ఎయిరిండియాపై మంచు లక్ష్మీ ఆగ్రహం | Lakshmi Manchu Fires On Air India For Delaying Flight | Sakshi
Sakshi News home page

ఎయిరిండియాపై మంచు లక్ష్మీ ఆగ్రహం

Published Thu, Oct 18 2018 1:10 PM | Last Updated on Thu, Oct 18 2018 1:13 PM

Lakshmi Manchu Fires On Air India For Delaying Flight - Sakshi

ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాపై నటి మంచు లక్ష్మీ మండిపడ్డారు. ఎలాంటి కారణం చెప్పకుండా దాదాపు 4 గంటల పాటు తనను క్యూలైన్‌లో నిలబెట్టారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె తన ట్విటర్‌ అకౌంట్‌లో వరుస ట్వీట్లు చేశారు. ప్రయాణికులను ఎయిర్ ఇండియా అధికారులు కనీసం పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. దీంతో ఆహారం, నీళ్లు లేకుండా పలువురు ప్రయాణికులు పుణె ఎయిర్ పోర్టులో చిక్కుకున్నారని తెలిపారు. 

‘ఎయిర్ ఇండియా విమానం బుధవారం మధ్యాహ్నం 12.15 గంటలకు తొలుత బయలుదేరాల్సి ఉంది. అయితే నాలుగు గంటలైనా విమానం జాడ లేదు. మేము గట్టిగా నిలదీస్తే అక్కడి ఎయిర్ ఇండియా అధికారి జవాబు చెప్పకుండా వెళ్లిపోయాడు. మరో రెండు గంటల పాటు వేచిచూడమని చెప్పాడు. కానీ అసలు విమానం వచ్చిందా? లేదా? అనే విషయంపైనే స్పందించలేదు.చివరికి నేను హైదరాబాద్ కు ఫోన్ చేస్తే వాతావరణం బాగోలేని కారణంగానే విమానం రద్దయినట్లు తెలిసింది. అలా నాలుగు గంటల పాటు ప్రయాణికులను ఎయిర్‌ఇండియా టార్చర్‌ పెట్టింది.ప్రయాణికులను టార్చర్ పెట్టడంలో ఎయిర్ ఇండియాలో అంత ఆనందం ఎందుకుందో!’  అని మంచు లక్ష్మీ విమర్శించారు. ఈ మేరకు లక్ష్మీ వరుస ట్వీట్లు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement