కోల్‌కతా: ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా విమానం పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. విమానంలో ఓ ప్రయాణికుడు అస‍్వస్థతకు గురైన క్రమంలో విమానాన్ని కోల్‍కతాకు మళ్లించినట్లు ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు. విమానంలో మొత్తం 159 మంది ప్రయాణికులు ఉన్నారని వెల్లడించారు.
‘కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిరిండియా విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఓ ప్రయాణికుడు శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. బుధవారం సాయంత్రం 4.50 గంటల నుంచి 6.50 గంటల పాటు సుమారు 159 మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లో నిరీక్షించాల్సి వచ్చింది. ఆ తర్వాత విమానం ఢిల్లీకి బయలుదేరి వెళ్లింది. అస్వస్థతకు గురైన ప్రయాణికుడిని కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ’ అని తెలిపారు కోల్‌కతా విమానాశ్రయ అధికారులు.
ఇదీ చదవండి: ‘2020లో సీట్లు తక్కువొచ్చినా సీఎం పదవి’.. బీజేపీ విమర్శలపై నితీశ్ క్లారిటీ
Comments
Please login to add a commentAdd a comment