సాక్షి, విశాఖ: ఎయిర్‌ఇండియా నిర్లక్ష్య వైఖరి మరోసారి వెలుగుచూసింది. గతంలో పలుమార్లు అప్పటికప్పుడు విమాన సర్వీసులను రద్దు చేసి ప్రయాణికులకు చుక్కలు చూపించిన ఎయిర్‌ఇండియా.. తాజాగా మరోసారి ఉన్నపళంగా విమాన సర్వీస్‌ను రద్దు చేసింది. శనివారం విశాఖ నుండి ఢిల్లీ వెళ్లవలసిన సర్వీసును ఆకస్మికంగా రద్దు చేసింది ఎయిర్‌ఇండియా విమానాయాన సంస్థ.
దాంతో ప్రయాణికుల్లో ఒక్కసారిగా ఆందోళన రేకెత్తింది. సుమారు 20 మంది ప్యాసింజర్లు విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాత్రి 9 గంటలకు బయల్దేరాల్సిన ఫ్లైట్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో సదరు ప్రయాణికులు మెయిల్‌కు సమాచారం ఇవ్వడంలో కూడా జాప్యం చేసింది.ఆఖరి నిమిషంలో సమాచారం ఇవ్వడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment