గన్నవరంలో విమానం అత్యవసర ల్యాండింగ్
విజయవాడ: సాంకేతిక లోపం తలెత్తడంతో ఎయిర్ ఇండియా విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. టేకాఫ్ అయిన 10 నిమిషాలకే ఇంజన్ లో సాంకేతిక లోపంతో ఎయిర్ ఇండియా విమానం వెనుదిరిగింది.
పైలట్ అప్రమత్తమవ్వడంతో భారీ ప్రమాదం తప్పిందని అధికారులు వెల్లడించారు. విమానంలో పొగలు రావడాన్ని గమనించి పైలట్ తగు జాగ్రత్తలు తీసుకుని గన్నవరం ఎయిర్ పోర్ట్ కు మళ్లించినట్టు అధికారుల తెలిపారు.
ఈ విమానంలో మొత్తం 96 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్టు సమాచారం. ఈ ఘటనలో ప్రయాణికులందరూ సురక్షితమని అధికారులు తెలిపారు. నిర్ణీత సమయానికి కన్నా గన్నవరం ఎయిర్ పోర్ట్ కు రెండు గంటలు ఆలస్యంగా విమానం వచ్చినట్టు తెలిసింది.