technical problem
-
చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయం
ప్రపంచవ్యాప్తంగా ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని చాట్‌జీపీటీ సేవలకు సంబంధించి వినియోగదారులు తీవ్ర అంతరాయాన్ని ఎదుర్కొన్నారు. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం 5 గంటల ప్రాంతంలో చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయం కలిగినట్లు వినియోగదారులు గుర్తించారు. ఈ విషయాన్ని పలు సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు. చాట్‌జీపీటీతోపాటు ఓపెన్ఏఐకు చెందిన ఏపీఐ, సొర(sora-రియల్‌టైమ్ ఇమేజ్ జనరేట్ చేసే ఏఐ) సేవలు కూడా ప్రభావితం చెందినట్లు తెలిపారు.చాట్‌జీపీటీతోపాటు ఇతర అనుబంధ సంస్థల్లో తలెత్తిన సమస్యను ఓపెన్ఏఐ అంగీకరించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ పోస్ట్ చేసింది. ‘ప్రస్తుతం కంపెనీ సేవల్లో అంతరాయాన్ని ఎదుర్కొంటున్నాం. సమస్యను గుర్తించాం. దాన్ని పరిష్కరించేందుకు పని చేస్తున్నాం. మీకు కలిగిన అంతరాయానికి క్షమాపణలు తెలియజేస్తున్నాం. ఈ విషయంపై త్వరలో మీకు అప్డేట్ చేస్తాం’ అని ఓపెన్ఏఐ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఆన్లైన్ సర్వీసులను ట్రాక్ చేసే డౌన్ డిటెక్టర్ ప్రకారం, చాట్‌జీపీటీ ఆఫ్‌లైన్‌లో ఉండటంపై భారీగానే ఫిర్యాదులు నమోదైనట్లు తెలిపింది.We're experiencing an outage right now. We have identified the issue and are working to roll out a fix.Sorry and we'll keep you updated!— OpenAI (@OpenAI) December 12, 2024ఇదీ చదవండి: రూ.5 కోట్ల వాచ్‌తో జుకర్‌బర్గ్.. ప్రత్యేకతలివే..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్మెటా ఆధ్వర్యంలోని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవల్లో యూఎస్‌లో ఇటీవల అంతరాయం ఏర్పడింది. దాదాపు 27,000 కంటే ఎక్కువ మంది వినియోగదారులు ఫేస్‌బుక్‌తో సమస్య ఏర్పడినట్లు తెలిపారు. 28,000 కంటే ఎక్కువ మంది యూజర్లు ఇన్‌స్టాగ్రామ్‌లో అంతరాయం ఏర్పడిందని పేర్కొన్నారు. -
మార్కెట్ నిండా ఉల్లి.. రైతులకు కష్టాల లొల్లి
కర్నూలు (అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ–నామ్‌కు గ్రహణం పట్టింది. నాలుగు రోజులుగా సర్వర్ పనిచేయక వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు స్తంభించిపోయాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గతంలో సాంకేతిక సమస్య ఏర్పడితే ఒకటి లేదా రెండు రోజుల్లో పరిష్కారమయ్యేది. తొలిసారి నాలుగు రోజులుగా సర్వర్ మొండికేయడంతో రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఈ–నామ్ సాంకేతిక సమస్య కారణంగా ఉల్లి మినహా ఇతర వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి. రేయింబవళ్లు యార్డుల్లోనే నిరీక్షణ ప్రస్తుతం ఉల్లి ధరలు ఆశాజనకంగా ఉండటంతో వారం రోజుల ముందే పంటను కోసి రైతులు మార్కెట్‌కు తెస్తున్నారు. ఫలితంగా మార్కెట్‌కు ఉల్లి వెల్లువెత్తుతోంది. విక్రయాలు ఒకరోజు ఆలస్యమైతే ధర పడిపోతుందేమోనన్న భయం రైతులను వెంటాడుతోంది. ఇదే సందర్భంలో ఈ–నామ్లో ఏర్పడిన సాంకేతిక సమస్యల కారణంగా మాన్యువల్‌గా టెండర్లు వేస్తున్నారు. టెండర్లు వేసే ప్రక్రియ పూర్తయి.. ధరలు ప్రకటించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఫలితంగా పంటను అమ్ముకుని ఇంటికి వెళ్లాలంటే రైతులు రేయింబవళ్లు మార్కెట్ యార్డులోనే నిరీక్షించాల్సి వస్తోంది. నిత్యం 20 వేల టన్నులు రాక రాష్ట్రంలో ఉల్లి క్రయవిక్రయాలకు ఏకైక ఆధారం కర్నూలు వ్యవసాయ మార్కెట్ మాత్రమే. పశి్చమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉల్లి క్రయవిక్రయాలు జరుగుతున్నా.. అది పూర్తిగా ప్రైవేట్ మార్కెట్. కర్నూలు మార్కెట్ ప్రభుత్వం అ«దీనంలో ఉన్నందున రైతులు 60 శాతం పంటను కర్నూలు మార్కెట్‌కే తీసుకొస్తారు. ఉమ్మడి కర్నూలుతో పాటు అనంతపురం, వైఎస్సార్ జిల్లాలు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికే ఉల్లిని తీసుకొచ్చి విక్రయిస్తారు. ఈ ఏడాది మొదటి నుంచి ఉల్లి ధరలు మెరుగ్గా ఉండటం వల్ల సాగు పెరిగింది. 2023 ఖరీప్‌లో ఉమ్మడి కర్నూలు జిల్లాఓ 39,431 ఎకరాల్లో ఉల్లి సాగు చేయగా.. ఈ ఏడాది 43,875 ఎకరాల్లో సాగైంది. ఎకరాకు సగటున 5 టన్నుల చొప్పున ఈ ఏడాది 2,19,375 టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ఉల్లి పంటను కోసి రబీ పంటగా శనగ విత్తుకోవాలనే ప్రయత్నాల్లో రైతులు ఉన్నారు. మరోవైపు పెరిగిన ధర ఎక్కడ పడిపోతుందోనన్న భయంతో వారం, 10 రోజుల ముందుగానే పంటను కోసి మార్కెట్‌కు తెస్తున్నారు. దీంతో కర్నూలు మార్కెట్‌కు ఉల్లి పోటెత్తుతోంది. రికార్డు స్థాయిలో రోజుకు 20 వేల క్వింటాళ్లు వస్తుండటం విశేషం. గతంలో అత్యధికంగా రోజుకు 8 వేల క్వింటాళ్ల వరకే వచ్చేది. ఎటూ చూసినా ఉల్లి వాహనాలే మార్కెట్ యార్డు విస్తీర్ణం 26 ఎకరాలు. మార్కెట్ మొత్తం ఉల్లి పంటతో నిండిపోయింది. మ్యాన్యువల్ టెండర్ల కారణంగా ధరల నిర్ణయం ఆలస్యమవుతోంది. కాటాల్లోనూ జాప్యం జరుగుతోంది. కొనుగోలు చేసిన ఉల్లిని బయటకు తరలించేందుకు తగినన్ని లారీలు లభ్యం కావడం లేదు. దీంతో యార్డులోని స్థలమంతా ఉల్లి వాహనాలతో నిండిపోయింది.అమ్ముకోవడానికి తెచ్చిన ఉల్లి వాహనాలు రోడ్లపైనే నిలిచిపోతున్నాయి. అన్ని ప్రధాన రహదారుల్లో కిలోమీటర్‌కు పైగా ఉల్లి వాహనాలు బారులు తీరి ఉండిపోతున్నాయి. ఆ వాహనాలు అతి కష్టం మీద మార్కెట్లోకి వెళితే స్థలం దొరకడం లేదు. మరోవైపు అన్లోడ్ చేయడానికి హమాలీలు ఉండటం లేదు. పంటను అమ్ముకోవాలంటే తలప్రాణం తోకకు వస్తోందని రైతులు వాపోతున్నారు. రాష్ట్రమంతటా ఈ–నామ్ సమస్యే గతంలో ఈ–నామ్లో ఎటువంటి సమస్య ఏర్పడినా యుద్ధప్రాతిపదిక పరిష్కరించేవారు. తొలిసారిగా రోజుల తరబడి సాంకేతిక సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఈ సమస్య ఒక్క కర్నూలు మార్కెట్‌కే పరిమితం కాలేదు. రాష్ట్రంలోని అన్ని మార్కెట్లతోపాటు దేశవ్యాప్తంగా ఈ–నామ్ విధానం అమలవుతున్న అన్ని మార్కెట్లలో ఇదే సమస్య ఉన్నప్పటికీ ప్రభుత్వాలు మొద్దు నిద్ర నటిస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే తొలిసారి ఈ–నామ్ అమల్లోకి వచ్చి ఏళ్లు గడుస్తోంది. ఎప్పుడు సమస్య వచ్చినా ఒకటి, ఒకటిన్నర రోజుల్లోనే పరిష్కారమయ్యేది. మొదటిసారిగా రోజుల తరబడి సమస్య ఉండిపోయింది. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే. ఇది రైతులకు శాపంగా మారింది. ఉల్లి మినహా అన్నిరకాల పంట క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. ఇది రైతులకు ఇబ్బందిగా మారింది. – కట్టా శేఖర్, అధ్యక్షుడు, కమీషన్ ఏజెంట్ల సంఘం, కర్నూలు రైతులకు నరకమే పంటను అమ్ముకోవడానికి వచ్చిన రైతులకు నరకం చూపిస్తున్నారు. పంటను ఆమ్ముకునేందుకు వస్తే.. మార్కెట్లోకి ప్రవేశించేందుకే తల ప్రాణం తోకకు వస్తోంది. ఈ–నామ్ సర్వర్ పనిచేయకపోవడంతో మ్యాన్యువల్‌గా టెండర్ వేయడం వల్ల ఆలస్యమవుతోంది. ధరలను ప్రకటించే సరికి సాయంత్రమైంది. పంటను అమ్ముకుని ఇంటికి వెళ్లేది ఎప్పుడో తెలియడం లేదు. సర్వర్ సమస్య ఏర్పడినపుడు సత్వరం పరిష్కరించేందుకు యంత్రాంగం ఉండాలి. – తిప్పారెడ్డి, బేతపల్లి, దేవనకొండ మండలం -
క్రౌడ్‌స్ట్రైక్ అతలాకుతలం
వాషింగ్టన్: ప్రపంచమంతటినీ అతలాకుతలం చేసిన విండోస్ ఆపరేటింగ్ సిస్టం సాంకేతిక సమస్య ఆర్థికంగా కూడా అంతర్జాతీయంగా గట్టి ప్రభావమే చూపింది. పలు దిగ్గజ సంస్థల షేర్ల విలువ తగ్గుముఖం పట్టింది. ముఖ్యంగా తప్పుడు అప్డేట్తో సమస్యకు కారణమైన సైబర్ సెక్యూరిటీ దిగ్గజం క్రౌడ్‌స్ట్రైక్‌కు ఆర్థికంగా గట్టి దెబ్బే తగిలింది. శుక్రవారం ఆ సంస్థ షేర్ వాల్యూ ఒక్కసారిగా 11 శాతానికి పైగా పడిపోయింది. 42.22 డాలర్లున్న ఒక్కో వాటా విలువ 30 డాలర్లకు తగ్గింది. సంస్థ మొత్తం విలువ 83 బిలియన్ డాలర్ల పై చిలుకని అంచనా. ఆ లెక్కన 900 కోట్ల డాలర్లకు పైగా హరించుకుపోయినట్టే. అయితే ఆర్థిక నష్టం కంటే కూడా ప్రపంచంలోనే అగ్రశ్రేణి సైబర్ సెక్యూరిటీ సంస్థగా క్రౌడ్‌స్ట్రైక్‌కు ఉన్న ఇమేజీకి జరిగిన నష్టమే చాలా ఎక్కువ. ఎందుకంటే దాని కస్టమర్లుగా ఉన్న కంపెనీలు, పెద్ద సంస్థల్లో చాలావరకు తమ సైబర్ సెక్యూరిటీ బాధ్యతల కోసం ఇతర సైబర్ సెక్యూరిటీ సంస్థలవైపు చూస్తున్నట్టు సమాచారం. ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్ ఎక్స్ వంటి దిగ్గజ కంపెనీల సీఈఓ ఎలాన్ మస్క్ ఇప్పటికే ఈ జాబితాలో చేరారు. ‘‘మా వ్యవస్థల నుంచి క్రౌడ్స్ట్రౌక్ను తొలగించేశాం’’ అంటూ ఆయన సోషల్ మీడియాలో తాజాగా పోస్ట్ చేశారు. సెంటినల్ వన్, పాలో ఆల్టో నెట్వర్క్ వంటి క్రౌడ్ర్స్టౌక్ ప్రత్యర్థి కంపెనీలు ఈ పరిస్థితిని రెండు చేతులా సొమ్ము చేసుకుంటున్నాయి. భారీ పరిహారాలు! మరోవైపు క్రౌడ్‌స్ట్రైక్ కస్టమర్లంతా తమకు జరిగిన నష్టానికి ఆ సంస్థ నుంచి భారీగా నష్టపరిహారం డిమాండ్ చేసేలా ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలు ఆ సంస్థ క్లయింట్ల జాబితాలో ఉండటం తెలిసిందే. షట్‌డౌన్ దెబ్బకు వాటి షేర్ల విలువ సగటున ఒక శాతం దాకా పడిపోయినట్టు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. -
అంతలో వెళ్లమని.. ఇంతలో ఆగమని..
సాక్షి, హైదరాబాద్: రామగుండం బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం మూసివేతపై రాజకీయ రగడ జరుగుతోంది. 1971లో 62.5 మెగావాట్ల విద్యుదుత్పత్తితో ప్రారంభమైన ఈ విద్యుత్ కేంద్రం జీవితకాలం ఎప్పుడో ముగిసింది. అయినా మరమ్మతులు చేస్తూ ఇంతకాలం నెట్టుకొచ్చారు. సాంకేతిక సమస్యలతో గత నెల 4వ తేదీ నుంచి విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. ఇకపై మరమ్మతులు చేసినా ఫలితం ఉండదనే భావనకు జెన్కో వచ్చింది. అక్కడున్న 65 మంది ఇంజనీర్లు, 230 మంది అపరేషన్స్ అండ్ మెయింటనెన్స్(ఓ అండ్ ఎం) సిబ్బంది, మరో 40 మంది అకౌంట్స్, పీఎంజీ విభాగాల్లో పనిచేస్తుండగా, జూన్ 4 నుంచి వీరికి పనిలేకుండా పోయింది. అక్కడి సబ్‌స్టేషన్, ఇతర అత్యవసర వ్యవస్థల నిర్వహణకు అవసరమైన సిబ్బంది మినహా మిగిలిన ఇంజనీర్లు, ఇతర ఉద్యోగులకు విడతల వారీగా రాష్ట్రంలోని ఇతర విద్యుత్ కేంద్రాలకు బదిలీ చేయాలని జెన్కో నిర్ణయం తీసుకుంది.తొలిదఫాలో 44 మంది ఇంజనీర్లు, నలుగురు కెమిస్ట్‌లను నిర్మాణదశలో ఉన్న యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి డెప్యూటేషన్‌పై బదిలీ చేస్తూ గత నెలలో జెన్కో ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఉత్తర తెలంగాణకు చెందిన ఓ మంత్రి, మరో ఎమ్మెల్యే ఒత్తిడితో రెండురోజులకే ఉత్తర్వుల అమలును నిలుపుదల చేస్తూ మరో ఉత్తర్వులు జారీ చేయాల్సి వచ్చింది. ఈ విద్యుత్ కేంద్రానికి సంబంధించిన ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు నెలకు రూ.4 కోట్లకు పైగా వ్యయం అవుతుండగా, ఉత్పత్తి నిలిచిపోయి ఉద్యోగులందరూ ఖాళీగా ఉండడంతో జెన్కోకు ఆర్థికంగా భారంగా మారింది. కొత్త విద్యుత్ కేంద్రంనిర్మించే వరకు వారిని అక్కడే కొనసాగించాలని ఓ మంత్రి, ఎమ్మెల్యే ఒత్తిడి చేస్తున్నట్టు చర్చ జరుగుతుండగా, కొత్త కేంద్రం నిర్మాణానికి 4 నుంచి 8 ఏళ్లు పట్టనుందని జెన్కో అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఐదేళ్లుగా నెట్టుకొస్తున్నా...రామగుండం బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్వహణ భారంగా మారినా స్థానికంగా వస్తున్న రాజకీయ ఒత్తిళ్లతో గత ఐదేళ్లుగా నెట్టుకొస్తున్నారు. 2019 మార్చి 31లోగా ఈ విద్యుత్ కేంద్రాన్ని మూసివేయాలని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ ఆథారిటీ(సీఈఏ) గతంలో ఆదేశాలు జారీ చేయగా, రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో గడువును 2029 వరకు పొడిగించింది. 62.5 మెగావాట్ల పూర్తి స్థాపిత సామర్థ్యం మేరకు విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి జరగడం లేదు. గరిష్టంగా 45 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి చేస్తుండగా, అధిక బొగ్గు వినియోగిస్తుండడంతో ఆర్థికంగా గిట్టుబాటు కావడం లేదు. కాలుష్యం సైతం అనుమతించిన స్థాయికి మించి జరుగుతోంది. దాదాపుగా రూ.2 కోట్లు ఖర్చు చేసి బయటి నుంచి పరికరాలు తెప్పించి మరమ్మతులు నిర్వహిస్తే 15 రోజుల్లో ఉత్పత్తిని ప్రారంభించి మరికొన్ని రోజుల పాటు నెట్టుకు రావొచ్చని, పూర్తిస్థాయిలో మరమ్మతుల నిర్వహ ణకు కనీసం రూ.30కోట్లకు పైగా ఖర్చు అవుతుందని జెన్కో వర్గాలు పేర్కొంటున్నాయి. అయినా ఎంత కాలం పనిచేస్తుందో చెప్పలేని పరిస్థితి నెల కొంది. ఈ నేపథ్యంలో జెన్కో ఆర్థిక ప్రయోజనాల రీత్యా ఈ విద్యుత్ కేంద్రాన్ని శాశ్వతంగా మూసివేయక తప్పని పరిస్థితి నెలకొంది. ‘సూపర్ క్రిటికల్’ నిర్మాణ బాధ్యతపై జెన్కో అభ్యంతరంరామగుండం బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం స్థానంలో అక్కడే 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై జెన్కో ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరే కిస్తున్నారు. కొత్త విద్యుత్ కేంద్రాన్ని జెన్కో ఆధ్వ ర్యంలోనే నిర్మించాలని కోరుతున్నారు. వాస్తవా నికి నైజాం ప్రభుత్వం 1931లో రామగుండంలో ఏ–థర్మల్, బీ–థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణా నికి 3000 ఎకరాలు కేటాయించింది. ఏ– థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని గతంలోనే మూసివే యగా, ఇందుకు సంబంధించిన స్థలంలో దాదాపు 1200 ఎకరాలను 90వ దశకం మధ్యలో బీపీఎల్ అనే సంస్థకు కొత్త విద్యుత్ కేంద్రం నిర్మాణం కోసం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇక బీ–థర్మల్ కేంద్రానికి దాదాపు 700 ఎకరాల స్థలం ఉండగా, కబ్జాలు పోగా 550 ఎకరాలే మిగిలాయి. 800 మెగావాట్ల కొత్త విద్యుత్ కేంద్రం నిర్మాణానికి ఈ స్థలం సరిపోదు. బీపీఎల్‌కు కేటాయించిన స్థలంలో కొంత స్థలాన్ని జెన్కోకు అప్పగిస్తే కొత్త విద్యుత్ కేంద్రం నిర్మించుకుంటామని జెన్కో ఉద్యోగులు కోరుతున్నారు. -
ఐదు గంటలపాటు విమానంలోనే..
ముంబై: సాంకేతిక సమస్యతో ముంబై ఎయిర్‌పోర్టులో నిలిచిపోయిన ఎయిర్ మారిషస్ విమానంలో సుమారు 200 మంది ప్రయాణికులు ఐదు గంటల పాటు బందీలుగా మారారు. చివరికి ఆ విమానాన్ని రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎయిర్ మారిషస్‌కు చెందిన ఎంకే 749 విమానం శనివారం ఉదయం 4.30 గంటలకు ముంబై విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకోవాల్సి ఉంది. బయలుదేరాల్సిన సమయానికి విమానంలో సమస్య గుర్తించారు. నిపుణులొచ్చి లోపాన్ని సరిచేసినా, ఫలితం లేకపోయింది. చివరికి ఉదయం 10 గంటల సమయంలో సర్వీసును రద్దు చేస్తున్నట్లు పైలట్ ప్రకటించారని బాధిత ప్రయాణికులు చెప్పారు. ఐదు గంటలపాటు తమను కిందికి కూడా దిగనివ్వలేదన్నారు. ఏసీ సరిగ్గా పనిచేయక ఆరోగ్య సమస్యలున్న వారు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని చెప్పారు. ఈ ఘటనపై ఎయిర్ మారిషస్ స్పందించలేదు. -
సాంకేతిక సమస్యతో యూకేలో నిలిచిన విమానాలు
లండన్: సాంకేతిక సమస్య కారణంగా యూకేకు వెళ్లాల్సిన, అక్కడి నుంచి ఇతరదేశాలకు వెళ్లే విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో, వేలాది మంది ప్రయాణికులు ఎక్కడివారక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. బ్రిటిష్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థల్లో సమస్య ఇందుకు కారణమని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టుల్లో భద్రతా నిర్వహణ కోసం ట్రాఫిక్‌పై నియంత్రణలను విధించినట్లు యూకే నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ తెలిపింది. అయితే, సమస్యకు కారణం, ఎప్పటివరకు పరిష్కారమవుతుందనే విషయం సంస్థ తెలపలేదు. సమస్యను సాధ్యమైనంత త్వరంగా పరిష్కరించేందుకు తమ ఇంజనీర్లు కృషి చేస్తున్నారని తెలిపింది. యూకే గగనతలాన్ని మాత్రం మూసివేయలేదని స్పష్టతనిచ్చింది. -
సాహసానికి ‘స్పాట్’ అవార్డు
తెనాలి : నది వంతెనపై ఆగిన రైలు.. సాంకేతిక సమస్య తో ముందుకు కదలనంటోంది.. సమయం గడుస్తోంది.. వెనక వచ్చే మెమో రైళ్లు ఆగిపోతున్నాయి.. మరికొన్ని నిముషాల్లో వచ్చే సూపర్‌ఫాస్ట్ రైళ్లకూ బ్రేకులు అని వార్యమైన వేళ.. అసిస్టెంట్ లోకో పైలట్ డ్రైవర్ చేసిన సాహసం.. ఉన్నతాధికారుల ప్రశంసలందుకుంది. దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ స్పాట్ అవార్డును గెలుచుకుంది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సీహెచ్‌వీపీ ఫణిబాబు రైల్వే శాఖలో సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్‌గా బెజవాడ డిపోలో చేస్తున్నారు. ఈ నెల 22న చెన్నై– న్యూఢిల్లీ (నం.12615) సూపర్‌ఫాస్ట్ రైల్లో డ్యూటీలో ఉన్నారు. చెన్నై నుంచి బయలుదేరిన ఆ రైలు, ఓ ప్రయాణికుడు చైన్ లాగడంతో ఆ రాత్రి 8.14 గంటలకు తడ–సూళ్లూరుపేట మధ్యలో నిలిచిపోయింది. అది కూడా సరిగ్గా కళింగి నది వంతెనపై. లోపాన్ని సరిదిద్ద డం సాధ్యపడలేదు. వాక్యూమ్ పోతోంది.. సంబంధిత బోగీ దిగువ నుండే ఐసోలేషన్ కాక్‌ను లాక్ చేయాలి.. కిందకు దిగడానికి అక్కడ ఎలాంటి సైడ్ పాత్ వే లేదు. దీంతో ఏం చేయాలో పాలుపోక గార్డు, సిబ్బంది నిస్సహాయంగా ఉండిపోయారు. పరిస్థితి గమనించిన రైలు డ్రైవర్(అసిస్టెంట్ లోకో పైలట్) సీహెచ్‌వీపీ ఫణిబా బు.. రైలు ఇంజన్‌లోంచి ఆ కోచ్‌కు వెళ్లి ఐసోలేషన్ కాక్‌ను లాక్ చేయడానికి సిద్ధపడ్డారు. బోగీ హ్యాండిల్స్, ఫుట్‌బోర్డు మెట్లను హత్తుకుని కిందకు వేలాడారు. ఏమాత్రం చేయి జారినా నదిలో పడిపోవడం ఖాయమని తెలిసినా.. భయప డలేదు. రైళ్లు ఆగిపోయి వేలాది ప్రయాణికులకు అసౌకర్యం కలగరాదన్న భావనతో తన విధి కాకున్నా ధైర్యం చేశారు. 15 నిమిషాల్లో ఐసోలేషన్ కాక్‌ను లాక్‌చేసి వ్యాక్యూమ్‌ను నిరోధించారు. దీంతో 9.05 గంటలకు జీటీ ఎక్స్‌ప్రెస్ ప్రయాణాన్ని ఆరంభించింది. తర్వాత వచ్చే సూపర్‌ఫాస్ట్ రైళ్లకు ఎలాంటి అవరోధం లేకుండా చేయగలిగారు. ఫణిబాబు సాహసం తెలుసుకున్న దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం శివేంద్రమోహన్, సీనియర్ డీసీఈ కొండా శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు. ‘డీఆర్ఎం స్పాట్ అవార్డు’ను బుధవారం ప్రకటించారు. -
వందే భారత్‌లో మొరాయించిన ఏసీలు
రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ): విశాఖపట్నం–సికింద్రాబాద్ (20833) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో సాంకేతిక సమస్య తలెత్తడంతో విజయవాడ స్టేషన్లో మూడున్నర గంటల పాటు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శుక్రవారం ఉదయం 5.45 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరాల్సిన ఈ రైలు దాని జత రైలు అలస్యం కారణంగా ఇప్పటికే 5 గంటలు అలస్యంగా బయలుదేరేలా అధికారులు రీషెడ్యూల్ చేశారు. దీంతో విశాఖలో ఈ రైలు 10.43 గంటలకు బయలు దేరింది. బయలుదేరిన కొంత సమయానికే రైలులోని నాలుగు బోగీలలో ఏసీలు పనిచేయడం ఆగిపోయాయి. అసలే వేసవి ఉక్కపోత దీనికి తోడు రైలులో తలుపులు, కిటికీలు పూర్తిగా మూసివేసి ఉండడంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరయ్యి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిపై కొంత మంది ప్రయాణికులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో రాజమండ్రి స్టేషన్లో కొంతమంది టెక్నిషియన్లను రైలులో పంపారు. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడ చేరుకోవడంతో ఏడీఆర్ఎం శ్రీకాంత్ పర్యవేక్షణలో సిబ్బంది సుమారు మూడున్నర గంటలు శ్రమించి మరమ్మతులు పూర్తిచేశారు. అనంతరం 5.30 గంటలకు రైలు విజయవాడ నుంచి బయలుదేరి వెళ్లింది. అసలే 5 గంటల ఆలస్యం అందులో మరోమూడున్నర గంటలు మరమ్మతుల కోసం నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విశాఖ మార్గంలో పలు రైళ్లు రద్దు విజయవాడ డివిజన్ అనకాపల్లి–తాడి సెక్షన్ మధ్యలో ట్రాక్ మెయింటెనెన్స్ పనుల కారణంగా ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రద్దు చేసిన రైళ్లు: ఈ నెల 17న గుంటూరు–విశాఖపట్నం (17239), విశాఖపట్నం–విజయవాడ (22701/22702), మచిలీపట్నం–విశాఖపట్నం (17219) రైళ్ల రద్దు, 18న విశాఖపట్నం–గుంటూరు(17240), విశాఖ పట్నం–మచిలీపట్నం (17220) రైళ్లను రద్దు చేశారు. -
కూలిన ఐఏఎఫ్ శిక్షణ విమానం.. పైలట్లకు గాయాలు
సాక్షి, బెంగళూరు: భారత వైమానిక దళాని (ఐఏఎఫ్)కి చెందిన విమానం కుప్పకూలిన ఘట నలో ఇద్దరు పైలట్లు గాయపడ్డారు. కర్ణాటకలోని చామరాజనగర జిల్లా భోగాపుర వద్ద గురువారం ఈ ఘటన జరిగింది. వింగ్ కమాండర్ తేజ్‌పాల్, కో పైలట్ భూమిక బెంగళూరు ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి సూర్యకిరణ్ రకం చిన్న శిక్షణ విమానంలో బయలుదేరారు. తిరిగి వస్తుండగా సాంకేతిక సమస్య తలెత్తి విమానం కుప్పకూలింది. ఇంధనం అంటుకుని కాలిపోయింది. తేజ్‌పాల్, భూమిక ప్యారాచూట్ల సాయంతో దూకి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. తేజ్‌పాల్ వెన్నెముకకు గాయమైంది. విమానం బహిరంగ ప్రదేశంలో కూలడంతో ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. సంఘటన ప్రాంతానికి పెద్ద సంఖ్యలో చేరుకున్న ప్రజలను నియంత్రించేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. రెండు రోజుల క్రితం బెళగావి జిల్లా సాంబ్రా ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన రెడ్‌బర్డ్ శిక్షణ విమానం వ్యవసాయ క్షేత్రంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. అందులోని ఇద్దరు పైలట్లు గాయాలతో బయటపడ్డారు. -
హైదరాబాద్ : మధురానగర్ దగ్గర నిలిచిన మెట్రో ట్రైన్
-
స్పైస్‌జెట్‌పై కొరడా ఝుళిపించిన DGCA
-
పులిచింతల ప్రాజెక్ట్ 16వ నంబర్ గేట్ వద్ద సాంకేతిక సమస్య
-
'అనంత' పొలాల్లో చాపర్
కళ్యాణదుర్గం రూరల్: సాంకేతిక సమస్యతో ఓ చాపర్ (హెలికాప్టర్) అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలంలోని ఎరడికెర పొలాల్లో అత్యవసరంగా దిగింది. వివరాలివీ.. కర్ణాటకలోని బళ్లారిలో జిందాల్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ పరంజిత్, పైలట్ పాఠక్‌లు సోమవారం ఉదయం బళ్లారి నుంచి మైసూరుకు చాపర్‌లో బయలుదేరారు. ఈ క్రమంలో.. ఇంజిన్‌లో ఇంధనం లీకవడాన్ని గుర్తించిన పైలట్ బ్రహ్మసముద్రం సమీపంలోని ఎరడికెర పొలాల్లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. విషయం తెలుసుకున్న సమీప గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో ఘటనా స్థలికి చేరుకున్నారు. కళ్యాణదుర్గం డీఎస్పీ వెంకటరమణ, సీఐ శివశంకర్ నాయక్, ఎస్ఐ నాగేంద్రబాబు, తహసీల్దార్ రమేష్, ఇతర అధికారులు వచ్చి వివరాలను సేకరించారు. బళ్లారి నుంచి సాంకేతిక నిపుణులు వచ్చి మరమ్మతులు చేసిన అనంతరం చాపర్ తిరిగి వెళ్తుందని చెప్పారు. చాపర్ దిగిన ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
నిలిచిన కోణార్క్ ఎక్స్‌ప్రెస్
సాక్షి, కాజీపేట : ముంబాయి నుంచి భువనేశ్వర్ వెళ్లే కోణార్క్ ఎక్స్‌ప్రెస్ (11019) చక్రాలకు సాంకేతిక సమస్య తలెత్తి బోల్టుస్టార్ కాయల్ స్ప్రింగ్ పగిలిపోయింది. దీంతో కాజీపేట జంక్షన్లో ఈ రైలు గంటన్నరపాటు నిలిచిపోయింది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్షాల కారణంగా ఉదయం 10 గంటలకు రావల్సిన కోణార్క్ సాయంత్రం నాలుగు గంటలకు చేరుకుంది. మార్గమధ్యలో ఇంజన్ నుంచి 7వ ఏసీ కోచ్ కింద రెండు చక్రాల మధ్య ఉన్న బోల్డుస్టార్ కాయల్ స్ప్రింగ్ పగిలిపోయింది. కాజీపేట రైల్వే స్టేషన్లోకి ప్రవేశిస్తున్న క్రమంలో రోలింగ్ ఇన్ క్యారియజ్ అండ్ వ్యాగన్ ఇన్స్పెక్షన్ స్టాఫ్ బోల్డుస్టార్ పగిలిపోయిన విషయాన్ని గమనించి అధికారులకు సమాచారం అందించారు. దీంతో కాజీపేటలో కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు. అధికారులు, సిబ్బంది మరమ్మతు చేసి సాయంత్రం 5.35 గంటలకు పంపించారు. సకాలంలో సీ అండ్ డబ్ల్యూ సిబ్బంది గమనించి చూడటం వల్ల ఇబ్బంది లేకుండా పోయింది. లేదంటే మార్గమధ్యలో పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని సిబ్బంది చెబుతున్నారు. -
గాలిలో విమానం చక్కర్లు.. భయభ్రాంతులు
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఇండిగో విమానం గాలిలో అదే పనిగా చక్కర్లు కొడుతూ.. ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఇండిగో విమానంలో ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్ అయి.. గాలిలోకి ఎగిరిన తర్వాత విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్లు.. విమానాన్ని కాసేపు ఆకాశంలోనే చక్కర్లు కొట్టించారు. దీంతో ప్రయాణికులు ఏం జరగబోతుందోనన్న ఉత్కంఠ కాసేపు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే, ఆకాశంలో చక్కర్లు కొట్టిన విమానం ఎట్టకేలకు తిరిగి శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. -
కాళోజి హెల్త్ యూనివర్సిటీ పరీక్షలో గందరగోళం
సాక్షి, వరంగల్: కాళోజి హెల్త్ యూనివర్సిటీ నిర్వహించిన పరీక్షలో గందరగోళం చోటుచేసుకుంది. యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థుల రాసిన పరీక్షను రద్దు చేశారు. టెక్నికల్ కారణాల వల్ల పరీక్ష రద్దు చేసినట్టు యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. వివరాల్లోకి వెళితే. సోమవారం నుంచి యూనివర్సిటీ పరిధిలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే నేడు ఉదయం విద్యార్థులు ఫస్ట్ పేపర్ పరీక్ష నిర్వహించారు. తీరా ఎగ్జామ్ పూర్తయిన కొద్దిసేపటికి పరీక్ష రద్దు చేసినట్టు యూనివర్సిటీ నుంచి విద్యార్థుల ఫోన్లకు అధికారులు సందేశాలు పంపించారు. మరోసారి షెడ్యూల్ ఖరారు చేసి పరీక్ష నిర్వహిస్తామని యూనివర్సిటీ అధికారులు ఆ సందేశంలో పేర్కొన్నారు. పరీక్ష జరిగిన రెండు సెంటర్లలో ఒక కోడ్‌కు బదులు.. మరో కోడ్ ప్రశ్నపత్రాన్ని డౌన్లోడ్ చేసి పరీక్ష నిర్వహించనందువల్ల.. పరీక్ష రద్దు చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. రాసిన పరీక్ష రద్దు చేసి.. మళ్లీ పరీక్ష నిర్వహిస్తామంటు అధికారులు ప్రకటించడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంబీబీఎస్ పరీక్షలంటే ఇంత నిర్లక్ష్యమా అని యూనివర్సిటీ అధికారులను ప్రశ్నిస్తున్నారు. పరీక్ష నిర్వహణ సిబ్బంది తీరును తప్పుబట్టిన విద్యార్థులు.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
నేడే భానూదయం..
భగభగ మండే సూర్యుడికి అత్యంత సమీపంలోకి పంపాలని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) తలపెట్టిన ‘పార్కర్’ శోధక నౌక ప్రయోగం చివరి నిమిషంలో వాయిదా పడింది. ముందస్తు ప్రణాళిక ప్రకారం శనివారం ఈ ప్రయోగం చేపట్టాలి.. కానీ పలు సాంకేతిక కారణాల వల్ల ఆదివారానికి శాస్త్రవేత్తలు ప్రయోగాన్ని వాయిదా వేశారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రయోగాన్ని ప్రారంభిస్తారు. దాదాపు రూ.లక్ష కోట్ల ఖర్చుతో చేస్తున్న ఈ ప్రయోగం విషయంలో శాస్త్రవేత్తలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి డెల్టా –4 హెవీ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పార్కర్ చేరుకుంటుంది. కానీ నేరుగా సూర్యుడి వద్దకు వెళ్లదు. బుధుడి చుట్టూ కనీసం ఏడు చక్కర్లు కొట్టిన తర్వాత 2024 డిసెంబర్ 19 నాటికి తొలిసారి సూర్యుడికి అత్యంత సమీపంలోకి అంటే.. కేవలం 40 లక్షల కిలోమీటర్ల దూరానికి చేరుతుంది. దీని ద్వారా దశాబ్దాలుగా శాస్త్రవేత్తలకు కొరుకుడు పడని సమస్యలకు సమాధానాలు చెబుతుందని అంచనా.. మిస్టరీల పుట్ట.. సౌర కుటుంబపు సహజ నక్షత్రం సూర్యుడు ఓ మిస్టరీల పుట్ట. ఉపరితలం కంటే చుట్టూ ఉండే వాతావరణం విపరీతమైన వేడి కలిగి ఉండటం వీటిల్లో ఒక్కటి మాత్రమే. ఇలా ఎందుకు ఉంటుందో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా అని పిలిచే సూర్యుడి వాతావరణం నుంచి వెలువడే శక్తిమంతమైన కణాలు కొన్నిసార్లు మన ఉపగ్రహ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్స్‌ను క్షుణ్నంగా అర్థం చేసుకునేందుకు పార్కర్ శోధక నౌక ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు. ఏముంటాయి దీంట్లో.. చిన్న సైజు కారులా ఉండే ‘పార్కర్’శోధక నౌక సుమారు ఆరేళ్ల పాటు ప్రయాణించి మరీ సూర్యుడికి అత్యంత సమీపంలోకి చేరుతుంది. సూర్యుడి నుంచి వెలువడే రేడియోధార్మిక కిరణాలను గుర్తించేందుకు ఓ ఫీల్డ్ యాంటెన్నా.. అక్కడి ధూళి కణాలను సేకరించేందుకు ప్రత్యేకమైన ఎస్పీసీ పరికరం ఉంటాయి. వీటితో పాటు ఇంధనం సమకూర్చేందుకు సోలార్ ప్యానెల్స్, సమాచారాన్ని భూమ్మీదకు పంపేందుకు రేడియో యాంటెన్నా, అయస్కాంత క్షేత్రాన్ని పరిశీలించేందుకు మ్యాగ్నెటో మీటర్ వంటి పరికరాలూ ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎల్తైతే.. పార్కర్ ముందు భాగంలో ఉండే ఉష్ణ కవచం ఇంకో ఎత్తు. దాదాపు 8 అడుగుల వ్యాసం, నాలుగున్నర అంగుళాల మందమున్న కార్బన్ మిశ్రమ లోహంతో ఈ ఉష్ణ కవచం తయారైంది. దాదాపు 1,371 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలను కూడా తట్టుకో గలగడం దీని ప్రత్యేకత. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. కవచానికి ఇంకోవైపున ఉండే పరికరాలన్నీ దాదాపు గది ఉష్ణోగ్రతలోనే ఉండటం.. అంటే.. కవచం గుండా ఉష్ణం ఏమాత్రం ప్రసారం కాదన్నమాట. సూర్యుడి చుట్టూ మూడు చక్కర్లు కొట్టిన తర్వాత పార్కర్ సూర్యుడి వ్యాసానికి 9 రెట్లు ఎక్కువ దూరంలో ఉంటుంది. ఆ సమయంలో దీని వేగం గంటకు 4.3 లక్షల మైళ్లు. పేరు వెనుక కథ.. 2017 వరకూ దీని పేరు సోలార్ ప్రోబ్ మాత్రమే. ఆ తర్వాత దీని పేరును పార్కర్‌గా మార్చారు. 1958లో సౌర తుపానులను మొట్టమొదట అంచనా వేసిన శాస్త్రవేత్త యుజీన్ పార్కర్ కృషికి గుర్తిం పుగా ఆయన పేరు పెట్టారు. యుజీన్ పార్కర్ షికాగో యూనివర్సిటీ అధ్యాపకుడిగా పనిచేశారు. బతికుండగా ఓ శాస్త్రవేత్త పేరు అంతరిక్ష నౌకకు పెట్టడం నాసా చరిత్రలో ఇదే తొలిసారి. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
1.4 కోట్ల మంది సమాచారం బహిర్గతం
న్యూయార్క్: సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్బుక్ మరో వివాదంలో చిక్కుకుంది. ఓ సాంకేతిక సమస్య కారణంగా యూజర్లు తమ స్నేహితులతో పంచుకున్న ఫొటోలు, పోస్ట్‌లు బహిర్గతమయ్యాయని ఫేస్బుక్ చీఫ్ ప్రైవసీ ఆఫీసర్ ఎరిన్ ఎగన్ తెలిపారు. మే 18 నుంచి 27 వరకూ ఈ సమస్య కారణంగా 1.4 కోట్లమంది యూజర్లు ప్రభావితమయ్యారని చెప్పారు. ఫేస్బుక్లో తమ పోస్ట్‌లు, ఫొటోలను స్నేహితులు మాత్రమే చూసేలా యూజర్లు పెట్టుకున్న ‘ఫ్రెండ్స్ ఓన్లీ’ సెట్టింగ్ తాజా సాంకేతిక సమస్యతో ఆటోమేటిక్‌గా ‘పబ్లిక్’ సెట్టింగ్‌కు మారిపోయిందన్నారు. ఈ ఘటనపై ఫెడరల్ ట్రేడ్ కమిషన్ విచారణ చేపట్టే వీలుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. -
ఆగిపోయిన ఐరావత్ బస్సు
- ప్రయాణికుల ఇక్కట్లు మహబూబ్‌నగర్: హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కర్ణాటకకు చెందిన ఐరావత్ బస్సు ప్రయాణికులకు చుక్కలు చూపించింది. సాంకేతిక సమస్యతో జానంపేట వద్ద బస్సు ఆగిపోవడంతో ప్రయాణికులు ఎండలోనే నిరీక్షిస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో గంటల తరబడి రోడ్డుపైనే వేచి ఉండాల్సి రావడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్సులో 50 మంది ప్రయాణికులు బెంగళూరు వెళ్తున్నారు. -
రైళ్ల రాకపోకలకు అంతరాయం
ఆలేరు/భువనగిరిఅర్బన్: గూడ్స్ రైలులో ఏర్పడిన సాంకేతిక లోపంతో గురువారం సికింద్రాబాద్– కాజీపేట రైల్వేమార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.ఉదయం 8.30 గంటలకు కాజీపేట నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం రాయగిరి రైల్వేస్టేషన్ సమీపంలోకి రాగానే సాంకేతిక సమస్య తలెత్తి పది నిమిషాల పాటు నిలిచిపోయింది. ఇదే సమయంలో కాజీపేట నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న గరీభ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ రైల్‌ను జమ్మాపురం, వంగపల్లి ట్రాక్ వద్ద నిలిపివేశారు.అలాగే కాకతీయ ప్యాసింజర్ గంటన్నర, పుష్పుల్ రైలును గంటపాటు ఆలేరు స్టేషన్లో నిలిపివేశారు. గూడ్స్ రైలులో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని సరిచేయడంతో యథావిధిగా రైళ్ల రాకపోకలు కొనసాగాయని రైల్వే పోలీసులు తెలిపారు. -
నిలిచిన సికింద్రాబాద్-గుంటూరు రైలు
మహబూబాబాద్: సికింద్రాబాద్-గుంటూరు మధ్య ప్రయాణిస్తున్నఇంటర్‌సిటీ రైలును శనివారం మధ్యాహ్నం కె.సముద్రం రైల్వేస్టేషన్లో నిలిపివేశారు. సిగ్నల్ వ్యవస్థలో సాంకేతిక లోపం కారణంగా రైలును ఆపినట్టు అధికారులు తెలిపారు. సాంకేతిక లోపాన్ని సరిచేసిన తర్వాత రైలు బయలుదేరుతుందని చెప్పారు. రైలు ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. -
దరఖాస్తుకు సాంకేతిక తిరకాసు
► గురుకుల దరఖాస్తు ప్రక్రియలో వెబ్‌పేజీ ఆటంకాలు ► ఆందోళన చెందుతున్న అభ్యర్థులు సాక్షి, హైదరాబాద్: గురుకుల పాఠశాలల్లో ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ అభ్యర్థులకు చుక్కలు చూపిస్తోంది. దరఖాస్తు పూరించే క్రమం నుంచి ఫీజు చెల్లించే వరకు పలు సమస్యలు తలెత్తడం చికాకు తెప్పిస్తోంది. సాధారణంగా ఒక్క దరఖాస్తు పూర్తి చేయడానికి పది నిమిషాలు పడుతుండగా సాంకేతిక సమస్యల కారణంగా గంటల తరబడి సమయం వృథా అవుతోంది. గురుకుల పాఠశాలల్లో వివిధ కేటగిరీల్లో 7,306 ఉద్యోగాలకు టీఎస్పీఎస్సీ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో టీజీటీ 4,362 పోస్టులు కాగా 921 పీజీటీ, 6 ఫిజికల్ డైరెక్టర్, 616 పీఈటీ, 372 ఆర్ట్ టీచర్, 43 క్రాఫ్ట్ టీచర్, 197 మ్యూజిక్ టీచర్, 533 స్టాఫ్ నర్స్, 256 లైబ్రెరియన్ పోస్టులున్నాయి. వీటికి సంబంధించి ఈ నెల 18 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది.కానీ, దరఖాస్తు ప్రక్రియలో పలుమార్లు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అభ్యర్థులు హైరానా పడుతున్నారు. దరఖాస్తు చేసే క్రమంలో ముందుగా టీఎస్పీఎస్సీలో రిజిస్ట్రేషన్(ఒన్ టైమ్ రిజిస్ట్రేషన్) వివరాలను నమోదు చేయాలి. వివరాలు ఎంట్రీ చేసిన తర్వాత దరఖాస్తు ఫారం తెరుచుకుంటుంది. అందులో వివరాలు నమోదు చేసిన తర్వాత చివరగా సరిచూసుకోవడానికి ప్రివ్యూ ఆప్షన్ నొక్కిన వెంటనే వెబ్‌పేజీ స్తంభించిపోతోంది. దీంతో తప్పనిసరి పరిస్థితిలో తిరిగి హోం పేజీ తెరిచి మొదట్నుంచి వివరాలు నమోదు చేయాల్సి వస్తోంది. అదేవిధంగా వివరాలు నమోదు చేసే క్రమంలోనూ అకస్మాత్తుగా పేజీ ఒకేచోట నిలిచిపోవడంతో మళ్లీ మొదటికోస్తోంది. అదేవిధంగా ఫీజును ఆన్లైన్ పద్ధతిలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డు సహాయంతో చెల్లించినప్పటికీ దరఖాస్తులో వివరాలు అప్లోడ్ కావడం లేదు. దీంతో అభ్యర్థి ఖాతాలో నిధులు వినియోగించినట్లు చూపుతుండగా దరఖాస్తు పేజీలో మాత్రం ఫీజు చెల్లించాలని సూచన వస్తోంది. దీంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ‘మీ సేవ’లోనూ అంతే! గురుకుల ఉద్యోగ దరఖాస్తుకు పలువురు అభ్యర్థులు మీసేవ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. దరఖాస్తు పూరించిన తర్వాత మీసేవా నిర్వహకుల ఖాతా నుంచి ఫీజును చెలిస్తున్నారు. ఆన్లైన్ పద్ధతిలో ఫీజు చెల్లించే క్రమంలో ఖాతా నుంచి నగదు కోతకు గురైనప్పటికీ దరఖాస్తు ఫారంలో అప్లోడ్ కావడంలేదు. దీంతో నిర్వాహకులు డబుల్చార్జి వసూలు చేస్తున్నారు. ఇదిలావుండగా, ఆన్లైన్ చెల్లింపుల్లో నగదు కోత పడినప్పటికీ వివరాలు అప్లోడ్ కాకుంటే ఆమేరకు నిధులు తిరిగి ఖాతాదారుడి అకౌంట్లో జమవుతాయి. అయితే అందుకు కనిష్టంగా వారంరోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. -
స్పైస్‌జెట్‌లో సాంకేతిక లోపం
విజయవాడ: సాంకేతికలోపం కారణంగా స్పైస్‌జెట్ విమానం దాదాపు 45 నిమిషాలపాటు గాల్లో చక్కర్లు కొట్టింది. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన అరగంట తర్వాత ఇంజన్లో సాంకేతిక లోపం ఏర్పడింది. వెంటనే సమస్యను గుర్తించిన పైలట్ విమానాన్ని తిరిగి ఎయిర్‌పోర్టులో సేఫ్‌గా ల్యాండ్ చేశాడు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ సమయంలో విమానంలో మొత్తం 75 మంది ప్రయాణికులు ఉన్నారు. -
భువనగిరిలో నిలిచిపోయిన రైళ్లు
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా పగిడిపల్లి వద్ద ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో ముంబయి ఎల్టీటీ రైలు నిలిచిపోయింది. దీంతో భువనగిరి రైల్వే స్టేషన్లో పలు రైళ్లను అధికారులు నిలిపివేశారు. రాజధాని, గోల్కొండ సహా మరో రైలు నిలిచిపోయింది. రెండు గంటలుగా రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. రైలులో సాంకేతిక లోపాన్ని అరగంటలో సరిదిద్దుతామని సీపీఆర్వో ఉమాశంకర్ తెలిపారు. ఆ వెంటనే రైళ్ల రాకపోకలు పునరుద్ధరిస్తామన్నారు. -
విమానం ఎగరలేదు.. తలుపులు లాక్
విశాఖపట్నం: విశాఖపట్నం విమానాశ్రయంలో స్పైస్ జెట్ విమానం సాంకేతికలోపం కారణంగా మూడు గంటల నుంచి నిలిచిపోయింది. ఇందులో ప్రముఖ నాయకులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. విమానంలో ఏసీ లేకపోవడంతో ఊపిరి ఆడని పరిస్థితి ఏర్పడింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేస్తారా లేదా అన్న విషయంపై యాజమాన్యం ఎలాంటి ప్రకటన చేయలేదు. విమానం నుంచి దిగి బయటకు వెళ్లిపోదామన్నా తలుపులు లాక్ అయి ఉన్నాయి. లోపల ఉక్కబోత, ఊపిరి ఆడని పరిస్థితి నెలకొంది. ప్రయాణికుల్లో చాలామంది పెద్దవయసు వాళ్లు ఉన్నారు. సాధారణంగానే ఇక్కడ 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. అలాంటిది విమానంలో తలుపులు అన్నీ వేసేసి ఉన్నప్పుడు పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సాంకేతిక లోపం మాత్రమే అని అధికారులు చెబుతున్నారు. అయితే విమానం ఎగరకపోవడం, తలుపులు లాక్ కావడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయో లేదో కూడా చెప్పకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. -
పాతబస్తీ... మెట్రో నాస్తి?
⇒18 నెలల ఆలస్యంతో ఆర్థిక భారం... ⇒పెరిగిన మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించాలని నిర్మాణ సంస్థ పేచీ! ⇒జూన్‌లో మియాపూర్– ఎస్.ఆర్.నగర్ రూట్లోనే ⇒మెట్రో పరుగులు.. పాతబస్తీ రూట్‌పై ఇంకా లేని స్పష్టత సిటీబ్యూరో: గ్రేటర్ వాసుల కలల మెట్రో ప్రాజెక్టు పాతనగరవాసులకు ‘కల’గానే మిగలనుంది. ప్రస్తుతం మెట్రో పనుల పురోగతి చూస్తే ఇదే విషయం సుస్పష్టమవుతోంది. సిటీలో నాగోల్–రాయదుర్గం (28 కి.మీ), ఎల్బీనగర్–మియాపూర్ (29 కి.మీ), జేబీఎస్–ఎంజీబీఎస్ (10 కి.మీ) మార్గాల్లోనే మెట్రో పనులు ఊపందుకున్నాయి. కానీ ఎంజీబీఎస్–ఫలక్‌నుమా రూట్లో సుమారు 5.3 కి.మీ మార్గంలో మెట్రో మార్గాన్ని ప్రభుత్వం ఖరారు చేయకపోవడంతో పనులు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారడం గమనార్హం. మరోవైపు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన మెట్రో రెండోదశ ప్రాజెక్టు సైతం కాగితాలకే పరిమితమైంది. ఇక ఈ ఏడాది జూన్‌లో మియాపూర్–ఎస్.ఆర్‌నగర్ రూట్లోనే మెట్రోరైళ్లు పరుగులు తీసే అవకాశాలున్నట్లు తెలిసింది. నాగోల్–బేగంపేట్ మార్గంలో మెట్రో పరుగులకు పలు అడ్డంకులున్నాయి. ప్రధానంగా బేగంపేట్, సికింద్రాబాద్ ఒలిఫెంటా రైలు ఓవర్బ్రిడ్జిల నిర్మాణం అసంపూర్తిగా మిగలడంతో ఈ రూట్లో మెట్రో రైళ్లు కూతపెట్టే అవకాశాలు కనిపించడంలేదు. నగరంలో మెట్రో పనులు ప్రారంభమై సుమారు ఐదేళ్లు కావస్తోంది. కానీ పాతనగరంలో ఎంజీబీఎస్–ఫలక్‌నుమా మార్గంలో ఇప్పటివరకు పనులు ఊపందుకోలేదు. ప్రధానంగా ఈ రూట్లో 30కి పైగా ఉన్న ప్రార్థనాస్థలాల మనుగడకు ముప్పు వాటిల్లకుండా మెట్రో మార్గాన్ని మూసీనది మధ్యనుంచి మళ్లించాలని అప్పట్లో కొన్ని రాజకీయపార్టీలు డిమాండ్‌చేశాయి. దీంతో రెండేళ్లక్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెట్రో మార్గాన్ని మార్చుతామని ప్రకటించింది. ఈ అంశంపై నగరంలోని అన్ని రాజకీయ పక్షాలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించిన తరవాతనే అలైన్మెంట్ ఖరారు చేస్తామని తెలిపింది. కానీ ఇప్పటివరకు సమావేశం నిర్వహించలేదు. అలైన్మెంట్ ఖరారు చేయలేదు. ఇక మెట్రో మార్గాన్ని మూసీ నదీగర్భం నుంచి మళ్లిస్తే నిర్మాణ పరంగా పలు సాంకేతిక సమస్యలు తలెత్తుతాయని, వాణిజ్యపరంగా తమకు గిట్టుబాటుకాదని నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ వర్గాలు ప్రభుత్వానికి స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో ఈ మార్గంలో మెట్రో మార్గం కలగానే మిగలనుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఆలస్యంతో నాలుగువేల కోట్ల భారం.. గ్రేటర్లో మెట్రో పనులు 2012 ఫిబ్రవరిలో ప్రారంభమయ్యాయి. నిర్మాణ ఒప్పందం ప్రకారం ఈ పనులను 2017 జూన్ నాటికి పూర్తిచేయాల్సి ఉంది. కానీ ఆస్తులసేకరణ ప్రక్రియ జఠిలంగా మారడం, కోర్టుకేసులు, రద్దీరూట్లలో పనులు చేపట్టేందుకు రైట్‌ఆఫ్‌వే సమస్యలు తలెత్తడం.. వెరసి ప్రాజెక్టును పూర్తిచేసే గడువు 2018 డిసెంబరుకు పొడిగించారు. దీంతో తొలుత అనుకున్న నిర్మాణ వ్యయం రూ.12,132 కోట్ల నుంచి ఇప్పుడు రూ.16,375 కోట్లకు చేరింది. ద్రవ్యోల్బణం, సిమెంటు, స్టీలు ధరల్లో హెచ్చుతగ్గులు, సిబ్బంది జీతభత్యాలు, యంత్రపరికరాల దిగుమతులు, వాటి అద్దెలు, నిర్మాణం కోసం వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీరేటు పెరగడం వంటి కారణాలతో వ్యయం రూ.4243 కోట్ల మేర పెరిగినట్లు తెలిసింది. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం తమకు పరిహారంగా చెల్లించాలని నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి స్పష్టతనీయకపోవడం గమనార్హం. జూన్‌లో మియాపూర్– ఎస్.ఆర్.నగర్ రూట్లోనే పరుగులు? ఈ ఏడాది జూన్ నెలలో మియాపూర్–ఎస్.ఆర్.నగర్(14 కి.మీ) రూట్లోనే మెట్రోరైళ్లు పరుగులు తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక నాగోల్–బేగంపేట్ మార్గంలో మెట్రో రైళ్లు పరుగులు తీయాలంటే బేగంపేట్, సికింద్రాబాద్ ఒలిఫెంటా రైలు ఓవర్బ్రిడ్జిల నిర్మాణాలను పూర్తిచేయాల్సి ఉంది. ఈ పనులను మే నెలాఖరునాటికి పూర్తిచేస్తామని నిర్మాణ సంస్థ వర్గాలు తెలిపాయి. ఒకవేళ ఈ పనులు ఆలస్యమైతే జూన్‌లో ప్రారంభించే అవకాశాలు లేనట్టే. కాగా ఈ ఏడాది డిసెంబరు నాటికి నాగోల్–రాయదుర్గం(28 కి.మీ), ఎల్బీనగర్–మియాపూర్ (29కి.మీ)మార్గాల్లో మెట్రో మార్గాన్ని పూర్తిచేస్తామని నిర్మాణ సంస్థ వర్గాలు ప్రకటించాయి. కాగితాలపైనే రెండోదశ... మెట్రో తొలిదశ పనులు ఊపందుకున్న తరుణంలో ప్రభుత్వం మెట్రో రెండోదశ ప్రాజెక్టును చేపడతామని రెండేళ్లక్రితం ఆర్భాటంగా ప్రకటించింది. పలు రూట్లలో సుమారు 56 కి.మీ మార్గంలో రెండోదశ మెట్రోను ప్రతిపాదించారు. దీనికి సంబంధించి ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్,హైదరాబాద్ మెట్రోరైలు,ఎల్అండ్టీ సంస్థల ప్రతినిధులు ఏడాదిక్రితం ప్రతిపాదిత మార్గాల్లో పరిశీలన జరిపి సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఏడాది కావస్తున్నా ఈవిషయంలో ఒక్క అడుగూ ముందుకుపడకపోవడం గమనార్హం. ప్రస్తుతం పనుల పురోగతి ఇదీ.. ⇒మూడు మార్గాల్లో మొత్తం 67 కి.మీ మార్గానికి గాను 52 కి.మీ మార్గంలో మెట్రో పిల్లర్ల నిర్మాణం, వీటిపై మెట్రోరైళ్లు పరుగులు తీసేందుకు వీలుగా వయాడక్ట్మార్గం సిద్ధమైంది. ⇒మొత్తం 65 స్టేషన్లకుగాను 40 స్టేషన్లు సిద్ధమయ్యాయి. మరో 25 స్టేషన్ల నిర్మాణం పనులు ఊపందుకున్నాయి. ⇒మొత్తం ప్రాజెక్టును 2018 డిసెంబరునాటికి పూర్తిచేస్తామని నిర్మాణ సంస్థ చెబుతోంది. ⇒మూడు రూట్లలో పరుగులుతీసేందుకు 57 మెట్రోరైళ్లు మియాపూర్, ఉప్పల్ మెట్రో డిపోల్లో సిద్ధంగా ఉన్నాయి. అసంపూర్తిగా మిగిలిన పనులివీ.. ⇒ మొత్తం 65 స్టేషన్లలో 17 స్టేషన్లకు మాత్రమే పార్కింగ్ వసతులున్నాయి. మిగతా వాటికి పార్కింగ్ స్థలాల లభ్యత కష్టసాధ్యంగా మారింది. ⇒ ఎల్భీనగర్–మియాపూర్ మార్గంలో: అసెంబ్లీ స్టేషన్ నిర్మాణం మొదలుకాలేదు. 19 పిల్లర్లు, 8 పునాదులు అసంపూర్తిగా ఉన్నాయి. లక్డీకాపూల్, మలక్‌పేట్ ఆర్ఓబీల నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. ⇒జేబీఎస్–ఫలక్‌నుమా మార్గంలో: బోయిగూడ స్టీలు బ్రిడ్జి నిర్మాణం పూర్తికాలేదు. నారాయణగూడ ఫ్లైఓవర్, పుత్లీబౌలి మెట్రో మార్గం పైనుంచి మెట్రో వయాడక్ట్ నిర్మాణం ప్రారంభంకాలేదు. ⇒నాగోల్–రాయదుర్గం మార్గంలో:ఒలిఫెంటా,బేగంపేట్ రైలు ఓవర్‌బ్రిడ్జీల నిర్మాణం పూర్తికాలేదు. అమీర్‌పేట్ మైత్రీవనం,యూసుఫ్‌గూడా ప్రాంతాల్లో వయాడక్ట్ మార్గం పూర్తికాలేదు. ⇒సుమారు వంద ఆస్తుల సేకరణకు సంబంధించి బాధితులకు పరిహారం అందించకపోవడం,న్యాయవివాదాలు పనుల వేగాన్ని దెబ్బతీస్తున్నాయి. -
మొరాయించిన రైలింజన్
- పలు రైళ్లు ఆలస్యం భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ఇంజన్ మొరాయించడంతో ఓ గూడ్స్ రైలు నిలిచిపోయింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. విజయవాడ నుంచి సికింద్రాబాద్ వెళ్లే శాతవాహన రైలు ఆలస్యంగా నడుస్తోంది. అలాగే కాజీపేట నుండి హైదరాబాద్ వెళ్లే రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. -
నిలిచిన తిరుపతి-హుబ్లీ ఎక్స్‌ప్రెస్
కడప: తిరుపతి నుంచి హుబ్లీ వెళ్తున్న ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. సాంకేతిక లోపం తలెత్తడం వల్ల అత్యవసరంగా రైలును నిలిపివేశారు. వైఎస్సార్ జిల్లా నంవలూరు సమీపంలోకి రాగానే రైళ్లో సాంకేతిక లోపం తలెత్తింది. ఇది గుర్తించిన డ్రైవర్ నంవలూరు సమీపంలో రైలును నిలిపివేసి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అధికారులు మరమ్మత్తులు చేస్తున్నారు. -
ఆర్టీసీ బస్సులో మంటలు : తప్పిన ప్రమాదం
విజయవాడ : కృష్ణాజిల్లాలో ఆర్టీసీ బస్సుకు మంగళవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. కంచికచర్ల మండలం పరిటాల జాతీయ రహదారిపై బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. విజయవాడ నుంచి కోదాడ వెళ్తున్న బస్సులో సాంకేతిక లోపంతో ఇంజిన్ వద్ద మంటలు వ్యాపించాయి. మంటలను గమనించిన డ్రైవర్ అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కన ఆపేశాడు. భయాందోళనకు గురైన ప్రయాణికులు బస్సు నుంచి కిందికి దాగారు. వెంటనే మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్ ఇంజిన్‌ను క్షుణ్ణంగా పరిశీలించాక బస్సు తిరిగి బయలుదేరింది. -
పెద్దపల్లిలో ఆగిన గూడ్స్ : రైళ్లకు అంతరాయం
పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలో ఓ గూడ్స్ రైలు సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. ఓదెల మండలం కొలనూరు వద్ద సోమవారం సాయంత్రం గూడ్స్ రైలులో సాంకేతిక లోపం తలెత్తటంతో పట్టాలపైనే నిలిచిపోయింది. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని రైళ్లను దారి మళ్లించగా, మరి కొన్నింటిని మరొక లైన్లో నడిపించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రైల్వే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేస్తున్నారు. సమస్యను వెంటనే పరిష్కరిస్తామని రైల్వే అధికారులు తెలిపారు. -
చిత్తూరులో నిలిచిపోయిన పుష్పుల్ రైలు
చిత్తూరు : చిత్తూరు నుంచి బెంగళూరు వెళుతున్న పుష్పుల్ రైలు సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. చిత్తూరు నుంచి గురువారం ఉదయం బయల్దేరిన రైలు గుడిపల్లి మండలం కోడవనపల్లి గ్రామ సమీపంలో ఆగిపోయింది. ఫలితంగా చెన్నయ్-బెంగళూరు మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైలు మార్గమధ్యంలో ఒక్కసారిగా ఆగిపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న చిత్తూరు రైల్వే అధికారులు, సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి బయలుదేరారు. -
జీతాల సమస్యపై మళ్లీ ప్రతిపాదనలు
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల్లో పనిచేస్తున్న డీఎస్పీలు, ఇన్ స్పెక్టర్లు, సబ్ఇన్ స్పెక్టర్లకు జీతాలు అందలేదన్న అంశంపై పీఅండ్ఎల్, బడ్జెట్ అధికారులతో డీజీపీ అనురాగ్‌శర్మ మంగళవారం చర్చించారు. కొత్త జిల్లాల నేపథ్యంలో ఏర్పాటు చేసిన నూతన పోస్టులకు జీతాల చెల్లింపు జీవో జారీ కాకపోవడం, ఇతర సాంకేతిక సమస్యలపై ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో మరోసారి చర్చించాలని పీఅండ్ఎల్ అధికారులను ఆదేశించారు. పోస్టులకు సంబంధించి జీతభత్యాల చెల్లింపులో పీఏఓ (పే అండ్ అకౌంట్స్) ఆదేశాలు వెళ్లేలా మరోసారి ప్రతిపాదనలు పంపాలని, రెండు రోజుల్లో ఆదేశాలు వెలువడేలా కృషి చేయాలని పీఅండ్ ఎల్ ఐజీ సంజయ్‌కుమార్ జైన్ ను డీజీపీ ఆదేశించారు. కాగా.. సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల విభజనలో సమయంలోనూ ఇదే సమస్య తలెత్తిందని, 6 నెలల పాటు జీతాల చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదురయ్యాయని డీజీపీకి పీఅండ్ఎల్ అధికారులు వివరించారు. -
శాతవాహన ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం
విజయవాడ : ఖమ్మం జిల్లా చింతకాని మండల పరిధిలోని పందిళ్లపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో శాతవాహన ఎక్స్‌ప్రెస్‌కు మంగళవారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళు తున్న శాతవాహన ఎక్స్‌ప్రెస్ పందిళ్లపల్లి రైల్వేస్టేషన్ సమీపంలోకి రాగానే 494/ 10 విద్యుత్ స్తంభం వద్ద వైర్లు ఒక్కసారిగా తెగి కిలోమీటర్ మేరకు ఉన్న 494/24 విద్యుత్ స్తంభం వరకు వైర్లు పూర్తిగా ధ్వంస మయ్యాయి. ఆ సమయంలో రైలు వేగంగా వెళుతోంది. దీంతో రైలింజన్ ఫాంటో విరిగి పడిపోయింది. కిలోమీటరున్నర మేరకు విద్యుత్ పరికరాలు ధ్వంసమయ్యాయి. విద్యుత్ వైర్లు తెగటంతో మంటలు వ్యాపిం చాయి. అప్రమత్తమైన లోకో పైలట్లు వెంటనే రైలును నిలిపివేయగా పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో రాత్రి 8.40 నుంచి 11 వరకు రైలు నిల్చిపోయింది. ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. విజయవాడ వైపు వెళ్లే పలు రైళ్లను ఆయా రైల్వేస్టేషన్లలో నిలిపివేశారు. -
గోదావరి మధ్యలో నిలిచిన బోటు
దేవీపట్నం: పాపికొండల విహారయాత్రకు బయలుదేరిన బోటు గోదావరి మధ్యలోనే నిలిచి పోయింది. వివరాలివీ.. గురువారం ఉదయం సుమారు 150 మంది యాత్రికులు సాయిగాయత్రి బోట్లో పురుషోత్తపట్నం నుంచి పాపికొండల వైపు బయలు దేరారు. బోట్ స్టీరింగ్‌లో సాంకేతిక లోపం తలెత్తటంతో ఉదయం 11.30 గంటల ప్రాంతంలో వీరవరం లంక వద్ద నది మధ్యలోనే నిలిచిపోయింది. దీంతో నిర్వాహకులు అధికారులకు సమాచారం అందించారు. ప్రయాణికులను మరో బోట్ ద్వారా గమ్యానికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేపట్టారు. అయితే, ఈ హఠాత్ పరిణామంతో పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం
గన్నవరం: గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరాల్సిన విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. లోపాన్ని గుర్తించిన పైలెట్ విమానాన్ని గన్నవరంలోనే నిలిపివేశాడు. మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు బయల్దేరాల్సిన స్పైస్ జెట్ విమానం ఇప్పటివరకు బయల్దేరలేదు. రాత్రి 9 గంటలకు బయల్దేరే అవకాశం ఉందని విమానాశ్రయం అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికి మూడు గంటలుగా 60 ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మొరాయించిన గూడ్స్ ఇంజిన్
– ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం డోన్ టౌన్ : సాంకేతికలోపంతో బుధవారం మధ్యాహ్నం గూడ్స్ ఇంజిన్ మోరాయించింది. పట్టణంలోని రైల్వేగేట్ మధ్యలో గూడ్స్ కంటైనర్లు నిలిచిపోయాయి. దీంతో గేటుకు ఇరువైపులా ట్రాపిక్ స్తంభించిపోయింది. వాహనదారులు, పాదచారులు గంటపాటు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ప్రత్యామ్నాయ ఇంజిన్‌ను ఏర్పాటు చేసి గూడ్స్ కంటైనర్లను స్టేషన్లోకి తరలించడంతో గేట్లను ఎత్తివేశారు. దీంతో వాహనాల రాకపోకలకు ఏర్పడిన అంతరాయం తొలగిపోయింది. -
కడచూపు కరువు!
► మిగిలింది మట్టే ► మురుగంపట్టిలో కన్నీటి ఘోష ► 19కి చేరిన మృతుల సంఖ్య ► రంగంలోకి సీబీసీఐడీ ► వెలుగులోకి యాజమాన్య నిర్లక్ష్యం ► సాంకేతిక సమస్యతోనే పెను ప్రమాదం సాక్షి, చెన్నై : ‘గుర్తు పట్టేందుకు వీలులేనంతంగా ఛిద్రమైన శరీరాలు.. మట్టిలో కలిసిన అవయవాలు.. ప్రతి గుండె బరువెక్కేంతగా హృదయ విదారకర పరిస్థితులు’. ఇది మురుగంపట్టిలో దర్శనం ఇస్తు న్న దృశ్యాలు. తమ వాళ్ల కడచూపు కూడా దక్కని దృష్ట్యా, బాధిత కుటుంబాల కన్నీటి వేదనకు హద్దే లేదు. చివరకు తమకు మిగిలింది మట్టే అన్నట్టుగా అక్కడి మట్టిని కొంత తవ్వి, అదే తమ వారి భౌతిక కాయం అంటూ అంత్యక్రియలకు తీసుకెళ్తుండడం బట్టి చూస్తే, పేలుడు తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. తిరుచ్చి జిల్లా తురైయూర్ సమీపంలోని మురుగంపట్టిలోని వెట్రివేల్ రసాయన కర్మాగారంలో గురువారం భారీ పేలుడు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతులు 18 మంది అని అధికార వర్గాలు తేల్చాయి. తొలి రోజు సహాయక చర్యలకు వర్షం అడ్డంకిగా మారడంతో రెండో రోజైన శుక్రవారం కూడా రెస్క్యూ ఆపరేషన్ తీవ్రంగానే సాగింది. నాలుగు ప్రొక్లైనర్లను తీసుకొచ్చి మరీ మృతదేహాల కోసం గాలించాల్సిన పరిస్థితి. కర్మాగారంలో పనిచేస్తున్న తమ అబ్బాయి ప్రవీణ్ కన్పించడం లే దంటూ సేలం నుంచి కుటుంబీకులు ఇచ్చిన సమాచారంతో మృతుల సంఖ్య 19కు చేరినట్టు అరుుంది. అరుుతే, మిగిలిన పదిహేను మృతదేహాల్ని గుర్తిం చేం దుకు వీలు కూడా లేదని అధికార వర్గాలు తేల్చాయి. ఎక్కడికక్కడ శరీర అవయవాలు ఛిద్రమై మట్టిలో కలవడం, పేలుడు దాటికి భవనం కుప్పకూలడమే కాకుండా, అక్కడి రసాయనాలు, యాసిడ్ కారణంగా చెలరేగిన మంటల కారణంగా ఆచూకీ తేల్చడం కష్టతరంగా మారింది. దీంతో అక్కడికి చేరుకున్న బాధిత కుటుంబాల కన్నీటి రోదనకు హద్దే లేదు. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదు. తమ వాళ్ల కడచూపు కూడా దక్కకుండా చేశారంటూ తిట్టి పోస్తూ, రోదించే వాళ్లు కొందరు అరుుతే, జరిగింది జరిగి పోరుుందంటూ ఆవేదన వ్యక్తం చేసే వాళ్లు మరి కొందరు. చివరకు తమకు మిగిలింది మట్టే అంటూ పలు కుటుంబాలు పేలుడు జరిగిన ప్రదేశం నుంచి కొంత మేరకు మట్టిని తవ్వి అవే తమ వారి మృతదేహాలుగా భావించి, అంత్యక్రియలు జరుపుకునేందుకు బరువెక్కిన హృదయాలతో ముందుకు సాగారు.రంగంలోకి సీబీసీఐడీ: పేలుడు ఘటన ఎలా జరి గిందో అంతు చిక్కని దృష్ట్యా, కేసును సీబీసీఐడీకి అ ప్పగించారు. ఆ విభాగం వర్గాలు శుక్రవారం పేలుడు జరిగిన పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఆ గ్రామాల ప్రజలతో మాట్లాడేందుకు యత్నించారు. అరుుతే, ఫ్యాక్టరీకి శాశ్వత తాళం వేయాల్సిందేనంటూ గ్రామస్తులు డిమాండ్ చేయడంతో అధికారులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. కాగా, సాంకేతిక కారణాలను సరి చేయడంలో యాజమాన్యం విఫలం అవుతుండడం వల్లే భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చినట్టుగా విచారణలో తేలింది. 22 ఏళ్ల క్రితం యాభై ఎకరాల విస్తీర్ణంలో వెట్రివేల్ రసాయన కర్మాగారం ఏర్పాటు చేసినట్టు తేలింది. ఇక్కడి ఏడు యూనిట్లలోని ఒక్కో యూనిట్లో ఒక్కో రకం పేలుడుకు ఉపయోగించే ముడిసరుకు తయారు అవుతున్నట్టు వెలుగుచూ సింది. పేలుడు జరిగిన యూనిట్లో భారీ విస్పోటనాలకు ఉపయోగించే పీఈటీ నైట్రేట్ అనే ముడిసరుకు తయారు అవుతున్నట్టు, రాత్రి షిఫ్ట్‌లో ఉన్న వాళ్లు టెంపరేచర్ లీక్‌ను గుర్తించి సంబంధిత విభాగానికి సమాచారం ఇచ్చినట్టే తేలింది. అరుుతే, దానిని సరిచేయలేదు. ఉదయం షిఫ్ట్‌లో పనికి వచ్చిన వాళ్లకు ఆ లీక్ విషయం తెలియనట్టు సమాచారం. దీంతో టెంపరేచర్‌ను పెంచే క్రమంలోనే ఈ విస్ఫోటనం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. అక్కడి యూనిట్లు పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల క్రితం నెలకొల్పినట్టు, వా టిలో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నా, వా టిని పూర్తి స్థారుులో కాకుండా , తాత్కాలికంగా సరిచేయడం వల్లే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిం దని గాయపడ్డ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము పదే పదే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా, పర్యవేక్షణ లోపం కారణంగా, ప్రస్తుతం సహచరులను కోల్పోయామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
విరిగిన పట్టా.. తప్పిన ప్రమాదం
-
విరిగిన పట్టా.. తప్పిన ప్రమాదం
రఘనాథపల్లి(వరంగల్ జిల్లా): బల్లార్షా-సికింద్రాబాద్ భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం తప్పింది. రఘనాథపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో రైలు పట్టా విరిగింది. పట్టా విరిగిన విషయాన్ని రైల్వే అధికారులకు గ్యాంగ్మెన్లు సమాచారం అందించారు. దీంతో భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌ను రఘనాథపల్లికి సమీపంలో నిలిపివేశారు. రైల్వే అధికారులు మరమ్మతులు చేపట్టారు. గ్యాంగ్మెన్ల అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. మరమ్మత్తు అనంతరం రైలు బయలు దేరింది. -
నడిసముద్రంలో ఆగిపోయిన నౌక
-
నడి సంద్రంలో నిలిచిన నౌక: ప్రయాణికుల ఆందోళన
విశాఖపట్నం: అండమాన్ వెళ్తున్న 'హర్షవర్దన్' నౌకలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో నడి సంద్రంలో నౌక నిలిచిపోయింది. దీంతో నౌక సిబ్బంది వెంటనే ఆ శాఖ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దాంతో సాంకేతిక సిబ్బంది బృందాన్ని హర్షవర్దన్ నౌక వద్దకు పంపి లోపాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టినట్లు విశాఖ ఫోర్టు ట్రస్ట్ ఉన్నతాధికారి ఒకరు బుధవారం విశాఖలో వెల్లడించారు. నౌకలో ఏర్పడిన సాంకేతిక లోపం నివారించేందుకు సిబ్బంది తమ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు చెప్పారు. ఈ నౌక దాదాపు 600 మంది ప్రయాణికులతో మంగళవారం మధ్యాహ్నం 1.20 గంటలకు విశాఖపట్నం పోర్టు నుంచి అండమాన్ బయలుదేరింది. అయితే రాత్రి సమయంలో నౌకలో సాంకేతిక లోపం ఏర్పడినట్లు సిబ్బంది గుర్తించారు. నౌక నిలిచిపోవడంతో అందులోని ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నౌకలో ప్రయాణిస్తున్న వారిలో అత్యధికులు ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలకు చెందిన వారని... వారంతా అండమాన్‌లో ఉపాధి చేసుకుంటున్న వారని సమాచారం. నౌక నడి సంద్రంలో చిక్కుకుందని తెలిసిన ప్రయాణికుల బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
ఆగిన దురంతో ఎక్స్‌ప్రెస్
వేటపాలెం: ఇంజిన్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో దురంతో ఎక్స్ ప్రెస్ నిలిచిపోయింది. చెన్నై నుంచి విజయవాడకు వెళ్తుండా ప్రకాశం జిల్లా వేటపాలెం సమీపంలో సోమవారం రైలులో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ ఎక్స్ ప్రెస్ ను నిలిపివేశారు. అధికారులు రైలు పునరుద్ధరణ పనులు చేపట్టారు. కాగా రెండు గంటలుగా రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆ రూట్లో ప్రయాణిస్తున్న రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లుతోంది. -
సర్వర్ సమస్యలతో ‘నామ్’ సతమతం
♦ రద్దీవేళల్లో మార్కెటింగ్ ప్రక్రియలో ఇబ్బందులు.. ♦ రైతుల పాట్లు సమస్యలు పరిష్కరించాలంటూ హరీశ్ లేఖ సాక్షి, హైదరాబాద్: జాతీయ వ్యవసాయ మార్కెటింగ్(నామ్) పథకం సాంకేతిక సమస్యలతో సతమతమవుతోంది. వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాల్లో పారదర్శకతను పెం చేందుకు ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వం నామ్ పథకాన్ని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 214 వ్యవసాయ మార్కెట్లను ఆన్లైన్ ద్వారా అనుసంధానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నామ్ పథకం కింద రాష్ట్రం నుంచి 44 మార్కెట్లను ఎంపిక చేయగా తొలి విడతలో ఐదు మార్కెట్లలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. నిజామాబాద్(పసుపు), తిరుమలగిరి(ధాన్యం), వరంగల్(మక్కలు), హైదరాబాద్(మిర్చి), బాదేపల్లి(ధాన్యం) యార్డుల్లో ‘ఈ టెండరింగ్’ విధానంలో లావాదేవీలు ప్రారంభించారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని ఐదు మార్కెట్‌యార్డుల్లో రూ.111.38కోట్ల విలువ చేసే 17,379 మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఆన్లైన్ ద్వారా లావాదేవీలు జరగాల్సి ఉండగా సర్వర్ సమస్యలతో ‘నామ్’ పోర్టల్ తరచూ మొరాయిస్తోంది. రద్దీవేళల్లో నెమ్మదించడంతో నిర్దేశిత సమయంలోగా మార్కెటింగ్ ప్రక్రియను పూర్తిచేయడంలో వ్యాపారులు ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు. మ రోవైపు వ్యవసాయ ఉత్పత్తులతో మార్కెట్‌కు తరలివచ్చిన రైతులు గంటలకొద్దీ వేచి ఉండాల్సిన పరిస్థితి. గేట్ ఎంట్రీలోనూ సమస్యలు మరో 39 వ్యవసాయ మార్కెట్లను నామ్ పథకం అనుసంధానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది జూలై 11 నుంచి మార్కెట్‌కు తరలివచ్చే ధాన్యం వివరాలను గేట్ ఎంట్రీ విధానంలో నమోదు చేస్తున్నారు. సర్వర్ సమస్యలతో గేట్ ఎంట్రీ ప్రక్రియ సకాలంలో పూర్తవడం లేదు. ఈ నేపథ్యంలో నామ్ సర్వర్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌కు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు ఇటీవల లేఖ రాశారు. సులభ మార్కెటింగ్ కార్యకలాపాలకు వీలుగా రూపొందిస్తున్న మొబైల్ యాప్ ను వీలైనంత త్వరగా అందజేయాలని కోరా రు. వ్యాపారులకు ఉత్పత్తులవారీగా ధరల జాబితాను ఇవ్వడం ద్వారా వేలం ప్రక్రియ మరింత సులభమవుతుందన్నారు. -
విమానం దారి మళ్లింపు, ఆందోళనలో ప్రయాణికులు
ఢిల్లీ: ఎయిరిండియా విమానంలో మరోసారి సాంకేతిక లోపం తలెత్తింది. ఢిల్లీ నుంచి న్యూయార్క్ బయలుదేరిన విమానంలో గురువారం రాత్రి సాంకేతిక లోపం ఏర్పడింది. న్యూయార్క్ వెళ్లాల్సిన విమానం కజికిస్థాన్కు దారి మళ్లింది. దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఘటనపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వెంటనే ఎయిరిండియా సీఈవోతో ఫోన్లో మాట్లాడారు. విమానంలో 50 మంది తెలుగు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రత్యామ్నాయ విమానం ద్వారా ప్రయాణికులను న్యూయార్క్ పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎయిరిండియా సీఈవో తెలిపారు. -
170 మంది లోపలే ఉన్నారు... బయట..
రెండున్నర గంటలపాటు నిలిచిపోయిన విమానం ప్రయాణికులు లోపలుండగానే మరమ్మతులు గోపాలపట్నం: విశాఖ విమానాశ్రయంలో స్పైస్ జెట్ విమానానికి సాంకేతిక సమస్య తలెత్తింది. సరిగ్గా విమానంలోకి ప్రయాణికులు ఎక్కాక సమస్య ఎదురవ్వడంతో అప్పటికపుడు ప్రయాణికులను దించడానికి వీల్లేక యుద్ధప్రాతిపదికపై సాంకేతిక నిపుణులు లోపాన్ని సరిచేసి విమానాన్ని కదిలించారు. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. హైదరాబాదు నుంచి విశాఖకు స్పైస్‌జెట్ విమానం సాయంత్రం 6.30కి చేరింది. ఇది ఏడు గంటలకు తిరిగి హైదరాబాదు బయలుదేరాల్సి ఉండగా, దాదాపు 170మంది ప్రయాణికులు విమానంలో కూర్చున్నారు. ఇంతలో విమానానికి సాంకేతిక సమస్య ఎదురవ్వడంతో పెలైట్ అప్రమత్తమయ్యారు. తలుపులు తెరవడానికి కూడా ఆస్కారం లేకపోవడంతో ప్రయాణికులను విమానంలోనే ఉంచి సాంకేతిక నిపుణులను రప్పించారు. ప్రయాణికులకు నూడిల్సు తదితర ఆహారం సరఫరా చేశారు. ఎట్టకేలకు రాత్రి 9.25కి సమస్య పరిష్కారమై విమానం కదిలింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకుని క్షేమంగా వెళ్లారు. -
ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు
బుధవారం ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు ఎగిసిపడుతుండటంతో.. వరంగల్ జిల్లా మహబూబాబాద్ స్టేషన్లో నిలిపివేశారు. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. ఏపీ ఎక్స్‌ప్రెస్ ఏసీ భోగిలో నుంచి పొగలు వెళ్తుండటం గమనించిన డ్రైవర్ రైలును స్టేషన్లో నిలిపివేశాడు. సమాచారం అందుకున్న అధికారులు మరమ్మత్తులు నిర్వహిస్తున్నారు. -
ఫీజులు పెండింగ్
► బీసీ అధికారుల నిర్లక్ష్య ఫలితం ► రూ.172 కోట్లు విడుదల ► సుమారు రూ.90 కోట్లే ఖర్చు ► సాంకేతిక సమస్యతో నిలిచిన ప్రక్రియ ► విద్యార్థులకు ఇక్కట్లు కరీంనగర్ సిటీ: బీసీ సంక్షేమ శాఖ అధికారుల నిర్లక్ష్యం జిల్లాలో విద్యార్థులకు శాపంలా పరిణమించింది. ఏళ్ల తరబడి రోడ్లెక్కి ఉద్యమాలు చేస్తే ప్రభుత్వం విడుదల చేసిన స్కాలర్షిప్, ఫీజు రీరుుంబర్స్‌మెంట్ నిధులను అధికారులు సకాలంలో ఖర్చుచేయకపోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికొస్తోంది. స్కాలర్షిప్, ఫీజు రీరుుంబర్స్‌మెంట్ కింద జిల్లా బీసీ సంక్షేమ శాఖకు రూ.172 కోట్లను ప్రభుత్వం గత మే 8న విడుదల చేసింది. ఇందులో 2014-15 ఫ్రెష్, 2015-16 సంవత్సరాలకు సంబంధించిన విద్యార్థుల రెన్యువల్, ఫ్రెష్ ఫీజులున్నాయి. బకాయిలు విడుదల చేయాలనే ఒత్తిడితో ఎట్టకేలకు కేసీఆర్ ప్రభుత్వం మొత్తం ఏకకాలంలో విడుదల చేసింది. దీంతో విద్యార్థులు, కళాశాలలు ఊపిరి పీల్చుకున్నాయి. కాని ప్రభుత్వం విడుదల చేసిన నిధులను విద్యార్థుల, కళాశాలల ఖాతాలకు మళ్లించాల్సిన సంక్షేమశాఖ అధికారులు విపరీత జాప్యంచేశారు. దాదాపు నెలరోజుల సమయంలో సుమారు రూ.90 కోట్లు మాత్రమే ఖాతాల్లో వే సినట్లు సమాచారం. ఇందుకు సంబంధిత బిల్లులు చేసే అధికారులకు అవగాహన లేకపోవడం కొంత కాగా, కావాలని జాప్యం చేస్తున్నారనే అనుమానాలూ ఉన్నాయి. ఇదే సమయంలో ట్రెజరీ నుంచి బ్యాంక్‌లకు వెళ్లాల్సిన ఆన్లైన్ ప్రక్రియ నిలిచిపోయింది. అయితే ఇది నిజంగా సాంకేతిక సమస్య కాదని, ప్రభుత్వం విధించిన అనధికార ఫ్రీజింగ్లో భాగమేననే పలు సంఘాలు పేర్కొంటున్నాయి. ఏదేమైనా సమస్యను రెండు రోజుల్లో సరిచేస్తామని అధికారులు చెబుతున్నా బిల్లులకు సంబంధించి బీసీ సంక్షేమ శాఖ అధికారులు చేస్తున్న జాప్యంతో మరెన్ని సమస్యలు వస్తాయో అనే ఆందోళనను విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసినా, సంక్షేమ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థులు, కళాశాలలు ఫీజుల కోసం మళ్లీ ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే, కళాశాలలతో ‘ఒప్పందాలు’ పూర్తి కాకపోవడంతో కావాలనే బిల్లుల్లో జాప్యం చేస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. ఏదేమైనా మొత్తం ఫీజు బకాయిలు వచ్చినందున జాప్యం చేయకుండా సకాలంలో చెల్లించాలని విద్యార్థులు కోరుతున్నారు. ‘బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన స్కాలర్షిప్, ఫీజు రీరుుంబర్స్‌మెంట్ నిధులు ఖాతాల్లో వేసే ప్రక్రియ సర్వర్ సమస్యతో తాత్కాలికంగా నిలిచిపోయింది. ఇప్పటికే మాకు వచ్చిన బిల్లులు దాదాపుగా ఖాతాల్లో వేశాం. ఒకట్రెండు రోజుల్లో సాంకేతిక సమస్యను సరిచేసి,ప్రక్రియను ప్రారంభిస్తాం’ అని డీటీవో శ్రీనివాస్ తెలిపారు. -
విమానంలో సాంకేతిక లోపం: ప్రయాణికుల ఆందోళన
హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం వెళ్ల వలసిన ఎయిర్ఇండియా విమానంలో గురువారం సాంకేతి లోపం ఏర్పడింది. దీంతో విమానం నాలుగు గంటలపాటు శంషాబాద్ విమానాశ్రయంలోనే నిలిచిపోయింది. దాంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఈ రోజు ఉదయం 7 గంటలకు బయలుదేరాల్సిన విమానం ఎంతసేపటికీ బయలుదేర లేదు. సరికదా విమానాశ్రయ అధికారులు కూడా సరైన సమాధానం ఇవ్వలేదు. దీంతో సదరు విమానంలో ప్రయాణించవలసిన సదరు ప్రయాణికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో విమానాశ్రయ అధికారులపై ప్రయాణికులు విరుచుపడ్డారు. చివరకు సాంకేతిక లోపాన్ని సరి చేసిన తర్వాత ఉదయం 11.15 గంటలకు విమానం విశాఖపట్టణం బయలుదేరింది. -
నిలిచిన 'కాళేశ్వరి': ప్రయాణికుల పడిగాపులు
విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లాలోని నక్కపల్లి టోల్గేట్ వద్ద బుధవారం రాత్రి విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కాళేశ్వరి ట్రావెల్స్ బస్సు సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. మరో బస్సు ఏర్పాటు చేస్తామని బస్సు యాజమాన్యం సదరు ప్రయాణికులకు తెలిపింది. దీంతో ఆ బస్సులోని దాదాపు 45 మంది ప్రయాణికులు రాత్రంతా బస్సులోన పడిగాపులు పడ్డారు. మరో బస్సు రాకపోవడంతో ప్రయాణికులు పోలీసులను ఆశ్రయించారు. వేరొక బస్సు ఏర్పాటు చేస్తామని యాజమాన్యం మోసం చేసిందని పోలీసులకు ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని... ప్రయాణికులను హైదరాబాద్ పంపించారు. -
బూర్గుల దగ్గర నిలిచిన గూడ్స్... పలు రైళ్లు ఆలస్యం
షాద్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ మండలం బూర్గుల వద్ద సాంకేతిక లోపంతో శనివారం ఉదయం ఓ గూడ్స్ రైలు నిలిచిపోయింది. ఉదయం సుమారు 7.30 గంటల సమయంలో సాంకేతిక లోపంతో గూడ్స్ నిలిచిపోవడంతో ఆ మార్గంలో ప్రయాణించాల్సిన రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేశారు. ఉదయం 10.30 గంటల సమయంలో వేరొక ఇంజన్‌ను రప్పించి గూడ్స్ రైలును అక్కడి నుంచి పంపించే ఏర్పాటు చేశారు. దీంతో సుమారు మూడు గంటలకుపైగా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. -
ఆగిన బల్లకట్టు.. ప్రయాణికుల ఆందోళన
- సాంకేతికలోపమే కారణం.. మరమ్మతుల అనంతరం ఒడ్డుకు.. మేళ్లచెర్వు : నల్లగొండ జిల్లా మేళ్లచెర్వు మండలంలోని చింత్రియాల వద్ద నిర్వహిస్తున్న బల్లకట్టు శనివారం సాయంత్రం సాంకేతిక లోపంతో కృష్ణానదిలో నిలిచిపోయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బల్లకట్టు గుంటూరు జిల్లా వైపు నుంచి లారీతోపాటు ప్రయాణికులను ఎక్కించుకుని మేళ్లచెర్వు మండలం చింత్రియాలవైపు వస్తుండగా.. సాంకేతికలోపం తలెత్తింది. దీంతో అది నది మధ్యలోనే నిలిచిపోయింది. ఇలా గంటసేపు నిలిచిపోవడంతో అందులో ఉన్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. నిర్వాహకులు ఇంజన్‌కు మరమత్తులు చేయించి ఒడ్డుకు తేవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు
యాదగిరిగుట్ట(నల్లగొండ): హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు రావడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇది గుర్తించిన రైల్వే సిబ్బంది ఫైరింజన్ సాయంతో పొగలను అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి వద్దకు చేరుకోగానే దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఇది గుర్తించిన సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ప్రస్తుతం పొగలను అదుపులోకి తెస్తున్నారు. సాంకేతిక లోపం కారణంగానే పొగలు అలుముకున్నాయని అధికారులు తెలిపారు. -
అర్థరాత్రి రోడ్డుపై పడిగాపులు
- చెడిపోయిన ఎస్ఎల్ ట్రావెల్స్ - ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు గుత్తి: ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆశ్రయించి ప్రయాణం సాగిస్తున్న వారి కష్టాలు చెప్పనలవి కాని విధంగా మారుతున్నాయి. అకస్మాత్తుగా బస్సు రిపేరుకు వస్తే.. గంటల తరబడి రోడ్డుపై నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తాజాగా బుధవారం రాత్రి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఎస్ ఎల్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు అనంతపురం జిల్లా గుత్తి మండలం రామరాజుపల్లి టోల్‌ప్లాజా సమీపంలో చెడిపోయింది. అయితే ట్రావెల్స్ యాజమాన్యం బస్సును రిపేర్ చేయించడం గానీ, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు గానీ చేయలేదు. దీంతో బస్సులో ఉన్న 22 మంది ప్రయాణికులు రోడ్డుపై అక్కడే పడిగాపులు కాస్తున్నారు. ట్రావెల్స్ యాజమాన్యం స్పందించడం లేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. ప్రత్యామ్నాయం చూపక పోవడంతో వారంత గత అర్థరాత్రి నుంచి రహదారిపై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణీకులు రహదారిపై ఆందోళనకు దిగారు. -
గ్యాస్ సబ్సిడీ గందరగోళం
► ఫినో ఖాతాలో జమ ► వినియోగదారులకు అందనివైనం ► సాంకేతిక సమస్య పేరిట దాటవేత కరీంనగర్ రూరల్ : వంటగ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బు వినియోగదారులకు అందడంలేదు. గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల నిర్లక్ష్యం, ఫినో కంపెనీ దాటవేత వైఖరితో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవైసీలో బ్యాంకు ఖాతాల నంబర్లతో వినియోగదారులు దరఖాస్తు చేసుకున్నా సబ్సిడీ డబ్బును వారి ఖాతాల్లో కాకుండా ఫినో కంపెనీ ఖాతాలో జమచేస్తున్నారు. సబ్సిడీ డబ్బుల కోసం వినియోగదారులు ఫినో కంపెనీ ప్రతినిధుల చుట్టూ మూడు నెలలుగా తిరుగుతున్నా.. సాంకేతిక సమస్య సాకుతో తప్పించుకుంటున్నారు. కరీంనగర్ మండలంలోని పలు గ్రామాలకు భారత్ గ్యాస్‌ను శివ థియేటర్ సమీపంలోని ఓంసాయిరాం గ్యాస్ ఏజెన్సీ సరఫరా చేస్తోంది. గతంలో గ్యాస్ సిలిండర్‌ను సబ్సిడీ మినహాయించి వినియోగదారులకు సరఫరా చేసేవారు. గతేడాదినుంచి కేంద్రప్రభుత్వం నేరుగా వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లోకి సబ్సిడీ జమచేస్తోంది. దీనికోసం గ్యాస్ ఏజెన్సీలకు వినియోగదారులు కేవైసీలో బ్యాంకుఖాతాలను సమర్పించారు. గ్యాస్ సిలిండర్ ధర రూ.599 ఉండగా సబ్సిడీ రూ.138 వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారు. ప్రభుత్వ లబ్ధిదారులకే ఈ తిప్పలు గ్యాస్ వినియోగదారులకు దాదాపు నాలుగైదు నెలల నుంచి సబ్సిడీ డబ్బు జమకావడంలేదు. ప్రభుత్వం నుంచి లబ్ధిపొందుతున్న వారికి మాత్రమే ఈ సమస్య ఏర్పడగా.. మిగిలిన వినియోగదారులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ డబ్బులు జమవుతున్నాయి. ఉపాధిహామీ కూలీలు, ఆసరా ఫించన్‌దారులకు ఫినో కంపెనీ నుంచి సబ్సిడీ డబ్బు చెల్లిస్తున్నారు. ఈ వినియోగదారులు కేవైసీలో బ్యాంకు ఖాతా నంబర్లు ఇచ్చినా ఆధార్‌కార్డు నంబర్ ఫీడింగ్తో ఫినో కంపెనీలో నమోదైన ఖాతాల్లోకి జమవుతోందని ఓంసాయిరాం గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధి వెంకటేశ్వర్రావు తెలిపారు. అయితే పలు గ్రామాల్లో టెక్నికల్ సమస్య పేరిట డబ్బులను కంపెనీ ప్రతినిధులు వినియోగదారులకు చెల్లించడంలేదని తెలుస్తోంది. మొగ్ధుంపూర్‌లో 50మందికి.. కరీంనగర్ మండలం మొగ్ధుంపూర్‌లో దాదాపు 50మంది వినియోగదారులకు నాలుగైదు నెలలుగా గ్యాస్ సబ్సిడీ డబ్బులు చెల్లించడంలేదు. తమకు కనీసం సమాచారం లేదంటూ ఇవ్వడంలేదని తాళ్లపల్లి ఎల్లమ్మ, వీరగోని వెంకటస్వామి, కందుల రమేశ్‌గౌడ్ ఆరోపించారు. స్మార్ట్మిషన్లో గ్యాస్ వినియోగదారుల ఆధార్‌కార్డు నంబర్‌ను ఫీడింగ్ చేస్తే కస్టమర్ నాట్అవైలబుల్ అనే సమాచారం రావడంతో డబ్బులను చెల్లించడం లేదని ఫినో కంపెనీ ప్రతినిధి సరస్వతి తెలిపారు. సమాచారమున్న కొందరు వినియోగదారులకు చెల్లించినట్లు వివరించారు. కొందరు వినియోగదారుల సమాచారం లభించడంలేదని, పూర్తి వివరాలను తెలుసుకుని సమస్య పరిష్కరించనున్నట్లు ఫినో మండల కోఆర్డినేటర్ రవూఫ్ తెలిపారు. -
ఉత్పత్తి నాలుగు రోజులే
600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌లో తరచూ అంతరాయం 44 రోజుల పాటు సాంకేతిక సమస్యలే జెన్కోకు కోట్ల రూపాయల నష్టం.. గణపురం : మండలంలోని చెల్పూరు శివారులోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం రెండవ దశ 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం సాంకేతిక సమస్యలతోనే కాలం వెళ్లదీస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్లాంట్‌ను ప్రారంభించి 48 రోజులు కాగా, అం దులో విద్యుత్ ఉత్పత్తి అరుుంది కేవలం నాలుగు రోజులే. మిగితా 44 రోజులు మరమ్మతులతోనే గడిచిపోయింది. నూతన ప్లాంట్‌లో లైటాఫ్ చేయడం, అనంతరం సింక్రనైజేషన్ చేయడం.. 200 నుంచి 300 మెగావాట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి జరగడం.. సాంకేతిక కారణాలతో మధ్యలోనే నిలిచిపోవడం.. ఇదేతంతు కొనసాగుతోంది. ఈ ప్లాంట్‌లో నవంబర్ నుంచే సింక్రనైజేషన్ ప్రారంభమైనప్పటికీ డిసెంబర్ చివరి వరకు సీఓడీ చేయలేదు. ఇందుకోసం కేటీపీపీ అధికారులు చేసిన యత్నాలు ఫలించలేదు. సీఓడీ కాకముందే జనవరి 5న సీఎం కేసీఆర్ ఈ ప్లాంట్‌ను ప్రారంభించారు. నాటి నుంచి కేటీపీపీ, జెన్కో అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా విద్యుదుత్పత్తి సజావుగా సాగకపోవడంతో వారు తల పట్టుకుంటున్నారు. ఓసారి స్టీమ్ పైపుల్లో.. మరోసారి బారింగ్ గేర్.. ఇంకోసారి బూడిద సమస్య, పైపులు వంగిపోవడం.. ఇలా 600 మెగావాట్ల ప్లాంట్‌కు అనేక అవాం తరాలు ఎదురవుతున్నారుు. ప్లాంట్‌లో 72 గంటల పాటు ఎలాంటి అటంకం లేకుండా విద్యుత్ ఉత్పత్తి జరిగితేనే సీఓడీకి అవకాశం ఉంటుంది. ఇందుకోసం అధికారులు కృషి చేస్తూనే ఉన్నారు. ఆటంకం కలిగిన ప్రతిసారి నిరాశ పడకుండా నూతన ఉత్సాహంతో మళ్లీ లైటాఫ్ చేస్తున్నారు. జెన్కో డెరైక్టర్ కేటీపీపీలోనే ఉండి మరమ్మతు చేయిస్తున్నా సమస్య పరిష్కారం కావడం లేదు. కేటీపీపీకి నష్టం కోట్లలోనే... 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యల మూలంగా కేటీపీపీ భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్లాంట్ ని ర్మాణంలో తీవ్ర జాప్యం కావడంతో ప్రాజెక్టుకు అదనంగా రూ.1000 కోట్లు ఖర్చు చేశారు. 36 నెలల్లో పూర్తికావాల్సిన ప్లాంట్‌కు మరో 86 నెలల సమయం తీసుకున్నారు. సమయం, డబ్బు అదనంగా ఖర్చు చేసినా సక్రమంగా నిర్మించలేదని ప్లాంట్‌లో తలెత్తుతున్న సమస్యలు స్పష్టం చేస్తున్నారుు. 600 మెగావా ట్ల ప్లాంట్‌లో 24 గంటలకు 14.4 మిలియన్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కావాలి. ఒక్క యూనిట్‌కు నాలుగు రూపాయల చొప్పున జెన్కోకు కోట్ల రూపాయలు రావాలి. కానీ సమస్యల కారణంగా ఈ ఆదాయం నష్టపోవాల్సి వస్తోంది. -
‘డబ్బా’లతో దోచేస్తారు..!
* ‘ఏటీఎం కేంద్రం’గా కొత్త తరహా మోసం * డబ్బు వచ్చే చోట ‘డబ్బా’లు పెడుతున్న వైనం * జోరుగా ఫోన్‌కాల్స్ ద్వారా మోసాలు * అప్రమత్తంగా ఉండాలంటున్న సైబర్ క్రైమ్ కాప్స్ సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ఓ వినియోగదారుడు అబిడ్స్ ప్రాంతంలోని ఏటీఎం కేంద్రానికి వెళ్లాడు. నగదు డ్రా చేసుకునేందుకు మిషన్‌లో కార్డు పెట్టడంతో పాటు మిగిలిన తతంగం పూర్తి చేశాడు. అయితే ఎంత సేపు వేచి చూసినా... డబ్బుతో పాటు స్లిప్ కూడా రాలేదు. సాంకేతిక సమస్యగా భావించి వెనుదిరిగాడు. ఇది కేవలం సాంకేతిక సమస్య మాత్రమే కాకపోవచ్చు... ఏటీఎం కేంద్రాలను అడ్డాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న నేరగాళ్ల కొత్త ఎత్తు కూడా కావచ్చునని సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొంటున్నారు. ఉత్తరాదిలో జోరుగా సాగుతున్న ఈ తరహా మోసాలు నగరంలోనూ చోటు చేసుకునే అవకాశం ఉందని, వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కేవలం ప్రత్యేకంగా తయారు చేసిన డబ్బా, ట్రాన్స్పరెంట్ టేప్‌లను ఆధారంగా చేసుకునే నేరగాళ్లు తమ ‘పని’ ఎలా పూర్తి చేసుకుంటున్నారన్న దానిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సీసీలు( కెమెరాలు, సెక్యూరిటీ) లేని కేంద్రాలే లక్ష్యం చేతిలో ఇమిడిపోయే స్కిమ్మర్లు, కెమెరాలను ఏర్పాటు చేసి ‘ఏటీఎం ఫ్రాడ్స్’ చేయాలంటే నేరగాడికీ సాంకేతిక పరిజ్ఞానం అవసరం. పైగా ఇందుకు పెట్టుబడి కూడా ఎక్కువగానే పెట్టాల్సి ఉంటుంది. ‘డబ్బా ఫ్రాడ్’కు పాల్పడే వారికి ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడి అవసరం లేకుండానే పని పూర్తవుతోంది. ప్రధానంగా సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు లేని, జనసమర్థ ప్రాంతాలు, ప్రధాన రహదారులకు దూరంగా ఉన్న ఏటీఎంలనే వీరు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ‘డబ్బా’ తయారీలోనే ప్రత్యేకం... ఏటీఎం మిషన్ నుంచి నగదు బయటకు వచ్చే ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు వీరు ప్రత్యేకమైన డబ్బాను రూపొందిస్తున్నారు. ఇది ఓ వైపు మిషన్‌కు ఉన్న మాదిరిగానే క్యాష్ స్లాట్‌ను తలపించేలా ఉంటూ, మరో వైపు ఖాళీగా ఉంటుంది. దీన్ని మిషన్ నుంచి నగదు బయటకు వచ్చే ప్రాంతంలో చాకచక్యంగా అతికించేయడంతో వినియోగదారుడికి ఏటీఎం మిషన్‌లో భాగంగానే కనిపిస్తుంది. ప్రధానంగా మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వారు నివసించే ప్రాం తాల్లోని ఏటీఎంలను లక్ష్యంగా ఎంచుకున్న నేరగాళ్లు ప్రతి నెలా మొదటి వారంలోనే ఏటీఎం మిషన్లకు డబ్బాలను అమరుస్తూ దోపిడీలకు పాల్పడుతున్నారు. స్లిప్ రాకుండా టేప్... క్యాష్ స్లాట్ దగ్గర డబ్బాను ఏర్పాటు చేసుకున్న నేరగాళ్లు... బ్యాలెన్స్ స్లిప్ సైతం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వినియోగదారులకు డబ్బు రాకుండా, స్లిప్ వస్తే వారు అనుమానించి, తక్షణం బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. లేదా ఏటీఎం మిషన్‌ను పరిశీలిస్తాడు. వీటిని ఆస్కారం లేకుండా చేసేందుకు నేరగాళ్లు స్లిప్ సైతం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకుగాను స్లిప్ బయటకు వచ్చే భాగంలో ట్రాన్స్పరెంట్ టేప్‌ను అతికించేస్తున్నారు. డబ్బు ‘డబ్బా’లోనే ఈ ‘ఏర్పాట్లు’ చేసిన ఏటీఎం కేంద్రంలోకి వెళ్లిన వినియోగదారులు కార్డు పెట్టడం నుంచి నగదు ఎంత కావాలో ఎంటర్ చేయడం వరకు అన్నీ పక్కాగా చేసినా... డబ్బు బయటకు రాదు. మిషన్ నుంచి డ్రా అయ్యే సొమ్ము నేరగాళ్లు ఏర్పాటు చేసిన డబ్బాలో పడిపోతుంది. టేప్ ఉన్న కారణంగా స్లిప్ సైతం బయటకు రాదు. దీంతో మిషన్ పని చేయట్లేదని భావించే వినియోగదారులు మరో ఏటీఎంకు వెళ్లిపోతాడు. కాస్త దూరంలో ఉంటూ దీన్ని కనిపెట్టే నేరగాళ్లు వెంటనే వచ్చి డబ్బాలో పడిన నగదు తీసుకుంటారు. ఎస్సెమ్మెస్ వచ్చినా.. వినియోగదారులు ఏటీఎం మిషన్లను వినియోగించినప్పుడు నగదు బయటకు రాకపోయినా... డ్రా అయినట్లు సంక్షిప్త సందేశం (ఎస్సెమ్మెస్) వచ్చేస్తోంది. దీనిపై సదరు బ్యాంక్ కాల్ సెంటర్‌ను సంప్రదిస్తే 24 గంటల్లో నగదు తిరిగి ఖాతాలోకి వెళ్లిపోతుందని చెప్తున్నారు. సాంకేతిక సమస్యలతో పాటు అనేక సందర్భాల్లో అలానే జరుగుతోంది కూడా. అయితే ‘డబ్బా ఏటీఎం’ను వినియోగించినప్పుడూ వినియోగదారులకు వచ్చే ఎస్సెమ్మెస్‌లు ఈ తరహాకు చెందినవిగానే భావించి నష్టపోతున్నారు. జోరుగా కాల్స్ మోసాలు ఫోన్‌కాల్స్ ద్వారా వ్యక్తిగత సమాచారం తెలుసుకుని టోకరా వేస్తున్న నేరగాళ్లకూ కొదవ లేకుండా పోతోంది. నగర సైబర్ క్రైమ్ పోలీసులకు రోజుకు కనీసం మూడు ఈ తరహా ఫిర్యాదులు వస్తున్నాయి. సైబర్ నేరగాళ్లు వినియోగదారులకు ఫోన్లు చేసి బ్యాంకు ఉద్యోగులుగా పరిచయం చేసుకుంటున్నారు. డెబిట్ కార్డును ఆధార్‌తో లింకు చేయాలనో, క్రెడిట్ కార్డు వివరాలు అప్డేట్ చెయ్యాలంటూ సీవీవీ కోడ్, ఓటీపీలనూ తీసుకుంటున్నారు. ఆపై ఆన్లైన్ షాపింగ్స్, క్లోన్డ్ కార్డులతో డబ్బు డ్రా చేసేస్తున్నారు. అప్రమత్తతే పరిష్కారం ‘ఏటీఎం కేంద్రాల్లో డబ్బాల ద్వారా చేసే నేరాలు, ఫోన్ కాల్స్ ద్వారా జరిగే ఫ్రాడ్స్ బారిన పడకుండా ఉండాలంటే అప్రమత్తతే పరిష్కారం. సెక్యూరిటీ గార్డు, సీసీ కెమెరాలు ఉన్న ఏటీఎం కేంద్రాలనే ఎంచుకోవడం ఉత్తమం. ఆధార్ లింకేజ్ లేదా అప్‌గ్రేడ్ కోసం ఏ బ్యాంకు ఫోన్లు చేయదని గుర్తుంచుకోవాలి. పేపర్లో ప్రకటన ఇవ్వడం, వ్యక్తిగతంగా బ్యాంకునకు రమ్మని కోరతాయి తప్ప ఫోన్ ద్వారా రహస్య వివరాలు అడగవు’ - విజయ్ ప్రకాష్ తివారీ, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్, సీసీఎస్ -
సాంకేతిక లోపంతో నిలిచిపోయిన రైలింజన్
భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సోమవారం రాత్రి సాంకేతిక లోపంతో ట్రాక్‌పై రైలింజన్ నిలిచిపోయింది. దీని కారణంగా తణుకులో విశాఖ ఎక్స్‌ప్రెస్, అత్తిలిలో శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌లను నిలిపివేశారు. నిడదవోలు, తణుకు మీదుగా విజయవాడ వెళ్లాల్సిన పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్టు రైల్వే శాఖ వెల్లడించింది. దాంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. -
కేటీపీఎస్‌లో ఉత్పత్తికి అంతరాయం
పాల్వంచ: ఖమ్మం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్‌లో విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. మంగళవారం మధ్యాహ్నం పదో యూనిట్ లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో 250 మెగావాట్ల యూనిట్లో సాంకేతిక లోపం తలెత్తి ఉత్పత్తి నిలిచి పోయింది. వెంటనే స్పందించిన అధికారులు మరమ్మతులకు ఉపక్రమించారు. -
ఎన్టీపీసీ ఐదో యూనిట్లో అంతరాయం
జ్యోతినగర్ (కరీంనగర్) : రామగుండం ఎన్టీపీసీలోని ఐదో యూనిట్లో సాంకేతిక సమస్యలతో మంగళవారం సాయంత్రం ఉత్పత్తి నిలిచిపోయింది. ఐదో యూనిట్లో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోవటంతో అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టారు. ప్రస్తుతం 2100 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోంది. -
ఈవీఎం మొరాయింపు: బాగు చేసిన అధికారులు
-
ఈవీఎం మొరాయింపు: బాగు చేసిన అధికారులు
వరంగల్ : వరంగల్ జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రంలలో ఈవీఎంలు మొరాయించాయి. భూపాలపల్లిలోని 17వ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంల మొరాయించాయి. అలాగే ధర్మసాగర్ మండలం జానకీపురం, వర్ధన్నపేట మండలం వట్యాలలో ఈవీఎంలు మొరాయించాయి. ఎన్నికల అధికారులు వెంటనే స్పందించి... ఈవీఎంలను సరి చేశారు. దీంతో పోలింగ్ ప్రశాంతంగా సాగుతుంది. -
మహబూబాబాద్‌లో నిలిచిన 'శాతవాహన'
వరంగల్ : విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న శాతావాహన ఎక్స్‌ప్రెస్ ఇంజన్లో శుక్రవారం సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో వరంగల్ జిల్లా మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో నిలిచిపోయింది. దీనిపై రైల్వే ఉన్నతాధికారులకు స్టేషన్ అధికారుల సమాచారం అందించారు. అయితే సాంకేతిక సిబ్బంది ఇంకా మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకోలేదు. సదరు రైలులోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్స్‌ప్రెస్ రైల్ నిలిచిపోవడంతో ఆ మార్గంలో వెళ్లే పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. -
ఆర్టీపీపీలో నిలిచిన ఉత్పత్తి
ఎర్రగుంట్ల: వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల సమీపంలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు(ఆర్టీపీపీ) 5వ యూనిట్, మూడో యూనిట్ లలో శనివారం సాంకేతిక లోపం ఏర్పడింది. మొత్తం 1050 మెగావాట్ల తో గత 410 రోజులుగా నిర్విరామంగా పని చేస్తోంది. ఈ విషయాన్ని అధికారులు ఈ సాయంత్రం ప్రకటించనున్న నేపథ్యంలో యూనిట్ లో ఉత్పత్తి నిలిచిపోవటం గమనార్హం. అధికారుల నిర్లక్ష్యమే ఈ యూనిట్ ట్రిప్ కావటానికి కారణమని భావిస్తున్నారు. -
నిలిచిన ట్రావెల్స్ బస్సు: ప్రయాణికుల ఇబ్బంది
మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో బుధవారం అర్థరాత్రి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. దీంతో బస్సు డ్రైవర్ ప్రయాణీకులను రహదారిపై దింపివేశాడు. తమను మరో బస్సులో హైదరాబాద్ చేర్చాలని ప్రయాణీకులు... యాజమాన్యానికి విజ్ఞప్తి చేసిన వారి నుంచి స్పందన కరువైంది. దాంతో ప్రయాణీకులకు ప్రత్యామ్నాయం చూపక పోవడంతో వారంత గత ఆర్థరాత్రి నుంచి రహదారిపై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణీకులు రహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో స్థానికంగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ బస్సు ప్రొద్దుటూరు నుంచి హైదరాబాద్ వస్తుంది. -
సాంకేతికలోపంతో నిలిచిన ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్
వరంగల్ : సాంకేతిక లోపాలు తలెత్తి ఓ ఎక్స్‌ప్రెస్ రైలు నిలిచిపోవడంతో పలు రైళ్లకు అంతరాయం ఏర్పడింది. వరంగల్ జిల్లాలోని కేసముద్రం రైల్వే స్టేషన్ సమీపానికి రాగానే ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో అక్కడే నిలిచిపోయింది. దీంతో ఈ మార్గంలో వెళ్లవలసిన పలు రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికుల నుంచి సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎక్స్‌ప్రెస్ రైలులో తలెత్తిన సాంకేతిక లోపాన్ని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. -
ఎన్టీపీసీ మూడో యూనిట్లో అంతరాయం
జ్యోతినగర్ (కరీంనగర్ జిల్లా) : కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో ఉన్న ఎన్టీపీసీ మూడో యూనిట్లో సాంకేతిక కారణాలతో అంతరాయం ఏర్పడింది. దీంతో ఆ యూనిట్లో ఆదివారం 200ల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. విషయం తెలిసిన అధికారులు మరమ్మత్తులు ప్రారంభించారు. కాగా మొత్తం 2600 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఈ ఉత్పత్తి కేంద్రంలో ప్రస్తుతం 2400 మెగావాట్ల ఉత్పత్తి మాత్రమే జరుగుతుందని అధికారులు తెలిపారు. -
కరవదిలో నిలిచిన 'పినాకిని'
ఒంగోలు : విజయవాడ నుంచి చెన్నై మహానగరానికి వెళ్తున్న పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఇంజిన్‌లో గురువారం సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో ప్రకాశం జిల్లా కరవదిలో దాదాపు 40 నిమిషాల పాటు నిలిచి పోయింది. దీంతో ఇంజిన్ డ్రైవర్ రైల్వే అధికారులకు సమాచారం అందించారు. దాంతో ఇంజిన్‌లో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని నివారించేందుకు రైల్వే అధికారులు సాంకేతిక సిబ్బందిని కరవదికి పంపారు. అయితే రైలు అర్థాంతరంగా నిలిచిపోవడంతో రైలులోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
నిలిచిపోయిన ఎక్స్‌ప్రెస్ రైలు..
పాతపట్టణం(శ్రీకాకుళం జిల్లా): బొనిపూర్-పూరి వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. శనివారం శ్రీకాకుళం జిల్లా పాతపట్టణం రైల్వేస్టేషన్లో ఈ రైలు నిలిచిపోయింది. ఇప్పటికే రెండు గంటలు ఆలస్యం కావడంతో పూరి జగన్నాథ్ రథయాత్రకు వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. -
ఆ గ్రామంలో వారం రోజులుగా విద్యుత్ లేదు
రంగారెడ్డి(గండేడ్): రంగారెడ్డి జిల్లా గండేడ్ మండల పరిధిలోని చెన్నాయపల్లి తండాలో గత వారం రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాంతో తండాలోని గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారు. విద్యుత్ సరఫరాలో తలెత్తిన సాంకేతిక సమస్యతో ఇళ్లకు విద్యుత్ సరఫరా కాకపోవడమే కాకుండా తాగునీటికి కూడా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి త్వరగా సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
పొలాల్లో దిగిన హెలికాప్టర్
విజయనగరం (కొత్తవలస) : విజయనగరం జిల్లా కొత్తవలస మండలం ఏఎంపురం గ్రామంలోని పరిసర పొలాల్లో సోమవారం ఓ హెలికాప్టర్ దిగింది. హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో అత్యవసరంగా దించినట్లు పైలట్ తెలిపారు. హెలికాప్టర్లో మొత్తం నలుగురు ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. కాగా ప్రమాదమేమీ లేదని అధికారులు పేర్కొన్నారు. అయితే మొట్టమొదటిసారి తమ ఊర్లోకి హెలికాప్టర్ రావడంతో గ్రామస్తులు హెలికాప్టర్‌ను చూడటానికి ఎగబడ్డారు. అధికారులు అనుమతించకపోవడంతో హెలికాప్టర్లో వచ్చిన ప్రముఖులు ఎవరో తెలియలేదు. -
ఆగిన కేశినేని బస్సు : ప్రయాణికులు ఇక్కట్లు
హైదరాబాద్: హైదరాబాద్ నుంచి ముంబై బయలుదేరిన కేశినేని ట్రావెల్స్‌కు చెందిన బస్సులో శనివారం అర్థరాత్రి సాంకేతికలోపం ఏర్పడింది. దాంతో బీదర్ సమీపంలో బసవ కల్యాణం వద్ద బస్సును డ్రైవర్ నిలిపివేశాడు. దాంతో అర్థరాత్రి నుంచి ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. బస్సులో ఏర్పడిన సాంకేతిక లోపం నివారించేందుకు చర్యలు తీసుకోవడం కానీ... ప్రత్యామ్నాయంగా మరో బస్సును ఏర్పాటు చేయడం కానీ ట్రావెల్స్ యాజమాన్యం చేయలేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. అధిక మొత్తంలో ఛార్జీలు వసూలు చేసిన సదరు ట్రావెల్స్ ... తమను నడి రోడ్డుపై నిలిపి చోద్యం చూస్తుందని ప్రయాణికులు కేశినేనిపై ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. -
పాపికొండలు వెళ్లే బోటులో సాంకేతిక లోపం
దేవీపట్నం (తూర్పు గోదావరి)- పాపికొండలు టూరిజం లాంచీ గోదావరి నదిలో సాంకేతిక లోపంతో 20 నిముషాలు ఆగిపోయింది. ఈ సంఘటన సోమవారం సాయంత్రం 6 గంటలకు దేవీపట్నం సమీపంలో గోదావరి నదిలో జరిగింది. గేర్ బాక్స్ పనిచేయకపోవడంతో టూరిజం లాంచీ 20 నిముషాలపాటు ఆగిపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. లాంచీ సిబ్బంది వెంటనే గేర్ బాక్స్‌లో తలెత్తిన సమస్యను సరిదిద్ది 20 నిముషాల తర్వాత లాంచీని ప్రారంభించారు. -
రేణిగుంట విమానాశ్రయంలో సాంకేతికలోపం
తిరుపతి : తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. రాత్రి భారీ వర్షంతో పాటు పిడుగుపడిన విషయం తెలిసిందే. దాంతో సిగ్నలింగ్ వ్యవస్థ దెబ్బతినటంతో హైదరాబాద్ నుంచి తిరుపతి రావాల్సిన విమానాన్ని చెన్నైకి తరలించారు. మరోవైపు ఉదయం నుంచి ప్రయాణికులు విమానాశ్రయంలో పడిగాపులు కాస్తున్నారు. -
నిలిచిన గూడ్స్ రైలు : రైళ్ల రాకపోకలకు అంతరాయం
నల్లగొండ : నల్లగొండ జిల్లా భువనగిరి సమీపంలో ఓ గూడ్స్ రైలు నిలిచిపోవటంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముత్తిరెడ్డిగూడెం సమీపంలోని శనివారం ఉదయం గూడ్స్ రైలు సాంకేతిక లోపం కారణంగా పట్టాలపైనే నిలిచిపోయింది. దీంతో ఆ మార్గంలో సికింద్రాబాద్ వైపు వెళ్లే కాకతీయ, పుష్పుల్, సంపర్క్, సింహపురి తదితర రైళ్లు నిలిచిపోయాయి. దీంతో సదరు రైళ్లలోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సికింద్రాబాద్ నుంచి మరో ఇంజిన్‌ను తెప్పించి ఆ మార్గంలో రాకపోకలను పునరుద్ధరించనున్నట్లు అధికారులు తెలిపారు. రైళ్ల పునరుద్దరణకు మరో గంట వరకు సమయం పడుతుందని అధికారులు చెప్పారు. (భువనగిరి) -
సాంకేతిక లోపంతో నిలిచిపోయిన బొకారో ఎక్స్‌ప్రెస్
ప్రకాశం: జిల్లాలోని ఉలవపాడు మండలం చాగొల్లు వద్ద బోకారో ఎక్స్‌ప్రెస్ శుక్రవారం ఉదయం నిలిచిపోయింది. సాంకేతిక లోపం కారణంగానే రైలును నిలిపివేసినట్టు రైల్వే అధికారులు పేర్కొన్నారు. -
జెట్ ఎయిర్వేస్ విమానంలో సాంకేతిక లోపం
హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి లక్నో వెళ్లాల్సిన జెట్ ఎయిర్వేస్ విమానంలో సోమవారం ఉదయం సాంకేతిక లోపం తలెత్తింది. ఉదయం ఆరు గంటలకు వెళ్లాల్సిన ఈ విమానం రద్దు కావటంతో విమానాశ్రయ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లక్నో వెళ్లాల్సిన సుమారు 80మంది ప్రయాణికులను వేరే విమానం ద్వారా లక్నోకు తరలించారు. -
అర్హుల గుర్తింపులో సాంకేతిక సమస్య
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సామాజిక పింఛన్ల పథకం తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఈనెల 8వతేదీ నుంచి అర్హులందరికీ పింఛన్లు పంపిణీ చేస్తున్నామంటూ హడావుడిగా ‘ఆసరా’ పథకాన్ని ప్రారంభించిన సర్కారు ప్రస్తుతం నెమ్మదించింది. లబ్ధిదారుల అర్హతలో నెలకొన్న తీవ్ర అయోమయం కారణంగా.. ఒకట్రెండు రోజులు ఉరుకులు, పరుగులు పెట్టిన అధికారులు.. తాజాగా చేతులు ముడుచుకున్నారు. సాంకేతికంగా నెలకొన్న సమస్యను సాకుగా చూపుతున్న ఏకంగా పింఛన్ల పంపిణీ ప్రక్రియనే నిలిపివేయడం గమనార్హం. దీంతో జిల్లావ్యాప్తంగా మండల కార్యాలయాల వద్ద లబ్ధిదారులు ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పంచింది 10వేల లోపే..! జిల్లాలో సామాజిక పింఛన్ల కోసం 3,69,118 మంది దరఖాస్తు చేసుకున్నారు. దీంతో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు మొత్తంగా 2,37,443 మందిని ఆసరా పథకానికి అర్హులుగా నిర్ధారించారు. ఆ తర్వాత లబ్ధిదారుల వివరాలను ప్రభుత్వం రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లో వివరాల నమోదుకు ఉపక్రమించి.. ఇప్పటివరకు 2,05,940 మంది వివరాలను ఆన్లైన్లో ఎంట్రీ చేశారు. ఎంట్రీ అనంతరం ఈ వివరాలను మండల పరిషత్ అభివృద్ధి అధికారి లాగిన్ ఐడీలోని సమగ్ర కుటుంబ సర్వే వివరాలతో సరిపోల్చి.. లబ్ధిదారులకు అర్హత కార్డులను ముద్రించి ఇవ్వాలి. కానీ డాటాఎంట్రీ ప్రక్రియలో తలెత్తిన సమస్యతో వేలాది మంది అర్హుల పేర్లు.. అనర్హులుగా ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఆసరా అర్హులు అంశం మళ్లీ మొదటికొచ్చింది. అసలు సమస్య ఎక్కడ ఉత్పన్నమైందనే విషయం చిక్కకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈనెల 8, 9 తేదీల్లో మండల కేంద్రాల్లో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టి ఒక్కో మండలంలో గరిష్టంగా రెండు వందల మంది చొప్పున.. జిల్లా వ్యాప్తంగా 10వేలలోపు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. పూర్తిస్థాయి అర్హుల జాబితా తేలకపోవడం.. సాఫ్ట్‌వేర్‌లో నెలకొన్న సమస్య పరిష్కారం కాకపోవడంతో ఏకంగా పింఛన్ల పంపిణీ ప్రక్రియనే నిలిపివేశారు. సమన్వయ లోపంతోనే.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమానికి సంబంధించి వివరాల నమోదు ప్రక్రియ అంతా ఎన్ఐసీ(నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్) పర్యవేక్షించింది. తాజాగా సామాజిక పింఛన్లకు సంబంధించి అర్హుల డాటా ఎంట్రీ ప్రక్రియను టీసీఎస్(టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లో నిక్షిప్తం చేశారు. అయితే సమగ్ర కుటుంబ సర్వే వివరాలు, దరఖాస్తులను పరిశీలించి అర్హులుగా తేల్చిన లబ్ధిదారుల వివరాలను సరిపోల్చి కార్డులు పంపిణీ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో రెండు సాఫ్ట్వేర్లలో నిక్షిప్తం చేసిన వివరాలు సరిపోలక వేలాది పేర్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో యంత్రాంగంలో అయోమయం నెలకొంది. వాస్తవానికి సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన సంస్థల మధ్య సమన్వం లేకపోవడంతో ఈ సమస్య తలెత్తిందని స్పష్టమవుతోంది. కొలిక్కి వచ్చేదెన్నడో.. మరో 10రోజుల్లో నవంబర్ నెల ముగియనుంది. ఈలోపు అర్హులందరికీ పింఛన్లు పంపిణీ చేయడం సాధ్యమయ్యే పరిస్థితి కన్పించడంలేదు. ముందుగా సాఫ్ట్‌వేర్‌లో నెలకొన్న సమస్యను పరిష్కరించిన తర్వాతే అర్హులపై స్పష్టత రానుంది. కానీ ఈ సమస్య ఇప్పట్లో కొలిక్కివచ్చే అవకాశంలేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ సమస్య పరిష్కరించాలంటే కనిష్టంగా నెలరోజుల సమయం పడుతుందని.. ఆ తర్వాతే పింఛన్ల పంపిణీపై స్పష్టత వస్తుందని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి ఒకరు ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
పింఛన్.. టెన్షన్..
మంచిర్యాల రూరల్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ఆహార భద్రతా కార్డులు, పింఛన్ల కోసం చేపట్టిన ప్రక్రియ సజావుగా ముగిసినా.. ఆన్లైన్ చేసేందుకు మాత్రం తంటాలు తప్పడం లేదు. ఇటీవల కోకొల్లలుగా వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ చేసేందుకు అధికారులకు పెద్ద పరీక్షగా మారింది. కాగా.. గురువారం వరకు ఆన్లైన్ ప్రక్రియ పూర్తిచేసి.. శుక్రవారం నుంచి కొత్త పింఛన్ల పంపిణీ ప్రారంభించాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఆన్లైన్ పూర్తికాకపోవడంతో కొత్త పింఛన్ల పంపిణీ ఎలా చేసేదని అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఆటంకంగా మారిన సాంకేతిక సమస్య... గత నెల 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆహార భద్రత, పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించారు. 22వ తేదీ నుంచి ఈనెల 2 వరకు దరఖాస్తులదారుల ఇళ్లకు వెళ్లి అధికారులు విచారణ చేశారు. అనంతరం 3వ తేదీ నుంచి ఆ అర్హులైన దరఖాస్తుదారుల వివరాలను ఆన్లైన్ చేసే పని ప్రారంభించారు. దరఖాస్తుల స్వీకరణ, ఇంటింటి సర్వే చేసి విచారించిన అధికారులకు దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా నమోదు చేయడం పెద్ద పరీక్షగా మారింది. తక్కువ సమయం ఉండడం, వివరాల నమోదుపై కంప్యూటర్ ఆపరేటర్లకు అవగాహన లేకపోవడం, సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఆన్లైన్లో పింఛన్ల వివరాలు నమోదు కావడంలో ఆలస్యం జరుగుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఏకకాలంలో దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయడం ప్రారంభించడంతో ఒక్కసారిగా సర్వర్‌పై ఒత్తిడి పెరిగి వెబ్‌పేజీలో వివరాలు ఆలస్యంగా నమోదవుతున్నాయి. ఒక్కో దరఖాస్తు పూర్తయ్యేందుకు పది నిమిషాల వరకు సమయం తీసుకుంటోంది. ఆ పది నిమిషాల తర్వాత కూడా ఆ దరఖాస్తు సేవ్ అవుతుందనే నమ్మకం కూడా లేకుండాపోయింది. ఒక్కోసారి ఒక్కో దరఖాస్తును రెండేసి మూడేసి సార్లు నమోదు చేయాల్సి వస్తోంది. వీటిని తొందరగా పూర్తి చేయాలని ఆపరేటర్లు రాత్రి, పగలు తేడా లేకుండా నాలుగు రోజులుగా కుస్తీ పడుతున్నారు. దీనికితోడు కంప్యూటర్ అవగాహన ఉన్న సిబ్బంది లేకపోవడం.. ఎక్కువ కంప్యూటర్లను సిద్ధం చేసుకోకపోవడంతోనూ ప్రక్రియ ఆలస్యం అవుతోంది. అందుబాటులో ఉన్న కంప్యూటర్ ఆపరేటర్లు, మండల పరిషత్, రెవెన్యూ, ఈజీఎస్ సిబ్బందితో ఆన్లైన్లో దరఖాస్తుల నమోదును చేపడుతున్నారు. ఒక్క రోజులో పూర్తయ్యేనా... జిల్లాలో ఆహార భద్రత కోసం 7,12,645 మంది, వివిధ రకాల పింఛన్ల కోసం 3,19,957 మంది దరఖాస్తు చేసుకున్నారు. పింఛన్ దరఖాస్తులను అధికారులు ఆన్లైన్లో నమోదు చేసి ఈ శుక్రవారమే గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో అర్హులైన వారి జాబితాలను ప్రదర్శించాలి. కానీ.. అలా వీలుపడే అవకాశం లేదని అధికారులే చెబుతున్నారు. జిల్లాలోని 3,19,957 పింఛన్ దరఖాస్తులకు గాను గురువారం సాయంత్రం 6 గంటల వరకు 1,81,581 దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు చేశా రు. ఒక్కరోజే సమయం ఉండడం, నాలుగు రోజు ల్లో 1.81 లక్షల దరఖాస్తులే ఆన్లైన్లో నమోదు చేయడంతో ఈ మిగిలిన ఒక్క రోజులో 1.38 లక్షల దరఖాస్తులను ఆన్లైన్ చేయడం కష్టంగానే మారిం ది. కంప్యూటర్లో దరఖాస్తుదారుల వివరాలను న మోదు చేసే సమయంలో జరిగిన పొరపాట్లను పరి శీలించేందుకు కూడా అధికారులకు సమయం లేకపోవడంతో, శనివారం పింఛన్ల పంపిణీలో ఎలాంటి గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయో చూడాలి. ఆన్లైన్ చేస్తేనే పింఛన్.. ఇదిలా ఉంటే.. జిల్లాలో మరో 1.38 లక్షల దరఖాస్తులు ఆన్లైన్ చేసేందుకు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే.. వీరి వివరాలు ఆన్లైన్ చేస్తేనే పింఛన్ అందిస్తారా లేకుంటే దాంతో సంబంధం లేకున్నా పింఛన్ ఇస్తారా తెలీక లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై డీఆర్డీఏ అడిషనల్ పీడీ గజ్జారాంను వివరణ కోరగా.. శనివారం ఆసరా కా ర్యక్రమం ప్రారంభం వరకు ఆన్లైన్ నమోదు ప్రక్రి య కొనసాగుతుందని, సమయానికి పూర్తికాకుంటే సంబంధిత తేదీ వరకు అనుమతి తీసుకుని పూర్తి చేస్తామని, ఆన్లైన్ పేర్లు నమోదు చేసిన వారికే పింఛన్లు అందుతాయని చెప్పారు. -
సాంకేతికలోపంతో నిలిచిన నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్
హైదరాబాద్ : తిరుపతి - సికింద్రాబాద్ మధ్య నడిచే నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం ఉదయం సాంకేతిక లోపం తలెత్తింది. ఇంజిన్‌లో సాంకేతిక లోపం కారణంగా రైలు ఘట్కేసర్-చర్లపల్లి వద్ద నిలిచిపోయింది. దీంతో ఆ మార్గంలో నడిచే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడ్డాయి. రైల్వే సిబ్బంది సాంకేతిక లోపాన్ని గుర్తించి మరమ్మతులు చేపట్టారు. మరోవైపు రైలు నిలిచిపోవటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. -
గూడ్స్ రైలు ఇంజిన్‌లో సాంకేతిక లోపం
నంద్యాల : కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో సోమవారం ఉదయం ఓ గూడ్స్ రైలు ఇంజన్లో సాంకేతిక లోపం ఏర్పడింది. దాంతో రైలును డోన్-పాణ్యం మధ్య నిలిపివేసి రైల్వే సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. ఈ నేపథ్యంలో డోన్-గుంటూరు రైల్వే మార్గంలో పలురైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.