హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం వెళ్ల వలసిన ఎయిర్‌ఇండియా విమానంలో గురువారం సాంకేతి లోపం ఏర్పడింది. దీంతో విమానం నాలుగు గంటలపాటు శంషాబాద్ విమానాశ్రయంలోనే నిలిచిపోయింది. దాంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఈ రోజు ఉదయం 7 గంటలకు బయలుదేరాల్సిన విమానం ఎంతసేపటికీ బయలుదేర లేదు.
సరికదా విమానాశ్రయ అధికారులు కూడా సరైన సమాధానం ఇవ్వలేదు. దీంతో సదరు విమానంలో ప్రయాణించవలసిన సదరు ప్రయాణికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో విమానాశ్రయ అధికారులపై ప్రయాణికులు విరుచుపడ్డారు. చివరకు సాంకేతిక లోపాన్ని సరి చేసిన తర్వాత ఉదయం 11.15 గంటలకు విమానం విశాఖపట్టణం బయలుదేరింది.