ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు | fire accident in east coast express | Sakshi
Sakshi News home page

ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు

Published Thu, Apr 21 2016 12:32 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

fire accident in east coast express

యాదగిరిగుట్ట(నల్లగొండ): హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు రావడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇది గుర్తించిన రైల్వే సిబ్బంది ఫైరింజన్ సాయంతో పొగలను అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి వద్దకు చేరుకోగానే దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఇది గుర్తించిన సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ప్రస్తుతం పొగలను అదుపులోకి తెస్తున్నారు. సాంకేతిక లోపం కారణంగానే పొగలు అలుముకున్నాయని అధికారులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement