East Coast Express
-
ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
సాక్షి, యాదాద్రి భువనగిరి: యాదగిరిగుట్ట మండలం వంగపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ఈస్ట్ కోస్ట్ ట్రైన్లో పొగలు వచ్చాయి. దీంతో ఆందోళన చెందిన ప్రయాణికులుట్రైన్ దిగి పరుగులు తీశారు. హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న రైలులో వంగపల్లి వద్దకు రాగానే పొగలు రావడాన్ని గుర్తించారు. ఎయిర్ పైప్ పగిలిపోవడంతో పొగలు వచ్చినట్లు రైల్వే సిబ్బంది గుర్తించారు. వెంటనే సిబ్బంది ఎయిర్ పైప్‌కు మరమ్మత్తులు చేసి రైలును పంపించారు. ప్రమాదం ఏమీ జరగకపోవడంతో ప్రయాణికులు, రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: ఈయన ఓటేశారు.. ఆ తర్వాత ఏమన్నారంటే.. -
ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు
-
విజయనగరం : ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ లో తొక్కిసలాట
-
మేం ఏం పాపం చేశాం : షేకింగ్ శేషు
సాక్షి, హైదరాబాద్ : ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో టిక్కెట్ కలెక్టర్‌తో జరిగిన వాగ్వాదంపై జబర్దస్త్ కమెడియన్ షేకింగ్ శేషు వివరణ ఇచ్చారు. అసలు విషయం తెలుసుకోకుండా పలువురు తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. విశాఖపట్టణం నుంచి హైదరాబాద్‌కు రిజర్వేషన్ చేసుకున్నామని అయితే, విజయనగరంలో జనరల్ టికెట్‌తో రైలు ఎక్కామని చెప్పారు. ఒడిశాకు చెందిన టిక్కెట్ కలెక్టర్ వారిపై నోరు పారేసుకున్నట్లు వెల్లడించారు. ఫైన్ కడతామని, వైజాగ్ నుంచి ఏసీ కోచ్‌కు టికెట్లు రిజర్వేషన్‌తో ఉన్నాయని టీటీతో చెప్పినట్లు వివరించారు. బదులుగా టీటీ అసహ్యాంగా మాట్లాడారని తెలిపారు. వైజాగ్‌లో పోలీసుల, స్క్వాడ్‌ను పిలిచి అల్లరి చేస్తానని బెదిరించాడని చెప్పారు. అందుకే వైజాగ్ స్టేషన్లో కిందికి దిగామని తెలిపారు. తప్పు చేసింది టీటీ కావడంతో తాను జరిమానా కూడా చెల్లించాల్సిన పని లేకుండా పోయిందని చెప్పారు. అక్కడకు వచ్చిన ఓ వ్యక్తి సెల్ఫోన్లో ఆ ఘటనను చిత్రీకరించి మీడియాకు అందించాడని చెప్పారు. దీనిపై మీడియా రచ్చ చేయాల్సిన పనేముందని ప్రశ్నించారు. ఇవాళ సెలబ్రిటీ అంటే ప్రతి ఒక్కరికి లోకువైపోయారంటూ మండిపడ్డారు. కేవలం టీఆర్పీల కోసం మీడియా ఇలా చేయడం సరికాదన్నారు. తాను రైల్లో ఉండగానే మీడియాలో వార్తల గురించి ఫోన్లు వరుస పెట్టాయని చెప్పారు. ‘మేం ఏం పాపం చేశాం. మీకైదైనా అన్యాయం చేశామా?. రేటింగ్స్ కోసం సెలబ్రిటీలతో ఆడుకుంటున్నారు. ఇది చాలా అన్యాయం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఒక కళాకారుడు బ్రతకకూడదు అని మీడియా అనుకుంటున్నట్లు ఉంది.’ అని ఆవేదన వ్యక్తం చేశారు శేషు. -
ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు
యాదగిరిగుట్ట(నల్లగొండ): హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు రావడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇది గుర్తించిన రైల్వే సిబ్బంది ఫైరింజన్ సాయంతో పొగలను అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి వద్దకు చేరుకోగానే దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఇది గుర్తించిన సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ప్రస్తుతం పొగలను అదుపులోకి తెస్తున్నారు. సాంకేతిక లోపం కారణంగానే పొగలు అలుముకున్నాయని అధికారులు తెలిపారు. -
రైల్లో గంజాయి రవాణా
పలాస: ఒడిశా నుంచి గుజరాత్‌కు ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్ రైల్లో అక్రమంగా రవాణా అవుతున్న గంజాయిని శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేశారు. పలాస రైల్వే జీఆర్పీ ఎస్ఐ ఎస్.ఎ. మునఫ్ కథనం ప్రకారం.. గురువారం రాత్రి ఒడిశాలోని గంజాం జిల్లా అస్కా గ్రామానికి చెందిన పింటు బెహర(24), బల్లు రెడ్డి(19) ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్ రైల్లో సూట్‌కేసుల్లో గంజాయి తీసుకెళ్తుండగా పలాస రైల్వే పోలీసులు అనుమానంతో వారిని వెంటాడారు. దీన్ని గుర్తించిన వారు రైలు పలాస రైల్వేస్టేషన్‌లోకి రాగానే గురువారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో గంజాయితో సహా దిగి అదృశ్యమయ్యూరు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లడానికి ప్లాట్‌ఫారంపై ఉండగా రైల్వే పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేశారు. ఆ పెట్టెల్లో ఉన్న సుమారు రూ.2 లక్షల విలువైన 78 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పలాస తహశీల్దార్ గన్నవరపు సత్యన్నారాయణ సమక్షంలో నిందితులపై కేసు నమోదు చేసి విశాఖపట్నం రైల్వే ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ప్రత్యేక కోర్టుకు తరలించినట్లు జీఆర్పీ ఎస్ఐ ఎస్ఎ మునఫ్ చెప్పారు. గతంలోనూ రైళ్లలో గంజాయి రవాణా గతంలో పలు పర్యాయాలు రైళ్లలో తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇలాంటి ఘటనలో సాక్షాత్తూ పలాసకు చెందిన ఆర్పీఎఫ్ ఎస్ఐ బి.ఎన్. సమంత కూడా కటకటాల పాలైన విషయం తెలిసిందే. 2012 అక్టోబరు 3న 103 కిలోల గంజాయి ఆర్పీఎఫ్ బ్యారక్‌లో లభించి అందరినీ ఆశ్చర్యపర్చింది. అప్పటి జీఆర్పీ ఎస్ఐ నవీన్‌కుమార్ ఆర్పీఎఫ్ ఎస్ఐను అరెస్టు చేసి సంచలనం సృష్టించారు. 2012 జూన్ 21న పూరి-అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్ రైల్లో 35 కిలోల గంజాయిని జీఆర్పీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరుుతే నిందితులు పరారయ్యారు. 2013 మే 10న పూరి-అహ్మదాబాద్ రైల్లోనే గంజాయితో పట్టుబడిన ముక్త చంద్రబెహర, మరొక వ్యక్తిని అరెస్టు చేశారు. వారికి ఒక ఏడాది జైలు శిక్ష కూడా పడింది. ఇప్పుడు కూడా పోయిన బంగారం కోసం ఎక్సైజ్ పోలీసులు గాలిస్తుండగా అనూహ్యరీతిలో ఈ అక్రమ గంజాయి రవాణాను పట్టుకొని నిందితులను అరెస్టు చేశారు. ఒడిశాలోని కొందమల అడవుల నుంచి గుజరాత్, బీహార్, హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు పలాస మీదుగా రవాణా అవుతున్నట్లు ఈ సంఘటనలు రుజువు చేస్తున్నాయి. -
‘గౌతమి’ గుర్తుకొచ్చింది..
తాళ్లపూసపల్లి వద్ద హౌరా ఎక్స్‌ప్రెస్ చక్రాల నుంచి మంటలు బ్రేక్ పట్టేయడంతో ఘటన పొగతో ఆందోళన చెందిన ప్రయాణికులు రైలు దిగి దూరంగా పరుగులు కాజీపేట రూరల్ : 2008 జూలై 31.. అంటే ఆరేళ్ల క్రితం జిల్లాలోని కేసముద్రం-తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ల నడుమ సికింద్రాబాద్-కాకినా డ గౌతమి ఎక్స్‌ప్రెస్ అగ్నికి ఆహుతైంది. సరిగ్గా అదే ప్రాంతంలో హౌరా నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్(18645)కు ఆదివా రం అలాంటి ప్రమాదమే త్రుటిలో తప్పింది. మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనకు సంబంధిం చిన వివరాలు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. మానుకోట నుంచి బయలుదేరిన పది నిమిషాలకే రాఖీ పండుగకు పుట్టింటికి వెళ్లి వస్తున్న మహిళ లు, అక్కాచెల్లెళ్లతో రాఖీ కట్టించుకుని తిరుగుముఖం పట్టిన వారితో ఆదివారం మధ్యాహ్నం హౌరా ఎక్స్‌ప్రెస్ కిక్కిరిసింది. ఈ రైలు మహబూబాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 2.20 గంటలకు వరంగల్ వైపు అప్‌లైన్‌లో బయలుదేరింది. ఆ వెంటనే వేగం పుంజు కో గా.. తాళ్లపూసపల్లి స్టేషన్ నుంచి రైలు మొత్తం బయటకు వెళ్లకముందే ఎస్-4 బోగీ చక్రాల నుంచి పొగలు వెలువడ్డాయి. రైలులో ఉన్న ఖ మ్మం వాసి, సికింద్రాబాద్‌లోని కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ఫేర్ కమ్యూనికేషన్ విభాగం ఉద్యోగి టి.ప్రశాంత్‌కుమార్ ఏం జరిగిందోనని రెండు బోగీల మధ్య ఉన్న ఖాళీ స్థలం నుంచి గమనించాడు. చక్రాన్ని పట్టే బ్రేక్ పట్టీ వద్ద నుంచి చిన్నగా మంటలు వస్తుండడాన్ని చూసి న ఆయన తోటి ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. అప్పటికే పొగలు కమ్ముకుంటుం డగా, కొందరు చైన్ లాగడంతో తాళ్లపూసపల్లి స్టేషన్ చివరలో రైలు నిలిచిపోయింది. మంటలు వస్తున్నాయని చెప్పడం, పొగలు విపరీతంగా రావడంతో రైలులోని చంటి పిల్లలతో ఉన్న మహిళ లు, వృద్ధులు.. ఇలా అందరూ ఒక్కసారి కంగారుకు లోనై రైలు నుంచి కిందకు దూకారు. పక్క నే కంకర కుప్పలు ఉండడంతో కొందరు కింద పడ్డారు. ఇంతలోనే రైలులో ఉన్న తాళ్లపూసపల్లి గ్యాంగ్మన్ నాగరాజు, మరికొందరు బాటిళ్లతో నీరు చల్లి నిప్పు ఆర్పారు. మంటలు ఆరిపోయి నా పొగలు మాత్రం ఆగకపోగా ఇంకా దట్టం కావడంతో ప్రయాణికులు దూరంగా పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న రైలు గార్డ్ కూ డా అక్కడకు చేరుకుని చక్రాన్ని బ్రేక్ పట్టివేయడంతో పొగలు వచ్చాయని తెలిపారు. అయినా పొగలు ఆగకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. ఆ తర్వాత పది నిమిషాలకు పొగలు కూడా నిలిచిపోవడంతో ప్రయాణికులందరూ కంగారుగానే రైలు ఎక్కారు. కిక్కిరిసిన జనరల్ బోగీలు రాఖీ పండుగకు వచ్చి తిరుగు ప్రయాణమైన వారితో హౌరా ఎక్స్‌ప్రెస్‌లోని రైలు జనరల్ బోగీలు కిక్కిరిసిపోగా చాలా మంది రిజర్వేషన్ బోగీల్లోకి ఎక్కారు. కానీ కొందరు ఎస్-4 లోకి కాకుండా వేరే బోగీల్లోకి ఎక్కారు. ఇందులోకి కొందరు రిజర్వేషన్ ఉన్న వారు కూడా ఆ బోగీ ఎక్కాలంటే భయపడ్డారు. ఈ సందర్భంగా ఆరేళ్ల క్రితం నాటి గౌతమి ఎక్స్‌ప్రెస్ ప్రమాదం జరిగిన ప్రదేశంలోనే ఇప్పుడు హౌరా రైలు చక్రాల నుంచి నుంచి మంటలు రావడాన్ని పో ల్చుకుని ఆందోళన చెందారు. అలాగే, విష యం టీవీల్లో స్క్రోలింగ్ వస్తుండగా చూసిన ప్రయాణికుల బంధువులు ఫోన్ చేయడంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సర్ది చెప్పడం కనిపించింది.