‘గౌతమి’ గుర్తుకొచ్చింది..
- తాళ్లపూసపల్లి వద్ద హౌరా ఎక్స్‌ప్రెస్ చక్రాల నుంచి మంటలు
- బ్రేక్ పట్టేయడంతో ఘటన
- పొగతో ఆందోళన చెందిన ప్రయాణికులు
- రైలు దిగి దూరంగా పరుగులు
కాజీపేట రూరల్ : 2008 జూలై 31.. అంటే ఆరేళ్ల క్రితం జిల్లాలోని కేసముద్రం-తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ల నడుమ సికింద్రాబాద్-కాకినా డ గౌతమి ఎక్స్‌ప్రెస్ అగ్నికి ఆహుతైంది. సరిగ్గా అదే ప్రాంతంలో హౌరా నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్(18645)కు ఆదివా రం అలాంటి ప్రమాదమే త్రుటిలో తప్పింది. మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనకు సంబంధిం చిన వివరాలు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి.
మానుకోట నుంచి బయలుదేరిన పది నిమిషాలకే
రాఖీ పండుగకు పుట్టింటికి వెళ్లి వస్తున్న మహిళ లు, అక్కాచెల్లెళ్లతో రాఖీ కట్టించుకుని తిరుగుముఖం పట్టిన వారితో ఆదివారం మధ్యాహ్నం హౌరా ఎక్స్‌ప్రెస్ కిక్కిరిసింది. ఈ రైలు మహబూబాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 2.20 గంటలకు వరంగల్ వైపు అప్‌లైన్‌లో బయలుదేరింది. ఆ వెంటనే వేగం పుంజు కో గా.. తాళ్లపూసపల్లి స్టేషన్ నుంచి రైలు మొత్తం బయటకు వెళ్లకముందే ఎస్-4 బోగీ చక్రాల నుంచి పొగలు వెలువడ్డాయి. రైలులో ఉన్న ఖ మ్మం వాసి, సికింద్రాబాద్‌లోని కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్‌ఫేర్ కమ్యూనికేషన్ విభాగం ఉద్యోగి టి.ప్రశాంత్‌కుమార్ ఏం జరిగిందోనని రెండు బోగీల మధ్య ఉన్న ఖాళీ స్థలం నుంచి గమనించాడు.
చక్రాన్ని పట్టే బ్రేక్ పట్టీ వద్ద నుంచి చిన్నగా మంటలు వస్తుండడాన్ని చూసి న ఆయన తోటి ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. అప్పటికే పొగలు కమ్ముకుంటుం డగా, కొందరు చైన్ లాగడంతో తాళ్లపూసపల్లి స్టేషన్ చివరలో రైలు నిలిచిపోయింది. మంటలు వస్తున్నాయని చెప్పడం, పొగలు విపరీతంగా రావడంతో రైలులోని చంటి పిల్లలతో ఉన్న మహిళ లు, వృద్ధులు.. ఇలా అందరూ ఒక్కసారి కంగారుకు లోనై రైలు నుంచి కిందకు దూకారు. పక్క నే కంకర కుప్పలు ఉండడంతో కొందరు కింద పడ్డారు.
ఇంతలోనే రైలులో ఉన్న తాళ్లపూసపల్లి గ్యాంగ్‌మన్ నాగరాజు, మరికొందరు బాటిళ్లతో నీరు చల్లి నిప్పు ఆర్పారు. మంటలు ఆరిపోయి నా పొగలు మాత్రం ఆగకపోగా ఇంకా దట్టం కావడంతో ప్రయాణికులు దూరంగా పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న రైలు గార్డ్ కూ డా అక్కడకు చేరుకుని చక్రాన్ని బ్రేక్ పట్టివేయడంతో పొగలు వచ్చాయని తెలిపారు. అయినా పొగలు ఆగకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. ఆ తర్వాత పది నిమిషాలకు పొగలు కూడా నిలిచిపోవడంతో ప్రయాణికులందరూ కంగారుగానే రైలు ఎక్కారు.
కిక్కిరిసిన జనరల్ బోగీలు
రాఖీ పండుగకు వచ్చి తిరుగు ప్రయాణమైన వారితో హౌరా ఎక్స్‌ప్రెస్‌లోని రైలు జనరల్ బోగీలు కిక్కిరిసిపోగా చాలా మంది రిజర్వేషన్ బోగీల్లోకి ఎక్కారు. కానీ కొందరు ఎస్-4 లోకి కాకుండా వేరే బోగీల్లోకి ఎక్కారు. ఇందులోకి కొందరు రిజర్వేషన్ ఉన్న వారు కూడా ఆ బోగీ ఎక్కాలంటే భయపడ్డారు. ఈ సందర్భంగా ఆరేళ్ల క్రితం నాటి గౌతమి ఎక్స్‌ప్రెస్ ప్రమాదం జరిగిన ప్రదేశంలోనే ఇప్పుడు హౌరా రైలు చక్రాల నుంచి నుంచి మంటలు రావడాన్ని పో ల్చుకుని ఆందోళన చెందారు. అలాగే, విష యం టీవీల్లో స్క్రోలింగ్ వస్తుండగా చూసిన ప్రయాణికుల బంధువులు ఫోన్ చేయడంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సర్ది చెప్పడం కనిపించింది.