
సాక్షి, యాదాద్రి భువనగిరి: యాదగిరిగుట్ట మండలం వంగపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ఈస్ట్ కోస్ట్ ట్రైన్‌లో పొగలు వచ్చాయి. దీంతో ఆందోళన చెందిన ప్రయాణికులుట్రైన్ దిగి పరుగులు తీశారు.
హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న రైలులో వంగపల్లి వద్దకు రాగానే పొగలు రావడాన్ని గుర్తించారు. ఎయిర్ పైప్ పగిలిపోవడంతో పొగలు వచ్చినట్లు రైల్వే సిబ్బంది గుర్తించారు. వెంటనే సిబ్బంది ఎయిర్ పైప్‌కు మరమ్మత్తులు చేసి రైలును పంపించారు. ప్రమాదం ఏమీ జరగకపోవడంతో ప్రయాణికులు, రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
చదవండి: ఈయన ఓటేశారు.. ఆ తర్వాత ఏమన్నారంటే..
Comments
Please login to add a commentAdd a comment