పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలో ఓ గూడ్స్ రైలు సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. ఓదెల మండలం కొలనూరు వద్ద సోమవారం సాయంత్రం గూడ్స్ రైలులో సాంకేతిక లోపం తలెత్తటంతో పట్టాలపైనే నిలిచిపోయింది. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని రైళ్లను దారి మళ‍్లించగా, మరి కొన్నింటిని మరొక లైన్‌లో నడిపించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రైల్వే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేస్తున్నారు. సమస్యను వెంటనే పరిష‍్కరిస్తామని రైల్వే అధికారులు తెలిపారు.