Goods Train Stopped
-
‘గరుడ’ భారీ గూడ్స్ రైలు
సాక్షి, హైదరాబాద్: ‘గరుడ’... పేరుకు తగ్గట్టుగానే సూపర్ స్పీడ్, రెండు కిలోమీటర్ల పొడవైన భారీ రైలు. దక్షిణ మధ్య రైల్వే తొలి భారీ సరుకు రవాణా రైలు. జాప్యాన్ని నివారించడం, భారీ సరుకు రవాణా, తక్కువ ఖర్చుతో ఎక్కువ పని... లక్ష్యంగా రైళ్లను నడపాలన్న సంస్థ ప్రయత్నాలు ఫలించాయి. ప్రయోగాత్మకంగా 8–10 తేదీల్లో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొలిసారి బొగ్గు రవాణాకు ఈ రైలును వినియోగించారు. రాయచూరు నుంచి మణుగూరుకు వచ్చి బొగ్గు లోడ్ చేసుకుని పరుగులు పెట్టిందీ రైలు. త్రిశూల్ పేరుతో మరోరైలును అంతకుముందు రోజే విజయవాడ సమీపంలోని కొండపల్లి నుంచి – ఈస్ట్‌కోస్ట్ జోన్‌లోని ఖుద్ర డివిజన్‌కు నడిపారు. సరుకు రవాణాలో దేశంలోనే మొదటి ఐదు స్థానాల్లో ఒకటైన దక్షిణ మధ్య రైల్వే... సరుకు రవాణాను మరింత వేగవంతం చేసే ప్రయత్నంగా ఈ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. మామూలు సరుకు రవాణా రైళ్లు మూడింటిని జోడించటం ద్వారా రెండు కిలోమీటర్ల పొడవుండే ఈ భారీ రైలును రూపొందించి నడుపుతున్నారు. ఒకేసారి మూడు రైళ్ల లోడు తరలిపోతుంది. దీంతో రైలుకు రైలు మధ్య సిగ్నళ్లు, ఇతర సమస్యలతో ఏర్పడే విరామం తగ్గి సరుకు వేగంగా తరలటం, ఖాళీ వ్యాగన్లు వేగంగా మళ్లీ గమ్యం చేరుకోవటం వీలవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. -
చుక్కలు చూపించిన గూడ్స్ రైలు...
సాక్షి, కృష్ణా : కైకలూరు మండలం ఆలపాడు రైల్వే క్రాసింగ్ వద్ద గూడ్స్ రైలు సాంకేతిక సమస్యతో నిలిచిపోయింది. ఇంజన్లో నుంచి అనూహ్యంగా పొగలు రావడంతో ఉదయం 9 గంటలకు ఆలపాడు రైల్వే గేట్ నెంబర్ 93 దగ్గర రైలును నిలిపివేశారు. దీంతో పామర్రు నుంచి కత్తిపూడి(165) జాతీయరహదారిపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఇరువైపులా రాకపోకలు నిలిచి పోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతుండగా..సమాచారం తెలుసుకున కైకలూరు రూరల్ పోలీసులు, రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. -
‘కీ’ కోసం రైలు ఆగిపోయింది
రివారి : రాకపోకలు రద్దీగా ఉన్నాయనో, వాతావవరణం అనుకూలించడం లేదనో రైళ్లు నిలిచిపోవడం చూస్తుంటాం. కానీ తాళం చెవి మిస్ కావడంతో, ఓ గూడ్స్ రైలు గంటల పాటు రైల్వే స్టేషన్లోనే వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మథుర నుంచి రివారికి వెళ్తున్న బొగ్గుతో నిండిన ఓ రైలు గుర్గావ్కు దగ్గరిలో బవల్ స్టేషన్లో దాదాపు ఎనిమిది గంటలకు పైగా ఆగిపోయింది. ఈ గూడ్స్ రైలును నడుపుతున్న సిబ్బంది స్విఫ్ట్‌లు మారే క్రమంలో రైలుకు సంబంధించిన తాళం చెవి మిస్ కావడంతో ఇలా వేచిచూడాల్సి వచ్చింది. దీంతో భారీ మొత్తంలో ట్రాఫిక్ జామ్‌ఏర్పడి, వేరే మార్గాల్లో రైళ్లు ప్రయాణించాల్సి వచ్చింది. మథురలో ప్రారంభమైన ఈ రైలు, రివారికి చేరుకోవాల్సి ఉంది. మార్గం మధ్యలో డ్రైవర్, గార్డులు మారతారు. రైలును స్టేషన్లో ఆపిన తర్వాత కొత్త సిబ్బంది ఛార్జ్ తీసుకోవాల్సి ఉంటుంది. కొత్త సిబ్బంది స్విఫ్ట్‌ను తీసుకునే సమయంలో స్టేషన్ మాస్టర్ కీస్ అడిగాడు. ముందు స్విఫ్ట్‌లో ఉన్న సిబ్బంది కాంట్రాక్ట్ ఉద్యోగులు కావడంతో, తెలియక వారు తాళం చెవి ఇవ్వకుండా వెళ్లిపోయారు. అంతేకాక వారు మొబైల్ నెంబర్లు కూడా అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించి, జైపూర్ నుంచి కొత్త తాళం చెవిని తెప్పించేంత వరకు రైలును కదలలేదు. ఈ మొత్తం ప్రక్రియకు దాదాపు ఎనిమిది గంటలకు పైగా సమయం పట్టింది. -
పెద్దపల్లిలో ఆగిన గూడ్స్ : రైళ్లకు అంతరాయం
పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలో ఓ గూడ్స్ రైలు సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. ఓదెల మండలం కొలనూరు వద్ద సోమవారం సాయంత్రం గూడ్స్ రైలులో సాంకేతిక లోపం తలెత్తటంతో పట్టాలపైనే నిలిచిపోయింది. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని రైళ్లను దారి మళ్లించగా, మరి కొన్నింటిని మరొక లైన్లో నడిపించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రైల్వే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేస్తున్నారు. సమస్యను వెంటనే పరిష్కరిస్తామని రైల్వే అధికారులు తెలిపారు.