
సాక్షి, కృష్ణా : కైకలూరు మండలం ఆలపాడు రైల్వే క్రాసింగ్ వద్ద గూడ్స్ రైలు సాంకేతిక సమస్యతో నిలిచిపోయింది. ఇంజన్లో నుంచి అనూహ్యంగా పొగలు రావడంతో ఉదయం 9 గంటలకు ఆలపాడు రైల్వే గేట్ నెంబర్ 93 దగ్గర రైలును నిలిపివేశారు. దీంతో పామర్రు నుంచి కత్తిపూడి(165) జాతీయరహదారిపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఇరువైపులా రాకపోకలు నిలిచి పోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతుండగా..సమాచారం తెలుసుకున కైకలూరు రూరల్ పోలీసులు, రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment