
ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌రావు వర్సెస్ ఎంపీ కేశినేని చిన్ని వ్యవహారం రచ్చకెక్కింది. ఎంపీ కేశినేని చిన్ని టార్గెట్‌గా కొలికపూడి సంచలన వ్యాఖ్యలు చేశారు.
గిరిజన మహిళ పట్ల కేశినేని చిన్ని అనుచరుడు రమేష్‌రెడ్డి అసభ్యకరంగా ప్రవర్తించాడు. రమేష్‌రెడ్డిపై చర్యలు తీసుకోకుండా ఎంపీ అడ్డుకుంటున్నారు. 48 గంటల్లో రమేష్‌రెడ్డిపై పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోవాలి. లేకపోతే రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే కొలికపూడి అల్టిమేటం జారీ చేశారు.