kesineni
-
టీడీపీలో ప్రమోషన్ ఎక్కువ.. పని తక్కువ..!
-
సీఎం జగన్ పై ప్రతిపక్షాలు అన్ని గుంపుగా చేరాయి: కేసినేని స్వేతి
-
దమ్ముంటే రా..చంద్రబాబుకు కేశినేని సవాల్
-
కేశినేని నాని పంచ్ లకు వణుకుతున్న టీడీపీ నేతలు
-
టీడీపీ 60 శాతం ఖాళీ అవుతుంది: ఎంపీ కేశినేని నాని
సాక్షి, విజయవాడ: కాల్ మనీ, అక్రమ వ్యాపారాలు చేసే వాళ్ల గురించి తాను మాట్లాడనని ఎంపీ కేశినేని నాని అన్నారు. శనివారం కంచికచర్ల మండలం పెండ్యాలలో 70 లక్షల అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడారు. కేశినేని చిన్ని వ్యాఖ్యలపై.. ఎన్నికల అనంతరం ఈవీఎంలు ఓపెన్ చేసిన తర్వాత మాట్లాడుతానని అన్నారు. ఉత్తర కుమార ప్రగల్భాలు పలకొద్దని, గతంలో తనతో ఉన్న అనుచరులను తనతో రమ్మని పిలవలేదని తెలిపారు. ఇక.. ప్రజలు సీఎం జగన్ వెంటే ఉన్నారని, నాయకుల పాత్ర తక్కువ ప్రజల పాత్ర ఎక్కువ అని తెలిపారు. రాజీనామా అనంతరం తన అనుచరులతో సమావేశం తర్వాతే వైఎస్సార్సీపీలో చేరాలని అనుకున్నానని నాని స్పష్టం చేశారు. సీఎం జగన్ పిలుపుతో వెంటనే వైఎస్సార్సీపీలో చేరినట్లు వెల్లడించారు. టీడీపీ 60 శాతం ఖాళీ అవుతుందని ఇప్పటికీ చెబుతున్నానని అన్నారు. రాజకీయాల్లో తన స్థాయి చంద్రబాబు స్థాయి ఒక్కటేనని.. స్థాయిలో లోకేష్.. తన కంటే చాలా తక్కువని అన్నారు. కాల్ మనీ కార్యకలాపాలకు పాల్పడేవాళ్ల మాటలకు తాను సమాధానం చెప్పనని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని నానిలో పాటు ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ పాల్గొన్నారు. చదవండి: అంబేద్కర్‌ను పచ్చ మీడియా అవమానించింది: ఆర్కే. రోజా -
పెద్దారెడ్డి టాక్స్ : సీటీ సిరగతాదేమో జాగర్త సిన్నీ!
ఓర్నాయనో.. అబ్బయ్యా సిన్నీ! మీ అన్నకి సెంద్రబాబు సీటీ సించేసే సరికి నీకు మహా కుశాలగా ఉన్నట్టుండాదే అబ్బయ్యా! ఇన్నేళ్లు సెంద్రబాబుకి ఊడిగం జేసిన మీ అన్నయ్యని మెడ బట్టుకోని బయటకి గెంటేసిన తర్వాత.. రాజ్జెమంతా నీదే అయిపోతాదని మురిసిపోతా వున్నట్టుండావు గదా. అప్పుడే నీకు ఎంపీ టిక్కెట్టు ఇచ్చేసినట్టు.. నువ్వు సైకిలెక్కి లగెత్తుకోని డిల్లీలో పార్లమెంటుకు పోయినట్టు కళ్లముందు సెవెంటీ ఎమ్మెమ్ములో కనిపిస్తా వున్నట్టుండాది గదా! అంతేలే అబ్బయ్యా.. యీ మాదిర్తో అరసేతిలో సొర్గాన్ని జూపించకపోతే.. ఆ సెంద్రబాబు మాత్తరం పార్టీని ఎట్టా నడుపుకుంటాళ్లే? యీ కలలు కొంచిం కట్టిపెట్టి.. నా మాటలు కొంచిం జాగర్తగా ఆలకించుకో అబ్బయ్యా! మీ అన్నకైనా నెత్తిన పదేళ్లు కిరీటం నిలబడినాది. నీ కాడికి వొస్తే.. అసలు ఎలచ్చను గంట మోగడానికి ముందుగాలే.. నీ సీటీ సిరిగిపొతాదేమో అని అనుమానంగా వుండాదబ్బయ్యా.. ఎట్టాగంటవా? అదే జెప్పబోతన్నా.. రొవ్వంత జాగర్తగా యినుకో! సెంద్రబాబు మీ అన్న నాని మీద పగబట్టినట్టుగా గెంటేసినాక ఏదో జగనన్న పంచన జేరినాడనుకో. అదాటుగా నువు సీన్లోకి బలే ఎంట్రీ ఇచ్చినావబ్బయ్యా! మా అన్న రెండు సార్లు గెలిస్తే.. అసలు ఆ ఎలచ్చన్లలో పన్జేసి గెలిపించింది నేనే అంటావుంటివి. ఏమోనబ్బా.. మా నెల్లూరు మీ బెజవాడకి శానా దూరం గదా. అందుకేగావాల నీ పేరు యిదివరలో యినబడలా! సరే, ‘గెలుపు అనే బిడ్డకి శానా మంది నాయినలుంటారని’ ఇంగ్లీసులో ఓ సామెతుండాదిలే. ఆ మాదిరిగా మీ అన్నయ్య గెలిస్తే అంతా నీ పెతాపమే అని జెప్పుకుంటా వుండావు. ఓకే! అన్నయ్యని బయటకి పంపేయగానే.. సెంద్రబాబుకు వత్తాసు ఏసుకోని శానా దుడుకు మాటలు అంటావుండావు. మీ అన్న నానికి అంత సీన్లేదని అంటావుండావు. ఆయన లేడు గనక.. బెజవాడ సీటుని నీ సేతుల్లో యేలుకో తమ్ముడా అని సెంద్రబాబు అనబోతాడని నీకు ఆసె గదా. ఆయన గొప్పదనం గూడా యిట్టాంటి ఆసెలు పుట్టించడమే గదా? మరైతే సీక్రేటు జెప్తా యిను.. సుజనా సౌదరి అనే పెద్దమడిసి నీకు ఎరుకే గదా! మీ సెంద్రబాబు తోలితేనే గదా ఆయన పొయ్యి పువ్వు పార్టీలో గూసోని ఆణ్నించి రాజకీయం జేస్తన్నాడు. ఆయనకీ సెంద్రబాబుకీ ఉండే బందం పైకి కనపడకపొయినా సరే.. ఫెవికాల్తో అతికించినదానికంటె గట్టిదేననే సంగతి నీగ్గూడా తెలుసు గదా. మరి తాజా తాజా కబుర్లు నీ సెవిలో పడినాయో లేదో! ఆ సుజనా సౌదరి అనే పెద్దమడిసి బెజవాడ ఎంపీ సీటు మీద కన్నేసినాడంట. ఎటూ పువ్వు పార్టీలో ఉన్నాడు గాబట్టి.. పువ్వు టిక్కెట్టు మీదనే పోటీ జేస్తాడనుకో… నీకు యిప్పుటికిప్పుడు అడ్డం రాబోయేదేమీ లే. కాపోతే.. పువ్వుతో సైకిలుకి, గాజుగ్లాసుకి ముడిపడతాదేమో అని కూడా ఆయనే లీకులు వదలతండాడు అబ్బయ్యా సిన్నీ! యినుకున్నావా?? అదేగానీ జరిగిందనుకో.. ఎంపీల వరకు గెలిసే సీట్లే గావాలని పువ్వు పార్టీవోళ్లు ఫిటింగు బెట్టకుండా వుంటారా? ఆముడి పడినా బెజవాడ పువ్వుకే సమర్పయామి అయిపోతాది. అప్పుడిక నీ బతుకు మూడుజెండాలు బుజాన యేస్కోని మళ్లీ వూరంతా తిరగతా వుండడమే. నీకొక దారీ దిక్కూ యెప్పుటికి దక్కతాదో యెవురికెరుక అబ్బయ్యా! ఒకేళ- పువ్వుతో సైకిలుకు ముడిపడలేదే అనుకో.. నీ బతుకు యింకా కనాగస్టంగా అయిపోతా దబ్బయ్యా! సెంద్రబాబు ఒక సేత్తో నీకు టికెటిస్తాడనుకుందాం. రెండో సేత్తో- రెండో కంటికి తెలీకుండా నీ యెనకాల గొయ్యి కూడా తవ్విపెడతాడు! గోయిందా గోయింద! ‘సీసీ.. అట్టా యెందుకు జేస్తాడు’ అని గీర మాటలు మాటాడబోక నాయినా! అదే మరి సెంద్రబాబు మంత్రాగం. నీలాంటోడు ఆయన్ని నమ్ముకోని యెప్పుటికీ యీ పంచనే పడుంటాడు. కానీ.. పువ్వు పార్టీలోకి సెంద్రబాబు సొరబెట్టిన సుజనా సౌదరి లాంటి పెద్దమడిసి గెలిస్తే.. ఢిల్లీలో గూసోని బాబు గారి పన్లన్నీ గుట్టుసప్పుడు గాకుండా సక్కబెడతా వుంటాడు గదా! అదొక్కటే యేముండాదిలే. లోపల్లోపల ఆ సౌదరికీ- సెంద్రబాబుకీ యెన్నిన్ని లుకలుకల బందాలుండాయో నేను నీకు జెప్పాల్నా అబ్బయ్యా..! నెల్లూరోణ్ని- నాకంటే.. బెజవాడోడివి- నీకే యిట్టాంటి లోగుట్టు కతలు మాబాగా తెలస్తాయి. కాదంటావా? కాబట్టి నాయినా సిన్నీ! అన్నియ్య పొయినాడని.. యిక రాజ్జెమంతా నువ్వే యేలుకోవచ్చునని మురిసిపోబాక. మిడిసిపడబోక. ‘యెన్నాల్లో యేసిన వుదయం.. ఇయ్యాలే ఎదురవుతోంటే..’ అని సాంగులూ గట్రా యేసుకోని పండగజేసుకోబాక. సెంద్రనీతి రాజకీయాల్లో యింకా యెన్నెన్ని టర్నింగులుండాయో.. యెన్నెన్ని లోయలుండాయో.. నీ కలలబండి యేడ కూలిపోబోతాదో.. తెలవదు గదా! అందుకే రొవ్వంత జాగర్తగా పో అబ్బయ్యా! యింకా నాకు తిరుగు లేదని యిసురుకుంటా తిరిగినావనుకో.. అన్నకు జేసిన మాదిరిగానే సెంద్రబాబు నీ సీటీ గూడా అవలీలగా సించేయగల్డు! ✍️నెల్లూరు పెద్దారెడ్డి -
టీడీపీలో ట్విస్ట్.. కేశినేని నానికి షాకిచ్చిన చంద్రబాబు
సాక్షి, విజయవాడ: టీడీపీ ఎంపీ కేశినేని నానికి టీడీపీ హైకమాండ్ చెక్ పెట్టింది. నానికి చంద్రబాబు గట్టి షాకిచ్చాడు. తిరువూరులో జరగబోయే చంద్రబాబు సభకు మరో ఇంఛార్జ్‌ను హైకమాండ్ నియమించింది. అలాగే, కేశినాని తిరువూరు రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని చంద్రబాబును ఆదేశించింది. మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా మరొకరికి ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పార్టీ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని నానికి టీడీపీ పార్టీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. తిరువూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో బుధవారం విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఆయన సోదరుడు చిన్ని వర్గీయులు బాహాబాహీకి దిగారు. ఈ నెల 7న టీడీపీ అధినేత చంద్రబాబు తిరువూరు రానున్న సందర్భంగా ఏర్పాట్ల పరిశీలనకు విచ్చేసిన నాయకుల నడుమ ప్లెక్సీ వివాదం ఘర్షణకు దారితీసింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే గద్దె రాంమోహన్, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ, టీడీపీ నేత నాగుల్‌మీరాలతో కలిసి కేశినేని నాని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈలోగా పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి దేవదత్ ఏర్పాటు చేసిన ప్లెక్సీలలో ఎంపీ నాని ఫొటో లేదంటూ ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు. ఉద్దేశపూర్వకంగానే ఎంపీ ఫొటో ప్లెక్సీలో లేకుండా చేశారని ఆరోపిస్తూ కార్యాలయం బయట నాని వర్గం బైఠాయించింది. ఇందుకు నియోజకవర్గ ఇన్చార్జి దేవదత్ కారణమని ఆరోపిస్తూ ఆయనపై దాడికి యత్నించారు. స్థానిక నేతలు దేవదత్‌ను ఒక గదిలో ఉంచి తలుపులు వేశారు. బహిరంగ సభాస్థలిని పరిశీలించిన అనంతరం నాని సోదరుడు చిన్ని కూడా పార్టీ కార్యాలయానికి విచ్చేశారు. చిన్నీ గో బ్యాక్ అంటూ నాని వర్గం గేటు వద్ద బైఠాయించగా, పోలీసులు చిన్నీని కార్యాలయంలోకి తీసుకెళ్ళారు. ఏర్పాట్లపై సమీక్ష జరిపే అవకాశం లేకుండా ఇరు వర్గాల కార్యకర్తలు టీడీపీ కార్యాలయ ఆవరణలో కుర్చీలు విసురుకుంటూ దాడులకు పాల్పడుతూ గందరగోళం సృష్టించారు. జిందాబాద్, గో బ్యాక్ నినాదాలతో సుమారు రెండు గంటల పాటు కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. -
టీడీపీ ఎంపీ కేశినేని నాని సోదరుల మధ్య మరోసారి వార్
-
దేవినేని వైఖరిపై గుర్రుగా ఉన్న టీడీపీ నేతలు
-
ప్రైవేట్ బస్సులో 6కిలోల బంగారం చోరీ
నాయుడుపేట : నెల్లూరు జిల్లా నాయుడుపేట వద్ద గురువారం ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీ దొంగతనం జరిగింది. చెన్నైకి చెందిన ఓ బంగారు ఆభరణాల సంస్థలో పనిచేస్తున్న సెంథిల్, మహేందర్ అనే వ్యక్తులు నాలుగు రోజుల క్రితం 14 కిలోల బంగారు ఆభరణాలతో హైదరాబాద్‌కు వచ్చారు. పని ముగించుకుని కొంత బంగారం తీసుకుని వారు బుధవారం రాత్రి కేశినేని ట్రావెల్స్ బస్సులో చెన్నై బయలు దేరారు. గురువారం ఉదయం ఆ బస్సు నెల్లూరు జిల్లా నాయుడుపేట బస్టాండ్‌లో టిఫన్ కోసం బస్సు ఆగింది. అనంతరం తిరిగి బస్సు బయలుదేరుతుండగా సెంథిల్, మహేందర్ తమ బ్యాగ్ ఒకటి కనిపించటం లేదని బస్సు డ్రైవర్‌కు చెప్పారు. దీంతో బస్సు ఆపి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని, విచారణ ప్రారంభించారు. కనిపించకుండా పోయిన బ్యాగులో ఆరు కిలోల బంగారు ఆభరణాలున్నాయని సెంథిల్, మహేందర్ చెబుతున్నారు. సరిగ్గా బస్సు బయలుదేరే సమయానికి ఒక వ్యక్తి హడావిడిగా ఓ బ్యాగుతో బస్సు దిగి, కారులో వెళ్లిపోయాడని బస్సు క్లీనర్ పోలీసులకు తెలిపాడు. బస్సులోని ప్రయాణికుల వివరాలు సేకరించి పోలీసులు విచారణ చేపట్టారు. -
పవన్‌కు జై కొడదామా... లేదంటే...