
‘‘ఓ వాహనానికి జీవితం ఉంటే ఎలా ఉంటుంది? అనే పాయింట్‌తో ‘టుక్ టుక్’ సినిమా చేశాను. మ్యాజికల్ పవర్స్ ఉన్న ‘టుక్ టుక్’ అనే వెహికల్ హర్ష రోషన్ , కార్తికేయ దేవ్, స్టీవెన్ మధుల దగ్గరకు ఎలా వచ్చింది?. ఆ వాహనం వారి జీవితాల్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి? అనేది ఈ చిత్ర కథ’’ అని డైరెక్టర్ సి.సుప్రీత్ కృష్ణ(Supreet Krishna) చెప్పారు.
హర్ష రోషన్ , కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, సాన్వీ మేఘన, నిహాల్ కోదాటి ముఖ్య పాత్రల్లో సుప్రీత్ కృష్ణ దర్శకత్వంలో రూ΄పొందిన చిత్రం ‘టుక్ టుక్’. ఆర్‌వైజీ సినిమాస్ పతాకంపై రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీ వరుణ్, శ్రీ రాములరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సుప్రీత్ కృష్ణ మాట్లాడుతూ–‘‘మా స్వస్థలం చిత్తూరు.
పూరి జగన్నాథ్‌గారి దగ్గర రచయితగా చేశాను. ఆ తర్వాత ‘అలనాటి సిత్రాలు’ అనే ఓటీటీప్రాజెక్ట్ చేశాను. ‘టుక్ టుక్’ నా తొలి ఫీచర్ ఫిల్మ్. క్రికెట్ యాడ్‌లో ఓ వాహనాన్ని చూసినప్పుడు ఈ సినిమా ఆలోచన వచ్చింది. ‘టుక్ టుక్’ వెనకాల ఉన్నది దెయ్యమా? దేవుడా? అనే పాయింట్ సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది. వెహికల్ కాకుండా ఈ చిత్రంలో చాలా లేయర్స్ ఉన్నాయి. ఈ సినిమా సక్సెస్ అయితే ‘టుక్ టుక్’ ఫ్రాంచైజీ ప్లాన్ ఉంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment