టాలీవుడ్‌లో కొంతకాలంగా చిన్న సినిమాలు సత్తా చాటుతున్నాయి. కంటెంట్ బాగుంటే ఆదరించడానికి ప్రేక్షకులు ఎప్పుడూ రెడీగా ఉంటున్నారు. ఈ క్రమంలో సీనియర్ కమెడియన్ గౌతం రాజు తనయుడు కృష్ణ కొత్త కథలతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈయన కృష్ణారావు సూపర్ మార్కెట్ అంటూ మొదటి చిత్రంతోనే మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నాడు. అయితే ఇది కరోనా సమయంలో ఓటీటీలో విడుదలైంది.
ఇప్పుడు కృష్ణ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే అతడు ‘కిలాడీ కుర్రోళ్ళు’ అనే చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయినట్టు సమాచారం. ఇదే కాకుండా కృష్ణ చేతిలో ఇంకో నాలుగైదు చిత్రాలున్నట్టు సమాచారం. అంతే కాకుండా ఓ పెద్ద హీరో చిత్రంలో స్పెషల్ రోల్ చేస్తున్నాడని టాక్!
Comments
Please login to add a commentAdd a comment