gautam raju
-
కమెడియన్ గౌతం రాజు తనయుడు హీరోగా కొత్త మూవీ
టాలీవుడ్లో కొంతకాలంగా చిన్న సినిమాలు సత్తా చాటుతున్నాయి. కంటెంట్ బాగుంటే ఆదరించడానికి ప్రేక్షకులు ఎప్పుడూ రెడీగా ఉంటున్నారు. ఈ క్రమంలో సీనియర్ కమెడియన్ గౌతం రాజు తనయుడు కృష్ణ కొత్త కథలతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈయన కృష్ణారావు సూపర్ మార్కెట్ అంటూ మొదటి చిత్రంతోనే మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నాడు. అయితే ఇది కరోనా సమయంలో ఓటీటీలో విడుదలైంది. ఇప్పుడు కృష్ణ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే అతడు ‘కిలాడీ కుర్రోళ్ళు’ అనే చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయినట్టు సమాచారం. ఇదే కాకుండా కృష్ణ చేతిలో ఇంకో నాలుగైదు చిత్రాలున్నట్టు సమాచారం. అంతే కాకుండా ఓ పెద్ద హీరో చిత్రంలో స్పెషల్ రోల్ చేస్తున్నాడని టాక్! -
హీరోగా పరిచయమవుతున్న కమెడియన్ గౌతమ్ రాజు కుమారుడు
కృష్ణ (కమెడియన్ గౌతం రాజు కుమారుడు) హీరోగా, సుమీత హీరోయిన్గా అంజన్ చెరుకూరి దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. రావుల గౌరమ్మ సమర్పణలో రావుల లక్ష్మణ్ రావ్, రావుల శ్రీను నిర్మిస్తున్నారు. తొలి సీన్‌కి నిర్మాత రామసత్యనారాయణ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు బి. గోపాల్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు రేలంగి నరసింహా రావు గౌరవ దర్శకత్వం వహించారు. అంజన్ చెరుకూరి మాట్లాడుతూ.. ‘‘ఓ ప్రేమజంట తమకు వచ్చిన చాన్స్‌ని చేజిక్కుంచుకొని కోటీశ్వరులు ఎలా అయ్యారు? అనేదే ఈ చిత్రకథ’’ అన్నారు. ‘‘మా అభిమాన హీరో చిరంజీవి గారి బర్త్ డే రోజు మా సినిమా ప్రారంభించడం హ్యాపీ. మా తొలి చిత్రం ‘రుద్రవీణ’ రిలీజ్‌కు రెడీగా ఉంది’’ అన్నారు రావుల లక్ష్మణ్ రావ్, రావుల శ్రీను. -
కమెడియన్ గౌతం రాజు ఇంట విషాదం
గత కొన్ని రోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కరోనాతో సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా ఈ లోకం విడిచి వెళుతుండటం కలవరపెడుతోంది. వారి కుటుంబ సభ్యులను కూడా ఈ మహహ్మారి వదలడం లేదు. ఇప్పటికే పదుల సంఖ్యలో సినీ ప్రముఖులు, వారి కుటుంబ సభ్యులు మృతి చెందారు. తాజాగా కమిడియన్ గౌతంరాజు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరుడు సిద్దార్థ కరోనాతో మృతి చెందాడు. ఇటీవల కోవిడ్ బారిన పడిన ఆయన కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచాడు. సిద్దార్దకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన సోదరుడి మృతి విషయాన్ని ఓ వీడియో ద్వారా తెలియజేసిన గౌతం రాజు.. బయట పరిస్థితులు మరి దారుణంగా ఉన్నాయని, అంతా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశాడు. -
చిరంజీవిగారి నుంచి అవార్డు అందుకోవాలి
‘‘చిరంజీవిగారంటే చిన్నప్పటి నుంచి భక్తి. ఆయన స్ఫూర్తితోనే నేను నటనలోకి వచ్చా. ఇంజనీరింగ్ తర్వాత కొన్ని రోజులు ఉద్యోగం చేశా. ఆ తర్వాత నాన్నగారికి తెలియకుండానే సత్యానంద్‌గారి వద్ద నటనలో శిక్షణ తీసుకున్నాను. ఆడిష¯Œ ్సలో ‘కృష్ణారావు సూపర్ మార్కెట్’ చిత్రంలో హీరోగా ఎంపికయ్యా’’ అని హాస్యటుడు గౌతంరాజు కుమారుడు, హీరో కృష్ణంరాజు అన్నారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ – ‘‘తొలి ప్రయత్నం ‘కృష్ణారావు సూపర్ మార్కెట్’ చాలా మంచి అనుభూతిని ఇచ్చింది. నాకు మాస్ అంటే చాలా ఇష్టం. చిరంజీవిగారి నుంచి ఎక్కువగా స్ఫూర్తి పొందేది ఫైట్స్, డ్యా¯Œ ్స. నా తొలి సినిమా ఇంకా ఆయన వద్దకి చేరలేదని బాధపడుతున్నా. ఏదో ఒక రోజు ఆయన చేతుల మీదగా ఒక చిన్న అవార్డు అయినా తీసుకోవాలన్నది నా పెద్ద కల. అందుకోసం ఎంతైనా కష్టపడతా. దర్శకుల్లో సుకుమార్‌గారు అంటే చాలా ఇష్టం. కృష్ణవంశీ, పూరీ జగన్నాథ్, రాజమౌళి, హరీష్ శంకర్గార్ల కూడాæ ఇష్టం. నటుడిగా నిరూపించుకునే పాత్రలు చేయాలనుకుంటున్నాను ’’ అన్నారు. -
అక్టోబర్ 18న ‘కృష్ణారావ్ సూపర్ మార్కెట్’
బీజీఆర్ ఫిల్మ్ అండ్ టీవీ స్టూడియోస్ బ్యానర్ పై ప్రముఖ కమెడియన్ గౌతంరాజు కుమారుడు కృష్ణ హీరోగా రూపొందిన చిత్రం ‘కృష్ణారావ్ సూపర్‌మార్కెట్’. శ్రీనాధ్ పులకరం ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయముతున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను అక్టోబర్ 18న గ్రాండ్ గా విడుదలచేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శ్రీనాథ్ పులకురమ్ మాట్లాడుతూ.. ‘కృష్ణారావ్ సూపర్ మార్కెట్ అనేది ఒక సస్పెన్స్ థ్రిల్లర్. సూపర్ మార్కెట్ చుట్టూనే కథ నడుస్తుంది కాబట్టి ఈ టైటిల్ పెట్టడం జరిగింది. హీరో కృష్ణ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఈ సినిమా ద్వారా ఆయనకు మంచి పేరు వస్తుంది. అలాగే హీరోయిన్ ఎల్సా కూడా బాగా నటించింది. ఇద్దరు డేడికేషన్ ఉన్న నటులు. ప్రస్తుతం థ్రిల్లర్ కథలకు మంచి ఆదరణ లభిస్తోంది. మంచి కంటెంట్‌తో సస్పెన్స్ థ్రిల్లర్‌గా వస్తున్న కృష్ణారావ్ సూపర్ మార్కెట్ తప్పకుండా ప్రతి ఒక్కరికీ నచ్చే చిత్రం అవుతుంది’ అన్నారు. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ... ‘ఇప్పటికే విడుదలైన టీజర్‌కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ రావడంతో మా సినిమాకు మంచి బజ్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అక్టోబర్ 18న గ్రాండ్‌గా సినిమాను రిలీజ్ చేస్తున్నాం’ అన్నారు. -
యువతరానికి నచ్చే సినిమా
శ్రీబాలాజీ, నటుడు గౌతంరాజు తనయుడు కృష్ణ కథానాయకులుగా రూపొందుతోన్న చిత్రం ‘నాకైతే నచ్చింది’. త్రినాథ్ కోసూరు దర్శకుడు. ఎ.పి.రాధాకృష్ణ నిర్మాత. పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోన్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ -‘‘యువతరం మెచ్చే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. ప్రస్తుతం రీ-రికార్డింగ్ జరుగుతోంది. నవంబర్ తొలివారంలో పాటల్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. మణిశర్మ గీతాలు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయని, నవంబర్ చివరి వారంలో సినిమాను విడుదల చేస్తామని ఎగ్జిక్యూటివ్ నిర్మాత బి.ఆర్.రాజు చెప్పారు. సోని చరిష్టా, రిషిక, సిరి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో రఘు, గౌతంరాజు, చిత్రం శ్రీను, జూ.రేలంగి తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: బి.ఆర్.కె.రాజు, కూర్పు: నందమూరి హరి, సహ నిర్మాత: ఎం.మలర్కొడి.