అక్టోబర్ 18న ‘కృష్ణారావ్ సూప‌ర్‌ మార్కెట్’ | Krishnarao Super Market Movie Release Date Announced | Sakshi
Sakshi News home page

అక్టోబర్ 18న ‘కృష్ణారావ్ సూప‌ర్‌ మార్కెట్’

Published Sat, Sep 21 2019 11:44 AM | Last Updated on Sat, Sep 21 2019 11:44 AM

Krishnarao Super Market Movie Release Date Announced - Sakshi

బీజీఆర్ ఫిల్మ్ అండ్ టీవీ స్టూడియోస్ బ్యాన‌ర్ పై ప్ర‌ముఖ క‌మెడియ‌న్ గౌతంరాజు కుమారుడు కృష్ణ హీరోగా రూపొందిన చిత్రం  ‘కృష్ణారావ్ సూప‌ర్‌మార్కెట్’.  శ్రీ‌నాధ్ పుల‌క‌రం ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయముతున్నారు.  ఇటీవ‌ల విడుద‌ల‌ చేసిన ఈ సినిమా టీజ‌ర్‌కి  మంచి రెస్పాన్స్ రావ‌డంతో సినిమాపై ఆస‌క్తి నెల‌కొంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను  అక్టోబర్ 18న గ్రాండ్ గా విడుదలచేస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు శ్రీ‌నాథ్‌ పుల‌కుర‌మ్ మాట్లాడుతూ.. ‘కృష్ణారావ్ సూప‌ర్‌ మార్కెట్  అనేది ఒక సస్పెన్స్ థ్రిల్లర్. సూపర్ మార్కెట్ చుట్టూనే కథ నడుస్తుంది కాబట్టి ఈ టైటిల్ పెట్టడం జరిగింది.  హీరో కృష్ణ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఈ సినిమా ద్వారా ఆయనకు మంచి పేరు వస్తుంది. అలాగే  హీరోయిన్ ఎల్సా కూడా బాగా న‌టించింది. ఇద్దరు డేడికేషన్‌ ఉన్న నటులు. ప్రస్తుతం థ్రిల్లర్ కథలకు మంచి ఆదరణ లభిస్తోంది. మంచి కంటెంట్‌తో సస్పెన్స్ థ్రిల్లర్‌గా వస్తున్న కృష్ణారావ్ సూప‌ర్‌ మార్కెట్ తప్పకుండా ప్రతి ఒక్కరికీ నచ్చే చిత్రం అవుతుంది’ అన్నారు.

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ... ‘ఇప్పటికే విడుదలైన టీజర్‌కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ రావడంతో మా సినిమాకు మంచి బజ్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అక్టోబర్ 18న గ్రాండ్‌గా సినిమాను రిలీజ్ చేస్తున్నాం’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement