బాక్సాఫీస్ దగ్గర 'కల్కి' ప్రభంజనం మొదలైంది. అప్పుడెప్పుడో ఎన్టీఆర్ కాలంలో మహాభారతాన్ని సినిమాల్లో చూపించారు. ఇన్నాళ్లకు మళ్లీ 'కల్కి'లో దీనికి సంబంధించిన సీన్స్ పడ్డాయి. 3 గంటల సినిమాలో దాదాపు అరగంట పాటు మహాభారత సన్నివేశాల్ని చూపించారు. అయితే అశ్వద్ధామ, అర్జునుడు, కర్ణుడు.. ఇలా ఆయా పాత్రలతో పాటే కృష్ణుడి పాత్ర కూడా చూపించారు. కానీ ముఖాన్ని మాత్రం రివీల్ చేయలేదు. ఇంతకీ ఆ నటుడెవరు? ఇలా ఎందుకు చేశారో తెలుసా?
'కల్కి' మూవీలో మహాభారతం సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. టైటిల్స్ పడుతున్నప్పుడే కురుక్షేత్ర సంగ్రామం, అశ్వద్ధామకి కృష్ణుడు శాపం ఇవ్వడం లాంటి సీన్స్ చూపించి నేరుగా కథలోకి వెళ్లిపోయారు. మళ్లీ కీలకమైన క్లైమాక్స్‌లో క్రేజీ ట్విస్ట్ రివీల్ చేసి మెంటలెక్కించారు. అయితే అర్జునుడిగా విజయ్ దేవరకొండ, అతడి రథసారధిగా కృష్ణుడికి సంబంధించిన సీన్స్ పడ్డాయి. కానీ కృష్ణ పరమాత్మ ముఖాన్ని నీడలా చూపించారు.
(ఇదీ చదవండి: పేరు మార్చుకున్న ప్రభాస్.. 'కల్కి'లో ఇది గమనించారా?)
'కల్కి'లో కృష్ణుడి పాత్ర చేసింది తమిళ నటుడు కృష్ణకుమార్ సుబ్రమణియమ్. గతంలో వచ్చిన 'ఆకాశమే హద్దురా' మూవీలో సూర్యకి ఫ్రెండ్‌గా ఇతడు నటించాడు. స్వతహాగా నటుడు, నిర్మాత, దర్శకుడు, మ్యూజీషియన్ అయిన ఇతడికి 'కల్కి'లో కృష్ణుడి పాత్ర దక్కడం అదృష్టమనే చెప్పాలి. ఇదే విషయాన్ని తన ఇన్ స్టా స్టోరీలోనూ చెప్పుకొచ్చాడు. దీన్ని చాలా గౌరవంగా భావిస్తున్నట్లు రాసుకొచ్చాడు. ఈ పాత్రకు ప్రముఖ నటుడు అర్జున్ దాస్ తెలుగులో డబ్బింగ్ చెప్పాడు.
ఇకపోతే 'కల్కి' నిర్మాత అశ్వనీదత్.. స్వర్గీయ ఎన్టీఆర్‌కి వీరాభిమాని. ఆయనతో తొలి సినిమా తీశారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ ఫొటోలోనూ ఎన్టీఆర్ కృష్ణుడి రూమపే ఉంటుంది. అయితే తెలుగు ప్రేక్షకులకు కృష్ణుడు అంటే ఎన్టీఆరే. ఆయన్ని తప్పితే మరొకరిని ఊహించుకోలేం. బహుశా అందుకేనేమో 'కల్కి'లో ముఖం చూపించకుండా మేనేజ్ చేసి ఉంటారు!
(ఇదీ చదవండి: ‘కల్కి 2898 ఏడీ’ మూవీ రివ్యూ)
Ashwathama attacking krishna.. Krishna punching ashwathama.. Pure cinema😭😭 E scene vachaka literally goosebumps vachayi ikkadanunchi mahabharat okkate chupinchina question cheyakunta chusevadni.. Aa music aa aura.. Big screen pyna mahabharatam🙏
pic.twitter.com/BsWYIPtn5i— Dagads (@Dagads_) June 27, 2024
Comments
Please login to add a commentAdd a comment