సూపర్ స్టార్ కృష్ణ.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనపేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు. తన నట ప్రస్థానంతో, సాధించిన అవార్డులతో అభిమానుల మనసు ఉప్పొంగేలా చేశారు. నేడు (మే 31) కృష్ణ 81వ జయంతి. ఈ సందర్భంగా తండ్రిని గుర్తు చేసుకుని మహేశ్‌బాబు భావోద్వేగానికి లోనయ్యాడు.
మిస్ అవుతున్నా..
హ్యపీ బర్త్‌డే నాన్నా.. నిన్ను ఎంతగానో మిస్ అవుతున్నాను. కానీ నువ్వు నా జ్ఞాపకాల్లో ఎప్పటికీ పదిలంగా ఉంటావు అంటూ కృష్ణ ఫోటో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
అవి గుర్తు చేసుకుంటే
మరోవైపు డైరెక్టర్ వివి వినాయక్.. కృష్ణతో కలిసి పని చేసిన రోజులను గుర్తు చేసుకున్నాడు. అసిస్టెంట్‌గా, సహ దర్శకుడిగా కృష్ణగారి నాలుగు సినిమాలకు పని చేశాను. ఆయనతో పనిచేసిన రోజులను గుర్తు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటుంది. ఆయన ఎప్పటికీ మనతోనే ఉంటారు అని పేర్కొన్నారు.
Forever in our hearts, forever a legend 💫
Today, we honour the eternal legacy of Superstar Krishna Garu 🎬
May his invaluable contributions to Indian cinema continue to inspire generations.#SSKLivesOn pic.twitter.com/kRewKGtp18— AMB Cinemas (@amb_cinemas) May 31, 2024
Comments
Please login to add a commentAdd a comment