Mahesh Babu Mother Indira Devi Birthday Celebration Pics Viral - Sakshi
Sakshi News home page

Mahesh Babu : బర్త్‌డే వేడుకల్లో కనిపించని మహేశ్‌.. కారణం అదే!

Published Thu, Apr 21 2022 4:03 PM | Last Updated on Thu, Apr 21 2022 5:52 PM

Super Star Mahesh Babu Mother Indira Devi Birthday Celebrations Pics Goes Viral - Sakshi

సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు తల్లి ఇందిరా దేవి బర్త్‌డే వేడుకలు ఘనంగా జరిగాయి. బుధవారం ఇందిరా దేవీ పుట్టినరోజు సందర్భంగా ఓ అపురూపమైన ఫోటోను షేర్‌ చేసిన మహేశ్‌ తల్లికి బర్త్‌డే విషెస్‌ తెలియజేశారు. కుటుంబసభ్యుల మధ్య ఆమె పుట్టినరోజును జరుపుకున్నారు.సూపర్‌ స్టార్‌ కృష్ణ భార్యకు కేక్‌ తినిపించి విషెస్‌ తెలిపారు. చదవండి:  ఆ హీరోయిన్‌ గురించి మనసులో మాటను బయటపెట్టిన యశ్‌

ఈ వేడకల్లో సూపర్ స్టార్ కృష్ణ, నమ్రత, సితార, గౌతమ్‌, ప్రియదర్శిని, మంజులా, గల్లా జయదేవ్‌ దంపతులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

కాగా ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో మిగతా కుటుంబసభ్యులు పాల్గొనగా మహేశ్‌ బాబు మాత్రం మిస్‌ అయ్యారు. ప్రస్తుతం ఆయన సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షూటింగ్‌లో బిజీగా ఉండటంతోనే మహేశ్‌ రాలేకపోయారని తెలుస్తుంది. చదవండి: సర్కారు వారి పాట: ఫైనల్‌ షూటింగ్‌


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement