Indira
-
నేనేంటో చూపిస్తా.. నటిని బెదిరించిన సల్మాన్ ఖాన్!
తనపై చేయి చేసుకుంటే పరిణామాలు దారుణంగా ఉంటాయని సల్మాన్ ఓ నటిని బెదిరించాడట.. దమ్ముంటే కొట్టి చూడు, తర్వాత ఏం జరుగుతుందో నువ్వే చూద్దువుగానీ అంటూ రెచ్చగొట్టాడట! ఈ ఆసక్తికర విషయం గురించి బాలీవుడ్ నటి ఇందిరా కృష్ట ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.సల్మాన్ బెదిరించాడుఆమె మాట్లాడుతూ.. తేరే నామ్ సినిమాలో నేను సల్మాన్‌ను కొట్టే సన్నివేశం ఒకటుంటుంది. సరిగ్గా ఆ సన్నివేశానికి ముందు సల్మాన్ నన్ను బెదిరించాడు. నువ్వు నన్ను చిన్నగా కొట్టినా సరే నేనేం చేస్తానో చూడు. ఎంత రచ్చ చేస్తానో నాకే తెలియదు అని బెదిరించాడు. నాకు చాలా భయమేసింది. ఆ సీన్ ఎలా పూర్తి చేయాలో అర్థం కాక ఆందోళన చెందాను. చేతులు వణికాయి. ఇంతలో సల్మాన్ అదంతా ప్రాంక్ అని చెప్పడంతో ఊపిరి పీల్చాను.ఆ ఫీలింగే రాదుఅతడితో కలిసి పని చేయడం నాకెంతో ఇష్టం. పెద్ద హీరోతో పని చేస్తున్న భావన రాదు. అంత కలివిడిగా ఉంటాడు అని చెప్పుకొచ్చింది. తేరే నామ్ సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని దివంగత దర్శకుడు సతీశ్ కౌశిక్ డైరెక్ట్ చేశాడు. భూమిక చావ్లా హీరోయిన్గా నటించింది. ఇకపోతే ఇందిర.. లేడీ విలన్ నీరజ అక్క మమత పాత్రలో నటించింది.చదవండి: హర్షసాయి కేసులో బిగ్ ట్విస్ట్.. యూట్యూబర్‌కు భారీ ఊరట! -
కూతురితో అసభ్యంగా ప్రవర్తించాడని.. భర్తను చంపిన భార్య
సంగారెడ్డి: కూతురితో అసభ్యంగా ప్రవర్తించిన భర్తను భార్య గొడ్డలితో నరికి చంపింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్‌పూర్‌లో బుధవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. సుల్తాన్‌పూర్‌కు చెందిన మన్నే మాణయ్య (45), ఇందిర దంపతులకు కూతురు సుకన్య ఉంది. ఏడాది కిందట సుకన్య భర్త చనిపోవడంతో తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. మద్యానికి బానిసైన మాణయ్య ఇంట్లో ఉంటున్న కూతురిపై కన్నేశాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. బుధవారం అర్ధరాత్రి అతిగా మద్యం సేవించి భార్య, కూతురితో గొడవకు దిగాడు. గొడ్డలితో బెదిరిస్తూ కూతురితో అసభ్యంగా ప్రవర్తించాడు. భార్య అడ్డుకున్నా వినలేదు. దీంతో మాణయ్య చేతిలో ఉన్న గొడ్డలిని లాక్కొని ఇందిర భర్తను నరికి చంపింది.ఘటన విషయం తెలుసుకున్న జోగిపేట సీఐ అనిల్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తల్లీకూతురు ఇద్దరూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. -
‘ఖలిస్థానీ‘ వివాదాస్పద పోస్టర్లు: ఘాటుగా స్పందించిన కెనడా మంత్రి
కెనడాలో ఖలిస్థానీ వేర్పాటువాదులు ఇందిరా గాంధీ హత్యకు సంబంధించిన పోస్టర్లు అతికించడం కలకలకలం రేపింది. ఈ చర్యలను కెనడా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. హింసను ప్రోత్సహించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. దీనిపై ఎక్స్ వేదికగా కెనడా మంత్రి డామినిక్ ఏ లెబ్లాంక్ స్పందించారు. ‘వాంకూవర్‌లో కొందరు ఇందిరా గాంధీ హత్య పోస్టర్లు వేశారు. కెనడాలో ఈ విధంగా హింసను ప్రోత్సహించడం ఆమోదయోగ్యం కాదు’ అని పేర్కొన్నారు. దీనికి ముందు కెనడాలోని వాంకోవర్‌లో ఖలిస్థానీ మద్దతుదారులు ఇందిరా గాంధీ హత్యపై వివాదాస్పద పోస్టర్లు అతికించడాన్ని హిందూ-కెనడియన్ ఎంపీ, మంత్రి చంద్ర ఆర్య తీవ్రంగా తప్పుపట్టారు. కెనడాలో హింసను ప్రోత్సహించడాన్ని ఎన్నటికీ అంగీకరించబోమని స్పష్టం చేశారు. వీరిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ట్రూడో ప్రభుత్వాన్ని ఆయన కోరారు.ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో పార్టీకి చెందిన ఎంపీ ఆర్య ట్విట్టర్ వేదికగా.. ‘భారత ప్రధాని ఇందిరా గాంధీ శరీరంపై బుల్లెట్ రంధ్రాలు ఉన్నాయని, ఆమె అంగరక్షకులే తుపాకులు పట్టుకుని హంతకులుగా మారారని పేర్కొంటూ ఖలిస్థానీ మద్దతుదారులు పోస్టర్లు వేసి, మరోమారు హిందూ-కెనడియన్లలో భయం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.ఇది కొన్ని సంవత్సరాల క్రితం బ్రాంప్టన్‌లో జరిగిన బెదిరింపుల కొనసాగింపని, కెనడాలోని హిందువులను భారతదేశానికి తిరిగి వెళ్లాలని కోరుతున్న ఖలిస్థానీ ఉద్యమ నేత పన్నూన్ చర్య అని పేర్కొన్నారు. ఆయన ప్రత్యేక సిక్కు రాష్ట్ర ఉద్యమాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ విధమైన చర్యలకు పాల్పడతున్నారన్నారు. పన్నూన్‌పై కెనడాలోని లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆర్య డిమాండ్ చేశారు. ఇటీవల వాంకోవర్‌లో భారత ప్రధాని ఇందిరా గాంధీ హత్యను చిత్రీకరించే పోస్టర్లు వెలిశాయని పబ్లిక్ సేఫ్టీ, డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్, ఇంటర్ గవర్నమెంటల్ అఫైర్స్ మంత్రి డొమినిక్ ఎ లెబ్లాంక్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. హింసను ప్రోత్సహించడం ఎన్నటికీ ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. కాగా హౌస్ ఆఫ్ కామన్స్ ఆఫ్ కెనడాలో నేపియన్ ఎన్నికల జిల్లాకు చంద్ర ఆర్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు. Khalistan supporters in Vancouver with posters, of Hindu Indian prime minister Indira Gandhi body with bullet holes with her bodyguards turned assassins holding their guns, are again attempting to instil fear of violence in Hindu-Canadians. This is continuation of threats with a… pic.twitter.com/ia8WQL4VtH— Chandra Arya (@AryaCanada) June 8, 2024 -
హెన్రీ కిసింజర్ కన్నుమూత
వాషింగ్టన్: అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి, అంతర్జాతీయ దౌత్య నిపుణుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, అమెరికా విదేశాంగ విధానం రూపశిల్పిగా పేరుగాంచిన హెన్రీ కిసింజర్ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు వందేళ్లు. చాలా రోజులుగా అనారోగ్యంగో బాధపడుతున్న కిసింజర్ కనెక్టికట్‌లో తన నివాసంలో బుధవారం కన్నుమూశారని ఆయన కన్సల్టెంగ్ కంపెనీ ‘కిసింజర్ అసోసియేట్స్’ ప్రకటించింది. అమెరికా విదేశాంగ విధానం గురించి ఎక్కడ చర్చ జరిగినా కిసింజర్ పేరు ప్రస్తావనకు రావాల్సిందే. అంతలా ఆయన తనదైన ముద్ర వేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో సైనికుడిగా పాల్గొన్న కిసింజర్ 21వ శతాబ్దంలోనూ ప్రపంచ పరిణామాలను ప్రభావితం చేశారు. ఏకకాలంలో రెండు కీలక పదవులు కిసింజర్ 1923 మే 27న జర్మనీలోని బవేరియన్ సిటీలో జని్మంచారు. యూదు మతస్తుడైన కిసింజర్ 1938లో తన కుటుంబంతో కలిసి అమెరికా చేరుకున్నారు. న్యూయార్క్‌లోని మన్హట్టన్లో స్థిరపడ్డారు. మాతృభాష జర్మన్. ఇంగ్లిష్ భాష అనర్గళంగా మాట్లాడే స్థాయికి చేరుకున్నప్పటికీ చనిపోయేదాకా జర్మన్ యాస మాత్రం ఆయనను వదల్లేదు. న్యూయార్క్ సిటీలోని జార్జి వాషింగ్టన్ హైసూ్కల్లో ప్రాథమిక విద్య అభ్యసించారు. తర్వాత అమెరికా సైన్యంలో చేరారు. మాతృదేశం జర్మనీలో అమెరికా తరఫున పోరాడారు. నిఘా విభాగంలో పనిచేశారు. జర్మనీలో నాజీలను ఓడించేందుకు తన వంతు సేవలందించారు. ఆయనకు ‘బ్రాంజ్ స్టార్’ లభించింది. తర్వాత అమెరికాకు తిరిగివచ్చారు. హార్వర్డ్ యూనివర్సిటీలో చేరారు. అదే యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. అంతర్జాతీయ వ్యవహారాలపై పరిజ్ఞానం పెంచుకున్నారు. రిపబ్లికన్ పార్టీ నేత, న్యూయార్క్ గవర్నర్ నెల్సన్ రాక్ఫెల్లర్కు సలహాలు ఇచ్చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రైమరీల్లో రిపబ్లికన్ పార్టీ నాయకుడు రిచర్డ్ నిక్సన్ విజయం సాధించారు. దాంతో కిసింజర్.. నిక్సన్ వర్గంలో చేరిపోయారు. నిక్సన్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక కిసింజర్‌ను జాతీయ భద్రతా సలహాదారుగా నియమించారు. 1973లో విదేశాంగ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ఏకకాలంలో రెండు కీలక పదవుల్లో కిసింజర్ చక్రం తిప్పారు. కిసింజర్ తర్వాత అమెరికాలో ఈ రెండు పదవులను ఒకేసారి ఎవరూ నిర్వర్తించలేదు. వాటర్‌గేట్ కుంభకోణంలో నిక్సన్ రాజీనామా చేయడంతో అధ్యక్షుడైన గెరాల్డ్ ఫోర్డ్ హయాంలోనూ కిసింజర్ అమెరికా విదేశాంగ మంత్రిగా సేవలందించారు. వియత్నాంలో అమెరికా యుద్ధానికి ముగింపు పలికేలా చొరవ తీసుకున్నందుకు 1973లో ఆయనకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఇజ్రాయెల్–అరబ్ దేశాల మధ్య ఘర్షణలను నివారించడంలో కీలక పాత్ర పోషించారు. అత్యంత శక్తివంతమైన దౌత్యవేత్తగా గుర్తింపు పొందారు. ఆయనకు మొదటి భార్య ద్వారా ఎలిజబెత్, డేవిడ్ జన్మించారు. భారత వ్యతిరేక వైఖరి విదేశాంగ మంత్రిగా పదవీ కాలం పూర్తయిన తర్వాత కూడా ఆయన సలహాదారుగా పనిచేశారు. కార్పొరేషన్లకు, రాజకీయనాయకులకు, ప్రపంచ స్థాయి నేతలకు సలహాలు ఇస్తుండేవారు. సభలు, సమావేశాల్లో పాల్గొనేవారు. ప్రపంచ పరిణామాలపై తనఅభిప్రాయాలు వెల్లడించేవారు. పలు చిన్న, దుర్బల దేశాలపై అమెరికా యుద్ధాలు, దాడుల వెనుక కిసింజర్ దుష్ట రాజనీతి ఉందన్న ఆరోపణలు వచ్చాయి. ఆయనను యుద్ధ నేరగాడిగా పలు దేశాలు అభివర్ణించాయి. కిసింజర్ రెండు సార్లు చైనాలో పర్యటించారు. సోవియట్ రష్యాకు చెక్ పెట్టడానికి చైనాతో ద్వైపాక్షిక సంబంధాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. 1971లో భారత్–పాకిస్తాన్ మధ్య భీకర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో అమెరికా ప్రభుత్వం పాకిస్తాన్‌కు అండగా నిలిచింది. దీని వెనుక కిసింజర్ ఒత్తిడి ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అప్పట్లో భారత్‌ను కిసింజర్ తీవ్రంగా వ్యతిరేకించేవారు. తరచూ విమర్శలు చేస్తుండేవారు. భారత్‌ను తప్పుపట్టినందుకు ఆ తర్వాతి కాలంలో ఆయన తన సన్నిహితుల వద్ద పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇది కూడా చదవండి: ఆ కార్మికుల ఆరోగ్యం ఎలా ఉందంటే.. -
రేవంత్ గజదొంగ.. నాపై ఒక్క కేసు లేదు: కడియం
సాక్షి, జనగాం: కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ నేత, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి మండిపడ్డారు. నియోజకవర్గంలో ఇవాళ జరిగిన కాంగ్రెస్ విజయభేరి సభలో రేవంత్.. కడియంపై తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ విమర్శలకు జాఫర్‌గడ్‌లో జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడుతూ కడియం కౌంటర్ ఇచ్చారు. రేవంత్ ఓ గజదొంగ. స్టేషన్ ఘన్పూర్ కాంగ్రెస్ అభ్యర్థిని ఇందిరపై, రేవంత్‌రెడ్డిపై పలు కేసులు ఉన్నాయి. కానీ, నాపై ఒక్క కేసు కూడా లేదు అని కడియం అన్నారు. నియోజక వర్గంలోని మాదిగలపై నిజంగా ప్రేమ ఉంటే మీ ఆస్తులు మొత్తం రాసివ్వాలని ఇందిరకు సవాల్ విసిరారాయన. ఇందిర తన ఆస్తుల్ని రాసిచ్చిన మరు క్షణమే తాను తన ఆస్తుల్ని రాసి ఇచ్చేస్తానని కడియం తెలిపారు. 2018 ఎన్నికల్లో రాజయ్య చేతిలో ఇందిర చిత్తుచిత్తుగా ఓడిపోయింది. నియోజకవర్గం పైన అవగాహన లేక పిచ్చిపిచ్చిగా మాట్లాడుతోంది. కడియం ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు చేయూతనిస్తున్నా. నియోజకవర్గంలోని ఒక్క దళిత కుటుంబానికి కూడా ఇందిర సాయం చేయలేదు. ఆపై చీటింగ్ కేసు నమోదు అయ్యింది. సుప్రీం కోర్టులో ఆ కేసు నడుస్తోంది. నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండని ఆమెకు.. ఇక్కడి ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయి? అని ప్రశ్నించారాయన. -
ఇందిర ‘మూడవ కుమారుడు’ ఎవరు? గాంధీ కుటుంబానికి ఎలా దగ్గరయ్యారు?
అది 2018వ సంవత్సరం.. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు 15 ఏళ్ల సుదీర్ఘ ప్రవాసం ముగిసింది. కమల్ నాథ్ అధికారం చేజిక్కించుకున్నారు. 2018 డిసెంబర్లో రాష్ట్ర 31వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇన్నాళ్ల తర్వాత దక్కిన అధికారం కాంగ్రెస్ చేతిలో 15 నెలలు మాత్రమే ఉంది. మరోసారి భారతీయ జనతా పార్టీ (బీజెపీ) ప్రభుత్వం ఏర్పడింది. శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఒకటిన్నర దశాబ్దం తర్వాత కాంగ్రెస్‌ను విజయపథంలో నడిపించిన కమల్‌నాథ్‌ను ఒకప్పుడు మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ‘మూడవ కుమారుడు’ అనేవారు. అంతటి ఘనత సాధించిన కమల్ నాథ్ నాయకత్వంలో కాంగ్రెస్ ఇప్పుడు మరోసారి ఎన్నికల రంగంలోకి దిగనుంది. మధ్యప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన కమల్ నాథ్ 1946 నవంబర్ 18న ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జన్మించారు. పాఠశాల విద్య తరువాత కమల్ నాథ్ కోల్‌కతాకు వెళ్లి, అక్కడ సెయింట్ జేవియర్స్ కళాశాల నుండి బీకామ్ పూర్తి చేశారు. 1973, జనవరి 27న అల్కా నాథ్‌ను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు నకుల్ నాథ్ రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. కమల్ నాథ్ ఛింద్వారా నుంచి లోక్‌సభ ఎన్నికల్లో 9 సార్లు గెలిచి ఎంపీ అయ్యారు. 1980లో తొలిసారి ఇక్కడ గెలిచారు. అప్పుడు అతని వయస్సు కేవలం 34 సంవత్సరాలు. 1997 ఉప ఎన్నికలను మినహాయిస్తే చింద్వారాలో విజయపథంలో దూసుకెళ్లిన నేత కమల్ నాథ్. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడల్లా ఆయనకు మంత్రివర్గంలో చోటు దక్కింది. పర్యావరణం, జౌళి, వాణిజ్యం, రోడ్డు రవాణా, రహదారుల వంటి కీలక మంత్రిత్వ శాఖల బాధ్యతలు ఆయనకు లభించాయి. ఇందిరాగాంధీ కాలం నుంచి కాంగ్రెస్‌తో అనుబంధం ఉన్న నేతగా కమల్‌నాథ్ పేరు తెచ్చుకున్నారు. పాఠశాల రోజుల్లో ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీతో ఏర్పడిన స్నేహం కమల్ నాథ్ రాజకీయ జీవితానికి పునాది వేసింది. సంక్షోభ సమయాల్లో కాంగ్రెస్‌కు అండగా నిలిచిన కమల్‌నాథ్.. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితునిగా మారారు. ఎమర్జెన్సీ ముగిసినప్పుడు కాంగ్రెస్‌కు గడ్డుకాలం ఎదురైంది. అదే సమయంలో సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించారు. ఇందిరాగాంధీపై వయసు ప్రభావం పడింది. ఉమ్మడి ప్రతిపక్షం ముందు కాంగ్రెస్ బలహీనపడింది. అలాంటి సమయంలో గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన కమల్‌నాథ్ పార్టీకి అండగా నిలిచారు. దీనికి ప్రతిఫలంగా ఇందిరాగాంధీ ఆయనకు చింద్వారా లోక్‌సభ టిక్కెట్ ఇవ్వడంతో కమల్‌నాథ్ రాజకీయ ప్రయాణం మొదలైంది. 2018లో కమల్ నాథ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా నిలిచారు. కమల్‌నాథ్ పేరిట రూ.7.09 కోట్ల విలువైన చరాస్తులు, రూ.181 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. కమల్‌నాథ్, ఆయన కుటుంబం పేరిట మొత్తం 23 కంపెనీలు, ట్రస్టులు రిజిస్టర్ అయ్యాయి. ఆయనకు చింద్వారా జిల్లాలో దాదాపు 63 ఎకరాల భూమి కూడా ఉంది. ఇది కూడా చదవండి: బ్రిటీషర్లను తరిమికొట్టిన చీమలు? ‘సిపాయిల తిరుగుబాటు’లో ఏం జరిగింది? -
ఇందిర సభలోకి సింహం ఎందుకు వదిలారు? తరువాత ఏం జరిగింది?
అది 1974వ సంవత్సరం. ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రచారం జోరుగా సాగుతోంది. ఢిల్లీకి సమీపంలోని దాద్రీ, గౌతమ్ బుద్ధ నగర్లో ఇందిరా గాంధీ ప్రచార సభ జరగాల్సి ఉంది. గుర్జర్ నేత రామచంద్ర వికల్‌కు ఓటు వేయాలని ఇందిర అభ్యర్థించాల్సివుంది. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో చౌదరి చరణ్ సింగ్‌కు పెరుగుతున్న ఆదరణ కారణంగా ఇందిరా గాంధీతోపాటు పార్టీ కాంగ్రెస్ చిక్కుల్లో పడింది. ఈ నేపధ్యంలో గుర్జర్ నేత వికల్ రూపంలో కాంగ్రెస్ ప్రత్యామ్నాయాన్ని చూసుకుంది. ఆ సమయంలో రామచంద్ర వికల్ బాగ్పత్ ఎంపీగా ఉన్నారు. దాద్రీ ప్రాంతం.. తిరుగుబాటు రైతు నేత బీహారీ సింగ్‌కు బలమైన కంచుకోట. అతను ఈ ప్రాంత నివాసి. ఇందిరా గాంధీకి సన్నిహితునిగా పేరుగాంచారు. అయినా వీటిని గుర్తించకుండా ఇందిర.. గుర్జర్ నేత వికల్‌ను రంగంలోకి దించారు. టిక్కెట్ రాకపోవడంతో ఆగ్రహించిన బీహారీ సింగ్ తిరుగుబాటు చేసి, స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీకి దిగారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన బీహారీ సింగ్‌కు ఎన్నికల చిహ్నంగా ‘సింహం’ గుర్తు కేటాయించారు. ఈ నేపధ్యంలో బీహారీ సింగ్.. తనకు టిక్కెట్ ఇవ్వకున్నా ఫర్వాలేదని, అయితే వికల్‌కు అనుకూలంగా బహిరంగ సభ పెట్టవద్దని ఇందిరాగాంధీకి సందేశం పంపినా, ఆమె పట్టించుకోలేదు. బిహారీ సింగ్ బాగీ ఆ రోజు జరగాల్సిన ఇందిరాగాంధీ బహిరంగ సభను ఆపేందుకు ప్లాన్ వేశారు. ఆ సమయంలో దాద్రీకి ఆనుకుని ఉన్న ఘజియాబాద్‌లో ఓ సర్కస్ నడుస్తోంది. బిహారీ సింగ్ ఆ సర్కస్ నుండి 500 రూపాయలకు ఒక సింహాన్ని అద్దెకు తీసుకున్నారు. దానిని బోనులో ఉంచారు. ఇందిరా గాంధీ సభ ప్రారంభం కాగానే బిహారీ సింగ్ సింహం ఉన్న బోనుతో సహా సమావేశానికి చేరుకుని, ఒక్కసారిగా బోను తెరిచారు. సింహం బయటకు రాగానే ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. జనం చెల్లాచెదురయ్యారు. ఫలితంగా ఇందిర తన సభను 5 నిమిషాల్లో ముగించాల్సి వచ్చింది. బీహారీ సింగ్ బాగీ ఆ ఎన్నికల్లో గెలవలేకపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి రామచంద్ర వికల్ కూడా ఓటమిపాలయ్యారు. బిహారీ సింగ్ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి కూడా సన్నిహితుడు. 1992లో బీహారీ సింగ్ ఒక రైతు ర్యాలీలో పాల్గొనడానికి వెళుతున్నప్పుడు అతనిపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో బిహారీ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. 2020 నవంబరు 29న బిహారీ సింగ్ బాగీ మరణించారు. త్వరలో బిహారీ సింగ్ విగ్రహాన్ని అతని స్వగ్రామమైన రుబ్బాస్లో ఆవిష్కరించనున్నారు. ఇది కూడా చదవండి: పేదరికంలో పుట్టిన పుతిన్ రష్యా అధ్యక్షుడెలా అయ్యారు? -
5 దారుణ అల్లర్లు.. దేశాన్ని వణికించి, రక్తపాతాన్ని సృష్టించి..
దేశ రాజధాని ఢిల్లీ లేదా ఇటువంటి మెట్రో నగరాల్లో ఏదో విషయమై అప్పుడప్పుడు అల్లర్లు చోటుచేసుకుంటాయి. 2020 ఫిబ్రవరిలో ఢిల్లీలోని ఈశాన్య జిల్లా హింసాత్మకంగా మారింది. పలు ఘటనల్లో 34 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటివరకు చోటుచేసుకున్న ఐదు అతిపెద్ద అల్లర్లలో వందలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ సంఘటనలు ఏమిటో తెలుసుకుందాం. 1. సిక్కు అల్లర్లు(1984) దేశంలో చోటుచేసుకున్న అతిపెద్ద అల్లర్లలో 1984లో జరిగిన సిక్కుల అల్లర్లు ప్రధానమైనవి. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హత్య తర్వాత ఇవి చోటుచేసుకున్నాయి. ఇందిరా గాంధీని హత్య చేసింది ఆమె అంగరక్షకులే. వారు సిక్కు మతానికి చెందినవారు. అందుకే ఇందిరాగాంధీ హత్యానంతరం దేశంలోని ప్రజలు సిక్కులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో సిక్కులను ఊచకోతకు గురిచేసిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ అల్లర్లలో ఐదు వేల మంది మరణించారని చెబుతుంటారు. ఒక్క ఢిల్లీలోనే రెండు వేల మందికి పైగా చనిపోయారు. ఇందిరా గాంధీ హత్యకు కారణం 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్ సమయంలో ఆమె తీసుకున్న నిర్ణయం అని చెబుతుంటారు. నాడు స్వర్ణ దేవాలయాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆమె భారత సైన్యాన్ని ఆదేశించారు. ఈ సమయంలో ఆలయంలోకి ప్రవేశించిన తిరుగుబాటుదారులు హతమయ్యారు. ఖలిస్తాన్ పేరుతో ప్రత్యేక దేశం కావాలనేది వారి డిమాండ్. ఆలయంలోకి ప్రవేశించిన జర్నైల్ సింగ్, భింద్రన్‌వాలే అతని సహచరులు ఆలయం లోపల ఉన్న సైనికులపై దాడి చేశారు. దీంతో ఇందిర ప్రభుత్వం తుపాకులతో దాడి చేయాలని సైనికులను ఆదేశించింది. ఈ ఘటనలో జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే, అతని సహచరులు మరణించారు. 2. భాగల్పూర్ అల్లర్లు(1989) 1947లో చోటుచేసుకున్న భాగల్పూర్ అల్లర్లు భారతదేశ చరిత్రలో అత్యంత క్రూరమైన అల్లర్ల జాబితాలో ఉంటాయి. ఈ అల్లర్లు 1989 అక్టోబర్‌లో భాగల్పూర్లో జరిగాయి. హిందూ- ముస్లిం వర్గాల మధ్య ఈ అల్లర్లు చోటుచేసుకున్నాయి. దీని కారణంగా 1000 మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. 3. ముంబై అల్లర్లు (1992) ఈ అల్లర్లకు ప్రధాన కారణం బాబ్రీ మసీదు కూల్చివేత. ఈ హింస డిసెంబర్ 1992లో ప్రారంభమై జనవరి 1993 వరకు కొనసాగింది. శ్రీకృష్ణ కమిషన్ నివేదిక ప్రకారం ఈ అల్లర్లలో 900 మంది చనిపోయారు. వీరిలో 575 మంది ముస్లింలు, 275 మంది హిందువులు, 45 మంది గుర్తుతెలియని వారు, మరో ఐదుగురు ఉన్నారు. సుధాకర్ నాయక్ సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అల్లర్లను నియంత్రించడంలో పూర్తిగా విఫలమయ్యిందని నిరూపితమయ్యింది. దీంతో అల్లర్లను అదుపు చేసేందుకు సైన్యాన్ని పిలవవలసి వచ్చింది. 4. గుజరాత్ అల్లర్లు(2002) గుజరాత్‌లోని గోద్రాలో జరిగిన అల్లర్లు దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన అల్లర్లు. గోద్రా ఘటన 2002లో జరిగింది. 27 ఫిబ్రవరి 2002న రైల్వే స్టేషన్లో ఒక గుంపు సబర్మతి రైలులోని ఎస్-6 కోచ్‌కు నిప్పు పెట్టడంతో 59 మంది కరసేవకులు మరణించారు. ఫలితంగా గుజరాత్ అంతటా మతకల్లోలాలు చోటుచేసుకున్నాయి. ఈ అల్లర్లలో 790 మంది ముస్లింలు, 254 మంది హిందువులు మరణించారు. ఆ సమయంలో ప్రస్తుత దేశ ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నారు. 5. ముజఫర్‌నగర్ (2013) ఈ అల్లర్లు ముజఫర్‌నగర్ జిల్లాలోని కవాల్ గ్రామంలో జరిగాయి. దీని కారణంగా 62 మంది ప్రాణాలు కోల్పోయారు. 2013 ఆగస్టు 27న కవాల్ గ్రామంలో జాట్ సామాజికవర్గ బాలికపై ముస్లిం యువకుడు వేధింపులకు పాల్పడ్డాడు. వేధింపులకు గురైన బాలిక బంధువు.. ఆ ముస్లిం యువకుడిని హత్య చేశాడు. తరువాత దీనికి ప్రతిగా పలువురు ముస్లింలు.. ఆ బాలిక సోదరులను హత్యచేశారు. ఇది కూడా చదవండి: ఏఏ దేశాల్లో వరద ముప్పు అధికం? దీనికి ప్రధాన కారణం ఏమిటి? -
ఫిరోజ్ ఘంఢీ.. ఫిరోజ్ గాంధీగా ఎలా మారారు? ఇందిరతో పెళ్లిపై కమలా నెహ్రూ ఏమన్నారు?
ఆమధ్య రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌ను టార్గెట్ చేశారు. తాను పండిట్ నెహ్రూ పేరు చెప్పడాన్ని మర్చిపోతే కాంగ్రెస్ నేతలకు కోపం వస్తుందన్నారు. కానీ నెహ్రూ ఇంటిపేరును కాంగ్రెస్ నేతలు ఎందుకు ఉపయోగించరని ప్రశ్నించారు. ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు సరికొత్త వివాదానికి దారితీశాయి. ఈ విషయంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. స్వాతంత్ర్య సమరయోధుడు, జర్నలిస్ట్, రాయ్ బరేలీ ఎంపీ అయిన తన ముత్తాత ఫిరోజ్ గాంధీ ఇంటి పేరును రాహుల్ గాంధీ తన ఇంటి పేరుగా పొందారు. ఫిరోజ్ గాంధీ 1960లో తన 48 ఏళ్ల వయసులో మరణించారు. ఫిరోజ్ గాంధీ అసలు పేరు ఫిరోజ్ జహంగీర్ ఘంఢీ. ఆయన 1912,సెప్టెంబర్ 12న బొంబాయిలో జన్మించారు. అతని తల్లిదండ్రులు రతిమాయి, జహంగీర్ ఫరేడూన్ ఘంఢీ. వీరు పార్సీ మతానికి చెందివారు. జహంగీర్ ఫరేడూన్ ఘంఢీ మెరైన్ ఇంజనీర్. తండ్రి మరణించినప్పుడు ఫిరోజ్ గాంధీ చాలా చిన్నవాడు. యువ ఫిరోజ్ నాటి రోజుల్లో లేడీ డఫెరిన్ హాస్పిటల్లో సర్జన్‌గా పనిచేస్తున్న తన అత్త షిరిన్ దగ్గర ఉండేందుకు అలహాబాద్ చేరుకున్నారు. ఫిరోజ్ అలహాబాద్‌లోని ఎవింగ్ క్రిస్టియన్ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నారు. 18 సంవత్సరాల వయస్సులో ఫిరోజ్ గాంధీ జీవితంలో రెండు ముఖ్యమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. మొదటిది స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వామ్యం. రెండవది నెహ్రూ కుటుంబంతో సాన్నిహిత్యం ఏర్పడటం. ఫిరోజ్ గాంధీ ఈవింగ్ క్రిస్టియన్ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ భార్య కమలా నెహ్రూ ఆ కళాశాల వెలుపల జరిగిన సత్యాగ్రహానికి నాయకత్వం వహించారు. ఒకరోజు ఆమె అనారోగ్యం పాలయ్యారు. అప్పుడు ఫిరోజ్ ఆమెకు సాయం అందించారు. ఆ రోజుల్లో స్వాతంత్య్ర సమరయోధులకు ‘ఆనంద్ భవన్’ కేంద్రంగా ఉండేది. అక్కడి నుంచే ఫిరోజ్ స్వాతంత్ర్య ఉద్యమ భాగస్వామ్యం కొనసాగింది. అదే సమయంలో ఫిరోజ్ తన ఇంటిపేరులో ‘ఘంఢీ’ని ‘గాంధీ’గా మార్చుకున్నారు. మహాత్మా గాంధీపై గల గౌరవంతోనే ఫిరోజ్ తన ఇంటి పేరును మార్చుకున్నారు. ఫిరోజ్ గాంధీ ఇందిరా గాంధీతో పరిచయం ఏర్పరుచుకున్నప్పుడు ఆమె వయస్సు 16 ఏళ్లు. ఫిరోజ్ ఆమె కంటే 5 ఏళ్లు పెద్ద. కాగా కమలా నెహ్రూ.. ఇందిర, ఫిరోజ్‌ల వివాహాన్ని వ్యతిరేకించారు. ఇద్దరి మధ్య వయస్సు తేడా చాలా తక్కువగా ఉన్నదని అన్నారు. ప్రఖ్యాత జర్నలిస్ట్ సాగరిక ఘోష్ తన పుస్తకం ‘ఇందిర: ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్’లో.. టీబీ కారణంగా కమలా నెహ్రూ ఆరోగ్య పరిస్థితి క్షీణించినప్పుడు ఫిరోజ్ ఆమెను చికిత్స కోసం జర్మనీ తీసుకువెళ్లారని రాశారు. ఇది కూడా చదవండి: లండన్‌లోని ఇండియా క్లబ్ ఎందుకు మూతపడింది? స్వాతంత్య్రోద్యమంతో లింక్ ఏమిటి? -
ఫిరోజ్ గాంధీ అంత్యక్రియలు అలా ఎందుకు జరిగాయి? అల్లుని మృతదేహాన్ని చూసి నెహ్రూ ఏమన్నారు?
అది 1960, సెప్టెంబరు 7.. ఫిరోజ్ గాంధీ వారం రోజులుగా ఛాతీ నొప్పితో బాధపడుతున్నారు. ఆ నొప్పి ఇక భరించలేక తన స్నేహితుడైన డాక్టర్ హెచ్ఎస్ ఖోస్లాకు ఫోన్ చేశారు. తరువాత తానే కారు నడుపుతూ ఢిల్లీలోని వెల్లింగ్టన్ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆయన భార్య ఇందిరా గాంధీ ఢిల్లీకి దాదాపు 3 వేల కిలోమీటర్ల దూరంలోని త్రివేండ్రంలో ఉన్నారు. ఈ వార్త తెలియగానే ఇందిర వెంటనే ఢిల్లీ బయలుదేరారు. విమానాశ్రయం నుంచి నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు. 48వ పుట్టినరోజుకు 4 రోజుల ముందు... ఇందిరా గాంధీ ఆ రాత్రంతా ఫిరోజ్ పక్కనే కూర్చున్నారు. ఫిరోజ్ అపస్మారక స్థితిలో ఉన్నారు. సెప్టెంబర్ 8న ఉదయం కొద్దిసేపు స్పృహలోకి వచ్చారు. అయితే ఆయన తన 48వ పుట్టినరోజుకు 4 రోజుల ముందు కన్నుమూశారు. ఫిరోజ్ గాంధీ మృతదేహాన్ని వెల్లింగ్టన్ హాస్పిటల్ నుండి తీన్ మూర్తి భవన్‌కు తీసుకువచ్చారని బెర్టిల్ ఫాక్ తన పుస్తకం ‘ఫిరోజ్ – ది ఫర్గాటెన్ గాంధీ’లో రాశారు. అందరినీ గది నుండి బయటకు వెళ్లిపోవాలని... తీన్ మూర్తి భవన్‌కు చేరుకున్న ఇందిర.. ఫిరోజ్ గాంధీ భౌతికకాయానికి తానే స్నానం చేయించి, అంత్యక్రియలకు సిద్ధం చేస్తానని, ఈ సమయంలో అక్కడ ఎవరూ ఉండకూడదని, అందరినీ గది నుండి బయటకు వెళ్లిపోవాలని కోరారు. తీన్ మూర్తి భవన్‌లోని కింది అంతస్తు నుంచి ఫర్నిచర్ తదితరాలన్నింటినీ తొలగించి, అక్కడ ఫిరోజ్ గాంధీ మృతదేహాన్ని తెల్లటి షీట్‌పై ఉంచి, అందరికీ చివరి చూపు కోసం ఉంచారు. ఫిరోజ్ గాంధీ చివరి దర్శనానికి... బీబీసీ తెలిపిన వివరాల ప్రకారం ఆ రోజుల్లో బ్రిటిష్ నటి, సినీ విమర్శకురాలు మేరీ సెటన్ జవహర్లాల్ నెహ్రూ ఇంటికి అతిథిగా వచ్చినప్పుడు తీన్ మూర్తి భవన్లో ఉండేవారు. జవహర్లాల్ నెహ్రూ, సంజయ్ గాంధీతో కలిసి ఫిరోజ్ గాంధీ మృతదేహాన్ని ఉంచిన గదికి చేరుకున్నారని మేరీ రాశారు. ఆ సమయంలో నెహ్రూ ముఖం పూర్తిగా వాడిపోయింది. ఇందిరా గాంధీ కూడా లోలోపల తీవ్రంగా ఆవేదన చెందున్నారు. ఫిరోజ్ గాంధీ చివరి దర్శనానికి వచ్చిన జనాన్ని చూసి నెహ్రూ ‘ఫిరోజ్ని జనం ఇంతలా ఇష్టపడతారని నాకు తెలియదు’ అని అన్నారు. మొదటిసారి గుండెపోటు వచ్చినప్పుడు... సెప్టెంబర్ 9 ఉదయం, ఫిరోజ్ గాంధీ భౌతికకాయం అంత్యక్రియల కోసం నిగంబోధ్ ఘాట్‌కు తరలించారు. ఫిరోజ్ గాంధీ తనకు మొదటిసారి గుండెపోటు వచ్చినప్పుడు పార్సీ ఆచారాల ప్రకారం తన అంత్యక్రియలు చేయకూడదని తన స్నేహితులకు తెలిపారు. పార్సీ సమాజ ఆచారంలో మృత దేహాన్ని కాల్చడం లేదా పూడ్చివేయడం చేయరు. దీనికి బదులుగా మృతదేహాన్ని ‘టవర్ ఆఫ్ సైలెన్స్’లో ఉంచుతారు. ఇక్కడ డేగలు, కాకులు, జంతువులు ఆ మృతదేహాన్ని ఆహారంగా తీసుకుంటాయి. కాథరిన్ ఫ్రాంక్ తన పుస్తకం ‘ది లైఫ్ ఆఫ్ ఇందిరా గాంధీ’లో ఇలా రాశారు ‘ఫిరోజ్ గాంధీ అంత్యక్రియలు హిందూ ఆచారాల ప్రకారం జరిగినప్పటికీ, ఫిరోజ్ గాంధీ మృతదేహాన్ని దహనం చేసే ముందు కొన్ని పర్షియన్ ఆచారాలను ఇందిర పాటించారు. ‘అహనవేటి’ అధ్యాయం మొత్తం చదివారు. అనంతరం 18 ఏళ్ల రాజీవ్ గాంధీ తన తండ్రి అంత్యక్రియల చితికి నిప్పంటించారు. చితాభస్మాన్ని మూడు భాగాలుగా.. ఫిరోజ్ గాంధీ కుటుంబం చాలా కాలం సూరత్‌లో ఉండేది. తర్వాత ఫిరోజ్ అలహాబాద్ వచ్చాడు. దహన సంస్కారాల అనంతరం అతని చితాభస్మాన్ని మూడు భాగాలుగా విభజించారు. పండిట్ నెహ్రూ సమక్షంలో అలహాబాద్ సంగమంలో ఒక భాగం నిమజ్జనం చేశారు. రెండవ భాగం అలహాబాద్‌లో, మూడవ భాగాన్ని సూరత్‌లోని ఫిరోజ్ పూర్వీకుల స్మశాన వాటికలో ఖననం చేశారు. ఇది కూడా చదవండి: డిజిటల్ విలేజ్ ప్రాజెక్ట్ అంటే ఏమిటి? ఆన్లైన్ సేవలు ఎలా వృద్ధి చెందుతాయి? -
భారత్-శ్రీలంకల ‘కచ్చతీవు’ వివాదం ఏమిటి? ఇందిరాగాంధీని ఎందుకు తప్పుబడుతున్నారు?
ఆమధ్య ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో మన దేశానికి దక్షిణాన ఉన్న కచ్చతీవు ద్వీపం గురించి ప్రస్తావించారు. భారత్- శ్రీలంక మధ్య పాక్ జలసంధిలో ఉన్న ఈ ద్వీపం గత కొన్నేళ్లుగా భారతదేశంలో చర్చనీయాంశంగా ఉంది. ఈ ద్వీపం గురించి ప్రధాని మాట్లాడుతూ 1974లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కచ్చతీవును శ్రీలంకకు కానుకగా ఇచ్చారని, అయితే ఈ ద్వీపం భారత్‌లో భాగమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రామేశ్వరంనకు 12 మైళ్ల దూరంలో.. కచ్చతీవు ద్వీపం భారతదేశంలోని రామేశ్వరం- శ్రీలంక ప్రధాన భూభాగం మధ్య పాక్ జలసంధిలో ఉన్న జనావాసాలు లేని ఒక ద్వీపం. ఇక్కడ చుక్క నీరు కూడా దొరకదు. ఈ ద్వీపం బంగాళాఖాతం- అరేబియా సముద్రాలను కలుపుతుంది. కచ్చతీవు భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం నుండి 12 మైళ్ల దూరంలో, శ్రీలంకలోని జాఫ్నాలోని నెందురికి 10.5 మైళ్ల దూరంలో ఉంది. 285 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ద్వీపం 300 మీటర్ల వెడల్పు కలిగివుంది. ఇది కూడా చదవండి: అంతరిక్షంలోకి వెళితే వయసు పెరగదా? ‘నాసా’ పరిశోధనలో ఏమి తేలింది? 14వ శతాబ్దంలో అగ్నిపర్వత విస్ఫోటనం ఈ ద్వీపంలో మత్స్యకారుల ఆరాధనా స్థలం సెయింట్ ఆంథోనీ చర్చి కూడా ఉంది. ప్రతి సంవత్సరం ఈ చర్చిలో ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ ఉత్సవాలలో భారత్, శ్రీలంకకు చెందిన మత్స్యకారులు పాల్గొంటారు. ఇక్కడి పగడపు దిబ్బల కారణంగా భారీ ఓడలు ఈ ప్రాంతంలో ప్రయాణించలేవు. 14వ శతాబ్దంలో అగ్నిపర్వత విస్ఫోటనం తర్వాత ఈ ద్వీపం ఏర్పడిందని చెబుతారు. ఈ ద్వీపానికి సంబంధించి భారత్, శ్రీలంకల మధ్య ఎంతో కాలంగా వివాదం నడుస్తోంది. బ్రిటిష్ పాలనా కాలంలో భారత్, శ్రీలంకకు చెందిన మత్స్యకారులు ఈ ద్వీపంలో చేపలు పట్టేవారు. ఈ ద్వీపం రామనాథపురం రాజు ఆధీనంలో ఉండేది. తరువాత భారతదేశంలో బ్రిటిష్ పాలన కొనసాగినప్పుడు ఇది మద్రాసు ప్రెసిడెన్సీలోకి చేరింది. 1974-76లో ఇరు దేశాల మధ్య ఒప్పందం 1921లో ఈ ద్వీపానికి సంబంధించి శ్రీలంక, భారత్‌ల మధ్య ఒప్పందం జరిగినా ఫలితం లేకపోయింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఈ దీవి గుర్తింపు విషయంలో ఇరు దేశాల మధ్య ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 1970వ దశకంలో, భారతదేశం- శ్రీలంక మధ్య సముద్ర సరిహద్దు నిర్ధారణపై చర్చలు ప్రారంభమైనప్పుడు, 1974-76లో ఇరు దేశాల మధ్య తుది ఒప్పందం కుదిరింది. ఆ సమయంలో ఇందిరాగాంధీ భారత ప్రధానిగా, శ్రీమావో బండారునాయకే శ్రీలంక అధ్యక్షులుగా ఉన్నారు. ఈ ఒప్పందం ప్రకారం కచ్చతీవు ద్వీపం శ్రీలంకకు చెందుతుంది. నాటి ఒప్పందం ప్రకారం భారతీయ మత్స్యకారులు వీసా లేకుండా ఈ ద్వీపంలో విశ్రాంతి తీసుకోవడానికి, వలలు ఆరబెట్టడానికి, సెయింట్ ఆంథోనీ పండుగను జరుపుకోవడానికి అనుమతి ఉంది. అయితే 2010లో ఎల్టీటీఈ తిరుగుబాటు ముగిసిన తరువాత శ్రీలంక మత్స్యకారులు ఈ ప్రాంతంలో చేపలు పట్టడం ప్రారంభించారు. అయితే శ్రీలంక నేవీ ఈ ప్రాంతంలో భారతీయ మత్స్యకారుల రాకను నిలిపివేసింది. దీనిపై వివాదాలు తలెత్తేవి. సుప్రీం కోర్టుకు చేరిన వివాదం భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించడంపై చాలాకాలంగా వ్యతిరేకత ఉంది. 1991లో తమిళనాడు శాసనసభలో ద్వీపాన్ని తిరిగి భారతదేశంలో చేర్చాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేశారు. 2008లో అప్పటి జయలలిత ప్రభుత్వం ఈ విషయమై సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. ఈ అంశం సుప్రీంకోర్టులో ఇంకా పరిశీలనలో ఉంది. తమిళనాడు డిఎంకె, ఐడిఎంకె పార్టీలు ఈ అంశాన్ని తరచుగా లేవనెత్తుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ కూడా లోక్‌సభలో కచ్చతీవును అంశాన్ని ప్రస్తావించారు. ఈ ద్వీపానికి సంబంధించి ఇందిరా గాంధీ ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా ఉల్లంఘిస్తే, శ్రీలంక భారత్‌ను అంతర్జాతీయ కోర్టుకు లాగుతుందనే వాదన వినిస్తున్నది. కచ్చతీవు విషయంలో ప్రధాని మోదీ ఎలాంటి వైఖరిని అవలంబిస్తారో వేచి చూడాలి. ఇది కూడా చదవండి: లక్షల్లో ఉద్యోగం వదిలేశాడు.. 200కెఫెలు.. రూ. 100 కోట్ల టర్నోవర్! -
ఇందిరను ప్రధానిని చేసిన కే. కామరాజ్ లైఫ్ స్టోరీ!
ప్రతీయేటా జూలై 15న స్వాతంత్ర్యసమరయోధుడు, రాజనీతిజ్ఞుడు కుమారస్వామి కామరాజ్ జయంతి వేడుకలు జరుగుతుంటాయి. కామరాజ్ రాజకీయ చతురతకు పేరుగాంచారు. జవహల్‌లాల్ నెహ్రూ మరణాంతరం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కు అధ్యక్షునిగా కామరాజ్ పార్టీకి సారధ్యం వహించారు. కామరాజ్ తనకు ప్రధానమంత్రికి కావలసిన అన్ని అర్హతలు ఉన్నా ఆ అవకాశాన్ని లాల్‌బహదూర్‌శాస్త్రి, ఇందిరాగాంధీలకు కల్పించడంలో ప్రధాన భూమిక వహించారు. విద్య, వైద్య రంగాల అభివృద్ధికి విశేష కృషి నాటి రోజుల్లో ఒక నేతగా, ముఖ్యమంత్రిగా కామరాజ్ మద్రాస్(ప్రస్తుతం తమిళనాడు)లో విశేష రీతిలో విద్య, వైద్యం అందించేందుకు కృషి చేశారు. ఇందుకోసం ఆయన భారీగా పెట్టుబడులు కేటాయించారు. కామరాజ్ పరిపాలనా కాలంలో మద్రాస్ భారతదేశంలోనే అత్యధిక పారిశ్రామికీకరణ జరిగిన రాష్ట్రంగా పేరొందింది. ఇందుకు నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అందించిన భారీ సాయం దోహదపడింది. 1976లో కామరాజ్ భారత అత్యున్న పురస్కారం ‘భారత రత్న’ను అందుకున్నారు. కామరాజ్ జన్మదినాన తమిళనాడులోని అన్ని స్కూళ్లలో ‘ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ డే’ని నిర్వహిస్తుంటారు. పాఠశాల విద్య పూర్తి కాకుండానే.. కామరాజ్ నాడార్ (వెనుకబడిన కులం) కుటుంబంలో జన్మించారు. పాఠశాల విద్య కూడా పూర్తి కాకుండానే తన 11 సంవత్సరాల వయస్సులో మదురై సమీపంలోని తన మామ కిరాణా దుకాణంలో పని చేశారు. ఈ సమయంలోనే అతనిలో రాజకీయాలపై, స్వాతంత్ర్య పోరాటంపై ఆసక్తి ఏర్పడింది. కామరాజ్‌ను నాటి జలియన్‌వాలాబాగ్ ఊచకోత అమితంగా కలచివేసింది. కాంగ్రెస్ పార్టీలో వాలంటీర్‌గా చేరిన కామరాజ్ 1940లో పార్టీ మద్రాసురాష్ట్ర విభాగానికి అధిపతిగా ఎదిగారు. అతను 1954 వరకు ఈ పదవిలో కొనసాగారు. అనంతరం పార్టీ కామరాజ్‌ను మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసింది. ఆయన నాయకత్వంలోనే మద్రాసు రాష్ట్రంలో కాంగ్రెస్ సంస్థాగతంగా మరింత బలం పుంజుకుంది. ఇది కూడా చదవండి: అప్పడం ఘన చరిత్ర: పాక్‌లో పుట్టి, విభజన సమయంలో ఉపాధిగా మారి.. ఆరు వేల పాఠశాలలను తిరిగి తెరిపించి.. 1952లో మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, గాంధేయవాది సి రాజగోపాలాచారి ఎంపికయ్యారు. అయితే 1954లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూతో రాజగోపాలాచారికి విభేదాలు వచ్చాయి. ఈ సమయంలో అనుభవం ఉన్న నాయకుడి స్థానంలో యువ నాయకుడిని (కామరాజ్) నియమించాలని పార్టీ నిర్ణయించింది. ఆ పదవిని అధిష్టించిన కామరాజ్ తొలుత 1953లో రాజాజీ ప్రవేశపెట్టిన కుల ఆధారిత సవరించిన ప్రాథమిక విద్య పథకాన్ని రద్దు చేశారు. రాష్ట్రంలో మూతపడిన 6,000 పాఠశాలలను తిరిగి తెరిపించారు. తన పదవీకాలంలో 12,000 పాఠశాలలను నిర్మించారు. 11వ తరగతి వరకు ఉచిత, నిర్బంధ విద్యను ప్రవేశపెట్టారు. పార్టీకి కలసివచ్చిన కామరాజ్ ప్రణాళిక 1963లో నెహ్రూ అనారోగ్యంతో బాధపడుతున్న దశలో కాంగ్రెస్ ఒకదాని తర్వాత ఒకటిగా అనేక సంక్షోభాలను ఎదుర్కొంది. ఉప ఎన్నికల్లో ఆ పార్టీ పరాజయం పాలైంది. ‘నెహ్రూ తర్వాత ఎవరు?’ అనే ప్రశ్న కాంగ్రెస్ నేతలతో పాటు కార్యకర్తలోనూ మెదిలింది. అప్పుడే పార్టీని పునరుద్ధరించి, ప్రభుత్వాన్ని పటిష్టం చేసేందుకు కామరాజ్ ఒక ప్రణాళికను రూపొందించారు. ప్రభుత్వంలో ఉన్న నేతలు సంస్థాగత పనులు చేపట్టాలని ఆయన ప్రతిపాదించారు. 1963 ఆగస్టు 10న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తీర్మానంలో కామరాజ్ ప్రణాళిక ఆమోదం పొందింది. శాస్త్రి వారసురాలిగా ఇందిరా గాంధీ 1964 మే 27న నెహ్రూ మరణించారు. నెహ్రూ లాంటి వారు మరొకరు లభ్యం కారని భావించిన కామరాజ్ వివాద రహిత నేత లాల్ బహదూర్ శాస్త్రికి ప్రధాన మంత్రి పదవి కట్టబెట్టడంలో కీలకపాత్ర వహించారు. అనంతరం కామరాజ్ పార్టీని సమాఖ్య నాయకత్వ వ్యవస్థ వైపు నడిపించడానికి ప్రయత్నించారు. 1966లో శాస్త్రి కన్నుమూశారు. అనంతరం గుల్జారీలాల్ నందా కొద్ది కాలం పాటు తాత్కాలిక ప్రధానమంత్రిగా ఉన్నారు. నెహ్రూ, శాస్త్రిలను కోల్పోయిన క్లిష్ట సమయాలను కాంగ్రెస్ అధిగమించేందుకు కామరాజ్ విశేష కృషి చేశారు. అనంతరం శాస్త్రి వారసురాలిగా ఇందిరా గాంధీ ప్రధానిగా ఎన్నుకోవడంలో కామరాజ్ కీలక పాత్ర పోషించారు. 1966 జనవరి 24న ఇందిర ప్రధాని పదవిని అలంకరించారు. 72 ఏళ్ల వయసులో కన్నుమూత ఇందిరాగాంధీ పదవిలో ఉన్న సమయంలో ఆమె మద్దతుదారులకు, మరికొందరు పార్టీ నేతలకు మధ్య విబేధాలు పొడచూపాయి. ఇది చివరకు 1969లో పార్టీ చీలికకు దారితీసింది. పార్టీపై కామరాజు ప్రభావం తగ్గిపోయింది. 1967 అసెంబ్లీ ఎన్నికలలో డిఎంకె మద్రాసు రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ఓడించింది. కామరాజ్ ఓటమి పాలయ్యారు. 1971లో ఇందిరను ఓడించాలని భావించిన పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఇందిరా కాంగ్రెస్ (రిక్విజిషన్) కాంగ్రెస్ (ఓ)ని ఘోరంగా ఓడించింది. కామరాజ్ 1975లో తన 72 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఇది కూడా చదవండి: వింత మొఘల్ పాలకుడు: ఒకసారి నగ్నంగా, మరోసారి స్త్రీల దుస్తులు ధరించి.. -
బాల్యంలో మహాత్మా గాంధీని కలిసిన రాజీవ్
నేడు దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి. ఈ సందర్భంగా ఆయన కుమారుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన తండ్రిని గుర్తు చేసుకున్నారు. లడఖ్‌లోని పాంగాంగ్ త్సో సరస్సు ఒడ్డున రాహుల్ తన తండ్రికి నివాళులర్పించారు. 21వ శతాబ్దపు సృష్టికర్తగా పేరొందిన రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉండగానే ఇండియన్ టెలికాం నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు. ఓటింగ్ పరిమితి 21 నుండి 18 సంవత్సరాలకు తగ్గించారు. దేశంలోకి మొదటిసారిగా కంప్యూటర్లను తీసుకువచ్చారు. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేశారు. ఇవన్నీ రాజీవ్ విజయాల ఖాతాలో చేరుతాయి. రాజీవ్ గాంధీ జీవితానికి సంబంధించిన పలు అంశాలు ఎంతో ఆసక్తి కలిగిస్తాయి. వీటిలో ఒకటి ఆయన మహాత్మా గాంధీని కలవడం. అప్పుడు రాజీవ్ వయసు 4 సంవత్సరాలు. అది 1948, జనవరి 29... సాయంత్రం మహాత్మా గాంధీని కలవడానికి రాజీవ్‌ను తీసుకుని అతని తల్లి ఇందిరా గాంధీ వెళ్లారు. ఇందిర, రాజీవ్‌లతో పాటు పండిట్ జవహర్లాల్ నెహ్రూ, అతని సోదరి కృష్ణ హతీ సింగ్, నయనతార పండిట్, పద్మజా నాయుడు మహాత్ముడిని కలవడానికి వెళ్లినవారిలో ఉన్నారు. ఇందిరా గాంధీ జీవిత చరిత్రను రాసిన కేథరీన్ ఫ్రాంక్.. ఆ రోజు సాయంత్రం ఇందిర ఇంటి నుండి బయలుదేరే ముందు, వారి ఇంటి తోటమాలి మల్లెపూలను తీసుకువచ్చి, ఆమెకు ఇచ్చారని రాశారు. ఆ మల్లెపూలను గాంధీజీకి ఇవ్వాలని ఇందిరాగాంధీ అనుకున్నారు. వారంతా కలిసి బిర్లా హౌస్‌కు బయలుదేరారు. ఎప్పటిలాగే ఆ సమయంలో మహాత్మా గాంధీ బిర్లా హౌస్ లాన్లో సన్‌బాత్ చేస్తున్నారు. ఇందిరా గాంధీ, నెహ్రూ సోదరి కృష్ణ హతీ సింగ్, నయనతార పండిట్, పద్మజా నాయుడు తదితరులు గాంధీ దగ్గర కూర్చున్నారు. ఆ పక్కనే రాజీవ్ గాంధీ సీతాకోక చిలుకలతో ఆడుకుంటున్నాడు. కొద్దిసేపటి తర్వాత రాజీవ్.. మహాత్మా గాంధీ పాదాల దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. ఆ చిన్నారి రాజీవ్ మనసులో ఏమనుకున్నాడోగానీ మహాత్ముని పాదాలపై మల్లెపూలు జల్లడం మొదలుపెట్టాడు. దీనిని గమనించిన జాతిపిత మహాత్మాగాంధీ.. రాజీవ్‌ను పైకి లేపి.. ‘అలా చేయకూడదు. చనిపోయిన వ్యక్తుల పాదాలపై మాత్రమే పూలు జల్లుతారని’ హితవు పలికారు. ఆ మరుసటి రోజే మహాత్మా గాంధీ హత్యకు గురయ్యారు. 1948, జనవరి 30 న గాంధీజీని నాథూరామ్ గాడ్సే కాల్చి చంపాడు. మహాత్ముడు ప్రార్థనా సమావేశానికి వెళుతుండగా నాథూరామ్ గాడ్సే జనసమూహం మధ్య నుంచి వచ్చి, గాంధీపై మూడు సార్లు కాల్పులు జరిపాడు. దీంతో వాతావరణం ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారింది. ఇది కూడా చదవండి: బీబీసీ యజమాని ఎవరు? సంస్థకు సొమ్ము ఎలా వస్తుంది? -
తల్లి బర్త్‌డే సెలబ్రేషన్స్.. మిస్ అయిన మహేశ్
సూపర్‌స్టార్ మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి బర్త్‌డే వేడుకలు ఘనంగా జరిగాయి. బుధవారం ఇందిరా దేవీ పుట్టినరోజు సందర్భంగా ఓ అపురూపమైన ఫోటోను షేర్ చేసిన మహేశ్ తల్లికి బర్త్‌డే విషెస్ తెలియజేశారు. కుటుంబసభ్యుల మధ్య ఆమె పుట్టినరోజును జరుపుకున్నారు.సూపర్ స్టార్ కృష్ణ భార్యకు కేక్ తినిపించి విషెస్ తెలిపారు. చదవండి: ఆ హీరోయిన్ గురించి మనసులో మాటను బయటపెట్టిన యశ్ ఈ వేడకల్లో సూపర్ స్టార్ కృష్ణ, నమ్రత, సితార, గౌతమ్, ప్రియదర్శిని, మంజులా, గల్లా జయదేవ్ దంపతులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో మిగతా కుటుంబసభ్యులు పాల్గొనగా మహేశ్ బాబు మాత్రం మిస్ అయ్యారు. ప్రస్తుతం ఆయన సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షూటింగ్లో బిజీగా ఉండటంతోనే మహేశ్ రాలేకపోయారని తెలుస్తుంది. చదవండి: సర్కారు వారి పాట: ఫైనల్ షూటింగ్ -
ప్రేమ్ ఇల్లమ్.. వీల్చెయిర్తోనే నడిపిస్తోంది
వైకల్యంతో వీల్ చెయిర్‌కు పరిమితమైన ఇందిర ను చైల్డ్‌కేర్ హోమ్‌లో చేర్చారు తల్లిదండ్రులు. వారానికి ఒకసారి మాత్రమే ఇంటి నుంచి ఎవరో ఒకరు వచ్చి ఇందిరను కలిసేవారు. ఇందిరకేమో వాళ్లను పదేపదే చూడాలనిపించేది. ఎంతో ఇష్టమైన తన వాళ్లకు దూరంగా ఉన్నప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో ప్రత్యక్షం గా అనుభవించిన ఇందిర తనలాంటి వాళ్లకు ఇబ్బందులు కలగకుండా చూసేందుకు ‘ప్రేమ్ ఇల్లమ్’ పేరుతో షెల్టర్ హోమ్ ను నడుపుతూ.. 30 మంది పిల్లలను అమ్మలా ఆదరిస్తున్నారు. ఇందిరకు ఐదేళ్లు ఉన్నప్పుడు పోలియో వచ్చి తొంభైశాతం వైకల్యానికి గురైంది. నడవడానికి రెండు కాళ్లు సహకరించనప్పటికీ ‘ఏదోఒకరోజు నేను నడవగలుగుతాను’ అన్న ధైర్యంతో ఉండేది. తల్లిదండ్రులు చెన్నైలోని ఓ షెల్టర్ హోంలో ఇందిరను చేర్చారు. హోమ్‌లో ఉన్న పిల్లలంతా బొమ్మలతో ఆడుకోవడానికి ఇష్టపడితే ఇందిర మాత్రం చదువుకునేందుకు ఆసక్తి చూపించేది. అన్నయ్య ప్రోత్సాహంతో.. షెల్టర్ హోమ్‌లో సైకాలజిస్టుగా పనిచేస్తోన్న అన్నయ్య సెల్విన్ ఇందిర ఆసక్తిని గమనించి తల్లిదండ్రులతో మాట్లాడి ఇందిర డైలీ స్కూలుకు వెళ్లి చదువుకునేందుకు ప్రోత్సహించాడు. ఇందిర ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుందోనని తల్లిదండ్రులు భయపడ్డప్పటికీ, అన్న అండతో‡ధైర్యం గా ముందుకు సాగింది. కానీ చాలా స్కూళ్లు ఇందిర వైకల్యాన్ని సాకుగా చూపించి అడ్మిషన్ ఇవ్వడానికి వెనకాడాయి. ఎట్టకేలకు ఒక స్కూలు ఇందిరకు ఎనిమిదో తరగతిలో చేరేందుకు అడ్మిషన్ ఇచ్చింది. స్కూల్లో చేరిన ఇందిర అనేక భయాలు, ఆత్మనూన్యతకు లోనైనప్పటికీ అంకిత భావంతో ఎంతో కష్టపడి చదివి ఎస్ఎస్ఎల్సీ మంచి మార్కులతో పాసైంది. అలాగే డిగ్రీ, ఎంసీఏ కూడా పూర్తి చేసింది. ప్రేమ్ ఇల్లమ్.. ఇందిర లాంటి వాళ్లను మరింత మందిని ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో సెల్విన్ 1999లో ‘ప్రేమ్ ఇల్లమ్’ను స్థాపించి వైకల్యం గలిగిన పిల్లలకు ఆసరాగా నిలుస్తున్నాడు. ఇందిర ఎంసీఏ అయ్యాక ఉద్యోగం చేసే అవకాశం వచ్చినప్పటికీ ప్రేమ్ ఇల్లమ్‌లో చేరి సేవ చేయాలని నిర్ణయించుకుంది. 2017 నుంచి ప్రేమ్ ఇల్లమ్ సంస్థకు సేవలందిస్తోంది. ప్రస్తుతం ప్రేమ్ ఇల్లమ్‌లో 30 మంది అమ్మాయిలు ఉన్నారు. వీరిలో ఐదుగురు స్కూలుకెళ్తుండగా మిగతా వారంతా హోమ్‌లోనే ఉంటున్నారు. ఈ పిల్లలకు చదువు చెప్పడం కోసం ఇందిర స్పెషల్ ఎడ్యుకేషన్‌లో బిఈడీ చేసి వారికి పాఠాలు చెబుతోంది. అంతేగాక 2019 నుంచి సేంద్రియ పద్ధతిలో పంటలు పండిస్తూ, ఆ పంటలతోనే షెల్టర్ హోమ్ పిల్లలకు భోజనం పెడుతుండడం విశేషం. కరోనా కష్టకాలంలో గ్రామంలోని పాజిటివ్ పేషంట్లకు భోజనాన్ని పంపిణీ చేసింది. ‘‘నా చిన్నప్పటినుంచి పన్నెండేళ్ల వరకు షెల్టర్ హోంలో గడిపాను. దీంతో బయట సమాజంలో ఎలా ఉంటుందో తెలిసేది కాదు. శారీరక, మానసిక వైకల్యం లేని పిల్లల్ని ఎప్పుడూ కలవలేదు. ఎనిమిదో తరగతిలో చేరి కొత్తకొత్త పాఠ్యాంశాలను నేర్చుకోవడం, తోటి విద్యార్థులతో కలవడం కష్టంగా ఉండేది. రోజూ స్కూలు అవగానే అన్నయ్య దగ్గర బాధపడేదాన్ని. ‘‘నువ్వు ధైర్యాన్ని కోల్పోవద్దు నిన్ను నువ్వు గట్టిగా నమ్ము’’ అని వెన్ను తట్టి చెప్పేవారు. అ ప్రోత్సాహంతోనే ఎంసీఏ వరకు చదివాను. నాకు ఒకరు ఏవిధంగా చెయ్యందించారో అలానే నేను నాలాంటి వాళ్లకు సాయం చేయాలని ప్రేమ్ ఇల్లమ్‌లో పని చేస్తున్నాను. మేము సేంద్రియ పద్ధతిలో ఒక్కో పంటకు 25 బస్తాల ధాన్యాన్ని పండిస్తాము. అవి హోమ్‌లో ఉన్న పిల్లలకు సరిపోతాయి. కూరగాయలు, పండ్ల చెట్లు కూడా పెంచి పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం’’ అని ఇందిర చెప్పింది. పట్టుదలకు వైకల్యం అడ్డురాదని, ఎంతటి పనినైనా సాధించవచ్చని ఇందిర ‘ప్రేమ్ ఇల్లమ్’ నిరూపిస్తుంది. -
కాంగ్రెస్ సీనియర్ నేత కన్నుమూత
డెహ్రడూన్: ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకురాలు ఇందిరా హృదయేశ్ ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. ఏప్రిల్‌లో కోవిడ్ బారిన పడిన ఆమె కోలుకున్నారు. తర్వాత ఆమె గుండెకు శస్త్రచికిత్స కూడా జరిగింది. శనివారం రాష్ట్ర పార్టీ సమావేశానికి హాజరయ్యేందుకు ఢిల్లీ వచ్చిన ఆమె.. ఉత్తరాఖండ్ సదన్‌లో గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచినట్లు ఆమె కుమారుడు సుమిత్ హృదయేశ్ తెలిపారని ఉత్తరాఖండ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సూర్యకాంత్ వెల్లడించారు. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ స్థానం నుంచి ఎన్నికైన ఇందిర, రాష్ట్ర కాంగ్రెస్ అంత్యంత సీనియర్ నేతల్లో ఒకరు. ఆమె రాష్ట్ర ఆర్థిక మంత్రిగా 2012-2017 సంవత్సరాల్లో పనిచేశారు. ఇందిర మృతిపట్ల ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ సంతాపం ప్రకటించారు. -
జూడాల సమస్యలను పరిష్కరించాలి: ఇందిరాశోభన్
సాక్షి, హైదరాబాద్: కరోనా సమయంలో ప్రాణాలను ఫణంగా పెట్టి నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న జూనియర్ డాక్టర్లను తెలంగాణ సర్కార్ విస్మరించడం సరికాదని వైఎస్ షర్మిల ముఖ్య అనుచరురాలు ఇందిరాశోభన్ అన్నారు. కరోనా ఫస్ట్ వేవ్ లో జూడాలకు 10 శాతం ఇంటెన్సివ్ ఇస్తానన్న ప్రభుత్వం.. ఇప్పటి వరకు ఆ మాట నిలబెట్టుకోకపోవడం వల్లే సమ్మె అనివార్యమైందన్నారు. వేతనాల పెంపుపై గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, కరోనా బారిన పడ్డ జూడాలు, వారి కుటుంబ సభ్యులకు నిమ్స్‌లో ఐసోలేషన్ ఏర్పాటు చేయాలన్నారు. కరోనా పేషంట్లకు చికిత్స చేస్తున్న వారి ఆరోగ్యానికే భద్రత లేకుండా ఎలా అని ఇందిరాశోభన్ ప్రశ్నించారు. ఇటీవల గాంధీ ఆసుపత్రిని సందర్శించిన సీఎం కేసీఆర్.. జూనియర్ డాక్టర్ల సమ్మె నోటీసుపై ఆరా తీయకపోవడం దురదృష్టకరమన్నారు. ఆ రోజే వాళ్లని పిలిచి మాట్లాడి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. ముఖ్యమంత్రికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా జూడాలను చర్చలకు ఆహ్వానించి.. సమ్మెను విరమింపజేయాలన్నారు. కరోనా సమయంలో ప్రభుత్వం పంతాలకు పోకుండా.. జూనియర్ డాక్టర్లు, నర్సుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఇందిరాశోభన్ డిమాండ్ చేశారు. చదవండి: ‘కేసీఆర్.. మీది గుండెనా.. బండనా..?: వైఎస్ షర్మిల సమ్మె చేయడం మంచిది కాదు: సీఎం కేసీఆర్ -
ఈ రోజు నాకెంతో ప్రత్యేకం: మహేష్ బాబు
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్‌బాబు తల్లి ఇందిరా దేవి గురువారం పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మహేష్ తన తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తల్లితో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘ఏప్రిల్ 20. నా జీవితంలో అత్యంత ప్రత్యేకమైన రోజు. ఈ రోజు అమ్మ పుట్టినరోజు. హ్యపీ బర్త్‌డే అమ్మ’’ అంటూ తల్లిపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. కాగా ఇందిర.. నటుడు కృష్ణ మొదటి భార్య అన్న విషయం తెలిసిందే. (సందీప్ ఛాలెంజ్ స్వీకరించిన రాజమౌళి) April 20!! A very special day of the most special person in my life... Happy birthday Amma❤️❤️❤️ pic.twitter.com/OuxWEN4q7x — Mahesh Babu (@urstrulyMahesh) April 20, 2020 కాగా మహేష్ సోదరి మంజులా కూడా తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘తన వ్యక్తిత్వంలాగే అమ్మ ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. మా ప్రతి రోజును గొప్పగా తీర్చిదిద్దుతుంది. తన మంచితనం, అప్యాయత, ప్రేమ మా హృదయాలను తాకుతుంది. మా కుటుంబానికిక వెన్నుముక తను. మేము నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూ ఉంటాం’ అంటూ మంజులా ట్వీట్ చేశారు. The charmer that she is,she always wears a smile as beautiful as her personality.💛 She brightens up our day,has always touched our hearts with kindness,goodness,https://t.co/en89wteV3w the woman of the family,she truly is the backbone of it all,we love you.Happy Birthday Amma♥️ pic.twitter.com/nlvBN69p6S — Manjula Ghattamaneni (@ManjulaOfficial) April 20, 2020 కాగా మహేష్ తల్లి ఇందిర బయట కనిపించడం చాలా అరుదు. ఇందిర కృష్ణకు మేన మరదలు. 1961లో వీరి వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు ముగ్గురు కుమార్తెలు. అయితే కొంత కాలానికి కృష్ణ.. విజయ నిర్మలను వివాహం చేసుకున్నప్పటికీ మొదటి భార్య ఇందిరాను ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు. (యుద్ధభూమిలో ఉన్నాం.. : రష్మిక ) ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మహేశ్‌తోనే.. జక్కన్న క్లారిటీ -
దోషులను క్షమించడమా... ఆ ప్రసక్తే లేదు!
న్యూఢిల్లీ: నిర్భయ దోషులను క్షమించాలంటూ ప్రముఖ సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ చేసిన విజ్ఞప్తిపై నిర్భయ తల్లి తీవ్రంగా స్పందించారు. ఇందిరా అలాంటి సలహా ఎలా ఇవ్వగలరని మండిపడ్డారు. ఇలాంటి వాళ్ల వల్లే అత్యాచార బాధితులకు న్యాయం జరగడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడేళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషులను ఫిబ్రవరి 1 ఉదయం ఆరు గంటలకు ఉరి తీసేందుకు రంగం సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో... తాను నిర్భయ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని.. అయితే ఉరిశిక్షకు కూడా తాను పూర్తి వ్యతిరేకమని ఇందిరా జైసింగ్ పేర్కొన్నారు. ఈ మేరకు.. రాజీవ్ గాంధీ దోషులను సోనియా గాంధీ క్షమించినట్లుగానే.. నిర్భయ తల్లి కూడా నలుగురు దోషులను క్షమించాలని ట్విటర్ వేదికగా ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై స్పందించిన నిర్భయ తల్లి... ‘నాకు ఇలాంటి సలహా ఇవ్వడానికి అసలు ఇందిరా జైసింగ్ ఎవరు? దోషులను ఉరి తీయాలని దేశమంతా కోరుకుంటోంది. నిజానికి ఇందిరా లాంటి వల్లే అత్యాచార బాధితులకు న్యాయం జరగడం లేదు. అసలు ఆమె ఇంత ధైర్యం ఎలా చేయగలిగారు. సుప్రీంకోర్టు ఆవరణలో ఆమెను చాలాసార్లు నేరుగా కలిశాను. కానీ ఎప్పుడూ కూడా నా క్షేమ సమాచారాల గురించి ఆమె అడగలేదు. కానీ ఈరోజు దోషుల తరఫున మాట్లాడుతోంది. ఆమె లాంటి వాళ్లు రేపిస్టులకు మద్దతు పలుకుతూ జీవనోపాధి పొందుతూ ఉంటారు’ అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నిర్భయ తల్లి ఆశాదేవి ఆ నిర్ణయం తీసుకుంటారా? చావును వాడుకోకండి.. నిర్భయ తల్లి కన్నీటి పర్యంతం తనను రక్తపు మడుగులో చూశా.. బండరాయిని Asha Devi on senior lawyer Indira Jaising's statement 'follow Sonia Gandhi's example and forgive convicts': Who is Indira Jaising to give me such a suggestion?Whole country wants the convicts to be executed. Just because of people like her, justice is not done with rape victims. pic.twitter.com/k3DfgRQio3 — ANI (@ANI) January 18, 2020 -
జీవన శైలి వల్ల కూడా సంతాన లేమి
భారతదేశంలో సంతానం లేని వారి శాతం వేగంగా పెరుగుతోంది. జీవన శైలిలో వచ్చిన మార్పులతో పాటు అనేక కారణాలతో దేశంలో సుమారు 15 శాతం దంపతులు వంధ్యత్వంతో బాధపడుతున్నారు. వారిలో ఒక శాతం మంది మాత్రమే ఐ.వి.ఎఫ్., ఇతర అందుబాటులో ఉన్న చికిత్సా పద్ధతిని సద్వినియోగం చేసుకోగలుగుతున్నారు. ‘‘సంతానలేమి సమస్య ఎక్కువైందని, ఇందుకు పరిష్కార మార్గాలు ఉన్నప్పటికీ భారతదేశం వంటి విస్తారమైన దేశంలో కేవలం ఒక శాతం దంపతులకు మాత్రమే చికిత్స అందుబాటులో ఉండడం విచారకరం’’ అని ఇందిరా ఐ.వి.ఎఫ్. గ్రూప్ చైర్మన్ డా. అజయ్ ముర్దియా అంటున్నారు. ఇందిరా ఐవీఎఫ్ హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో నూతనంగా రెండు ఆస్పత్రులను ప్రారంభించింది. ఈ సందర్భంగా పిల్లలు లేని దంపతులకోసం సెప్టెంబర్ 10 వరకు ఉచిత అవగాహన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. -
ఇందిరా.. గో బ్యాక్..
సాక్షి, లింగాలఘణపురం: గో బ్యాక్.. గో బ్యాక్.. ఇందిరా గో బ్యాక్ అంటూ స్టేషన్‌ఘన్‌పూర్ మహాకూటమి అభ్యర్థి సింగపురం ఇందిరను కుందారంలో యువకులు అడ్డుకున్నారు. జనగామ జిల్లా ఉద్యమంలో కనిపించని ఇందిరా నేడు జఫర్గడ్ మండలాన్ని వరంగల్ అర్బన్ జిల్లాలో కలుతానంటూ ఇటీవల ఎన్నికల ప్రచారంలో మాట్లాడడం పట్ల మండలంలోని కుందారం గ్రామంలో ఆదివారం రాత్రి ఆమెకు వ్యతిరేకంగా యువకులు నినాదాలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి ఇందిరా రోడ్‌షో ఆదివా రం మండలంలోని నెల్లుట్ల నుంచి ప్రారంభించారు. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో కుందారం గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతున్న సమయంలో స్థానిక యువకులు కొంతమంది ఇందిరా గో బ్యాక్ అంటూ నినదిం చారు. జనగామ జిల్లా ఏర్పాటు ఉద్యమాల ఫలితంగా జరిగిందని, అలాంటి జిల్లా ఉనికి కోల్పో యే విధంగా జఫర్గడ్ మండలాన్ని అధికారంలోనికి వస్తే వరంగల్‌లో కలుపుతానని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. జిల్లా ఉద్యమ సమయంలో ఎక్కడ ఉన్నావంటూ ప్రశ్నించారు. దీంతో స్థానిక యువకులకు, కాంగ్రెస్, టీడీపీ నాయకులకు వాగ్వివాదం జరిగింది. జై జనగామ..జైజై జనగామ అంటూ పెద్ద ఎత్తున యువకులు నినదించారు. -
బాబొచ్చాడు.. బార్లొచ్చాయి...
బొబ్బిలి: బాబు వస్తే జాబొస్తుందని నమ్మించి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు వి.ఇందిర విమర్శించారు. సీఐటీయూ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మద్యం అమ్మకాలకు లక్ష్యాలు విధించి మద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఆదాయ వనరుగా పరిగణిస్తుందని, మీరయినా దృష్టి సారించి నియంత్రించాలని కోరుతూ ఐద్వా ఆధ్వర్యంలో రాష్ట్ర గవర్నర్‌కు లేఖలు రాశారు. జిల్లా వ్యాప్తంగా 20వేల లేఖలు రాయగా అందులో బొబ్బిలి ప్రాంతం నుంచే పదివేల లేఖలుండటం విశేషమని చెప్పారు. మద్యం కారణంగా మహిళలపై హింస, అత్యాచారాలు, వేధింపులు, హత్యలు పెరిగిపోతున్నాయన్నారు. మద్యానికి బానిసలై ఇంటిని పట్టించుకోకపోవడంతో మహిళలపై ఆర్థిక భారం పడుతుందన్నారు. యువత మద్యానికి బానిసవడంతో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. బెల్ట్ షాపులపై ఎక్సైజ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎక్కడ అమ్ముతున్నారో చూపించాలని ప్రశ్నిస్తున్నారని, అసలు ఎక్కడ అమ్మడం లేదో వారే చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళలకు రక్షణ కల్పించాలన్నారు. ఆమె వెంట కె.పుణ్యవతి, సీహెచ్ రమణమ్మ, పి.సత్తెమ్మ, ఎస్.రాముడమ్మ తదితరులు ఉన్నారు. -
ఇందిరకే అత్యంత ప్రజాదరణ
శతజయంతి ఉత్సవాల్లో రాష్ట్రపతి ప్రణబ్ న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య భారతంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేత మాజీ ప్రధాని ఇందిరా గాంధీయేనని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొనియాడారు. తిరుగులేని నిర్ణాయాత్మక నేతగా పేరు సంపాదించుకున్న ఆమెను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని కాంగ్రెస్ నాయకత్వానికి సందేశాన్నిచ్చారు. సంస్థాగత విషయాల్లో వేగంగా నిర్ణయాలు తీసుకోవటం అలవాటు చేసుకోవాలని సూచించారు. ఇందిర శతజయంతి ఉత్సవాల సందర్భంగా ‘ఇండియాస్ ఇందిర – ఎ సెంటెన్నియల్ ట్రిబ్యూట్’ పుస్తకాన్ని ప్రణబ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1978లో రెండోసారి కాంగ్రెస్ చీలిపోయిన తర్వాత నెలకొన్న దుర్భర పరిస్థితుల్లోనూ ఇందిర కేవలం రెండునెలల్లోనే ఎన్నికలు ఎదుర్కొని కేంద్రంలో, రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తెచ్చారన్నారు. ఇందుకు ఆమె వేగంగా, సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యమే కారణమన్నారు. ‘20వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా ప్రభావవంతమైన నాయకుల్లో ఆమె ఒకరు. ఆమె మరణించి ఇన్నేళ్లయినా నేటికీ ప్రజాస్వామిక భారతంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేత ఆమెనే’ అని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్, ఉప రాష్ట్రపతి అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ పాల్గొన్నారు. -
చిరస్మరణీయురాలు ఇందిరా గాంధీ
– కాంగ్రస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): మాజీ ప్రధాని, దివంగత ఇందిరాగాంధీ చిరస్మరణీయురాలని సీనియర్ కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖార్గే అన్నారు. శనివారం ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని డీసీసీ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుత.. ఇందిరా గాంధీ ప్రధామంత్రిగా పనిచేసిన సమయంలో బంగ్లా విముక్తికోసం పాకిస్తాన్‌పై యుద్ధం చేసి విజయం సాధించరన్నారు. పేదల కోసం బ్యాంకుల జాతీయికరణ, గరిబీ హఠవో, హరిత విప్లవాలను ప్రోత్సహించారన్నారు. పెద్దనోట్ల రద్దు వ్యవహారం వెనుక ఉన్న బండారాన్ని త్వరలో బయట పెడతామన్నారు. అనంతరం పార్టీ కార్యాలయం ఎదుట ఉన్న దామోదరం సంజీవయ్య విగ్రహానికి పూలమాల వేశారు. పార్టీ నాయకులంతా బైక్‌లపై ర్యాలీగా వచ్చి రాజ్‌విహార్‌లో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అక్కడి నుంచి కర్నూలు వ్యవసాయ మార్కెట్‌కు వెళ్లారు. ఉల్లిరైతును ఆదుకోవడంలో విఫలం ఉల్లిరైతును ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. గిట్టుబాటు ధర లేకపోవడంతో ఉల్లిని రోడ్లపైనే పడేయాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. ఈ సమస్యను పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్చార్జి కుంతియా, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రారావు, శాసనమండలిలో విపక్షనేత రామచంద్రయ్య, ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రులు కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, పనబాక లక్ష్మీ, కిల్లి కృపారాణి, కర్నూలు నియోజకవర్గ ఇన్చార్జి అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు. అతిథి గృహం నిర్వాహకులపై కోట్ల ఆగ్రహం రాష్ట్ర ప్రభుత్వ అతిథిగృహం నిర్వాహకులపై కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో విపక్షనేత మల్లికార్జున ఖర్గే ప్రెస్‌మీట్ నిర్వహణ కోసం మీటింగ్ హాల్‌ను ఇవ్వకపోడాన్ని తీవ్రంగా తప్పుపట్టాడు.అతిథి గృహం ఏమైనా కలెక్టర్/జేసీ సొంత ఆస్తినా అని ప్రశ్నించారు. ఐఏఎస్ అధికారులు అయి ఉండి తెలుగుదేశం ప్రభుత్వ ఏజెంట్లుగా పనిచేయడం దారుణమని మండిపడ్డారు. ఈ విషయాన్ని లోక్‌సభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. -
థ్రిల్లర్ సినిమాగా ఇందిరాగాంధీ ప్రసంగం..
న్యూఢిల్లీః అత్యంత ధైర్య సాహసాలు కలిగిన దేశ మహిళ, భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రసంగం.. సినిమాగా రూపొందుతోంది. 40 ఏళ్ళ క్రితం 1975 జూన్ 25న భారత్ లో ఎమర్జెన్సీని విధించి... ఆరోజు రాత్రి ఆల్ ఇండియా రేడియోలో ఆమె ప్రసంగించారు. ఇప్పుడు ఆ ప్రసంగం ప్రముఖ బాలీవుడ్ థ్రిల్లర్ సినిమా 'సన్ పఛత్తర్' గా విడుదల కాబోతోంది. ఎమర్జెన్సీ పై నలభై ఏళ్ళ క్రితం ఇందిరాగాంధీ ఇచ్చిన ప్రసంగం ఓ కథా చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రానికి 'డిటెక్టివ్ బ్యోమకేష్ బక్షయ్' ఫేమ్ సందీప్ మాధవన్ భయంకరమైన (పానిక్) సౌండ్ ట్రాక్ ను అందించారు. ఆల్ ఇండియా రేడియోలో 1975 జూన్ 25న ఇందిరాగాంధీ ఇచ్చిన ప్రసంగంపై రూపొందుతున్న ఈ కథా చిత్రానికి సంబంధించిన అన్ని ఆడియో హక్కులను ఆల్ ఇండియా రేడియోనుంచి, వీడియో హక్కులను ఫిల్మ్ డివిజన్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకుంటున్నట్లు చిత్ర నిర్మాత కబీర్ లోవీ ఓ ప్రకటనలో తెలిపారు. 'సన్ పఛత్తర్' సినిమాలో స్టార్ నటుడు కె కె మెనన్, ప్రవేశ్ రాణా, కీర్తి కుల్హారీలు నటిస్తుండగా, 'తమాన్ ఛే' ఫేమ్ నవనీత్ బెహల్ దర్శకత్వంలో ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.