హైదరాబాద్‌లో ఇందిరా ఐ.వి.ఎఫ్. నూతన ఆసుపత్రిని ప్రారంభిస్తున్న ఐవీఎఫ్ స్పెషలిస్ట్ డాక్టర్ శిల్పారెడ్డి
భారతదేశంలో సంతానం లేని వారి శాతం వేగంగా పెరుగుతోంది. జీవన శైలిలో వచ్చిన మార్పులతో పాటు అనేక కారణాలతో దేశంలో సుమారు 15 శాతం దంపతులు వంధ్యత్వంతో బాధపడుతున్నారు. వారిలో ఒక శాతం మంది మాత్రమే ఐ.వి.ఎఫ్., ఇతర అందుబాటులో ఉన్న చికిత్సా పద్ధతిని సద్వినియోగం చేసుకోగలుగుతున్నారు. ‘‘సంతానలేమి సమస్య ఎక్కువైందని, ఇందుకు పరిష్కార మార్గాలు ఉన్నప్పటికీ భారతదేశం వంటి విస్తారమైన దేశంలో కేవలం ఒక శాతం దంపతులకు మాత్రమే చికిత్స అందుబాటులో ఉండడం విచారకరం’’ అని ఇందిరా ఐ.వి.ఎఫ్. గ్రూప్ చైర్మన్ డా. అజయ్ ముర్దియా అంటున్నారు. ఇందిరా ఐవీఎఫ్ హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో నూతనంగా రెండు ఆస్పత్రులను ప్రారంభించింది. ఈ సందర్భంగా పిల్లలు లేని దంపతులకోసం సెప్టెంబర్ 10 వరకు ఉచిత అవగాహన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment