
బాలీవుడ్ ఫేమస్ జంటల్లో ఇషితా దత్తా- వత్సల్ సేత్ ఒకరు. తెలుగులో చాణక్యుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ఆ తర్వాత బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో కనిపించింది. సినిమాలతోపాటు పలు బాలీవుడ్ సీరియల్స్‌లో నటించిన ఇషితా దత్తా.. ఆ తర్వాత బాలీవుడ్ నటుడు వత్సల్ సేథ్‌ను పెళ్లాడింది. ఇప్పటికే వీరిద్దరికీ వాయు అనే కుమారుడు కూడా జన్మించాడు. గతంలో తన కుమారుడిని ఫేస్ రివీల్ చేస్తూ ఫోటోలను షేర్ చేసింది.
అయితే ఈ ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా ఆమె భర్త వత్సల్ సేత్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో బిడ్డను తమ ఇంటికి ఆహ్వానించబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. '9 ఏళ్ల పరిచయం.. ఎనిమిదేళ్ల ప్రేమ.. గుర్తుగా ఓ చిన్న ప్రేమ.. త్వరలోనే మా హృదయాలు మళ్లీ కలవబోతున్నాయి' అంటూ వాలైంటైన్ డే రోజున పోస్ట్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సైతం వత్సల్ సేత్ ఈ వార్తలను ధృవీకరించారు. ఇషితా రెండోసారి గర్భం ధరించడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసిందని.. అంతేకాకుండా చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇషిత నాకు ప్రెగ్నెన్సీ గురించి చెప్పినప్పుడు.. ఒక తండ్రిగా నేను సంతోషించానని తెలిపారు. కాగా.. ఇషితా దత్తా, వత్సల్ సేత్ 2017లో పెళ్లి చేసుకున్నారు. 'రిష్టన్ కా సౌదాగర్ - బాజీగర్' అనే టీవీ సీరియల్ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. జూలై 19 2023న తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు.
సినిమాల విషయానికొస్తే ఇషిత దత్తా చివరిసారిగా థ్రిల్లర్ చిత్రం 'దృశ్యం 2'లో కనిపించింది ప్రస్తుతం ఆమె మరో ప్రాజెక్ట్‌లో నటిస్తోంది. మరోవైపు వత్సల్ చివరిగా 'ఆదిపురుష్' చిత్రంలో కనిపించారు. ఝార్ఖండ్‌లో పుట్టి పెరిగిన ఇషితా దత్తా.. 2004లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. 2012లో తెలుగులో వచ్చిన చాణక్యుడు సినిమాలో హీరోయిన్‌గా నటించింది. హిందీలో దృశ్యం 1, దృశ్యం 2 , ఫిరంగి, బ్లాంక్ వంటి చిత్రాల్లో నటించింది.
Comments
Please login to add a commentAdd a comment