టాలీవుడ్ హీరోయిన్ అమలాపాల్ పండంటి బిడ్డకు జన్మినిచ్చింది. గతేడాది తన ప్రియుడు జగత్ దేశాయ్‌ను పెళ్లాడిన ముద్దగుమ్మ గతంలోనే ప్రెగ్నెన్సీని ప్రకటించింది. తాజాగా ఇవాళ మగబిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. బిడ్డను ఇంటికి తీసుకెళ్తున్న వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న సినీతారలు, అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా.. గతేడాది తన ప్రియుడు జగత్ దేశాయ్‌ను అమలా పాల్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈనెల 11 వ తేదీన బిడ్డకు జన్మనిచ్చినట్లు ఇన్‌స్టా ద్వారా పంచుకుంది. దాదాపు వారం రోజుల తర్వాత బిడ్డ పుట్టిన విషయాన్ని వెల్లడించింది.
కాగా.. మైనా చిత్రం ద్వారా కోలీవుడ్‌లో పాపులర్ అమలా పాల్, తమిళం, తెలుగు, మలయాళ చిత్రాల్లో నటించింది. నీలతమర (2009) అనే మలయాళ చిత్రంతో రంగప్రవేశం, ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్స్ హీరోలతో కలిసి నటించింది. తెలుగులో ఇద్దరమ్మాయిలతో చిత్రంలో నటించింది. ఇటీవల పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఆడు జీవితం(ది గోట్ లైఫ్) చిత్రంతో అభిమానులను మెప్పించింది.
Comments
Please login to add a commentAdd a comment