బాలీవుడ్ భామ, టాలీవుడ్ హీరోయిన్ ఆర్తి చాబ్రియా ఇటీవల బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలు నెట్టింట వైరలయ్యాయి. త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వనుందని వార్తలొచ్చాయి. కానీ తాజాగా ఆర్తి చాబ్రియా ఫ్యాన్స్‌కు గట్టి షాక్ ఇచ్చింది. ఇప్పటికే తాను బిడ్డకు జన్మనిచ్చి నెల రోజులు పూర్తయిందని రాసుకొచ్చింది. ఇదొక అద్భుతమై, కష్టమైన ప్రయాణమని రాసుకొచ్చింది. మార్చి 4వ తేదీన మగబిడ్డకు జన్మనిచ్చినట్లు వెల్లడించింది. తన బిడ్డకు యువన్ అని పేరు కూడా పెట్టినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా..2019లో విశారద్ బీదాస్సీని పెళ్లాడింది.
అయితే యువన్ పుట్టకముందే తనకు గర్భస్రావం అయిందని ఛాబ్రియా వెల్లడించింది. గతంలో తనకు గర్భస్రావం జరిగిందని.. అందుకే తన ప్రెగ్నెన్సీ గురించి ముందుగా మాట్లాడకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. 41 ఏళ్ల వయసులో డెలివరీ కావడం అంటే.. 20 లేదా 30 ఏళ్లలో ఉన్నంత సులభం కాదని నటి చెప్పుకొచ్చింది. అయితే ఇది నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిందని.. కానీ ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేరని అన్నారు. కేవలం బిడ్డను కనాలని మహిళలపై ఒత్తిడి తెస్తున్నారని ఆర్తి అన్నారు. చివరికీ నేను ఆశలు వదులుకున్న టైంలో ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్‌గా వచ్చిందని.. దీంతో నేను, నా భర్త చాలా ఆనందంగా ఫీలయ్యామని తెలిపింది.
ఆర్తి తన ఇన్‌స్టాలో రాస్తూ..' ఈ ఫోటో మిమ్మల్ని మోసం చేయదు. ఎందుకంటే ఈ ప్రయాణం అంత సులభం కాదు. తల్లి కావాలనుకుంటున్న మహిళలకు.. ఆ కోరిక తీరనప్పుడు పడే బాధ, కష్టాలు నాకు తెలుసు. ఎందుకంటే నేను చాలా కష్టాలు పడ్డాను. నేను ఎప్పుడు నవ్వుతూ, అందంగా కనిపించగలను కాబట్టి ఇది చాలా సులభమని నేను ఎప్పుడూ అనుకోను. కానీ చివరికి ఆ దేవుడు నా పట్ల దయతో ఉన్నాడు. మన కోరుకున్న దానికోసం ఒత్తిడికి దూరంగా ఉంటే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు మనకు అంతా మంచే జరుగుతుంది.' అని రాసుకొచ్చింది.
కాగా.. ఆర్తి చాబ్రియా బాలీవుడ్‌లో ఆవారా పాగల్ దీవానా, షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా, తుమ్సే అచ్చా కౌన్ హై, షాదీ నంబర్ 1 వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. చాబ్రియా చివరిసారిగా 2013లో విడుదలైన పంజాబీ చిత్రం వ్యాహ్ 70 కిమీలో కనిపించింది. అప్పటి నుంచి ఆమె పెద్దగా సినిమాల్లో నటించలేదు. టాలీవుడ్‌లో మధుర క్షణం, ఒకరికి ఒకరు, ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి సినిమాలు చేసింది. చింతకాయల రవి మూవీలో ఐటం సాంగ్‌లో మెరిసింది. తెలుగులో చివరగా గోపి గోడ మీద పిల్లి చిత్రంలో నటించింది.
Comments
Please login to add a commentAdd a comment