త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్‌.. భర్తపై ‍అలాంటి పోస్ట్! | Amala Paul Shares Emotional Post About Her Husband, Goes Viral On Social Media | Sakshi

Amala Paul: త్వరలోనే అమ్మ కాబోతున్న అమలాపాల్.. పోస్ట్ వైరల్!

May 6 2024 9:14 PM | Updated on May 7 2024 10:34 AM

Amala Paul Pens Heartful Note About Her Husband

టాలీవుడ్ హీరోయిన్ అమలాపాల్ తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. నాయక్ మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన భామ స్టార్‌ హీరోల సరసన మెప్పించింది. ఇటీవలే రిలీజైన పృథ్వీరాజ్ సుకుమారన్ మూవీ ఆడుజీవితం(గోట్ లైఫ్) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే గతేడాది ప్రియుడు జగత్‌ దేశాయ్‌ను అమలాపాల్ పెళ్లి చేసుకుంది.

ఆ తర్వాత అభిమానులకు గుడ్‌ న్యూస్‌ కూడా చెప్పింది. ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్న ముద్దుగుమ్మ తాజాగా చేసిన పోస్ట్‌ నెట్టింట వైరలవుతోంది. ఈ సందర్భంగా తన భర్త జగత్‌ దేశాయ్‌పై ప్రశంసలు కురిపించింది. ప్రెగ్నెన్సీ ధరించిన సమయం నుంచి తనకు అన్ని విధాలుగా అండగా నిలిచారని కొనియాడారు.

అమలాపాల్ తన ఇన్‌స్టాలో రాస్తూ..' నాతో పాటు అర్థరాత్రి వరకు ఉంటూ.. నా ఇబ్బందులను ఒక్కొక్కటిగా తగ్గిస్తూ.. నాపై మీకున్న అచంచలమైన నమ్మకం.. మీ ఉత్తేజపరిచే మాటలు నాలో శక్తిని నింపాయి. ఈ విలువైన గర్భధారణ ప్రయాణంలో నా వెన్నంటే ఉన్నందుకు ధన్యవాదాలు. నా ఆత్మవిశ్వాసం సన్నగిల్లిన  క్షణాల్లో కూడా నాకు మద్దతుగా నిలిచారు. మీలాంటి అపురూపమైన వ్యక్తి నా జీవితంలోకి రావడం.. నిజంగా నేను ఏదో అద్భుతమైనా చేసి ఉండాలి. నా శక్తి, ప్రేమ తిరుగులేని మద్దతు ఉన్నందుకు ధన్యవాదాలు. నేను చెప్పే మాటలకంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నా' అంటూ పోస్ట్‌ చేసింది. ఇది చూసిన అభిమానులు బ్యూటీఫుల్ కపుల్ అంటూ పోస్టులు పెడుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement