Tollywood Anchor Lasya Manjunath Blessed With Baby Boy, Pic Goes Viral - Sakshi
Sakshi News home page

Lasya Manjunath: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన లాస్య.. సోషల్ మీడియాలో వైరల్

Published Wed, Mar 8 2023 6:48 PM | Last Updated on Wed, Mar 8 2023 7:58 PM

Tollywood Anchor Lasya Manjunath Blessed With baby Boy - Sakshi

టాలీవుడ్ యాంకర్‌ లాస్య మరోసారి తల్లి కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. హోలీ సందర్భంగా బిడ్డ పుట్టడంతో లాస్య కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. చేతులకు రంగులు అద్దుకుని సెలబ్రేట్ చేసుకున్న ఓ వీడియోను షేర్ చేసింది. సోషల్ మీడియాలో ఇది చూసిన అభిమానులు లాస్యకు కంగ్రాట్స్ చెబుతున్నారు. 

గతంలో సోషల్ మీడియాలో పలుసార్లు ఫోటోలు, వీడియోలు పంచుకున్నారు. ఇటివలే ఆమెకు కుటుంబ సభ్యులు సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించారు. ఒక రోజు ముందే బిడ్డ ఆమెను గందరగోళానికి గురి చేస్తున్నాడంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను కూడా షేర్‌ చేసింది. కాగా.. చీమ ఏనుగు జోక్స్‌తో బాగా పాపులర్‌ అయిన లాస్య పలు టీవీ షోలకు యాంకర్‌గా వ్యవహరించింది. పెళ్లి తర్వాత కెరీర్‌కు కాస్త గ్యాప్‌ ఇచ్చిన లాస్య సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఫ్యాన్స్‌తో షేర్‌ చేస్తుంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement