Anchor Lasya
-
బుజ్జి.. ఇక పోట్లాడుకుంది చాలు.. ఇప్పటికైనా..! (ఫోటోలు)
-
ఇస్మార్ట్ జోడీ 3కి రంగం సిద్ధం: ఎవరెవరు పాల్గొంటున్నారంటే?
ప్రేమ అంటే ఓ మ్యాజిక్. ఆ మ్యాజిక్‌తో స్టార్ మా "ఇస్మార్ట్ జోడి సీజన్ 3"ని ప్రారంభిస్తోంది. గత రెండు సీజన్లు విజయవంతంగా ముగించుకుని ఇప్పుడు మూడో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. యాంకర్ ఓంకార్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న ఈ షోలో సెలబ్రిటీ జంటల మధ్య అనుబంధానికి, అన్యోన్యతకు, అనురాగానికి కావాల్సినంత వినోదాన్ని జోడించనున్నారు.ఈ షోలో ప్రదీప్- సరస్వతి, అనిల్ జీలా- ఆమని, అలీ రెజా- మసుమా, రాకేష్- సుజాత, వరుణ్- సౌజన్య, యష్- సోనియా, మంజునాథ- లాస్య, ఆదిరెడ్డి- కవిత, అమర్ దీప్- తేజు జంటలు పాల్గొంటున్నారు. కొత్తగా పెళ్లి చేసుకున్నవారు, కొంత జీవితం చూసినవారు, సలహాలు సూచనలు ఇచ్చే స్థాయి అందుకున్నవారు అంద ఉన్నారు.ఈ షో వినోదంతో అలరించడమే కాదు, ఆలోచింపచేస్తుంది. జంటలు మరింత ప్రేమగా ఉండేందుకు పరోక్షంగా సలహాలిస్తుంది. బంధం బలంగా ఉండడానికి ఏం చేయాలో సూచనలిస్తుంది. స్టార్ మా లో ఈ శనివారం(డిసెంబర్ 21) రాత్రి 9 గంటలకు ఇస్మార్ట్ జోడి సీజన్ 3 ప్రారంభం కానుంది. ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. -
ఫ్యామిలీతో గోవా బీచ్‌లో చిల్ అవుతున్న యాంకర్ లాస్య (ఫోటోలు)
-
రెండో కుమారుడికి శాంతి పూజ చేయించిన యాంకర్ లాస్య (ఫోటోలు)
-
నీ భార్యగా గర్వపడుతున్నా.. భర్తపై యాంకర్ లాస్య ఎమోషనల్ పోస్ట్
ప్రముఖ యాంకర్, బిగ్‌బాస్ ఫేం లాస్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అప్పట్లో యాంకర్ రవితో జతకట్టి బుల్లితెరపై అలరించింది. ఈ క్రమంలో ప్రేమ పెళ్లి చేసుకున్న లాస్య అనంతరం యాంకరింగ్ గుడ్‌బై చెప్పింది. ప్రస్తుతం గృహిణిగా ఇంటి బాధ్యతలు చూసుకుంటుంది. అలాగే యూట్యూబ్ చానల్‌ను రన్ చేస్తుంది. ఇటీవల రెండో బిడ్డకు జన్మనిచ్చిన ఆమె తాజాగా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. గురువారం(మార్చి 16న)లాస్య భర్త మంజునాథ్ బర్త్‌డే. ఈ సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో భర్తపై ప్రేమ కురిపిస్తూ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. చదవండి: హీరోగా కొడుకు లుక్ షేర్ చేస్తూ మురిసిపోయిన యాంకర్ సుమ ‘హ్యాపీ బర్త్‌డే మంజునాథ్.. నువ్వు నన్ను నవ్వించావు. నా కన్నీళ్లు తుడిచావు. నన్ను గట్టిగా హత్తుకున్నావు. నా సక్సెస్‌ను చూశావు. నా వైఫల్యాలను చూశావు. ఎలాంటి సమయంలోనైన నా పక్కనే నిలిచి ధైర్యాన్ని ఇచ్చావు. లవ్ యూ’ అంటూ రాసుకొచ్చింది. అంతేకాదు ఓ పర్పెక్ట్ హస్బెండ్‌కు భార్యగా గర్వపడుతున్నానంటూ లాస్య భావోద్వేగానికి లోనైంది. ప్రస్తుతం ఆమె పోస్ట్ ఆమె ఫ్యాన్స్‌ని, ఫాలోవర్స్‌ని బాగా ఆకట్టుకుంటోంది. మంజునాథ్‌కు బర్త్‌డే విషెస్ తెలుపుతూ క్యూట్ కపుల్ అంటూ వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: అనారోగ్యంతో ఆస్పత్రి పాలైన ‘చిన్నారి పెళ్లి కూతురు 2’ నటి View this post on Instagram A post shared by Lasya Chillale (@lasyamanjunath) -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన యాంకర్ లాస్య
టాలీవుడ్ యాంకర్ లాస్య మరోసారి తల్లి కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. హోలీ సందర్భంగా బిడ్డ పుట్టడంతో లాస్య కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. చేతులకు రంగులు అద్దుకుని సెలబ్రేట్ చేసుకున్న ఓ వీడియోను షేర్ చేసింది. సోషల్ మీడియాలో ఇది చూసిన అభిమానులు లాస్యకు కంగ్రాట్స్ చెబుతున్నారు. గతంలో సోషల్ మీడియాలో పలుసార్లు ఫోటోలు, వీడియోలు పంచుకున్నారు. ఇటివలే ఆమెకు కుటుంబ సభ్యులు సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించారు. ఒక రోజు ముందే బిడ్డ ఆమెను గందరగోళానికి గురి చేస్తున్నాడంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను కూడా షేర్ చేసింది. కాగా.. చీమ ఏనుగు జోక్స్‌తో బాగా పాపులర్ అయిన లాస్య పలు టీవీ షోలకు యాంకర్‌గా వ్యవహరించింది. పెళ్లి తర్వాత కెరీర్‌కు కాస్త గ్యాప్ ఇచ్చిన లాస్య సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్డేట్స్ను ఫ్యాన్స్‌తో షేర్ చేస్తుంటుంది. View this post on Instagram A post shared by Lasya Chillale (@lasyamanjunath) -
కడుపులో బేబీ ఇలా గందరగోళం చేస్తుంది.. వీడియో షేర్ చేసిన లాస్య
యాంకర్ లాస్య మరోసారి తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. ఇటివలే ఆమెకు కుటుంబ సభ్యులు సీమంతం వేడుకను ఘనంగా జరిపించారు. ప్రస్తుతం లాస్యకు తొమ్మిదో నెల. కాగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే లాస్య తాజాగా ఓ ఆసక్తికర వీడియోను షేర్ చేసింది. తొమ్మిదో నెలలో బిడ్డ ఆమెను గందరగోళానికి గురి చేస్తున్నాడంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేసింది. చదవండి: లాక్డౌన్లో ఆర్థిక కష్టాలు.. అంతలోనే లగ్జరీ హోం ఓనర్!: కమెడియన్ రఘు ఇల్లు చూశారా? ‘ఈ తొమ్మిదో నెల ప్రెగ్నెన్సీలో బేబీ గందరగోళానికి గురిచేస్తుంది. 8వ నెల కంటే తొమ్మిదో నెలలోనే బేబీ కదలికలు ఎక్కువగా ఉంటాయి. తరచూ తంతూ ఉంటుంది. మీరే చూడండి’ అంటూ తన బేబీ బంప్ వీడియో షేర్ చేసింది. ప్రస్తుతం నెలలు నిండిన లాస్య త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతుంది. దీంతో ఆమెకు తన ఫాలోవర్స్, ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చదవండి: గుసగుసలేం లేవు.. సీక్రెట్‌గా పెళ్లి తంతు.. ఫ్యాన్స్‌కు షాకిచ్చిన స్టార్స్ వీరే! View this post on Instagram A post shared by Lasya Chillale (@lasyamanjunath) -
సీమంతం వేడుకలో డ్యాన్స్‌తో అదరగొట్టిన లాస్య.. వీడియో వైరల్
ప్రముఖ యాంకర్ లాస్య మంజునాథ్ మరోసారి తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. కొన్నాళ్ల క్రితమే తాను గర్భం దాల్చినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది లాస్య. తాజాగా ఆమె సీమంతం వేడుకలు గ్రాండ్‌గా జరిగాయి. ఈ వేడుకలో బిగ్‌బాస్‌లో సందడి చేసిన మెహబూబా, దేత్తడి హారిక, గీతూ రాయల్ తదితరులు పాల్గొన్ని హల్ చేశారు. ఇప్పటికే లాస్య సీమంతంకు సంబంధించిన సీమంతం ఫోటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. View this post on Instagram A post shared by Lasya Chillale (@lasyamanjunath) తాజాగా లాస్య సీమంతంకు సంబంధించిన వీడియోలను అభిమానులతో పంచుకుంది. అందులో లాస్య భర్త మంజునాథ్ ఆమెను స్టేజ్‌పైకి తీసుకెళ్లడం.. మెడలో దండేసి, తిలకం పెట్టి, నుదుటిపై ముద్దు ఇస్తున్నాడు. అలాగే మరో వీడియోలో ఓ హిందీ పాటకు స్నేహితులతో కలిసి లాస్య డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా 2017లో మంజునాథ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది లాస్య. 2019లో ఈ దంపతులకు ఓ కుమారుడు జన్మించాడు. View this post on Instagram A post shared by Lasya Chillale (@lasyamanjunath) -
ఘనంగా యాంకర్ లాస్య సీమంతం ఫంక్షన్...ఫోటోలు వైరల్
-
ఘనంగా యాంకర్ లాస్య సీమంతం వేడుక, ఫొటోలు వైరల్
యాంకర్ లాస్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. చీమ ఏనుగు జోక్స్‌తో బాగా పాపులర్ అయిన లాస్య పలు టీవీ షోలకు యాంకర్‌గా వ్యవహరించింది. పెళ్లి తర్వాత కెరీర్‌కు కాస్త గ్యాప్ ఇచ్చిన లాస్య సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్డేట్స్ను ఫ్యాన్స్‌తో షేర్ చేస్తుంటుంది. ఇదిలా ఉంటే లాస్య మరోసారి తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల తాను మరోసారి గర్భవతి అయినట్లు భర్త మంజునాథ్‌తో కలిసి సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. తాజాగా ఆమె సీమంతం వేడుక ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లాస్య సీమంతం వేడుకలో బిగ్‌బాస్ ఫేం గీతూ రాయల్, టీవీ నటి సుష్మ ఇతర బుల్లితెర నటీనటులు సందడి చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by 👑 𝑮𝒆𝒆𝒕𝒖 𝑹𝒐𝒚𝒂𝒍 👑 (@geeturoyal_) -
రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న యాంకర్ లాస్య
యాంకర్ లాస్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. చీమ ఏనుగు జోక్స్‌తో బాగా పాపులర్ అయిన లాస్య పలు టీవీ షోలకు యాంకర్‌గా వ్యవహరించింది. పెళ్లి తర్వాత కెరీర్‌కు కాస్త గ్యాప్ ఇచ్చిన లాస్య సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్డేట్స్ను ఫ్యాన్స్‌తో షేర్ చేస్తుంటుంది. తాజాగా తన సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి అభిమానులతో పంచుకుంది. నేను మరోసారి గర్భవతినయ్యాను. సెకండ్ బేబీ ఆన్ ప్రాసెస్ అంటూ భర్తతో కలిసి దిగిన ఫోటోను షేర్చేసుకుంది. దీంతో బుల్లితెర సెలబ్రిటీలు సహా నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం లాస్య షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Lasya Chillale (@lasyamanjunath) -
హాస్పిటల్ బెడ్‌పై లేవలేని స్థితిలో యాంకర్ లాస్య.. వీడియో వైరల్
ప్రముఖ యాంకర్ లాస్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. చీమ ఏనుగు జోక్స్‌తో కూడా బాగా పాపులర్ ఆమె యాంకర్‌గా స్టేజీపై ఆమె చేసే సందడి అంతా ఇంతా కాదు. కొంతకాలంగా బుల్లితెరకు గ్యాప్ ఇచ్చిన లాస్య తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా అలరిస్తుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోలతో నెట్టింట సందడి చేస్తుంది. అయితే తాజాగా లాస్య హాస్పిటల్ పాలైంది. ఈ విషయాన్ని స్వయంగా లాస్య భర్త మంజునాథ్ తన ఇన్‌స్టా స్టోరీలో చెప్పుకొచ్చారు. గెట్ వెల్ సూన్ అంటూ ఓ పోస్ట్‌ను షేర్ చేశారు. దీంతో యాంకర్ లాస్యకు ఏమైందంటూ ఆమె ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. లాస్య హాస్పిటల్లో ఎందుకు చేరిందన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు. మరోవైపు ఆమె త్వరగా కోలుకోవాలంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. -
ర్యాప్ సాంగ్ ఇరగదీసిన యాంకర్, అట్లుంటది లాస్యతోని!
యాంకర్ లాస్య.. బుల్లితెర ప్రేక్షకులకు తెలియని పేరు కాదు. టీవీ షోలలో యాంకర్‌గా అలరించిన ఆమె బిగ్‌బాస్ తెలుగు నాల్గో సీజన్లోనూ పాల్గొని జనాలను ఎంటర్టైన్ చేసింది. లాస్య టాక్స్ ద్వార యూట్యూబ్‌లోనూ వినోదాన్ని పంచుతున్న ఆమె తాజాగా ర్యాప్ సాంగ్ పాడింది. దీనికి సంబంధించిన వీడియోను ఆమె తన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసింది. ప్రపంచమంతా తల్లుల దినోత్సవం జరుపుకుంటే వీళ్లేమో నాకు తలనొప్పిలా తయారయ్యారు.. అన్న డైలాగ్స్‌తో మొదలు పెట్టిన లాస్య చివరికి ర్యాప్ సాంగ్ పాడి అందరినీ ఓ ఊపు ఊపేసింది. 'ఏజ్ బార్ అనుకోవద్దు న్యూ ఏజ్ మామ్ నేను.. ర్యాప్‌తోని ఇరగదీస్తా సావేజ్ మామ్ నేను.. బాసాన్లు తోమమంటే సాకులన్ని చెప్తవు.. బుక్కు ముందు పెట్టుకుని గురక పెట్టి పంటవు.. అంటూ పాటతో అదరగొట్టింది లాస్య. ఇక ఇంగ్లీష్ ఆల్ఫబెట్స్లోని A టు Z వరకు అన్ని లెటర్స్‌తో లైన్స్ రాసి మ్యాజిక్ క్రియేట్ చేశారు రోల్ రైడా, మనోజ్ జూలూరి. మొత్తానికి ఈ సాంగ్ మాత్రం అద్భుతంగా ఉందంటున్నారు ఫ్యాన్స్. ఇక ఈ పాటను తల్లీబిడ్డలందరికీ అంకితం ఇస్తున్నట్లు తెలిపింది లాస్య. చదవండి: ఆ డైరెక్టర్స్ మన మంచితనాన్ని అలుసుగా తీసుకుని వాడుకుంటారు.. ఫ్యాన్స్‌కు మహేశ్‌బాబు రిక్వెస్ట్, సోషల్ మీడియాలో లేఖ వైరల్ -
అన్నయ్యకు ఎలక్ట్రిక్ బైక్ గిఫ్ట్ ఇచ్చిన యాంకర్ లాస్య
యాంకరింగ్‌లో లాస్యది డిఫరెంట్ స్టైల్. సరదాగా, చలాకీగా మాట్లాడుతూ ప్రేక్షకులను తన వాగ్ధాటితో కట్టిపడేస్తుంది. బిగ్‌బాస్ షో తర్వాత అటు యాంకర్‌గానే కాకుండా యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ అభిమానులను అలరిస్తోంది. ఇటీవలే అత్తారిల్లును చూపించిన లాస్య తాజాగా తన అన్నయ్యకు బైక్ గిఫ్ట్‌గా ఇచ్చింది. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియో రిలీజ్ చేసింది. 'మా అన్నయ్య సెకండ్ హ్యాండ్లో స్కూటీ తీసుకుని ఇప్పటికీ అదే వాడుతున్నాడు. అతడికి ఒక మంచి బైక్ బహుమతిగా ఇవ్వాలనుకున్నాం. కానీ మేము ఆర్డర్ చేసిన మూడు నెలలకు డెలివరీ చేస్తామన్నారు. అతడి బర్త్‌డే నవంబర్లోనే అయిపోతే మేమిప్పుడు గిఫ్ట్ ఇచ్చాము. మొదట మేము మూడు వేలు పెట్టి ఆథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేశాం. కానీ మా అన్నయ్యను మాటల్లో పెట్టి ఏ బైక్ ఇష్టమో ఆరా తీస్తే యునికాన్ నచ్చుతుందన్నాడు. దీంతో రూ.1000 పెట్టి ఓ యునికాన్ బైక్ కూడా బుక్ చేశాం. ఈ రెండింటిలో ఏది తీసుకోవాలా? అని తెగ ఆలోచించాను' చదవండి: హాట్ టాపిక్‌గా శ్రుతిహాసన్ రెమ్యునరేషన్.. చిరు సినిమాకు అన్ని కోట్లా ? 'అన్నయ్యవాళ్లకు పెట్రోల్ ఖర్చులు మిగులుతాయని ఎలక్ట్రిక్ స్కూటర్‌కే మొగ్గు చూపాను. అన్నయ్యను షోరూమ్‌కు తీసుకొచ్చి అతడి చేతికి బైక్ తాళాలు అందించి సర్ప్రైజ్ చేశాం' అని చెప్పుకొచ్చింది లాస్య. ఈ బైక్ ధర దాదాపు లక్షన్నర రూపాయలు ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా అన్నయ్యకు బైక్ కొనిచ్చిన లాస్యను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. భర్తకు కారు, నాన్నకు ట్రాక్టర్, ఇప్పుడు అన్నయ్యకు బైక్ గిఫ్ట్ ఇవ్వడం మామూలు విషయం కాదంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: కోట్లు ఖరీదు చేసే ఆస్తులు గిఫ్ట్‌గా ఇస్తే షాకయ్యారు! అంతా సురేఖ వల్లే! -
Home Tour: ఇల్లు అమ్మేస్తామని చెప్పిన యాంకర్ లాస్య.. కారణమిదే!
చీమ జోకులతో, చలాకీ యాంకరింగ్‌తో బాగా ఫేమస్ అయింది లాస్య మంజునాథ్. బిగ్‌బాస్ నాలుగో సీజన్లోనూ పాల్గొన్న లాస్య అటు షోలతో పాటు యూట్యూబ్ చానల్లోనూ సందడి చేస్తుంది. తాజాగా ఆమె తన అత్తారిల్లును అభిమానులకు చూపించే ప్రయత్నం చేసింది. ఈ మేరకు యూట్యూబ్ చానల్లో అత్తగారి హోమ్ టూర్ వీడియోను షేర్ చేసింది. ఈ సందర్భంగా ఇంటి విశేషాలు వెల్లడిస్తూ.. తన భర్త మంజునాథ్ తాతయ్య ఈ ఇల్లును రూ.25 వేలకే కట్టించాడంది. ఈ ఇంటిని కట్టించి దాదాపు 50 ఏళ్లు అవుతుందని పేర్కొంది. ఇప్పుడు అత్తామామ తమతో పాటే సిటీలో ఉంటున్నారని, త్వరలోనే ఈ ఇల్లును అమ్మేయబోతున్నట్లు వెల్లడించింది. ఇక ఈ ఇంటికి రెండు గుమ్మాలతో పాటు విశాలమైన గదులున్నాయి. హాల్, డైనింగ్ టేబుల్‌కో రూమ్, రెండు కిచెన్లు, దేవుడి రూమ్, బెడ్ రూమ్స్, స్టోర్ రూమ్ ఉన్నాయి. మోడ్రన్ మహాలక్ష్మి షోలో ఒక ఫ్రిజ్ గెలిచానని, అది ఈ ఇంట్లోనే ఉందని చూపించింది. ఇంటి ముందు రెండు కొబ్బరి చెట్లు, పెరట్లో మూడు మామిడి చెట్లు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అలా ఈ హౌస్‌తో తనకు ఉన్న అనుబంధాలను ఒక్కొక్కటినీ వివరించుకుంటూ పోయింది. -
నాన్న కోసం ఇష్టంతో ఇల్లు కట్టిస్తున్నా: యాంకర్ లాస్య
యాంకర్ లాస్య.. హోస్టింగ్‌తోనే కాదు, చీమ ఏనుగు జోక్స్‌తో కూడా బాగా పాపులర్ ఆమె. యాంకర్‌గా స్టేజీపై ఆమె చేసే సందడి అంతా ఇంతా కాదు. గతంలో కొన్నాళ్లపాటు బుల్లితెరకు దూరమైన లాస్య ఈమధ్య టీవీ షోలతో బిజీబిజీగా మారింది. అలాగే వీలున్నప్పుడు యూట్యూబ్‌లో వీడియోలు కూడా చేస్తోంది. తాజాగా ఆమె తన తండ్రికి ఇల్లు కట్టిస్తోంది. ఈ విషయాన్ని అభిమానులకు వెల్లడించిన లాస్య ఈమేరకు ఓ వీడియోను రిలీజ్ చేసింది. 'నేను చిన్నప్పుడు ఉన్న ఇంటిని ఆ మధ్య కూలగొట్టాం కదా, దాని స్థానంలో కొత్తింటిని కట్టిస్తున్నాము. ఇప్పటికే అది చాలావరకు పూర్తయింది' అంటూ ఆ ఇల్లును చూపించింది. నాన్న కళ్లలో ఆనందం చూడటానికి నేనేదైనా చేస్తాను. ఆయన సంతోషం చూస్తుంటే కడుపు నిండిపోతుంది. ఆయన కోసం ఇష్టంతో ఇల్లు కట్టిస్తున్నానంటూ గదులన్నింటినీ చూపించింది. గృహప్రవేశం చేసేటప్పుడు తప్పకుండా పూర్తిగా చూపిస్తామని చెప్పుకొచ్చింది. అలాగే తండ్రికి గిఫ్టిచ్చిన ట్రాక్టర్‌ను చూపించడమే కాకుండా అందులో ఎక్కి తిరిగింది. -
యాంకర్ రవి కారులో.. సీక్రెట్స్ బయటపెట్టేసిన లాస్య
బుల్లితెరపై యాంకర్ రవి-లాస్య జోడీకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. 'సమ్‌థింగ్ స్పెషల్' అనే ప్రోగ్రాం ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న ఈ జోడీ కొన్ని కారణాల వల్ల విడిపోయిన సంగతి తెలిసిందే. అప్పటిదాకా టామ్ అండ్ జెర్రీలా కలిసున్న వీరు బహిరంగంగానే ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శలు చేసుకోవడం అప్పట్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. దాదాపు ఐదేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ వీరిద్దరూ కలిసిపోయారు. దీంతో మరోసారి ఆన్‌స్ర్కీన్‌పై రవి-లాస్య సందడి చేస్తున్నారు. ఒకానొక దశలో వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఇంకెప్పుడో కలిసి షోలు చేయం అని భీష్మించుకున్న ఈ జంట కొందరు మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా మళ్లీ కలిసారు. దీంతో ఈ జోడీకున్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకొని స్పెషల్ ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నారు షో నిర్మాతలు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రవి-లాస్య తామిద్దరం మళ్లీ ఎలా కలిశారు? అప్పుడు నెలకొన్న పరిస్థితులు సహా పలు విషయాలపై చర్చించారు. ఈ క్రమంలోనే రవికి సంబంధించిన ఓ సీక్రెట్‌ను లాస్య బయటపెట్టేసింది. సోషల్ మీడియా, ఫోన్, శానిటైజర్..ఈ మూడు లేకుండా రవి బతకలేడని, ఎక్కడకి వెళ్లినా ఈ మూడు తప్పనిసరి అని పేర్కొంది. అంతేకాకుండా ఇప్పుడైతే కరోనా సమయమని అందరం చాలా ఎక్కువగా శానిటైజర్ వాడుతున్నామని, అయితే రవి మాత్రం కరోనాకు ముందు నుంచే శానిటైజర్ వాడే అలావాటుందని పేర్కొంది. తన కారులో ఎప్పుడూ ఓ శానిటైజర్ బాటిల్ ఉంటుందని, ఏదైనా ముట్టుకుంటే వెంటనే శానిటైజర్ రాసుకుంటాడని తెలిపింది. చదవండి : లాస్యకు క్షమాపణలు చెప్పిన యాంకర్ రవి పెళ్లి కాలేదని చెప్పి..వేరే అమ్మాయిలతో నటుడి ఎఫైర్స్ -
లవ్ పాఠాలు నేర్పిస్తున్న దేత్తడి పాప, సెట్ చేసుకో అంటున్న లాస్య
♦ ఒకటి కాదు రెండు కాదు నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నానంటోన్న పరిణీతి చోప్రా ♦ 'భేడియా' షెడ్యూల్ హోగయా అంటున్న కృతీసనన్ ♦ సూరీడు ముద్దులు పెడుతున్నాడంటోన్న జాన్వీ కపూర్ ♦ నన్ను అక్కడికి తీసుకెళ్లండి అంటోన్న ప్రీతి జింటా ♦ నవ్వును కోల్పోకండి అంటున్న పూజా రామచంద్రన్ ♦ రేపు ఘనంగా ఉండాలంటే నిన్నటి కంటే ఎక్కువగా శ్రమించాల్సిందే అంటోన్న శిల్పాశెట్టి ♦ సెట్ చేసుకోవాలంటున్న యాంకర్ లాస్య ♦ దీనికి క్యాప్షన్ ఇవ్వొచ్చుగా అంటోన్న రెజీనా కసాండ్రా View this post on Instagram A post shared by Parineeti Chopra (@parineetichopra) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Preity G Zinta (@realpz) View this post on Instagram A post shared by Pooja Ramachandran (@pooja_ramachandran) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Regina Cassandra (@reginaacassandraa) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Keerthi Pandian (@keerthipandian) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Vidyu Raman (@vidyuraman) -
జున్ను బర్త్‌డే: లాస్య గ్రాండ్ పార్టీ
బిగ్‌బాస్ హౌస్‌కు వెళ్లివచ్చిన తర్వాత యాంకర్ లాస్య బుల్లితెర మీద మళ్లీ సందడి చేస్తోంది. యాంకర్ రవితో కలిసి ప్రోగ్రామ్ చేస్తున్న ఆమె ఓవైపు యాంకరింగ్‌తో, మరోవైపు యూట్యూబ్ వీడియోలతో అభిమానులను అలరిస్తోంది. తాజాగా ఆమె తన కొడుకు జున్ను బర్త్‌డేను పురస్కరించుకుని గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసింది. దీనికి కామెడీ స్టార్స్‌తో పాటు అఖిల్, మోనాల్ గజ్జర్, అషూ రెడ్డి, సోహైల్ సహా పలువురు బిగ్‌బాస్ సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా జున్నుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ పార్టీలో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. ఇక లాస్య కూడా కొడుకుతో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. "హ్యాపీ బర్త్‌డే జున్ను బేటా.. నువ్వు నా అదృష్టానివి కన్నమ్మ.. ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి.. బ్లెస్ యు బేటా.." అని రాసుకొచ్చింది. అతడికి దక్ష్ అని నామకరణం చేసినట్లు రివీల్ చేసింది. View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) కాగా లాస్యది ప్రేమ వివాహం. 2010లో ఆమె తను ప్రేమించిన మంజునాథ్‌తో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. ఈ విషయాన్ని ఏడేళ్లు దాచిపెట్టింది. చివరకు పెద్దలను ఒప్పించి అందరి సమక్షంలో 2017లో మరోసారి మంజునాథ్‌తో ఏడడుగులు నడిచింది. తర్వాత ఐదు నెలలకే గర్భం దాల్చింది, కానీ అది నిలవలేదు. ఇక మరుసటి ఏడాదే జున్ను జన్మించడంతో లాస్య మాతృత్వపు మాధుర్యాన్ని అనుభవించింది. చదవండి: జున్ను వచ్చాక నా లైఫ్ మారిపోయింది: లాస్య ఆ ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి -
భర్తకు ఖరీదైన కారు గిఫ్టిచ్చిన లాస్య
యాంకర్ లాస్య. ఈ పేరు తెలియని టీవీ ప్రేక్షకులు లేరనడంలో అతిశయోక్తి లేదు. ప్రముఖ యాంకర్‌గా పాపులారిటీ గడించిన ఆమె తన వ్యక్తిగత జీవితంలోని ఆటుపోట్లు కారణంగా బుల్లితెర మీద నుంచి నెమ్మదిగా పక్కకు జరిగింది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడటం, పెద్దలను ఒప్పించి మరోసారి అదే వ్యక్తితో వేదమంత్రాల సాక్షిగా, కుటుంబ సభ్యుల సమక్షంలో భర్త వేలు పట్టుకుని ఏడడుగులు నడిచింది. ఆమె యాంకర్‌గా తిరిగి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న సమయంలో మరోసారి బిగ్‌బాస్ షో నుంచి పిలుపు వచ్చింది. ఈసారి ఆలోచించింది, షోలో పాల్గొనేందుకు ఓకే చెప్పింది. అలా బిగ్‌బాస్ నాల్గో సీజన్లో అడుగు పెట్టిన లాస్య తన అభిమానులను మెప్పించింది. అనవసర విషయాల్లో తలదూర్చకుండా తన పనేదో తను చేసుకుపోయింది. కానీ అందరికీ వండి పెడుతూ వంటలక్కలా స్థిరపడిపోయింది. తన ప్రేమ, పెళ్లి విషయాలు చెప్తూ ఎన్నోసార్లు కంటతడి పెట్టింది. సోమవారం వారి పెళ్లి రోజు. ఈ సందర్భంగా లాస్య కొత్త కారు కొంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 500 కారు కొనుగోలు చేసి భర్తకు కానుకగా ఇచ్చింది. దీని ధర పదహారు లక్షల పైమాటే! View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) ప్రత్యేకమైన రోజుల్లో ఇలాంటి బహుమతినిస్తే ఎంత సంతృప్తిగా ఉంటుందో?! మేము ఇప్పుడు దీనిలో ఓ రౌండ్ వేసుకొస్తాం అని రాసుకొచ్చింది. ఇక నిన్న పెళ్లిరోజును పురస్కరించుకుని మంజునాథ్‌తో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకుంది. ఏ అనుబంధంలోనూ మంచి రోజులే ఉండవు. తుపానులా చుట్టేసే కష్టం ఎదురొచ్చినా సరే ఒకే గొడుగు కింద ఉండి దాన్ని ఎదుర్కొందాం. ఆ శక్తి మనకు ప్రేమ అందిస్తుంది అని భావోద్వేగ నోట్ రాసుకొచ్చింది. తన ప్రేమ కథను చెప్తూ ఓ స్పెషల్ వీడియోను తన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసింది. View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) చదవండి: లాస్య ఛానెల్ హ్యాక్: హ్యాపీ అంటున్న నోయల్ బిగ్‌బాస్: అరియానా ఖాతాలో అరుదైన ఘనత సినిమాలు తెలుగోడి దమ్ము చూపిస్తున్నాయి -
లాస్య ఛానెల్ హ్యాక్: హ్యాపీ అంటున్న నోయల్
బిగ్‌బాస్ నాల్గో సీజన్లో పాల్గొన్న యాంకర్ లాస్య సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ఆమె మాటలకు తోడు కొడుకు జున్ను అల్లరిని కూడా కెమెరాల్లో చిత్రీకరించి లాస్య టాక్స్ ద్వారా వినోదాలను పంచుతోంది. కొత్త కొత్త కాన్సెప్టులతో ముందుకు వస్తూ ఫ్యాన్స్‌ను ఎంటర్టైన్ చేస్తూనే ఉంది. అయితే సడన్‌గా ఈ ఎంటర్టైన్మెంట్కు బ్రేక్ పడింది. అదేంటి అంటారా? ఎనిమిది లక్షల మందికి పైగా సబ్‌స్ర్కైబర్లు ఉన్న లాస్యటాక్స్ ఛానల్ హ్యాక్ అయింది. ఈ విషయాన్ని లాస్య స్వయంగా వెల్లడించింది. అయితే తన ఛానల్‌ను ఎవరు? ఎందుకు? హ్యాక్ చేశారో తెలీట్లేదని చెప్పుకొచ్చింది. కానీ ఈ విషయాన్ని వేరేవాళ్లు చెప్పేవరకు తనకు తెలియలేదని పేర్కొంది. దీనిపైన తన టెక్నికల్ టీమ్ పని చేస్తోందని, తప్పకుండా లాస్య టాక్స్ తిరిగి వస్తుందని చెప్పుకొచ్చింది. అయితే లాస్య ఛానల్ హ్యాక్ అయినందుకు నోయల్ చాలా సంతోషపడ్డాడు. "మా లాస్య అకౌంట్ హ్యాక్ చేశారంటే ఆమె ఎంత తోపు, తురుము? అని పొగిడాడు. ఎదిగేవాళ్ల అకౌంట్లే హ్యాక్ అవుతాయ్. నా అకౌంట్ కూడా ఒకప్పుడు హ్యాక్ అయింది. ఇలాంటివి వంద అకౌంట్లు నువ్వు క్రియేట్ చేయగలుగుతావు, అయినా నీ అకౌంట్ తిరిగొస్తుందిలే" అని భరోసా ఇచ్చాడు. (చదవండి: బిగ్‌బాస్‌కు ఎందుకు వెళ్లానా అనిపించింది: నోయల్) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) -
లాస్యకు క్షమాపణలు చెప్పిన యాంకర్ రవి
బుల్లితెరపై ఎంతోమంది యాంకర్లు ఉన్నా రవి-లాస్య జోడీకి ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. టీఆర్పీ రేటింగ్‌లోనూ వీరిద్దరి కాంబో హిట్ పెయిర్‌గా నిలిచింది. రవి-లాస్య జోడీకి సెలబ్రిటీలు సైతం ఫిదా అయ్యారంటే వీరిద్దరి కాంబినేషన్ ఎంతపెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'సమ్‌థింగ్ స్పెషల్' అనే ప్రోగ్రాం ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న ఈ జోడీ కొన్ని కారణాల వల్ల విడిపోయారు. అప్పటిదాకా టామ్ అండ్ జెర్రీలా కలిసున్న వీరు బహిరంగంగానే ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శలు చేసుకోవడం అప్పట్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. పెళ్లి తర్వాత బుల్లితెరకు కొంచెం గ్యాప్ ఇచ్చిన లాస్య తాజాగా బిగ్‌బాస్ సీజన్-4లో పాల్గొన్న సంగతి తెలిసిందే. కాగా దాదాపు 5 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఈ క్యూట్ పెయిర్ మళ్లీ తెరపై కనిపించనున్నారు. ఈ విషయన్ని స్వయంగా యాంకర్ రవి తన ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా వెల్లడించాడు. సంక్రాంతి స్పెషల్ వేడుకగా వీరిద్దరితో 'స్టార్‌మా' వాళ్లు ఓ షో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ స్పెషల్ ఈవెంట్‌తో రవి-లాస్య కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. View this post on Instagram A post shared by Anchor Ravi (@anchorravi_offl) -
బిగ్‌బాస్: చతికిలపడ్డ కంటెస్టెంట్లు వీళ్లే
అంగరంగ వైభవంగా ప్రారంభమైన బిగ్‌బాస్ నాల్గో సీజన్లో 19 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. 16 మందితో మొదలైన షోలో మరో మూడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చి చేరాయి. కానీ ఏ వైల్డ్ కార్డ్ కంటెస్టెంటు కూడా ఫినాలేకు చేరుకోలేకపోయింది. కొందరు మెరుపు తీగల్లా వచ్చి వెళ్లిపోగా, భారీ అంచనాల మధ్య వచ్చిన మరికొందరు మాత్రం ఉనికిని కూడా చాటుకోలేక అభిమానులను నిరుత్సాహానికి గురి చేశారు. అలాంటి కంటెస్టెంట్లు ఎవరెవరే చూద్దాం... సూర్యకిరణ్ తన కోపమే తన శత్రువు అన్న వాక్యం దర్శకుడు సూర్య కిరణ్ విషయంలో అక్షరాలా నిజమైంది. ఎదుటి వాళ్లు చెప్పేది వినకుండా, ప్రతిదానికి చిర్రుబుర్రులాడేవాడు. అందుకే షోలో అడుగు పెట్టిన మొదటి వారమే షో నుంచి నిష్క్రమించాడు. కానీ తను హౌస్‌లో ఉండాల్సిన వ్యక్తి అని, ఇలా ఎలిమినేట్ అయిపోతాననుకోలేదని చెప్పుకొచ్చాడు. కానీ రెమ్యూనరేషన్ మాత్రం ఊహించినదానికన్నా పది రెట్లు ఎక్కువే ఇచ్చారని చెప్పాడు. (చదవండి: వారం రోజులకు లక్షల్లో ఇచ్చారు) కరాటే కల్యాణి అప్పుడే కోప్పడుతూ అప్పుడే ఏడుస్తూ కల్యాణి ఎవరికీ ఓ పట్టాన అర్థం కాలేదు. చిన్నచిన్న విషయాలకు కూడా పెద్ద రాద్ధాంతం చేసేది. అలా ఆమె పెద్దపెద్దగా కేకలేస్తూ అందరి మీద నోరు పారేసుకోవడంతో సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేశారు. చాలామందితో కయ్యం పెట్టుకుని చివరికి రెండో వారంలో హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. కానీ ఆమె అమ్మ రాజశేఖర్‌తో కలిసి అందరినీ తెగ ఎంటర్టైన్ చేసేది. (చదవండి: అభిజిత్ బిగ్‌బాస్‌కే గర్వకారణం) స్వాతి దీక్షిత్ ఇంట్లో మూడో వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చిన బొద్దు గుమ్మ స్వాతి దీక్షిత్. ఆమె ఎంట్రీ, ఎలిమినేషన్ రెండూ అందరినీ సర్ప్రైజ్ చేశాయి. ఇంట్లోకి వెళ్లగానే ఆమెను ఇంప్రెస్ చేసేందుకు అబ్బాయిలు పోటీపడ్డారు. చివరికి ఆమె అభిజిత్‌తో కనెక్ట్ కావడం, అభిజిత్-హారిక మధ్య గ్యాప్ రావడం, ఇంతలో ఆమె ఎలిమినేట్ కావడం చకచకా జరిగిపోయాయి. (చదవండి: స్వాతిలో అది నాకు నచ్చలేదు: లాస్య) యాంకర్ లాస్య లాస్య అనగానే గుర్తొచ్చేది చీమ-ఏనుగు జోకులు. ఆమె వేసే జోకులకు ఎవరూ నవ్వకపోయినా ఆమె మాత్రం పడీపడీ నవ్వేది. కానీ ఈ నవ్వే ఆమెకు నానాపేర్లు తెచ్చిపెట్టింది. ఫేక్ స్మైల్, కవరింగ్ స్మైల్ అంటూ మిగతావాళ్లు లాస్య గురించి ఎన్నో అన్నారు. ఇది పక్కన పెడితే ఈ యాంకర్ నుంచి ఆమె అభిమానులు ఎంతగానో ఆశించారు. కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్కు మ్యాచ్ అవకుండా ఆమె కిచెన్లోనే ఉండిపోయి వంటలక్కగా మారిపోయింది. టాస్కుల్లోనూ వెనకబడిపోయింది. (చదవండి: టాప్ 2: లాస్య జోస్యం నిజమయ్యేనా?) జోర్దార్ సుజాత తెలంగాణ యాసలో మాట్లాడే ఈ యాంకర్ కిలకిలా నవ్వుతూనే ఉండేది. ఎప్పుడు చూసినా లాస్యతో కలిసి ఇంట్లో జరిగే విషయాల గురించి గుసగుసలు పెట్టేది. అలా ఆమెకు గాసిప్ క్వీన్ అన్న ముద్ర పడిపోయింది. అయితే వ్యాఖ్యాత నాగార్జునను పట్టుకుని ఆమె బిట్టూ అని పిలవడం చాలామందికి నచ్చలేదు. దీంతో ఐదోవారంలోనే ముల్లెమూట సర్దుకుని ఇంటిబాట పట్టింది. బయటకు వచ్చాక సుజాత మాట్లాడుతూ తనను బిట్టూ అని బిగ్‌బాస్ యూనిటే పిలవమని చెప్పిందంటూ తనపై జరుగుతున్న ట్రోలింగ్‌కు గట్టి సమాధానం ఇచ్చింది. (చదవండి: బిట్టూ అని వాళ్లే పిలవమన్నారు: సుజాత) కుమార్ సాయి బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టిన మొట్ట మొదటి వైల్డ్ కార్డ్ కంటెస్టెంటు. ఎవరితోనూ కలవలేక, క్లారిటీ లేని సమాధానాలతో కన్ఫ్యూజన్ మాస్టర్‌గా నిలిచాడు. కొన్ని టాస్కుల్లో బాగా ఆడి కెప్టెన్ అయినప్పటికీ హౌస్‌లో ఉన్నానా? లేనా? అన్నట్టుగా ఉండటంతో అతడిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. హౌస్‌లో కూడా ఇంటిసభ్యులు కుమార్‌ను తమలో ఒకరుగా ఫీల్ అవలేదు. దీంతో అతడు ఏకాకిగా మారిపోయాడు. చివరికి ఏడో వారంలో హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. కానీ నాగార్జున స్క్రిప్ట్ చెప్పాలన్న కోరికకు నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సంతోషంగా వీడ్కోలు తీసుకున్నాడు. -
మోనాల్‌తో మాట్లాడమని అభికి చెప్పేవాళ్లం: లాస్య
బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చాక వంటలక్కలా మారిన లాస్య పదకొండో వారం ఎలిమినేట్ అయింది. అయితే షో నుంచి వెళ్లిపోతున్నానన్న బాధ కన్నా తన కుటుంబాన్ని కలుస్తానన్న సంతోషమే ఆమెను ఉక్కిరిబిక్కరి చేసింది. దీంతో ఆనందంగా హౌస్మేట్స్ దగ్గర నుంచి వీడ్కోలు తీసుకుంది. ఇక ఈ సీజన్ మొత్తంలో హైలెట్‌గా నిలిచిన అఖిల్, మోనాల్, అభిజిత్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ గురించి యాంకర్ లాస్య స్పందించింది. తను చూసినంతవరకు హౌస్‌లో లవ్స్టోరీలేమీ లేవని చెప్పుకొచ్చింది. (చదవండి: బిగ్‌బాస్ బిగ్ షాక్.. వరస్ట్ పెర్ఫార్మర్గా అభిజిత్) "అభిజిత్‌కు మోనాల్ మీద ఎలాంటి ఫీలింగ్ లేదు. పైగా ఒకే ఇంట్లో ఉండి మాట్లాడకపోతే బాగోదని ఆమెతో మాట్లాడమని అభికి మేమే చెప్పేవాళ్లం. అటు అఖిల్, మోనాల్ కూడా క్లోజ్ ఫ్రెండ్స్. అఖిల్ మోనాల్ తన బెస్ట్ ఫ్రెండ్ అని, మోనాల్ కూడా అఖిల్ తన బెస్ట్ ఫ్రెండ్ అనే చెప్పేవాళ్లు. ఎప్పుడూ వాళ్ల నోటి నుంచి లవ్ అనేది రాలేదు. అలాంటప్పుడు వాళ్ల మధ్యలో ఏదో ఉందని మేం ఎందుకు అనుకుంటాం? కొన్ని మెంటాలిటీలు కొందరికి మాత్రమే ట్యూన్ అవుతారు. అలాగే నేను, అభి, నోయల్, హారికలు ట్యూన్ అయ్యాం. అదే విధంగా అఖిల్ మోనాల్ క్లోజ్ అయ్యారు. నేనైతే వాళ్లను బెస్ట్‌ఫ్రెండ్స్ అనే అంటాను. అయితే ఎలాంటి క్లిప్పింగులు చూపించారో నాకు తెలీదు. కానీ బయట మాత్రం ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీలా కనిపించిందంటున్నారు. కానీ లోపల మాత్రం అలాంటిదేమీ లేదు" అని లాస్య స్పష్టం చేసింది. (చదవండి: టాప్ 2లో ఉండేది ఆ ఇద్దరే: లాస్య) -
టాప్ 2: లాస్య జోస్యం నిజమయ్యేనా?
బిగ్‌బాస్ నాల్గో సీజన్ పదకొండో వారంలో లాస్య జున్నును కలిసేందుకు ఇంటికి వెళ్లిపోయింది. అసలే లాస్య ఇల్లు విడిచి 70 రోజులు దాటిపోవడంతో జున్ను ఆమెను పూర్తిగా మార్చిపోయాడు. దీంతో ఆమె జున్ను చెంతకు చేరి తల్లి ప్రేమ కురిపించి మళ్లీ దగ్గరకు తీసుకోనుంది. ఇక వెళ్తూ వెళ్తూ కిచెన్ బాధ్యతలనే బిగ్‌బాంబ్‌ను ఆమెకు ఎంతో ఇష్టమైన వ్యక్తి మీద వేసింది. వాళ్లెవరు? నేటి బిగ్‌బాస్ ఎపిసోడ్ ఎలా సాగిందో తెలియాలంటే ఈ స్టోరీ మీద ఓ కన్నేయండి.. సేఫ్‌గా ఆడటం మీ స్ట్రాటజీనా? సండేను ఫండేగా మార్చేందుకు సిద్ధమైన నాగార్జున ఇంటి సభ్యులను రెండు టీమ్‌లుగా విడగొట్టారు. అవినాష్, అరియానా, సోహైల్, మోనాల్ ఏ టీమ్‌గా మిగిలినవారు బీ టీమ్‌గా ఏర్పడ్డారు. వీరికి కొన్ని ఫొటోలను చూపించి దాని ఆధారంగా పాటల పేర్లను చెప్పమని గేమ్ ఆడించారు. పోటాపోటీగా సాగిన ఈ గేమ్ ముగిసేసరికి బీ టీమ్ గెలిచింది. బీ టీమ్ కెప్టెన్ హారిక సేఫ్ అయినట్లు నాగ్ ప్రకటించారు. అనంతరం ఓ ప్రేక్షకురాలు సంధించిన ప్రశ్నను వినిపించారు. సేఫ్‌గా ఆడటం మీ గేమ్ స్ట్రాటజీనా అని ఓ అభిమాని లాస్యను అడగ్గా తాను సేఫ్ గేమ్ ఆడటం లేదని ఆమె స్పష్టం చేసింది. తర్వాత మోనాల్ సేఫ్ అయినట్లు నాగ్ ప్రకటించారు. (చదవండి: సెల్ఫ్‌డబ్బా కొట్టుకున్న హారిక) అవినాష్‌కు నెయిల్ పాలిష్ రుద్దిన సోహైల్ ఇంటిసభ్యులతో వెరైటీగా లూడో గేమ్ ఆడించారు. ఇందులో సోహైల్, అవినాష్ ఉన్న అరియానా టీమ్‌లో మోనాల్, మిగిలిన సభ్యులు ఉన్న హారిక టీమ్‌లో అభిజిత్ డైస్ రోల్ చేశారు. సోహైల్, అఖిల్ డైస్ రోల్ చేసిన నంబర్ల ఆధారంగా ఒక్కో గడిని దాటుకుంటూ ముందుకు వెళ్లారు. ఇందులో సోహైల్ నోటితో నెయిల్ పాలిష్‌ను అవినాష్ వేళ్లకు అందంగా రుద్దాడు. అటు అఖిల్ రొమాంటిక్ సాంగ్‌ను ఏడుస్తూ, ఫాస్ట్ ఫార్వర్డ్‌లో, స్లో మోషన్లో ఖూనీ చేయకుండా పాడి మెప్పించాడు. తర్వాత లాస్య నాలుక బయటపెట్టి డైలాగులు చెప్పడం అందరికీ నవ్వు తెప్పించింది. అరియానా సేఫ్, లాస్య అవుట్ ఇక అవినాష్ ఒక్క నిమిషంలో చీర కట్టుకుని చిందులు వేయగా.. రాత్రి తొమ్మిది తర్వాత నువ్వు చేసేది ఇదే అన్నమాట అని నాగ్ కౌంటర్ వేశారు. ఈ దెబ్బతో తన పెళ్లి సంబంధాలు గోవిందా అని డీలా పడ్డ అవినాష్ తర్వాత టాస్కులో భాగంగా నిమ్మకాయను నమిలిపారేశాడు. మొత్తానికి లూడో గేమ్‌లో అరియానా టీమ్ గెలవగా హారిక టీమ్ ఓడిపోయింది. తర్వాత అభిజిత్, అరియానా సేఫ్ అయినట్లు ప్రకటించగా లాస్య ఎలిమినేట్ అయినట్లు వెల్లడించారు. (చదవండి: సోషల్ మీడియాలో అభిజిత్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ..) అందరి కన్నా వీక్ అనుకున్నా.. స్టేజీ మీదకు వచ్చిన లాస్య ముందుగా తన నవ్వు నిజమైనదేనని, కన్నింగ్ కాదని చెప్పుకొచ్చింది. ఆ విషయం ప్రేక్షకులకు కూడా తెలుసని నాగ్ భరోసా కల్పించారు. తర్వాత లాస్య.. సోహైల్, అభిజిత్ టాప్ 2లో ఉంటారని జోస్యం చెప్పింది. దీంతో భావోద్వేగానికి సోహైల్.. అందరికన్నా వీక్ అనుకున్నా కానీ అక్క టాప్ 2లొ ఉంటాను చెప్పగానే ఈ మాట చాలు అనిపించిందని చెప్పుకొచ్చాడు. అవినాష్.. ఎంటర్టైనర్ కానీ నామినేషన్‌ను తీసుకోలేడని చెప్పింది. మోనాల్ బాగా ఆడుతుంది కానీ కన్ఫ్యూజన్లో ఉంటుందని పేర్కొంది. అరియానా బోల్డ్‌గా మాట్లాడుతుంది, కానీ కొన్నిసార్లు తప్పును కూడా ఒప్పుకోవాలని సలహా ఇచ్చింది. (చదవండి: మొదటిసారి నాకు ముద్దు పెట్టావు: అఖిల్) అభిజిత్ అంటే ఇష్టం అంటూనే అతడిపై బిగ్‌బాంబ్ సోహైల్‌కు ఎంత కోపం వస్తుందో అంత త్వరగా కరిగిపోతుంది అని చెప్పుకొచ్చింది. అఖిల్ బాగా ఆడతాడు. కానీ కోపం ఎక్కువ. ఎదుటివాళ్లకు మాట్లాడే అవకాశం ఇవ్వడని, అది మార్చుకోమని సూచించింది. అభి నాకు చాలా ఇష్టం. అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తాడు. హారికతో సమయం గడపడం మరీమరీ ఇష్టం. అల్లరి పిల్ల. తనకు అన్యాయం జరిగిందని అనిపిస్తే వాదించి సాధిస్తుంది. తను టాప్ 3 నుంచి 1కి వెళ్లాలని తెలిపింది. అనంతరం కింగ్ ఆఫ్ ద కిచెన్ బిరుదును అభిజిత్‌కు ఇచ్చింది. దీంతో వారం రోజుల పాటు వంట చేయాలన్న బిగ్‌బాంబ్ అభి మీద పడింది. కానీ అభి మాత్రం బ్రేక్‌ఫాస్ట్ ఒక్కటే చేస్తానని చెప్పేశాడు. (చదవండి: అభి, నీ బ్రదర్‌ను బాగా చూసుకో: అఖిల్ అమ్మ) -
బిగ్‌బాస్‌లో వంటలక్క చివరి డ్యాన్స్!
బిగ్‌బాస్ ఇచ్చే టాస్కులు ఒకత్తైతే అందరికీ వండి పెట్టడమనేది మరో ఎత్తు. మొదటి విషయాన్ని పక్కన పెడితే బిగ్‌బాస్ హౌస్‌లో మొదటి వారం నుంచి కంటెస్టెంట్లందరి కోసం వంట చేస్తూ వస్తోంది లాస్య. ఏమాత్రం విసుక్కోకుండా అడిగిన వారికి అన్నీ చేసి పెట్టేది. కానీ ఇదే వంట వల్ల ఓసారి నామినేషన్లోకీ వచ్చింది. ఆమె చేసిన పప్పు వల్ల ఇంటిసభ్యులు అనారోగ్యానికి గురయ్యారంటూ దివి లాస్యను నామినేట్ చేసింది. అది ఫ్రిజ్‌లో పెట్టిన పప్పు వల్ల.. కానీ తను వండటం వల్ల కాదని లాస్య తిప్పికొడుతూ ఏడ్చేసింది. ఆ సమయంలో గంగవ్వ కూడా లాస్యను వెనకేసుకొచ్చింది. ఇలా మాటలు పడ్డా కూడా అందరి కడుపు నింపేందుకు మళ్లీ వంటింట్లోనే దూరిన ఆమెకు నెటిజన్లు వంటలక్క అని పేరు కూడా పెట్టేశారు. కానీ ఏం లాభం.. ఈ వారం ఆమె ఎలిమినేట్ అయిందంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. పోటీ పెరుగుతోంది, కంటెస్టెంట్లు తగ్గుతున్నారు ఇదిలా వుంటే స్టార్ మా.. 'హౌస్ నుంచి వెళ్లిపోయేది ఎవరు?' అంటూ లేని ఆసక్తిని కల్పించడానికి ప్రోమోను రిలీజ్ చేసింది. ఇందులో అందరూ సంతోషంగా డ్యాన్సులు చేస్తున్న సమయంలో 'రోజురోజుకీ పోటీ పెరిగిపోతోంది.. రోజురోజుకీ హౌస్మేట్స్ తగ్గిపోతున్నారు' అంటూ నాగార్జున ఎలిమినేషన్ గురించి ప్రస్తావించారు. దీంతో కంటెస్టెంట్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్లు ఎలిమినేట్ అయింది ఎవరో మాకు తెలుసుగా అంటున్నారు. ఎలిమినేట్ అవుతానని తెలీని మా వంటలక్క లాస్య ఆనందంతో షోలో చివరి సారిగా డ్యాన్స్ చేస్తుందని కామెంట్లు చేస్తున్నారు. (మోనాల్ సేఫ్, లాస్య ఎగ్జిట్!) ఒక్క టాస్క్ మోనాల్‌ను సేవ్ చేసింది కాగా ఈ వారం అభిజిత్, సోహైల్, హారిక, మోనాల్, అరియానా, లాస్య నామినేషన్లో ఉన్నారు. వీరిలో మోనాల్ పక్కాగా ఎలిమినేట్ అవుతుందని అంతా భావించారు. కానీ శుక్రవారం నాటి ఎపిసోడ్లో మోనాల్.. అఖిల్‌ను కాదని హారికకు సపోర్ట్ చేసింది. తనపై నమ్మకం ఉంచినందుకు హారికను కెప్టెన్ చేసింది. అఖిల్‌ను ఎత్తుకుని సోహైల్, అభిజిత్‌ను ఎత్తుకుని అవినాష్ ఎక్కువ సేపు నిలబడలేకపోగా మోనాల్ మాత్రం ధైర్యంగా చిరునవ్వుతో నా మీద నమ్మకం ఉంచు అంటూ హారికను భుజాన మోసి కడవరకు నిలబడింది. ఏడు సార్లు కెప్టెన్సీకి పోటీ చేసి ఓడిన హారికకు విజయాన్ని సొంతం చేసింది. దీంతో మోనాల్ బలమేంటో అందరికీ తెలిసొచ్చింది. తలుచుకుంటే తనూ ఆడగలదని నిరూపించింది. ఫలితంగా శుక్రవారం ఒక్కరోజే ఆమె ఎక్కువ ఓట్లు పడ్డాయట. దీంతో ఆఖరి నిమిషంలో లాస్యను కిందకు లాగి ఆమె పై స్థానానికి వెళ్లిపోయింది. ఈవారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకోగలిగింది. -
బిగ్‌బాస్ ఎలిమినేషన్: లాస్య అవుట్!
బిగ్‌బాస్ నాల్గో సీజన్లో ఎలిమినేషన్లో చోటు చేసుకున్న ట్విస్టులో అంతా ఇంతా కాదు. ఒకరు వెళ్లిపోతారనుకుంటే మరొకరు ఎలిమినేట్ కావడం, అసలు ఊహించని కంటెస్టెంట్లు కూడా హఠాత్తుగా బ్యాగు సర్దేసుకుని బయటకు వచ్చేయడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో పదకొండో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఉత్కంఠగా మారింది. ఈ వారం అభిజిత్, అరియానా, సోహైల్, మోనాల్, హారిక, లాస్య నామినేషన్లో ఉన్నారు. ఈసారి కచ్చితంగా మోనాల్ ఎలిమినేట్ అవుతుందని అనధికారిక పోల్స్ ఘంటాపథంగా చెప్పాయి. కానీ వాటిని తూచ్ అంటూ బిగ్‌బాస్ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. (చదవండి: బిగ్‌బాస్: ట్రోలింగ్‌పై స్పందించిన మెహబూబ్) అందులో భాగంగా యాంకర్ లాస్యను హౌస్ నుంచి పంపించేసినట్లు సమాచారం. కాగా నిన్నటి ఎపిసోడ్లో లాస్య.. గేమ్ ఎలా ఆడుతున్నానని తన భర్తను పదే పదే అడిగింది. టాస్కుల్లో తను పెట్టిన శ్రమ కనిపిస్తుందా? లేదా? అని గుచ్చిగుచ్చి ప్రశ్నించింది. దీనికి ఆమె భర్త సంకోచిస్తూనే అలాంటిదేమీ లేదని, బాగా ఆడుతున్నావని వెనకేసుకొచ్చాడు. కానీ కిచెన్‌లో నుంచి బయటకు వచ్చేయమని సలహా ఇచ్చాడు. కానీ ఆ సలహాను పట్టాలెక్కించేలోపే ఆమె రేపటి ఎపిసోడ్లో ఎలిమినేట్ కానున్నట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్ షోలో రెండో కంటెస్టెంటుగా ఎంట్రీ ఇచ్చిన లాస్య మొదటి వారంలోనే కెప్టెన్సీను చేజిక్కించుకుంది. తర్వాత సుజాతతో కలిసి గాసిప్స్ మాట్లాడటం, వంట గదికే పరిమితమవుతూ టాస్కుల్లో వెనకబడిపోవడంతో ప్రేక్షకులను తనవైపుకు తిప్పుకోలేకపోయింది. తన జీవితంలోని కష్టనష్టాలను గూర్చి చెప్తూ అందరినీ కంటతడి పెట్టించిన ఆమె చివరికి రేపటి ఎపిసోడ్లో కన్నీటితో బిగ్‌బాస్ షోకు వీడ్కోలు పలకనున్నట్లు తెలుస్తోంది. (చదవండి: నా కూతురే నాకు నటనలో ఓనమాలు నేర్పింది: హారిక తల్లి) -
ఈ ఇద్దరిలో ఒకరే బిగ్‌బాస్ విజేత: కౌశల్
పోటీదారులు ఎంతమంది ఉన్నా విజేత ఒక్కరే. ప్రస్తుతం బిగ్‌బాస్ నాల్గో సీజన్ ట్రోఫీ కోసం ఎనిమది మంది పోరాడుతున్నారు. అభిజిత్, అఖిల్, హారిక, సోహైల్, మోనాల్, అరియానా, అవినాష్, లాస్య ఎవరికి వారే టైటిల్ దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇందుకోసం ఇప్పటికే వారు బలహీనతలను అధిగమించి, ఎమోషన్స్‌ను జయించి, బలాన్ని కూడదీసుకుని, టాస్కులను ఒంటిచేత్తో పూర్తి చేసి విజయాన్ని అందుకునేందుకు ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు. కానీ ఎంత కష్టపడ్డా వీరిలో ఐదుగురు మాత్రమే గ్రాండ్ ఫినాలే వరకు వెళ్తారు. అందులో ఒక్కరికే టైటిల్ సొంతమవుతుంది. అలా మరో మూడు వారాల్లో షోకు శుభం కార్డు పడనుంది. ఈ క్రమంలో ట్రోఫీని అందుకునే అవకాశం ఎవరికి పుష్కలంగా ఉందనే విషయాన్ని బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంటు కౌశల్ మండా వెల్లడించాడు. కానీ హౌస్‌లో ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతోందని చెప్పుకొచ్చాడు. ఆయన ఇంకా ఏమేం అన్నాడో అతడి మాటల్లోనే.. సీక్రెట్ రూమ్ అట్టర్ ఫ్లాప్.. అభిజిత్.. మైండ్ గేమ్ ఆడుతున్నాడు. ఫిజికల్‌గా స్ట్రాంగ్ కాకపోవచ్చు. కానీ అతడు చెప్పే ప్రతీదీ జనాలకు అర్థమయ్యేట్టు చెప్తాడు. మా సీజన్లో తనీష్‌కు ఆ అలవాటు ఉంది. ఇతడు కచ్చితంగా టాప్ 2లో ఉంటాడు. సోహైల్.. మంచి ప్లేయర్. కోపమే అతడి బలం. అతడు కోపంలో మాట్లాడే మాటలు విని ఎంజాయ్ చేయొచ్చు. సోహైల్ కూడా పక్కా టాప్ 2లో ఉంటారు. అఖిల్.. మిగతావాళ్లతో పోలిస్తే బాగా ఆడతాడు. మొదట్లో మోనాల్‌తో ట్రాక్ నడిపాడు. కానీ సడన్‌గా ఆ రిలేషన్‌షిప్‌కు ఫుల్స్టాప్ పెట్టాడు. తర్వాత మళ్లీ గేమ్‌లోకి వచ్చాడు. అఖిల్ సీక్రెట్ రూమ్‌కు వెళ్తున్నాడని అతనితో పాటు ఇంటిసభ్యులకు కూడా తెలుసు. అయితే ప్రతి సీజన్‌కు సీక్రెట్ రూమ్ వర్కవుట్ కాదు. పైగా అఖిల్ ఆ సీక్రెట్ రూమ్‌లోకి వెళ్లి టెంపర్ లూజ్ అయ్యాడు. అదే అతడికి మైనస్ అవుతోంది. (చదవండి: మొదటిసారి నాకు ముద్దు పెట్టావు: అఖిల్) అవినాష్ కామెడీ తగ్గించేశాడు అవినాష్.. కామెడీ చేస్తున్నాడు, గేమ్ ఆడటానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ చిల్లర కామెడీ అన్నప్పటి నుంచి కామెడీ తగ్గించేశాడు. ఎత్తుకు పై ఎత్తుకు వేసుకుంటూ వెళ్తే టాప్ 5లోకి వెళ్తాడు. అరియానా.. అగ్రెసివ్. ఒకసారి పీక్స్‌కు వెళుతుంది మళ్లీ డ్రాపవుట్ అవుతుంది. అదే పీక్నెస్ మెయింటెన్ చేస్తే బాగుంటుంది. ఇక అవినాష్, అరియానా మధ్య బంధం బలంగా ఉంది. హారిక.. ఇద్దరు ముగ్గురితోనే మాట్లాడుతుంది. అందరితో ఓపెన్ అవ్వట్లేదు. క్యూట్ అండ్ బబ్లీనెస్తోనే ఉండిపోతోంది. కానీ అక్కడ సమయం మించిపోతోంది. అయినా సరే తర్వాత చేద్దాం, తర్వాత ఆడదాం అనుకుంటే కుదరదు. ఇప్పటి నుంచే ఆడాల్సిందే. (చదవండి: అరియానా నాకు కాంపిటీషనే కాదు: లాస్య) లాస్య అసలు స్వరూపం చూపించాలి లాస్య.. గేర్ లేని కారును నడుపుతున్నట్లుగా ఆమె ఆట ఉంది. మొదటి నుంచి కూల్‌గా వెళ్తోంది. అందరూ ఆమె నవ్వునే చూశారు, కానీ కోపాన్ని కూడా చూడాలనుకుంటున్నారు. అవకాశం దొరికినప్పుడు అసలు స్వరూపాన్ని చూపింస్తుందని కోరుకుందాం. మోనాల్.. ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతోంది. అఖిల్‌తో రిలేషన్ నుంచి బయటకు వచ్చి గేమ్ మీద దృష్టి పెడితే బాగా ఆడగలదు. భాష రాకపోవడం వల్ల చెప్పాలనుకున్నది కరెక్ట్‌గా చెప్పలేకపోతోంది. ఎమోషనల్‌గా కాకుండా అగ్రెసివ్‌గా ఆడితే బాగుంటుందని కౌశల్ చెప్పుకొచ్చాడు. మరి ఈ జోస్యం ఎంతవరకు నిజమవుతుందో చూడాలి. (చదవండి: బిగ్‌బాస్ : నీకు పడిపోతా అవినాష్.. అరియానా) -
బిగ్‌బాస్: టాస్కుల్లో వెనకబడుతోన్న లాస్య
ఏ టాస్కులూ ఆడటం లేదని అందరూ అభి మీద పడతారు. కానీ టాస్కులు ఆడీఆడనట్లుగా కనిపించే మరో కంటెస్టెంటు కూడా హౌస్‌లో ఉన్నారు. ఆవిడెవరో కాదు యాంకర్ లాస్య. అందరూ అటు గేమ్ ఆడుతూ, ఇటు ఎంటర్టైన్ చేస్తూ అభిమానులను పెంచుకుంటూ పోతున్నారు. కానీ లాస్య మాత్రం అటు ఈ రెండింటితో కాకుండా గతంలోని పాపులారిటీతోనే నెట్టుకొస్తున్నారు. వంటింటి కుందేలులాగా ఎప్పుడూ కిచెన్లోనే కనిపించడం, లేదంటే గాసిప్స్ మాట్లాడుకోవడానికే ఆమె పరిమితమైపోయింది అయితే టాస్కుల్లో చురుకైన ప్రదర్శన లేకపోవడంతో ఆమెకు నెగెటివ్‌గా మారుతోంది. పైగా నిన్నటి నామినేషన్ ప్రక్రియలో అరియానా తనకు కాంపిటీషనే కాదని లాస్య చెప్పడాన్ని కూడా నెటిజన్లు విమర్శిస్తున్నారు. టాస్కుల్లో పోటాపోటీగా ఆడే అరియానాకు ఆమెకు పోలికే లేదంటున్నారు. అరియానా దగ్గర ఫేక్ నవ్వు ఉండదని, ముక్కుసూటిగా మాట్లాడుతుందని అరియానాకే ఎక్కువమంది సపోర్ట్ చేస్తున్నారు. (చదవండి: నా భర్త నాకంటే ఓ ఏడాది చిన్న: లాస్య) అయినా సరే లాస్య తన బద్ధకాన్ని వీడినట్లు కనిపించడం లేదు. నేడు బిగ్‌బాస్ హౌస్ కమాండ్ కంట్రోల్‌గా మారుతున్న విషయం తెలిసిందే కదా. ఇందులో బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు కఠినమైన ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఆయన చెప్పేవన్నీ చేయలేక వాళ్లు తెగ ఆయాసపడుతున్నారు. అసలీ గేమ్‌లో విజయం సాధిస్తామా? అని హారికకు డౌటచ్చింది. అయితే దాన్ని తేలికగా తీసుకున్న లాస్య.. ముందు బజర్ కొడదాం, తర్వాత టాస్కు గురించి ఆలోచిద్దాం.. అని చెప్పుకొచ్చింది. ఇక గేమ్‌లో కూడా అందరూ నేలపై పాకుతూ ముందుకెళ్లాల్సి ఉండగా లాస్య మాత్రం చివర్లో ఎక్కడో ఉంది. దీంతో ఆమె టాస్క్ పేపర్ చదివి వినిపిస్తుంది కానీ ఆడదని కొందరు నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇలానే ఏమీ చేయకుండా ఉంటే ఎలిమినేట్ అవడం ఖాయమని చెప్తున్నారు. మరోవైపు అరియానా, అవినాష్ మధ్య గొడవ రాజుకున్నట్లు ప్రోమోలో చూపించారు. మరి అది ఎంత వరకు వెళ్లిందనేది చూడాలి.. (చదవండి: తొక్కలో రిలేషన్స్, అంతా నటిస్తారు: అఖిల్) -
నేను ఊర మాస్, ఇంకా గలీజ్‌గా మాట్లాడతా: హారిక
నామినేషన్ ప్రక్రియతో బిగ్‌బాస్ హౌస్ నిప్పులగుండంగా మారింది. మాటలను సూదుల్లా గుండెకు గుచ్చుతూ కంటెస్టెంట్లు నిప్పురవ్వల్లా ఎగిరెగిరి పడ్డారు. ఈ క్రమంలో కొందరు లాజిక్ మరిచినట్లు తెలుస్తోంది. గేమ్ ఆడటం లేదంటూ ఎక్కువ మంది అభిజిత్‌ను టార్గెట్ చేశాడు. మరికొందరు నామినేషన్‌ను తీసుకోలేకపోయారు. మండే అగ్నిగోళంగా మారిన బిగ్‌బాస్ ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో చదివేయండి.. మటన్ పంపిన నాగ్ బిగ్‌బాస్ ఇంటికి సింహం కెప్టెన్ అయ్యాడంటూ సోహైల్ అఖిల్‌కు కెప్టెన్సీ బ్యాండ్ తొడగ్గా, అతడు లాస్యను రేషన్ మేనేజర్‌గా నియమించాడు. ఇచ్చిన మాట ప్రకారం నాగార్జున మటన్ పంపడంతో ఇంటిసభ్యులు సంతోషంతో ఎగిరి గంతేశారు. అనంతరం పదకొండో వారానికి గానూ నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఇప్పటివరకు సాగిన ప్రయాణంలో ఎవరు వరస్ట్ పర్ఫామెన్స్ అనుకుంటున్నారో, వారిని నామినేట్ చేయాలని ఆదేశించాడు. ఇతర కారణాలు కూడా చెప్పేందుకు అవకాశం కల్పించాడు. మొదటగా కెప్టెన్ అఖిల్ అభిజిత్ గుండె మీద గురి చూసి బాణం దింపాడు. నేను వెళ్లిపోయాక నా గురించి నవ్వుకున్నావు, రోబో టాస్క్ తప్ప మిగతావేవీ ఆడటం లేదు అని తన అభిప్రాయాన్ని చెప్పాడు. (చదవండి: సినిమా ఛాన్స్ అనగానే రూ.80 వేలు ఇచ్చి మోసపోయా: అవినాష్) అఖిల్, నీ గుడ్లు కింద పడిపోతాయ్.. మటన్ షాపు యజమాని గడ్డి చూపిస్తే మేక లోపలికి వెళ్లింది, తర్వాత ఏమైంది అని అభితో అంటూ మేక పులై వచ్చిందని అఖిల్ డైలాగ్ కొట్టాడు. దీంతో అఖిల్ మిస్సయిన లాజిక్ పట్టుకుని అభి.. మేక ఎప్పుడూ పులి కాదు, బలైతదని కౌంటరిచ్చాడు. అలా ఈ ఇద్దరి మధ్య గొడవ షురూ అయింది. నా సోచ్ గురించి మాట్లాడావు అని అభి చెప్పగానే అసలు నీకు బుద్ధి ఉంటే కదా? అని అఖిల్ నోరు జారాడు. దీంతో రెచ్చిపోయిన అభి కూడా ఇంత జరిగినా నీకు బుద్ధి రాలేదు, ముందు నువ్వు గుడ్లు బయటకు తీయకు, కిందకు పడిపోతాయ్ అని వెటకారంగా మాట్లాడాడు. నువ్వేమైనా తురుమ్‌ఖాన్‌వా? కెప్టెన్ అయ్యావని చెట్టెక్కి కూర్చున్నావు. అని గరమయ్యాడు. ఇంతలో ఒకమ్మాయి గురించి అని అఖిల్ స్టార్ట్ చేయబోతుంటే అమ్మాయి విషయం మధ్యలోకి లాగకు అంటూ కొట్టుకున్నంత పని చేశారు. నువ్వెంత అంటే నువ్వెంత అని కొట్టుకున్నంత పని చేశారు. నాకు 32, నీది 25 ఏళ్లు.. బచ్చాగానివి.. ఛల్‌ఛల్, జా అంటూ అఖిల్ నోరు మూయించేందుకు ప్రయత్నించాడు. అయినా సరే తగ్గని అఖిల్ 25 ఏళ్లలోనే తాను బిగ్‌బాస్‌కు వచ్చానని చెప్పుకొచ్చాడు. ఊతపదాల మీద లొల్లి తర్వాత అరియానా.. నేను నీకు కాంపిటీషన్ కాదన్నారు. కానీ గేమ్‌లో అందరూ సమానమే. బిగ్‌బాస్ ఏకాభిప్రాయంతో ఒక పేరు చెప్పమన్నప్పుడు మీరు చెప్పకుండా గేమ్‌ను ముందుకు తీసుకెళ్లలేదు అంటూ లాస్యను, ఆ తర్వాత అభిజిత్‌ను నామినేట్ చేసింది. ఇక సోహైల్.. తనను చిచ్చుబుడ్డి అన్నవారికి థ్యాంక్స్ చెప్పాడు. ఆటంబాంబు కన్నా చిచ్చుబుడ్డే బెటర్ అని అభిప్రాయపడ్డాడు. కానీ హారిక మాత్రం ఎవ్వరూ దేఖరు, వేస్ట్‌గాడు అని చిచ్చుబుడ్డి ఇచ్చింది. ఆమెను ఎప్పుడూ ఒక్కమాట అనలేదు అని బాధపడుతూనే సీరియస్ అయ్యాడు. దీనిక హారిక స్పందిస్తూ నీ అవ్వ పో అనడం నీకు ఊతపదం అయినప్పుడు వేస్ట్‌గాడు అనేది నాకు ఊతపదం అని స్పష్టం చేసింది. అలా ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో గింతంత లేవు, ఆపు అని సోహైల్ కావాలని రెచ్చగొట్టాడు. దీంతో ఆమె నా హైట్‌ను ఎందుకు అంటున్నావు. నువ్వు మాస్ అయితే నేను ఊరమాస్ అని ఆవేశపడింది. తనతో రుబాబుగా మాట్లాడొద్దు అని వార్నింగ్ ఇచ్చింది. ఇక రోబో టాస్క్ తర్వాత మళ్లీ అంత పర్ఫామెన్స్ కనిపించలేదని అభిజిత్‌ను నామినేట్ చేశాడు. ఇక నుంచి నో చెప్తా: మోనాల్ లాస్య మాట్లాడుతూ.. ఒకరిని బయటకు పంపించడానికి ఐకమత్యంగా లేనప్పుడు ఉంచడానికి ఐకమత్యంగా ఎందుకు ఆలోచించలేదంటూ అరియానాను నామినేట్ చేసింది. టాస్కుల్లో పెద్దగా ఆడలేదని, కొన్నిసార్లు పనులు ఎక్కడివక్కడే వదిలేస్తుందని మోనాల్‌ను నామినేట్ చేసింది. హారిక.. చాలాసార్లు కెప్టెన్సీ పోటీ వరకు వచ్చాను, ఈసారి కెప్టెన్సీకి సపోర్ట్ చేయమని అడిగినప్పుడు ఓడిపోవడం నీ తప్పు అన్నాడు. అందుకు బాధేసింది అని సోహైల్‌ను, తర్వాత మోనాల్‌ను నామినేట్ చేసింది. మోనాల్.. తనకు అప్పజెప్పిన పనిని ఎప్పుడూ చేస్తానని లాస్య, రేషన్ మేనేజర్‌గా సక్రమంగా పని చేయలేదని అవినాష్ గుండెల మీద బాణాల్ని గుచ్చింది. అవినాష్.. పని చెప్తే చేస్తాననడం నేర్చుకో అని మోనాల్‌కు చెప్పడంతో ఇప్పటినుంచి నో చెప్తానని చెంప పెట్టుగా సమాధానమిచ్చింది. టాస్కులు ఆడటం లేదని అభిజిత్‌ను గుండెలో బాణం దించాడు. (చదవండి: అఖిల్ ప్రవర్తనపై మోనాల్ ఫ్యాన్స్ ఫైర్) నాతో మర్యాదగా మాట్లాడు: అభిజిత్ అభిజిత్ వంతు రాగా.. ఏకాభిప్రాయంతో మావైపు నిలబడలేదని అరియానా గుండె మీద బాణం గుచ్చాడు. అయితే మీ ఆటకు అడ్డుపడే వారి పేరును ఏకాభిప్రాయంతో చెప్పాలని బిగ్‌బాస్ చెప్పాడని, అందుకు ఎవరి పేర్లు వారు చెప్పుకోవడం తప్పని నాగార్జున దీన్ని ఖండించిన విషయం అభి మర్చిపోయినట్టున్నాడు. కాగా.. నీయవ్వ అని నాతో మాట్లాడొద్దని చెప్పినా అలాగే మాట్లాడుతున్నాడని సోహైల్‌ను నామినేట్ చేశాడు. దీంతో అగ్గి మీద గుగ్గిలమైన సోహైల్ 'అంటే నేను నాలాగా మాట్లాడకూడదు. పాష్‌గా మాట్లాడాలి' అంటూనే హర్ట్ అయితే సారీ అని చెప్పాడు. నీ ఊతపదాలు నా దగ్గర వద్దు. నాతో మర్యాదగా మాట్లాడు, జాగ్రత్తగా ఉండు అని అభి వార్నింగ్ ఇచ్చాడు. మొత్తానికి ఈ వారం హౌస్‌ను అతలాకుతలం చేసిన నామినేషన్ లిస్టులో అభిజిత్, మోనాల్, హారిక, లాస్య, అరియానా, సోహైల్ ఉన్నారు. నేను అంతకంటే గలీజుదాన్ని ఈ నామినేషన్ ప్రక్రియ నుంచి బయటపడని హారిక.. లాస్య దగ్గర తన ఉక్రోశం చూపించింది. 'సోహైల్ అరుచుకుంటూ మాట్లాడితే నేను మూసుకుని ఉండలేను. నేను మరీ మాస్, ఇంకా గలీజ్‌గా మాట్లాడతా..' అని ఆవేశంతో ఊగిపోయింది. అటు సోహైల్ కూడా అరియానా దగర తన గోడు వెల్లబోసుకున్నాడు. నన్ను వేస్ట్ అంటే చాలా హర్ట్ అయినా, అది కూడా హర్ట్ కావాలనే గింతంత లేవు అన్నా అని తెలిపాడు. అదే మాట అభిని అనుంటే అతడు ఊరుకునేవాడే కాదని చెప్పుకొచ్చాడు. (చదవండి: రెండేళ్ల క్రితం రిలేషన్లో ఉన్నా: హారిక) -
లాస్యకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన బిగ్‌బాస్
బిగ్‌బాస్ హౌస్‌లో ‘నవ్వడం నిషేధం’ టాస్క్ నవ్వులు పూయించేలా ఉంది. తోటి సభ్యులను నవ్వించడానికి కంటెస్టెంట్లు నానా యేషాలు వేశారు. ఎంతకీ హౌస్మేట్స్ నవ్వకపోవడంతో చివరికి బిగ్‌బాసే రంగంలోకి దిగి ఇంటి సభ్యులను నవ్వించాడు. దీంతో పాటు ఈ రోజు లాస్యకు ఊహించని గిఫ్ట్ అందినట్లు తాజా ప్రోమో చూస్తే అర్థమవుంది. దిపావళి సందర్భంగా హౌస్‌మేట్స్‌కి ఇంటి సభ్యుల నుంచి గిఫ్ట్‌లు వచ్చాయి. ఇక ఏది కూడా ఊరికే ఇవ్వని బిగ్‌బాస్.. ఈ గిఫ్ట్ పొందాలంటే ఓ టాస్క్ గెలువాలని కండిషన్ పెట్టాడు. ఆ టాస్కే ‘నవ్వడం నిషేధం’.. ఇంట్లో ఏ ఒక్కరు నవ్వినా టాస్క్ ఓడిపోయినట్లే. అయితే ఎవరైతే నవ్విస్తారో వాళ్లు ఈ టాస్క్ గెలిచినట్లు. దీంతో గిఫ్ట్‌లు పొందాలనే ఆశతో ఇంటి సభ్యులు నవ్వించే పనిలో పడ్డారు. ఇక ఎంటరైన్మెంట్ ఈస్ బ్యాక్ అంటూ.. అవినాష్ తనలోని కమెడియన్‌ను బయటకు తీశాడు. ఇక ప్రతి చిన్న విషయానికి నవ్వులు చిందించే లాస్కను టార్గెట్ చేశాడు అవినాష్. తదైన శైలీలో కామెడీ చేసి లాస్యను నవ్వించాడు. అలా మెహబూబ్, సోహైల్‌ను కూడా నవ్వించేశాడు. ఇక సోహైల్ అయితే జోకర్ వేసి మరి నవ్వించే ప్రయత్నం చేశాడు. ఎవ్వరూ నవ్వకపోవడంతో తన చిరకాల మిత్రుడు మెహబూబ్‌తో దగ్గరికి వెళ్లి బ్రతిమిలాడి మరీ నవ్వించాడు. ‘మొత్తం వేషం వేశార్రా.. దీనికైనా నవ్వురా’ అని సోహైల్ అనగా.. అస్సలు బాలేదురా అంటూ మెహబూబ్ సింపుల్‌గా పక్కకి తోసాడు. ఇక అభిజిత్ కూడా అందరిని నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇదిలా ఉంటే.. ఇంటి సభ్యులను నవ్వించేదుకు బిగ్‌బాసే రంగంలోకి దిగినట్లు కనిపిస్తోంది. ‘సోహైల్ ఏందీ పంచాయితీ.. కథెట్లుంది’ అంటూ సోహైల్ యాసలో మాట్లాడాడు. దీంతో ఆశ్చర్యపోయిన సోహైల్.. కథ వేరేలా ఉంది బిగ్‌బాస్ అంటూ తనదైన శైలీలో చెప్పాడు. ఇక దీపావళి సందర్భంగా లాస్యకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చినట్లు ఉన్నాడు బిగ్‌బాస్. లాస్య కుమారుడి వాయిస్‌ని బిగ్‌బాస్ హౌస్‌లో వినిపించాడు. దీంతో లాస్య ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సంతోషంతో చిందులేసింది. ఇంకా బిగ్‌బాస్ ఇంట్లో ఈ రోజు ఏమేం జరిగాయో తెలియాలంటే కొద్ది గంటలు ఆగాల్సిందే. -
బిగ్‌బాస్ : బిగ్ సీక్రెట్ చెప్పి షాకిచ్చిన లాస్య
బిగ్‌బాస్ నాల్గో సీజన్ రసవత్తంగా మారింది. కంటెస్టెంట్స్ అంతా ముసుగు తీసి మనసుకు నచ్చినట్లుగా ఆడుతున్నారు. బిగ్‌బాస్ ఇచ్చిన ప్రతి టాస్క్‌ని సక్సెస్ చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో తమ తమ రహస్యాలను కూడా బహిర్గతం చేయడానికి వెనకాడటం లేదు. ఇక బిగ్‌బాస్ పుణ్యమా అని యాంకర్ లాస్య గురించి ఎవరికీ తెలియని విషయాలు బయటపడుతున్నాయి. లాస్యకు పెళ్లి అయిన విషయమే చాలా కాలం వరకు ఫ్యాన్స్‌కి తెలియదు. 2012 లో ప్రేమ వివాహం చేసుకుంటే.. ఆ విషయాన్ని 2017లో రివీల్ చేసింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. బిగ్‌బాస్‌లోకి వచ్చాక లాస్య వాళ్ల తల్లిదండ్రులతో పాటు ఫ్యాన్స్‌కి కూడా షాక్‌ల మీద షాక్ ఇస్తోంది. ఇప్పటికే తాను ఒకసారి అబార్షన్ చేయించుకున్నానని చెప్పి షాకిచ్చిన లాస్య.. తాజాగా మరో రహస్యం చెప్పి అందరికి విస్మయానికి గురి చేసింది. గురువారం నాటి ఎపిసోడ్లో ఇప్పటివరకూ ఎవరికీ తెలియని సీక్రెట్ చెప్పాలని బిగ్ బాస్ కోరాడు. దీంతో ఒక్కొక్కరు వచ్చి తమ తమ సిక్రెట్ విషయాలను బిగ్‌బాస్‌తో పంచుకున్నారు. ఇక లాస్య వంతు రాగానే బిగ్ సిక్రెట్ చెప్పి అందరికి షాకిచ్చింది. తన భర్త తన కంటే ఏడాది చిన్నవాడని, చాలా పేదవాడని చెప్పుకొచ్చింది. ‘2017లో పెద్దల సమక్షంలో మా పెళ్లి అయ్యింది. పెళ్లైనప్పుడు నేను ఒక మరాఠీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పా.. అందరూ అనుకున్నారు.. కోటీశ్వరుడు డబ్బులున్న అబ్బాయి అనుకున్నారు. తను మిడిల్ క్లాస్ కూడా కాదు. అతని ఫైనాన్సియల్ స్టేటస్ నాకు మాత్రమే తెలుసు. నాకంటే ఆ అబ్బాయి ఒక సంవత్సరం చిన్న. ఆ విషయం తెలిసిన తరువాత నాకంటే ఏడాది చిన్నవాడ్ని నేను లవ్ చేశానా?? అని ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు. ఈ సీక్రెట్ మా ఇంట్లో ఎవరికీ తెలియదు. ఈ షోకి వచ్చాక షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నా.. అమ్మా మీ అల్లుడు నాకంటే ఏడాది చిన్న.. కానీ వయసులో చిన్నవాడైనా పెద్ద మనసు.. చాలా బాగా చూసుకుంటాడు’ అని చెబుతూ కంటతడి పెట్టింది. -
మొదటి బిడ్డను చంపుకున్నా: లాస్య కన్నీళ్లు
పరమ బోరింగ్‌గా మారిన పల్లెకు పోదాం ఛలో ఛలో టాస్కు ముగియడంతో ప్రేక్షకులు ఊపిరి పీల్చుకున్నారు. బిగ్‌బాస్ ఆదేశాల ప్రకారం అన్ని హత్యలు చేస్తూనే ఏమీ ఎరగనట్టు తెగ నటించేసింది. దీంతో టాస్క్ విజయవంతంగా పూర్తి చేసింది. కానీ హత్యలన్నీ జరిగిపోయాక సోహైల్ హంతకురాలు హారిక అని తీర్పు చెప్పడంతో లాభం లేకపోయింది. ఇక ఇంటిసభ్యులు వారు చేసిన త్యాగం, సాయాలను చెప్తూ ఎమోషనల్ అయ్యారు. యాంకర్‌గా వెలుగు వెలిగిన లాస్య తన జీవితంలో చీకటి రోజులను మరోసారి గుర్తు చేసి కంటతడి పెట్టించింది. మరి నేటి ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో చదివేసేయండి.. తిండి దగ్గరే టాస్క్ ఆపేస్తారు: అరియానా ఆగ్రహం తనకు ఆమ్లెట్ కావాలని అరియానా కోరగా కుదరదని అభిజిత్ చెప్పాడు. దీంతో ప్రతిసారి ఆహారం దగ్గరే టాస్క్ ఆపేస్తారు అని అరియానా మండిపడింది. ఇందుకే, నీ గేమ్ నచ్చదని అభిజిత్‌ను ముఖం పట్టుకుని అనేసింది. దీంతో తిక్క లేచిన అభి.. నాన్సెన్స్, తెలుసుకుని మాట్లాడు అంటూ సీరియస్ అయ్యాడు. ఇక అరియానా ఆకలి బాధ చూడలేక మాస్టర్ కిచెన్‌లో దూరాడు. అతడు చెప్పినదానికి వారు తలూపకపోవడంతో మోనాల్ ప్లేటులో పట్టుకున్న ఫుడ్డును పాడు చేసి వెళ్లిపోయాడు. తర్వాత సీక్రెట్ టాస్క్‌లో భాగంగా హారిక అవినాష్‌ను రెచ్చగొట్టింది. కానీ అసలు గొడవ మాత్రం మెహబూబ్, అఖిల్ మధ్య రాజుకోవడం గమనార్హం. ఆ వెంటనే గ్రామంలో మరో హత్య జరిగిందని బిగ్‌బాస్ ప్రకటించగా అమ్మ రాజశేఖరే ఈ హత్యలు చేస్తున్నాడని అందరూ అనుమానించారు. (చదవండి: అఖిల్, నన్ను బే అనకు: సోహైల్ వార్నింగ్) సీక్రెట్ టాస్క్ కంప్లీట్ చేసిన హారిక 'వెనక నుంచి హత్య చేయడమేంటి? మనిషా, దున్నాపోతా? ఛీ, తూ..' అంటూ అవినాష్ నానా మాటలు అన్నాడు. మరోవైపు హారిక మాత్రం హౌస్ లోపల అద్దంపై లిప్‌స్టిక్‌తో మెహబూబ్ చనిపోయాడు అని రాయడంతో ఆఖరు హత్య కూడా జరిగిపోయింది. తర్వాత పంచాయితీలో కూడా గ్రామపెద్ద సోహైల్ హారికే హంతకురాలని తీర్పు చెప్పాడు. కానీ అప్పటికే హత్యలు జరిగిపోవడంతో లాభం లేకపోయింది. ఇంటిసభ్యులందరూ మంటను మాత్రం చివరి వరకు ఆర్పకుండా కాపాడగలిగారు. ఇంతటితో టాస్క్ ముగిసినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. నాగార్జున చెప్పినదాని ప్రకారం మాస్టర్, సీక్రెట్ టాస్క్ గెలిచి హారిక, కెప్టెన్ అరియానా కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచారు. నా గురించి మాట్లాడకు అరియానా: అవినాష్ టాస్కులో అనవసరంగా కోపానికి వస్తున్నావు అని అరియానా అవినాష్‌తో చెప్పుకొచ్చింది. టాస్కులో వరస్ట్ పర్ఫామెన్స్ అడిగితే నీ పేరే చెప్పేదాన్ని అనడంతో అవినాష్ హర్ట్ అయ్యాడు. 'నన్ను చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నావు, అది నాకు నచ్చట్లేదు, నా గురించి నువ్వు మాట్లాడకపోతేనే బెటర్' అని సలహా ఇచ్చాడు. అనంతరం ఇంటిసభ్యులు సమాజం కోసం కానీ, వేరే వారి జీవితాల్లో వెలుగులు నింపిన సంఘటనలను కానీ చెప్పాల్సి ఉంటుంది. ఎవరు చెప్పింది అందరినీ కదిలించివేస్తుందో వారిని బెస్ట్‌గా ఎంపిక చేయాల్సి ఉంటుంది. (చదవండి: బిగ్‌బాస్: సోహైల్, అఖిల్ మళ్లీ గొడవపడ్డారు!) అర్ధరాత్రి అర్జంటుగా డబ్బులు కావాలన్నాడు: సోహైల్ మొదట సోహైల్ మాట్లాడుతూ.. "నా స్నేహితుడి భార్యకు అప్పటికే రెండుసార్లు గర్భస్రావం అయ్యింది. మూడోసారి గర్భం దాల్చిన సమయంలో ఓ రోజు నాకు వాడు అర్ధరాత్రి ఫోన్ చేశాడు. అర్జంట్‌గా డబ్బులు కావాలన్నాడు. సమయానికి నా దగ్గర లేకపోయేసరికి మా వాళ్లను అడిగి 15 వేలు ఇచ్చాను. కానీ తర్వాతి రోజే 10 లక్షలు అవుతుందన్నారు. సోషల్ మీడియాలో సాయం కోసం పోస్టు పెట్టి 10 లక్షలు సమకూర్చాను. వాడు ఎమోషనలై.. జీవితాంతం నీకు, సమాజానికి రుణపడి ఉంటానని నాతో అన్నాడు నాకు కూడా గర్వంగా అనిపించింది" అని చెప్పుకొచ్చాడు. (చదవండి: బిగ్‌బాస్ : ‘అమ్మ’బాబోయ్.. ఊహించని ట్విస్ట్ ఇది) జున్ను వచ్చాక నా లైఫ్ మారిపోయింది: లాస్య లాస్య మాట్లాడుతూ.. "2010లో నాకు పెళ్లి అయింది. 2012లో కలిసి ఉన్నాం. 2014 జనవరిలో నాన్న దగ్గరి నుంచి ఫోన్ వచ్చింది. ముందు సెటిల్ అవండి. తర్వాత వాళ్లే స్వయంగా పెళ్లి చేస్తాం అన్నారు. అది చూసి హ్యాపీగా ఫీలయ్యాను. కానీ అదే వారం నేను ఆరోగ్యం బాగోలేక ఆస్పత్రికి వెళ్తే గర్భవతిని అని చెప్పారు. కానీ ఫ్యామిలీకి చెప్పుకోలేక అబార్షన్ చేసుకున్నాను. 2017లో మళ్లీ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాం. ఐదు నెలలకే నేను మళ్లీ గర్భవతినయ్యా. కానీ నిలవలేదు. 2018లో నా పొట్టలోకి జున్ను వచ్చాడు. ఆ తర్వాత నా లైఫ్ మారిపోయింది. కానీ నా మొదటి బిడ్డను నేనే చంపేసుకున్నాను అన్న బాధ ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది" అని ఏడ్చేసింది. అందరూ లాస్య చెప్పిన ఘటనతో భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె చెప్పిన సంఘటనే అందరి వాటిలో ది బెస్ట్ అనిపించడంతో ఆమెకు ఒప్పో దివాళి ఎడిషన్ ఫోన్‌ను అందించారు. -
దివి ఎలిమినేట్: సినిమా ఛాన్స్ కొట్టేసింది
నటనా సామ్రాజ్యపు మహారాణి, సిరివెన్నెల విరబోణి సమంత బిగ్‌బాస్ నాల్గో సీజన్లో దసరా స్పెషల్ మహా ఎపిసోడ్‌కు వ్యాఖ్యాతగా వ్యహరించింది. ముద్దు ముద్దు మాటలతో షో ప్రారంభం నుంచే సందడి మొదలు పెట్టేసింది. కంటెస్టెంట్లు ఒక్కొక్కరి గురించి సమంత తన అభిప్రాయాలను చక్కగా చెబుతూనే అందరినీ తికమక పెట్టింది.. అరియానా ఫైటర్, జాలి గుండె అని చెప్తూనే ఆమెను చూస్తుంటే తనను తాను చూసినట్లే ఉందని తెలిపింది. దివి గేమ్‌పై ఫోకస్ పెట్టడం లేదంది. హారికకు బాగా క్లారిటీ ఉందంది. లాస్య నవ్వుతూనే అందరినీ బుట్టలో వేస్తుందని పేర్కొంది. మోనాల్ బిగ్‌బాస్ హౌస్‌లో చాలామందికి ప్రేమించడం నేర్పుతుందని అంది. ప్రతిసారి ఏడవకూడదని సలహా ఇచ్చింది. అబ్బాయిలు ఫీలైనా సరే వాళ్ల గురించి చెప్పనని తేల్చి చెప్పింది. స్వయంవరం మొదటి రౌండ్ గెలిచిన అఖిల్ బిగ్‌బాస్ హౌస్‌లో సమంత స్వయంవరం ప్రకటించింది. ఇది మూడు రౌండ్లు ఉంటుందని తెలిపింది. మొదట వచ్చిన అభిజిత్ సాంగ్ పాడాడు. సోహైల్.. డైలాగులు చెప్తుంటే అరియానా అడ్డుపడింది. నువ్వూ నేను టామ్ అండ్ జెర్రీ అని ఆమెను కూల్ చేసేందుకు ప్రయత్నించి, ఆపై కండలు ప్రదర్శించాడు. అవినాష్.. తనను పెళ్లి చేసుకుంటే జీవితాంతం నవ్విస్తానని హామీ ఇచ్చినా అమ్మాయిలు పడిపోలేదు. నా భార్యకు నేనే వండిపెడతా, ఏమడిగినే ఇచ్చేస్తానని చెప్పి మెహబూబ్ చొక్కా తీసేసి డ్యాన్స్ చేశాడు. బంగారు కళ్ల బుచ్చొమ్మో.. అంటూ అఖిల్ పాట పాడాడు. అనంతరం అమ్మాయిలందరూ అఖిల్ నచ్చాడని ఏకగ్రీవంగా ప్రకటించారు. దీంతో అతనికి ఓ స్పెషల్ గిఫ్ట్ అంటూ అఖిల్ ఇంటిసభ్యులు మాట్లాడిన వీడియోను చూపించారు. (చదవండి: మోనాల్ మళ్లీ సేఫ్, దివి ఎలిమినేట్) నీ రూమ్‌లోకి వెళ్లి నీ కోసమే ఆలోచిస్తున్నాం "నిన్ను చాలా మిస్ అవుతున్నాం, నువ్వు ఏడవడం చూసి బాధపడ్డాం. కానీ మమ్మీ ఐ లవ్ యూ అని చెప్పిన సంఘటన నా జీవితంలోని కష్టాలను పోగొట్టింది. నీ రూమ్‌లోకి వెళ్లి నీకోసమే ఆలోచిస్తున్నాం. అందరితో కలిసి ఉండు, మంచిగా ఆడు, అదే నాకు సంతోషం" అని అఖిల్ అమ్మ మాట్లాడింది. ఇది చూడగానే అఖిల్ కన్నీటిపర్యంతం అయ్యాడు. తర్వాత మోనాల్‌కు ఆమె ఫ్యామిలీ వీడియో చూపించారు. "మేము నిన్ను మిస్ అవుతున్నాం. నువ్వు లేకపోతే ఇల్లు బోసిగా ఉంది. నిన్ను ఏడుస్తూ చూడటం మాకు నచ్చట్లేదు. నువ్వు ఆనందంగా ఉంటే మేము ఆనందంగా ఉంటాం" అని అమ్మ మాట్లాడిన వీడియో చూసి మోనాల్ కన్నీళ్లు పెట్టుకుంది. తర్వాత నోయల్ వంతు వచ్చింది. "చూడు అన్నయ్యా.. నాన్న తొడగొడుతున్నాడు. నువ్వు కాస్త బాధపడినా మేమూ బాధపడతాం. ఆల్ ద బెస్ట్‌రా" అని అతడి తమ్ముడు మాట్లాడాడు. తర్వాత అరియానా సేఫ్ అయినట్లు సమంత వెల్లడించింది. (చదవండి: బిగ్‌బాస్ : తొలిసారి అవినాష్.. సోహైల్ రిక్వెస్ట్) రెండో రౌండ్లోనూ గెలిచిన అఖిల్ స్వయంవరంలో 'ఎవడు పోటుగాడు' అని రెండో రౌండ్ మొదలైంది. అరియానా బర్త్ ఇయర్ ఎప్పుడు? అన్న ప్రశ్నకు 1993 అని అవినాష్, దివికి ఏది భయం? అన్న ప్రశ్నకు దెయ్యం అని అఖిల్, హారిక ఫేవరెట్ కలర్ బ్లాక్ అని మెహబూబ్ చెప్పాడు. మోనాల్ లక్కీ నంబర్ 2 అని అవినాష్ తప్పు ఆన్సర్ ఇవ్వడంతో అతికష్టం మీద శీర్షాసనం వేయించారు. తన లక్కీ నంబర్ నాలుగు అని మోనాల్ స్పష్టం చేసింది. దివి చెవికమ్మ రంగు బ్లూ అని మరోసారి తప్పులో కాలేయడంతో అవినాస్ ఈ రౌండ్ నుంచి తప్పుకున్నాడు. ఆడవాళ్లు మగవాళ్ల కన్నా ఎక్కువ మాట్లాడతారా? అన్న ప్రశ్నకు అవునని అభిజిత్, ఎవరు ఎక్కువ అబద్ధాలు చెప్తాడన్న ప్రశ్నకు అబ్బాయిలు అని అఖిల్ ఆన్సరిచ్చారు. ఒక చీర ఎంత పొడవుంటుందంటే ఆరు అడుగులు అని అఖిల్, ఆడవాళ్లు వాడే బ్లాక్ కలర్లో మూడు మేకప్ ఐటమ్స్‌ను మెహబూబ్ కరెక్ట్‌గా చెప్పాడు. ఈ రౌండ్లో కూడా అఖిలే గెలిచాడు. ఒక్క పాయింట్ కూడా రాని సోహైల్ ఎలిమినేట్ అయ్యాడు. (చదవండి: నరకం చూపించిన ఆ ఇద్దరే బెస్ట్ పర్ఫార్మర్లు) సింగరేణి ముద్దుబిడ్డ మేం బాగున్నాం. "సింగరేణి ముద్దుబిడ్డ.. నీ గ్రాఫ్ పెరుగుతుంది. కథ వేరే ఉంది. మేం చాలా గర్వంగా ఫీలవుతున్నాం. మేం బాగున్నాం. నాన్న మాత్రం చాలా గర్వంగా ఫీల్ అయితుండు. లవ్ యూ అన్నా" అంటూ తమ్ముళ్లు, "నేను చాలా సంతోషంగా ఉన్నా. నువ్వు బాగా ఆడుతున్నావు. గెలిచి రావాలి" అని తండ్రి మాటలను చూపించడంతో సోహైల్ ఎమోషనల్ అయ్యాడు. నాకు బాగోలేనప్పుడు మెహబూబ్, అఖిల్ బాగా చూసుకుంటూ, తినిపించారని సంతోషం వ్యక్తం చేశాడు. తర్వాత అమ్మ రాజశేఖర్ వంతు రాగా "నీ ఆరోగ్యం చూసుకో. టాస్క్‌ల్లో దెబ్బలు తగిలించుకోకు. నీ గుండు అవతారం బాగుంది. లవ్ యూ" అని భార్య, "మిగతావాళ్లకు టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నావ్, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం" అని కొడుకు, కూతురు మాట్లాడిన వీడియో చూసి భావోద్వేగానికి లోనయ్యారు. తర్వాత దివి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. "టాస్కులు బాగా ఆడుతున్నావ్. గెలిచి రావాలి. అదే మా కోరిక" అని చెప్పుకొచ్చారు. ఇది చూసి దివి చాలా సంతోషపడింది. షోలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఎంట్రీ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అఖిల్ షోలోకి వచ్చాడు. స్వయంవరంలో భాగంగా అఖిల్-మోనాల్, అభిజిత్-దివి, అవినాష్-హారిక డ్యాన్స్ చేయగా.. మెహబూబ్ జోడి బాగా చేసిందని అఖిల్ ప్రకటించాడు. తర్వాత మెహబూబ్, అరియానా, అవినాష్ తల్లిదండ్రులు మాట్లాడిన వీడియోలను చూపించారు. ఇక హీరో అఖిల్ మాట్లాడుతూ.. మా గురించి మర్చిపోయి నాన్న మీ గురించే మాట్లాడుతన్నారని చెప్పుకొచ్చాడు. అనంతరం స్వయంవరంలో మెహబూబ్- అరియానాలను టాప్ జోడీగా ప్రకటిస్తూ స్నేహమాల వేయించి మెహబూబ్‌తో ఆమెకు రింగు తొడిగించాడు. తర్వాత మోనాల్, అభిజిత్ సేఫ్ అయినట్లు ప్రకటించారు. స్వయంవరంలో టాప్ జోడీగా మెహబూబ్- అరియానా అనంతరం లాస్య భర్త మాట్లాడుతూ.. "ఇంకెప్పుడూ ఏడవకు. నువ్వేడిస్తే ఇక్కడ చాలా మంది ఏడుస్తాం. జున్ను నీకోసం రాసిన లెటర్ చదువుతాను.. అమ్మ.. అందరూ నన్ను బాగా చూసుకుంటున్నారు. నేను అల్లరి చేస్తున్నాను. నిన్ను టీవీలో చూసి నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎప్పుడూ ఏడవద్దు. లవ్ యూ అమ్మ" అని చెప్పుకొచ్చారు. జున్నును చూసి లాస్యకు కన్నీళ్లు ఆగలేవు. "హెయిర్ కట్ టాస్క్ చేసినందుకు ఎమోషనల్ అయ్యాం, కానీ టీమ్ కోసం త్యాగం చేయడం చాలా నచ్చింది. బీ సేఫ్. టాస్కులు ఇరగదీసేయ్" అని హారిక అన్నయ్య వీడియో సందేశం ఇచ్చారు. (చదవండి: బిగ్‌బాస్: మోనాల్ కోసం అరియానా త్యాగం) మోనాల్ సొంత క్రష్ అనిపిస్తుంది: హైపర్ ఆది తర్వాత హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్, డిటెక్టివ్‌గా హైపర్ ఆది ఎంట్రీ ఇచ్చారు. వచ్చీరాగానే కంటెస్టెంట్లపై పంచులు విసిరాడు. అమ్మ రాజశేఖర్‌ను అపరిచితుడితో పోల్చాడు. సోహైల్ అర్జున్‌రెడ్డిలా ఉండేవాడని, ఇప్పుడు స్వాతిముత్యంలా తయారయ్యాడని చెప్పుకొచ్చాడు. కోపాన్ని కంట్రోల్ చేసుకున్నావ్ కాబట్టే టీవీలో ఉన్నావు, లేదంటే టీవీ ముందు ఉండేవాడన్నాడు. మోనాల్‌ను చూస్తుంటే తన సొంత క్రష్‌లా అనిపిస్తుందని ఆది పులిహోర కలిపాడు. తన పేరు కూడా ఏతో మొదలవుతుందని అప్లికేషన్ పెట్టుకున్నాడు. అనంతరం నోయల్ సేఫ్ అయినట్లు ప్రకటించారు. తర్వాత దివి ఎలిమినేట్ అని ప్రకటించడంతో మాస్టర్ కంటతడి పెట్టుకున్నాడు. కిచెన్ వద్దనుకున్న లాస్యపై బిగ్‌బాంబ్ నీ తర్వాతి సినిమాలో దివికి ఓ మంచి పాత్ర ఇవ్వు అంటూ సమంత షోకు విచ్చేసిన కార్తికేయను అభ్యర్థించగా అతడు ఓకే చెప్పాడు. మరి మీతో ఒక సినిమా చేయాలనుంది అని కార్తికేయ మనసులోని మాటను బయటపెట్టగా సామ్ అందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. ఇక వారం రోజుల పాటు ఒక్కరే వంట చేయాలన్న బిగ్‌బాంబ్‌ను దివి లాస్యపై వేసింది. తనకు అసిస్టెంటుగా లాస్య అభిజిత్‌ను ఎన్నుకుంది. -
నామినేషన్ అప్పుడు చూపిస్తా: అవినాష్
అఖిల్, అభిజిత్ బద్ధ శత్రువులుగానే అందరికీ తెలుసు. కానీ నేటి ఎపిసోడ్లో మాత్రం ఒకరి మీద ఒకరు జోకులు వేసుకోవడంతో పాటు ఇద్దరూ కలిసి మోనాల్‌పై పంచులు వేశారు. ఒక గొడవలో అయితే అఖిల్ అభికి సపోర్ట్ చేశాడు. ఇక అభి.. అఖిల్, మోనాల్‌కు లవ్ సీన్లు ఎలా చేయాలో వివరించడం గమనార్హం. ఇక ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే అవినాష్ షూటింగ్లో తెగ ఫ్రస్టేట్ అయ్యాడు. టాస్క్‌లో స్క్రీన్ రైటర్ అయినప్పటికీ సినిమాలో పల్లెటూరి బావ పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమా షూటింగ్ ఎలా జరిగిందో చదివేసేయండి.. గంట ఎక్స్ట్రా నిద్ర కోసం తన్నుకు చచ్చారు బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా ఏ కంటెస్టెంటు మ్యాట్రెస్ మీద చివరి వరకు ఉంటారో వారికి ఒకరోజు ఓ గంట ఎక్కువ సేపు పడుకునే అవకాశం కల్పించాడు. ఈ టాస్క్‌లో దివి విజయం సాధించింది. దీంతో నేడు ఆమె ఆ బెడ్‌పై పడుకునే ఛాన్స్ కొట్టేయడంతో పాటు తర్వాతి రోజు ఓ గంట ఆలస్యంగా లేచే అవకాశాన్ని పొందింది. బిగ్‌బాస్ బ్లాక్‌బస్టర్ సినిమా చేయాల్సి ఉంటుందని బిగ్‌బాస్ ఇంటిసభ్యులను ఆదేశించాడు. (ఎలిమినేషన్: మోనాల్‌పై తీవ్ర వ్యతిరేకత) హారికకు గోరుముద్దలు పెట్టిన సోహైల్ అభిజిత్ దర్శకుడిగా, దివి అసిస్టెంట్ దర్శకుడిగా, అవినాష్ స్క్రిప్ట్ రైటర్‌గా, నోయల్ డీఓపీగా, అమ్మ రాజశేఖర్ కొరియోగ్రాఫర్‌గా, లాస్య మేకప్ అండ్ స్టైలిష్, హారిక, సోహైల్ ఐటమ్ సాంగ్ డ్యాన్సర్లుగా ఉంటారు. మేకప్ లేకుండా కనిపిస్తే మా సినిమా పరువు పోతుంది అని అభి అనడంతో దివి ఆమెను లోపలకు తీసుకెళ్లింది. ఇక మాస్టర్ హారిక జోడీకి ఐటమ్ సాంగ్ నేర్పించే పనిలో పడ్డాడు. తర్వాత సోహైల్ హారికకు తినిపించాడు. ఐటమ్ సాంగ్ ఎక్కడ చేయాలన్న విషయంలో మాస్టర్ అభిజిత్ సీరియస్ అయ్యారు. (వాళ్లకు సాయం చేయను: ఏడ్చేసిన హారిక) సోహైల్‌ను ఏడిపించిన లాస్య అఖిల్, మోనాల్‌ను పక్కన పెట్టేసి దర్శకుడు అరియానా, అవినాష్‌ల మీద ఫోకస్ పెట్టాడు. ఇక నోయల్ అరియానాను ఏడిపించే తుంటరి అబ్బాయిగా నటించాడు. అప్పుడు అవినాష్ సీన్లోకి దిగి ఆమెను కాపాడతాడు. సోహైల్‌ను ఐటమ్ అని కాసేపు ఏడిపించారు. 'బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్లు తోపు దమ్ముంటే ఆపు' అని లాస్య ప్రాసతో ఉన్న టైటిల్ చెప్పగా మాస్టర్, మోనాల్ బాగుందని మెచ్చుకున్నారు. డైలాగుల విషయంలో అవినాష్‌కు, అభికి బేధాభిప్రాయాలు వచ్చాయి. ఈ విషయంలో అఖిల్ అభికి సపోర్ట్ చేశాడు. తన రెండు సీన్లకే సినిమా మొత్తం నాదే అంటున్నారని అవినాష్ వాపోయాడు. స్క్రిప్ట్ రైటర్‌గా తాను డైలాగులు చెప్పినా తీసుకోవడం లేదని విసుగు ప్రదర్శించాడు. క్లైమాక్స్ కూడా వద్దంటున్నారని అలిగాడు. అఖిల్ ఒడిలో ఒదిగిపోయిన మోనాల్ ఇక అఖిల్, మోనాల్ లవ్ ట్రాక్‌ను అభి డైరెక్ట్ చేయక తప్పలేదు. దీంతో అభి ఏం ఫిట్టింగ్ పెట్టారు బిగ్‌బాస్ అని తనను తానే తిట్టుకుంటూనే అఖిల్‌ను ఓ పాటతో ఆమెను పడేయమని సూచించాడు. ఇంత మంచి అవకాశం వచ్చాకా అఖిల్ వదులుకుంటాడా? మొన్న కనిపించావు, మైమరిచిపోయాను.. అంటూ సాంగ్ మొదలుపెట్టగానే మోనాల్ అతడి ఒడిలో చేరిపోయింది. వాళ్లు పాత్రలో నటించడం కాదు నిజంగానే జీవించేయడం అభి కూడా మెచ్చుకోక తప్పలేదు. తర్వాత హారిక, సోహైల్ కెవ్వు కేక ఐటమ్ సాంగ్‌కు డ్యాన్స్ ప్రాక్టీస్ చేశారు. ఎట్టకేలకు సినిమా షూటింగ్ పూర్తి తర్వాత ఓ సీన్ చేయాల్సి ఉండగా అస్తమానం టచప్‌లు ఇస్తూ లాస్య, జోకులు పేలుస్తూ దివి అందరినీ డిస్టర్బ్ చేస్తున్నారు. దీంతో కావాలని ఎక్కువ టేకులు తీసుకుంటున్నారని ఈ సీన్లో తాను చేయనంటూ అవినాష్ మండిపడ్డారు. షూటింగ్లో సీరియస్‌గా ఉండకపోతే తనకు నచ్చదని చెప్పుకొచ్చాడు. వాళ్లందరికీ నామినేషన్ సమయంలో చూపిస్తానని కోపాన్ని అణుచుకునేందుకు ప్రయత్నించాడు. ఎట్టకేలకు అర్ధరాత్రి మూడున్నరకు సినిమా పూర్తి చేశారు. (మనాలిలో నాగ్: బిగ్‌బాస్‌కు సమంత?) -
బిగ్‌బాస్: మోనాల్ కోసం అరియానా త్యాగం
బిగ్‌బాస్ హోస్ట్ మారనున్నారన్న ఊహాగానాలకు చెక్ పెడుతూ నేటి ఎపిసోడ్లో నాగార్జునే వ్యాఖ్యాతగా వ్యవహరించారు. బిగ్‌బాస్ డీల్స్‌లో ఇంటిసభ్యులు వదిలేసిన ఒక డీల్‌ను పట్టుబట్టి మరీ చేయించారు. అలాగే కంటెస్టెంట్లు ఒకరి గురించి మరొకరు మనసులో ఏమనుకుంటున్నారనేదాన్ని బయటపెట్టారు. సోహైల్‌పై అరిచిన అవినాష్‌కు చీవాట్లు పెట్టారు. నామినేషన్లో తొమ్మిదిమంది ఉండగా అందులో ముగ్గురిని సేవ్ చేశారు. మరి బుల్లితెర బాస్ బిగ్‌బాస్ షోలో ఇంకా ఏమేం జరిగాయో చదివేసేయండి.. మారని మాస్టర్, సోహైల్‌పై వ్యక్తిగత దూషణ శుక్రవారం నాటి ఎపిసోడ్లో బిగ్‌బాస్ ఇంటిసభ్యులకు దోసె టాస్క్ ఇచ్చాడు. ఇందులో వారు రెండు టీమ్‌లుగా విడిపోయి మినపగుళ్లను పిండి రుబ్బి దోసె వేయాల్సి ఉంటుంది. ఎక్కువ దోసెలు వేసిన మాస్టర్ టీమ్ గెలుపొందగా, అందులోని సభ్యులకు లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో అదనపు పాయింట్లు లభిస్తాయి. ఇక ఆటలో దోసె దొంగిలించినట్లు పరాచకాలు ఆడిన సోహైల్‌పై మాస్టర్ చిర్రుబుర్రులాడాడు. నీకు దొంగ అన్న పేరు కరెక్ట్‌గా పెట్టారని వ్యక్తిగతంగా దూషించారు. అతడి ప్రవర్తనకు షాకైన సోహైల్ ఇప్పటినుంచి ఏ టాస్క్ ఆడనంటూ అలిగాడు. తనకు లేనిపోని అన్ని పేర్లు పెడుతున్నారని బాధపడ్డాడు. కానీ మాస్టర్ మాత్రం అలా దూషించడం తన తప్పే అని అంగీకరించకపోవడం గమనార్హం. ఏదేమైనా ఇంకోసారి సోహైల్‌ను దొంగ అనకండని అఖిల్ మాస్టర్‌కు సూచించాడు. (చదవండి: ఫిజికల్ టాస్కులు అభిజిత్‌కు చేతకాదా?) సోహైల్‌కు సారీ చెప్పిన అరియానా నాగార్జున ఎప్పటిలాగే ఈసారి కూడా అమ్మాయిలు బాగున్నారని మెచ్చుకున్నారు. తర్వాత కంటెస్టెంట్లు చేసిన తప్పొప్పులను ఎత్తి చూపారు. నోయల్‌ను రేసర్ ఆఫ్ ద హౌస్ టాస్క్ ఎందుకు ఆడలేదని ప్రశ్నించారు. అవకాశమొచ్చినప్పుడు వదులుకోవద్దని సూచించారు. నిజమైన నోయల్ ఇంకా బయటకు రావట్లేదన్నారు. ఇక సోహైల్ కోపాన్ని గెలిచేశాడని ప్రశంసించారు. అతడిని పొగరు అన్న అరియానాను నిలబెట్టి నిలదీశారు. అయితే 'సోహైలే వచ్చి తినిపిస్తూ మరీ సారీ చెప్పాడు, కదా! మరి నువ్వు చెప్పవా' అని అడిగారు. దీంతో చెప్పనని మొండికేస్తూనే చివరి నిమిషంలో సారీ చెప్పింది. తర్వాత బిగ్‌బాస్ డీల్స్ టాస్క్‌లో సోహైల్- అవినాష్ మధ్య జరిగిన గొడవలో అవినాష్‌దే తప్పని నాగ్ కుండ బద్ధలు కొట్టారు. సంచాలకుడిగా సోహైల్ కరెక్ట్‌గానే ఉన్నాడని పేర్కొన్నారు. ఇక మోనాల్ ఆరు రోజులుగా ఒకటే డ్రెస్ వేసుకుండటంతో నాగ్ ఓ సలహా ఇచ్చారు. ఈ ఒక్కరోజు మోనాల్‌కు బదులు ఆమె బ్లూ టీమ్‌లోని మిగతా ఎవరైనా ఆమె డ్రెస్ వేసుకోవాలని చెప్పడంతో అరియానా ముందుకు వచ్చింది. (చదవండి: నా లవ్ బ్రేకప్ అయింది: అఖిల్) సేఫ్ అయిన తొలి కంటెస్టెంటు లాస్య బ్లూ టీమ్ వదిలేసిన అరగుండు డీల్ పూర్తి చేసినవారికి తర్వాతి వారం నామినేషన్ నుంచి సేఫ్ అయ్యే అవకాశం ఉంటుందని నాగ్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఈ డీల్‌కు అమ్మ రాజశేఖర్ ఒప్పుకోవడంతో నోయల్ గుండు గీశాడు. తల్లి కోసం చేయని త్యాగం బిగ్‌బాస్ కోసం చేశావని నాగ్ మాస్టర్‌ను ఆకాశానికెత్తారు. మీరు కానీ, లేదా ఇతరులనెవరినైనా సేవ్ చేసే అవకాశమిచ్చారు. హెయిర్ కట్ చేసుకున్నాక కూడా హారిక క్యూట్‌గా ఉందని తెలిపారు. ఇక లాస్య టాస్క్‌లో అన్నీ కలగలిపిన డ్రింక్ ఎలా తాగావని మెచ్చుకుంటూనే ఆమె సేఫ్ అయినట్లు ప్రకటించారు. (చదవండి: బిగ్‌బాస్: మాస్టర్ కాళ్లు పట్టుకున్న సోహైల్) కంటెస్టెంట్ల రంగు బయటపెట్టిన మనసులో మాట ఇంటిసభ్యులు ఒకరి గురించి మరొకరు ఏమనుకున్నారో రాసివ్వగా వాటిని నాగ్ చదివి వినిపించారు. ► అవినాష్‌ది టాస్కు సమయంలో క్రూర మనస్తత్వం-దివి ► మెహబూబ్ ఫ్రెండ్షిప్ సర్కిల్ సెట్ చేసుకుని వారిని వాడుకోవాలనుకుంటాడు. స్వార్థపరుడు కానీ స్నేహం కోసం చేస్తున్నట్టు కలర్ ఇస్తాడు - కుమార్ సాయి ► లాస్యది మోసపూరిత నవ్వు- అమ్మ రాజశేఖర్ ► అభిజిత్‌కు చాలా అహంకారం- దివి ► నోయల్‌ది తాత్కాలిక స్నేహం- అవినాష్ ► అరియానా అతిగా స్పందించడం, పాడటం కొన్నిసార్లు హద్దులు దాటుతుంది- మెహబూబ్ ► దివి.. అహంకారం, అగౌరవం, సభ్యత లేకుండా ఉంటుంది, ఇతర మనోభావాలను పట్టించుకోదు- మోనాల్ ► అఖిల్ నిజాయితీపరుడిగా, ఎటువంటి వంచన లేని మనిషిగా నటిస్తాడు- అభిజిత్ ► మోనాల్ అబద్ధాల కోరు- అభిజిత్ ► అమ్మ రాజశేఖర్ ఏం అరుస్తాడో, నిజాయితీ అన్న ముసుగు ఎలాగైతా ఉండాలనుకుంటున్నాడో అందులో దాచుకుంటాడు- అభిజిత్ నోయల్.. నాకు నాన్న: హారిక తర్వాత నోయల్, హారిక సేఫ్ అయినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా హారిక తనకు ఈ సేవింగ్ చాలా స్పెషల్ అని చెప్పింది. నోయల్‌ను తన నాన్నలా ట్రీట్ చేస్తానని పేర్కొంది. ఇక అరగుండు గీసుకున్న మాస్టర్ తర్వాతి వారం నామినేషన్ నుంచి తానే సేఫ్ అవుతానని వెల్లడించారు. ఇక ఈ వారం మోనాల్ గజ్జర్‌ను కాదని అన్యాయంగా కుమార్ సాయిని ఎలిమినేట్ చేసినట్లు సమాచారం. (చదవండి: బిగ్‌బాస్: ఆమెపై ఎలిమినేషన్ కత్తి) -
పెళ్లి విషయం ఏడేళ్లు దాచా: లాస్య
బిగ్‌బాస్ హౌస్‌లో అందరినీ ఓసారి వారి కుటుంబాలను గుర్తుచేసుకునేందుకు బిగ్‌బాస్ ఓ అవకాశమిచ్చాడు. ఈ సందర్భంగా అందరూ తమ జీవితాల్లో చోటు చేసుకున్న కీలక పరిణామాల గురించి చెప్పుకొచ్చారు. అయితే లాస్య మాత్రం తాను పుట్టినప్పుడు తల్లి పడ్డ బాధ చెప్తూ తల్లడిల్లిపోయింది. వారికి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నప్పుడు నాన్న అసహ్యించుకున్నాడని చెప్తూ కుంగిపోయింది. కానీ ఆ ఇద్దరే ఇప్పుడు తన కొడుకు జున్నును చూసుకుంటున్నారంటూ ఆనంద భాష్పాలతో వారికి కృతజ్క్షతలు చెప్పింది. "నేను రైతు బిడ్డను. 9 నెలలు మోస్తున్నప్పుడు కూడా అమ్మ గడ్డి కోయడానికి వెళ్లింది. అప్పుడే కడుపులో ఉన్న నేను అడ్డం తిరిగానట. ఓ వైపు రక్తం కారుతున్నా అమ్మ కిలో మీటరు నడిచి ఇంటికి చేరుకుని మంచంపై పడుకుంది. నేను అక్కడే పుట్టాను. సహనం అమ్మ దగ్గర, భరించడం నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నాను. నాన్నకు నచ్చని పని(పెళ్లి) చేసినందుకు మూడేళ్లు నాతో మాట్లాడలేదు. అయితే ఆయనకు రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు మొదటిసారి అప్పు చేశాను. అందరి దగ్గరా అడిగి లక్షా 50 వేలు అప్పు చేశాను. మూడు ప్లాస్టిక్ సర్జరీలు జరిగాయి. అప్పుడు నాకు దగ్గరివాళ్లు కూడా సాయం చేయలేదు. నా భర్త ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఇక అప్పటి నుంచి నాన్న మా ఆయన్ను కొడుకు అని పిలుస్తాడు. మా నాన్నను జీవితంలో ఇంకెప్పుడూ బాధపెట్టను" అని లాస్య బిగ్‌బాస్ సాక్షిగా మాటిచ్చింది. (బిగ్‌బాస్: కళ్లకు గాయాలు, ఎలిమినేట్!) తనది రిజిస్టర్ మ్యారేజ్ అని చెప్పుకొచ్చింది. పెళ్లి చేసుకున్న ఏడేళ్ల వరకు ఆ విషయం ఎవరికీ చెప్పలేదని బాధపడింది. షోలకు వెళ్లినప్పుడు కూడా తను నా కజిన్ అని చెప్పానే కానీ భర్త అని చెప్పలేకపోయానని చింతించింది. నాన్నకిచ్చిన మాట కోసమే నా పెళ్లి విషయం బయటపడనివ్వలేదని వాపోయింది. అందరినీ విడిచి ఉంటానని చెప్పాను కానీ చాలా మిస్సవుతున్నాను అంటూ కెమెరాల ముందు కన్నీరుమున్నీరుగా విలపించింది. ప్రతిరోజు రాత్రి గుర్తు చేసుకుంటున్నా అని లాస్య వెక్కి వెక్కి ఏడ్చింది. (గంగవ్వకు కొత్త ఇల్లు కట్టిస్తా: నాగ్) -
ఐదేళ్లుగా నాన్నకు దూరమయ్యా: హారిక
బిగ్‌బాస్ నాల్గో సీజన్లో ఆరో వారం కొనసాగుతోంది. ఇప్పటికే ఆరుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. మరో కంటెస్టెంటు హౌస్‌ను వీడేందుకు సిద్ధంగా ఉంది. ఇక ఇప్పటికే ఫిజికల్ టాస్కులు, బ్రెయిన్ టాస్కులు ఇచ్చిన బిగ్‌బాస్ వారి అందరినీ తమ తమ జీవితాలలో ఓసారి వెనక్కు తిరిగి చూసుకునే అవకాశాన్ని కల్పించాడు. ఏం కోల్పోయారనేది గుర్తు చేస్తూ, ఏం సాధించారనేది వారితోనే చెప్పిస్తున్నాడు. ఈ క్రమంలో ఇంటిసభ్యులు ఎమోషనల్ అవుతున్నారు. ముఖ్యంగా కన్నీళ్ల వరద పారించే మోనాల్‌కు తన తండ్రితో కలిసి దిగిన ఫొటోను పంపించారు. అది చూసి చనిపోయిన తండ్రిని గుర్తు చేసుకుంటూ నాన్న ప్రేమకు దూరమయ్యానని వెక్కివెక్కి ఏడ్చింది. నాన్నతో కలిసి దిగిన ఏకైక ఫొటో ఇదేనని దాన్ని గుండెకు హత్తుకుంది. (చదవండి: బిగ్‌బాస్ వాళ్లే బిట్టూ అని పిలవమన్నారు) 'డబ్బు ఎప్పుడైనా వస్తుంది, కానీ మనుషులను మిస్సయితే చాలా కష్టమ'ని మాస్టర్ కంటతడి పెట్టుకున్నాడు. ఇక దివి కూడా తన చిన్ననాటి ఫొటోను ముద్దాడుతూ.. డాడీ అంటే చాలా ఇష్టం, మమ్మీ అంటే ఇంకా ఎక్కువ ఇష్టమని కన్నీళ్లతో వారిపై ప్రేమ కురిపించింది. తాను బిగ్‌బాస్ హౌస్‌కు వచ్చినందుకు మా నాన్న గర్వంగా ఫీలవుతాడని సోహైల్ సంతోషపడ్డాడు. జీవితంలో నిన్ను ఎప్పుడూ బాధపెట్టను అంటూ లాస్య బిగ్‌బాస్ షో సాక్షిగా తండ్రికి మాటిస్తోంది. ఇక హారిక తన తండ్రికి దూరంగా వచ్చేశానని, వెనక్కు తిరిగి చూసిన రోజు ఆగిపోతామని తెలుసని, అందుకే తాను ఆ పని చేయను అంటూ దుఃఖించింది. దీంతో హౌస్‌లో నేడు ఉద్విగ్న వాతావారణం నెలకొననున్నట్లు కనిపిస్తోంది. (చదవండి: కెప్టెన్‌గా నోయల్, కానీ తప్పని ముప్పు) -
బిగ్‌బాస్: నొప్పితో విలవిల్లాడిన కుమార్
బిగ్‌బాస్ నేడు ఇంటిసభ్యులకు ఇస్తున్న టాస్క్ మూడో సీజన్‌ను గుర్తు చేస్తోంది. కాకపోతే కొన్ని మార్పులు చేర్పులు చేశారంతే. బిగ్‌బాస్ ఇంటిసభ్యులను బ్లూ, రెడ్ టీమ్స్‌గా విడగొట్టారు. ఒకదాన్ని మించి మరొకటిగా వీరికి కష్టతరమైన టాస్కులు ఇస్తున్నాడు. అందులో భాగంగా హారిక తనకు ఏమాత్రం ఇష్టం లేకపోయినా సరే, ఏడుస్తూనే జుట్టు కత్తిరించుకునేందుకు సిద్ధపడిపోయింది. అయితే రెండో సీజన్లో దీప్తి సునయన, మూడో సీజన్లో శివజ్యోతి కూడా జుట్టు కత్తిరించుకున్న విషయం తెలిసిందే. కాకపోతే వీళ్లిద్దరూ నామినేషన్లో ఉన్న ఒకరిని సేవ్ చేసేందుకు ఆ పని చేశారు. ఇక కుమార్ సాయి తను వేసుకున్న డ్రెస్సును కత్తిరించుకోవడంతో పాటు మరో కఠినతరమైన టాస్క్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. (చదవండి: అన్నయ్య లవర్‌ను అక్కా అనేవాడిని: అవినాష్ తమ్ముడు) తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో ప్రకారం కుమార్ ఓ తాడుకు కట్టి ఉన్న బస్తాను కింద ఆనించకుండా పట్టుకోవాలి. ఈ టాస్క్ కూడా గత సీజన్లలో చూసిందే. అయితే ఎక్కువగా జిమ్ముల్లో చెమటలు చిందించడం అలవాటు లేని అతడికి ఇది చాలా కష్టమైన టాస్కే. అతను ఆ బస్తాను ఒంటి చేత్తో మోయలేక అరుపులు, కేకలు పెడుతూ ఏడ్చినంత పని చేశాడు. అతని అవస్థను చూసి ఇంటి సభ్యులు సైతం తెగ కంగారు పడిపోయారు. మరోవైపు స్టోర్ రూమ్‌లో ఉన్న పదార్థాలతో జ్యూసు తయారు చేసి దాన్ని రెండు గ్లాసులు తాగాల్సి ఉంటుందని బిగ్‌బాస్ ఆదేశించాడు. ఈ ఛాలెంజ్ పూర్తి చేసేందుకు లాస్య ధైర్యంగా ఓ అడుగు ముందుకేసింది. కానీ చిత్రవిచిత్రమైన ఆ జ్యూసును తాగడం ఆమెకు అత్యంత కష్టంగా ఉన్నప్పటికీ కళ్లు మూసుకుని గ్లాసులు ఖాళీ చేసేందుకు ప్రయత్నిస్తోంది. నేటి ఎపిసోడ్లో మిగతా వారికి సైతం ఇలాంటి కఠినమైన టాస్కులే ఇచ్చినట్లు కనిపిస్తోంది. వాటిని ఇంటి సభ్యులు ఎలా పూర్తి చేస్తారనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. (చదవండి: బిగ్‌బాస్ : కెప్టెన్ పవర్‌తో ఫ్రెండ్‌ని సేవ్ చేసిన సోహైల్) -
బిగ్‌బాస్: అదిరేటి డ్రెస్ మేమేస్తే..
బిగ్‌బాస్ సీజన్ 4లో కావాల్సినంత వినోదం అందుతోంది. ఆటలు, పాటలు, టాస్క్‌లతోపాటు హౌజ్‌లో అందానికి కూడా కొదవేలేదు. ఈ సీజన్లో గంగవ్వ మినహా ప్రస్తుతం ఉన్న అమ్మాయిలంతా దాదాపు యంగ్ వారే కావడంతో కంటెస్టెంట్ల మధ్య బోలెడంత లవ్‌ట్రాక్‌లు నడుస్తున్నాయి. ఇక రోజులు గడుస్తున్న కొద్దీ కొత్త కొత్త టాస్క్‌లు,స్కిట్లతో బిగ్‌బాస్ ప్రేక్షకులను అలరిస్తోంది. కాగా బిగ్‌బాస్ ప్రతి సీజన్లోనూ ఓ ఎపిసోడ్‌ను ఫ్యాషన్ షోకు కేటాయించే సంప్రదాయం కొనసాగుతోంది. అలాగే ఈ సీజన్లో కూడా నేడు బిగ్‌బాస్ హౌజ్‌లో ష్యాషన్ షో జరగనుంది. చదవండి: అఖిల్‌కు సర్ప్రైజ్ ఇవ్వనున్న బిగ్‌బాస్ అయితే ఈ ఫ్యాషన్ షోలో ఇంటి సభ్యులందరూ సంప్రదాయమైన దుస్తులను ధరించాల్సి ఉంటుంది. దీంతో కంటెస్టెంట్లందరూ తమ ట్రెడీషనల్ లుక్‌లో జిగేలు మనిపించారు. అబ్బాయిలంతా కుర్తా దుస్తుల్లో స్టేజ్‌పై ర్యాంప్ వాక్‌తో అదరగొట్టగా..ఇక అమ్మాయిలయితే తమ అందచందాలతో మైమరిస్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. చీర కట్టుతో పదహారణాల తెలుగింటి అమ్మాయిలాగా మెరిసిపోతున్నారు. అంతేగాక బిగ్‌బాస్ గ్యాంగ్ అంతా స్టేజ్ మీదకు వచ్చి డాన్స్‌లతో కెవ్వు మనిపించనున్నారు. ఆ తర్వాత అవినాష్ ఇంట్లోని ఆడవాళ్లకు అద్దంలా మారబోతున్నాడు. తన ముందుకు వచ్చిన అమ్మాయిలతో అద్దంగా మారిన అవినాష్ వారిపై సరదాగా సెటైర్లు వేస్తూ హాస్యం పండించనున్నారు. చదవండి: బిగ్‌బాస్: మాస్టర్ కాళ్లు పట్టుకున్న సోహైల్ Adarakotte fashion show ayyaka...#Avinash addamlo book aipoyaru 😂 #BiggBossTelugu4 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/gGGvolKgZr — starmaa (@StarMaa) October 2, 2020 -
బిగ్‌బాస్: ఈ వారం నామినేషన్లో ఏడుగురు
రోజులు గడుస్తున్న కొద్ది బిగ్‌బాస్ సీజన్ 4 మెల్లగా పుంజుకుంటుంది. బిగ్‌బాస్ ఒక్కోరోజు ఒక్కో రకంగా టాస్కులు ఇస్తున్నాడు. ముఖ్యంగా షో మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మరింత ఆసక్తికరంగా మారిపోయింది. పైగా ఇంట్లో కూడా ఒకరి మధ్య ఒకరు బాగానే పుల్లలు పెట్టుకుంటున్నారు. దాంతో ఒకరంటే ఒకరు మండిపడుతున్నారు. ఓ రకంలో అందరి నిజస్వరూపాలను టాస్క్‌లు బయటపడేలా చేస్తున్నాయి. ఈ వారం నామినేషన్స్‌లో భాగంగా కూడా ఒకరిపై ఒకరు చాలా సెటైర్లు వేసుకున్నారు. స్వాతి దీక్షిత్ మార్నింగ్ మస్తీతో ఇంటి సభ్యులను అలరించగా.. బిగ్‌బాస్‌లో ఈరోజు ఇంకేం జరిగిందంటే...(సై అంటే సై: లాస్య, నోయల్ మధ్య మాటల యుద్ధం) ఉదయం కాగానే మాస్ మహారాజ్ రవితేజ ‘గొంగూరు తోట కాడా కాపు కాసా’ మాస్ పాటకు ఇంట్లోని సభ్యులంతా ఎనర్జిటిక్‌గా డాన్స్ చేశారు. ఆ తర్వాత మార్నింగ్ మస్తిలో స్వాతి ఇంటి సభ్యులకు నవరసాలను నేర్పించాల్సి ఉంటుంది. అయితే స్వాతి తన పార్ట్నర్గా అభిజిత్‌ను ఎంపిక చేసుకుంది. శృంగార రసంలో భాగంగా అభిజిత్‌ను లవ్ చేస్తున్నట్లు చెప్పింది. ఇక ఏడుపులో స్వాతి కంటే ముందే మోనాల్ ఏడ్చేసింది. కోపం టాస్క్‌లో భాగంగా లాస్య, నోయల్ మధ్య గొడవ పడుతున్నట్లు నటించారు. నా గురించి వేరే వాళ్ల వద్ద ఎందుకు మాట్లాడినవ్ అని అనగా.. నాకు వెనకాల చెప్పే అవసరం లేదంటూ లాస్య గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. బీభత్సంలో అవినాష్‌పై గంగవ్వ అరిచింది. (బిగ్‌బాస్: ఈ వారం ఎవరు మర్డర్ కానున్నారు?) అక్కా , తమ్ముడిలా ఉన్నారు అనంతరం అభిని సులభంగా నామినేట్ చేయోచ్చు అంటూ దివి, మోహబూబ్ చర్చించుకున్నారు. అలాగే అరియానా, అవినాష్ మధ్య చర్చ జరిగింది. అందరితో ఉన్నట్లు నాతో ఉండటం లేదని అరియానా అవినాష్‌పై అలిగింది. ఇంతకు ముందు వేరేలా ఉండేవాడివని, నాపై నీకు వేరే అభిప్రాయం ఉండేదని అవినాష్‌ను ఆటపట్టించింది. అవినాష్ వచ్చి మోనాల్‌కు దగ్గరయ్యేందుకు అమ్మ గుర్తొస్తుందని సరదాగా అంటుండగా మధ్యలో అఖిల్ కల్పించుకొని సేమ అక్కా , తమ్ముడిలా ఉన్నారంటూ పంచ్ వేశాడు. దీంతో అవినాష్ మరింత ఏడుస్తున్నట్లు నటించాడు. అక్కడ ఒక ఫన్నీ క్రియోట్ చేశాడు అవినాష్. దివి, అభి మాట్లాడుకుంటూ కొన్ని కొన్ని సందర్భాలలో వేరేలా ప్రవర్తిస్తుంటావని అభి ముఖంపైనే దివి చెప్పేసింది. నేనైతే నిన్నే నామినేట్ చేస్తాను. అని తేల్చి చెప్పింది. అనంతరం అఖిల్, సోహైల్‌ను స్టోర్ రూమ్‌లో ఉన్న దుస్తులు ధరించాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. ఆ దుస్తుల్ని ధరించి ఏదో హీరోల్లాగా ఫీల్ అయిపోయారు. ఇక సోమవారం నామినేషన్ ప్రారంభమైంది. ఇంట్లో ఇద్దరు హిట్ మెన్లు(అఖిల్, సోహైల్) ఉంటారు. మిగిలిన ఇంటి సభ్యులంతా లివింగ్ ఏరియాలో ఉండాలి. ప్రతి ఒక్కరికి బిగ్‌బాస్ 10 వేల రూపాయలు ఇస్తాడు. అలాగే ఇద్దరు హిట్మెన్లకు ఒక్కొక్కరికి 5 వేలు ఇస్తాడు. సమయానుసారం ఇంట్లో 5 బజర్లు మోగుతాయి. ప్రతి బజర్ మోగినప్పుడు లాంజ్‌లోకి ఎవరు మొదటగా వస్తే వారే హిట్మెన్లతో మర్డర్ డీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఎవరినైతే చంపాలి అనుకుంటున్నారో వారి పేరు చెప్పి, అంందుకు గల కారణాలను వివరించాలి. చనిపోయిన వ్యక్తి నాయినేట్ అయినట్లు. ఈ వారం ఇంటి కెప్టెన్ అయిన కారణంగా గంగవ్వ, అరియానాను దేవి సేఫ్ చేసినందున తనను కూడా ఇంటి సభ్యులెవరు నామినేట్ చేయరాదు. ఈ టాస్క్‌లో ముందు బజర్‌కు అమ్మ రాజశేఖర్ మాస్టర్ వచ్చారు. వచ్చి రాగానే తను స్వాతిని చంపాలి అనుకుంటున్నట్లు వెల్లడించారు. స్వాతి ఇటీవల వచ్చినట్లు తనకు ఎవరితో ఎక్కువ కాంటాక్ట్ అవ్వడం లేదని చెప్పారు. అలాగే స్వాతి కొంచెం హౌజ్‌లో నటిస్తుందని తెలిపాడు. వెంటనే గన్ తీసుకొని స్వాతిని అఖిల్ మర్డర్ చేశాడు. అయితే తనను నామినేట్ చేసినందుకు స్వాతి కొంచెం ఫీల్ అయ్యింది. అనంతరం మాస్టర్‌తో కొంచెం సీరియస్ అయ్యింది. రెండోసారి మొహబూబ్ ఇంట్లోకి మొదట వచ్చాడు. అభిని చంపేందుకు ప్లాన్ ఇచ్చుకున్నాడు. రోబో టాస్క్‌లో భాగంగా గల్లీ బాయ్స్అని అభి ఎగతాళి చేసినట్లు కారణంగా చెప్పుకొచ్చాడు. రెండోసారి కూడా అఖిల్ గన్ అందుకొని అభిని షూట్ చూసి నామినేట్ అయినట్లు ప్రకటించాడు. మోహబూబ్ చాలా ముక్కోపి మూడో బజర్‌కు అరియానా ముందుగా రూమ్‌లో వచ్చి లాస్యను చంపేందుకు ప్లాన్ ఇచ్చింది. అరియానా వల్ల ఇంటి సభ్యులంతా ఇరిటేడ్ అవుతున్నారని లాస్య చెప్పిందని, దాని వల్ల తనపై బయట తప్పుగా చూపిస్తుందని తెలిపింది. అది పక్కా అబద్దం అని తెలిపింది. మళ్లీ తనను నామినేట్ చేయటానికి అన్ని దెబ్బలు తగిలించుకొని వెళ్లలా అని లాస్య వెటకారంగా మాట్లాడింది. అయితే మధ్యలో ప్రతి సారి అఖిల్‌కు మర్డర్ డీల్ వస్తుందని అసూయతో సోహైల్ అఖిల్ డబ్బులను తన సూట్‌కేస్‌లోకి మార్చుకున్నాడు. నాలుగో బజర్‌కు వచ్చిన అలేఖ్య హారిక తన ఫ్రెంఢ్ మెహబూబ్‌ను అంతం చేసేందుకు డీల్ మాట్లాడుకుంది. టాస్క్‌లో భాగంగా మోహబూబ్ చాలా ముక్కోపిగా వ్యవహరించాడని, ఓవర్ కన్ఫిడెన్స్ కనిపించిందని తెలిపింది. ఈ సారి సోహైల్‌కు గన్ దొరికి మోహబూబ్‌ను చంపేశాడు. అయిదో బజర్‌కు తెలివిగా నటించినట్లు చేస్తూ నోయల్ ఇంటి నుంచి కాకుండా గార్డెన్ ఏరియా నుంచి రూమ్‌లోకి వచ్చాడు. కానీ నిబంధనల ప్రకారం ఇంట్లో నుంచి రావాలి కాబట్టి నోయల్ ను ఆపేసి తన తర్వాత వచ్చిన సుజాత రూమ్‌లోకి వెళ్లింది. వెంటనే కుమార్ సాయిని నామినేట్ చేసింది. ఎంత ప్రయత్నించినా కుమార్ కలవడం లేదని, టాస్క్‌లో లీనం అవ్వడం లేదనే కారణంతో మర్డర్ డీల్ కుదుర్చుకున్నాడు. అఖిల్ వచ్చి కుమార్‌ను మర్డర్ చేశాడు. అయిదు బజర్లు అయిపోయాకా కూడా సోహైల్ అఖిల్ సూట్‌కేస్ లాక్కునేందుకు ప్రయత్నించాడు. చివరకు ఎవరి సూట్‌కేస్‌లో ఎంత డబ్బు ఉంటే వాళ్లు సేఫ్ అయినట్లు కావడంతో అఖిల్ వద్ద ఎక్కువ ఉండటంతో అఖిల్ సేఫ్ అయ్యాడు. దీంతో అఖిల్ ఒక్కరిని నామినేట్ చేయాల్సి ఉండగా, హారికను నామినేట్ చేశాడు. అఖరుగా ఈ వారం ఇంటినుంచి బయటకు వెళ్లేందుకు స్వాతి, అభిజిత్, మెహబూబ్, లాస్య, హారిక, కుమార్‌సాయి, సోహైల్ నామినేట్ అయ్యారు. మరి ఎవరూ ఉంటారో, ఎవరూ ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే ఆదివారం వరకు వేచి చూడాలి. -
లాస్య, నోయల్ మధ్య మాటల యుద్ధం..
సండే ఫన్డే కావడంతో హౌజ్‌మెట్స్ అంతా ఖుషీఖుషీగా గడిపారు. నాగార్జున ఇచ్చిన టాస్కులు పూర్తి చేసి ఆటపాటలతో సరదాగా గడిపారు. అయితే బిగ్‌బాస్‌లో ఆదివారం ఒకరూ ఎలిమినేషన్ కావాల్సి ఉండటంతో ఈ సారి ఎవరూ ఊహించని విధంగా దేవి నాగవల్లి బిగ్‌బాస్ హౌజ్ నుంచి వెనుదిరిగారు. ఎప్పుడూ లేనిది ఇంటి సభ్యులంతా దేవి కోసం కంటతడి పెట్టుకున్నారు. దీంతో సోమవారం నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే మునెపెన్నడూ లేని విధంగా ఈవారం నామినషన్ సరికొత్తగా ఉండబోతుంది. ఇప్పటి వరకు ఇంటి సభ్యుల్లో ఎవరి ఇద్దరి మధ్య కూడా పెద్ద రచ్చ జరగలేదు. కానీ ప్రస్తుతం లాస్య, నోయల్ మధ్య పెను తుఫాన్‌లా మాటల యుద్దం జరిగేలా కన్పిస్తోంది. చదవండి : (బిగ్‌బాస్: నామినేషన్లో ఎవరూ మర్డర్ కానున్నారు?) ఏదో విషయంపై పెరిగిన మాటల చర్చ చివరకు ఇద్దరి మధ్య తీవ్ర గొడవకు దారి తీసినట్లు తెలుస్తోంది. నోయల్ గురించి లాస్య ఎవరితోనో రహస్యంగా మాట్లాడినట్లు నోయల్‌కు తెలియడంతో సరాసరి లాస్య వద్దకు వచ్చి నా గురించి ఏం మాట్లాడవ్ అంటూ తనను నిలదీశాడు. ‘నేను ఏం మాట్లాడలేదు. ముందు ఎవరూ మాట్లాడారో అడిగి తెలుసుకొని నిలదీయాలి’ అని సూటిగా చెప్పింది. దీంతో ఆవేశానికి వెళ్లిన నోయల్ ‘ఎందుకు అరుస్తున్నావ్.. నాకు అరవడం రాదనుకుంటున్నావా’ అంటూ లాస్యపై విరుచుకుపడ్డాడు. దీనిపై స్పందించిన లాస్య నీకే కాదు అరవడం నాకు కూడా వచ్చు. నీ వెనకాల మాట్లాడే అవసరం నాకు లేదు అని ఖరఖండిగా చెప్పేసింది. అయినప్పటికీ కూల్ అవ్వని నోయల్ నా ముందు మాట్లాడండి పిలుస్తాననగా.. ముందుకు తీసుకురా మాట్లాడుదాం అని లాస్య తేల్చి చెప్పేసింది. దీంతో లాస్య, నోయల్ మధ్య ఈ సంఘర్షణ సై అంటే సై అనేలా సాగబోతుంది. ఇదంతా చూస్తుంటే ఇకపై బిగ్‌బాస్ అంచనాలను మించి ఉండబోతోందని అర్థం చేసుకోవచ్చు. (స్వాతి దీక్షిత్ గురించి లాస్య చెప్పింది నిజమేనా?) Heated discussion between #Lasya and #Noel 🔥 🔥 #BiggBossTelugu4 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/2eAIvvqQdv — starmaa (@StarMaa) September 28, 2020 -
స్వాతి దీక్షిత్ గురించి లాస్య చెప్పింది నిజమేనా?
బిగ్‌బాస్ నాల్గవ సీజన్ కంటెస్టెంట్లు పక్కా ప్లాన్‌తోనే హౌస్‌లో అడుగు పెట్టారని ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలీదు కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన వాళ్లు మాత్రం ఎలా ఆడాలనేది ముందే డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. కాగా '100 శాతం ఎంటర్టైన్మెంట్' అన్న మాటను నిలబెట్టుకోలేకపోతున్న తరుణంలో బిగ్‌బాస్ టీమ్ ముక్కు అవినాష్‌ను హౌస్‌లోకి దించింది. ఎవరెలాంటి వారు? హౌస్‌లో ఏం జరుగుతోంది? అని రెండువారాలపాటు బాగానే పరిశీలించిన అవినాష్ ఇంటి సభ్యులతో కలిసిపోయి ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాడు. (చదవండి: అఖిల్‌ను దత్త పుత్రుడు చేసుకుంటా: గంగవ్వ) లాస్య చేసిన తప్పే కుమార్ చేశాడు కానీ అతడి కన్నా ముందొచ్చిన కుమార్ సాయి మాత్రం అటు వాళ్లతో కలవలేక, అలా అని ఒంటరిగా ఉండలేక, తనకే అర్థం కాని ఓ అయోమయంలో పడిపోయాడు. దీన్ని అవకాశంగా మలుచుకున్న ఇతర కంటెస్టెంట్లు కుమార్‌ను టార్గెట్ చేస్తున్నారు. దీంతో నవ్విస్తానని వచ్చిన అతడు బాధలో కొట్టుమిట్టాడుతున్నాడు. పైగా నిన్నటి ఎపిసోడ్లో అభిజిత్, అఖిల్ విషయం గురించి ఇతను ప్రస్తావించి గొడవ చేయడం మొదటికే మోసం వచ్చింది. అనవసరంగా గత వారం లాస్య చేసిన తప్పే ఈసారి కుమార్ చేశాడని నెటిజన్లు విమర్శిస్తున్నారు. (చదవండి: బిగ్‌బాస్: నేడే వైల్డ్ కార్డ్ ఎంట్రీ) స్వాతి ప్లాన్ నాకు నచ్చలేదు ఇదిలా వుంటే మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా స్వాతి దీక్షిత్ హౌస్‌లో ఎంటర్ అయింది. మరిన్ని లవ్‌స్టోరీలు కల్పించాలనే ఉద్దేశ్యంతోనే ఆమెను తీసుకొచ్చినట్లు కనిపిస్తోంది. ఇక ఇంట్లోకి ప్రవేశించి ఇంకా రెండు రోజులే అవుతుంది, కాబట్టి ఇప్పటివరకు ఆమె గురించి ఎవరూ తప్పుగా అనలేదు. కానీ లాస్య మాత్రం ఆమెలో తనకు ఒక విషయం నచ్చలేదని అందరి ముందే బహిరంగంగా వెల్లడించింది. బిగ్‌బాస్ హౌస్‌లో ఎవరెవరితో స్నేహం చేయాలి? ఎవరితో క్లోజ్‌గా ఉండాలనేది స్వాతి ముందుగా డిసైడ్ చేసుకుని వచ్చిందని పేర్కొంది. ఆమె అభిజిత్, హారిక, నోయల్, మరో ఇద్దరు ముగ్గురితో ఎక్కువగా ఉంటోందని చెప్పింది. లాస్య చెప్పిన పేర్లను చూస్తే నిజంగానే ఆమె ప్లాన్ చేసుకుని వచ్చిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఆమె ప్రస్తావించిన వాళ్లందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లు మాత్రమే కాకుండా ఇప్పట్లో ఎలిమినేట్ అయ్యేందుకు ఆస్కారమే లేని వారు కావడం గమనార్హం. -
అఖిల్, మోనాల్‌ను గంగవ్వ విడదీస్తోందా?
గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యానికి నివాళులిస్తూ బిగ్‌బాస్ షో ప్రారంభమైంది. కానీ కంటెస్టెంట్లకు మాత్రం ఆయన మరణవార్తను తెలియజేయకపోవడం గమనార్హం. ఇక రోజురోజుకీ ఆటలో మరింత రాటు దేలుతున్న గంగవ్వకు అఖిల్ అంటే ఇష్టం. మోనాల్ అంటే కష్టం. దీంతో నేటి ఎపిసోడ్లో వారిద్దరినీ వేరు చేసేందుకు ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. ఇదిలా వుంటే కింగ్ నాగార్జున ఇద్దరు అమ్మాయిలు సేఫ్ అయినట్లు వెల్లడించారు. వారెవరో, నేటి ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో చదివేయండి.. అఖిల్ దత్తపుత్రుడిగా తీసుకువెళ్తా: గంగవ్వ గంగవ్వ ఈ మధ్య మరీ హుషారుగా కనిపిస్తోంది. అంతేకాదు, మోనాల్‌ను కూడా ఏడిపించేసింది. నీతో మాట్లాడకని అఖిల్‌కు నేనే చెప్పానని అవ్వ అనడంతో నిజమని నమ్మిన మోనాల్ కంటతడి పెట్టుకుంది. దీంతో ఊరికే అన్నానని బుజ్జగించింది. ఇక తనకు ఎంతో ఇష్టమైన అఖిల్‌ను దత్తపుత్రుడిగా స్వీకరిస్తానని చెప్పుకొచ్చింది. మరి అతడికి భార్యగా ఆమె వద్దా అని లాస్య.. మోనాల్ వైపు వేలు పెట్టి చూపిస్తే ఛీ, ఇక్కడున్నవాళ్లు వద్దు అని తేల్చి చెప్పింది. అలాగే నాగ్ ముందు కూడా మోనాల్‌కు గట్టిగానే కౌంటర్లు ఇచ్చింది. అమ్మాయిలు అమ్మాయిలతో, అబ్బాయిలు అబ్బాయిలతో ఉండాలని తేల్చి చెప్పింది. చూస్తుంటే తన అఖిల్.. మోనాల్‌తో ఉండటం అవ్వకు ఏమాత్రం ఇష్టం లేనట్లు కనిపిస్తోంది. మరోవైపు అరియానాలో రోజురోజుకీ గెలవాలన్న కసి పెరిగిపోతోంది. ఈ సీజన్లో అమ్మాయే గెలవాలని బలంగా కోరుకుంటోంది. ఒకవేళ తాను వెళ్లిపోతే, తన బాధ్యతను స్వీకరించాల్సిందిగా దేవి నాగవల్లి దగ్గర మాట తీసుకుంది. (చదవండి: బిగ్‌బాస్: విశ్వరూపం చూపించిన గంగవ్వ) ఏ అక్షరం మైండ్లోనూ ఉంది: మోనాల్ నామినేషన్లో ఉన్న ఏడుగురితోనే నాగ్ గేమ్స్ ఆడించారు. అందులో భాగంగా నాగ్ అడిగిన ప్రశ్నలకు నామినేట్ అయిన కంటెస్టెంట్లు ఇలా సమాధానమిచ్చారు. ఇంట్లో కుమార్ సాయి తనకు పోటీయే కాదని హారిక తెలిపింది. ఇంట్లో నారదుడు సోహైల్ అని మోనాల్ తెలిపింది. ఆమెతో నాగ్ మాట్లాడుతూ నీ మనసులో ఏ అక్షరం ఉందని నాగ్ చెప్పడంతో, మైండ్‌లో కూడా ఉన్నారని నవ్వేసింది. బిగ్‌బాస్ హౌస్‌లో మోనాల్ ఉత్తమ అబద్ధాల కోరు అని లాస్య ప్రకటించింది. మరోవైపు కిడ్నాప్ ప్లాన్ అభిజిత్‌దే అని లాస్య చెప్తుంటే కాదు తాను చెప్పానని గంగవ్వ అడ్డు పడింది. ఇక ఎలిమినేట్ అయిన వారిని కుమార్ సాయి స్థానంలోకి తీసుకురావచ్చని దేవి నాగవల్లి పేర్కొంది. ఎందుకంటే అతడిలో ఇంకా క్లారిటీ లేదని స్పష్టం చేసింది. (చదవండి: బిగ్‌బాస్: గంగవ్వకు అతడిష్టం, ఆమె కష్టం) ఒకరంటే మరొకరికి మహా చిరాకు సోహైల్ ఇంట్లో తనకు బాగా చిరాకు తెప్పించే వ్యక్తి అని అరియానా చెప్పగా, తనకు కూడా చిరాకు తెప్పించే వ్యక్తి అరియానా అని సోహైల్ పేర్కొన్నాడు. కుమార్ సాయికి అసలు ఇంట్లో ఉండేందుకు అర్హత లేదని మెహబూబ్ చెప్పుకొచ్చాడు. అవకాశం వచ్చినప్పుడు కూడా ఉపయోగించుకోవడం లేదని తెలిపాడు. సోహైల్, తాను కర్ణార్జునలా కనెక్ట్ అయ్యామని మెహబూబ్ తన స్నేహాన్ని చాటుకున్నాడు. ఈ ఇంట్లో అత్యంత నకిలీ వ్యక్తి అభి అని కుమార్ సాయి అభిప్రాయపడ్డాడు. టాస్క్‌లో నోటికొచ్చినట్లు తిడుతున్నాడని బాధపడ్డాడు. "24 ఏళ్ల అఖిల్.. పెద్ద చదువులు చదివిన నన్ను ఒరేయ్ అంటాడా? అని అభిజిత్ పంచాయతీ చేశాడు. కానీ అతను కోరుకున్న గౌరవం వేరేవాళ్లకు(నాకు) కూడా ఇవ్వాలి కదా అని బాధపడ్డాను. ఈ విషయంలో అతను సారీ చెప్పకపోతే ఎలిమినేట్ అయ్యేంతవరకు అతడినే నామినేట్ చేస్తాను" అని కుమార్ చెప్పడంతో అభి మరో ఆలోచన చేయకుండా క్షమాపణ కోరడం విశేషం. ఓటమి నుంచి బయటపడని మనుషుల టీమ్ కానీ ఆ వెంటనే అఖిల్ తానెప్పుడూ అరేయ్ అని అనలేదని గరమవడంతో, ఇప్పటికే దీని గురించి మాట్లాడుకున్నామని అభి క్లారిటీ ఇచ్చాడు. ఇక గత టాస్క్‌లో ఓడిపోయిన మనుషుల టీమ్ ఓటమి నుంచి బయటపడినట్లు కనిపించడం లేదు. ఓటమి చెందిన మనసు మంచిది అని సంకేతాలు ఇస్తూ ర్యాప్ సాంగ్ పాడారు. ఇంటి సభ్యులందరూ రోబోల టీమ్‌లో మహా నాయకుడుగా గంగవ్వ పేరు చెప్తే నాగ్ మాత్రం యుద్ధం చేశాడంటూ అభిజిత్ పేరు చెప్పారు. అవినాష్‌కు మహా కంత్రి అవార్డు బహుకరించారు. గంగవ్వకు మహా నటి అవార్డు బహుకరించారు. ఆమె ట్రాప్ చేసేందుకు ప్రయత్నించిన క్లిప్పింగ్‌ను చూపించారు. అది చూసి మనుషుల టీమ్ షాక్‌కు లోనయ్యారు. అటు అవ్వ కూడా ఇదంతా టీవీలో వచ్చిందా అని ఖంగు తింది. తర్వాత లాస్య సేఫ్ అయినట్లు ప్రకటించారు. (చదవండి: అభిజిత్‌లో ధోనీని చూశా: యాంకర్ రవి) ఇంటి సభ్యుల్లో మీకు నచ్చనిది ఇంటి సభ్యులు ఒక్కొక్కరుగా ఒక్కో కంటెస్టెంటులో నచ్చని గుణం ఏంటో చెప్పుకొచ్చారు. అఖిల్ చిన్న చిన్న విషయాలకే కోపానికొస్తాడని మోనాల్ బుంగమూతి పెట్టుకుంది. మరి తనను ఒక్కోసారి అభి అని పిలుస్తుందని అఖిల్ చిన్నబుచ్చుకున్నాడు. కుళ్లు జోకులేస్తున్నాడని నోయల్ మాస్టర్‌పై ఫిర్యాదు చేశాడు. కానీ ఆయన చిన్నపిల్లాడని అంతలోనే వెనకేసుకొచ్చాడు. అభి కనిపించేంత అమాయకుడు కాదని దివి పేర్కొంది. గంగవ్వ ఇష్టపడే వాళ్లు తప్పు చేసినా వారినే సపోర్ట్ చేస్తుందని దేవి అభిప్రాయపడింది. ఇంట్లో ఏమైపోతుందా అని లాస్య ఊరికే కంగారు పడిపోతుందని అవినాష్ చెప్పుకొచ్చాడు. స్వాతి దీక్షిత్ ప్రిపేర్ అయి వచ్చింది అభి అందరితో కలవట్లేదని సుజాత చెప్పింది. ఏ, నీకు చెల్లె అనడం నచ్చలేదా అని నాగ్ నిలదీయడంతో నీళ్లు నమిలిన సుజాత.. లేదు, ఛీ అనడం మాత్రమే నచ్చలేదని స్పష్టం చేసింది.. బ్రష్ చేసుకోకుండానే టీ, కాఫీలు తాగుతుందని అవ్వ హారిక ఇజ్జత్ తీసింది. దివికి దేనికి ఏడవాలో, దేనికి నవ్వాలో తెలీదని మాస్టర్ చెప్పుకొచ్చాడు. స్వాతి ఎవరితో క్లోజ్‌గా ఉండాలో ముందే ప్లాన్ చేసుకుని వచ్చిందని లాస్య పేర్కొంది. అనంతరం మోనాల్ సేఫ్ అయినట్లు ప్రకటించారు. -
బిగ్‌బాస్: కాళ్లు మొక్కినా కనికరించలేదు!
బిగ్‌బాస్ షోలో నిన్నటి ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది. అసలే నిన్న ఐపీఎల్ ప్రారంభం కావడంతో చాలామంది ప్రేక్షకులు బిగ్‌బాస్‌కు గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. కానీ అనూహ్యంగా బిగ్‌బాస్ గేమ్ మార్చాడు. డబుల్ ఎలిమినేషన్ అంటూ అందరిలో ఆసక్తి రేపాడు. మరోవైపు హీరో-జీరో గేమ్‌లో శ్రుతి మించిన కామెడీ అని లాస్య.. అమ్మ రాజశేఖర్‌ను జీరోగా పేర్కొంది. అక్కడితో ఆగకుండా ఓ ఫొటో షూట్ కోసం దివి ప్రెగ్నెంట్‌గా కనిపించేందుకు రాజశేఖర్ స్వయంగా ఆమెకు పిల్లో సర్దడం తనకు కరెక్ట్ అనిపించలేదని చెప్పుకొచ్చింది దివి పట్ల ఆయన అలా ప్రవర్తించాల్సింది కాదని చెప్పడంతో మాస్టర్ తట్టుకోలేకపోయాడు. తనకు ఎలాంటి ఉద్దేశం లేదని, అది టాస్క్ కోసం హడావుడిలో చేశానని చెప్పుకుంటూ ఏడ్చేశాడు. (బిగ్‌బాస్ నాకు సారీ చెప్పాలి: నోయల్) తన వల్ల ఏడ్చినందుకు బాధపడ్డ లాస్య అతడి కాళ్లు మొక్కి మరీ క్షమించమని కోరింది. అయినప్పటికీ హౌస్‌లో వాతావరణం మరింత వేడెక్కిందే కానీ చల్లబడలేదు. పైగా లాస్య తన పేరును ప్రస్తావిస్తూ చేసిన కామెంట్స్‌ను దివి జీర్ణించుకోలేకపోయింది. 'ఆ విషయంలో నాకెలాంటి అభ్యంతరం లేదు, మధ్యలో నీకెందుకు, షటప్' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. దివి యాటిట్యూడ్ చూసి షాకైన లాస్య నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడంటూ వార్నింగ్ ఇచ్చింది. అయితే మాస్టర్ ఏడ్వటంతో ఇంటి సభ్యులందరూ అతడిని ఓదార్చటమే కాక, చాలామంది మాస్టర్నే హీరోగా ప్రకటించారు. ఈ ఒక్క సన్నివేశంతో లాస్య విలన్‌గా మారిపోయింది. (బిగ్‌బాస్ పిచ్చి కామెడీ దారిలో వెళుతుంది: దేవి ఫైర్) కాగా దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. లాస్య తనకు అనిపించింది చెప్పారని, అయినా ఎవరి అభిప్రాయాలు వారికుంటాయంటూ ఆమెను వెనకేసుకొస్తున్నారు. దీన్ని మాస్టర్ పాజిటివ్‌గా తీసుకుంటే అసలు ఏ సమస్యా ఉండేది కాదని అభిప్రాయపడుతున్నారు. దివి నోరు జారడాన్ని సైతం విమర్శిస్తున్నారు. మరికొందరు మాత్రం మాస్టర్ ఇమేజ్ను దెబ్బతీసేందుకే లాస్య అలాంటి కామెంట్స్ చేసిందని మండిపడుతున్నారు. దివికే అభ్యంతరం లేనప్పుడు మధ్యలో ఆవిడకేంటని ప్రశ్నిస్తున్నారు. ఏదైతేనేం, నిన్న ఒక్క ఎపిసోడ్ హౌస్‌లో కార్చిచ్చును రాజేసింది. (ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ పనిష్మెంట్) -
దివి, నోరు అదుపులో పెట్టుకో: లాస్య వార్నింగ్
వైల్డ్ కార్డ్ కంటెస్టెంటుగా అడుగు పెట్టిన కుమార్ సాయి ఏకాకిగా మారాడన్న విషయం నేడు మరోసారి స్పష్టమైంది. ముందుగా ఊహించినట్టుగానే కళ్యాణి బిగ్‌బాస్ హౌస్‌కు గుడ్‌బై చెప్పింది. హీరో-జీరో గేమ్‌లో అమ్మ రాజశేఖర్ ఏడ్వడం, అందుకు కారణమైన లాస్యను దివి టార్గెట్ చేయడం, దీంతో ఖంగు తిన్న లాస్య దివిని నోరు అదుపులో పెట్టుకోమని వార్నింగ్ ఇవ్వడం జరిగాయి. మరి నేటి ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో చదివేయండి. గంగవ్వను చెల్లెలని పిలిచిన నాగ్ ఇప్పుడు ఆరోగ్యం మంచిగైంది కాబట్టి ఇంట్లో నుంచి వెళ్లిపోనని గంగవ్వ స్పష్టం చేసింది. తిరిగి ఎప్పటిలాగే జోష్‌గా ఉంటూ అవినాష్‌ను బర్రె ముక్కు అని వెక్కిరించింది. కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లిన గంగవ్వను నాగ్ చెల్లెలు అని పిలవడం గమనార్హం. అవ్వ అనడం మానేసి గంగమ్మ అని పిలిచారు. తర్వాత ఫొటో పోటీ జరిగింది. దీనికోసం మోనాల్.. అభికి ముద్దులిస్తూ ఫొటోకు పోజిచ్చింది. మెహబూబ్, దివి కూడా రకరకాల యాంగిల్స్‌లో ఫొటోలు క్లిక్‌మనిపించారు. అనంతరం అసలు సీన్ ప్రారంభమైంది. ఇంటి సభ్యులు ఎవరూ గేమ్‌ను సీరియస్‌గా తీసుకోవడం లేదని నాగ్ మండిపడ్డారు. (బిగ్‌బాస్: గంగవ్వకు కరోనా టెస్ట్) రియల్ గేమ్ ఆడేవాళ్లకే ఓట్లు: నాగ్ బిగ్‌బాస్ హౌస్‌కు వచ్చేదే గెలవడానికని నామినేట్ అయిన కంటెస్టెంట్లకు నాగ్ గడ్డి పెట్టారు. నామినేషన్ ప్రక్రియను సీరియస్‌గా తీసుకోమంటే దానిపై కూడా జోకులు పేల్చుతూ పాట పాడుకున్నారని గరమయ్యారు. గంగవ్వను నామినేట్ అయేలా చేసినందుకు నోయల్‌ను తిట్టిపోశారు. మంచివాళ్లు అని మార్కులు కొట్టేసేందుకు త్యాగాలు చేస్తున్నారు, కానీ ప్రేక్షకులు నిజంగా గేమ్ ఆడేవాళ్లకు మాత్రమే ఓట్లు వేస్తారని స్పష్టం చేశారు. తర్వాత గంగవ్వ సేఫ్ అయినట్లు వెల్లడించారు. అనంతరం హీరో-జీరో గేమ్ ఆడించారు. హీరో అనుకున్నవాళ్లను కుర్చీ మీద కూర్చోబెట్టాలి. జీరో అనుకున్నవాళ్లను మెడబట్టి అక్కడ ఏర్పాటు చేసిన ద్వారం గుండా బయటకు గెంటేయాలని తెలిపారు. బిగ్‌బాస్ పిచ్చి కామెడీ దారిలో వెళుతుంది: దేవి ఫైర్ నోయల్.. హీరోగా మాస్టర్‌ను, జీరోగా కుమార్ సాయిగా తెలిపారు. సుజాత.. హీరోగా అమ్మ రాజశేఖర్‌ను, జీరోగా కళ్యాణిని, సోహైల్.. హీరోగా నోయల్‌ను, జీరోగా కళ్యాణిని, దేవి.. హీరోయిన్గా అరియానాను, జీరోగా అమ్మ రాజశేఖర్ పేరు చెప్పింది. ఈ సందర్భంగా దేవి మాట్లాడుతూ.. బిగ్‌బాస్ పిచ్చి కామెడీ దారిలో వెళుతుందని ఏడుస్తూ చెప్పుకొచ్చింది. కామెడీ చేస్తే ఇక్కడ హీరోలా అని అమ్మ రాజశేఖర్‌ను దుమ్ము దులిపింది. నామినేషన్ ప్రక్రియ తర్వాత నుంచి తనను వేరు చేసి చూస్తున్నారని ఆవేదన చెందింది. తర్వాత మెహబూబ్.. హీరోయిన్గా లాస్యను, జీరోగా కుమార్‌ను, కుమార్.. హీరోగా అభిజిత్‌ను, జీరోగా నోయల్‌ను, హారిక.. హీరోగా అభిజిత్‌ను, జీరోగా కుమార్ సాయిని, లాస్య.. హీరోయిన్గా గంగవ్వను, జీరోగా అమ్మ రాజశేఖర్ పేరును వెల్లడించింది. (రొమాంటిక్ డ్యాన్స్; కళ్లు మూసుకున్న అరియానా) పంపించేయండంటూ కన్నీళ్లు పెట్టుకున్న మాస్టర్ శ్రుతి మించిన కామెడీ నచ్చలేదని లాస్య చెప్పింది. దివి గర్భవతిగా నటించాల్సి వచ్చినప్పుడు మాస్టర్ వెళ్లి ఆమెకు పిల్లో సర్దడం నచ్చలేదని చెప్పింది. దీంతో హర్ట్ అయిన మాస్టర్ 'నేను వెళ్లిపోతాను, అసలు కామెడీనే చేయను, నన్ను పంపించేయండి' అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. షూటింగ్లో అవన్నీ సాధారణమేనని, తప్పేమీ కాదని, మాస్టర్ ఉండవల్సిందేనని గంగవ్వ బల్లగుద్ది చెప్పింది. అందరికీ నచ్చాల్సిన అవసరం లేదంటూ నాగ్ మాస్టర్‌ను ఊరడించారు. తర్వాత కళ్యాణి.. హీరోయిన్గా గంగవ్వను, జీరోగా సుజాతను, అరియానా.. హీరోయిన్గా గంగవ్వను, జీరోగా కళ్యాణిని, అఖిల్, మోనాల్.. హీరోగా గంగవ్వను, జీరోగా కుమార్ సాయిని, అవినాష్, గంగవ్వ.. హీరోగా అమ్మ రాజశేఖర్‌ను, జీరోగా కుమార్ సాయి పేర్లు చెప్పారు. దివి, లాస్య మధ్య రాజుకున్న గొడవ అభిజిత్.. హీరోగా గంగవ్వను, జీరోగా అరియానా, అమ్మ రాజశేఖర్.. హీరోగా నోయల్‌ను, జీరోగా దేవి నాగవల్లి, దివి.. హీరోగా అమ్మ రాజశేఖర్, జీరోగా సాయి కుమార్ పేర్లను చెప్పారు. దివి మాట్లాడుతూ.. మాస్టర్ హౌస్‌లో లేకపోతే అందరికీ మెంటలెక్కిపోతుందని చెప్పుకొచ్చింది. అతని ప్రవర్తన ఎవరికీ తప్పు అనిపించలేదని పేర్కొంది. తన ఫొటో కోసం అతను పిల్లో పెట్టడం తప్పు కాదని తేల్చి చెప్పింది. తన విషయం గురించి అందరి ముందు మాట్లాడినందుకు లాస్యపై ఆగ్రహం వ్యక్తం చేసింది. షటప్, నీతో మాట్లాడనవసరం లేదు అని ముఖం మీద చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయింది. దీంతో షాకైన లాస్య నోరు అదుపులో పెట్టుకో అని వార్నింగ్ ఇచ్చింది. అనంతరం కళ్యాణి ఎలిమినేట్ అవుతున్నట్లు నాగ్ ప్రకటించగా ఇంటి సభ్యులు ఆమెను సాగనంపారు. (బిగ్‌బాస్: ఎక్కువ పారితోషికం అవినాష్‌కే) -
బిగ్‌బాస్: ఈ వారం ఎలిమినేషన్లో ఉన్నది వీళ్లే
కరోనా కారణంగా కాస్తా ఆలస్యంగా ప్రారంభమైనా బిగ్‌బాస్ జనాల్లో మెల్లమెల్లగా పుంజుకుంటుంది. వారం రోజులుగా చప్పగా సాగిన కంటెస్టెంట్ల ప్రదర్శనలో మెరుగు కన్పిస్తోంది. తొటి సభ్యులతో పరిచయాలు పెంచుకుంటూ ప్రస్తుతం హుషారుగా ఉన్నట్లు కొట్టొచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా రెండో వారం రానే వచ్చింది. అర్థరాత్రి బిగ్‌బాస్‌లోకి ప్రవేశించిన కుమార్ సాయి దొంగలా దాక్కొని.. అక్కడ ఉన్న దేవితో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. ఇంట్లోకి ఎవరో వచ్చారని గమనించిన దేవి అతని ముఖం చూసేందుకు సాహసించింది. అయితే తనను చూడొద్దని దేవిని భయపెడుతూ సభ్యులను పిలుచుకు రావాలని కుమార్ కోరాడు. అనంతరం ఒక్కొక్కరిగా వచ్చి సాయి కుమార్‌తో మాట్లాడి ఇంట్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారని పసిగట్టారు. (బిగ్‌బాస్: నువ్వు హీరోయిన్, నేను హీరో) అంతేగాక అభిజిత్, మోనాల్ అర్థరాత్రి ఏకాంతంగా గుసగుసలు పెట్టుకున్నారు. ఇక ఉదయం కూడా మళ్లీ మోనాల్, అభిజిత్ రహస్యంగా మాట్లాడుకోవడంతో వీరి మధ్య ఎదో ఉందని ప్రజలకు సందేహిస్తున్నారు. అదే విధంగా అఖిల్ మోనాల్ గురించి లాస్యతో చాడీలు చెప్పేందుకు ప్రయత్నించి వెంటనే మళ్లీ మోనాల్‌ను పిలిచి తనతో కాస్తా కొంటెగా ముచ్చటించాడు. అఖిల్ వద్దకు వచ్చిన మోనాల్ ఎదో చెప్పే ప్రయత్నం చేయబోతుంటే యదవ యాక్టింగ్‌లు చేయకు అంటూ అఖిల్ నోరు పారేసుకున్నాడు. నీకేం చేయాలో తెలియదా అని అఖిల్ అనగానే. మంచిగా మాట్లాడు అంటూ మోనాల్ కూడా కొంచెం సీరియస్ అయ్యింది. ఇక ఈ వాదన అయిపోగానే ఇద్దరి మధ్య ఏర్పడిన చిరు గొడవను డైవర్ట్ చేస్తూ మోనాల్‌ను కూల్ అయ్యేలా మస్కా కొట్టాడు. మరోలా ఆలోచిస్తే ఈ రోజు చర్చంతా మోనాల్‌పై జరిగినట్లు కన్నిస్తోంది. (బిగ్‌బాస్: సూర్యకిరణ్ అవుట్, ఆమెపై బిగ్‌బాంబ్!) ఇదిలా ఉండగా ఈ రోజు నుంచి రేషన్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఇంటి సభ్యులకు కావాల్సిన రేషన్‌ను దక్కించుకునేందుకు ఒకిరిని రేషన్ మేనేజర్‌గా ఎన్నుకోవాలి. వారికి రూమ్ తాళం ఇచ్చి అందులోని సమన్లు తెచ్చుకోవాలి. అ క్రమంలో ఈ పోస్టును అమ్మ రాజశేఖర్‌కు కెప్టెన్ లాస్య అప్పగించడంతో మాస్టర్, కెప్టెన్ లాస్య స్టోర్ రూమ్‌కు వెళ్లి కావాల్సిన వస్తువులను తీసుకొచ్చారు. (బిగ్‌బాస్: ముందు తనే వెళ్లిపోతానన్న గంగవ్వ) ఇక రెండో వారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ నేపథ్యంలో ఇంట్లోని 16 మంది గార్డెన్ ఏరియాలో ఉన్న పడవలోకి ఎక్కాలి. పడవ ప్రతి తీరం మధ్య ఆగినప్పుడు ఒక్కో సభ్యుడు దాని నుంచి ఖచ్చితంతగా దిగిపోవాల్సి ఉంటుంది. ఇలా తొమ్మిది తీరాల మధ్య పడవ ఆగుతుంది. అంటే 9 మంది నామినేషన్ అవుతారు. ఇక పడవలోకి కూర్చొని సభ్యులంతా సరదాగా పాటలతో హోరెత్తించారు. ఇక మొదటి తీరం రాకముందే పడవ నుంచి నేను పోత అంటే నేను దిగపోతా అంటూ ముందుకు వచ్చారు. ఇంతలోనే దిగేందుకు సరైన కారణం చెబితే తాను దిగిపోతానని కుమార్ సాయి తెలిపాడు. దీంతో ఎవరిని పడవ నుంచి దింపేయాలన్న చర్చ సభ్యుల్లో సాగింది. ఇంతోనే అభిజిత్ కలగజేసుకొని అవ్వ ఎక్కవ సేపు కూర్చోలేదని చెబుతూ మొదట పడవ దిగమని చెబుతామా అని సలహా ఇచ్చాడు. దానికి అవ్వ సరే చెప్పి తొలి రౌండ్లోనే దిగిపోయింది. అయితే ఊహించని విధంగా నోయల్ రెండో హారన్‌కు దిగిపోయాడు. మోనాల్ మూడో హారన్‌కు పడవ నుంచి దిగేసింది. (మైండ్ బ్లాక్ చేసిన దివి, దేవి) ఇంట్లోకి వచ్చిన కుమార్ మొదటి రోజే ఇంటి సభ్యులతో మైండ్ గేమ్ ఆడుతున్నట్లు తెలుస్తోంది. మనసులో దిగాలని లేకపోయిన మీరు చేస్తే దిగుతా అంటూ ప్రతి రౌండ్లో తెలివి ప్రదర్శిస్తూ వచ్చాడు. నాలుగో రౌండ్ మోగగానే పోహైల్, అయిదో బజర్‌కు కరాటే కళ్యాణి దిగిపోయింది. ఆరో హారన్‌కు అమ్మ రాజశేఖర్ పడవ నుంచి దిగేసి ఇంట్లోకి వచ్చేశారు. ఏడవ రౌండ్లో కుమార్, ఎనిమిది హారిక, తొమ్మిది అభిజిత్ దిగిపోయాడు. అయితే నామినేషన్లోకి వెళ్లినా తిరిగి సేఫ్ అవ్వగలం అన్న నమ్మకం ఉన్న వారు పడవ నుంచి దిగేసినట్లు తెలస్తోంది. నామినేట్ అయితే ఎలిమినేట్ అవుతామన్న భయంతో సుజాత, మెహబూబ్, దివి, అఖిల్ గుట్టు చప్పుడు కాకుండా చివరి దాకా పడవలోనే ఉన్నారు. చివరికి ఈ వారం నామినేషన్ ప్రక్రియ ముగిసింది. గంగవ్వ, నోయల్, మోనాల్, సోహైల్, కరాటే కళ్యాణి, అమ్మ రాజశేఖర్, కుమార్ సాయి, హారిక, అభిజిత్ నామినేట్ అయ్యారు. మరి ఈ వారం సేఫ్ అయ్యేది ఎవరో, ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలియాలంటే ఈ వారమంతా బిగ్బాస్సై ఓ కన్ను వేయాల్సిందే. -
హారిక విష సర్పం, అఖిల్ దున్నపోతు..
సండేను ఫండే చేసేందుకు బిగ్‌బాస్ మంచి ప్లానే వేశాడు. అబ్బాయిలు, అమ్మాయిల మధ్య డ్యాన్స్ పోటీ పెట్టాడు. అమ్మ రాజశేఖర్, నాగ్ జడ్జిలుగా వ్యవహరించారు. జిగేల్ రాణి పాటకు మోనాల్, మెహబూబ్ నువ్వా నేనా అన్న రీతిలో స్టెప్పులేశారు. కానీ మెహబూబ్‌కే ఎక్కువ పాయింట్లు వచ్చాయి. పెద్దపులి పాటకు సోహైల్, కల్యాణి అదరగొట్టారు. ప్రేక్షకులు ఈలలు కొట్టేలా జోష్‌గా డ్యాన్స్ చేశారు. ఈ ఇద్దరిలో కల్యాణికి ఎక్కువ మార్కులు పడ్డాయి. నోయల్, హారిక మధ్య పోటీ రంజుగా సాగింది. హోరాహోరీగా తలపడ్డిన ఈ ఇద్దరికీ సమానంగా మార్కులు పడ్డాయి. దేవి నాగవల్లి, అభిజిత్ మధ్య డ్యాన్స్ ఆసక్తికరంగా సాగింది. హీరో అభి ఎలాగో తన స్టెప్పులతో ఊపేయగా దేవి ఎక్స్ప్రెషన్స్, స్టెప్పులు కలిపి వీర లెవల్లో డ్యాన్స్ చేసింది. దీంతో దేవికి ఎక్కువ మార్కులు పడ్డాయి. రెచ్చిపోయిన దివి, తడబడ్డ అఖిల్ మైండ్ బ్లాక్ పాటకు డ్యాన్స్ చేయడంలో అఖిల్ కాస్త తడబడ్డాడు. కానీ దివి మాత్రం చూపు తిప్పుకోనివ్వకుండా స్టెప్పులేయడంతో ఆమెకే ఎక్కువ మార్కులు పడ్డాయి. నాది నెక్కలేసు గొలుసు పాటకు సూర్యకిరణ్, లాస్య రెచ్చిపోయి మరీ చిందులేశారు. చొక్కా విప్పేసి మరీ డ్యాన్స్ చేసినందుకు సూర్యకిరణ్‌కు అధిక పాయింట్లు లభించాయి. ఆ తర్వాత మాస్టర్ గంగవ్వతో డ్యాన్స్ చేయించాడు. వయసు మర్చిపోయి మరీ అవ్వ రెట్టింపు జోష్‌తో గంతులేసింది. మొత్తంగా ఈ టాస్క్‌లో అమ్మాయిలకు 91 పాయింట్లు రాగా, అబ్బాయిలకు 88 పాయింట్లు వచ్చాయి. (చదవండి: బిగ్‌బాస్ : గంగవ్వ తోపు.. ‘బకరా’ అయిన లాస్య) సూర్యకిరణ్ అవుట్ ఆ తర్వాత అఖిల్ సేవ్ అయ్యాడని పాట రూపంలో తెలిపారు. ఆ తర్వాత బొమ్మ గీసి దాని ద్వారా అది ఏ పద్యమో కనుక్కోవాలని ఆటాడించారు. అయితే అందరూ పద్యాలు చెప్తే.. గంగవ్వ మాత్రం చెవులకింపైన జోల పాట పాడింది. అనంతరం మెహబూబ్ సేవ్ అయ్యాడని స్కెచ్ చూపించారు. ఇంకా ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారని నాగ్ చెప్పగానే ఇంటి సభ్యులు ఎలిమినేషన్స్ వద్దంటూ ర్యాప్ సాంగ్‌తో వేడుకున్నారు. కానీ అలాంటి పప్పులు ఉడకవని నాగ్ తేల్చి చెప్పారు. మొదటి నుంచీ ఊహించినట్టుగానే సూర్య కిరణ్ ఎలిమినేట్ అయ్యాడని ప్రకటించారు. కాగా తను నీళ్లు ఇవ్వడం వల్లే సూర్య కిరణ్ వెళ్లిపోయాడని మోనాల్ కన్నీళ్లు పెట్టుకుంది. (చదవండి: నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత) దేవిని మొసలి, సోహైల్ ఎలుక అనంతరం సూర్యకిరణ్‌తో నాగ్ ఓ టాస్క్ ఆడించారు. ఇందులో జంతువుల ఫొటోలను కంటెస్టెంట్లతో పోల్చమన్నారు. అలా మోనాల్‌ను నెమలితో, గంగవ్వను చీమతో, దేవిని మొసలితో, సోహైల్‌ను ఎలుకతో, అభిజిత్‌ను పిల్లితో, దివిని తాబేలుతో, కళ్యాణిని కోతితో, మెహబూబ్‌ను గద్దతో, హారికను పాముతో పోల్చాడు. విశ్వాసమున్నందుకు సుజాతను కుక్కతో, అతిగా ఆలోచిస్తున్నందుకు నోయల్‌ను నక్కతో, కెప్టెన్‌గా ఇంటి భారాన్ని మోస్తున్నందుకు లాస్యను గాడిదతో, అరియానాను గుడ్లగూబతో, అఖిల్‌ను దున్నపోతుతో, అమ్మ రాజశేఖర్‌ను సింహంతో పోల్చాడు. (చదవండి: నోయల్ సింపతీ కార్డ్ ప్లే చేస్తున్నాడు, ఓవర్ యాక్షన్) దేవిపై బిగ్‌బాంబ్ ఆ తర్వాత దేవికి ఒకరోజు మొత్తం ఏ పని చేయనవసరం లేదని బిగ్‌బాంబ్ వేసి వీడ్కోలు తీసుకున్నాడు. అనంతరం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ సాయి కుమార్‌ను స్టేజీపైకి పిలిచారు. కుమార్ మాట్లాడుతూ.. షో గెలవాలన్న ఆశయం, హౌస్ నుంచి బయటకు వచ్చేసరికి కోవిడ్ అంతమైపోయి తిరిగి సాధారణంగా పని చేసుకోవాలన్న నమ్మకం, నాగ్‌కు స్క్రిప్ట్ చెప్పాలన్న కోరిక.. ఈ మూడింట్లో ఒక్కటి జరిగినా చాలు అని మనసులోని మాటను బయట పెట్టాడు. మరి అతడు హౌస్‌లోకి వెళ్లి ఎంతలా ఎంటర్టైన్ చేస్తాడనేది రేపటి నుంచి చూడాల్సిందే! (చదవండి: గంగవ్వ 10 వారాల పైనే ఉంటుంది) -
బిగ్‌బాస్: ఫస్ట్ కెప్టెన్‌గా కట్టప్ప!
నాలుగు రోజులుగా నాన్చుతూ వచ్చిన కట్టప్ప ఎపిసోడ్ ఉత్తిదేనని తేలింది. హౌస్‌లో అలాంటి పాత్రే లేదని, కానీ మీలో ఉన్న అనుమానమే కట్టప్ప అని, దాన్ని పక్కన పడేయండని నాగార్జున సూచించారు. వారం రోజులు కావస్తున్నా ఇంటి సభ్యులు ఒకరికొకరు సరిగ్గా కనెక్ట్ అయినట్లు కనిపించడం లేదని చెప్పాడు. హౌస్మేట్స్ చేసిన తప్పొప్పులను సరిదిద్దే ప్రయత్నం చేశారు. ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో ఈ వారం 5 కోట్ల ఓట్లు వచ్చాయన్నారు. ఎలిమినేషన్ జోన్లో ఉన్న ఇద్దరిని ఆ గండం నుంచి బయటపడేశారు. ఆ ఇద్దరు ఎవరు? నేటి ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో చూసేద్దాం.. ఎన్నో వారాలు ఉండలేను: గంగవ్వ బిగ్‌బాస్‌లో కట్టప్ప ఎవరో తేల్చేద్దాం అంటూ బాహుబలి పాటతో ఎంట్రీ ఇచ్చాడు కింగ్ నాగార్జున. అనంతరం శుక్రవారం నాడు హౌస్‌లో ఏం జరిగిందో చూపించారు. ఆ రోజు వర్షం పడుతుండటంతో "ఎన్నాళ్లకు గుర్తొచ్చానా వాన" సాంగ్ వేశారు. ఇంకేముందీ.. ఇంటి సభ్యులు వర్షంలోనే తడుచుకుంటూ మరీ చిందేశారు. ఆ తర్వాత మాస్టర్ కట్టప్ప మీద పాట పాడాడు. కల్యాణి కూడా బాగా పాడుతుందంటూ పొగడటంతో గొంతు సవరించుకుని పాటందుకుంది. అంతే.. చటుక్కున అక్కడున్న అబ్బాయిలంతా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోయి ఆమెను బకరా చేశారు. ఐదేళ్లున్నప్పుడు పెళ్లి చేశారు. మరోవైపు గంగవ్వ "నా భర్త తాగుడు, కొట్టుడు, చెప్పినమాట వినకుండా అయిపోయిండు" అని తన బాధలను ఇంటి సభ్యులతో వెళ్లబోసుకుంది. ఎన్నో వారాలు ఇంట్లో ఉండలేనని చెప్పుకొచ్చింది. (చదవండి: బిగ్‌బాస్: 'అతను ఓవరాక్షన్ తగ్గించుకుంటే మంచిది) అప్పుడు పెళ్లన్నాడు, ఇప్పుడు మాట కూడా లేదు వీకెండ్ ఎపిసోడ్ కావడంతో హౌస్మేట్స్ అందరూ అందంగా ముస్తాబయ్యారు. వారం రోజులకు నాగార్జున కనిపించడంతో ఇంటిసభ్యులు ఆనందానికి లోనయ్యారు. గంగవ్వ నాగార్జునను నడిపన్న(రెండో అన్న) అని పిలుచుకుంటూ పాట పాడింది. నోయల్ నువ్వు ఓవర్ థింక్ చేస్తావ్ కదా అని నాగ్ అన్నారు. అన్నింటిని అలాగేపెంట చేశావ్ అని చెప్పారు. నువ్వు టాలెంటే కానీ, ఓవర్ థింకింగ్ తగ్గించుకో అని సూచించారు. అరియానాకు ఇంకోసారి తినిపించయని అఖిల్‌ను ఆదేశించారు. ఆ తర్వాత నాగ్, ఇంటిసభ్యుల కోరిక మేరకు సోహైల్ అరియానాను వీపుపై మోస్తూ పుషప్స్ చేశాడు. నువ్వెప్పుడైనా ఇలా ట్రై చేశావా అని నాగ్ అడగ్గా ఇలాంటి అమ్మాయి ఇంకా దొరకలేదని అఖిల్ సమాధానమిచ్చాడు. నర్మద నదిలో ఎప్పుడు నీళ్లు ఉంటాయి. దానికి డ్యామ్ కట్టేశారని, నువ్వు కూడా అలాంటిది వేసుకోవాలని నాగ్ మోనాల్‌ను కోరారు. లాస్యకు గోడ మీద పిల్లిలా ఉన్నావ్, జోష్ తగ్గిపోయిందని చెప్పారు. షో ప్రారంభం రోజు అభిజిత్ ఎవర్ని పెళ్లి చేసుకుంటావు అంటే మోనాల్‌ను చేసుకుంటానన్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు తను నేరుగా వచ్చి మాట్లాడిచ్చినా స్పందించట్లేదని మోనాల్ వాపోయింది. మరోవైపు సైలెంట్‌గా ఉంటూ.. అందరి గురించి బాగా చెప్పావ్ అని దివిని పొగిడారు. సూర్యకిరణ్‌కు మొట్టికాయలు వేసిన నాగ్ కట్టప్ప గురించి తెలుసుకోడానికి వెయిటింగ్ అంటూ హౌస్మేట్స్ అద్భుతమైన ర్యాప్ సాంగ్ పాడారు. నా చెవులు గిల్లుమంటున్నాయి ఆపండి అని గంగవ్వ వారించడంతో అందరూ నోళ్లు మూసుకున్నారు. ఆ తర్వాత బిగ్‌బాస్ హౌస్‌లో జరుగుతున్నదాని గురించి బ్రేకింగ్ అండ్ హెడ్‌లైన్స్ చెప్పమని నాగ్ దేవి నాగవల్లిని కోరారు. అందుకు ఆమె వ్యాసం చెప్పడంతో 'ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. దేవి వార్తలు చెప్పడం మర్చిపోయింద'ని కింగ్ నవ్వుతూ చెప్పుకొచ్చారు. అనవసరమైన దానిలో దూరి లెక్చర్లు ఇవ్వకండని సూర్యకిరణ్‌కు మొట్టికాయలు వేశారు. అక్కడిది ఇక్కడ.. ఇక్కడిది అక్కడ చెప్పడమేంటని కరాటే కల్యాణిపై అసహనం ప్రదర్శించారు. వేరేవాళ్లని మాట్లాడనివ్వండని ఉచిత సలహా ఇచ్చారు. (చదవండి: దివి ధ్యాసలో వంట పెంట చేసిన మాస్టర్) గంగవ్వ తోపు, లాస్య బకరా ఆ తర్వాత సోహైల్, అరియానాతో ఓ ఆటాడించారు. రకరకాల బొమ్మలు ఉన్న మెడల్స్‌ను కంటెస్టెంట్ల మెడలో వేయాలన్నారు. అలా సుజాత ఊసరవెల్లి, దివి కాకరకాయ, కల్యాణి చిచ్చు పెట్టడం, హారిక డ్రామా క్వీన్, సూర్య కిరణ్ బద్ధకం, అభిజిత్ చెత్తకుండీ, నోయల్ లౌడ్ స్పీకర్, గంగవ్వ తోపు, దేవి పర్ఫెక్ట్, మోనాల్ ఏడ్చే బేబీ, లాస్య బకరా, మెహబూబ్ మిర్చి, అమ్మ రాజశేఖర్‌ను జోకర్‌గా చెప్పుకొచ్చారు. అనంతరం నాగ్ ఎలిమినేషన్ జోన్లో ఉన్న ఏడుగురిలో మొదట అభిజిత్‌ను, తర్వాత సుజాత, గంగవ్వను సేవ్ చేశారు. ఇక మెజారిటీ ఇంటి సభ్యులు లాస్యను కట్టప్ప అనుకున్నారు, కానీ అలాంటి క్యారెక్టరే లేదని నాగ్ వెల్లడించారు. లాస్యను ఫస్ట్ కెప్టెన్‌గా ప్రకటించారు. (చదవండి: అమ్మ రాజశేఖర్ కుళ్లు జోకులు మానేయండి) -
నోయల్‌కు నో చెప్పిన బిగ్‌బాస్
బిగ్‌బాస్ ఇచ్చిన ఫిజికల్ టాస్క్ ఇంటిసభ్యులు పూర్తి చేయలేకపోయారు. దీనికి కూడా కట్టప్పే కారణమని పరోక్షంగా చెప్పాడు. దీంతో ప్రతిదానికి అడ్డుపడుతున్న ఈ కట్టప్ప ఎవర్రా బాబూ అని హౌస్మేట్స్ తలలు పట్టుకున్నారు. ఇదిలా వుంటే వయసు అనేది కేవలం నెంబర్ మాత్రమేనని నిరూపించిది గంగవ్వ. 60 ఏళ్లున్న అవ్వ ఈ రోజు కూడా ఉదయం లేవగానే అబ్బాయిలతో పోటీ పడుతూ ఎక్సర్సైజ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత కిచెన్ క్లీన్‌గా ఉంచాలని మోనాల్ చెప్తే అమ్మ రాజశేఖర్ కాస్త అసహనం ప్రదర్శించాడు. వంట చేయడం, క్లీన్ చేయడం ఒకేసారి ఎలా అవుతుందని ప్రశ్నించాడు. అతని సమాధానం నచ్చని కల్యాణి ఈరోజు భోజనం చేయనని ఉపవాసం ఉంటున్నానని చెప్పింది. అసలే ఎలాంటి పండ్లు కూడా లేవని మోనాల్ నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె వినకుండా వెళ్లిపోయింది. (బిగ్‌బాస్‌పై ఐపీఎల్ ఎఫెక్ట్!) అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటా: మోనాల్ ఇవాళేంటో అందరూ హుషారుగా కనిపించారు. కిచెన్‌లో అమ్మ రాజశేఖర్, దివి ఒకరిపై ఒకరు తెగ ప్రేమ కురిపించుకున్నారు. బిగ్‌బాస్‌లో ఉన్నంతసేపు నువ్వు హీరోయిన్, నేను హీరో.. అని చెప్పుకొచ్చాడు దివితో కబుర్లు చెప్పుకుంటూ నూనెలో టీ పొడి వేశాడు. దీంతో నోయల్ ఆ ఇద్దరినీ నూనె, టీ పొడితో పోలుస్తూ అవి రెండూ కలవవు అని పంచ్ వేశాడు. అటు మోనాల్, అభిజిత్ ఒకరి గురించి మరొకరు మరింత లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మోనాల్ తనకు పెద్దలు కుదిర్చిన పెళ్లే చేసుకుంటానని అఖిల్‌తో చెప్పుకొచ్చింది. ప్రస్తుతానికైతే ఎలాంటి రిలేషన్షిప్లో లేనని స్పష్టం చేసింది. ఇక నోయల్ ఇంటి సభ్యుల మీద ర్యాప్ సాంగ్ పాడితే మెహబూబ్, దేవి, దివి కలిసి నోయల్ మీదే ర్యాప్ పాడి ఔరా అనిపించారు. (సూర్య కిరణ్ తగ్గించుకుంటే మంచిది: దివి) మరోసారి కట్టప్ప టాస్క్ సోహైల్.. అఖిల్, లాస్య, హారిక, కల్యాణి.. సూర్యకిరణ్, మోనాల్, గంగవ్వ.. అమ్మ రాజశేఖర్, అరియానా, దేవి, దివి, అమ్మ రాజశేఖర్, సూర్యకిరణ్,.. నోయల్, అఖిల్, మెహబూబ్, సుజాత, అభిజిత్.. లాస్యపై స్టాంపు గుద్దారు. నోయల్ వంతు వచ్చేసరికి మాత్రం కాస్త సీన్ క్రియేట్ చేశాడు. తనకు ఎవరినీ బాధపెట్టడం ఇష్టం లేదని అందుకే తన ముఖంపైనే ముద్ర వేసుకుంటున్నట్లు వెల్లడించాడు. అయితే ఈ నిర్ణయాన్ని ఇంటి సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. అలా చేస్తే నిజమైన కట్టప్ప నువ్వే అవుతావని వారించారు. నోయల్ చర్యను ఖండించిన బిగ్‌బాస్ అయినప్పటికీ నోయల్ తన మనసు మార్చుకోకపోవడంతో బిగ్‌బాస్ రంగంలోకి దిగాడు. నీకు నువ్వు స్టాంప్ వేసుకోడానికి వీల్లేదని చెప్పాడు. దీంతో నోయల్.. లాస్య మీదే అనుమానం ఉన్నప్పటికీ ఆమె ఎక్కడ బాధపడుతుందోనని అమ్మ రాజశేఖర్‌కు స్టాంప్ గుద్దాడు. ఈ తంతు ముగిసిన తర్వాత బిగ్‌బాస్.. ఈ కట్టప్ప ఎవరనేది ఇప్పట్లో తెలియజేయనని, కానీ త్వరలో మీకే తెలుస్తుందంటూ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. అనంతరం రాత్రి మాస్టర్.. ఇంటి సభ్యులు గ్యాంగ్‌గా విడిపోవడంపై జోకులు వేశాడు. ఇప్పుడు హాయిగా సరదాగా నవ్వుకుంటున్న ఇంటి సభ్యుల్లో ఎలిమినేషన్ నుంచి ఎవరు గట్టెక్కుతారు? ఎవరు అవుట్ అవుతారనేది రానున్న ఎపిసోడ్లలో తేలనుంది. (ఇద్దరిని ఏడిపించిన అరియానా) -
బిగ్‌బాస్ 4 యాంకర్ లాస్య ఫొటోలు
-
బిగ్ బాస్‌లోకి కడప వాసి ఎంట్రీపై హర్షం
మా టీవీలో హీరో నాగార్జున హోస్ట్‌గా ఆదివారం ప్రారంభమైన బిగ్ బాస్ రియాలిటీ షో లోకి కడప జిల్లాకి చెందిన ప్రముఖ సినీ యాంకర్ లాస్య కాంటెంటెస్ట్గా ఎంటర్ అయింది. సినీ, టీవీ షో లతో పాపులర్ అయిన లాస్యది వైఎస్ఆర్ జిల్లా, వీరబల్లి మండలం గడికోట గ్రామం స్వస్థలం. ఆమె తండ్రి పేరు వీరబల్లి నరసింహారెడ్డి. జెమిని టీవీలో అంకితం లైవ్ షో ద్వారా కెరీర్‌ను ప్రారంభించిన లాస్య.. ఆ తరువాత మా టీవీ లో చేసిన సమ్‌థింగ్ స్పెషల్ అనే ప్రోగ్రాం ద్వారా మంచి పేరు సంపాదించుకుంది. ఇప్పుడు అదే మాటీవీలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ షోకి వెళ్లడం నిజంగా విశేషమనే చెప్పుకోవాలి. ఈటీవీ లో ప్రారంభమైన ఢీ షో లాస్య కు మరో మెట్టు పైకి ఎక్కించింది. (గంగవ్వకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు) అనేక ఈవెంట్లకు యాంకర్‌గా పనిచేసిన లాస్య పద్ధతిగా తనదైన శైలిలో అభిమానుల ఆదరణతో సినీ, టీవీ ఇండస్ట్రీ లో ఎటువంటి బాక్ గ్రౌండ్ లేకుండా స్వశక్తితో ఎదిగింది. లాస్య ఇప్పుడు బిగ్ బాస్ షో లోకి వెళ్లడం పట్ల వైఎస్ఆర్ జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా లాస్య తన జీవితంలో రెండుసార్లు పెళ్లి చేసుకుంది. తాను ప్రేమించిన మంజునాథ్‌తో 2010లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. తర్వాత పెద్దలను ఒప్పించి 2017లో మరోసారి అందరి సమక్షంలో భర్తతో ఏడడుగులు నడిచింది. పెళ్లి చేసుకున్నాక బుల్లితెరకు దూరమైన లాస్య చాలా సంవత్సరాలకు మళ్లీ ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమైంది. (బిస్‌బాస్-4 : ఇదిగో 16 మంది కంటెస్టెంట్స్) -
జోకులతో భయపెట్టే లాస్య
ఇంజనీరింగ్ అయ్యాక ఏదైనా సాధించాలని కలలు గనేది లాస్య. అలా అనుకోకుండా బుల్లితెరపై యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలోనే పక్కింటి అమ్మాయిగా స్థిరపడిపోయింది. ఆమె తన జీవితంలో రెండుసార్లు పెళ్లి చేసుకుంది. అతను ప్రేమించిన వ్యక్తి మంజునాథ్‌తో 2010లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. తర్వాత పెద్దలను ఒప్పించి 2017లో మరోసారి అందరి సమక్షంలో భర్తతో ఏడడుగులు నడిచింది. పెళ్లి చేసుకున్నాక టీవీకి దూరమైన లాస్య చాలా సంవత్సరాలకు మళ్లీ ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమైంది. కానీ మళ్లీ చీమ ఏనుగు జోక్స్ చెప్తూ అందరినీ భయపెట్టిస్తోంది. తానేంటో చూపించడానికి బిగ్‌బాస్ హౌస్‌కు వస్తున్నానంటోంది. ఇలాగే చలాకీగా ఉంటూ కంటెస్టెంట్లను తనవైపు తిప్పుకుని బిగ్‌బాస్‌లో ఎలా ప్రయాణం సాగిస్తుందో చూడాలి. -
బిగ్‌బాస్ ఎంట్రీపై లాస్య ఏమన్నారంటే..
త్వరలో ప్రారంభం కానున్న బిగ్‌బాస్ తెలుగు మూడవ సీజన్ కంటెస్టెంట్లు ఎవరనే దానిపై సోషల్ మీడియాలో రకరకాలు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే తాము బిగ్‌బాస్‌లో పాల్గొంటున్నామంటూ వస్తున్న వార్తలపై ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు క్లారిటీ ఇచ్చారు. తాజాగా యాంకర్ లాస్య కూడా బిగ్‌బాస్‌లో పాల్గొనబోతున్నారనే వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి. అయితే వీటిపై లాస్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు. ‘మీకో విషయం తెలుసా.. నేను బిగ్ బాస్‌కు వచ్చేస్తున్నాను. బిగ్‌బాస్‌లో లాస్య కన్ఫార్మ్ అయిపోయింది. లాస్యకు బిగ్‌బాస్ వాళ్లు షో స్టార్ట్ కాకముందే 30 లక్షల రూపాయలు ఇచ్చేస్తున్నారు. అబ్బా ఇది వినడానికి ఎంత బాగుందో.. కానీ ఇదంతా అబద్ధం. ఇట్స్ ఏ ఫేక్ న్యూస్’ అని లాస్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. తను బిగ్‌బాస్‌లోకి రావడం లేదని చెప్పిన లాస్య.. ఈ వార్తలు చూసి తన క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్తున్నట్టు వెల్లడించారు. అది ఫేక్ న్యూస్ అని చెప్పడానికే ఈ వీడియోను పోస్ట్ చేస్తున్నట్టు తెలిపారు. తనకు చిన్నబాబు ఉన్నాడని.. బాబుతోనే టైమ్ సరిపోతుందని.. ఈ టైమ్ మళ్లీ మళ్లీ రాదని అన్నారు. ఈ ఒక్క ఏడాది పూర్తిగా బాబుతోనే గడపాలని అనుకుంటున్నట్టు తెలిపిన లాస్య.. ఏదైనా ఉంటే నెక్ట్స్ టైమ్ చూద్దామని పేర్కొన్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో తనపై వస్తున్న ఫేస్ న్యూస్ సంబంధించిన ఫొటోను లాస్య ఇన్‌స్టాలో ఉంచారు. -
బిగ్‌బాస్‌పై లాస్య ఏమన్నారంటే..
-
హీరోయిన్గా మరో టీవీ యాంకర్
బుల్లితెర మీద యాంకర్లుగా స్టార్ ఇమేజ్ అందుకున్న చాలా మంది, హీరోయిన్లుగా మారేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే రష్మీ, అనసూయ లాంటి వారు ఈ రేసులో ముందుండగా ఇప్పుడు మరో భామ ఈ లిస్ట్‌లో చేరేందుకు రెడీ అవుతోంది. పలు రియాల్టీ షోలకు వ్యాఖ్యతగా వ్యవహరించిన యాంకర్ లాస్య హీరోయిన్గా పరిచయం అవుతోంది. గుంటూరు టాకీస్ సినిమాను నిర్మించిన ఆర్ కె స్టూడియోస్ బ్యానర్లో కృష్ణ కిశోర్.టిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమా 'రాజా మీరు కేక'. రేవంత్, నోయోల్, మిర్చీ హేమంత్లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాతో లాస్య హీరోయిన్గా పరిచయం అవుతోంది. ఈ సినిమా కోసం కొద్ది రోజులుగా బుల్లితెరకు కూడా దూరమైన ఈ బ్యూటీ.., సినిమా విజయం మీద చాలా నమ్మకంగా ఉంది. మరి లాస్య కూడా రష్మీ, అనసూయల బాటలో వెండితెర మీద కూడా సక్సెస్ సాధిస్తుందేమో చూడాలి. -
లాస్యతో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రాజ్ తరుణ్
సినీ తారలపై గాసిప్స్ సహజం. తాజాగా యంగ్ హీరో రాజ్ తరుణ్, యాంకర్ లాస్యను పెళ్లాడినట్టుగా రెండు రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ విషయం రాజ్ తరుణ్ తనదైన స్టైల్లో స్పందించాడు. అభిమానులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెపుతూనే ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేసే వారిపై సెటైర్స్ వేశాడు. మీడియాలో వస్తున్న వార్తలపై తన ఫేస్బుక్ పేజ్‌లో స్పందించిన రాజ్ తరుణ్, 'కేవలం ఒక్కసారి కుమారి 21ఎఫ్ ఆడియో రిలీజ్లో కలిసిన లాస్యతో నా పెళ్లి చేసిన కొంత మంది మీడియా మిత్రులకు, వెబ్ సైట్ దారులకు నా కృతజ్ఞతలు' అంటూ మొదలు పెట్టిన రాజ్ తరుణ్, ఇలా వెటకారంగా మాట్లాడుతున్నందుకు క్షమించాలని కోరాడు. అయితే ఇలాంటి పిచ్చి ప్రచారాలు చేసేవారిపై ఇంతకన్నా ఎలా స్పదించాలో తనకు తెలియదన్నాడు. మరో మూడేళ్లలోపు తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, తను పెళ్లి వార్తను తానే అందరికీ తెలియజేస్తానన్నాడు. రూమార్స్ అయినా.., నా గురించి ఆలోచించిన అందరికీ థ్యాంక్స్ అంటూ రూమర్స్ క్రియేట్ చేస్తున్నవారికి పంచ్ ఇచ్చాడు.