Anchor Lasya Gifts Electric Bike To Her Brother Video Goes Viral - Sakshi
Sakshi News home page

Anchor Lasya: అన్నయ్యకు ఎలక్ట్రిక్‌ బైక్‌ గిఫ్ట్‌ ఇచ్చిన యాంకర్‌ లాస్య

Published Fri, Mar 11 2022 6:28 PM | Last Updated on Sat, Mar 12 2022 7:58 AM

Anchor Lasya Gifts Electric Bike To Her Brother, Deets Inside - Sakshi

యాంకరింగ్‌లో లాస్యది డిఫరెంట్‌ స్టైల్‌. సరదాగా, చలాకీగా మాట్లాడుతూ ప్రేక్షకులను తన వాగ్ధాటితో కట్టిపడేస్తుంది. బిగ్‌బాస్‌ షో తర్వాత అటు యాంకర్‌గానే కాకుండా యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ అభిమానులను అలరిస్తోంది. ఇటీవలే అత్తారిల్లును చూపించిన లాస్య తాజాగా తన అన్నయ్యకు బైక్‌ గిఫ్ట్‌గా ఇచ్చింది. ఈ మేరకు తన యూట్యూబ్‌ ఛానల్‌లో ఓ వీడియో రిలీజ్‌ చేసింది.

'మా అన్నయ్య సెకండ్‌ హ్యాండ్‌లో స్కూటీ తీసుకుని ఇప్పటికీ అదే వాడుతున్నాడు. అతడికి ఒక మంచి బైక్‌ బహుమతిగా ఇవ్వాలనుకున్నాం. కానీ మేము ఆర్డర్‌ చేసిన మూడు నెలలకు డెలివరీ చేస్తామన్నారు. అతడి బర్త్‌డే నవంబర్‌లోనే అయిపోతే మేమిప్పుడు గిఫ్ట్‌ ఇచ్చాము. మొదట మేము మూడు వేలు పెట్టి ఆథర్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ బుక్‌ చేశాం. కానీ మా అన్నయ్యను మాటల్లో పెట్టి ఏ బైక్‌ ఇష్టమో ఆరా తీస్తే యునికాన్‌ నచ్చుతుందన్నాడు. దీంతో రూ.1000 పెట్టి ఓ యునికాన్‌ బైక్‌ కూడా బుక్‌ చేశాం. ఈ రెండింటిలో ఏది తీసుకోవాలా? అని తెగ ఆలోచించాను'

చదవండి: హాట్‌ టాపిక్‌గా శ్రుతిహాసన్‌ రెమ్యునరేషన్‌.. చిరు సినిమాకు అన్ని కోట్లా ?

'అన్నయ్యవాళ్లకు పెట్రోల్‌ ఖర్చులు మిగులుతాయని ఎలక్ట్రిక్‌ స్కూటర్‌కే మొగ్గు చూపాను. అన్నయ్యను షోరూమ్‌కు తీసుకొచ్చి అతడి చేతికి బైక్‌ తాళాలు అందించి సర్‌ప్రైజ్‌ చేశాం' అని చెప్పుకొచ్చింది లాస్య. ఈ బైక్‌ ధర దాదాపు లక్షన్నర రూపాయలు ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారగా అన్నయ్యకు బైక్‌ కొనిచ్చిన లాస్యను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. భర్తకు కారు, నాన్నకు ట్రాక్టర్‌, ఇప్పుడు అన్నయ్యకు బైక్‌ గిఫ్ట్‌ ఇవ్వడం మామూలు విషయం కాదంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

చదవండి: కోట్లు ఖరీదు చేసే ఆస్తులు గిఫ్ట్‌గా ఇస్తే షాకయ్యారు! అంతా సురేఖ వల్లే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement