జున్ను బర్త్‌డే: లాస్య గ్రాండ్‌ పార్టీ | Lasya Manjunath Son Birthday Celebrations With Bigg Boss Contestants | Sakshi
Sakshi News home page

లాస్య గ్రాండ్‌ పార్టీ: రచ్చ లేపిన బిగ్‌బాస్‌ కంటస్టెంట్లు

Published Tue, Apr 6 2021 2:37 PM | Last Updated on Tue, Apr 6 2021 6:02 PM

Lasya Manjunath Son Birthday Celebrations With Bigg Boss Contestants - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌కు వెళ్లివచ్చిన తర్వాత యాంకర్‌ లాస్య బుల్లితెర మీద మళ్లీ సందడి చేస్తోంది. యాంకర్‌ రవితో కలిసి ప్రోగ్రామ్‌ చేస్తున్న ఆమె ఓవైపు యాంకరింగ్‌తో, మరోవైపు యూట్యూబ్‌ వీడియోలతో అభిమానులను అలరిస్తోంది. తాజాగా ఆమె తన కొడుకు జున్ను బర్త్‌డేను పురస్కరించుకుని గ్రాండ్‌ పార్టీ ఏర్పాటు చేసింది. దీనికి కామెడీ స్టార్స్‌తో పాటు అఖిల్‌, మోనాల్‌ గజ్జర్‌, అషూ రెడ్డి, సోహైల్‌ సహా పలువురు బిగ్‌బాస్‌ సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు.

ఈ సందర్భంగా జున్నుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ పార్టీలో దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.  ప్రస్తుతం ఆ పిక్స్‌ నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇక లాస్య కూడా కొడుకుతో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. "హ్యాపీ బర్త్‌డే జున్ను బేటా.. నువ్వు నా అదృష్టానివి కన్నమ్మ.. ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి.. బ్లెస్‌ యు బేటా.." అని రాసుకొచ్చింది. అతడికి దక్ష్‌ అని నామకరణం చేసినట్లు రివీల్‌ చేసింది.

కాగా లాస్యది ప్రేమ వివాహం. 2010లో ఆమె తను ప్రేమించిన మంజునాథ్‌తో రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకుంది. ఈ విషయాన్ని ఏడేళ్లు దాచిపెట్టింది. చివరకు పెద్దలను ఒప్పించి అందరి సమక్షంలో 2017లో మరోసారి మంజునాథ్‌తో ఏడడుగులు నడిచింది. తర్వాత ఐదు నెలలకే గర్భం దాల్చింది, కానీ అది నిలవలేదు. ఇక మరుసటి ఏడాదే జున్ను జన్మించడంతో లాస్య మాతృత్వపు మాధుర్యాన్ని అనుభవించింది.

చదవండి: జున్ను వ‌చ్చాక నా లైఫ్ మారిపోయింది: లాస్య

ఆ ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement