![Anchor Lasya Manjunath Hospitalised Video Goes Viral - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/3/lasya.jpg.webp?itok=jabDy7X5)
ప్రముఖ యాంకర్ లాస్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. చీమ ఏనుగు జోక్స్‌తో కూడా బాగా పాపులర్ ఆమె యాంకర్‌గా స్టేజీపై ఆమె చేసే సందడి అంతా ఇంతా కాదు. కొంతకాలంగా బుల్లితెరకు గ్యాప్ ఇచ్చిన లాస్య తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా అలరిస్తుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోలతో నెట్టింట సందడి చేస్తుంది. అయితే తాజాగా లాస్య హాస్పిటల్ పాలైంది.
ఈ విషయాన్ని స్వయంగా లాస్య భర్త మంజునాథ్ తన ఇన్‌స్టా స్టోరీలో చెప్పుకొచ్చారు. గెట్ వెల్ సూన్ అంటూ ఓ పోస్ట్‌ను షేర్ చేశారు. దీంతో యాంకర్ లాస్యకు ఏమైందంటూ ఆమె ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. లాస్య హాస్పిటల్‌లో ఎందుకు చేరిందన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు. మరోవైపు ఆమె త్వరగా కోలుకోవాలంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment