Anchor Lasya Majunath Expecting Her Second Baby, Photo Goes Viral - Sakshi
Sakshi News home page

Anchor Lasya: రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న లాస్య.. ఫోటో వైరల్‌

Sep 21 2022 12:31 PM | Updated on Sep 21 2022 1:32 PM

Anchor Lasya Majunath Expecting Her Second Baby Shares Pic - Sakshi

యాంకర్‌ లాస్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. చీమ ఏనుగు జోక్స్‌తో బాగా పాపులర్‌ అయిన లాస్య పలు టీవీ షోలకు యాంకర్‌గా వ్యవహరించింది. పెళ్లి తర్వాత కెరీర్‌కు కాస్త గ్యాప్‌ ఇచ్చిన లాస్య సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఫ్యాన్స్‌తో షేర్‌ చేస్తుంటుంది. తాజాగా తన సెకండ్‌ ప్రెగ్నెన్సీ గురించి అభిమానులతో పంచుకుంది.

నేను మరోసారి గర్భవతినయ్యాను. సెకండ్‌ బేబీ ఆన్‌ ప్రాసెస్‌ అంటూ భర్తతో కలిసి దిగిన ఫోటోను షేర్‌చేసుకుంది. దీంతో బుల్లితెర సెలబ్రిటీలు సహా నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం లాస్య షేర్‌ చేసిన ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement