బిగ్‌బాస్‌: మోనాల్ కోసం అరియానా త్యాగం | Bigg Boss 4 Telugu: Lasya, Noel, Harika Safe For Sixth Week Elimination | Sakshi
Sakshi News home page

అభి, దివికి అహంకారం, మెహ‌బూబ్ వాడుకుంటున్నాడు

Published Sat, Oct 17 2020 11:22 PM | Last Updated on Sat, Oct 17 2020 11:31 PM

Bigg Boss 4 Telugu: Lasya, Noel, Harika Safe For Sixth Week Elimination - Sakshi

బిగ్‌బాస్ హోస్ట్ మార‌నున్నార‌న్న ఊహాగానాల‌కు చెక్ పెడుతూ నేటి ఎపిసోడ్‌లో నాగార్జునే వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించారు. బిగ్‌బాస్ డీల్స్‌లో ఇంటిస‌భ్యులు వ‌దిలేసిన ఒక డీల్‌ను ప‌ట్టుబ‌‌ట్టి మ‌రీ చేయించారు. అలాగే కంటెస్టెంట్లు ఒక‌రి గురించి మ‌రొక‌రు మ‌న‌సులో ఏమ‌నుకుంటున్నారనేదాన్ని బ‌య‌ట‌పెట్టారు. సోహైల్‌పై అరిచిన అవినాష్‌కు చీవాట్లు పెట్టారు. నామినేష‌న్లో తొమ్మిదిమంది ఉండ‌గా అందులో ముగ్గురిని సేవ్ చేశారు. మ‌రి బుల్లితెర బాస్‌ బిగ్‌బాస్ షోలో ఇంకా ఏమేం జ‌రిగాయో చ‌దివేసేయండి..

మార‌ని మాస్ట‌ర్‌, సోహైల్‌పై వ్య‌క్తిగ‌త దూష‌ణ‌
శుక్ర‌వారం నాటి ఎపిసోడ్‌లో బిగ్‌బాస్‌ ఇంటిస‌భ్యుల‌కు దోసె టాస్క్ ఇచ్చాడు. ఇందులో వారు రెండు టీమ్‌లుగా విడిపోయి మిన‌ప‌గుళ్ల‌ను పిండి రుబ్బి దోసె వేయాల్సి ఉంటుంది. ఎక్కువ దోసెలు వేసిన మాస్ట‌ర్‌ టీమ్ గెలుపొంద‌గా, అందులోని స‌భ్యులకు ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్క్‌లో అద‌న‌పు పాయింట్లు ల‌భిస్తాయి. ఇక ఆట‌లో దోసె దొంగిలించిన‌ట్లు ప‌రాచ‌కాలు ఆడిన సోహైల్‌పై మాస్ట‌ర్ చిర్రుబుర్రులాడాడు. నీకు దొంగ అన్న పేరు క‌రెక్ట్‌గా పెట్టార‌‌ని వ్య‌క్తిగ‌తంగా దూషించారు. అత‌డి ప్ర‌వ‌ర్త‌న‌కు షాకైన‌ సోహైల్ ఇప్ప‌టినుంచి ఏ టాస్క్ ఆడ‌నంటూ అలిగాడు. త‌న‌కు లేనిపోని అన్ని పేర్లు పెడుతున్నా‌ర‌ని బాధ‌ప‌డ్డాడు. కానీ మాస్ట‌ర్ మాత్రం అలా దూషించ‌డం త‌న త‌ప్పే అని అంగీక‌రించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఏదేమైనా ఇంకోసారి సోహైల్‌ను దొంగ అనకండ‌ని అఖిల్ మాస్ట‌ర్‌కు సూచించాడు. (చ‌ద‌వండి: ఫిజిక‌ల్ టాస్కులు అభిజిత్‌కు చేత‌కాదా?)

సోహైల్‌కు సారీ చెప్పిన అరియానా
నాగార్జున ఎప్ప‌టిలాగే ఈసారి కూడా అమ్మాయిలు బాగున్నార‌ని మెచ్చుకున్నారు. త‌ర్వాత కంటెస్టెంట్లు చేసిన త‌ప్పొప్పుల‌ను ఎత్తి చూపారు. నోయ‌ల్‌ను రేస‌ర్ ఆఫ్ ద హౌస్ టాస్క్ ఎందుకు ఆడ‌లేద‌ని ప్ర‌శ్నించారు. అవ‌కాశ‌మొచ్చిన‌ప్పుడు వ‌దులుకోవ‌ద్ద‌ని సూచించారు. నిజ‌మైన నోయ‌ల్ ఇంకా బ‌య‌ట‌కు రావ‌ట్లేద‌న్నారు. ఇక‌ సోహైల్ కోపాన్ని గెలిచేశాడ‌‌ని ప్ర‌శంసించారు. అత‌డిని పొగ‌రు అన్న అరియానాను నిలబెట్టి నిల‌దీశారు. అయితే 'సోహైలే వ‌చ్చి తినిపిస్తూ మ‌రీ సారీ చెప్పాడు, క‌దా! మ‌రి నువ్వు చెప్ప‌వా' అని అడిగారు. దీంతో చెప్ప‌న‌ని మొండికేస్తూనే చివ‌రి నిమిషంలో సారీ చెప్పింది. త‌ర్వాత బిగ్‌బాస్ డీల్స్ టాస్క్‌లో సోహైల్‌- అవినాష్ మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ‌లో అవినాష్‌దే త‌ప్ప‌ని నాగ్ కుండ బ‌ద్ధ‌లు కొట్టారు. సంచాల‌కుడిగా సోహైల్ క‌రెక్ట్‌గానే ఉన్నాడ‌ని పేర్కొన్నారు. ఇక‌ మోనాల్ ఆరు రోజులుగా ఒక‌టే డ్రెస్ వేసుకుండ‌టంతో నాగ్ ఓ స‌ల‌హా ఇచ్చారు. ఈ ఒక్క‌రోజు మోనాల్‌కు బ‌దులు ఆమె బ్లూ టీమ్‌లోని మిగ‌తా ఎవ‌రైనా ఆమె డ్రెస్ వేసుకోవాల‌ని చెప్ప‌డంతో అరియానా ముందుకు వ‌చ్చింది. (చ‌ద‌వండి: నా ల‌వ్ బ్రేక‌ప్ అయింది: అఖిల్‌)

సేఫ్ అయిన తొలి కంటెస్టెంటు లాస్య‌
బ్లూ టీమ్ వ‌దిలేసిన అర‌గుండు డీల్ పూర్తి చేసిన‌వారికి త‌ర్వాతి వారం నామినేష‌న్ నుంచి సేఫ్ అయ్యే అవ‌కాశం ఉంటుంద‌ని నాగ్ బంప‌ర్‌ ఆఫ‌ర్ ప్ర‌క‌టించారు. ఈ డీల్‌కు అమ్మ రాజ‌శేఖ‌ర్‌ ఒప్పుకోవ‌డంతో నోయ‌ల్ గుండు గీశాడు. త‌ల్లి కోసం చేయ‌ని త్యాగం బిగ్‌బాస్ కోసం చేశావ‌ని నాగ్‌‌ మాస్ట‌ర్‌ను ఆకాశానికెత్తారు. మీరు కానీ, లేదా ఇత‌రులనెవ‌రినైనా సేవ్ చేసే అవ‌కాశ‌మిచ్చారు.  హెయిర్ క‌ట్ చేసుకున్నాక కూడా హారిక క్యూట్‌గా ఉంద‌ని తెలిపారు. ఇక లాస్య టాస్క్‌లో అన్నీ క‌ల‌గ‌లిపిన డ్రింక్ ఎలా తాగావ‌ని మెచ్చుకుంటూనే ఆమె సేఫ్ అయిన‌ట్లు ప్ర‌క‌టించారు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: మాస్టర్‌ కాళ్లు పట్టుకున్న సోహైల్‌)

కంటెస్టెంట్ల‌ రంగు బ‌య‌ట‌పెట్టిన మ‌న‌సులో మాట‌
ఇంటిస‌భ్యులు ఒక‌రి గురించి మ‌రొక‌రు ఏమ‌నుకున్నారో రాసివ్వ‌గా వాటిని నాగ్‌ చ‌దివి వినిపించారు.
అవినాష్‌ది టాస్కు స‌మ‌యంలో క్రూర మ‌న‌స్త‌త్వం-దివి
► మెహ‌బూబ్ ఫ్రెండ్‌షిప్ స‌ర్కిల్ సెట్‌ చేసుకుని వారిని వాడుకోవాల‌నుకుంటాడు. స్వార్థప‌రుడు కానీ స్నేహం కోసం చేస్తున్న‌ట్టు క‌ల‌ర్ ఇస్తాడు - కుమార్ సాయి
► లాస్యది మోస‌పూరిత న‌వ్వు- అమ్మ రాజ‌శేఖ‌ర్‌
► అభిజిత్‌కు చాలా అహంకారం- దివి
► నోయ‌ల్‌ది తాత్కాలిక స్నేహం- అవినాష్
► అరియానా అతిగా స్పందించ‌డం, పాడ‌టం కొన్నిసార్లు హ‌ద్దులు దాటుతుంది- మెహ‌బూబ్ 
► దివి.. అహంకారం, అగౌర‌వం, స‌భ్య‌త లేకుండా ఉంటుంది, ఇత‌ర మ‌నోభావాల‌ను ప‌ట్టించుకోదు- మోనాల్‌
► అఖిల్‌ నిజాయితీప‌రుడిగా, ఎటువంటి వంచ‌న లేని మ‌నిషిగా న‌టిస్తాడు- అభిజిత్
► మోనాల్‌ అబద్ధాల కోరు-  అభిజిత్
► అమ్మ రాజ‌శేఖ‌ర్‌ ఏం అరుస్తాడో, నిజాయితీ అన్న ముసుగు ఎలాగైతా ఉండాల‌నుకుంటున్నాడో అందులో దాచుకుంటాడు- అభిజిత్‌

నోయల్‌.. నాకు నాన్న‌: ‌హారిక‌
త‌ర్వాత‌ నోయ‌ల్‌, హారిక సేఫ్ అయిన‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా హారిక త‌న‌కు ఈ సేవింగ్ చాలా స్పెష‌ల్ అని చెప్పింది. నోయ‌ల్‌ను త‌న‌ నాన్న‌లా ట్రీట్ చేస్తాన‌ని పేర్కొంది. ఇక అర‌గుండు గీసుకున్న మాస్ట‌ర్‌ త‌ర్వాతి వారం నామినేష‌న్ నుంచి తానే సేఫ్ అవుతాన‌ని వెల్ల‌డించారు. ఇక ఈ వారం మోనాల్ గ‌జ్జ‌ర్‌ను కాద‌ని అన్యాయంగా కుమార్ సాయిని ఎలిమినేట్ చేసిన‌ట్లు స‌మాచారం. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: ఆమెపై ఎలిమినేష‌న్ క‌త్తి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement