బిగ్‌బాస్‌: అఖిల్‌కు ప‌ట్ట‌ని మోనాల్ బాధ‌ | Bigg Boss 4 Telugu: AKhil Ignores Monal Gajjar | Sakshi
Sakshi News home page

హారిక త‌మ‌న్నా, మోనాల్ అనుష్క అంటోన్న‌ అభి

Published Thu, Dec 10 2020 11:57 PM | Last Updated on Fri, Dec 11 2020 4:49 AM

Bigg Boss 4 Telugu: AKhil Ignores Monal Gajjar - Sakshi

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ ముగిసేందుకు ఇంకా ప‌ది రోజులు మాత్ర‌మే మిగిలి ఉంది. ప్రేక్ష‌కుల‌తో మ‌రింత‌ క‌నెక్ట్ అయ్యేందుకు బిగ్‌బాస్ ఇచ్చిన అవ‌కాశాల‌ను అరియానా అందిపుచ్చుకుంటోంది. రెండోసారి గెలిచి ప్రేక్ష‌కుల‌ను ఓటేయ‌మ‌ని అభ్య‌ర్థించే ఛాన్స్ అందుకుంది. అటు అరియానాతో గొడ‌వ ప‌రిష్క‌రించుకుందామ‌ని వెళ్లిన సోహైల్‌కు అనుకూల ఫ‌లితాలు రాలేదు. మ‌రోవైపు అఖిల్ త‌న‌కు పులిహోర క‌ల‌ప‌డం త‌గ్గించ‌మ‌ని స‌ల‌హా ఇచ్చిన‌ మోనాల్‌ను చుల‌క‌న చేసి మాట్లాడాడు. ఇంకా ఎన్నెన్నో జ‌రిగిన నేటి బిగ్‌బాస్ ఎపిసోడ్ ఎలా కొన‌సాగిందో తెలియాలంటే దీన్ని చ‌దివేయండి..

మొన్న అధికారం, ఇప్పుడు ఏకాగ్ర‌త‌
మిమ్మ‌ల్ని మీరు నిరూపించుకోండంటూ బిగ్‌బాస్ "ఏకాగ్ర‌త" అనే మూడో టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఇంటిస‌భ్యులు 30 నిమిషాల‌ను లెక్క‌పెట్టాల్సి ఉంటుంది. ఉల్లిపాయ తొక్క తీస్తూ, మొక్క‌జొన్న పొట్టు తీస్తూ ఇలా ర‌క‌ర‌కాల ప‌నులను చేస్తూ ఈ టాస్క్ పూర్తి చేయాలి. వీళ్ల‌ను మిగ‌తా ఇంటిస‌భ్యులు స‌రైన స‌మ‌యాన్ని లెక్కించ‌కుండా డిస్ట‌ర్బ్ చేయాలి. మొద‌ట మోనాల్‌తో టాస్క్ మొద‌ల‌వ‌గా ఆమెను ఇంటి స‌భ్యులు వ‌రుస‌ ప్ర‌శ్న‌ల‌డుగుతూ ఏకాగ్ర‌త దెబ్బ తీసేందుకు ప్ర‌య‌త్నించారు. ఎవ‌రెస్ట్ శిఖ‌రం ఎక్క‌డ ఉంది? నీ(knee) పైన ఏముంటుంది? అంటూ అభి ఒక‌దానికొక‌టి సంబంధం లేని ప్ర‌శ్న‌లు వేయ‌గా వాటిన్నింటికీ ఆమె ఓపిక‌గా స‌మాధాన‌మిచ్చింది. పిల్ల‌లెరా పుడ‌తారు? అన్న ప్ర‌శ్న‌కు ఆస్ప‌త్రిలో పుడ‌తారని అదిరిపోయే ఆన్స‌రిచ్చింది. (చ‌ద‌వండి: మోనాల్ మ‌న‌సులో నేనున్నా అంది: అభి)

హారిక త‌మ‌న్నా, మోనాల్ శివ‌గామి
ఈ టాస్క్‌లో అఖిల్ మోనాల్‌కు సాయం చేసేందుకు ప్ర‌య‌త్నించ‌గా మిగ‌తావాళ్లు ప‌సిగ‌ట్టేశారు. త‌ర్వాత అరియానా, హారిక టాస్కును పూర్తి చేయ‌గా అనంత‌రం అభి రంగంలోకి దిగాడు. ఈ హౌస్‌లో శివ‌గామి ఎవ‌రు? అని హారిక అత‌డిని ప్ర‌శ్నించింది. దీనికి పెద్ద‌గా ఆలోచించాల్సిన ప‌నే లేద‌న్న‌ట్లుగా అభి ట‌పీమ‌ని ఆన్స‌రిచ్చాడు. శివ‌గామిలో అందం మోనాల్‌కు ఉంది, శివ‌గామిలో ఉన్న టెర్ర‌ర్ అరియానాకు, శివ‌గామిలోని ప్రేమ హారిక‌కు ఉంద‌ని చెప్పి అంద‌రూ అవాక్క‌య్యేలా చేశాడు. పోనీ శివ‌గామి, అనుష్క‌, త‌మ‌న్నా ఎవ‌రో చెప్ప‌మ‌ని అడ‌గ్గా అరియానా.. శివ‌గామి, హారిక.. త‌మ‌న్నా, మోనాల్.. అనుష్క అని జ‌వాబిచ్చాడు. (చ‌ద‌వండి: అరియానాకు ఓటేయ‌మ‌ని ఆర్జీవీ పిలుపు)

మీకెంత ద‌గ్గ‌రైతే అంత ముందుకెళ్తా..
ఈ టాస్క్‌లో ఎవ‌రూ స‌రిగ్గా స‌మ‌యాన్ని లెక్క‌పెట్ట‌లేదు. అరియానా మాత్రం ఇచ్చిన టార్గెట్‌కు చేరువ‌లో అంటే 37 నిమిషాలు లెక్క‌పెట్ట‌డంతో ఆమె విజేత‌గా నిలిచి మ‌రోసారి ప్రేక్ష‌కుల‌తో మాట్లాడే అవ‌కాశం పొందింది. ఈ సంద‌ర్భంగా గోల్డెన్ మైక్ చేత ప‌ట్టుకున్న ఆమె ఆనందం ప‌ట్టలేక‌పోయింది. మీకెంత ద‌గ్గ‌రైతే అంత ముందుకెళ్తాన‌ని చెప్పుకొచ్చింది. నేనంటే కొద్దిగా ఇష్టం, కొద్దిగా క‌ష్ట‌మైన వారికి కూడా ల‌వ్‌యూ చెప్తున్నానంది. మ‌రోవైపు సోహైల్ అరియానా బొమ్మ మీద ప‌డ్డాడు. ఆమె త‌న ఎమోష‌న్ అని చెప్పుకునే బొమ్మ వాష్‌రూమ్‌లో ప‌డేసి ఉంద‌న్నాడు. అరేయ్ చింటూగా నిన్ను చంపుతారా.. అంటూ దానితో కాసేపు ఆడుకున్నాడు. బొమ్మ‌ను పాడు చేచేస్తే లేని గొడ‌వ మొద‌ల‌వుతుంద‌ని  మోనాల్ అత‌డిని లాక్కెళ్లింది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌ : అభిజిత్‌కి జైలు శిక్ష..నెంబర్‌ వన్‌ అతనే!)

డీల్స్ మాట్లాడుకున్న సోహైల్, అఖిల్‌
నేను గెలిస్తే నీకు బైక్, ల్యాప్‌టాప్ కొనిస్తానంటూ అఖిల్‌, సోహైల్ ఒక‌రికి ఒక‌రు మాటిచ్చుకున్నారు. త‌ర్వాత జెమ్స్‌తో పోరాడాల్సిన‌ ఫైట్ సీన్స్ టాస్క్‌లో సోహైల్ గెలిచాడు. అనంత‌రం మోనాల్ ఏదో న‌వ్వుకుంటూ అన్న మాట‌కు అఖిల్ సీరియ‌స్ అయ్యాడు. ఒక‌మ్మాయిని ఫ్రెండ్‌గా తీసుకుంటే త‌ప్పేమీ కాద‌ని అఖిల్ అన‌గా పులిహోర అంటూ సోహైల్ పాట‌లు పాడాడు. నేనేదో చేసేస్తున్నా అన్న‌ట్లుగా మాట్లాడుతున్నావ‌ని మోనాల్ మీద గ‌ర‌మ‌య్యాడు. నీవు మొద‌టి నుంచీ ఫ్ల‌ర్టింగ్ చేస్తున్నావు కానీ ఈ మ‌ధ్య కొంచెం ఎక్కువైంది. అది చూడ‌టానికి బాగోలేదు అని ఉన్న‌మాట‌ చెప్పింది. నిన్ను ఏదో బ్యాడ్ చేయ‌డానికి ఇలా చెప్ప‌ట్లేద‌ని స్ప‌ష్టం చేసింది. కానీ అఖిల్ మాత్రం ఆమె మాట‌ల‌తో ఏకీభ‌వించ‌లేదు. 'నేను అంద‌రి ముందే మ‌జాక్ చేస్తున్నాను అంతే, నీకు త‌ప్పుగా అనిపిస్తే నాకు చెప్ప‌కు, నాతో మాట్లాడ‌కు' అని దురుసుగా మాట్లాడ‌టంతో మోనాల్ హ‌ర్టై అక్క‌డ నుంచి వెళ్లిపోయింది. నీతో టైమ్ స్పెండ్ చేయాల‌ని ఉంద‌ని మోనాల్ మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట పెట్టింది. అలా అనిపిస్తే ఎక్క‌డో మూల‌న ఎందుకు కూర్చుంటావు, నువ్వే వ‌చ్చి నా ప‌క్క‌న కూర్చో అని ప‌ట్టింపు లేన‌ట్లుగా మాట్లాడాడు.

కొలిక్కి రాని చ‌ర్చ‌లు
త‌ర్వాత సోహైల్ అరియానాతో మాట్లాడి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకునేందుకు ప్ర‌య‌త్నించాడు. అవినాష్ లేప్పుడు అత‌డి గురించి మాట్లాడ‌టం, నాపైకి దూసుకుంటూ రావ‌డం న‌చ్చ‌లేద‌ని అరియానా ముఖం మీదే చెప్పింది. టాస్క్ వ‌ల్ల ఈ పంచాయితీ అయింద‌ని, ఇందులో ఇద్ద‌రిదీ త‌ప్పుంద‌ని సోహైల్ అన్నాడు. వీళ్ల గొడ‌వ‌కు మాత్రం ప‌రిష్కారం దొర‌క‌లేదు. అటు తిరిగి, ఇటు తిరిగి అత‌డికి అఖిల్‌తో కూడా ఫైట్ అయింది. వీట‌న్నింటితో మ‌న‌సు పాడు చేసుకున్న సోహైల్ క‌న్నీళ్లు పెట్టుకోగా అఖిల్ అత‌డిన ఓదార్చాడు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: ఈ సారి కూడా అమ్మాయిల‌కు నో ఛాన్స్)

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/5

2
2/5

3
3/5

4
4/5

5
5/5

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement