Noel Sean
-
బిగ్‌బాస్ నోయల్ '14' సినిమా రివ్యూ
బిగ్‌బాస్ ఫేమ్ నోయల్ లేటెస్ట్ మూవీ '14'. ఇందులో ఇతడు డిటెక్టివ్ పాత్ర పోషించాడు. రామ్ రతన్ రెడ్డి, విషాక ధీమాన్ హీరోహీరోయిన్లుగా నటించారు. పోసాని కూడా కీ రోల్ చేశారు. లక్మీ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా.. సుబ్బారావు రాయన, శివకృష్ణ నిచ్చన మెట్ల సంయుక్తంగా నిర్మించారు. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ సస్పెన్స్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉంది? టాక్ ఏంటనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?రతన్ (రామ్ రతన్ రెడ్డి).. ముఖ్యమంత్రి (పోసాని కృష్ణ మురళి) కుమారుడు. ఇతడిది జాలీ లైఫ్. నేహా (విషాక ధీమాన్) అనే డాక్టర్‌తో ప్రేమలో ఉంటాడు. ఉన్నట్టుండి ఓరోజు.. నేహా ఫ్లాట్‌లో వీళ్లిద్దరూ విగత జీవులుగా కనిపిస్తారు. ఆత్మహత్య కింద కేసు నమోదు చేసి పోలీసులు.. కేస్ మూసేస్తారు. జర్నలిస్ట్ సుబ్బు(శ్రీకాంత్ అయ్యంగార్) మాత్రం వీరిది ఆత్మహత్య కాదని, హత్య అని ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తాడు. ఇంతకీ సుబ్బు ఏం కనుక్కొన్నాడు. ఈ చావులో సీఎం పాత్ర ఏంటి? డిటెక్టివ్ నోయల్ ఈ కేస్ స్టడీలో ఎంత వరకూ ఉపయోగపడ్డాడు? అనేదే స్టోరీ.(ఇదీ చదవండి: రష్మిక 'కుబేర' వీడియో.. ఆ సూట్ కేసులో ఏముంది?)ఎలా ఉందంటే?మొదట్లో ఓ సాధారణ మర్డర్ మిస్టరీలాగ సినిమా ప్రారంభించారు. ఆ తరువాత ఇంట్రెస్టింగ్ మలుపులతో స్క్రీన్ ప్లే నడిపించారు. మధ్యలో యూత్‌ని ఎంటర్ టైన్ చేయడం కోసం రొమాంటిక్ సీన్స్ పెట్టారు. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు ట్విస్టులతో ఆకట్టుకున్నారు. 14 ఏళ్ల యువకుల్లో వచ్చే మార్పులు ఎలా ఉంటాయి? వారు టెక్నాలజీలో పడి ఎలాంటి వాటికి బానిస అవుతున్నారు? తల్లిదండ్రులు వారి పట్ల ప్రవర్తిస్తున్న తీరు తదితర విషయాలను ప్రీ క్లైమాక్స్ నుంచి బాగా చూపించి... తల్లిదండ్రులకు ఓ మెసేజ్ ఇచ్చారు. పిల్లల ఎదురుగా తల్లిదండ్రులు ఎలాంటి పనులు చేయకూడదో... అలా చేయడం వల్ల వారు ఎలాంటి క్షణికావేశాలకు లోనవుతారనేది ఇందులో చూపించారు.ఎవరెలా చేశారు?నోయల్ డిటెక్టివ్‌గా... ప్రీ క్లైమాక్స్‌లో ఆకట్టుకుంటారు. లీడ్ రోల్స్ చేసిన రతన్, విషాక పర్లేదు. రొమాంటిక్స్ సీన్లలో బాగానే చేశారు. పోసాని కృష్ణ మురళి పాత్ర ఓకే. జబర్దస్త్ మహేష్ పాత్ర కాసేపు ఉన్నా... తన మార్క్ సంభాషణలతో ఆకట్టుకుంటారు. జర్నలిస్ట్ సుబ్బు పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ పాత్రకు న్యాయం చేశారు. మిగతా పాత్రధారులు తమ తమ పరిధి మేరకు నటించారు. దర్శకుడు లక్ష్మీ శ్రీనివాస్ రాసుకున్న కథ... కథనాలు చాలా బాగున్నాయి. రొమాంటిక్ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ తీసినప్పటికీ.. చివర్లో ఓ మంచి మెసేజ్ ఇచ్చి ఆకట్టుకున్నారు. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాటోగ్రఫ, సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్‌గా ఉండాల్సింది. (ఇదీ చదవండి: ప్రభాస్ 'రాజాసాబ్'... ఆ వార్తలు నమ్మొద్దని టీమ్ ప్రకటన) -
బిగ్‌బాస్ నోయల్ '14' సినిమా.. ఫస్ట్‌లుక్ పోస్టర్
బిగ్‌బాస్ నోయల్ హీరోగా, విషాక ధీమాన్ హీరోయిన్గా నటిచంఇన చిత్రం 14. లక్మీ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మెట్ల రాయల్ పిక్చర్స్ పతాకంపై సుబ్బారావు రాయన, శివకృష్ణ నిచ్చన సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ జూలై 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది, ఈ సందర్భంగా చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను డైరెక్టర్స్ యూనియన్ ప్రెసిడెంట్ డైరెక్టర్ వీర శంకర్ లాంచ్ చేశారు.ఈ సందర్భంగా వీరశంకర్ మాట్లాడుతూ అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లే ఉన్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ "14" చిత్రం కచ్చితంగా మంచి హిట్ కొడుతుందన్నారు. రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రంలో రతన్, పోసాని కృష్ణ మురళి, శ్రీకాంత్ అయ్యంగర్, రూపాలక్ష్మి తదితరులు నటించారు. కళ్యాణ్ నాయక్ పాటలు అందించగా ఆదిత్య భార్గవ్ మాటలు రాశారు. -
అతనితో 16 రోజులే ఉన్నాను.. రెండో పెళ్లి చేసుకోవాలని ఉంది: ఎస్తర్
కన్నడలో పలు సినిమాల్లో నటించి ఆపై తెలుగులో 'భీమవరం బుల్లోడు' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఎస్తర్ నోరోన్హ. ఆమె ఇప్పటి వరకు తెలుగు, తమిళం, కన్నడ, మరాఠీ, కొంకణి, హిందీ భాషా చిత్రాలలో నటించింది. జయ జానకి నాయిక, గరం,69 సంస్కార్ కాలనీ,డెవిల్,టనెంట్ వంటి తెలుగు సినిమాల్లో మెరిసింది. పలు సినిమాల్లో ఐటెం సాంగ్స్‌లో కూడా మెప్పించిన ఎస్తర్ రెండో పెళ్లికి సిద్ధమైనట్లు తెలిపింది.టాలీవుడ్ సింగర్, నటుడు నోయల్‌ను ప్రేమించి 2019లో పెళ్లి చేసుకున్న ఎస్తర్.. వారి బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. ఆరు నెలల్లోనే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించిన ఎస్తర్ తన గ్లామర్‌తో కుర్రకారును అదరగొట్టింది. రెక్కి, సంస్కార్ కాలనీ చిత్రాలలో తన గ్లామర్‌తో ఆకట్టుకుంది.తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి ఎస్తర్ ఇలా చెప్పుకొచ్చింది. 'నేను 2019లో పెళ్లి చేసుకున్నాను. అయితే, మేము కేవలం 16 రోజులు మాత్రమే కలిసి ఉన్నాము. పెళ్లయిన 16 రోజుల తర్వాత అతనితో దూరంగానే ఉంటూ వచ్చాను. అలా 2020లో విడాకులు తీసుకున్నాను. ప్రస్తుతం నాకు ఒంటరిగా బతకాలని లేదు. నేను మళ్లీ పెళ్లి చేసుకుంటాను. నాకు అందమైన జీవితం కావాలి. అందుకు తగిన భాగస్వామి కోసం వెతుకుతున్నారు. అయితే, ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలో నాకు క్లారిటీ లేదు. నేను ఇప్పటికే ఒకసారి వివాహం చేసుకున్నాను.. అందులో చాలా సమస్యలను ఎదుర్కొన్నాను, నన్ను అర్థం చేసుకునే అబ్బాయి నాకు దొరుకుతే సంతోషం. షోకేస్ లాంటి భర్త వద్దు.' అని ఎస్తర్ చెప్పుకొచ్చింది. రెండో పెళ్లిపై ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారాయి. -
తప్పుగా చిత్రీకరించాడు, యాసిడ్ పోస్తానని బెదిరించాడు : నోయెల్ మాజీ భార్య
'భీమవరం బుల్లోడు' సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఎస్తర్ నోరోన్హ. 'జయజయజానకి నాయక'లో ఓ చిన్న పాత్ర చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అంతలోనే ఆమెకు అవకాశాలు కరువయ్యాయి. ఈ క్రమంలో సింగర్ నోయల్‌ను ప్రేమ వివాహం చేసుకున్నప్పటికీ ఈ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. పెళ్లి చేసుకున్న ఆరు నెలల్లోనే వీరు విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం కెరీర్లో బిజీగా ఉన్నానంటోంది ఎస్తర్. రీసెంట్గా ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటరవ్యూలో ఆమె మరోసారి నోయెల్‌పై కామెంట్స్ చేసింది. అతనితో విడిపోయాక నాపై నెగిటివ్ ప్రచారం చేశాడు. విడాకుల తర్వాత బిగ్‌బాస్‌లోకి వెళ్లిన నోయెల్ ఆ ఇష్యూని సానుభూతి కోసం వాడుకున్నాడు. మనుషులు ఇలా కూడా ఉంటారా అని అప్పుడు అర్థమయ్యింది. నేనేదే తప్పు చేసినట్లుగా చిత్రీకరించాడు. దీంతో సోషల్ మీడియాలో నాపై చాలా ట్రోల్స్ వచ్చాయి. ఒకతను అయితే నువ్వు హైదరాబాద్‌కి వస్తే యాసిడ్ పోస్తానంటూ బెదిరించాడు. మంచితనం అనే ముసుగులో నోయెల్ సింపతీ క్రియేట్ చేసుకున్నాడు. కానీ నిజం ఏంటన్నది నాకు తెలుసు కదా.. పెళ్లయిన 16రోజులకే అతని నిజస్వరూపం తెలుసుకున్నా. అందుకే విడాకులు తీసుకున్నా అంటూ చెప్పుకొచ్చొంది. -
ఓటీటీలో పంచతంత్ర కథలు, స్ట్రీమింగ్ అప్పుడే!
బాల్యంలో చదువుకున్న పంచతంత్ర కథల ఇన్స్పిరేషన్తో తెరకెక్కిన ఆంథాలజీ మూవీ పంచతంత్ర కథలు. నోయల్, నందిని రాయ్, సాయి రోనక్, గీత భాస్కర్, ప్రణీత పట్నాయక్, నిహాల్ కోదర్తి, సాదియ, అజయ్ కతుర్వర్ ముఖ్య పాత్రలు పోషించారు. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించగా ప్రముఖ వ్యాపారవేత్త డి. మధు నిర్మించారు. ఇందులో అడకత్తెర, అహల్య, హ్యాపీ మ్యారీడ్ లైఫ్, నర్తనశాల, అనగనగా అని ఐదు కథలు ఉంటాయి. వాటి సమాహారమే ఈ సినిమా. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వస్తోంది. ఆగస్టు 31 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలోకి అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. ఆహా అనిపించిన అనౌన్స్మెంట్ ఇది అంటూ నోయల్ సోషల్ మీడియాలో తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. Bittersweetness of love is the most beautiful part being in marriage. Here's such a story "Happy Married Life." #PanchatantraKathaluOnAha from August 31st. @creations_madhu @ShekarPhotos @syedkamran @mrnoelsean @ImNandiniRai@saironak3 @nihalkodhaty1 @ajaykathurvar pic.twitter.com/jx53GqsLqM — ahavideoin (@ahavideoIN) August 27, 2022 చదవండి: బాలీవుడ్లో నా స్నేహితులే నన్ను పక్కన పెట్టేశారు సీతారామం సినిమా అన్ని కోట్లు వసూలు చేసిందా? -
సింగర్ నోయెల్ ఇంట తీవ్ర విషాదం..
ర్యాప్ సింగర్ నోయెల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ర్యాపర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నోయెల్ సింగర్‌గానే కాకుండా నటుడిగానూ పలు సినిమాల్లో నటించాడు. బిగ్‌బాస్ తెలుగు సీజన్-3లో కంటెస్టెంట్‌గానూ పాల్గొని అలరించాడు. అయితే నోయెల్ ఇంట ఇప్పుడు తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నోయెల్ తండ్రి శనివారం రాత్రి కన్నుమూశారు. ఈ విషయం తెలిసి సింగర్ రాహుల్ సిప్లిగంజ్ సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా నోయెల్‌కు తండ్రితో ఎంతో అనుబంధం ఉంది. ఆయనతో కలిసి పంచుకున్న పలు సరదా వీడియోలను నోయెల్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తండ్రి మరణంతో నోయెల్ కుంగిపోయినట్లు తెలుస్తోంది. -
‘పంచతంత్ర కథలు’ మూవీ రివ్యూ
టైటిల్: పంచతంత్ర కథలు నటీనటులు: నోయెల్, నందిని రాయ్, సాయి రోనక్, గీత భాస్కర్, ప్రణీత పట్నాయక్, నిహాల్ కోదర్తి, సాదియ, అజయ్ కతుర్వర్ తదితరులు నిర్మాణ సంస్థ: మధు క్రియేషన్స్ నిర్మాత: డి. మధు రచన-దర్శకత్వం: గంగనమోని శేఖర్ సంగీతం: కమ్రాన్ సినిమాటోగ్రఫి: గంగనమోని శేఖర్, విజయ్ భాస్కర్ సద్దల ఎడిటర్: శ్రీనివాస్ వరగంటి బాల్యంలో మనం పంచతంత్ర కథలు పుస్తకం చదువుకుని... వాటి నుంచి ఎంతో కొంత నీతిని నేర్చుకున్నాం. అలాంటి కథల ఇన్సిపిరేషన్ తో తెరకెక్కిన ఆంథాలజీ చిత్రం ‘పంచతంత్ర కథలు’. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ వ్యాపారవేత్త డి. మధు నిర్మించారు. నోయెల్, నందిని రాయ్, సాయి రోనక్, గీత భాస్కర్, ప్రణీత పట్నాయక్, నిహాల్ కోదర్తి, సాదియ, అజయ్ కతుర్వర్ ముఖ్య పాత్రలు పోషించారు. తాజాగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది? ఆ ఐదు కథలు ఏంటి? అవి ప్రేక్షకులను ఎలాంటి నీతిని భోధించాయో రివ్యూలో చూద్దాం. ఈ చిత్రంలో మొత్తం ఐదు కథలు ఉన్నాయి. 1) అడ్డకత్తెర కథేంటంటే.. కృష్ణ(నిహాల్) అనే యువకుడు క్షవర వృత్తి చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. అదే వీధిలో ఉంటున్న యువతిని సత్య(సాదియ అన్వర్) ప్రేమిస్తాడు. వేరు వేరు కులాలకు చెందిన వీరిద్దరి ప్రేమకు పెద్దల నుంచి ఎలాంటి ఆటంకాలు ఎదురయ్యాయి? చివరకు వీరి ప్రేమకు శుభం కార్డు ఎలా పడిందనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఇప్పటికీ సమాజంలో కుల పిచ్చి అనేది ఇంకా పూర్తిగా తొలగిపోలేదు.కులామ మధ్య ఉండే అంతరాలతో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో రోజూ చూస్తూనే ఉన్నాం. దాన్ని తొలగించాలనే ఉద్దేశంతో ఈ కథను తెరకెక్కించారు. మనం చేసే వృత్తుల వల్ల కులాలను నిర్ణయించారని, వాటి వల్ల ఎలాంటి ఉపయోగంలేదని ఇద్దరి ప్రేమికులను ఒకటి చేసే క్రమంలో పెద్దలకు వివరించి చెప్పారు.ఇందులో నిహాల్, సాదియాల నటన అందరినీ ఆకట్టుకుంటుంది. 2) అహల్య కథేంటంటే.. రేవతి (ప్రణీత పట్నాయక్) ఓ వేశ్య. తన కుటుంబాన్ని పోషించుకోవడానికి పడుపు వృత్తిని ఎంచుకుంటుంది. ఆమెకు పెయింటింగ్ ఆర్టిస్ట్ అయోధ్య(అజయ్ )పరిచయం అవుతాడు. అతని పరిచయంతో ఆమె తనలో మార్పు వస్తుంది. వేశ్య వృత్తిని వదిలేసి మంచి మనిషిగా బతకాలనుకుంటుంది. అలాంటి సమయంలో సమాజం నుంచి రేవతికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? చివరకు ఆమె జీవితం ఎలా ముగిసింది? అనేదే మిగతా కథ. ఎలా ఉదంటే.. ఈ కథ అందరి హృదయాలను హత్తుకుంటుంది. ఓ వేశ్య మాములు మనిషిగా బతకాలని చూస్తే ఆమెను సమాజం ఎలా చూస్తుంది? అనేదానిని తెరపై చక్కగా చూపించారు. వేశ్య వృత్తికి ఎంత దూరంగా ఉండాలని చూసినా.. ఆ మార్పును సమాజం అంగీకరించదు. అందు కోసం వాళ్లు పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తోందనేది ఈ కథ ద్వారా చూపించారు. వేశ్య వృత్తిని వదిలేసి వచ్చిన చిన్నచూపు చోడొద్దనేది ఈ కథ ఇచ్చే సందేశం. క్లైమాక్స్ కంటతడి పెట్టిస్తుంది. వేశ్యగా ప్రణీత పట్నాయక్ తనదైన సహజ నటనతో ఆకట్టుకుంది. 3) హ్యాపీ మ్యారీడ్ లైఫ్ కథేంటంటే: మధ్యతరగతి కుటుంబానికి చెందిన కీర్తిక (నందిని రాయ్)కి డబ్బు అంటే పిచ్చి. బాగా డబ్బు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటే జీవితం సుఖంగా ఉంటుందని భావించి ప్రాణంగా ప్రేమించిన ప్రశాంత్(నోయల్)ని వదిలేస్తుంది. అనుకున్నట్లే బాగా డబ్బు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఆ తర్వాత కీర్తిక జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. భర్తతో సుఖంగా జీవించిందా లేదా? లగ్జరీ లైఫ్‌కి అలవాటు పడిన కీర్తికకి ప్రశాంత్ ఎలాంటి గుణపాఠం నేర్పాడు అనేదే మిగతా కథ. ఎలా ఉదంటే.. డబ్బుకు ఆశపడి నమ్ముకున్నోళ్లను మోసం చేయొద్దని అనేది ఈ కథ సారాంశం. ప్రాణంగా ప్రేమించిన అబ్బాయిని కాదని, తండ్రి మాట కూడా లెక్క చేయకుండా కేవలం డబ్బున్న అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన అమ్మాయికి ఓ భగ్న ప్రేమికుడు చెప్పే గుణపాఠం అందరిని ఆకట్టుకుంటుంది. అయితే ఈ కథలో రొమాంటిక్ సీన్స్ కాస్త ఎక్కువవడం.. ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఇబ్బందిగా అనిపిస్తుంది. 4 ) నర్తనశాల ఇందులో ఓ వింత లవ్‌స్టోరీని చూపించారు. డ్యాన్స్ స్కూల్ నడిపించే ఓ డ్యాన్స్ మాస్టర్(సాయి రోనక్)కు ఫోన్ ద్వారా శిరీష అనే యువతి పరిచయం అవుతుంది. ఆమెను చూడకుండా ప్రేమలో పడిపోతాడు. కొద్ది రోజుల తర్వాతను ఆమె చూడాలని ఉందని చెప్పి బీజ్కి రమ్మని రిక్వెస్ట్ చేస్తాడు. మరి బీచ్‌లో వీరిద్దరు కలిశారా? అసలు ఫోన్ కాల్ మాట్లాడిన వ్యక్తి ఎవరు? వీరిద్దరు కలిశాక ఏం జరిగింది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. డ్యాన్స్ మాస్టర్‌తో ఫోన్లో మాట్లాడింది ఎవరనే సస్పెన్స్‌ని క్లైమాక్స్ వరకు కొనసాగించి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచేలా చేశాడు. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. వేగంగా పెరిగిపోతున్న టెక్నాలజీ కారణంగా ఎలాంటి మోసాలు జరుగుతాయి? ఫోన్ పరిచయాల ద్వారా మోససోయిన వ్యక్తులను నిత్యం చూస్తూనే ఉన్నాం. అలాంటి వారికి ఇది నచ్చుతుంది. 5) అనగనగా వృద్ధురాలు కమలక్క (గీతా భాస్కర్)ది ఇద్దరి కుమారుల మధ్య నలిగిపోయే జీవితం. భర్త ఉన్నప్పుడు ఎంతో హుందాగా బతికిన ఆమె.. వృద్ధాప్యంలో ఇద్దరు కొడుకులు చెరో నెల అని ఆమెను పంచుకుంటారు. దాని వల్ల ఆమెకు ఎదురయ్యే సమస్యలేంటి? వృద్దాప్యంలో ఆమె జీవితం ఎలా సాగిందనేదే ఈ కథ. ఎలా ఉదంటంటే.. ఆస్తులను పంచుకున్నట్లుగా తల్లిదండ్రులను కూడా పంచుకుంటున్నారు నేటి పిల్లలు. చెరో నెల అంటూ వంతులు పెట్టికొని మరీ వారిని పోషిస్తున్నారు. దీని వల్ల పేరెంట్స్ పడే బాధ ఏంటి అనేది కళ్లకు కట్టినట్లు చూపించారు.సగటు తల్లి పడే బాధ ఏంటో గీతా భాస్కర్ ద్వారా తెరపై చక్కగా చూపించారు. మొత్తంగా ఈ ఐదు కథలుగా తెరకెక్కిన ఈ పంచతంత్రకథలు.. మంచి సందేశాన్ని ఇచ్చాయి. ఒక్కో కథలో ఓక్కో నీతి ఉంది. దర్శకుడు ఎంచుకున్న కథలు... వాటిని నడిపించడానికి రాసుకున్న స్క్రీన్ ప్లే బాగున్నాయి.సయ్యద్ కమ్రాన్ అందించిన సంగీతం చిత్రానికి బాగా ప్లస్ అయింది. మొదటి కథలో వచ్చే మోతెవారి పాటతో ప్రేక్షకుల్లో జోష్ నింపుతుంది. మిగిలిన పాటలు కూడా బాగున్నాయి. చిత్ర దర్శకుడు గంగనమోని శేఖర్ యే సినిమాటోగ్రాఫర్ కావడంతో మంచి విజువల్స్ తీశారు. దీనికి మరో సినిమాటోగ్రాఫర్ విజయ్ భాస్కర్ సద్దల కూడా తన వంతు సహకారం అందించారు. శ్రీనివాస్ వరగంటి ఎడిటింగ్ పర్వాలేదు. సాధారణంగా ఏ నిర్మాత అయినా తన తొలి చిత్రాన్ని కమర్షియల్ ఫార్మెట్లో నిర్మిస్తాడు. అలాంటి చిత్రాలను నిర్మిస్తే.. సేఫ్ జోన్లోకి వెళ్లొచ్చు. కానీ నిర్మాత డి మధు మాత్రం.. తొలి చిత్రంగా మంచి సందేశాత్మకమైన అంశాలు ఉన్న ‘పంచతంత్రకథలు’ ఎంచుకోవడం అభినందనీయం. -
ఐదు విభిన్న కథలు, జోనర్లతో 'పంచతంత్ర కథలు'.. ఆసక్తిగా ట్రైలర్
Panchatantra Kathalu Trailer Released: ఐదు వేరు వేరు కథలతో ఆంథాలజీ మూవీగా తెరకెక్కుతోన్న చిత్రం `పంచతంత్ర కథలు`. మధు క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా ప్రముఖ వ్యాపారవేత్త డి. మధు నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారా గంగనమోని శేఖర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నోయెల్, నందిని రాయ్, సాయి రోనక్, గీత భాస్కర్, ప్రణీత పట్నాయక్, నిహాల్ కోదర్తి, సాదియ, అజయ్ కతుర్వర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన `మోతెవరి` సాంగ్ ట్రెమండస్ రెస్పాన్స్‌తో చార్ట్ బస్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎంఎం. కీరవాణి మాట్లాడుతూ - ``గంగనమోని శేఖర్ దర్శకత్వంలో మధు క్రియేషన్స్ పతాకంపై 'పంచతంత్ర కథలు' అనే ఈ ఆంథాలజీ ఐదు వేరు వేరు కథలు.. వేరు వేరు జోనర్లలో రావడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ట్రైలర్ చాలా బాగుంది. క్యారెక్టరైజేషన్స్ అన్నీ కొత్త కొత్తగా ఉన్నాయి. అన్నింటిని మించి మా ఫ్యామిలీ మెంబర్ నోయెల్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను`` అని తెలిపారు. కాగా ఈ సినిమా ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని యు/ ఎ సర్టిఫికేట్ పొందింది. సెన్సారు సభ్యులు ఈ సినిమా చూసి చిత్ర యూనిట్‌ను అభినందించారు. అతి త్వరలో ఈ చిత్రం విడుదల తేదిని ప్రకటించనున్నారు. -
ఆఫర్స్ కోసం అలాంటి నీచమైన పనులు చేయను : హీరోయిన్
Noel Ex Wife Ester Noronha: 'భీమవరం బుల్లోడు' సినిమాతో టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఎస్తర్ నోరోన్హ. ఆ తర్వాత వెయ్యి అబద్ధాలు, జయ జానకి నాయిక, గరం వంటి చిత్రాల్లో కనిపించినా పెద్దగా అవకాశాలు రాలేదు. కొన్నాళ్లకు సింగర్ నోయల్‌ను ప్రేమ వివాహం చేసుకున్నప్పటికీ ఈ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. ఆరు నెలల్లోనే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంతరం అడపాదడపా చిత్రాలు చేస్తున్న ఎస్తర్ తాజాగా ‘69 సంస్కార్ కాలనీ’ మూవీలో నటించింది. ఈ క్రమంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న ఎస్తర్ కాస్టింగ్ కౌచ్‌పై ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది. 'ఇండస్ట్రీలో అన్ ప్రొఫెషనల్ ట్రాక్స్ చాలా చూశాను. సినిమా ఆఫర్లతో పాటు ఈ ఆఫర్లు కూడా వచ్చేవి.. వాళ్లని ఇంప్రెస్ చేయమని వీళ్లని ఇంప్రెస్ చేయమని అనేవాళ్లు. ఆఫర్ కోసం ఏం చేయడానికైనా రెడీ అని చెప్పిన హీరోయిన్లు కూడా ఉన్నారు. ఆ సోకాల్డ్ హీరోయిన్స్ చాట్స్ స్క్రీన్ షాట్స్ కూడా నేను చూశాను. కెరీర్ కోసం ఏదైనా చేస్తాం అంటారు. అలా ఆడవాళ్లే స్వయంగా ఆఫర్స్ ఇవ్వడం అనేది కూడా ఇండస్ట్రీలో ఉంది. క్యాస్టింగ్ కౌచ్ నేను కూడా ఎదుర్కొన్నాను. కానీ ఆఫర్స్ కోసం అలాంటి నీచమైన పనులు చేయను' అని చెప్పుకొచ్చింది. -
నోయల్‌తో విడాకుల తర్వాత రెట్టింపు సంతోషంగా ఉన్నా: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
'భీమవరం బుల్లోడు' సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఎస్తర్ నోరోన్హ. ఆ తర్వాత 'గరం'లో ఓ సాంగ్, 'జయజయజానకి నాయక'లో ఓ చిన్న పాత్ర చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అంతలోనే ఆమెకు అవకాశాలు కరువయ్యాయి. ఈ క్రమంలో సింగర్ నోయల్‌ను ప్రేమ వివాహం చేసుకున్నప్పటికీ ఈ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. పెళ్లి చేసుకున్న ఆరు నెలల్లోనే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. చదవండి: Manchu Family: ఆ పోస్టులు డిలీట్ చేయకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం దావా.. విడాకుల అనంతరం అడపాదడపా చిత్రాలు చేస్తున్న ఎస్తర్ తాజాగా ‘69 సంస్కార్ కాలనీ’ మూవీలో నటించింది. మార్చి 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందు రానుంది. మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఎస్తర్ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన వ్యక్తిగత విషయాలతో పాటు టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్‌పై నోరు విప్పింది. అలాగే నోయల్‌తో విడాకులపై కూడా స్పందించింది. విడాకుల అనంతరం రెట్టింపు సంతోషంగా ఉన్నానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘విడాకుల సమయంలో చాలా ఒత్తిడికి లోనయ్యాను. కానీ ఎప్పుడైతే అన్నింటికీ సిద్ధపడి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నానో అప్పుడు ఫ్రీ అయ్యా. ఎందుకంటే దీనిపై నా ఫ్యామిలీకి నేను ఎలా సమాధానం చెప్పుకోవాలని భయపడ్డాను. కానీ ఎప్పుడైతే వారికి తెలిసిందో నా తల్లిదండ్రులు కూడా నాకు అండగా నిలబడ్డారు. దీంతో నాకు రెట్టింపు ధైర్యం, ఎనర్జీ వచ్చింది’ అని చెప్పుకొచ్చింది ఎస్తర్. చదవండి: పోలీసులను ఆశ్రయించిన ప్రముఖ టాలీవుడ్ రైటర్ ఇక ‘ఎక్కడో బయటి వ్యక్తులు విడాకులు తీసుకున్నారనే వార్తలు వినడమే కానీ ఆ అనుభవం ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు నేను ఆ పరిస్థితికి వస్తానని ఊహించుకోలేదు. మా కుటుంబంలో కూడా ఇలాంటివి లేవు. అలాంటి పరిస్థితుల్లో విడాకుల నిర్ణయంతో సతమతమయ్యాను. కానీ ఎప్పుడైతే విడాకుల పోస్ట్ షేర్ చేశానో కంటిన్యూస్‌గా నా ఫోన్ రింగ్ అయ్యింది. అందులో కొందరూ ఈమె కూడా జీవితం చెడగొడ్డుకుంది నాలాగే అంటూ సంతోషించారు.. మరికొందరెమో నీకు మేమున్నామంటూ ధైర్యమిచ్చారు’ అని చెప్పింది ఎస్తర్. -
Deergaishmaanbhava: ఆకట్టుకుంటున్న‘వదిలి వెళ్ళిపోకే’ సాంగ్
కార్తీక్ రాజు, మిస్తీ చక్రవర్తి హీరో హీరోయిన్లుగా నోయెల్, ఆమని, పృద్వీ, సత్యం రాజేష్, కాశి విశ్వనాధ్, తాగుబోతు రమేష్, గెటప్ శ్రీను తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'దీర్ఘాయుష్మాన్ భవ'. ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ యముడి పాత్రలో నటించగా డాక్టర్ ఎంవీకే రెడ్డి సమర్పణలో ప్రతిమ ఈ సినిమా ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. పూర్ణానంద మిన్నకూరి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం వహించారు. మలహర్ భట్ జోషి ఛాయాగ్రహణం అందించగా వినోద్ యాజమాన్య సంగీతం సమకూరుస్తున్నారు. కిషోర్ మద్దాలి ఎడిటర్ గా చేస్తున్నారు. కాగా ఈ సినిమాలోని ‘వదిలి వెళ్ళిపోకే’ అనే పాట యూట్యూబ్ లో విడుదల కాగా ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతుంది. సోసియో ఫాంటసీ ప్రేమకథా చిత్రం గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా త్వరలోనే విడుదలతేదీ ని ప్రకటించనున్నారు. -
బిగ్‌బాస్ 5: నోయల్ సపోర్ట్ ఎవరికో తెలుసా?
సింగర్, యాక్టర్ నోయల్ సేన్.. గత బిగ్‌బాస్ సీజన్లో పాల్గొని హల్చల్ చేశాడు. హౌస్‌లో ఉన్నన్ని రోజులు చాలా కూల్‌గా ఉంటూ అందరికీ హితబోధ చేస్తూ బాబాలా మారిపోయాడు. కానీ తనకు ఆరోగ్యం సహకరించలేక కుంటుకుంటూ నడిచి, చివరకు షోలో కొనసాగలేని పరిస్థితి ఏర్పడంతో అర్ధాంతరంగా షో నుంచి తప్పుకున్నాడు. అయితే వెళ్లిపోయేటప్పుడు మాత్రం తన మీద, తన హెల్త్ మీద కుళ్లు జోకులేసిన ఒక్కొక్కరికీ వాయించేసి వీడ్కోలు తీసుకున్నాడు. ఇప్పటికీ నోయల్ అనగానే బిగ్‌బాస్ వీక్షకులకు ఇదే సీన్ గుర్తొస్తుంది. షో నుంచి నిష్క్రమించాక అతడు దేత్తడి హారిక, లాస్యకు సపోర్ట్ చేసి వారికి అండగా నిలబడ్డాడు. ఇదిలా వుంటే ఈ మధ్యే ప్రారంభమైన బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లోనూ అతడు ఓ కంటెస్టెంట్‌కు సపోర్ట్ చేస్తున్నాడు. సింగర్ శ్రీరామచంద్రకు ఓటేయమని అభిమానులను కోరుతున్నాడు. ఈవారం అతడు నామినేషన్స్‌లో ఉండటంతో శ్రీరామ్‌ను ఎలాగైనా గట్టెక్కించాలని ప్రయత్నిస్తున్నాడు. అనధికారిక పోల్స్‌లో అయితే శ్రీరామ్‌కు ఈవారం ఈజీగా సేఫ్ అవుతాడని తెలుస్తోంది. ఎవరో ఒక లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. మరి అఫీషియల్ ఓటింగ్‌లోనూ శ్రీరామ్ టాప్ 3లో ఉన్నాడా? అన్నది తెలియరాలేదు. ఏదేమైనా శ్రీరామ్ హౌస్‌లో ఉన్నన్ని రోజులు అతడికి నోయల్ అండదండలు గట్టిగానే ఉండేటట్లు కనిపిస్తోంది. -
Noel Sean: పెళ్లి గురించి కాదు.. నోయల్ శుభవార్త ఇదే
సింగర్, ‘బిగ్‌బాస్’ఫేమ్ నోయల్ రెండు రోజుల క్రితం ‘ఓ ఎగ్జైటింగ్ న్యూస్ మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను’అని ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఎగ్జైట్ న్యూస్ అని చెప్పడంతో అది కచ్చితంగా పెళ్లి గురించి అయి ఉంటుందని నెటిజన్లు భావించారు. అయితే నోయల్ తాజాగా అసలు విషయాన్ని చెప్పాడు. తన జీవితంలోని కొత్త ఆరంభం గురించి ప్రకటించేశారు. తాను హీరోగా రాబోతోన్న కొత్త సినిమా అప్డేట్ను ఇస్తూ ఫస్ట్‌లుక్‌ని రివీల్ చేశాడు. మనీషి అనే సినిమాతో హీరోగా నోయల్ ఎంట్రీ ఇవ్వబోతోన్నారు. పూజిత పొన్నాడ హీరోయిన్గా రాబోతోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్ అదిరిపోయింది. స్పార్క్ ఓటీటీలో ఈ మూవీ జూన్ 18 నుంచి అందుబాటులోకి రానుందని ప్రకటించారు. ఈ మూవీకి వినోద్ నాగుల దర్శకత్వం వహించగా.. సత్యనారాయణ నాగుల నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. Here's the First Look of my upcoming movie #MoneyShe🎭 Very happy to share that it's Releasing Exclusively in @sparkottin on June 18th! 📝 Thank you @VinodNagula bhayya & team for making me a part this project!#మనిషి @pujita_ponnada pic.twitter.com/Uphoij6mEZ — Noel (@mrnoelsean) June 9, 2021 చదవండి: PSPK28: ఫ్యాన్ మేడ్ పోస్టర్ వైరల్.. స్పందించిన నిర్మాణ సంస్థ సమంతకు కొడుకుగా నటించేది ఈ స్టార్ హీరో తనయుడే! -
బిగ్‌బాస్ ఫేమ్ నోయల్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడా?
యువ గాయకుడు, నటుడు, ‘బిగ్‌బాస్’ ఫేమ్ నోయల్ సేన్ ప్రేమ, పెళ్లి, విడాకుల గురించి అందరికి తెలిసిందే. హీరోయిన్ ఎస్తర్‌తో ప్రేమలో పడిన నోయల్.. 2019లో ఆమెను వివాహం చేసుకున్నారు. పెళ్లైన కొన్ని నెలలకే వారు విడిపోయారు. కోర్టు ఉత్తర్వులు రావడంతో ఈ ఇద్దరూ కూడా తమ విడాకుల విషయాన్ని 2020 బహిర్గతం చేశారు. అనంతరం నోయల్ బిగ్‌బాస్ షోకి వెళ్లి, అనారోగ్యం కారణంగా అర్థాంతరంగా బయటకు వచ్చారు. అయితే బిగ్‌బాస్ ఇంట్లో ఉన్నది కొద్ది రోజులే అయినా.. తనదైన ముద్ర వేసుకున్నాడు నోయల్. సినిమాల్లో చూసిన నోయల్‌కి.. బిగ్‌బాస్‌లో చూసిన నోయల్‌కి చాలా తేడా కనిపించింది. ఒకనొక దశలో మరీ ఇంత మంచితనం పనికి రాదని కూడా నోయల్‌పై కామెంట్లు చేశారు నెటిజన్లు. ఇక బిగ్‌బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చిన నోయల్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది. ఆయన చేసిన ట్వీట్లు, పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా నోయల్ చేసిన ట్వీట్‌పై నెటిజన్లు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ‘ఓ ఎగ్జైటింగ్ న్యూస్ మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.. ఈ విషయం చెప్పాలని ఎంతో ఆత్రుతగా ఉంది.. ఆగలేకపోతోన్నా’అంటూ ట్వీట్ చేశాడు నోయల్. దీంతో ఇది పక్కా పెళ్లి విషయమే అని నెటిజన్లు ఫిక్సయ్యారు. ‘మళ్లీ పెళ్లి చేసుకుంటున్నావా? అని కామెంట్లు చేస్తున్నారు. ఇక మరికొంత మంది అయితే.. సినిమాకి సంబంధించిన అప్డేట్ అయి ఉంటుందని కామెంట్లు పెడుతున్నారు. ఇంతకి ఆ ఎగ్జైటింగ్ న్యూస్ ఏంటో తెలియాలంటే.. నోయల్ చెప్పే వరకు ఆగాల్సిందే. Am Gonna Share An Exciting News Soonnnn!!!! Can't Wait For It!!! pic.twitter.com/XqjAofXZrA — Noel (@mrnoelsean) June 5, 2021 -
తళుకు బెళుకు తారలు, అందాల సొగసులు..
♦ అదితి భాటియా సెల్ఫీ మోడ్ ♦ నేనిలాగే ఉంటా, కానీ ఇది యాటిట్యూడ్ మాత్రం కాదంటోన్న కౌశల్ మండా ♦ ఆకాశమే హద్దుగా సాగిపో అని చెప్తోన్న ముమైత్ ఖాన్ ♦ మంచు లక్ష్మీకి కూతురి సర్ప్రైజ్ ♦ అప్పట్లో ఎంతో సేఫ్‌గా ప్రయాణించేవాళ్లమంటోన్న నోయల్ సేన్ ♦ గుడ్ హెయిర్డే అంటోన్న మాధురీ దీక్షిత్ ♦ ఎందుకో తెలీదు గానీ నిన్నుచూసిన మరుక్షణం నా పెదాల మీద చిరునవ్వు ప్రత్యక్షమవుతుందంటోన్న అషూ రెడ్డి ♦ బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో ఆర్ ఎక్స్ 100 భామ ♦ నన్ను నమ్మండి, నేను నిజంగానే పని చేస్తున్నాను అంటోన్న సన్నీలియోన్ View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Niveditha Gowda 👑 (@niveditha__gowda) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Anveshi Jain (@anveshi25) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Mehaboob Shaik (@mehaboobdilse) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Aditi Bhatia 🎭 (@aditi_bhatia4) View this post on Instagram A post shared by Aditi Bhatia 🎭 (@aditi_bhatia4) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by k a u s h a l M a n d a (@kaushalmanda) View this post on Instagram A post shared by Mumait Khan (@mumait) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Noel (@mr.noelsean) View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Akanksha Puri🧚♀️ (@akanksha8000) View this post on Instagram A post shared by Akanksha Puri🧚♀️ (@akanksha8000) View this post on Instagram A post shared by Archana Gupta🧿 (@archannaguptaa) View this post on Instagram A post shared by Archana Gupta🧿 (@archannaguptaa) View this post on Instagram A post shared by Daksha Nagarkar (@dakshanagarkar) View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) View this post on Instagram A post shared by Apsara👼 (@apsararaniofficial_) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) -
హీరోయిన్గా అవకాశాలు లేక నోయల్ మాజీ భార్య..
డైరెక్టర్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన వెయ్యి అబద్దాలు చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఎస్తర్. ఆ తర్వాత సునీల్ సరసన 'భీమవరం బుల్లోడు సినిమాలో నటించినా ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఈ క్రమంలోనే సింగర్ నోయల్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఏడాది కూడా గడవక ముందే వారి పెళ్లి పెటాకులైంది. ఇద్దరి మధ్యా అభిప్రాయ బేధాలు తలెత్తడంతో విడాకులు తీసుకుంటున్నట్లు ఇరువురూ సోషల్ మీడియాలో వెల్లడించిన సంగతి తెలిసిందే. తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత ఇద్దరూ తమతమ కెరియర్లో ముందుకు సాగారు. అయితే పలు సినిమాల్లో హీరోయిన్గా నటించినా ఆమెకు సరైన అవకాశాలు రాకపోవడంతో మరో కొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఇప్పటికే పలు మ్యూజిక్ ఆల్భమ్స్‌లో నటించిన ఎస్తర్...కొన్ని పాటలు కూడా పాడింది. త్వరలోనే ఓ కన్నడ మూవీతో సంగీతదర్శకురాలిగానూ పరిచయం కానున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఏప్రిల్4న రివీల్ చేస్తానని వెల్లడించింది. View this post on Instagram A post shared by Ester Valerie Noronha (@esternoronhaofficial) -
లాస్య ఛానెల్ హ్యాక్: హ్యాపీ అంటున్న నోయల్
బిగ్‌బాస్ నాల్గో సీజన్లో పాల్గొన్న యాంకర్ లాస్య సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ఆమె మాటలకు తోడు కొడుకు జున్ను అల్లరిని కూడా కెమెరాల్లో చిత్రీకరించి లాస్య టాక్స్ ద్వారా వినోదాలను పంచుతోంది. కొత్త కొత్త కాన్సెప్టులతో ముందుకు వస్తూ ఫ్యాన్స్‌ను ఎంటర్టైన్ చేస్తూనే ఉంది. అయితే సడన్‌గా ఈ ఎంటర్టైన్మెంట్కు బ్రేక్ పడింది. అదేంటి అంటారా? ఎనిమిది లక్షల మందికి పైగా సబ్‌స్ర్కైబర్లు ఉన్న లాస్యటాక్స్ ఛానల్ హ్యాక్ అయింది. ఈ విషయాన్ని లాస్య స్వయంగా వెల్లడించింది. అయితే తన ఛానల్‌ను ఎవరు? ఎందుకు? హ్యాక్ చేశారో తెలీట్లేదని చెప్పుకొచ్చింది. కానీ ఈ విషయాన్ని వేరేవాళ్లు చెప్పేవరకు తనకు తెలియలేదని పేర్కొంది. దీనిపైన తన టెక్నికల్ టీమ్ పని చేస్తోందని, తప్పకుండా లాస్య టాక్స్ తిరిగి వస్తుందని చెప్పుకొచ్చింది. అయితే లాస్య ఛానల్ హ్యాక్ అయినందుకు నోయల్ చాలా సంతోషపడ్డాడు. "మా లాస్య అకౌంట్ హ్యాక్ చేశారంటే ఆమె ఎంత తోపు, తురుము? అని పొగిడాడు. ఎదిగేవాళ్ల అకౌంట్లే హ్యాక్ అవుతాయ్. నా అకౌంట్ కూడా ఒకప్పుడు హ్యాక్ అయింది. ఇలాంటివి వంద అకౌంట్లు నువ్వు క్రియేట్ చేయగలుగుతావు, అయినా నీ అకౌంట్ తిరిగొస్తుందిలే" అని భరోసా ఇచ్చాడు. (చదవండి: బిగ్‌బాస్‌కు ఎందుకు వెళ్లానా అనిపించింది: నోయల్) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) -
నోయల్ మాజీ భార్య..ఎస్తేర్ ఫొటోస్
-
నోయల్ టైటిల్ గెలవాల్సింది: అభిజిత్
బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లు ఆఖరుసారి సంతోషంగా డ్యాన్సులు చేసుకుంటూ గడిపారు. ఎలిమినేట్ అయినవాళ్లను తిరిగి హౌస్‌లో చూస్తున్నందుకు ఓపక్క సంతోషం, తర్వాతి రోజు నుంచి ఈ హౌస్ ఉండదన్న మరో వైపు బాధ వాళ్లను ఉక్కిరి బిక్కిరి చేశాయి. దీంతో హౌస్‌లో చివరి రోజు కొంత ఎమోషనల్‌గా సాగింది. అయితే దేవి నాగవల్లి, సూర్య కిరణ్, అమ్మ రాజశేఖర్ మాత్రం రీయూనియన్ పార్టీకి రాకపోవడం గమనార్హం. మరి సంతోషాలు వెల్లివెరిసిన నేటి బిగ్‌బాస్ ఎపిసోడ్ ఎలా సాగిందో చదివేయండి.. ఇంటి నుంచి సందేశం.. అఖిలూ, ఓ అఖిలూ.. అని పిలుచుకుంటూనే గంగవ్వ లోపలకు వచ్చింది. అవ్వ పిలుపు వినగానే అఖిల్ ఉత్సాహం ఉరకలెత్తింది. ఆమెను చూడగానే పిల్లాడిలా సంబరపడిపోయాడు. తర్వాత జోర్దార్ సుజాత లోనికి రాగా అవ్వతో కలిసి ఫైనలిస్టులతో ఆటాడించారు. నన్ను ఇంప్రెస్ చేస్తే మీ ఇంటి నుంచి వచ్చిన మెస్సేజ్‌ను చూపిస్తానని సుజాత బంపర్ ఆఫర్ ప్రకటించింది. దీంతో అభిజిత్ సోహైల్ పోటీపడుతూ ఇంట్లోకి పరుగెత్తారు. ఈ క్రమంలో అభి మైకు విరగొట్టుకుని మరీ మొదటగా కాఫీ మగ్గు తీసుకొచ్చాడు. తర్వాత సోహైల్ ప్లేటు మీద ఐ లవ్ యూ అని రాసుకొచ్చి మరీ అందించాడు. ఇలా ఎవరికి తోచిన ప్రయత్నాలు వారు చేయగా.. ఫైనలిస్టులందరికీ కుటుంబ సభ్యులు మాట్లాడిన వీడియోలు చూపించారు. అనంతరం గంగవ్వ, సుజాత ఇద్దరూ వీడ్కోలు తీసుకున్నారు. (చదవండి: కృష్ణుడిలాంటి భర్త కావాలి: మోనాల్) నేను నిన్ను గెలిచాను.. తర్వాత వచ్చిన నోయల్ ర్యాప్‌తో ఊపేస్తూ అందరి సంతోషాన్ని రెట్టింపు చేశాడు. అతడి కోసం ఓ సందేశాన్ని రాసిన బాటిల్‌ను అభి నోయల్ చేతికందించాడు. దానిపై 'నోయల్ టైటిల్ గెలిచేందుకు అర్హుడు' అని ఉంది. ఇది చదివిన నోయల్ నేను నిన్ను గెలిచాను, ఇది చాలదా.. అంటూ అభిజిత్‌తో చెప్పుకొచ్చాడు. హౌస్‌ను మిస్సవలేదు, కానీ మిమ్మల్ని మిస్ అవుతున్నానని పేర్కొన్నాడు. ఈ బిగ్‌బాస్ తనకు ఎంతో ఇచ్చిందని, కానీ తను ఏమీ తిరిగివ్వలేకపోతే క్షమించండి అంటూ హౌస్‌కు గుడ్‌బై చెప్పాడు. (చదవండి: బిగ్‌బాస్ : నోయల్‌కు వచ్చిన వ్యాధి ఇదే) దివి.. దీపిక పదుకొణెలా ఉన్నావు తర్వాత మెహబూబ్‌ను చూడగానే సోహైల్ తెగ ఎగ్జైట్ అయ్యాడు. అతడు మాత్రం తన ఆతృతను లోలోపలే అణుచుకుంటూ దివితో స్టెప్పులేశాడు. అనంతరం తన జిగిరీ దోస్తులు సోహైల్, అఖిల్, అభిజిత్‌తో కబుర్లు చెప్పాడు. అటు అఖిల్ మాత్రం దీపిక పదుకొణెలా ఉన్నావంటూ దివిని పొగడ్తలతో ముంచెత్తాడు. చాలా బాగున్నావంటూ అభిజిత్ కూడా మెచ్చుకోవడంతో ఏంటి పులిహోరా? అని దివి ప్రశ్నించింది. మరోపక్క మెహబూబ్, సోహైల్ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం ఫైనలిస్టులు అన్ని హార్ట్ దిండులను మెహబూబ్, దివికి బహుమతిగా ఇచ్చారు. మీ ఐదుగురు విన్నర్లే అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండని మెహబూబ్ పదే పదే చెప్తూ సెలవు తీసుకున్నాడు. (చదవండి: బిగ్‌బాస్: పెద్దగా ఆకట్టుకోని కంటెస్టెంట్లు వీళ్లే..) మిస్ అవుతున్నానంటూ ఏడ్చేసిన అరియానా తర్వాత అవినాష్ ఎంట్రీ ఇవ్వడంతో అరియానా ఆనందంతో గెంతులేసింది. కానీ ఆ వెంటనే నిన్ను మిస్ అవుతున్నానంటూ గుక్కపెట్టి ఏడవటంతో ఆమెను ఓదార్చాడు. తననిప్పుడు అవినాష్ అని కాకుండా ఎంటర్టైనర్ అని పిలుస్తున్నాడని చెప్పుకొచ్చాడు. తన ఇంటికి వేరే వేరే జిల్లాల నుంచి అభిమానులు కలిసేందుకు వస్తున్నారని తెలిపాడు. అఖిల్ పులిహోర మామూలుగా కలపడం లేదంటూ సెటైర్లు వేశాడు. హారిక అలాగే చూస్తుండటం చూసి ఏంటి? దినాలకు పిట్టకు పెట్టినట్లు చూస్తున్నావు అని పంచ్ వేశాడు. అనంతరం అందరి హౌస్‌కు గుడ్‌బై చెప్తూ అక్కడి నుంచి నిష్క్రమించాడు. తర్వాత ఫైనలిస్టులు డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు. (చదవండి: బిగ్‌బాస్ విన్నర్ అతడే: అలీ రెజా) -
బిగ్‌బాస్‌కు ఎందుకు వెళ్లానా అనిపించింది: నోయల్
బిగ్‌బాస్ నాల్గో సీజన్లో అనారోగ్య కారణాలతో నోయల్ షో మధ్యలో నుంచే వెళ్లిపోయాడు. ఆ మధ్య తన రీఎంట్రీ ఉంటుందని హోరెత్తించాడు. గేమ్ ఈజ్ స్టిల్ ఆన్.. ఈసారి వెళ్తే మామూలుగా ఉండదు అంటూ పోస్టులు పెట్టాడు. దీంతో రీఎంట్రీ ఖాయమని అంతా అనుకున్నారు. కానీ చివరాఖరకు అదంతా ఉత్తిదే అని తేలింది. దీంతో అతడు తన స్నేహితులకు సపోర్ట్ చేయడం ప్రారంభించాడు. అభిజిత్, హారికకు ఓటేయమని ప్రచారం చేపట్టాడు. ఆ ఇద్దరి గెలుపు గురించి అనునిత్యం అలుపెరగని పోరాటం చేస్తున్నాడు. అందుకే సిటీకి దూరంగా ఉంటున్నా.. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు అందరూ జోరుగా ఇంటర్వ్యూలు చేస్తుంటే నోయల్ మాత్రం వాటికి దూరంగా ఉన్నాడు. తాజాగా ఎక్కడో సిటీకి దూరంగా, రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న నోయల్ నివాసానికి హారిక అన్నయ్య వంశీ, ఆమె స్నేహితుడు, యాంకర్ నిఖిల్ వెళ్లి సర్ప్రైజ్ చేశారు. నోయల్‌కు చెప్పాపెట్టకుండా అతడి ఇంటికి చేరుకుని ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా నిఖిల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నోయల్ షాకింగ్ విషయాలను వెల్లడించాడు. 'మనుషులను ఎంత ఇష్టపడితే అంత దూరంగా ఉండాలి. వాళ్లకు ఎంత దగ్గరగా ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, అందుకే సిటీకి దూరంగా ఉంటున్నా'నని పూర్తి వైరాగ్యంలో ఉన్నట్లుగా మాట్లాడాడు. ఏడాదిన్నర క్రితమే ఈ ఇల్లు కొన్నానని తెలిపాడు. (చదవండి: కాళ్లు పట్టుకుంటే బాగోదు, ప్లీజ్..: అవినాష్) అమ్మాయిని గెలిపించండి.. బిగ్‌బాస్ షో గురించి చెప్తూ అది మనకవసరం లేదని అర్థమైందన్నాడు. ఆ షోకు ఎందుకెళ్లానో, ఏమో అనిపించిందని బాధపడ్డాడు. షో చూడటం కూడా మానేశానని తెలిపాడు. హౌస్‌లో అందరూ మంచివాళ్లేనని, తన సపోర్ట్ మాత్రం అభిజిత్, హారికకు ఉంటుందని స్పష్టం చేశాడు. ఎనిమిది సార్లు కెప్టెన్సీ పోటీదారులుగా నిలబడటం మామూలు విషయం కాదని హారికను మెచ్చుకున్నాడు. ఆమె మనుషుల్ని వాడుకుని గేమ్ ఆడి టైటిల్ కొట్టాలి, రూ.50 లక్షలు తీసుకోవాలి, వాడేమైపోతే ఏంటి? వీడేమైపోతే ఏంటి? అనుకుని ఆడే రకం కాదు. తాను గెలవాలన్న కోణంలోనే ఆడుతుందని చెప్పుకొచ్చాడు. హారికకు లవ్ ట్రాకులు, కామెడీ ట్రాకులు లేవని కష్టపడి ఆడి ఇక్కడివరకు వచ్చిందన్నాడు. జీవితంలో కూడా ఎన్నో కష్టాలు పడిందని, ఈసారైనా అమ్మాయిని గెలిపించమని అభిమానులకు పిలుపునిచ్చాడు. (చదవండి: నోయల్ అవుట్, మోకరిల్లి దండం పెట్టిన అవినాష్) -
దివి నన్ను కాపాడిన దేవత, హౌస్‌లో అభి దండగ
బిగ్‌బాస్ నాల్గో సీజన్లో ఎప్పుడో వెళ్లిపోవాల్సిన కంటెస్టెంటు అమ్మ రాజశేఖర్. అదృష్టం బాగుండి, బిగ్‌బాస్ టీమ్ కాపాడటం వల్ల కొన్నివారాలు ఎలిమినేషన్ నుంచి తప్పించుకోగలిగాడు. కానీ ఆయనను బయటకు పంపించేందుకు ప్రేక్షకులు కాచుకుని కూర్చున్నారు. తీరా నామినేషన్లోకి వచ్చాడు. వేటు వేశారు. వెళ్లిపోయారు. అయితే అఖిల్ చెప్పినట్లు అమ్మ రాజశేఖర్ తనకు నచ్చినవాళ్లతో బాగా మాట్లాడతారు. నచ్చకపోతే ఎదుటివాళ్లను మాట్లాడనిచ్చేవారే కాదు. తాజాగా ఆయన బిగ్‌బాస్ బజ్‌లో రాహుల్ సిప్లిగంజ్ దగ్గర ఇంటిసభ్యుల గురించి తన అభిప్రాయాలను వెల్లడించాడు.తన ఎంటర్టైన్మెంట్కు నవ్వుతూనే, అందులో తప్పులు వెతుకుతూ నామినేట్ చేస్తారని చెప్పుకొచ్చారు. (చదవండి: ప్యాంటులో మాస్క్ పెట్టుకుంటావా?: సల్మాన్ ఫైర్) లాస్య సింపథీ గేమ్ ఆడుతోంది "అభిజిత్‌ను చూసి చాలామంది పని చేయకుండా బద్ధకస్తులవుతున్నారు. అతడు పొద్దున డ్యాన్స్ చేయడు, గేమ్ ఆడడు, టాస్క్‌ను మధ్యలో ఆపేస్తాడు. అసలు బిగ్‌బాస్‌కు అభిజిత్ సూట్ కాడు. ఇక అఖిల్‌కు యాటిట్యూడ్ ఎక్కువ. అరియానా ముక్కుసూటిగా మాట్లాడుతుంది. కానీ, టాస్కులో మాత్రం రఫ్ఫాడిస్తుంది. దేవి నాగవల్లి ప్రతీది నెగెటివ్‌గా ఆలోచిస్తుంది. దివి.. నేను జనాల్లో బ్యాడ్ అవకుండా కాపాడింది. ఆమెకు నేను దిండు పెట్టిన గొడవలో ఆమె నావైపు నిల్చుని దేవతలా కాపాడింది. అప్పటి నుంచి ఆమె నా బెస్ట్ ఫ్రెండ్. గంగవ్వ.. నేను ఏడుస్తుంటే చీర కొంగుతో కన్నీళ్లు తుడిచింది. నేను వెళ్లిపోతే బిగ్‌బాస్ షోనే ఉండదు అంటూ ఓదార్చింది. హారిక.. ఇంగ్లీషులో మాట్లాడేవాళ్లతో ఉంటుంది. లాస్యకు ఆమె ముఖంలో ఉన్న క్లారిటీ లోపల ఉండదు. ఆమె నవ్వుకు ఏదో ఒక అర్థం ఉంటుంది. సింపథీ గేమ్ ఆడుతోంది. మెహబూబ్‌ను చూస్తే చిన్నప్పుడు నన్ను నేను చూసుకున్నట్లు ఉంటుంది. ఫైర్ ఉంది కానీ తెలివి లేదు. మోనాల్.. ఏం చేస్తుందో ఆమెకే అర్థం కాదు. చిన్నవాటికి ఎమోషనల్ అయిపోతుంది" (చదవండి: బిగ్‌బాస్: కెప్టెన్‌గా మాస్టర్, మరి ఎలిమినేషన్?) నోయల్ ఫేక్, ఎనిమది వారాలు నటించాడు "నోయల్.. ఫేక్ కంటెస్టెంటు. నిజానికి నోయల్ కోసమే బిగ్‌బాస్‌కు వచ్చాను. మొదట జాలీగా ఉన్నాం. తర్వాత అతడికి కాళ్లనొప్పి రావడంతో గేమ్ ఆడలేకపోయాడు. తర్వాత ఫాదర్, ఆ తర్వాత గురూజీ అయిపోయాడు. అతడికి హగ్గింగ్ డాక్టర్ అని పేరు కూడా పెట్టాను. కానీ అతడి క్యారెక్టర్ చివర్లో బ్లాస్ట్ అయింది. అంటే హౌస్‌లో ఎనిమిది వారాలు నటించాడంటే ఆస్కారు అవార్డు ఇవ్వాల్సిందే. సోహైల్‌కు కోపమెక్కువ. అందరితో బాగుండాలని తాపత్రయపడతాడు. అవినాష్.. నాలాగే ఎంటర్టైన్ చేస్తాడు. నోయల్ అతడిని చిల్లర కామెడీ అనడం చాలా తప్పు" అని విమర్శించాడు. దీంతో రాహుల్ మధ్యలో కలగజేసుకుని నోయల్ ఆ మాట మిమ్మల్ని అన్నాడు కానీ అవినాష్‌ను కాదని వెనకేసుకొచ్చాడు. అయితే మాస్టర్ మాత్రం అతడు ఎవరి పేరూ చెప్పలేదని, ఇద్దరికీ వేలు చూపించాడని చెప్పుకొచ్చాడు. ఇక తనకు స్విచ్ అయ్యే అవకాశం వస్తే.. అభిని బయటకు పంపించి తాను లోపలికి వెళ్తానని పేర్కొన్నాడు. తన వల్ల కనీసం టీఆర్పీ అయినా పెరుగుతుందని, వాడి వల్ల ఏదీ అవదని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పాడు. -
బిగ్‌బాస్ : నోయల్ రీఎంట్రీ.. సర్ప్రైజ్ వీడియో
బిగ్‌బాస్ నాల్గో సీజన్ నుంచి నోయల్ అర్థాంతరంగా వెళ్లిపోయాడు. అనారోగ్య పరిస్థితి దృష్ట్యా అతను హౌస్‌లో ఉండటం సరికాదని వైద్యులు సూచించడంతో నోయల్ బిగ్‌బాస్‌ను వీడాల్సివచ్చింది. మొదట మెరుగైన వైద్యం కోసం నోయల్ బయటకు వెళ్తున్నాడని.. త్వరలో కోలుకుని తిరిగి వస్తాడని బిగ్‌బాస్ చెప్పాడు. అయితే శనివారం నాగార్జున వచ్చి.. నోయల్ ఇక శాశ్వతంగా బిగ్‌బాస్ హౌస్‌ని వీడుతున్నాడని కుండబద్దలు కొట్టాడు. ఎలిమినేట్ అయిన అందరి కంటెస్టెంట్స్‌లాగే నోయల్‌కు కూడా ఘన వీడ్కోలు పలికారు. నోయల్‌ని స్టేజ్ మీదకు రప్పించి సెల్ఫీ తీసుకొని బైబై చెప్పి బయటకు పంపించేశాడు. దీంతో నోయల్ ఫ్యాన్స్ ఒకింత అసంతృప్తికి లోనైనా.. ఆయన త్వరాగా కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. (చదవండి : బిగ్‌బాస్ : ఆమెను నామినేట్ చేసి షాకిచ్చిన అఖిల్) ఇంతవరకు బాగానే ఉన్నా... సోమవారం ఓ సర్ప్రైజ్ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. ఫ్యాన్స్‌కి శుభవార్తని అందిచాడు నోయల్. ‘బిగ్‌బాస్ గేమ్ ఇప్పటికీ ఆన్‌లోనే ఉంది(The Game is still ON). ఏదైనా జరగొచ్చు.. నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. నా హెల్త్ కోసం ఎంతోమంది ఫోన్లు చేస్తున్నారు. ఎన్నో మెసేజ్‌లు వస్తున్నాయి. వాటిని చూస్తే చాలా ఎమోషనల్‌గా ఉంది. కానీ.. బిగ్ బాస్ గేమ్‌లో ఏదైనా జరగొచ్చు.. ది గేమ్ ఈజ్ స్టిల్ ఆన్. పని అయిపోయింది అనుకున్నవాడు మళ్లీ తిరిగి వస్తే ఆ కిక్ వేరేలా ఉంటుంది కదా? త్వరలో ఫుల్ డీటైల్స్ అందిస్తా మళ్లీ కలుద్దాం’ అంటూ వీడియో విడుదల చేసి ఫ్యాన్స్‌ని అయోమయోనికి గురిచేశాడు నోయల్. ఇప్పటికే బిగ్‌బాస్‌లో ఎన్నెన్నో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత వారం పక్కా ఎలిమినేట్ అవుతారనుకున్న అమ్మ రాజశేఖర్‌ని సేవ్ చేస్తూ అందరిని అశ్చర్యపరిచాడు బిగ్‌బాస్. మరి నోయల్‌ని కూడా తిరిగి హౌస్‌లోకి పంపి మరో ట్విస్ట్ ఇస్తాడేమో చూడాలి. ఏదైనా జరగొచ్చు అంటున్నాడుగా నోయల్.. ఏం జరుగుతుందో చూడాలి మరి. The Game is still ON!#EdainaJaragochu#BiggBossTelugu4 #BiggBoss4 #BiggBoss4Telugu #NoelSean pic.twitter.com/E9OUQqcBM9 — Noel (@mrnoelsean) November 2, 2020 -
బిగ్‌బాస్ : నోయల్‌కు వచ్చిన వ్యాధి ఇదే
బిగ్‌బాస్ నాల్గో సీజన్ నుంచి నోయల్ అర్థాంతరంగా వెళ్లిపోయాడు. అనారోగ్య పరిస్థితి దృష్ట్యా అతను హౌస్‌లో ఉండటం సరికాదని వైద్యులు సూచించడంతో అతను మధ్యలోనే హౌస్‌ని వీడి బయటకు వచ్చాడు. బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లిన తొలివారంలోనే నోయల్‌కు కాళ్లనొప్పి ప్రారంభమైంది. అయితే ప్రేక్షకుల కోసం నోయల్ ఆ నొప్పినంతా భరిస్తూ పైకి నవ్వుతూ చక్కగా గేమ్ ఆడాడు. నొప్పి రోజు రోజుకి తీవ్రతరం కావడంతో నోయల్ అసలు విషయం చెప్పి బయటకు వచ్చాడు. అయితే ఇన్ని రోజులు నోయల్ నరకం అనుభించినట్లుగా శనివారం ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థం అవుతోంది. ఆయన మామలు కాళ్ల నొప్పులతో బాధపడలేదు.. ఆయనకు యాంకిలాసింగ్ స్పాండిలైటిస్ అనే వ్యాది ఉందట. ఇది ఎముకలకు సంబంధించిన వ్యాధి. ఈ వ్యాది వల్ల ఎముకల పనితీరు మెల్ల మెల్లగా క్షీణిస్తుందని వైద్యులు చెబుతున్నారు. దాని వల్ల దేహంలోని పలు అంగాలపై ప్రభావం పడుతుందట. ఈ వ్యాధి బారిన పడిన వారి నడక తీరు, నిలబడే విధానం మారిపోతుంట. ఈ వ్యాధి ప్రభావం పక్కటెముకలపై పడితే శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుందని వైద్యులు చెబుతున్నారు. కంటి చూపు కూడా ప్రభావితం అవ్వడంతో పాటు గుండెకు సంబంధించిన సమస్యలు కూడా మొదలు అవుతాయి. ఇలా శరీరం మొత్తం కూడా ఈ వ్యాది వల్ల క్షీణిస్తూ మనిషి జీవచ్చవం మాదిరిగా అయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. నోయల్‌కు అత్యున్నత చికిత్స అందిస్తే ఆయన తప్పకుండా మళ్లీ మామూలు మనిషి అవుతాడని కూడా వైద్యులు చెబుతున్నారు. -
నోయల్ అవుట్, మోకరిల్లి దండం పెట్టిన అవినాష్
నోయల్ అభిమానులకు చేదువార్త. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో రీఎంట్రీ ఇస్తాడని ఆశగా ఎదురు చూస్తున్న తరుణంలో అతడు నోయల్ అందరి దగ్గరా వీడ్కోలు తీసుకుని షో నుంచి నిష్క్రమించాడు. హౌస్‌లో ఉన్నన్ని రోజులు బాబాగా ఉన్నప్పటికీ బయటకు వచ్చాక మాత్రం నిజమైన నోయల్ కనిపించాడు. తాను చెప్పాలనుకున్న మాటలను తూటాలుగా మలిచి కంటెస్టెంట్ల మీదకు వదిలాడు. మరికొందరికి మంచి మాటలతో పూల బాణాలను వదిలాడు. మరి నేటి బిగ్‌బాస్ ఎపిసోడ్ ఎలా సాగిందో తెలుసుకోవాలంటే దీన్ని చదివేసేయండి.. కులు మనాలీ నుంచి కొత్త బట్టలు తెచ్చిన నాగ్ ఈ మధ్య ఎలిమినేషన్స్ అన్‌ఫెయిర్‌గా ఉంటున్నాయని బిగ్‌బాస్ షోపై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై హోస్ట్ నాగార్జున ఓ క్లారిటీ ఇచ్చారు. మీరు వేసే ఓటును బట్టే ఎలిమినేషన్ జరుగుతుందని కుండ బద్ధలు కొట్టి చెప్పారు. ఇక కులు మనాలీ నుంచి వస్తూ వస్తూ కంటెస్టెంట్ల కోసం కొత్తబట్టలు కూడా తీసుకురావడం విశేషం. అనంతరం అఖిల్, సోహైల్‌ను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి వీడియో చూపించారు. ఇందులో ఎక్కడి విషయాలు అక్కడే వదిలేయ్ అని సోహైల్ మోనాల్‌కు మంచి మాటలు చెప్పాడు. అయినా ఆమె మారకపోగా అఖిల్ దగ్గరకు వెళ్లి సోహైల్ నీ గురించి మాట్లాడుతున్నాడని చెప్పడంతో వారి మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. ఇద్దరి మధ్య దూరం పెరిగింది. అయితే ఈ వీడియో ద్వారా అసలేం జరిగిందనేది వారికి ఓ క్లారిటీ వచ్చింది. దీంతో వీళ్ల మధ్య అపార్థాలు తొలిగిపోయాయి. మాస్టర్ స్వార్థం కోసం అరియానాకు సాయం అనంతరం మోనాల్‌కు బిగ్‌బాస్ ఓ వీడియో చూపించాడు. మోనాల్ నన్ను మోసం చేసింది అని అభి మాట్లాడినదానితో పాటు, ఆమె ఒంటెలా నడుస్తుందని కామెంట్ చేశాడు. లాస్య, నోయల్ కూడా తన గురించి అభికి చెప్పడాన్ని చూపించాడు. దీనిపై నాగార్జున స్పందిస్తూ కొన్నిసార్లు పక్కనున్న వాళ్ల ద్వారా కూడా దూరాలు పెరుగుతాయని హెచ్చరించారు. ఇక అరియానాకు మాస్టర్ మాట్లాడిన వీడియో చూపించారు. నీ దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసి మాస్టర్ నీకు సాయం చేశాడని నాగ్ స్పష్టం చేశారు. ఈ విషయం గురించి అరియానా మాట్లాడుతూ.. కెప్టెన్ కావాలని కలలు కన్నాను, కానీ అయ్యాక చాలా బాధపడ్డాను అని చెప్పుకొచ్చింది. (చదవండి: కాబోయే భార్య ఎలా ఉండాలంటే..: అఖిల్) సోహైల్‌కు అరియానా విలన్, కానీ ఆమెకు మాత్రం కాదు ఈ 56 రోజుల జర్నీలో విలన్ ఎవరు? అంటూ నాగ్ కంటెస్టెంట్లతో ఓ ఆట ఆడించారు. అఖిల్ తనకు అభిజిత్ విలన్ అని, సోహైల్‌కు అరియానా, అమ్మ రాజశేఖర్‌కు అభిజిత్, హారికకు మెహబూబ్, మెహబూబ్‌కు హారిక, అవినాష్‌కు లాస్య, లాస్యకు అవినాష్, అరియానాకు అఖిల్, అభిజిత్‌కు మాస్టర్, మోనాల్‌కు లాస్య విలన్‌గా అనిపించారని చెప్పుకొచ్చారు. తర్వాత అఖిల్ సేఫ్ అయినట్లు ప్రకటించారు. (చదవండి:సంకేతాలిచ్చిన బిగ్‌బాస్: మాస్టర్ ఎలిమినేట్?!) ఫస్ట్ వీక్‌లోనే నాకు నొప్పి స్టార్ట్ అయింది: నోయల్ నోయల్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా అతడు హౌస్‌లో ఉండటం సరికాదని వైద్యులు సూచించార, దీంతో అతడు వెళ్లిపోతున్నట్లు నాగ్ వెల్లడించారు. తనకు 'ఆంక్లియో స్పాంటిలైటిస్' ఉందని, హౌస్‌లోకి వెళ్లిన మొదటి వారంలోనే కాళ్ల నొప్పి ప్రారంభమైందని నోయల్ తెలిపాడు. అయినా సరే ఆ నొప్పిని పంటికింద భరిస్తూ, అందర్నీ ఎంటర్టైన్ చేస్తూ హౌస్‌లో రెండు సార్లు కెప్టెన్ అవడం విశేషం. ఇక నోయల్.. అవినాష్, అమ్మ రాజశేఖర్‌లను ఒంటికాలి మీద నిలబడమని పనిష్మెంట్ ఇచ్చాడు. అభి, హారిక, లాస్య టాప్ 5లో ఉండాలన్నాడు. మోనాల్‌ను ఏడవద్దని, లాస్యను దేన్నీ పట్టించుకోవద్దని, సోహైల్‌ను చిన్న పిల్లాడని చెప్పుకొచ్చాడు. హౌస్‌లో తన వెన్నెముక నోయల్ వెళ్లిపోతున్నాడంటూ హారిక ఏడ్చేసింది. ఆమెను బుజ్జగించడం కోసం ఓ ర్యాప్ సాంగ్ పాడి అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు. నా బాధను హేళన చేశారు: నోయల్ ఆ తర్వాత ఒంటికాలిపై నిల్చున్న ఆ ఇద్దరినీ కాళ్లు నొప్పెట్టాయా? అని అడగ్గా అవునని తలూపారు. దీని కన్నా వెయ్యి రెట్లు ఎక్కువ నొప్పి ప్రతిరోజూ అనుభవిస్తున్నానని నోయల్ తన బాధను బయటకు కక్కాడు. "నాకు ఆంక్లియోస్పాటిలైసిస్ ఉంది. పొద్దున లేచాక అరగంట కాళ్లు స్ట్రెచ్ చేసుకుంటేనే నడగలను. దాన్ని మీరిద్దరూ జోక్ చేస్తారేంటి?" అని నిలదీశాడు. తాను ఎలా నడిచానో చూపిస్తూ అవినాష్ ఎగతాళి చేశాడని చెప్పాడు. కానీ అతడి కాలికి దెబ్బ తగిలినప్పుడు తాను కట్టు కట్టానని పేర్కొన్నాడు. దీంతో అవినాష్ "మీరు కావాలని ఇద్దరినీ బ్యాడ్ చేస్తున్నారని మండిపడ్డాడు. ప్రేక్షకుల ముందు బ్యాడ్ చేయొద్దని హితవు పలికాడు. చిల్లర కామెడీ అయితే ఇక్కడి వరకు వస్తానా? "అని ఆవేశంతో ఊగిపోగా ఇవే తగ్గించుకుంటే మంచిదని నోయల్ సమాధానమిచ్చాడు. (చదవండి:సోనూసూద్, మోనాల్‌కు సపోర్ట్ చేయండి) మోకరిల్లి సారీ చెప్పినా కనికరించని నోయల్ అలా అయితే నువ్వు ఇన్నిరోజులు నటించావంటూ అవినాష్ నోయల్‌ను తప్పు పట్టాడు. కామెడీని తక్కువ చేసి మాట్లాడొద్దని సూచించాడు. "మిమిక్రీని తప్పు పడుతున్నావు, కళామతల్లిని అవమానిస్తున్నావు అంటూ అవినాష్ అసలు విషయాన్ని తప్పుదోవ పట్టించినట్లు కనిపించింది. కానీ చివరికి మాత్రం మోకాళ్లపై మోకరిల్లి రెండు చేతులు జోడించి సారీ చెప్పాడు. తప్పు చేసి సారీ చెప్పడం పెద్దరికం కాదని నోయల్ చెంపపెట్టుగా సమాధానమిచ్చాడు. అనంతరం లాస్య సేఫ్ అయినట్లు ప్రకటించారు. చివరగా ర్యాప్ సాంగ్‌తో నోయల్ వీడ్కోలు తీసుకున్నాడు. ఇన్నిరోజులు అతడు కేవలం శారీరక బాధనే కాకుండా మనాసిక వేదనను కూడా భరించినట్లు నేటి ఎపిసోడ్‌తో రుజువు అయింది. -
రెచ్చిపోయిన నోయల్; ఆ ఇద్దరికీ వాచిపోయిందంతే!
నేటి బిగ్‌బాస్ ఎపిసోడ్లో పెద్ద ట్విస్టులే చోటు చేసుకున్నట్లు కనిపిస్తోంది. అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న నోయల్ స్టేజీ మీదకు వచ్చాడు. నాగార్జున పక్కనే ఉండి కంటెస్టెంట్లతో మాట్లాడుతున్నాడు. ఈ మేరకు స్టార్ మా తాజాగా ప్రోమోను రిలీజ్ చేసింది. అయితే నోయల్స్టేజీ మీద ఉండటంతో అతడు శాశ్వతంగా హౌస్ నుంచి వెళ్లిపోతున్నాడా? అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఈ విషయాన్ని కాస్త పక్కన పెడితే ఇంట్లో కొంత కాలంగా నోయల్ కాలి నొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రోమోలో నోయల్ మాట్లాడుతున్నదాన్ని బట్టి చూస్తే అతడు మానసికంగానూ నరకం అనుభవించినట్లు తెలుస్తోంది. అతడి దీనావస్థను చూసి తోటి కంటెస్టెంట్లు జాలి పడాల్సింది పోయి పుండు మీద కారం చల్లినట్లుగా వెటకారాలు చేశారట. నోయల్ కుంటిగా ఎలా నడుస్తాడో చూపిస్తూ అవినాష్, నోయల్ పరిస్థితి మీద జోకులు చేస్తూ మాస్టర్ అతడిని హేళన చేస్తూ మానసికంగా వేధించారట. వారి వైఖరిని నోయల్ ఆ సమయంలోనే ఖండించాడో తెలీదు కానీ నేడు మాత్రం ఆ ఇద్దరినీ దుమ్ము దులిపాడు. (చదవండి: బిగ్‌బాస్: సగం కాలం గడిచిపోయాక మంగ్లీ ఎంట్రీ?) ఈ మేరకు నోయల్.. అమ్మ రాజశేఖర్, అవినాష్‌లను కాసేపు ఒంటికాలిపై నిలబడమన్నాడు. కానీ కాసేపటికే వాళ్లు నొప్పి తాళలేకపోయారు. మీరు పడ్డ కంటే వెయ్యి రెట్లు ఎక్కువ నొప్పి తనకు రోజూ ఉంటుందని, దాన్ని మీరు జోక్ చేస్తారేంటని నిలదీశాడు. అసలు మీ ప్రవర్తనతో ఏం చెప్పాలనుకుంటారని ప్రశ్నించాడు. తర్వాత అవినాష్ అసలు రంగును కూడా బట్టబయలు చేశాడు. నేనెలా నడుస్తానో అవినాష్ నడిచి చూపిస్తున్నాడు, మీరు రెండు నిమిషాలు నిలబడలేకపోయారు. మరి నాకు ఎంత పెయిన్ ఉంటుందో తెలుసా? అంటూనే ఈ చిల్లర కామెడీలు ఏంటని విమర్శించాడు. దీంతో ఆగ్రహించిన అవినాష్.. మీరు వెళ్తూ వెళ్తూ ఇద్దరిని బ్యాడ్ చేయాలని ఫిక్సయ్యారు అని నోయల్‌పై మండిపడగా అతడు మాత్రం పిచ్చ లైట్ అంటూ ఎందుకు నటిస్తున్నావ్ అవినాష్? అని కౌంటరిచ్చాడు. దీంతో అవినాష్ ఆవేశం మీద నీళ్లు గుమ్మరించినట్లైంది. ఈ ప్రోమోపై నెటిజన్లు స్పందిస్తూ నోయల్ బాధలో అర్థం ఉందంటూ అతడికి మద్దతిస్తున్నారు. అయితే అవినాష్.. వెళ్లిపోయే ముందు బ్యాడ్ చేస్తున్నావ్ అనడాన్ని బట్టి చూస్తే నోయల్ ఎలిమినేట్ అవుతున్నాడేమో అని ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: నీకోసం ఎదురు చూస్తూ ఉంటా: హారిక) -
విశ్వాసం లేదు, చెప్పుతో కొట్టినట్లు ఉంది: మాస్టర్
అనారోగ్యంతో అవస్థ పడుతున్న నోయల్.. గంగవ్వ లాగే బిగ్‌బాస్ షో నుంచి అనూహ్యంగా వెళ్లిపోయాడు. దీంతో ఇంటిసభ్యులు భారంగా వీడ్కోలు పలికారు. కానీ వీలైనంత త్వరగా కోలుకుని నోయల్ మళ్లీ తిరిగి రానున్నాడు. మళ్లీ వచ్చేస్తాడన్న సంతోషం కన్నా ఇప్పుడు వెళ్లిపోతున్నాడన్న బాధే హారికను ఎక్కువగా కుంగదీసింది. దీంతో అభిజిత్ ఆమెను ఆప్యాయంగా హత్తుకుని ఊరడించాడు. ఇక ముందుగా ఊహించినట్లుగానే అరియానా ఎనిమిదో కెప్టెన్‌గా అవతరించింది. కానీ ప్రోమోలో మాస్టర్, అవినాష్ కలిసి ఇంటిసభ్యులను ఆటపట్టించిన క్లిప్పింగులను మాత్రం మొత్తానికే చూపించలేదు. ఇదిలా వుంటే నేటి బిగ్‌బాస్ ఎపిసోడ్లో ఇంకా ఏమేం విశేషాలు, గొడవలు జరిగాయో చదివేసేయండి... ఆడవాళ్లకు మాత్రమే కెప్టెన్సీ టాస్క్ అనారోగ్యంతో బాధపడుతున్న నోయల్‌కు అర్ధరాత్రి దాటినా నిద్ర పట్టలేదు. దీంతో ఒంటరిగా పాటలు పాడుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తర్వాతి రోజు అభి నోయల్ దగ్గర కూర్చుని మోనాల్‌పై సెటైర్ వేశాడు. ఆమె పెద్ద పెద్దగా అడుగులేసుకుంటూ ఒంటెలా నడుస్తుందని కామెంట్ చేశాడు. మరి నువ్వు దుబాయ్ షేక్‌లా కూర్చున్నావని నోయల్ అభి గురించి చెప్పుకొచ్చాడు. అనంతరం బిగ్‌బాస్ "ఆడవాళ్లకు మాత్రమే" కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో భాగంగా గార్డెన్ ఏరియాలో ఒక యాపిల్ చెట్టు, దానిపై పోటీదారుల ఫొటోలు అతికించి ఉన్నాయి. దానిపక్కనే ఒక డబ్బా(అందులో కత్తి), దాని తాళం ఉన్నాయి. మూడుసార్లు బజర్ మోగినప్పుడు అబ్బాయిలు ఆ తాళపుచెవిని సంపాదించి నచ్చిన అమ్మాయికి ఇవ్వొచ్చు. అప్పుడు ఆమె తాళంచెవి సాయంతో డబ్బాలోని కత్తి తీసుకుని ఎవరు కెప్టెన్ అవడానికి వీల్లేదని భావిస్తారో ఆమె ఫొటో అతికించి ఉన్న యాపిల్‌ను తెంపి ముక్కలు ముక్కలుగా కోయాల్సి ఉంటుంది. (చదవండి: బిగ్‌బాస్: అస్వస్థతకు గురైన నోయల్) నీ తెలివి పని చేయలేదు: హారిక ఈ టాస్క్‌లో మొదట తాళపు చెవిని దక్కించుకున్న అఖిల్‌ను తాళపు చెవి తనకివ్వమంటే తనకివ్వండని అమ్మాయిలు అర్జీ పెట్టుకున్నారు. కానీ అతడు మాత్రం అందరూ ఊహించినట్లుగా మోనాల్‌కే ఇచ్చాడు. కత్తి చేతబట్టిన మోనాల్.. హారిక కెప్టెన్సీకు అర్హురాలు కాదంటూ ఆమె ఫొటో ఉన్న పండును ముక్కలు ముక్కలు చేయడంతో దేత్తడి హర్టయ్యింది. తర్వాత తాళపు చెవిని దక్కించుకున్న మెహబూబ్ దాన్ని అరియానాకు ఇచ్చాడు. కత్తి అందుకున్న అరియానా.. లాస్య ఫొటో ఉన్న పండును నాశనం చేసి ఆమెను కెప్టెన్సీ పోటీ నుంచి తొలగించింది. తర్వాత కీ చేజీక్కించుకున్న మాస్టర్ దాన్ని అరియానాకు ఇవ్వగా ఆమె మోనాల్‌ను సైడ్ చేసేసింది. దీంతో అరియానా హౌస్‌లో రెండో మహిళా కెప్టెన్‌గా అవతరించింది. అప్పటికే ఫ్రస్టేషన్లో ఉన్న హారిక.. నీకు తెలివి ఉంది కానీ ఈ రోజు పని చేయలేదని మోనాల్‌ను నవ్వుతూనే తిట్టింది. రేషన్ మేనేజర్‌గా ఉంటే సేఫ్ అయ్యేవాడిని కెప్టెన్ అరియానా రేషన్ మేనేజర్‌గా మోనాల్‌ను ఎంచుకుంది. దీంతో మాస్టర్ ముఖం మాడ్చుకున్నాడు. నామినేషన్లో ఉన్నప్పుడు రేషన్ మేనేజర్‌గా ఇస్తే తనకు సపోర్ట్ అయ్యేదని అర్థం పర్థం లేని మాటలు అన్నాడు. అసలు తాను మోనాల్‌కు సపోర్ట్ చేసి ఉండాల్సిందని, నీకు విశ్వాసం లేదని అసహనం వ్యక్తం చేశాడు. కన్నీళ్లు రాకపోయినా కెమెరాల ముందు ఏడుపు నటించినట్లు ఈజీగా అర్థమవుతోంది. అతని ప్రవర్తనతో విసుగెత్తిన అరియానా.. రేషన్ మేనేజర్‌గా ఉంటే సేవ్ అవుతారని ఎక్కడా లేదని స్పష్టం చేసింది. అయినా సరే పట్టించుకోని మాస్టర్.. నువ్వు చేసిన పనికి నాకు చెప్పుతో కొట్టినట్లుగా ఉందంటూ పెద్ద పెద్ద డైలాగులు కొట్టాడు. ఈ గొడవతో అరియానా తల బొప్పి కట్టింది. (చదవండి: కమెడియన్‌కు ముద్దు పెట్టిన హీరోయిన్) నీకోసం ఎదురు చూస్తూ ఉంటా: హారిక అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న నోయల్‌ను వైద్యులు పరీక్షించారు. అతడు మెడికల్ రూమ్‌కు వెళ్లడం చూసిన హారిక.. నోయల్ వెళ్లిపోవడం నాకిష్టం లేదంటూ గుక్కపెట్టి ఏడ్వడంతో ఆమెను అభిజిత్ హత్తుకుని ఓదార్చాడు. ఇక నోయల్‌ను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచిన బిగ్‌బాస్.. స్పెషలిస్టుల సలహా మేరకు మరింత మెరుగైన వైద్యం అందుకునేందుకు ఇంటి నుంచి వెళ్లిపోవాలని సూచించాడు. అయితే త్వరలోనే పూర్తి ఆరోగ్యవంతులై తిరిగి రావాలన్నాడు. నీ కోసం ఎదురు చూస్తూ ఉంటానని హారిక నోయల్ వెళ్లిపోయిన చాలాసేపటివరకు ఏడుస్తూనే ఉంది. (చదవండి: నాన్న డిఫెన్స్ ఉద్యోగి, కానీ..: నోయల్ తమ్ముడు) -
షాకింగ్: హౌస్ నుంచి వెళ్లిపోయిన నోయల్!
బిగ్‌బాస్ ప్రేమికులకు, నోయల్ అభిమానులకు చేదువార్త. మిస్టర్ కూల్ నోయల్ అనారోగ్య సమస్యలతో ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. ఈ మేరకు స్టార్ మా తాజాగా ప్రోమో వదిలింది. గత కొంతకాలంగా తన అనారోగ్య సమస్యలను పంటి కింద భరిస్తూ నవ్వుతూ వచ్చిన నోయల్‌కు ఆరోగ్యం మరింత క్షీణించింది. అడుగు వేసి అడుగు వేయడమే కష్టంగా మారింది. సరిగా విశ్రాంతి లేక మెడ నరాలు, భుజాలు నొప్పి పెడుతూ అతడిని మరింత బాధించాయి. ఈ క్రమంలో నిన్నటి బీబీ డే కేర్ టాస్క్‌లో బిగ్‌బాస్ నోయల్‌కు మినహాయింపు కల్పించాడు. నేడు అతడిని వైద్యులు పరీక్షించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం అతడికి ఉన్న అనారోగ్య సమస్యలతో హౌస్‌లో నెట్టుకురావడం కష్టమని వైద్యులు తేల్చి చెప్పారు. అతడిని మెరుగైన చికిత్స కోసం హౌస్ నుంచి వీడ్కోలు తీసుకోమని బిగ్‌బాస్ సూచించాడు. దీంతో షాక్ తిన్న కంటెస్టెంట్లు నోయల్‌కు భారంగా వీడ్కోలు పలికారు. అయితే చికిత్స పూర్తయిన తర్వాత మళ్లీ లోనికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది (చదవండి: బిగ్‌బాస్: అస్వస్థతకు గురైన నోయల్) కాగా గతంలోనూ ఆరోగ్యం బాగాలేకపోవడంతో గంగవ్వ ఇంటిని వీడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో నోయల్ కూడా తనకు ఆరోగ్య సమస్యలున్నాయని, గంగవ్వ లాగే వెళ్లిపోతానని చెప్పుకొచ్చాడు. అయినా సరే ఇన్నివారాలు తన బాధను భరిస్తూ హౌస్‌లో నెట్టుకురావడం నిజంగా ప్రశంసనీయం. ఇక గత నామినేషన్లో కాలునొప్పి అంటూ టాస్కులకు దూరంగా ఉంటున్నాడని దివి అతడిని నామినేట్ చేసింది. ప్రస్తుత ప్రోమోతో అతడికి చాలారోజుల నుంచే ఆరోగ్యం బాగోలేదని నిరూపితమైంది, అయితే ఓ మంచి కంటెస్టెంటు హౌస్‌లో నుంచి హఠాత్తుగా వెళ్లిపోవడాన్ని అందరూ జీర్ణించుకోలేకపోతున్నారు. నోయల్‌ను మిస్ అవుతామంటూ కామెంట్లు చేస్తున్నారు. త్వరగా కోలుకొని, హౌస్‌లోకి రీఎంట్రీ ఇవ్వాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. (చదవండి: బాయ్‌ఫ్రెండ్ సినిమాలు వదులుకోమన్నాడు: దివి) -
బిగ్‌బాస్: అస్వస్థతకు గురైన నోయల్
బీబీ డే కేర్ బిగ్‌బాస్ హౌస్‌లోని కేర్టేకర్లకు మాత్రమే కాదు, బయట ప్రేక్షకులకు కూడా విసుగును తెప్పించింది. దీంతో బిగ్‌బాస్ నేడు ఆ టాస్క్‌కు ముగింపు పలికాడు. అందులో హింస-సహనానికి మారుపేర్లుగా నిలిచిన అరియానా- సోహైల్ జోడీ విజేతగా నిలిచింది. దీంతో అప్పటివరకు ఎంతో అల్లరి చేస్తూ కొంటె పనులు చేసిన హారిక కష్టం బూడిదలో పోసిన పన్నీరయ్యింది. ఇక గత కొంత కాలంగా టాస్కులు ఆడలేక ఇబ్బందులు పడుతున్న నోయల్ మరింత అనారోగ్యానికి గురయ్యాడు. నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డ అతడిని వైద్యులు పరీక్షించనున్నారు. మరి నేటి ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో చదివేయండి.. చాక్లెట్ దొంగిలించిన పాపానికి హారికపై కోపం చిన్నపిల్లల్లా మారిన కంటెస్టెంట్లు దాగుడు మూతలు ఆడుకున్నారు. తర్వాత మాస్టర్ జేబులో నుంచి హారిక చాక్లెట్ కొట్టేసింది. దీంతో మాస్టర్‌తో పాటు అతడి కేర్ టేకర్ అభిజిత్ కూడా కోపానికి వచ్చాడు. చాక్లెట్ పోయిందని మాస్టర్ పెద్ద సీన్ క్రియేట్ చేశాడు. అందరిమీద కోపంతో కేకలేశాడు. చివరికి హారిక తనే స్వయంగా వెళ్లి ఆయనతో మాట్లాడి సారీ చెప్పినా అతడు కూల్ అవలేదు. చాక్లెట్ కొట్టేసిందన్న కోపంలో అతడు హారిక మెడలు పట్టుకున్నాడని అభిజిత్.. లాస్య, నోయల్‌తో చెప్పుకొచ్చాడు. (చదవండి: నాగ్ కన్నా ఎక్కువ తీసుకుంటున్న సమంత) హారిక మీద సీరియస్ అయిన అభి పాకెట్లో నుంచి తీసుకోవడం లాక్కోవడమా? దొంగతనమా అని అభి ప్రశ్నించాడు. అది దొంగతనమే అని క్లారిటీ ఇచ్చిన హారిక ఆ సంఘటన జరిగినప్పుడే మాట్లాడకపోయావేనని తిరిగి ప్రశ్నించింది. ఎదురు ప్రశ్నకు చిర్రెత్తిన అభి.. నేనెప్పుడు మాట్లాడాలో నువ్వు నాకు నేర్పకు. ఏం మాట్లాడుతున్నావు? నాకు నచ్చినప్పుడే చెప్తానని సీరియస్ అయ్యాడు. అయితే అంతకుముందు వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లుంది. దాన్ని అభి ప్రస్తావిస్తూ.. అప్పుడు వేస్ట్ అనుకుంటూ మధ్యలో నుంచి ఎందుకు వెళ్లిపోయావు? అని మండిపడ్డాడు. దీంతో హారిక అతడికి క్షమాపణలు చెప్పి, ఇంకోసారి అలా చేయనంటూ అక్కడ నుంచి బయటకు వెళ్లిపోయింది. అభి మాటలతో కన్నీళ్లు పెట్టుకున్న హారిక ఈ గొడవకంతటికీ మూలకారణమైన చాక్లెట్‌ను మాస్టర్‌కు తిరిగిచ్చేసింది. (చదవండి: ఈసారి మహిళా విజేత ఉండకపోవచ్చు: కౌశల్) అది నా గేమ్ ప్లాన్: అభి సమయం చూసి పులిలా పంజా కొట్టడమే తన గేమ్ ప్లాన్ అని అభిజిత్ మెహబూబ్‌తో చెప్పుకొచ్చాడు. ఎంత సేపు అబ్జర్వ్ చేస్తే అన్ని సమాధానాలు దొరుకుతాయని, అది మోనాల్ విషయంలో తెలిసొచ్చిందని చెప్పాడు. మరోవైపు హారిక అందరూ పడుకున్నాక లాస్య దగ్గర చాక్లెట్లు కొట్టేసి భద్రంగా దాచుకుంది. తర్వాతి రోజు పొద్దున లేవగానే చాక్లెట్లు కనిపించక లాస్య కంగారు పడింది. రాత్రి హారిక ఇల్లంతా కలియ తిరగడం తాను చూశానని అవినాష్ చెప్పాడు. దీంతో ఆమె వెళ్లి హారికను అడగడంతో దొంగిలించిన చాక్లెట్లు ఇచ్చేస్తానంది. (చదవండి: పట్టపగలే చుక్కలు చూపించిన అరియానా) నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్న నోయల్ పాపం సోహైల్‌కు అరియానా బాధ నుంచి క్షణం కూడా విముక్తి దొరకడం లేదు. ఆమెను మళ్లీ ఎత్తుకుని ఆడించాడు. నిమ్మకాయను పిండు కానీ తనను పిండద్దొని వేడుకున్నాడు. ఎప్పుడూ తన మీదే ఎక్కుతున్నావు, నేల మీద కూడా నడవాలని అరియానాకు సూచించాడు. తర్వాత మెహబూబ్ సోహైల్‌ను గట్టిగా కొరికేయడంతో ఏడవలేక నవ్వేశాడు. ఇక మోనాల్ క్లాస్ చెప్పడం కోసం అఖిల్ బ్లాక్‌బోర్డ్ మీద బొమ్మ వేశాడు. క్లాసు మొదలవగానే లవ్ అంటే మోనాల్ అని అవినాష్ ప్రేమపాఠాలు వల్లించాడు. నోయల్‌కు ఆరోగ్యం బాగోలేకపోవడంతో అవినాష్‌కు కూడా అభిజితే కేర్ టేకర్‌గా వ్యవహరించాడు. భుజాలు కదలడం లేదని, మెడపై నరాలు పట్టేశాయని, కాళ్లు నడవడానికి కూడా రావట్లేదని నోయల్ బాధపడ్డాడు. రాత్రంతా నిద్ర కూడా పోలేదని చెప్పాడు. అయితే ఇవన్నీ భవిష్యత్తులో పెద్దది కాకుండా చూసుకోమని అభి అతడికి సలహా ఇచ్చాడు. బిగ్‌బాస్ కూడా అనారోగ్యం కారణంగా నోయల్‌కు విశ్రాంతి కల్పించాడు. అల్లరితో ఏడిపించి చివరికి తనే ఏడ్చేసింది తర్వాత బిగ్‌బాస్ ఇంటిసభ్యులతో సరదాగా నేల, నీళ్లు, మంట ఆడించారు. ఈ టాస్క్‌లో అభి కాళ్లు జారి కిందపడగా అఖిల్ గెలిచాడు. అనంతరం బీబీ డే కేర్ టాస్క్ ముగిసినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. ఈ టాస్క్‌లో విన్నర్ జోడీని ఎంపిక చేయమని లాస్యను ఆదేశించగా ఆమె సోహైల్-అరియానా పేర్లను వెల్లడించింది. దీంతో బిగ్‌బాస్ వారికి స్పెషల్ గిఫ్టులు పంపారు. ఇక తనకొచ్చిన మటన్‌ను ఎవరికీ ఇవ్వనని, ఒక్కడినే తింటానని, ఎవరాపుతారో చూస్తానని సోహైల్.. అవినాష్‌కు సవాలు విసిరాడు. మరోవైపు అప్పటివరకు టాస్క్‌లో భాగంగా ఆడుకున్న చింపాంజీ బొమ్మను తనకే ఇచ్చేయమని, దాన్ని చూస్తే ఇంట్లోవాళ్లను చూసినట్లుందని అరియానా ఏడ్చేసింది. (చదవండి: నామినేషన్ అప్పుడు చూపిస్తా: అవినాష్) -
నోయల్.. నీకు క్యారెక్టర్ లేదు: మాస్టర్ ఫైర్
బిగ్‌బాస్ నాల్గో సీజన్లో తొలి వారాల్లోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అన్నింటినీ దింపేశారు. మొదటగా వచ్చిన కుమార్ సాయిని ఇంటిసభ్యులు కలుపుకోలేక, చివరికి ఏకాకిగానే వీడ్కోలు తీసుకున్నాడు. తర్వాత వచ్చిన అవినాష్ బిగ్‌బాస్ హౌస్‌లో ఓ కొత్త ఎనర్జీని నింపుతూ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాడు. మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీ స్వాతి దీక్షిత్ మెరుపుతీగలా పట్టుమని పది రోజులు కూడా ఉండకుండా వచ్చినదారినే వెళ్లిపోయింది. ఆమె వెళ్లినప్పుడు అందరికన్నా ఎక్కువ బాధపడ్డ ఏకైక వ్యక్తి నోయల్. అమ్మ రాజశేఖర్ ఆమెను నామినేట్ చేయడం వల్లే ఎలిమినేట్ అయిందని నోయల్ మనసులో ఓ అభిప్రాయం బలంగా నాటుకుపోయింది. స్వాతి ఎలిమినేషన్‌తో మొదలైన గొడవ దీంతో ఇదే కారణాన్ని ప్రస్తావిస్తూ అతడు మాస్టర్‌ను నామినేట్ చేశాడు. ఇది ఆయనకు నచ్చలేదు. అమ్మాయి కోసం తనను నామినేట్ చేస్తావా? అని ఆగ్రహంతో ఊగిపోయాడు. నీ వల్ల నేను వెళ్లిపోతే నువ్వు జీవితాంతం బాధపడాలంటూ శాపనార్థాలు పెట్టాడు. అప్పటినుంచి వీరి మధ్య దూరం పెరిగిపోయింది. అయితే ఈ దూరాన్ని తగ్గించుకునేందుకు మొన్న నోయల్ ముందుకు వచ్చి మాస్టర్‌కు అరగుండు గీశాడు. అయినా సరే వాళ్లు తిరిగి మామూలైనట్లు కనిపించడం లేదు. నేటి ఎపిసోడ్లో మరోసారి గొడవ పడుతున్నట్లు తెలుస్తోంది. (చదవండి: నోయల్‌కు శాపం పెట్టిన అమ్మ రాజశేఖర్) నోయల్‌పై విరుచుకుపడ్డ మాస్టర్ తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో ప్రకారం.. "నా దృష్టిలో ప్రామిస్ పెద్ద విషయం.. అది ఇప్పుడు కాకపోతే నేను చనిపోయాకైనా మీకు అర్థమవుతుంది" అని నోయల్ చెప్తుంటే మరి నా ప్రామిస్ మిస్ చేశావ్ కదా! అని మాస్టర్ ఎదురు తిరిగాడు. నేను మాటిస్తే మనిలబడతానని రాసిస్తానని నోయల్ అంటుంటే మాస్టర్ మళ్లీ వ్యక్తిగత దూషణకు దిగాడు. 'కెమెరా కోసం డ్రామాలు.. ప్రామిస్ మీద నిలబడే క్యారెక్టర్ నీకు లేదు. బయటకు వెళ్లినా కూడా ఎన్ని అనాలో అన్ని అంటాను' అని విరుచుకుపడ్డాడు. ఈ గొడవతో అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ఇక గొడవ జరిగినందుకు అభికి హ్యాపీ అని నోయల్ అన్నాడు. అంటే అభిజిత్ నోయల్ దగ్గర మాస్టర్ ప్రస్తావన తీసుకుచ్చాడా? ఈ క్రమంలోనే వారికి వాగ్వాదం జరిగిందా? అనేది నేటి ఎపిసోడ్లో తేలనుంది. (చదవండి: మాస్టర్‌పై ప్రతీకారం తీర్చుకున్న స్వాతి దీక్షిత్) -
నరకం చూపించిన ఆ ఇద్దరే బెస్ట్ పర్ఫార్మర్లు
మంచికి చెడుకు జరుగుతున్న యుద్ధంలో రాక్షసులు విచ్చలవిడిగా ప్రవర్తించారు. నానారకాలుగా హింసిస్తూ చెలరేగిపోయారు. అయినా సరే చెడుపై విజయం సాధించింది. రాక్షసులపై మంచి మనుషుల టీమ్ గెలిచింది. ఈ క్రమంలో కొందరికి చిన్నపాటి గాయాలు కూడా అయినట్లు తెలుస్తోంది. అయినా సరే వాటిని లెక్క చేయకుండా టాస్కే మాకు సర్వస్వం అన్న రీతిలో రెచ్చిపోయి మరీ ఆడారు. మరి బిగ్‌బాస్ ఇచ్చిన ఈ ఈ టాస్కులో ఎవరు బాగా ఆడారు? ఎవరి ఐడియా వర్కవుట్ అయిందో చదివేసేయండి.. రాక్షసుల టీమ్ వాళ్లు నన్ను వదిలేశారు: హారిక కొంటె రాక్షసులను మంచి మనుషులుగా మార్చేందుకు మరో టాస్క్ ఇచ్చాడు. గుండంలో ఉన్న బస్తాలను బయట పడేసి వారు లోపలే ఉండాల్సి ఉంటుంది. కానీ వాళ్లు బయట పడేసిన ప్రతీసారి రాక్షసులు లోపలకు వేశారు. దీంతో బస్తాలు మరోసారి లోపలకు వేయకుండా మంచి మనుషులు వాటిని స్విమ్మింగ్ పూల్‌లో వేశారు. ఇన్ని చేసినా సరే మంచి మనుషులు ఆ టాస్కులో గెలవలేకపోయారు. ఇక రాక్షసిగా ఉన్న తాను మంచిమనుషులకు ఎలా దొరికిపోయానన్నది హారిక లాస్యతో చెప్పుకొచ్చింది. అరియానా, అవినాష్, మెహబూబ్ తనను వదిలేసి ముగ్గురూ ఒకే వాష్‌రూమ్‌లో దూరిపోయారని చెప్పింది. అందుకు హర్ట్ అయ్యానంది (చదవండి: సోహైల్‌కు హారిక పంటిగాట్లు, ఎవ్వరినీ వదల్లేదు) ఇంకా టార్చర్ చేయాలనుంది: అరియానా ఇక తర్వాతి రోజు అరియానా ఇవాళ ఇంకా టార్చర్ చేయాలనిపిస్తుందని మాస్టర్‌తో అంది. తీరా అన్నంతపనే చేసింది. సోహైల్, అఖిల్ షూలను ఎక్కడపడితే అక్కడ విసిరేసింది. పైగా అఖిల్‌తో సారీ చెప్పించుకుంది. ఇక అవినాష్.. లాస్యతో విసనకర్ర విసిరించుకున్నాడు. మొత్తానికి అందరి బట్టలను కింద పడేసి హౌస్‌ను చెత్తకుప్పగా తయారు చేశారు. కళ్ల ముందు జరుగుతున్న ఘోరాలను చూసి లాస్య ఏడ్వలేక నవ్వింది. (చదవండి: అభి, దివికి అహంకారం, మెహబూబ్ వాడుకుంటున్నాడు) మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్.. లాస్య పంచ్ ఆ కోపంలోనే అరియానా, అవినాష్‌లను 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' అని పంచ్ కూడా వేసింది. కానీ వాళ్లు అందుకు ప్రతీకారంగా ఆమె దుస్తులను కింద పడేశారు. దీంతో ఆమె తన మాటను వెనక్కు తీసుకుని 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' అని పొగిడింది. అప్పటివరకు రెచ్చిపోయిన అవినాష్ మోనాల్ రాగానే సైలెంట్ అయిపోయాడు. కాసేపటివరకు ఇద్దరు గుసగుసలు పెట్టుకున్నారు. ఆమెను వదిలి రాబుద్ధి కావడం లేదని వాపోయాడు. మరోవైపు సోహైల్ తనంతట తానుగా బట్టలు పడేయకపోతే అందరివీ పారేస్తానని మెహబూబ్ వార్నింగ్ ఇవ్వగా.. టైమ్ బ్యాడ్ అనుకుని చిరాకుతో అప్పటివరకు సర్దుకున్న అన్నింటిని సోహైల్ కింద పడేశాడు. అరియానాను పూల్‌లో తోసేసిన మాస్టర్ కుండలతో స్విమ్మింగ్ పూల్ నుంచి నీళ్లు తీసుకుని డ్రమ్ములు నింపాలని మంచి మనుషులకు మరో టాస్క్ ఇచ్చాడు. మెహబూబ్ కుండలకు చిల్లులు పెడుతూ వాటిని పగలగొట్టాడు. దీంతో అభిజిత్ సీరియస్ అయ్యాడు. అయినా సరే మెహబూబ్ డ్రమ్మును బోర్లించగా, అదే సమయంలో అక్కడున్న తనకు దెబ్బ తగిలిందని అఖిల్ గరమయ్యాడు. నీళ్లెలా పోస్తారో చూస్తానన్నట్టు డ్రమ్ముపై కూర్చున్న మెహబూబ్‌ను సోహైల్ ఆ డ్రమ్మును ఎప్పటిలా పెట్టేశాడు. తర్వాత అరియానాను మాస్టర్ స్విమ్మింగ్ పూల్‌లో తోసేశాడు, కానీ తాను తోయలేదని బుకాయించాడు. (చదవండి: కెప్టెన్‌గా నోయల్, కానీ తప్పని ముప్పు) నువ్వు పెద్ద తోపేం కాదు: అఖిల్ ఇక స్విమ్మింగ్ పూల్‌లో తనను అడ్డుకుంటున్న అవినాష్‌ను మోనాల్ కొరికేసింది. వీళ్లను దాటుకుని టాస్కు గెలవలేమని భావించిన నోయల్ ఓ ఐడియా చెప్పాడు. డ్రమ్ములను స్విమ్మింగ్ పూల్‌లో పడేసి నింపుదామన్నాడు. ఈ ప్లాన్ వర్కవుట్ అయి వారి విజయానికి కారణమైంది. మరోవైపు టాస్కులో చాలా క్రూరత్వంగా ప్రవర్తిస్తున్నావని అఖిల్ మెహబూబ్‌ను అన్నాడు. నన్ను ఆపలేక అంటున్నావా? అని అతడు రివర్స్ కౌంటరివ్వడంతో "నువ్వు పెద్ద తోపు, తురుము ఏం కాదు, దమ్ముంటే నా దగ్గరకు రా" అని అఖిల్ సవాలు విసిరాడు. చివరాఖరకు ఈ టాస్కులో మంచి మనుషుల టీమ్ గెలవడంతో అవినాష్‌ను తమలో కలుపుకుపోయారు. (చదవండి: నాన్న ఇస్త్రీ పని చేసేవాడు, ఇదిగో ప్రూఫ్: నోయల్) మెహబూబ్‌కు బిగ్‌బాస్ పంచ్ ఒక కొంటె రాక్షసుడిని ఎత్తుకుని ఎండ్ బజర్ మోగేసరికి నేలపై లేకుండా చూసుకోవాలని బిగ్‌బాస్ చిట్టచివరి టాస్క్ ఇచ్చాడు. దీంతో అరియానా అడ్డంగా దొరికిపోయింది. ఆమెను కాలు కింద పెట్టకుండా చూసుకుని అరియానాను మంచి మనిషిగా మార్చేశారు. మిగిలిన మెహబూబ్ కూడా వాళ్లలో కలిసిపోయాడు. మంచి మనిషిగా మారిన మెహబూబ్, మైకు ధరించడం కూడా మంచి లక్షణమే అని బిగ్‌బాస్ పంచ్ వేయడంతో ఇంటిసభ్యులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. కెప్టెన్ నోయల్ ఈ టాస్కులో బెస్ట్ పర్ఫార్మర్గా అరియానా, అవినాష్ పేర్లను వెల్లడించాడు. వీరిద్దరూ కెప్టెన్సీ కోసం పోటీ పడుతారు. మరి రేపటి ఎపిసోడ్లో ఎవరు కెప్టెన్ అవనున్నారనేది చూడాలి.. -
నాన్న డిఫెన్స్ ఉద్యోగి, కానీ..: నోయల్ తమ్ముడు
గతవారం బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లు వారి వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ కంటతడి పెట్టారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఇక్కడివరకు వచ్చామంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ఇక నోయల్ వంతు రాగా.. అమ్మ అందరి ఇళ్లల్లో పని చేసేదని, నాన్న రకరకాల పనులు చేసేవాడని చెప్పుకొచ్చాడు. ఇస్త్రీ, మేస్త్రీ పని చేస్తూ డబ్బులు సంపాదించేవాడని తెలిపాడు. అయితే వికీపీడియాలో నోయల్ తండ్రి డిఫెన్స్ ఉద్యోగి అని ఉండటంతో నెటిజన్లు ఫైర్ అయ్యారు. సింపథీ ఓట్ల కోసం తండ్రి గురించే అబద్ధం చెప్తావా? అని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఈ వివాదంపై నోయల్ తమ్ముడు స్పందించారు. (చదవండి: ఫిజికల్ టాస్కులకు దూరంగా అభిజిత్) ఇస్త్రీ షాపులో పని చేస్తున్న నోయల్ తండ్రి ఆయన మాట్లాడుతూ నోయల్ చెప్పినదాంట్లో ఏ తప్పూ లేదని స్పష్టం చేశారు. నిజంగానే నాన్న డిఫెన్స్‌లో చేరేముందు రకరకాల పనులు చేశాడని తెలిపారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను సైతం బయటపెట్టారు. బట్టలు ఇస్త్రీ చేస్తున్న తండ్రి ఫొటోలను పంచుకున్నారు. డిఫెన్స్ అనగానే శాస్త్రవేత్తో, ఆఫీసరో అనుకుంటున్నారు. కానీ ఆయన సెక్యూరిటీ గార్డుగా పని చేసేవారని వెల్లడించారు. ఆ సమయంలో కూడా ఆటో నడిపేవారని పేర్కొన్నారు. ఇక నోయల్ గురించి చెప్తూ.. "అన్నయ్య ఇంటర్ తర్వాత చార్మినార్‌లో బుక్ షాపులో పని చేశాడు, మా వీధిలోనే పాలు పోసేవాడు, వార్తాపత్రికలు వేసేవాడు. ఎన్నో కష్టాలు పడి ఇక్కడివరకు వచ్చాడు. అన్నయ్యకు పీఆర్ టీమ్ లేదు. నేను మాత్రమే పోస్టులు చేస్తున్నాను. దయచేసి అతడిపై తప్పుడు ప్రచారం చేయకండి" అని కోరారు. (చదవండి: బిగ్‌బాస్: అఖిల్‌కు లైనేసిన హారిక) -
బిగ్‌బాస్: బయటపడ్డ నోయల్ మోసం
బిగ్‌బాస్ రియాలిటీ షోలో మొన్నామధ్య కంటెస్టెంట్లు రియల్ లైఫ్ కష్టాలు చెప్పి అందరినీ కంటతడి పెట్టించేశారు. చాలా మంది కంటెస్టెంట్లు మధ్యతరగతి కుటుంబం నుంచే వచ్చారని, ఎన్నోకష్టనష్టాలు అనుభవించాకే ఈ స్థాయికి వచ్చారని తెలిసి ప్రేక్షకులు కూడా భావోద్వేగానికి లోనయ్యారు. ఆ సమయంలో సింగర్ నోయల్ తన కుటుంబం గురించి చెప్తూ.. మా అమ్మ అందరి ఇళ్లల్లో పని చేసేది. నాన్న రకరకాల పనులు చేసేవాడు. ఇస్త్రీ, మేస్త్రీ పని చేస్తూ డబ్బులు సంపాదించేవాడు అని చెప్పాడు. (చదవండి: అరియానాకు సారీ చెప్పి తినిపించిన సోహైల్) వికీపీడియాలో వెల్లడైన నిజం కానీ వికీపీడియాలో అతడి తండ్రి రిటైర్డ్ డిఫెన్స్ ఉద్యోగి అని ఉంది. దీంతో ప్రేక్షకులను బకరా చేసిన నోయల్ మోసం బయటపడిందని అతని యాంటీ ఫ్యాన్స్ అంటున్నారు. తండ్రి డిఫెన్స్ ఉద్యోగి అయినా కూడా రోజువారీ కూలీ అన్నట్లుగా చెప్పి సింపతీ ఓట్లు పొందాలని చూస్తున్నాడని విమర్శిస్తున్నారు. ఇక వికీపీడియాలో ఓసారి అతడి తండ్రి డిఫెన్స్ ఉద్యోగి అని, మరోసారి కూలీ అని మార్చేసి ఉన్న ఫొటోలను పంచుకుంటున్నారు. ఈ వ్యవహారంతో నోయల్ అభిమానులకు దిమ్మతిరిగిపోయింది. ఏదేమైనా సపోర్ట్ చేయడమే వారి పని కాబట్టి, అతడి తండ్రి అంతకు ముందు డెయిలీ లేబర్ కావచ్చని, తర్వాత ఆ ఉద్యోగంలో చేరాడేమోనని వెనకేసుకువస్తున్నారు. (చదవండి: గంగవ్వలాగే నన్ను పంపించేయండి: నోయల్) నిజమైన నోయల్ బయటకు రావాలి: నాగ్ అసలే ఎన్నో అంచనాలు పెట్టుకున్న నోయల్ ప్రేక్షకులను నిరాశపరుస్తున్నాడు. మొదట్లో కనీసం ర్యాప్ సాంగ్స్‌తో అయినా ఎంటర్టైన్ చేసేవాడు. కానీ ఇప్పుడు పాటా లేదు, ఆటా లేదు. ఇంట్లో ఉన్నాడా? లేడా? అన్నట్లుగా మెదులుతున్నాడు. గంగవ్వలాగే తననూ పంపిచేయండి అంటూ అతడిని విన్నర్‌గా చూడాలన్న అభిమానుల ఆశలపై నీళ్లు చల్లాడు. ఇక నిన్నటి ఎపిసోడ్లో నాగ్ సైతం నిజమైన మాకు నిజమైన నోయల్ కావాలి అని పేర్కొనడం అతడు మాస్క్ వేసి ఆడుతుతున్న విషయాన్ని పరోక్షంగా ఎత్తి చూపింది. Noel father is a retired defence employee! His team tries to convince Noel lies through Wikipedia but later reverted. #BiggBossTelugu4 #Noel #Abijeet #BiggBoss4Telugu #DiviVadthya #akhilsarthak #DisneyPlusHS Link: https://t.co/kiF5Ky5rP7 pic.twitter.com/SSSdGb0X0e — Mohan Peram (@MohanPeram) October 18, 2020 #NoelSean PR mundhu migatha andariki PRs jujubees 😂😂#Abhijeeth #Akhil #DiviVadthya #sohel all other armies.. 👇👇#BiggBossTelugu4 @StarMaa @mrnoelsean pic.twitter.com/6jiWEM72co — Chitti (@iChittiRobot) October 17, 2020 -
బిగ్‌బాస్: మోనాల్ కోసం అరియానా త్యాగం
బిగ్‌బాస్ హోస్ట్ మారనున్నారన్న ఊహాగానాలకు చెక్ పెడుతూ నేటి ఎపిసోడ్లో నాగార్జునే వ్యాఖ్యాతగా వ్యవహరించారు. బిగ్‌బాస్ డీల్స్‌లో ఇంటిసభ్యులు వదిలేసిన ఒక డీల్‌ను పట్టుబట్టి మరీ చేయించారు. అలాగే కంటెస్టెంట్లు ఒకరి గురించి మరొకరు మనసులో ఏమనుకుంటున్నారనేదాన్ని బయటపెట్టారు. సోహైల్‌పై అరిచిన అవినాష్‌కు చీవాట్లు పెట్టారు. నామినేషన్లో తొమ్మిదిమంది ఉండగా అందులో ముగ్గురిని సేవ్ చేశారు. మరి బుల్లితెర బాస్ బిగ్‌బాస్ షోలో ఇంకా ఏమేం జరిగాయో చదివేసేయండి.. మారని మాస్టర్, సోహైల్‌పై వ్యక్తిగత దూషణ శుక్రవారం నాటి ఎపిసోడ్లో బిగ్‌బాస్ ఇంటిసభ్యులకు దోసె టాస్క్ ఇచ్చాడు. ఇందులో వారు రెండు టీమ్‌లుగా విడిపోయి మినపగుళ్లను పిండి రుబ్బి దోసె వేయాల్సి ఉంటుంది. ఎక్కువ దోసెలు వేసిన మాస్టర్ టీమ్ గెలుపొందగా, అందులోని సభ్యులకు లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో అదనపు పాయింట్లు లభిస్తాయి. ఇక ఆటలో దోసె దొంగిలించినట్లు పరాచకాలు ఆడిన సోహైల్‌పై మాస్టర్ చిర్రుబుర్రులాడాడు. నీకు దొంగ అన్న పేరు కరెక్ట్‌గా పెట్టారని వ్యక్తిగతంగా దూషించారు. అతడి ప్రవర్తనకు షాకైన సోహైల్ ఇప్పటినుంచి ఏ టాస్క్ ఆడనంటూ అలిగాడు. తనకు లేనిపోని అన్ని పేర్లు పెడుతున్నారని బాధపడ్డాడు. కానీ మాస్టర్ మాత్రం అలా దూషించడం తన తప్పే అని అంగీకరించకపోవడం గమనార్హం. ఏదేమైనా ఇంకోసారి సోహైల్‌ను దొంగ అనకండని అఖిల్ మాస్టర్‌కు సూచించాడు. (చదవండి: ఫిజికల్ టాస్కులు అభిజిత్‌కు చేతకాదా?) సోహైల్‌కు సారీ చెప్పిన అరియానా నాగార్జున ఎప్పటిలాగే ఈసారి కూడా అమ్మాయిలు బాగున్నారని మెచ్చుకున్నారు. తర్వాత కంటెస్టెంట్లు చేసిన తప్పొప్పులను ఎత్తి చూపారు. నోయల్‌ను రేసర్ ఆఫ్ ద హౌస్ టాస్క్ ఎందుకు ఆడలేదని ప్రశ్నించారు. అవకాశమొచ్చినప్పుడు వదులుకోవద్దని సూచించారు. నిజమైన నోయల్ ఇంకా బయటకు రావట్లేదన్నారు. ఇక సోహైల్ కోపాన్ని గెలిచేశాడని ప్రశంసించారు. అతడిని పొగరు అన్న అరియానాను నిలబెట్టి నిలదీశారు. అయితే 'సోహైలే వచ్చి తినిపిస్తూ మరీ సారీ చెప్పాడు, కదా! మరి నువ్వు చెప్పవా' అని అడిగారు. దీంతో చెప్పనని మొండికేస్తూనే చివరి నిమిషంలో సారీ చెప్పింది. తర్వాత బిగ్‌బాస్ డీల్స్ టాస్క్‌లో సోహైల్- అవినాష్ మధ్య జరిగిన గొడవలో అవినాష్‌దే తప్పని నాగ్ కుండ బద్ధలు కొట్టారు. సంచాలకుడిగా సోహైల్ కరెక్ట్‌గానే ఉన్నాడని పేర్కొన్నారు. ఇక మోనాల్ ఆరు రోజులుగా ఒకటే డ్రెస్ వేసుకుండటంతో నాగ్ ఓ సలహా ఇచ్చారు. ఈ ఒక్కరోజు మోనాల్‌కు బదులు ఆమె బ్లూ టీమ్‌లోని మిగతా ఎవరైనా ఆమె డ్రెస్ వేసుకోవాలని చెప్పడంతో అరియానా ముందుకు వచ్చింది. (చదవండి: నా లవ్ బ్రేకప్ అయింది: అఖిల్) సేఫ్ అయిన తొలి కంటెస్టెంటు లాస్య బ్లూ టీమ్ వదిలేసిన అరగుండు డీల్ పూర్తి చేసినవారికి తర్వాతి వారం నామినేషన్ నుంచి సేఫ్ అయ్యే అవకాశం ఉంటుందని నాగ్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఈ డీల్‌కు అమ్మ రాజశేఖర్ ఒప్పుకోవడంతో నోయల్ గుండు గీశాడు. తల్లి కోసం చేయని త్యాగం బిగ్‌బాస్ కోసం చేశావని నాగ్ మాస్టర్‌ను ఆకాశానికెత్తారు. మీరు కానీ, లేదా ఇతరులనెవరినైనా సేవ్ చేసే అవకాశమిచ్చారు. హెయిర్ కట్ చేసుకున్నాక కూడా హారిక క్యూట్‌గా ఉందని తెలిపారు. ఇక లాస్య టాస్క్‌లో అన్నీ కలగలిపిన డ్రింక్ ఎలా తాగావని మెచ్చుకుంటూనే ఆమె సేఫ్ అయినట్లు ప్రకటించారు. (చదవండి: బిగ్‌బాస్: మాస్టర్ కాళ్లు పట్టుకున్న సోహైల్) కంటెస్టెంట్ల రంగు బయటపెట్టిన మనసులో మాట ఇంటిసభ్యులు ఒకరి గురించి మరొకరు ఏమనుకున్నారో రాసివ్వగా వాటిని నాగ్ చదివి వినిపించారు. ► అవినాష్‌ది టాస్కు సమయంలో క్రూర మనస్తత్వం-దివి ► మెహబూబ్ ఫ్రెండ్షిప్ సర్కిల్ సెట్ చేసుకుని వారిని వాడుకోవాలనుకుంటాడు. స్వార్థపరుడు కానీ స్నేహం కోసం చేస్తున్నట్టు కలర్ ఇస్తాడు - కుమార్ సాయి ► లాస్యది మోసపూరిత నవ్వు- అమ్మ రాజశేఖర్ ► అభిజిత్‌కు చాలా అహంకారం- దివి ► నోయల్‌ది తాత్కాలిక స్నేహం- అవినాష్ ► అరియానా అతిగా స్పందించడం, పాడటం కొన్నిసార్లు హద్దులు దాటుతుంది- మెహబూబ్ ► దివి.. అహంకారం, అగౌరవం, సభ్యత లేకుండా ఉంటుంది, ఇతర మనోభావాలను పట్టించుకోదు- మోనాల్ ► అఖిల్ నిజాయితీపరుడిగా, ఎటువంటి వంచన లేని మనిషిగా నటిస్తాడు- అభిజిత్ ► మోనాల్ అబద్ధాల కోరు- అభిజిత్ ► అమ్మ రాజశేఖర్ ఏం అరుస్తాడో, నిజాయితీ అన్న ముసుగు ఎలాగైతా ఉండాలనుకుంటున్నాడో అందులో దాచుకుంటాడు- అభిజిత్ నోయల్.. నాకు నాన్న: హారిక తర్వాత నోయల్, హారిక సేఫ్ అయినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా హారిక తనకు ఈ సేవింగ్ చాలా స్పెషల్ అని చెప్పింది. నోయల్‌ను తన నాన్నలా ట్రీట్ చేస్తానని పేర్కొంది. ఇక అరగుండు గీసుకున్న మాస్టర్ తర్వాతి వారం నామినేషన్ నుంచి తానే సేఫ్ అవుతానని వెల్లడించారు. ఇక ఈ వారం మోనాల్ గజ్జర్‌ను కాదని అన్యాయంగా కుమార్ సాయిని ఎలిమినేట్ చేసినట్లు సమాచారం. (చదవండి: బిగ్‌బాస్: ఆమెపై ఎలిమినేషన్ కత్తి) -
సాయంత్రం మల్లెపూలు తేనా..: అరియానా
బిగ్‌బాస్ షోలో నేడు పార్టీ జరగబోతోంది. కానీ ఇది అమ్మాయిలకే స్పెషల్ పార్టీ అని తెలుస్తోంది. అబ్బాయిలను కూడా పార్టీలో జాయిన్ చేసుకోవాలంటే అమ్మాయిలు కండీషన్స్ పెడుతున్నారు. దొరికిందే ఛాన్సని వారిని ఆటాడేసుకుంటున్నారు. అయినా సరే మాస్టర్ వద్దంటున్నా ఆడవాళ్ల పార్టీలో దూరిపోయాడు సోహైల్. పోనీ అమ్మాయిలు చెప్పినట్లు నడుచుకున్నాడా అంటే అదీ లేదు.. వారికే కౌంటర్లు వేస్తూ పోయాడు. దీంతో సారీ చెప్పమని హారిక డిమాండ్ చేసింది. మాస్ ఇక్కడ క్షమాపణలు చెప్పేదే లేదన్నట్లుగా సోహైల్ ప్రవర్తించడంతో అందరూ కలిసి అతడిని ఓ ఆటాడుకున్నారు. హారిక అతడి లుంగీ పట్టుకుని లాగగా దొరికిన వస్తువు అందుకుని చితకబాదారు. (డబుల్ ఎలిమినేషన్; కళ్యాణి అవుట్!) అఖిల్ పార్టీ రూమ్‌లోకి రాగా సాయంత్రం మల్లెపూలు తేనా అని అరియానా ఓరకంటతో అడగ్గా అతడు సిగ్గులమొగ్గయ్యాడు. ఇక ఈ పార్టీ మొదలు కావడానికి ముందు కంటెస్టెంట్లు అందరూ పుషప్స్ చేశారు. అయితే కుమార్ సాయి కంటిన్యూగా పుషప్స్ చేయలేదని నోయల్ అన్నాడు. ఒక్కరోజైనా నిజాయితీగా ఉండు అని సూచించడంతో అది తప్పు స్టేట్మెంట్ అని కుమార్ ఖండించాడు. ఈ ప్రోమో చూసిన నెటిజన్లు మాత్రం నోయల్ మాటలను తప్పు పడుతున్నారు. కుమార్ వ్యక్తిత్వాన్ని చులకన చేసి మాట్లాడటం సమంజసం కాదని మండిపడుతున్నారు. (బిగ్‌బాస్: ఒకరు సేఫ్, మరొకరు నామినేట్) మరికొందరైతే నోయల్ ఇప్పటికీ ఫేక్‌గానే ఉంటున్నాడని అతడిని దుమ్మెత్తి పోస్తున్నారు. ఒక్క ఆట కూడా ఆడని నోయల్ టాస్కుల్లో ప్రాణం పెట్టి ఆడే కుమార్‌ని నిందించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మోనాల్ మూడు రోజులవుతున్నా ఇంకా జ్యూట్ డ్రెస్ ధరించడంపై నెటిజన్లు ఛలోక్తులు విసురుతున్నారు. రేపు నాగార్జున ఎదుట ఈ అవతారంలో కనిపించే వరకు ఆ డ్రెస్‌ను వదిలేలా లేదని సెటైర్లు వేస్తున్నారు. బిగ్‌బాస్ డీల్స్ ముగిసినా మోనాల్‌కు మాత్రం ఆ డ్రెస్ నుంచి విముక్తి కల్పించడం లేదని మరికొందరు ఆమెను వెనకేసుకొస్తున్నారు. -
చెప్పొద్దనుకున్నా, కానీ నా అసలు పేరు: అరియానా
నేడు బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లు అందరూ వారి జీవితాలను కుదిపేసిన సంఘటనలను గురించి చెప్తూ విషాదంలో మునిగిపోయారు. తమతమ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఓసారి జీవితంలోకి వెనుదిరిగి చూసుకున్నారు. ఈ క్రమంలో వారు కోల్పోయినవి, సంపాదించుకున్నవి గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అలా ప్రతీఒక్కరూ వారి వారి సంఘటనలను చెప్తూ ప్రేక్షకులను కంటతడి పెట్టించారు. ఎవరు ఏయే విషయాలను పంచుకున్నారో చదివేయండి.. అరియానాకు సారీ చెప్పి తినిపించిన సోహైల్ మోనాల్ అవినాష్‌కు గోరు ముద్దలు తినిపిస్తే అతడు మాత్రం అరియానాకు తినిపించాలని తహతహలాడాడు. అటువైపేమో తన ఫ్రెండ్స్ లిస్టులో లేదన్న అరియానాకు సోహైల్ సారీ చెప్తూ నూడుల్స్ తినిపించాడు. దీంతో అవినాష్ తినిపించబోతే వద్దని వారించింది. 'అతడు పెడితే తింటావు, కానీ నేను పెడితే తినవు కదా' అని అవినాష్ నిలదీయడంతో మారు మాట్లాడలేక తినేసింది. బిగ్‌బాస్ ఇంటిసభ్యులకు లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చారు. స్విమ్మింగ్ ఫూల్‌లోని బాటిల్స్ తీసుకుని ఎత్తిన బాటిల్ దించకుండా తాగాలి. ఇందులో ఇందులో మెహబూబ్ ఏడు బాటిల్స్ తాగేయగా కుమార్ ఆరింటిని తాగి టాస్క్ విజయవంతంగా పూర్తి చేశారు. తర్వాత అందరూ కలిసి పిచ్చి పట్టినవాళ్లలా అరిచారు. (చదవండి: బిట్టూ అని వాళ్లే పిలవమన్నారు: సుజాత) మా అమ్మానాన్న విడిపోయారు: అరియానా ఇంటి సభ్యులందరి చిన్ననాటి ఫొటోలను బిగ్‌బాస్ టీవీలో చూపించడంతో కంటెస్టెంట్లు ఎగ్జైట్ అవుతూనే కన్నీళ్లు పెట్టుకున్నారు. తర్వాత అందరికీ ఫొటోఫ్రేములను పంపించగా వారిని కదిలించిన స్టోరీలను చెప్పుకొచ్చారు. అరియానా తన అసలు పేరు అర్చన అని తెలిపింది. కానీ ఇది ఎవరికీ చెప్తాననుకోలేదని అంది. "మా అమ్మానాన్న లవ్ మ్యారేజ్. నేను కడుపులో ఉన్నప్పుడు విడిపోయారు. అమ్మ ఒక్కతే నన్ను, అక్కని పెంచింది. నాలుగు వేల జీతానికి యాంకరింగ్ చేశా. ఐదు వందలకు కూడా ఈవెంట్స్ చేశా. అలా అర్చన నుంచి అరియానాగా మారి ఇక్కడి వరకు వచ్చాను" అని చెప్పుకొచ్చింది. తన కుటుంబం అంటే ఇష్టమని చెప్పిన మోనాల్ బిగ్‌బాస్ తర్వాత ఇంకా ఎన్నో కుటుంబాలు తనకోసం ఉన్నాయని తెలిపింది. (చదవండి: నేను లేకపోతే ఏమైపోతావో: అవినాష్) సింగరేణి ముద్దుబిడ్డ బిగ్‌బాస్‌కు వచ్చిండు "సింగరేణిలో మా నాన్న పని చేస్తాడు. ఓసారి అండర్‌గ్రౌండ్‌లో తల మీద రాయి పడింది. దాని ప్రభావం ఈ మధ్య బయటపడింది. ఆయనకు తలలో రక్తం గడ్డకట్టింది. అంతకుముందే రోడ్డు ప్రమాదంలో ఒక కిడ్నీ పోయింది. అయినా ఉద్యోగం చేస్తూ మా ఐదుగురిని పెంచి పోషించాడు. నాన్నంటే నాకు చాలా ఇష్టం. సింగరేణి ముద్దుబిడ్డ సయ్యద్ సోహైల్ బిగ్‌బాస్‌కు వచ్చిండని మా నాన్న హ్యాపీగా ఫీలవుతాడు" అని సోహైల్ సంతోషించాడు. "మాది అద్దె ఇల్లు. తమ్ముడు కూరగాయలు అమ్మేవాడు. తల్లిదండ్రులు, తమ్ముడు నాకోసం కష్టపడేవారు. వాళ్లు బాగుంటే నాకంతే చాలు" అంటూ మెహబూబ్ భావోద్వేగానికి లోనయ్యాడు. అమ్మ అందరి ఇళ్లల్లో పని చేసేది: నోయల్ "నేను అమ్మతో క్లోజ్‌గా ఉంటాను. ఉన్న ఆస్తినంతా నాకిచ్చేస్తానని అమ్మ చెప్పింది. దీంతో అందరూ నాకు అమ్మను దూరం చేశారు. అమ్మకు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆస్పత్రికి వెళ్లాను. బతకడం కష్టమన్నారు. డబ్బు ఇచ్చి అమ్మను రెండేళ్లపాటు కాపాడుకున్నాను. డబ్బు ఎప్పుడైనా వస్తుంది, కానీ మనుషులను మిస్ అవ్వద్దు 'అని మాస్టర్ అందరికీ మంచి సందేశం ఇచ్చాడు. "అమ్మ అందరి ఇళ్లల్లో పని చేసేది. నాన్న చిరంజీవి ఫ్యాన్. నేను మొదటిసారి 'ఈగ' సినిమాలో కనిపించా. నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్ సినిమా రిలీజ్ అయినప్పుడు నాన్నను తీసుకుని థియేటర్‌కు వెళ్లాను. అందరూ నాతో ఫొటోలు దిగుతుంటే నాన్న షాకయ్యారు. కానీ తర్వాత నాన్నతో నేను సెల్ఫీ దిగాను" అని నోయల్ తెలిపాడు. (చదవండి: గంగవ్వలాగే నన్ను పంపించేయండి: నోయల్) నాన్న పేరు కూడా మర్చిపోయా: హారిక "అది నా ఇంటర్మీడియట్. అమ్మమ్మ ఇంటికి రమ్మంటే వెళ్లాను. అక్కడ మా అమ్మానాన్న విడిపోతున్నారని చెప్పారు. నాన్న దగ్గర ఉండమన్నారు. అమ్మ మాత్రం ఖాళీ బ్యాగుతో వెళ్లిపోయింది. ఆ తర్వాత ఒకరోజు నేను, అన్న అమ్మ దగ్గరకు వెళ్లిపోయాం. అలా ఐదు సంవత్సరాలుగా నాన్నకు చాలా దూరమొచ్చేశాను. ఓ సారైతే ఆయన పేరు కూడా గుర్తు రాలేదు. నాన్న.. మేమెప్పుడూ తిరిగి చూడలేదు, మీరెప్పుడు తిరిగి చూడలేదు. తిరిగి చూసినరోజు మేం ఆగిపోతాం. అందుకే మేం తిరగం. కానీ ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం. అమ్మా.. నువ్వు లేని రోజు నేను లేను, నాన్న లేని లోటు అన్న తీర్చాడు, అతడు నా వెన్నెముక" అని హారిక ఎమోషనల్ అయింది. కిచెన్‌లో దొంగలు పడ్డారు రాత్రి పూట కిచెన్‌లో దొంగలు పడ్డారు. హారిక, లాస్య పిస్తాలు దొంగతనం చేసి తినేశారు. తర్వాత వాటితో గవ్వలాట ఆడారు. అయితే వీరిని దూరం నుంచి చూసిన అఖిల్ ఒక్కసారిగా భయపెట్టాడు. తర్వాత ఈ ముగ్గురినీ నోయల్ భయపెట్టాడు. అంతా కలిసి అక్కడి వస్తువులను లాగించడమే పనిగా పెట్టుకున్నారు. ఈ విషయం కనిపెట్టిన దివి కూడా ఆ గ్యాంగ్‌లో చేరి దొరికినంత తినేసింది. (చదవండి: సుజాత ఎలిమినేట్, 'పోకిరీ'పై ప్రతీకారం) -
నాకొక గర్ల్‌ఫ్రెండ్ కావాలి: అఖిల్
బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు మొదటి రోజును మించిపోయేలా రెండో రోజు కఠినమైన డీల్స్ ఇచ్చాడు. అన్నీ చేసేందుకు తలాడించిన కంటెస్టెంట్లు అరగుండు, సగం గడ్డం గీసుకునేందుకు మాత్రం వెనకడుగు వేశారు. ఇక టాస్క్‌లో అఖిల్‌ను కష్టపెడుతుంటే చూడలేకపోయిన మోనాల్ అతడికి సాయం చేసేందుకు ముందుకు రావడంతో అభిజిత్ ఆమెపై మండిపడ్డాడు. కోపాన్ని చంపుకుంటున్న సోహైల్‌తో ఇంటిసభ్యులు గొడవ పడుతూ అతడి సహనాన్ని పరీక్షిస్తున్నారు. నాగార్జునకు ఇచ్చిన మాట కోసం సోహైల్ ఎవరి మీదా అరవలేక ఏడుపు రూపంలో బాధను బయటకు కక్కాడు. మరి నేటి ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో చదివేయండి.. బిగ్‌బాస్ నిన్న ఆరు డీల్స్ ఇవ్వగా అందులో అరియానా రెడ్ టీమ్, అఖిల్ బ్లూ టీమ్ చెరో మూడు పూర్తి చేశాయి. నేడు బిగ్‌బాస్ మరో ఐదు డీల్స్ ఇచ్చాడు. అవేంటంటే.. ఏడో డీల్: తల, గడ్డం సగం గీసుకోవాలి. చెల్లించాల్సిన నాణాలు: 40 మాస్టర్ ఈ టాస్క్ చేసేందుకు ముందుకు వచ్చాడు. అమ్మ చనిపోతే గుండు గీసుకోలేదని ఎమోషనల్ అయ్యాడు. అయితే అభిజిత్ వెళ్లి ఇది కెప్టెన్సీ కోసం కాదు, కెప్టెన్సీ పోటీదారుల కోసమేనని మాస్టర్‌తో చెప్పుకొచ్చాడు. మీరు గెలిచినా మళ్లీ కొట్లాడుకోవాల్సిందేనని తెలిపాడు. దీంతో మరోసారి ఆలోచనలో పడ్డ మాస్టర్ చేయలేనని చేతులెత్తేశాడు. అటు అరియానా టీమ్ కూడా ఈ డీల్‌ను తిరస్కరించడంతో బిగ్‌బాస్ దీన్ని రద్దు చేశాడు. ఎనిమిదో డీల్: పేడ కలిగిన బాత్‌టబ్‌లో దిగి 100 బటన్లను వెతికి తీయాలి. చెల్లించాల్సిన నాణాలు: 30 అఖిల్ గంట మోగించడంతో అతని టీమ్‌లో దివి ఈ టాస్క్ చేసేందుకు ముందుకు వచ్చింది. అఖిల్ ఆమె దగ్గర నిలుచుని పాటలు పాడుతూ ఎంకరేజ్ చేశాడు. తొమ్మిదో డీల్: ముఖానికి స్టాకింగ్ వేసుకుని దానిపై నుంచి అరటి పళ్లను తినాలి. చెల్లించాల్సిన నాణాలు: 10 అరియానా గంట మోగించడంతో అభిజిత్ ఈ చాలెంజ్ పూర్తి చేసేందుకు సిద్ధమయ్యాడు. కానీ ముఖానికి అంతటికీ స్టాకింగ్ పెట్టుకోకుండా అతి తెలివి ప్రదర్శించాడు. అయితే సంచాలకుడు అలా కుదరదని చెప్పడంతో అవినాష్ ముఖానికంతటికీ కప్పేసుకుని అరటిపండు నోటిలో కుక్కుకున్నాడు. పదో డీల్: గార్డెన్ ఏరియాలో ఉన్న ఒక కుర్చీలో ఒక సభ్యుడు కూర్చుని ఉండాల్సి ఉంటుంది. మిగతావాళ్లు అతడిని లేపే వరకు వాష్ చేస్తుండాలి. బిగ్‌బాస్ తదుపరి ఆదేశాల వరకు అతను అందులోనే కూర్చోవాలి. చెల్లించాల్సిన నాణాలు: 25 గంట మోగించిన అఖిల్ ఈ టాస్కు చేసేందుకు రెడీ అయ్యాడు. తర్వాత అతడిని డిస్టర్బ్ చేసేందుకు అందరూ సాయశక్తులా ప్రయత్నించారు. మోనాల్ అతడి గడ్డానికి బ్రష్‌తో పేస్ట్ రుద్దింది. తర్వాత అభిజిత్, అవినాష్ అతడికి చన్నీళ్లతో తలస్నానం చేయించారు. అయితే అఖిల్‌ను ఇబ్బంది పెడుతున్నాడని నోయల్ అనడంతో అవినాష్ ఇది టాస్క్‌లో భాగమని సీరియస్ అయ్యాడు. ఇక కళ్లలోకి షాంపూ పోతుందని మోనాల్ నీళ్లు గుమ్మరించడంతో అభి, మెహబూబ్ ఏం చేస్తున్నావని మండిపడ్డారు. నోయల్ కూడా ముందుకొచ్చి అతనికి కళ్లు తుడుస్తుంటే సంచాలకుడిగా సోహైల్ గుంభనంగా ఉండటాన్ని అవినాష్ ప్రశ్నించాడు. (చదవండి: కథ వేరే ఉంటది: మాస్టర్‌కు సోహైల్ వార్నింగ్) సంచాలకుడిగా నువ్వు కరెక్ట్ కాదు: అవినాష్ దీంతో సోహైల్ ఎవరూ అఖిల్ దగ్గరకు రావడానికి కూడా ఒప్పుకోలేదు. అయినా సరే అవినాష్ మాత్రం ఆవేశంతో ఊగిపోయాడు. దివి టబ్‌లో నుంచి ఒకసారి దిగినప్పుడు కూడా ఏమీ చేయలేదని విమర్శించాడు. సంచాలకుడిగా నువ్వు కరెక్ట్ కాదని అనేశాడు. 'బిగ్‌బాస్.. ఇలానే జరిగితే నేను టాస్కులు ఆడను, కావాలంటే ఎలిమినేట్ చేసేయండి, నాకు క్లారిటీ లేకపోతే బాగోదు' అని వార్నింగ్ ఇచ్చాడు. 'ఎవడు బే ఆడుతోంది సేఫ్ గేమ్' అంటూ నోరు జారాడు. దీంతో సోహైల్‌కు కోపం వస్తోందని గ్రహించిన అఖిల్ అతడిని పక్కకు తీసుకువెళ్లాడు. కానీ ఆవేశం పట్టలేక చేయిని కుర్చీకి బాదుకున్నాడు. నాగ్ సర్‌కు ప్రామిస్ ఇచ్చినందుకే తాను అరవట్లేదు అని తన బాధను చెప్పుకొచ్చాడు. పదకొండో డీల్: ఎవరైనా ఒకరు తరువాతి వారం నేరుగా నామినేట్ అవ్వాలి. చెల్లించాల్సిన నాణాలు: 30 అఖిల్ ముందుగా గంట కొట్టడంతో అతని టీమ్‌లో నుంచి నోయల్ నామినేట్ అవుతానని చెప్పాడు. ఇంతటితో డీల్స్ ముగిసిపోగా అఖిల్ 'రెడ్' టీమ్ గెలిచినట్లు సోహైల్ ప్రకటించాడు. తర్వాత సోహైల్‌కు ప్లేటులో అన్నం పెట్టుకున్నాడే కానీ బాధతో ముద్ద దిగడం లేదు. ఇది గమనించి అఖిల్ దగ్గరకు వెళ్లగా సోహైల్ చంటి పిల్లాడిలా కన్నీళ్లు పెట్టుకున్నాడు. 'అందరూ అన్నా కూడా పడుతున్నా, ఇంకా ఏం చేయాలి, నాకేం అర్థం కావట్లేద'ని దుఃఖించాడు. దీంతో అఖిల్ వెక్కి వెక్కి ఏడుస్తున్న అతడి కన్నీళ్లు తుడిచాడు. మెహబూబ్ దగ్గరుండి స్నేహితుడికి గోరు ముద్దలు తినిపించాడు. (చదవండి: నోయల్‌కు మోనాల్ హగ్: షాక్‌లో అభిజిత్) గర్ల్‌ఫ్రెండ్ కావాలంటూ అఖిల్ పాటలు తర్వాతి రోజు మధ్యాహ్నం వర్షంలో హారిక, దివి గొడుగు కింద ఆటలాడారు. మరోవైపు అవినాష్.. అరియానాతో కాసేపు చిలిపి సంభాషణలు జరిపాడు. అరియానాను దగ్గరకు రమ్మంటూ పిలిచి సైగలు చేయబోయాడు. సైగలేవీ వద్దు, డైరెక్ట్‌గా చెప్పు అని అరియానా వారించడంతో 'యూ సో కూల్' అని మరోసారి చెప్పుకొచ్చాడు. ఇక మోనాల్, అఖిల్ బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నామన్న విషయాన్నే మర్చిపోయి మరో లోకంలో విహరించారు. ఒకరినొకరు కాసేపు ఆట పట్టించుకున్నారు. నాకో గర్ల్‌ఫ్రెండ్ కావాలి.. అని అఖిల్ పాట పాడాడు. తర్వాత మళ్లీ తనెప్పుడూ పాడే "మొన్న కనిపించావు, మైమరిచిపోయాను.." అంటూ పాట ఎత్తుకున్నాడు. (చదవండి: నామినేషన్స్ పిచ్చ లైట్: నోయల్) రెండోసారి కెప్టెన్ అయిన నోయల్ బిగ్‌బాస్ కెప్టెన్సీ పోటీదారులకు "కొట్టు- తలతో ఢీ కొట్టు" అనే టాస్క్ ఇచ్చాడు. దీనికి అవినాష్ సంచాలకుడిగా వ్యవహరించాడు. తలకు బ్యాటు కట్టుకుని వారికి కేటాయించిన కలర్ బాల్స్‌ను నెట్లో వేయాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో నోయల్ గెలవడంతో అతడు రెండోసారి కెప్టెన్ అయ్యాడు. కానీ అమీతుమీ టాస్క్‌లో నేరుగా నామినేట్ అయినందున తర్వాతి వారంలో అతడికి ఇమ్యూనిటీ లభించదని బిగ్‌బాస్ స్పష్టం చేశాడు. దీంతో నోయల్ తర్వాతి వారం నామినేషన్ నుంచి తప్పించుకోలేకపోయాడు. అనంతరం నోయల్.. మెహబూబ్‌ను రేషన్ మేనేజర్‌గా ప్రకటించాడు. (చదవండి: బిట్టు అని పిలవడం ఇష్టమేనా అని అడిగారు: సుజాత) -
గంగవ్వలాగే నన్ను పంపించేయండి: నోయల్
బిగ్‌బాస్ నాల్గో సీజన్లో సెలబ్రిటీ కంటెస్టెంట్లు నోయల్, లాస్య. ఇద్దరికీ మంచి ఫాలోయింగ్ ఉంది, కానీ స్క్రీన్ స్పేస్ మాత్రం లభించట్లేదు. లాస్య వంటింటి కుందేలుగా మారిపోగా, నోయల్ నీతి సూక్తులు చెప్తూ బాబా అవతారం ఎత్తాడు. ఆటలో ఇరగదీస్తాడనుకుంటే ఇలా మారిపోయాడేంటని నోయల్ అభిమానులు డీలా పడిపోయారు. నిజానికి షో ప్రారంభంలో కాస్త ఎగిరెగిరి పడ్డాడు. కట్టప్ప టాస్క్‌లో ఇతరులను నొప్పించడం ఇష్టం లేదంటూ తనకు తానే కట్టప్ప అని ప్రకటించేసుకుంటూ నవ్వులపాలయ్యాడు. వేరే వ్యక్తి పేరు చెప్పాలని బిగ్‌బాస్ హెచ్చరించడంతో మాస్టర్ ఫీల్ అవడంటూ అతన్ని కట్టప్పగా పేర్కొన్నాడు. మొన్నటికి మొన్న మాస్టర్నే నామినేట్ చేశాడు. (చదవండి: బిగ్‌బాస్ జంట ఫోటోలు మళ్లీ వైరల్!) నిజమైన నోయల్ ఎక్కడ? ఈ మధ్యలో అతను పెద్దగా ఆటను రఫ్ఫాడించినట్లు ఎక్కడా కనిపించలేదు. పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. అందరూ మాస్కులు తీసేసినా నోయల్ మాత్రం ఇంకా మాస్కు పెట్టుకున్నాడన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతెందుకు, అతడు సేఫ్ గేమ్ ఆడుతున్నాడని, నిజమైన నోయల్ కనిపించడం లేదని దివి కూడా ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే సోమవారం జరిగిన నామినేషన్స్‌లో అతన్ని టార్గెట్ చేయడంపై నోయల్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు బిగ్‌బాస్ అన్‌సీన్ వీడియోలో స్పష్టమవుతోంది. ఈ నామినేషన్స్ గురించి నోయల్ అభిజిత్‌తో మనసు విప్పి మాట్లాడాడు. (చదవండి: చిన్నపిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చిన సోహైల్) మాస్టర్‌కు టార్గెట్ అయ్యాను "నామినేషన్ పిచ్చ లైట్. ఒక్క ఓటు వచ్చినా కూడా నామినేట్ అన్నప్పుడు నోయల్ ముఖం మాడిపోయింది అని మాస్టర్ అంటున్నాడు. కానీ, నేను మెడికల్ రూమ్‌లోకి వెళ్లినప్పుడు నా కాల్ తీసుకోండి, ప్లీజ్ గంగవ్వను పంపించినట్లు నన్ను పంపించండి అని కోరాను. నామినేషన్ ద్వారా వెళ్లినా, అలా నేరుగా వెళ్లినా ఒక్కటే. దానికి ఎందుకు ఫీలవుతాను. కానీ మాస్టర్ మంచిగా ఆలోచించడం లేదు. మాస్టర్‌ను నామినేట్ చేసినందుకు టార్గెట్ అయ్యాను. దివి ఎందుకు నన్ను నామినేట్ చేసిందో కూడా తెలుసు" అని నోయల్ చెప్పుకొచ్చాడు. అయితే నోయల్ వ్యాఖ్యలపై ఆయన అభిమానులు అసహనానికి లోనవుతున్నారు. టాప్ 5లో నిలబెట్టేందుకు మేమంతా ప్రయత్నిస్తుంటే గంగవ్వలా బయటకు వచ్చేస్తానంటాడేంటి? అని నిరుత్సాహపడుతున్నారు. (చదవండి: తెలుగు బిగ్‌బాస్‌లో ఆవేశం స్టార్లు ఎవరో తెలుసా?) -
ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: అవినాష్
కొద్ది రోజులుగా ఎడమొహం, పెడమొహం అన్నట్లుగా ఉన్న అఖిల్, మోనాల్ కలిసిపోయారు. ఇంటిసభ్యులు వారికి జరిగిన సంఘటనలను చెప్తూ ఎమోషనల్ అయ్యారు. రాత్రి వచ్చేసరికి మాత్రం పాటల అంత్యాక్షరిలో ఎంజాయ్ చేశారు. లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో మెహబూబ్, అఖిల్ పోటీపడ్డారు. మరోవైపు బిగ్‌బాస్ ఆత్మ అవినాష్‌లోకి వచ్చి ఇంటి సభ్యులందరి గురించి చెప్పింది. మరి ఆ ఆత్మ ఏం చెప్పింది? లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో ఎవరు గెలిచారు? అనే విషయాలను చదివేసేయండి.. అమ్మ నా బెస్ట్ ఫ్రెండ్: నోయల్ హౌస్‌లో ఐదో కెప్టెన్‌గా ఎన్నికైన సోహైల్‌కు బిగ్‌బాస్ మొదటిరోజే పరీక్ష పెట్టాడు. నీటి సరఫరా ఆగిపోవడంతో సోహైల్ తన ఇజ్జత్ తీయొద్దని వేడుకున్నాడు. అతని మొర ఆలకించిన బిగ్‌బాస్ వెంటనే నీళ్లను పంపించాడు. తర్వాత మార్నింగ్ మస్తీలో ఇంటిసభ్యులందరూ మనసులో ఉండిపోయిన తమ సందేశాలను తెలియజేయాల్సి ఉంటుందన్నాడు. అందులో భాగంగా నోయల్ తన అమ్మ గురించి చెప్పుకొచ్చాడు. 207 ఎముకలు విరగ్గొడితే ఎంత నొప్పి ఉంటుందో పురిటి నొప్పి అంత తీవ్రంగా ఉంటుందని వివరించాడు. అందుకే తన కాలి నొప్పిని నేను టాస్కులో ఎప్పుడూ లెక్కచేయలేదన్నాడు. తన బెస్ట్ ఫ్రెండ్ అమ్మ అని, తనను తల ఎత్తుకునేలా చేస్తానని సగర్వగా ప్రకటించాడు. దీంతో లాస్యకు జున్ను గుర్తొచ్చి కన్నీళ్లు పెట్టుకుంది. (చదవండి: అతిథుల టార్చర్.. కుప్పకూలిన అభి) ఇంటి కోసం అప్పు చేశాను: అవినాష్ అవినాష్ మాట్లాడుతూ.. "నేను పేరెంట్స్, ప్రేక్షకులను మాత్రమే నమ్ముతా. లాక్డౌన్లో ఆత్మహత్య చేసుకుందామనుకున్నా. ఎందుకంటే ఇల్లు కొన్నాను, కానీ ఈఎమ్ఐ కట్టలేకపోయాను. ఎందుకంటే అదే సమయంలో నాన్నకు గుండెపోటు వచ్చింది. మూడు స్టంట్లు వేయడానికి ఇంటి కోసం ఉంచిన 4 లక్షలు ఖర్చు పెట్టాను. అమ్మకు కీళ్లు అరిగిపోతే వైద్యం చేయించాను. దీంతో ఇంటి అప్పు తీర్చేందుకు బయట అప్పు చేశాను. కానీ ఇదంతా నా పేరెంట్స్ కోసమే చేశాను. వాళ్లు పోయినప్పుడు బాధపడకుండా ఉన్నప్పుడే వారికి గౌరవం ఇవ్వండి. ఓల్డ్ ఏజ్ హోమ్‌లో పెట్టకండి. వాళ్లతో కలిసి ఉండండి అని కోరుతూ ఓ మంచి సందేశాన్ని వినిపించాడు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న అవినాష్‌పై మాస్టర్ మండిపడ్డాడు. తాను రూ.6 కోట్ల ఇల్లు కట్టాను, కానీ అమ్మేశాను, కష్టాలు అలా ఉంటాయి అని సముదాయించాడు. బిడ్డ శవం ఎత్తుకుని వెళ్తే బస్సెక్కనియ్యలే తర్వాత గంగవ్వ మాట్లాడుతూ.. "ఐదేళ్లప్పుడే పెళ్లి. 17 ఏళ్లకే కొడుకు. ఇంకో రెండేళ్లకే కూతురు పుట్టింది. తాగి కొట్టే భర్త విదేశాలకు పోయిండు. ఓ రోజు నా కూతురుకు ఫిట్స్ రావడంతో ఆమెను ఎత్తుకుని నడక ప్రారంభించాను. అప్పుడు ఊర్లోకి బస్సు వచ్చేది కాదు. కానీ ఊరి నుంచి వెళ్లే ఓ బండి నన్ను చూసి ఎక్కించుకుంది. అలా జగిత్యాల ఆస్పత్రికి వెళ్లాను. అక్కడ ఆమె చనిపోయిందని చెప్పగానే బిడ్డను ఎత్తుకుని వెనుదిరిగాను. బస్ ఎక్కబోతే శవంతోని లోపలకు రానీయలేదు. ఆటోలో ఇంటికి వెళ్లాను" అని ఏడ్చేసింది. తర్వాత మళ్లీ అన్నం తినలేకపోతున్నానని గంగవ్వ కన్నీళ్లు పెట్టుకుంది. (చదవండి: బిగ్ బాస్ : సీక్రెట్ టాస్క్ అవినాష్ కొంప ముంచేనా?) లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో గెలుపొందిన మెహబూబ్ బిగ్‌బాస్ ఇంటిసభ్యులకు లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో అఖిల్, మెహబూబ్ పోటాపోటీగా ఆడారు. తర్వాత గెలిచిన మెహబూబ్ మోనాల్‌తో మసాజ్ చేయించుకున్నాడు. ఇక అఖిల్ కొద్దిరోజులుగా దూరం పెట్టిన మోనాల్‌తో మాట్లాడి ఆమెను కూల్ చేశాడు. కానీ దేవుడి మీద నమ్మకం ఉంది గానీ నీ మీద లేదని మోనాల్ మొహం మీదే చెప్పేశాడు. బిగ్‌బాస్ ఈసారి ఓ క్రేజీ టాస్క్ ఇచ్చాడు. బిగ్‌బాస్‌ను ప్రసన్నం చేసుకోవాలని, అతని ఆత్మను రప్పించాలని చెప్పాడు. ఆ ఆత్మ అవినాష్ శరీరంలోకి వస్తుందని తెలిపాడు. వెంటనే ఇంటి సభ్యులందరూ బిగ్‌బాస్ ఆవాహయామి అంటూ చేతులు పట్టుకుని వలయాకారంలో అవినాష్ చుట్టూ తిరిగారు. వెంటనే ఉరుములు, మెరుపులతో బిగ్‌బాస్ ఆత్మ అవినాష్ శరీరంలోకి వచ్చింది. అతడు ఇంటి సభ్యులు ఒక్కొక్కరి గురించి వివరంగా చెప్పాడు. (చదవండి: బిగ్‌బాస్: గంగవ్వ భజన చూడలేక..) ఐ లవ్ యూ : దివి నోయల్‌ను కుంటడం మానేయమని, సుజాతను చిన్న చిన్న విషయాలకు అలగడం మానేయాలని చెప్పాడు. మోనాల్ తెలుగులో చక్కగా మాట్లాడుతుందని మెచ్చుకున్నాడు. ఇక గంగవ్వ మాత్రం అవినాష్(బిగ్‌బాస్)కు ఓ కోడిని కోసి పెడతా, ఇంటికి రా అని చెప్పింది. తర్వాత సోహైల్‌ను గట్టిగా మాట్లాడటం తగ్గించండని చెప్పాడు. దివి బిగ్‌బాస్‌కు ఐ లవ్ యూ చెప్పడంతో కాసేపు మెలికలు తిరిగాడు. మెహబూబ్ బాగా ఆడుతున్నాడని, కానీ కోపానికి వస్తున్నారని అన్నాడు. హారిక ముద్దులతో సైగలు ఇవ్వగా అవినాష్‌కు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇక హోటల్ టాస్క్‌లో అవినాష్‌ను బాగా టార్చర్ పెట్టావని అరియానాను తిడుతూనే, ముక్కుసూటి మనిషి అని మెచ్చుకున్నాడు. ఈ వయసులో కూడా బాగా ఆడుతున్నాడని మాస్టర్‌పై సెటైర్ వేశాడు. అనంతరం మళ్లీ మెరుపులతో బిగ్‌బాస్ ఆత్మ అవినాష్ నుంచి వెళ్లిపోయింది. మోనాల్‌కు దివి, మాస్టర్ సలహాలు తర్వాత గంగవ్వతో ముచ్చట్లు పెట్టుకుంటుంటే మధ్యలో వచ్చినందుకు అవినాష్‌ను సుజాత ఒక్కటిచ్చింది. రాత్రి ఇంట్లో అంత్యాక్షరి జరిగింది. మాస్టర్, అవినాష్, అరియానా, సోహైల్ పాటలు పాడాడు. ఈ పాటల పోటీ ముగిశాక దివి మోనాల్‌కు కొన్ని సూచనలు చేసింది. మోనాల్‌కు నేనంటే ఇష్టమని ఇద్దరు అబ్బాయిలు(అభిజిత్, అఖిల్) ఫీల్ అవుతున్నారు అని ఆమె చెవిన వేసింది. నేనలా చెప్పలేదని, నా పేరు వాడొద్దని మాత్రమే చెప్పానని మోనాల్ తెలిపింది. అఖిల్‌తో ఉంటే ఏం కాదు కానీ, అభిజిత్‌తో ఉండొద్దని మాస్టర్ ఉచిత సలహా ఇచ్చాడు. ఇద్దరూ జెన్యూన్, నువ్వే వాళ్లకు క్లారిటీ ఇవ్వు అని దివి చెప్పుకొచ్చింది. (చదవండి: నేను పెళ్లి చేసుకోడానికి రాలేదు: అఖిల్) -
'అమ్మో' రాజశేఖర్, మళ్లీ శాపం పెట్టాడు!
బిగ్‌బాస్ అనేది రియాలిటీ షో. ఇక్కడ నామినేషన్ ప్రక్రియ అయినా, గేమ్ అయినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటన్నింటినీ ఎదురీదుకుంటూ స్పోర్టివ్‌గా ముందుకెళ్లాలి. కానీ ఇప్పుడున్న 15 మందిలో ఒక్కరికి మాత్రం ఈ స్పోర్టివ్‌నెస్ అనేది ఇసుమంతైనా లేదు. అందరూ గురువు, డాడీ అని పిలుచుకుంటూ యసుకు పెద్దరికం ఇస్తుంటే అమ్మ రాజశేఖర్ మాత్రం ఏదో బాబాలా ఫీల్ అయిపోతున్నాడు. అతనేం చేసినా కరెక్టే కానీ ఇతరులు చేస్తే మాత్రం తప్పని వాదిస్తున్నాడు. పోనీ తప్పని చెప్తే సరిపోతుంది, కానీ అక్కడితో ఆగకుండా శాపనార్థాలు పెడుతున్నాడు. మొదట సోహైల్ మీద విరుచుకుపడ్డాడు. (చదవండి: మాస్టర్‌పై ప్రతీకారం తీర్చుకున్న స్వాతి దీక్షిత్) నిన్న నామినేట్ చేసినందుకు అరియానా మీద ప్రతాపాన్ని చూపించాడు. ఇప్పుడు స్వాతి విషయంలో నామినేట్ చేసినందుకు నోయల్‌పై నోరు పారేసుకున్నాడు. నోయల్ స్వాతి గురించి చెప్పడం మొదలు పెట్టగానే విసుగు ప్రదర్శించాడు. వేరే ఎవరికైనా చెప్పుకో పో అన్నాడు. అమ్మాయి అయినా, అబ్బాయైనా నేనలానే ఉంటానని నోయల్ అనడంతో చిన్నపిల్లలకు చెప్పుకో, ఎందుకు నన్ను మళ్లీ మళ్లీ చంపేస్తున్నావ్ అని కోపగించుకున్నాడు. (చదవండి: బిగ్‌బాస్ షో నుంచి వైదొలుగుతా: నోయల్) "నేను ఇంట్లో ఉండకూడదు అని ప్లాన్ చేశావు, నీ కోసం ఈ వారం నేను బయటకు వెళ్లాలి, అది నువ్వు జీవితాంతం బాధపడాలి" అని శాపనార్థాలు పెట్టాడు. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్లు మాస్టర్ ఓవర్ యాక్టింగ్ నానాటికీ భరించలేనంతగా పెరిగిపోతుందని, అతడిని వెంటనే పంపించేయాలని నెటిజన్లు అంటున్నారు. ఎవరైనా తనను నామినేట్ చేస్తే చాలు, జన్మ అంతా ఫీల్ అవుతావ్ అని శాపాలు పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ సారి డబుల్ ఎలిమినేషన్ పెడితే ఆ సుజాతను, ఈ అమ్మో రాజశేఖర్‌ను హౌస్ నుంచి బయటకు పంపించేస్తామని చెబుతున్నారు. (చదవండి: నేడే ఎలిమినేషన్: స్వాతి దీక్షిత్ అవుట్) -
బిగ్‌బాస్‌కు స్వాతి గుడ్‌బై, మోనాల్‌పై అపనింద
మొన్న జరిగిన కాయిన్ల టాస్క్ గురించి నాగ్ పంచాయితీ పెట్టారు. ఈ గేమ్‌లో ఎవరెవరికి ఎవరు దోషులుగా అనిపించారనేది గేమ్ ఆడించారు. కాయిన్ల వేటలో విలన్‌గా మారిన సోహైల్, మెహబూబ్‌లను బాగా ఆడారని మెచ్చుకున్నారు. నోరు తెరిస్తే చాలు ఇంగ్లీషు ముక్కలే మాట్లాడుతున్న హారిక, అభిజిత్‌లకు శిక్ష విధించారు. నేటి ఎపిసోడ్లో సేఫ్ జోన్ కంటెస్టెంట్లను ప్రకటించకుండా నేరుగా స్వాతి దీక్షిత్‌ను ఎలిమినేట్ చేయడం గమనార్హం. ఊహించని పరిణామానికి ఇంటిసభ్యులు షాక్‌కు లోనయ్యారు. బిగ్‌బాస్ షోలోని నేటి ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో చదివేసేయండి.. ఇంటి సభ్యులతో దొంగా పోలీసు ఆట ఎప్పటిలాగే మళ్లీ సుజాత నాగ్‌ను బిట్టు అని పిలుస్తూ, కిలకిలమని నవ్వుతూ ఉండగా షో ప్రారంభమైంది. ఇక ఈ వారం టాస్క్ ఎందుకు ఆడలేదని నాగ్ గంగవ్వను ప్రశ్నించారు. తనకు చేత కావడం లేదని ఆమె చెప్పడంతో తర్వాత నుంచి బాగా ఆడాలని హితవు పలికారు. నోయల్ నేర్పిన తెలుగు ర్యాప్ సాంగ్‌ను మోనాల్ పాడి అందరినీ ఆకట్టుకుంది. అనంతరం ఇంటి సభ్యులతో దొంగా పోలీసు ఆట ఆడించారు. అరియానా.. అమ్మ రాజశేఖర్‌ను దోషిగా నిలబెట్టగా అతడిని మిగతా ఇంటి సభ్యులు నిర్దోషిగా తేల్చి చెప్పారు. సుజాత.. సోహైల్‌ను దోషిగా బోనులో నిలబెట్టింది. కానీ నాగ్ మాత్రం సోహైల్‌కు సపోర్ట్ చేస్తూ, బాగా ఆడావని మెచ్చుకున్నారు. ఇంటి సభ్యులు కూడా అతడిని నిర్దోషిగా ప్రకటించారు. అమ్మ రాజశేఖర్ కూడా సోహైల్నే దోషిగా నిలబెట్టగా ప్రతీ ఒక్కరూ అతడు నిర్దోషి అనే ప్రకటించారు రుజువు చేశారు. కుమార్ సాయి.. అమ్మ రాజశేఖర్‌ను దోషిగా అన్నప్పటికీ హౌస్మేట్స్ ఆయన్ను అమాయకుడిగా ప్రకటించారు. (చదవండి: బిగ్‌బాస్: లక్ష రూపాయలు పట్టేసిన గంగవ్వ) హారిక, అభిజిత్‌కు పనిష్మెంట్ ఎప్పుడూ ఇంగ్లీషులోనే మాట్లాడుతున్నందుకు అభిజిత్, హారికకు నాగ్ క్లాస్ పీకారు. రాకపోయినా తెలుగులో మాట్లాడుతున్నావని మోనాల్‌ను మెచ్చుకుంటూనే ఈ ఇద్దరికీ అక్షింతలు వేశారు. ఇంగ్లీషులోనే వాగేస్తున్న అభిజిత్, హారికల వీడియోను నాగ్ ప్లే చేశారు. దీంతో ఏం చెప్పాలో అర్థం కాని అయోమయంలో పడిపోయిన అభిజిత్ తన ఆలోచనలను తెలుగులో చెప్పడానికి సమయం పడుతుందని, అందుకే ఇంగ్లీషులో మాట్లాడానని తప్పును కప్పి పుచ్చే ప్రయత్నం చేశాడు. మీరు మాట్లాడేది చాలామందికి అర్థం కావడం లేదని అసహనం వ్యక్తం చేసిన నాగ్ ఈ రోజు ఎపిసోడ్ పూర్తయ్యేంతవరకు వీరిద్దరూ నిల్చునే ఉండాలని శిక్ష విధించారు. అనంతరం సోహైల్.. దివిని దోషని చెప్పగా.. ఆమెను నిర్దోషిగా రుజువు చేశారు. తర్వాత దివి సోహైల్నే దోషి అని ప్రకటించింది. అనంతరం అఖిల్.. మాస్టర్‌ను దోషిగా నిలబెట్టగా అందరూ అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అవినాష్.. దివిని దోషిగా బోనులోకి రమ్మనగా ఆమె బాగా ఆడలేదని అందరూ పెదవి విరిచారు. అనంతరం అరియానా, అవినాష్‌ల సీక్రెట్ వ్యవహారాన్ని నాగ్ బయటపెట్టారు. నువ్వు చాలా కూల్ అని అరియానా గురించి రాశాడని నాగ్ వెల్లడించారు. (చదవండి: నాతో జీవితంలో మాట్లాడకు: అమ్మ రాజశేఖర్) ట్రయాంగిల్ లవ్ స్టోరీపై చర్చ లాస్య.. స్వాతిని దోషిగా చెప్పగా నాగ్ కూడా అదే అభిప్రాయాన్ని తెలిపారు. నోయల్ దోషిగా నిలబెట్టిన సుజాతనే మిగతావారందరూ దోషిగా తేల్చారు. మెహబూబ్.. లాస్య సేఫ్ గేమ్ ఆడిందని చెప్పగా అదే నిజమని రుజువైంది. మోనాల్.. అభిజిత్‌ను దోషిగా నిలబెట్టగా అందరూ అవునని చెప్పారు. తర్వాత హౌస్‌లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ గురించి చర్చ మొదలైంది నువ్వంటే ఇష్టం అని మోనాల్.. అభికి చెప్పిన విషయాన్ని దివి బయటపెట్టింది. అఖిల్ పడుకున్నాకే అభి దగ్గరకు వచ్చి మాట్లాడుతుందని చెప్పుకొచ్చింది. ఈ విషయంలో అభిపై జోకులు వేశామని తెలిపింది. కానీ ఆమె చెప్పిన పాయింట్లకు బాధపడ్డ మోనాల్ కన్నీళ్లు పెట్టుకుంటూ దీన్ని ట్రయాంగిల్ చేయకండి, తన క్యారెక్టర్ కించపర్చకండంటూ బోరున ఏడ్చేసింది. కాయిన్ల టాస్క్‌లో పాల్గొననందుకు గంగవ్వ, తెలుగు మాట్లాడనందుకు శిక్ష అనుభవిస్తున్న అభి, హారికలకు ఈ గేమ్ ఆడేందుకు చాన్స్ ఇవ్వలేదు. తర్వాత స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. దీంతో నోయల్ చిన్నపిల్లాడిలా ఏడ్చాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బిగ్‌బాస్: లక్ష రూపాయలు పట్టేసిన గంగవ్వ
ఐపీఎల్, కరోనాను ఎదుర్కొని ప్రేక్షకులకు బిగ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు బిగ్‌బాస్ సీజన్ 4 తమ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. టాస్క్‌లు, ట్విస్టులు, నామినేషన్లు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో భారీ స్థాయిలో వినోదాన్ని పంచుతోంది. ఇక బిగ్‌బాస్ ఇంటి హౌజ్‌లో 26వ రోజు సందడి సందడిగా సాగింది. ఉదయాన్నే హుషారైన పాటకు అందరూ ఎనర్జిటిక్‌గా డ్యాన్స్‌లు చేశారు. మార్నింగ్ మస్తీలో భాగంగా ఇంటి సభ్యులందరికి మెహబూబ్ డ్యాన్స్ స్టెప్పులు నేర్పిస్తున్నాడు. ఇంటి సభ్యుల్లో కొంతమందికి మాత్రమే లగ్జరీ బడ్జెట్ లభించింది. ష్యాషన్ షోలో ర్యాంప్ వాక్‌లతో అలరించారు. ఇంకేం జరిగిందంటే.. చపాతి స్టెప్ చేసిన మెహబూబ్ లాస్య ఎక్కువగా కిచెన్ వర్క్ చేస్తుంటుంది. కిచెన్‌లో ఆమె చేసే చపాతిని డ్యాన్స్ రూపంలో చేసి చూపించాడు మెహబూబ్. అవినాష్ కాలుకు దెబ్బ తగలడంతో కాలు కదలకుండా, అఖిల్ లాగా వర్కౌట్స్ ఎలా చేయాలో డ్యాన్స్ చేయాలో చేసి చూపించాడు. వీటితోపాటు ఇంట్లో కోపిష్టిగా పేరు తెచ్చుకున్న సోహైల్ ఆగ్రహంతో ఏ విధంగా డ్యాన్స్‌లు చేయాలో చూపించాడు. మాస్టర్‌తో కలిసి కాంచనలా మారి స్టెప్పులు వేశాడు. గంగవ్వ, స్వాతి, కుమార్ సాయి.. ఇలా ఇంట్లోని వారందరితోనూ ఏదో ఒక విధంగా డ్యాన్స్ చేపించాడు. అవినాష్ తనలోని మిమిక్రీ టాలెంట్‌ను ప్రదర్శించాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు సినిమాలోని విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ వాయిస్‌ను మిమిక్రీ చేసి చూపించాడు. చదవండి : అఖిల్‌కు బిగ్‌బాస్ ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటి? కన్ఫెషన్ రూమ్‌లోకి అఖిల్ ఇంటి సభ్యులంతా హాల్లో కూర్చొని ఉండగా అఖిల్‌ను బిగ్‌బాస్ కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిపించాడు. ఆ రూమ్‌లోకి వెళ్లిన అఖిల్ మిగతా ఇంటి సభ్యులకు కనిపించనున్నాడు. ఈ వారం రేషన్ మేనేజర్‌గా అఖిల్ ఎన్నికైనందున అతనికి లగ్జరీ బడ్జెట్ షాపింగ్ చేయాలి. లగ్జరీ బడ్జెట్ సామాన్ల లిస్ట్‌ను అందించి, తమ దగ్గర ఉన్న 3200 పాయింట్లో ఒక్కొక్కరికి ఒక్కో వస్తువు చొప్పున16 ఎంపిక చేయాలి. లాస్యకు చికెన్ పచ్చడి, నోయల్‌కు బ్రెడ్, నూడుల్స్ సోహైల్, పోహ మెహబూబ్, పన్నీర్ మోనాల్, మాస్టర్‌కు శనగపిండి, కార్నఫ్లెక్స్ గంగవ్వకు కేటాయించాడు. కన్ఫేషన్ రూమ్ నుంచి బయటకు వచ్చాక తమకు ఏ వస్తువులు రాని ఇంటి సభ్యులు కొంత నిరాశ చెందాడు. అఖిల్ వేరే విధంగా ప్లాన్ చేసి ఉంటే బాగుండని అనుకున్నారు. చదవండి : బిగ్‌బాస్: అదిరేటి డ్రెస్ మేమేస్తే.. పిచ్చెక్కించిన ఫ్యాషన్ షో ఇంట్లోని సభ్యులందరికి కొత్త బట్టలు వచ్చాయి. చందన బ్రదర్స్ పంపించిన దుస్తులను ధరించి అందంగా తయారు అవ్వాలి. అనంతరం చందన బ్రదర్స్ ఫ్యాషన్ టాస్క్ చేయాలి. ఈ టాస్క్‌లో ర్యాంప్ వాక్ చేయాలి. ఇందులో మంచిగా చేసిన ఒక అబ్బాయి, అమ్మాయిని విజేతగా ప్రకటించి వారికి లక్ష రూపాయల గిఫ్ట్ వోచర్‌ను అందించాలి. ర్యాంప్ వాక్‌లో అబ్బాయిలందరూ ఒక్కొక్కరూ వచ్చి తమదైన స్టైల్లో వాక్ చేశారు. ఆ తర్వాత అమ్మాయిలందరూ అందంగా ర్యాంప్ వాక్ చేసి అబ్బాయిల గుండెల్లో మంటలు రేపారు. కుందనపు బొమ్మలా కనిపించారు. అమ్మాయిల నుంచి గంగవ్వను ఏకగ్రీవంగా విజేతగా ప్రకటించగా..అవ్వకు లక్ష రూపాయల గిఫ్ట్ వోచర్ అందించారు. అబ్బాయిల నుంచి అవినాష్‌ను విజేతగా తెలిపారు. బిగ్‌బాస్: అదిరేటి డ్రెస్ మేమేస్తే.. అద్దంలా మారిన అవినాష్ ఇంట్లోని అమ్మాయిలకు అందంగా తయారు అవ్వడం మహా ఇష్టం. ఈ క్రమంలో అవినాష్ అమ్మాయిలకు అద్దంగా వ్యవహరించనున్నాడు. ప్రతి అమ్మాయి అద్దం(అవినాష్) ముందుకు వచ్చి తమ మనసులోని ఫీలింగ్స్‌ను చెప్పుకోవాలి. ఇందులో అవినాష్ తన దగ్గరకు వచ్చిన వారిలో ఒక్కొక్కరిని ఒక్కో విధంగా ఆటాడుకున్నాడు. వాళ్లపై పంచ్‌లు వేస్తూ వారిని సరదాగా అలరించాడు. చివరగా ర్యాంప్ వాక్ షో లో ఎవరూ ఎలా చేశారో ఇమిటెట్ చేసి చూపించారు. అయితే సుజాత బుంగమూతి పెట్టుకుని అలిగింది. ఈ నెపంతో లాస్య, సుజాతకు మధ్య చిన్నగా వివాదం మొదలైంది. విన్నర్‌గా ముందు నోయల్‌ను చెప్పి ఆ తరువాత అవినాష్‌ను ప్రకటించినదని లాస్య సుజాత మధ్య గొడవ అయ్యింది. తర్వాత అవినాష్ సుజాతను కూల్ చేశాడు. అంతేగాక తనకు నచ్చినట్లు ఆడి బిగ్‌బాస్‌లో ఉండాలని, ఇతరులను బతిమాలడం మానేయాలని అరియానా అవినాష్‌లో స్పూర్తిని నింపింది. -
అఖిల్‌కు బిగ్‌బాస్ ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటి?
బిగ్‌బాస్‌లో గురువారం నాడు ఎడిపోడ్లో కొనసాగిన కాయిన్స్ టాస్క్‌లో అనేక ట్విస్ట్‌లతో కొత్త ఇంటి కెప్టెన్‌గా కుమార్ సాయి ఎన్నికవ్వడంతో ఇంటి సభ్యూలంతా ఆశ్యర్యంలో మునిగితేలారు. సుజాత, మాస్టర్, కుమార్ సాయి, హారిక అనూహ్యంగా కెప్టెన్సీ టాస్క్‌లోకి రావడం వీరిలో ఎవరూ ఊహించని విధంగా కుమాన్ కెప్టెన్ బ్యాండ్ స్వీకరించడంతో ఇంట్లో వారికి షాక్ తగిలినట్లు అయ్యింది. ఈ రోజుతో గంగవ్వ కెప్టెన్సీ కాలం ముగియడంతో రేపటి నుంచి కుమార్ బిగ్‌బాస్ ఇంటిలో కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అంతేగాక కెప్టెన్ అయ్యనందున ఎలిమినేషన్‌కు నుంచి కూడా తప్పిచుకున్నాడు. చదవండి: భవిష్యవాణి చెప్పిన గంగవ్వ ఇక ఈ రోజు ఎపిసోడ్లో బిగ్‌బాస్ అఖిల్‌ను మాత్రమే కన్ఫేషన్ రూమ్‌కు పిలిపించాడు. అక్కడికి వెళ్లిన అఖిల్‌ను ఇంటి సభ్యులంతా టీవీలో చూస్తున్నారు. అయితే కన్ఫేషన్ రూమ్‌కు రప్పించిన అఖిల్‌కు బిగ్‌బాస్ ఏదో ప్రత్యేకమైన టాస్క్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అఖిల్‌కు ఏదో ప్రత్యేక అవకాశం లేదా అధికారం ఇచ్చినట్లు కన్పిస్తోంది. కాగా ఏ సర్ప్రైజ్ ఇచ్చాడో ఖచ్చితంగా తెలియదు కానీ తాజాగా విడుదలైన ప్రోమోను బట్టి చూస్తుంటే ఇంట్లోని మిగతా కంటెస్టెంట్లకు ఎసరు పెట్టేలా కన్పిస్తోంది. వెంటనే నోయల్, అరియానా, మాస్టర్ ఏదో పోగోట్లుకున్నట్లు నో వద్దు అంటూ అరిచారు. అసలు బిగ్‌బాస్ అఖిల్‌కు ఏ టాస్క్/సర్ప్రైజ్ ఇచ్చాడో తెలియాలంటే ఈ రోజు రాత్రి ప్రసారమయ్యే బిగ్‌బాస్‌పైనే ఓ కన్నేయండి. #Akhil ki lopala ochina surprise enti??#BiggBossTelugu4 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/n2SnDiWk8I — starmaa (@StarMaa) October 2, 2020 -
బిగ్‌బాస్: మాస్టర్ కాళ్లు పట్టుకున్న సోహైల్
గత మూడు సీజన్లుగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్‌బాస్ నాలుగో సీజన్లో మరో మెట్టు ఎక్కువ వినోదాన్ని పంచేందుకు ప్రయత్నిస్తోంది. విభిన్న టాస్క్‌లతో కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇస్తోంది. ఇప్పటికే 24 ఎపిసోడ్లను పూర్తి చేసుకొని 25వ రోజులోకి అడుగుపెట్టింది. గురువారం కూడా కాయిన్ల టాస్క్ కొనసాగింది. మాస్టర్‌పై అరిచినందుకు సోహైల్ తన దగ్గరకు వచ్చి మాస్టర్ కాళ్లు పట్టుకున్నారు. స్విచ్ కాయిన్ ద్వారా సుజాతకు ఊహించని వరం లభించింది. సోహైల్‌పై మాస్టర్ విరుచుకుపడగా ఎవరూ ఊహించని వ్యక్తి ఇంటి కెప్టెన్ అయ్యాడు. ఇంకా ఈ రోజు ఏం జరిగిందంటే.. అరియానాపై సుజాత ఫైర్ లాస్య, అమ్మ రాజశేఖర్ మాస్టర్ మాట్లాడుతుండగా.. సోహైల్ వచ్చి మాస్టర్ కాళ్లు పట్టుకొని క్షమాపణలు కోరాడు. మాస్టర్ నుంచి కాయిన్లు దొంగిలించిన కారణంగా తను ఇలా క్షమాపణలు కోరాడు. .. తన పక్కన కూర్చొబెట్టి బుజ్జగించాడు. తన మీద కోపం లేదని, ఏదో కోపంలో అలా చేశానని సంజాయిషీ చెప్పుకున్నాడు. నువ్వే నన్ను అర్థం చేసుకోకుండా నా దగ్గర కాయిన్లు తీసుకున్నావ్ అని మాస్టర్ సోహైల్‌కు హితబోధన చేశాడు. అందరూ రిలాక్స్ అయిపోవడంతో బిగ్‌బాస్ ఇంటి సభ్యులను హెచ్చరించాడు.. ఆటను కొనసాగించాలని ఆదేశించాడు. తిరిగి ఆటను కొనసాగించారు. కిల్లర్ కాయిన్స్ రెండో భాగంలో దివి, అరియానా, సోహైల్, నోయల్, మాస్టర్ అవుట్ అవ్వడంతో తప్పుకున్నాడు. ఎక్కువ పాయింట్లు ఉన్న వారిని టార్గెట్ చేయాలని అరియానా చెప్పడంతో ఆమెపై సుజాత ఫైర్ అయ్యింది. నువ్వు రన్నింగ్ కామెంట్ ఇవ్వొద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండో లెవల్ పూర్తయింది. ఓవైపు అరియానా, సుజాత గొడవ పడుతుండగా.. మరోవైపు అఖిల్, మాస్టర్ మధ్య వాదన మొదలైంది. అమ్మాయిల మాదరి ఇంట్లోకి వెళ్లి దాక్కున్నాడని మాస్టర్ మండిపడ్డారు. చదవండి : బిగ్‌బాస్: అందరి కన్ను సోహైల్ పైనే అనంతరం మూడో లెవల్ ప్రారంభమైంది. ఇదే అఖరిది కూడా. ఆ లెవల్లో ఆఖరు బజర్ మోగేలోపు ఇంటి సభ్యులు అందరూ సామా, భేద,దాన, దండోపాయాలు ఉపయోగించి తమ దగ్గర ఉన్న కాయిన్ల విలువను పెంచుకునేందుకు ప్రయత్నించాలి. అవినాష్‌కు కాయిన్లు పట్టకునేందుకు అరియానా సాయం చేసింది. లాస్చ, మాస్టర్‌కు కాయిన్లు ఇచ్చేసింది. అవినాష్వి కూడా మాస్టర్‌కు ఇచ్చేసింది. సోహైల్, మెహబూబ్‌కు ఇచ్చేశాడు. తన దగ్గర తీసుకున్న కాయిన్లనను తనకు ఇచ్చేయమని మాస్టర్, సోహైల్‌ను అడిగాడు. లేకుండే తన మనసు కుదుటపడదని వాపోయాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మాస్టర్‌కు కాయిన్లు ఇవ్వకంటూ మెహబూబ్ సోహైల్‌కు నూరిపోశాడు. (బిగ్‌బాస్: కాసుల వేటలో గెలుపెవరిది!) తర్వాత ఇంటి సభ్యులంతా తమ దగ్గర ఉన్న కాయిన్లను లెక్కించి బిగ్‌బాస్‌కు చెప్పారు. అఖిల్, మోనాల్, సోహైల్ తమ పాయింట్లను మెహబూబ్‌కు ఇచ్చేశారు. ఇప్పడు సుజాత దగ్గర ఉన్న స్విచ్ కాయిన్‌ను ఉపయోగించి.. వేరే వాళ్ల కాయిన్లతో స్విచ్ చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని వాడుకొని సుజాత, మెహబూబ్ పాయింట్లను లాగేసుకుంది. చివరకు ఎక్కు పాయింట్లు ఉన్న కారణంగా సుజాత, అమ్మ రాజశేఖర్ మాస్టర్, కుమార్ సాయి, అలేఖ్య హారిక నలుగరు కెప్టెన్ పోటీదారులుగా ఎన్నికయ్యారు. తన పాయింట్లు పోవడంతో మెహబూబ్ కన్నిటీ పర్యంతమయ్యాడు. కష్టపడి ఆడిన తనకు అన్యాయ జరిగిందని ఆవేదన చెందాడు. అక్కడితో ఆ టాస్క్ ముగియడంతో హారిక, అభి, దివి జరిగిన దాని గురించి చర్చించుకున్నారు. (బిగ్‌బాస్: టాస్క్‌లో పడిపోయిన అవినాష్) మాస్టర్‌తో మాట్లాడాలని సోహైల్ కోరితే అందుకే మాస్టర్ ససేమిరా అన్నాడు. తన కాయిన్లు ఇచ్చేందుకు అవకాశం ఇచ్చిన సోహైల్ ఉపయోగించుకోలేదని రాజశేఖర్ మాస్టర్ అనగా.. గేమ్‌ను గేమ్ లానే ఆడానని, అస్సలు క్షమాపణలు చెప్పనని సోహైల్ తెగేసి చెప్పాడు. దీంతో తనతో జీవితంలో మాట్లాడనని మాస్టర్ శపథం చేశాడు. అనంతరం నలుగురు కెప్టెన్సీ పోటీదారులకు కాసుల వేట టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో భాగంగా గార్డెనింగ్ ఏరియాలో మట్టితో బురద గొయ్యి ఏర్పాటు చేసి అందులో కొన్ని కాయిన్లు పెట్టి ఉంచారు. బురదలోని కాయిన్లనుంచి టాస్క్ ముగిసే సమయానికి ఎవరి బాస్కెట్లో ఎక్కవ కాయిన్లు ఉంటే వారు ఇంటి కెప్టెన్ అవ్వనున్నారు. ఈ టాస్క్ సంచాలకులుగా సోహైల్ ఉన్నాడు. ఈ టాస్క్‌లో నలుగురు పోటీపడి మరి పోరాడారు. ఈ టాస్స్‌లో ఎవరూ ఊహించని విధంగా 100 పాయింట్ల అధిక్యతతో కుమార్ నాలుగో కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు. అనంతరం కెప్టెన్ బ్యాండ్‌ను ధరించాడు. గార్డెన్లో కూర్చొని ఉల్లాసంగా గడిపారు. అరియానుకు పిచ్చి పట్టింది. కానీ తనకు ఇప్పడే తెలిసిందని మాస్టర్ చెప్పాడు. ఇక స్వాతి, అఖిల్ మాట్లాడుకుంటుండగా.. అవినాష్ వారి సంభాషణలకు దూరం నుంచి ఫన్నీగా వాయిస్ ఇచ్చాడు. అలాగే గంగవ్వ అమ్మ వారు సోకితే ఎలా మాట్లాడతారో నటించి చూపిస్తూ ఇంటి సభ్యులకు వినోదాన్ని అందించింది. దీనంగా చూస్తున్న హారికను అభి ఆకస్మాత్తుగా వచ్చి భయపెట్టాడు. తర్వాత తనను వెనకనుంచి వచ్చి పట్టుకొని కూల్ చేశాడు. (కథ వేరే ఉంటది: మాస్టర్‌కు సోహైల్ వార్నింగ్) -
లాస్య, నోయల్ మధ్య మాటల యుద్ధం..
సండే ఫన్డే కావడంతో హౌజ్‌మెట్స్ అంతా ఖుషీఖుషీగా గడిపారు. నాగార్జున ఇచ్చిన టాస్కులు పూర్తి చేసి ఆటపాటలతో సరదాగా గడిపారు. అయితే బిగ్‌బాస్‌లో ఆదివారం ఒకరూ ఎలిమినేషన్ కావాల్సి ఉండటంతో ఈ సారి ఎవరూ ఊహించని విధంగా దేవి నాగవల్లి బిగ్‌బాస్ హౌజ్ నుంచి వెనుదిరిగారు. ఎప్పుడూ లేనిది ఇంటి సభ్యులంతా దేవి కోసం కంటతడి పెట్టుకున్నారు. దీంతో సోమవారం నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే మునెపెన్నడూ లేని విధంగా ఈవారం నామినషన్ సరికొత్తగా ఉండబోతుంది. ఇప్పటి వరకు ఇంటి సభ్యుల్లో ఎవరి ఇద్దరి మధ్య కూడా పెద్ద రచ్చ జరగలేదు. కానీ ప్రస్తుతం లాస్య, నోయల్ మధ్య పెను తుఫాన్‌లా మాటల యుద్దం జరిగేలా కన్పిస్తోంది. చదవండి : (బిగ్‌బాస్: నామినేషన్లో ఎవరూ మర్డర్ కానున్నారు?) ఏదో విషయంపై పెరిగిన మాటల చర్చ చివరకు ఇద్దరి మధ్య తీవ్ర గొడవకు దారి తీసినట్లు తెలుస్తోంది. నోయల్ గురించి లాస్య ఎవరితోనో రహస్యంగా మాట్లాడినట్లు నోయల్‌కు తెలియడంతో సరాసరి లాస్య వద్దకు వచ్చి నా గురించి ఏం మాట్లాడవ్ అంటూ తనను నిలదీశాడు. ‘నేను ఏం మాట్లాడలేదు. ముందు ఎవరూ మాట్లాడారో అడిగి తెలుసుకొని నిలదీయాలి’ అని సూటిగా చెప్పింది. దీంతో ఆవేశానికి వెళ్లిన నోయల్ ‘ఎందుకు అరుస్తున్నావ్.. నాకు అరవడం రాదనుకుంటున్నావా’ అంటూ లాస్యపై విరుచుకుపడ్డాడు. దీనిపై స్పందించిన లాస్య నీకే కాదు అరవడం నాకు కూడా వచ్చు. నీ వెనకాల మాట్లాడే అవసరం నాకు లేదు అని ఖరఖండిగా చెప్పేసింది. అయినప్పటికీ కూల్ అవ్వని నోయల్ నా ముందు మాట్లాడండి పిలుస్తాననగా.. ముందుకు తీసుకురా మాట్లాడుదాం అని లాస్య తేల్చి చెప్పేసింది. దీంతో లాస్య, నోయల్ మధ్య ఈ సంఘర్షణ సై అంటే సై అనేలా సాగబోతుంది. ఇదంతా చూస్తుంటే ఇకపై బిగ్‌బాస్ అంచనాలను మించి ఉండబోతోందని అర్థం చేసుకోవచ్చు. (స్వాతి దీక్షిత్ గురించి లాస్య చెప్పింది నిజమేనా?) Heated discussion between #Lasya and #Noel 🔥 🔥 #BiggBossTelugu4 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/2eAIvvqQdv — starmaa (@StarMaa) September 28, 2020 -
బిగ్‌బాస్: హీరోయిన్ స్వాతి దీక్షిత్ ఎంట్రీ
బుద్ధి బలం ముందు కండబలం ఓడిపోయింది. ఎత్తుకు పై ఎత్తులు, పోట్లాటలు, కొట్లాటల తర్వాత ఎట్టకేలకు రోబోల టీమ్ గెలుపును ముద్దాడింది. దీంతో అప్పటివరకు చేసిన శ్రమ వృథా అయిందే అని మనుషుల టీమ్ ముఖం మాడ్చుకున్నారు. ఇంటి సభ్యులందరూ నోయల్ చెత్తగా ఆడారనడంతో అతడిని బిగ్‌బాస్ చెరసాలలో బందీ చేశాడు. మరి నేటి ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చదివేయండి.. అవినాష్ నమ్మకద్రోహి: మాస్టర్ రోబోల టీమ్‌లోని అవినాష్ మాస్టర్‌కు తెలీకుండానే అతని దగ్గరి నుంచి చార్జింగ్ పెట్టేసుకున్నాడు. అది గమనించిన దివి అవినాష్‌ను రెండు తగిలించింది. నమ్మకద్రోహంతో బాగా హర్ట్ అయిన మాస్టర్ లైఫ్‌లో, జన్మజన్మలో తనతో మాట్లాడకంటూ అవినాష్‌కు వార్నింగ్ ఇచ్చాడు. లైఫ్‌లో నాశనం అయిపోతావ్ అని శాపనార్థాలు పెట్టాడు. దీంతో మాస్టర్‌ను కూల్ చేసేందుకు అవినాష్ నానా తంటాలు పడ్డాడు. తర్వాత అవ్వ రోబో డ్రెస్‌ను తీసి విసిరేసినందుకు మోనాల్‌పై కుర్చీ ఎత్తి విసిరేసింది. మరోవైపు వాష్‌రూమ్ ఆపుకోలేకపోయిన మనుషులు రోబోలకు ఎలాంటి చార్జింగ్ ఇవ్వకుండానే వాష్‌రూమ్ వాడేసుకున్నారు. (చదవండి: బిగ్‌బాస్ హౌస్‌లో తలనొప్పిగా మారుతోన్న గంగవ్వ!) బతికిన రెండు రోబోలు, గెలుపు డిక్లేర్ దీంతో అడ్డు వెళ్లబోయిన అరియానాను మోనాల్ ఈడ్చి పారేసింది. లాస్యను వెనక్కు నెట్టే క్రమంలో ఇద్దరూ కిందకు పడిపోయారు.ఆహారం ఇస్తే చార్జ్ ఇస్తామని గంగవ్వతో బేరం కుదుర్చుకున్నారు. కానీ ఎలాంటి చార్జింగ్ లేకపోవడంతో రోబోలు అరియానా, కుమార్ సాయి, అవినాష్, హారిక, లాస్యలు చచ్చిపోయారు. బజర్ మోగే సమయానికి అభి, గంగవ్వ లు బతికే ఉండటంతో రోబో టీమ్ గెలుపు సాధించినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. దీంతో సంతోషం పట్టలేక రోబో టీమ్ ఎగరి గంతేసింది. కానీ ఈ టాస్క్‌లో జరిగిన పరిణామాల నుంచి మనుషులు బయట పడలేదు. కెప్టెన్సీ పోటీకి ఆ నలుగురు రోబోల టీమ్‌లోని వాళ్లు నమ్మకాన్ని పోగొట్టుకున్నారని నోయల్ మోనాల్‌తో చెప్పుకొచ్చాడు. అభితో మాట్లాడేందుకు ప్రయత్నించినా మధ్యలో హారిక వస్తుందని మోనాల్ బాధపడింది. అభిని హారిక కంట్రోల్ చేస్తుందని మాస్టర్ అభిప్రాయపడ్డాడు. టాస్క్‌లో జరిగిన రభసకో ఏమో కానీ అభి తనకు ఉండాలనిపించడం లేదని హారికతో ఫీలింగ్స్ షేర్ చేసుకున్నాడు. ఇక గెలిచిన టీమ్ నుంచి అవినాష్, గంగవ్వ, హారిక, అభిజిత్ కెప్టెన్ పోటీలో నిలబడ్డారు. అయితే మూడో కెప్టెన్‌గా గంగవ్వే సెలక్ట్ అయిందని లీకువీరులు చెప్తున్నారు. ఇక ఇంటి సభ్యులందరూ కలిసి ఓడిపోయిన టీమ్‌లో నోయల్ చెత్త పర్ఫార్మెన్స్ ఇచ్చాడని తెలపడంతో అతడు జైల్లోకి వెళ్లాల్సిందిగా బిగ్‌బాస్ ఆదేశించాడు. (చదవండి: వర్కవుట్ అయిన కిడ్నాప్; నాకిది అగ్ని పరీక్ష) నోయల్‌కు రోజంతా రాగి జావ మాత్రమే అతడికి తిండీ, టీ, కాఫీలు, జ్యూస్‌లు ఇవ్వకూడదని శిక్ష విధించాడు. కేవలం రాగి జావ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందని బిగ్‌బాస్ స్పష్టం చేశాడు. జావకు అవసరమయ్యే రాగులను కూడా అతడే పిండి చేయాల్సి ఉంటుందని తెలిపాడు. తర్వాత చెరసాలలో నుంచే నోయల్ ర్యాప్ పాడాడు. దివి పాట పాడితే మాస్టర్ స్టెప్పులేశాడు. ఇక రేపటి ఎపిసోడ్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంది. అంటే హీరోయిన్ స్వాతి దీక్షిత్ ఇంట్లోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఆమె ఎంట్రీ ఏ రేంజ్లో ఉండబోతుందో రేపు చూడాల్సిందే. (చదవండి: బిగ్‌బాస్: త్వరలో హీరోయిన్ ఎంట్రీ!) -
బిగ్‌బాస్: జైలుకు వెళ్లనున్న నోయల్!
సేఫ్ గేమ్ ఆడుతున్న ఇంటి సభ్యుల ఆట కట్టించేందుకు నామినేషన్ ప్రక్రియతో వారి మధ్య అగ్గి రాజేశాడు బిగ్‌బాస్. దీంతో అప్పటివరకు డల్‌గా సాగిన ఆట కాస్త రసవత్తరంగా మారింది. ఇక తర్వాతది.. ఫిజికల్ టాస్క్.. అసలే వేడి మీదున్న కంటెస్టెంట్లకు వారేంటో చూపించుకునేందుకు దొరికిన సరైన అవకాశమిది. దీన్ని చేజార్చుకోనివ్వకుండా ఉండేందుకు పక్కోడిని పడగొట్టైనా సరే గెలవాలనుకుంటున్నారు. బిగ్‌బాస్ కూడా పక్కా ప్లాన్‌తోనే కంటెస్టెంట్లను మనుషులు, రోబోల టీమ్‌లుగా విడగొట్టారు. అయితే మనుషులు టీమ్‌లో బలమైన కంటెస్టెంట్లు ఉన్నారని, వీరిని ఆపడం మన తరం కాదంటూ రోబోల టీమ్‌లోని అభి ముందే చేతులెత్తేశాడు. దీంతో సోషల్ మీడియాలో అభిపై విమర్శలు వెల్లువెత్తాయి. (చదవండి: డబుల్ ఎలిమినేషన్; కళ్యాణి అవుట్!) okarini minchi okadu iragdeesthunnaru ferformances 🤣🤣🤣🤣promo lo#Mehboob :dhammunte nannu teeskellandra ammayini teeskelladam kadu#ammarajasekhar :meeku game imp ha manishi imp ha#Sohel : siggundala meeku..thu..#Sujatha : intha chandalanga game adthara#BiggBossTelugu4 — Vamc Krishna (@vamccrishnaa) September 23, 2020 అభి ప్లాన్‌తో గెలుపు దిశగా రోబోలు 'అతనికి ఎలాగో ఆడటం చేతకాదు, కనీసం పక్కనవాళ్లని కూడా ఆడనివ్వడు' అని సెటైర్లు విసిరారు. కానీ అనూహ్యంగా నేడు రిలీజ్ చేసిన ప్రోమోలో అభి మైండ్‌గేమ్ ఆడాడు. దివిని పక్కా ప్లాన్‌తో కిడ్నాప్ చేశారు. ఇది తట్టుకోలేకపోయిన మనుషుల టీమ్ ఆవేశంతో ఊగిపోయారు. అయితే దెబ్బకు దెబ్బ కొట్టేందుకు మనుషుల టీమ్ సిద్ధమైంది. రోబోల దూకుడుకు బ్రేక్ వేయనుంది. వీరు ఎలా ప్రతీకారం తీర్చుకుంటారనేది నేటి ఎపిసోడ్లో చూడాలి. మరోవైపు ఈ టాస్క్‌పై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. నిన్న సోమరిపోతుగా ఆటాడకుండా ప్రవర్తించిన అభిని తిట్టినవారే నేడు అతడి ప్లాన్‌ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. (చదవండి: అతి త్వరలోనే మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ) కుమార్ సాయిని గడ్డిపోచలా తీసేస్తున్నారు అతడి ప్లాన్‌పై మనుషుల టీమ్ ఎందుకంత మండిపడుతుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అటు మెహబూబ్, సోహైల్ విపరీత ప్రవర్తనను కడిగి పారేస్తున్నారు. కుమార్ సాయిని గడ్డిపోచలా చూస్తున్నారని అతడిపై జాలి చూపిస్తున్నారు. సుజాత ఏడుపు పైనా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. చివరికి రోబోల టీమ్ గెలుస్తుందని, నోయల్ జైలుకు వెళ్తాడని మరికొందరు అంచనా వేస్తున్నారు. ఇవన్నీ ఎంతవరకు నిజమనేది నేటి ఎపిసోడ్లో తేలనుంది. (చదవండి: బిగ్‌బాస్: గెలవడం కోసం ఆమె ఏమైనా చేస్తుంది!) Door open avagane kompateesi Noel team "idi fun idi fun" ani rap paadatara enti.. promo lo maatrame e elevations.. episode Noel rap laga untundi #BiggBossTelugu4 pic.twitter.com/EKbIL8HjLs — #̷7̷ ̷F̷o̷r̷e̷v̷e̷r̷ (@M_a_h_iiii) September 23, 2020 #Abijeet as professor 🤓#BiggBossTelugu4 https://t.co/FYBmxa9QUS — Believer! Living on a PALE BLUE DOT🌏 (@Human9368) September 23, 2020 Abhi kidnap cheddam annappudu... ariyanaa ila react ayithey bhale undedi “So adi nee character. Bayata kidnaps chesthu bathukutaav nuvvu” want to see his reaction. Atleast nagarjuna anna ila adigite baagundu weekend lo.. #BiggBossTelugu4 — Arjun (@nj_politics2020) September 23, 2020 Door open chesina ventane Divi - akada em kaleeeee 😂#BiggBossTelugu4 https://t.co/0UfIckOWlf pic.twitter.com/HEB4gQepTt — ʌınɐʎ (@VintageVinnu) September 23, 2020 Sujatha Ferformance 😂😂#BiggBossTelugu4 pic.twitter.com/yN7fJEcleS — Canford Cliffs (@Canford_Cliff) September 23, 2020 ROBOTS ARE BEHAVING LIKE HUMANS BUTTTT HUMANS ARE BEHAVING LIKE WILD ANIMALS 🙏 HENCE PROVED ROBOTS ARE FAR BETTER THAN HUMANS 🤣😂#BiggBossTelugu4 — BIGG BOSS ADDICTS (@BiggBossAddicts) September 23, 2020 -
గొంతు పెంచి మాట్లాడితే ఒప్పుకోను: దేవి
ఇన్నాళ్లకు బిగ్‌బాస్ తానున్నానంటూ ఉనికి చాటుకున్నాడు. ఇంటి నియమ నిబంధనలు పాటించనందుకు ఇంటి సభ్యులందరినీ శిక్షించాడు. మరోవైపు బీబీ టీవీ సాగదీతగా మారింది. మొదట సీరియల్ ఎపిసోడ్, తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్, నేడు కామెడీ షో నిర్వహించారు. జబర్దస్త్‌ను గుర్తు చేసిన ఈ కార్యక్రమంలో అవినాష్, సాయి కుమార్ రెండు టీమ్‌లుగా విడిపోయి నువ్వానేనా అన్న రీతిలో కామెడీ పండించారు. నేటి ఎపిసోడ్లో ఇంకేమేం జరిగాయో చదివేయండి.. టాస్క్ ఓడిపోవడంతో హర్టైన మాస్టర్, కూల్ చేసిన బిగ్‌బాస్ సాయి కుమార్ డ్రామా స్కిట్, అవినాష్ సినిమా స్కిట్ వేశారు. ఈ రెండు టీమ్‌లకు సమాన ఓట్లు పడగా చివరగా గంగవ్వ వేసిన ఒక్క ఓటుతో అవినాష్ టీమ్ గెలిచింది. దీంతో సాయి కుమార్ టీమ్‌లోని మాస్టర్ కాస్త హర్టయ్యాడు. కానీ రెండు గ్రూపులు గెలిచాయన్నదానికి సంకేతంగా బిగ్‌బాస్ రెండు రీల్ జ్యూస్ బాటిల్స్ పంపించడంతో ఇంటి సభ్యులు టైటిల్ గెలిచినంత ఆనందంగా ఫీలయ్యారు. తర్వాత దేవి తనను కాస్త దూరం పెడుతున్నారని హర్ట్ అయింది. మీరందరూ ఏదో మాట్లాడుకుని కావాలని తనను ఇలా చేస్తున్నారని అందరిపై అనుమానం వ్యక్తం చేసింది. అలాంటిదేం లేదని లాస్య ఎంత చెప్పినా ఆమె చెవికెక్కించుకోలేదు. (బిగ్‌బాస్: టీఆర్పీలో సరికొత్త రికార్డు) బిగ్‌బాస్‌తో సహా అందరూ సారీ చెప్పాలి మోనాల్, అభిజిత్, అఖిల్, నోయల్, హారిక తెలుగులో కాకుండా అన్యభాషల్లో మాట్లాడుతున్నారని బిగ్‌బాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు శిక్షగా వారందరూ బోర్డు మీద బిగ్‌బాస్ మమ్మల్ని క్షమించండి అని రాసుకొచ్చారు. ఏదైనా టాస్క్ కోసం పిలిచినప్పుడు ఇంటి సభ్యులు ఆలస్యంగా వస్తున్నారని బిగ్‌బాస్ తెలిపాడు. దీనికి శిక్షగా బెల్ కొట్టిన ప్రతీసారి ఇంటి సభ్యులు పరుగున ఒకచోటికి చేరి 20 గుంజీలు తీశారు. అయితే నిబంధనలు ఉల్లంఘించిన ప్రతిసారి లాస్య తన వస్తువును వదిలేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. (బిగ్‌బాస్‌లో నా వాయిస్, సంతోషంగా ఉంది: నందు) కెప్టెన్‌గా నోయల్ ఏకగ్రీవం తర్వాత సుజాత చిట్టి చిలకమ్మ పద్యం చెప్పే కొద్దీ మోనాల్ ముద్దుముద్దుగా పలుకుతూ నేర్చుకుంది. మరోవైపు చిన్న చిన్న విషయాలకు తెగ ఫ్రస్టేట్ అవుతున్న నోయల్ తనకు బిగ్‌బాస్‌తో సహా చాలా మంది సారీ చెప్పాలన్నాడు. ఈ శనివారం నాగ్‌ను అడిగి వెళ్లిపోతానన్నాడు. తర్వాత కొద్ది గంటలకే శిక్షాకాలం ముగిసినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. ఈ వారం లగ్జరీ బడ్జెట్ టాస్క్ బీబీ టీవీ విజయవంతంగా పూర్తి చేశారని అభినందించాడు. అనంతరం కెప్టెన్సీ కోసం నోయల్, మెహబూబ్, కళ్యాణి, అభిజిత్ పోటీ పడ్డారు. అందరూ ఏకాభిప్రాయంతో నోయల్‌ను రెండో కెప్టెన్‌గా ఎన్నుకున్నారు. అమ్మ రాజశేఖర్ వర్సెస్ దేవి నాగవల్లి ఎవరు ఏ పని చేయాలన్న విషయంలో దేవి, అమ్మ రాజశేఖర్ మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. గొంతు పెంచి మాట్లాడితే ఒప్పుకోనని దేవి కరాఖండిగా చెప్పేసింది. దీంతో ఖంగు తిన్న మాస్టర్ నీ వాయిస్ పెరిగితే ఏం లేదు, కానీ నా వాయిస్ పెరిగితే మాత్రం తప్పొచ్చిందా? అని అసహనానికి లోనయ్యాడు. అలా ఇద్దరి మధ్య కాస్త రభస జరగడంతో నోయల్ సర్ది చెప్పాడు. ఆ తర్వాత అవినాష్.. మోనాల్ ఎలా ప్రవర్తిస్తుందో చేసి చూపించడంతో ఆమె హర్ట్ అయింది. దీంతో అవినాష్ ఆమె దగ్గరికి వెళ్లి క్షమించమని కోరాడు. (నోయల్‌ను ఆడేసుకుంటున్న నెటిజన్లు) -
బిగ్‌బాస్ షో నుంచి వైదొలుగుతా: నోయల్
బిగ్‌బాస్ నాల్గవ సీజన్లో కంటెస్టెంట్లు హౌస్‌లో అడుగుపెట్టి 10 రోజులపైనే అయింది. అయినా ఇప్పటికీ ఇంట్లో పాటించాల్సిన నియమ నిబంధనలను ఎవరూ పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. ముఖ్యంగా తెలుగు మాట్లాడాలి అన్న నిబంధనను చాలామంది లైట్ తీసుకున్నారు. అయితే కొందరు తెలుగులోనే మాట్లాడినా, సగం మంది అన్ని భాషలను కలుపుతూ వాగేస్తున్నారు. దీంతో ఇదంతా చూసి చిర్రెత్తిపోయిన బిగ్‌బాస్ అందరికీ కలిపి పనిష్మెంట్ ఇచ్చాడు. ఈ క్రమంలో నోయల్ కాస్త హర్ట్ అయినట్లు కనిపిస్తున్నాడు. మిగతా ఇంటి సభ్యులపై చిర్రుబుర్రులాడుతున్నాడు. అంతేకాదు, బిగ్‌బాస్ మీద కూడా గరమవుతున్నట్లు కనిపిస్తోంది. ఈ మేరకు స్టార్ మా తాజాగా ఓ ప్రోమోను రిలీజ్ చేసింది. అందులో "బిగ్‌బాస్ నన్ను క్షమించండి, ఇప్పటి నుంచి తెలుగులోనే మాట్లాడతాము" అని బోర్డు మీద రాస్తున్న నోయల్.. ఒక్కసారిగా బిగ్‌బాస్ తనకు క్షమాపణలు చెప్పాలని పట్టుపట్టాడు. (ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయిన హారిక) ఇంట్లోని ఇతర కంటెస్టెంట్లకు బస్తీ మే సవాల్ అని చాలెంజ్ విసురుతున్నాడు. ఈ శనివారం వెళ్లిపోతా అని నిర్ణయించుకున్నానంటున్నాడు. నాగార్జునను ఒప్పించి వెళ్లిపోతానంటున్నాడు. కాగా తెలుగు మాట్లాడకుండా ఉన్నది ప్రధానంగా మోనాల్, అభిజిత్, అఖిల్ అయితే మధ్యలో నోయల్‌కు ఎందుకు శిక్ష విధించారని ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అలా అని మరీ బిగ్‌బాస్ వచ్చి సారీ చెప్పాలని కోరడం సబబు కాదని అభిప్రాయపడుతున్నారు. అసలు నోయల్ ఎందుకంత ఫ్రస్టేట్ అవుతున్నాడు? ఇంట్లో ఏం జరిగిందనేది తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేంతవరకు ఎదురు చూడాల్సిందే. (బిగ్‌బాస్: టీఆర్పీలో సరికొత్త రికార్డు) -
అమ్మాయి పేరు కనిపించినా వదలడు
అట్టహాసంగా ప్రారంభమైన బిగ్‌బాస్ నాల్గవ సీజన్.. మొదటి వారం నీరసంగానే సాగింది. హౌస్‌లో కోపానికి చిరునామాగా మారిపోయిన సూర్యకిరణ్ ఎలిమినేట్ కావడంతో హౌస్‌లో కాస్త ప్రశాంతత చోటు చేసుకున్నట్లు కనిపిస్తోంది. కానీ వైల్డ్‌కార్డ్ ఎంట్రీగా వచ్చిన సాయి కుమార్ కాస్త తత్తరపాటుకు లోనవుతున్నట్లుగా ఉంది. దీంతో హౌస్‌లో అడుగు పెట్టిన తర్వాత రోజే నామినేట్ అయ్యాడు. ఇదిలా వుంటే బిగ్‌బాస్ హౌస్‌లో ఇన్నాళ్లకు గొడవలు పక్కనపెట్టి కాస్త వినోదాన్ని పంచుతున్నట్లు కనిపిస్తోంది. (చదవండి: నేను చనిపోయాననుకున్నారు: సూర్యకిరణ్.) #AmmaRajasekhar and #KarateKalyani dance lo anukunnadi okkati ayindi okkati 😂 ??#BiggBossTelugu4 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/FEwhFICoV2 — starmaa (@StarMaa) September 15, 2020 ఈ మేరకు స్టార్ మా తాజాగా ఓ ప్రోమోను రిలీజ్ చేసింది. ఇందులో నోయల్.. కుళ్లు జోకులతో కామెడీ పండించే అమ్మ రాజశేఖర్‌ను రొమాంటిక్ డ్యాన్స్ చేయమన్నాడు. అది కూడా అతిగా ఆవేశపడే కరాటే కల్యాణితో. ఇంకేముంది.. ఇద్దరూ ఒకరికొకరు సరిపోయారు. వామ్మో, ఈ ఘోరాన్ని చూడలేను అన్నట్లుగా అరియానా కళ్లు మూసేసుకుంది. మరోవైపు మాస్టర్ కళ్యాణి చేయి పట్టుకుని లేపబోయి అతడే బొక్క బోర్లా పడ్డాడు. దీంతో కంటెస్టెంట్లు అందరూ పగలబడి నవ్వలేక చచ్చారు. (చదవండి: బిగ్‌బాస్: ఊరమాస్ స్టెప్పులేసిన దేవి) మరోవైపు ఉదయం రిలీజ్ చేసిన ప్రోమోలో కంటెస్టెంట్లు సరికొత్త అవతారాలతో దర్శనమిచ్చారు. దేత్తడి హారిక ఐటమ్ సాంగ్‌తో రెచ్చిపోనున్నట్లు కనిపిస్తోంది. రోజుకో టాలెంట్‌ను బయటపెడ్తూ ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్న దేవి నాగవల్లి.. "అబ్బాయి చూడటానికి అలా ఉన్నాడు. కానీ, పేపరు మీద అమ్మాయి అని పేరున్నా వదలడు" అంటూ నేటి ఎపిసోడ్లో కామెడీ పంచ్‌లు విసురుతోంది. వీరి స్కిట్లు నేడు ఏ మేరకు పేలుతాయో చూడాలి. (చదవండి: జిగిరీ దోస్త్ నోయల్‌కే సపోర్ట్: రాహుల్) BB TV show shoot lo special entertainment 📹 #BiggBossTelugu4 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/3tBKM2PQmr — starmaa (@StarMaa) September 15, 2020 -
నోయల్‌ను ఆడేసుకుంటున్న నెటిజన్లు
బిగ్‌బాస్ హౌస్‌లో అంతో ఇంతో కాస్త అందరికీ తెలిసిన వ్యక్తి నోయల్ సేన్. సింగర్, నటుడు అయిన ఇతనికి సోషల్ మీడియాలో చాలామందే అభిమానులు ఉన్నారు. హౌస్‌లో అడుగు పెట్టిన మొదటి రోజు నుంచే చాలా తెలివిగా ఆడుతూ అందరితో కలిసిపోతున్నాడు. అలాగే గ్యాంగ్ లీడర్ అయ్యేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. కాకపోతే నిన్నటి కట్టప్ప ఎపిసోడ్ నోయల్‌కు వెన్నుపోటు పొడిచిందంటున్నారు నెటిజన్లు. ఈ టాస్క్‌లో నోయల్ కాస్త అతి చేశాడని అంటున్నారు. చీప్‌గా సింపతీ కార్డ్ ప్లే చేశాడని విమర్శిస్తున్నారు. (వైల్డ్ కార్డ్ ఎంట్రీ: ఇద్దరా? ముగ్గురా?) అసలేంటి కట్టప్ప ఎపిసోడ్ బిగ్‌బాస్.. మీలో ఒకరు కట్టప్ప ఉన్నారని చెప్పగానే కంటెస్టెంట్లు అందరూ భయపడిపోయారు. ప్రతి ఒక్కరినీ అనుమానంగా చూడటం మొదలు పెట్టారు. బిగ్‌బాస్ మొదటి వారం మొత్తం ఈ కట్టప్ప చుట్టే తిరుగుతోంది. ఇప్పటికే కట్టప్ప ఎవరో కనుక్కునేందుకు రెండు టాస్క్‌లు ఆడించాడు. తాజాగా నిన్నటి ఎపిసోడ్లో ముచ్చటగా మూడోసారి కూడా కట్టప్ప గురించే టాస్క్ నడిచింది. కట్టప్ప అని ఎవరిమీదైతే అనుమానం ఉందో వారిపై స్టాంప్ వేయమని ఆదేశించాడు. ఇంటి సభ్యులు కూడా అలానే చేశారు. కానీ నోయల్ వంతు వచ్చేసరికి కథ అడ్డం తిరిగింది. కట్టప్ప అంటే అందరినీ నమ్మకంగా కాపాడుకునే వ్యక్తి అని భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేశాడు. (బిగ్‌బాస్: డేంజర్ జోన్లో ఆ ఇద్దరు) 🤣🤣🤣🤣🤣🤣#Noel#BiggBossTelugu4 pic.twitter.com/MevnpueRXG — నందమూరి_అభిమాని (@p_jit26) September 12, 2020 అందరిలా కాకుండా విభిన్నంగా ఆలోచిస్తున్న నోయల్ వ్యాఖ్యలతో అటు ఇంటిసభ్యులతోపాటు ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు. కానీ అంతలోనే అనవసరమైన ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చి ప్రేక్షకుల అభిప్రాయాన్ని మార్చేశాడు. "కట్టప్ప అని ముద్ర వేస్తే టీవీలో చూసే మీ ఇంటి సభ్యులు బాధపడతారు. అది నాకు ఇష్టం లేదు. అందుకే నాకు నేనే ముద్ర వేసుకుంటాను" అని మాట్లాడాడు. అయితే ఎవరికి వారు ముద్ర వేసుకోవడం కుదరదని బిగ్‌బాస్ తేల్చి చెప్పాడు. దీంతో తనకు అమ్మ రాజశేఖర్‌తో చనువు ఉంది కాబట్టి, ఆయనకే వేస్తాను, మిగతా వారికి వేస్తే ఫీలవుతారని చెప్పుకొచ్చాడు. ఈ ఒక్క ఎపిసోడ్‌తో నోయల్‌పై నెగెటివిటీ పెరిగింది. సింపతీ కార్డ్ ప్లే చేస్తున్నాడు, ఓవర్ యాక్షన్ అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. మరికొందరైతే "మొన్నటివరకు నోయల్ అంటే ఇష్టం ఉండేది, కానీ ఇప్పుడు వేరే హౌస్‌మేట్స్‌ను వెతుక్కుంటాం" అంటున్నారు. (ఎనిమిదేళ్లలో లంబాడిపల్లి టు బిగ్‌బాస్..) View this post on Instagram Masth emotional drama chesthunnadu ani naku anpinchindhi.... 🙄 Mirem antaru? . . . . Do follow @gammunundavayya . . . . . . #bigboss #bigboss4telugu #bigbosstelugu #biggestrealityshow #starmaa #nagarjunaakkineni #noel #bigbossnoel #ammarajashekar #bigbossmemes #comedymeme #telugumemes #telugumemers #comedymemestelugu #girladmins A post shared by Gammunundavayya (@gammunundavayya) on Sep 12, 2020 at 3:13am PDT View this post on Instagram Noel 🤣🤣🤣🤣 #biggboss4telugu #biggboss #biggboss4 #biggboss4teluguofficial #biggbosstelugu4 A post shared by @ bigg_boss_4_telugu_trolls on Sep 12, 2020 at 3:40am PDT -
నోయల్ తర్వాత ఆమెకే..: రాహుల్
బిగ్‌బాస్ మూడో సీజన్ విజేత రాహుల్ సిప్లిగంజ్ మరోసారి బుల్లితెరపై సందడి చేయనున్నాడు. ఎలాగో ఇంటిసభ్యుల్లో ఒకరు ఆదివారం బిగ్‌బాస్ హౌస్ నుంచి బ్యాగ్ సర్దేయనున్నారు. అయితే వారిని నేరుగా ఇంటికి పంపించకుండా హౌస్‌మేట్స్‌పై వారి అభిప్రాయాలను, అనుభవాలను పంచుకునేందుకు బిగ్‌బాస్ బజ్ ఉండనే ఉంది. ఈ కార్యక్రమానికి రాహుల్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. అయితే కంటెస్టెంట్లతో మాటామంతీ జరపాలంటే వారి గురించి అంతో ఇంతో తెలిసే ఉండాలి. ఇందుకోసం రాహుల్ ప్రతిరోజూ బిగ్‌బాస్ షోను ఫాలో అవుతున్నాడట. (చదవండి: కంటెస్టెంట్ల ఎంపిక బాగోలేదు: కౌశల్) టాప్ 5లో ఎవరుంటారో ఇప్పుడే చెప్పలేం ఈ మేరకు ఓఇంటర్వ్యూలో రాహుల్ మాట్లాడుతూ.. షో చూస్తున్నాను, కానీ ఎవరు టాప్ 5లో ఉంటారనేది చెప్పడం కష్టమని అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే ఇక్కడ మంచివాళ్లు.. చెడ్డవాళ్లుగా, చెడ్డవాళ్లు.. మంచివాళ్లుగా మారిపోయే ఆస్కారం ఉంటుందన్నాడు. కంటెస్టెంట్లలో తనకు నోయల్ తప్ప ఎవరూ పెద్దగా పరిచయం లేదని పేర్కొన్నాడు. కాకపోతే బిగ్‌బాస్ ఇంట్లోకి యూట్యూబర్లను తీసుకురావడం వారికి దక్కిన గొప్ప అవకాశం అని తెలిపాడు. అందరూ ఊహించినట్టుగానే తన జిగిరీ దోస్త్ నోయల్‌కే సపోర్ట్ చేస్తానని తెలిపాడు. నోయల్ తర్వాత గంగవ్వపై మంచి అభిప్రాయం ఉందని చెప్పుకొచ్చాడు. ఈ వయసులో ఆమె బిగ్‌బాస్ షోలో పాల్గొని యువతతోపాటు చాలామందిని ఇన్స్పైర్ చేస్తుందన్నాడు. ప్రోమోలు కూడా ఆమె మీదే ఎక్కువ వస్తున్నాయని, అటు ట్విటర్లోనూ గంగవ్వ హ్యాష్‌ట్యాగ్‌లు చాలానే ఉంటున్నాయని చెప్పుకొచ్చాడు. (చదవండి: అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటా: మోనాల్) -
నోయల్‌కు నో చెప్పిన బిగ్‌బాస్
బిగ్‌బాస్ ఇచ్చిన ఫిజికల్ టాస్క్ ఇంటిసభ్యులు పూర్తి చేయలేకపోయారు. దీనికి కూడా కట్టప్పే కారణమని పరోక్షంగా చెప్పాడు. దీంతో ప్రతిదానికి అడ్డుపడుతున్న ఈ కట్టప్ప ఎవర్రా బాబూ అని హౌస్మేట్స్ తలలు పట్టుకున్నారు. ఇదిలా వుంటే వయసు అనేది కేవలం నెంబర్ మాత్రమేనని నిరూపించిది గంగవ్వ. 60 ఏళ్లున్న అవ్వ ఈ రోజు కూడా ఉదయం లేవగానే అబ్బాయిలతో పోటీ పడుతూ ఎక్సర్సైజ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత కిచెన్ క్లీన్‌గా ఉంచాలని మోనాల్ చెప్తే అమ్మ రాజశేఖర్ కాస్త అసహనం ప్రదర్శించాడు. వంట చేయడం, క్లీన్ చేయడం ఒకేసారి ఎలా అవుతుందని ప్రశ్నించాడు. అతని సమాధానం నచ్చని కల్యాణి ఈరోజు భోజనం చేయనని ఉపవాసం ఉంటున్నానని చెప్పింది. అసలే ఎలాంటి పండ్లు కూడా లేవని మోనాల్ నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె వినకుండా వెళ్లిపోయింది. (బిగ్‌బాస్‌పై ఐపీఎల్ ఎఫెక్ట్!) అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటా: మోనాల్ ఇవాళేంటో అందరూ హుషారుగా కనిపించారు. కిచెన్‌లో అమ్మ రాజశేఖర్, దివి ఒకరిపై ఒకరు తెగ ప్రేమ కురిపించుకున్నారు. బిగ్‌బాస్‌లో ఉన్నంతసేపు నువ్వు హీరోయిన్, నేను హీరో.. అని చెప్పుకొచ్చాడు దివితో కబుర్లు చెప్పుకుంటూ నూనెలో టీ పొడి వేశాడు. దీంతో నోయల్ ఆ ఇద్దరినీ నూనె, టీ పొడితో పోలుస్తూ అవి రెండూ కలవవు అని పంచ్ వేశాడు. అటు మోనాల్, అభిజిత్ ఒకరి గురించి మరొకరు మరింత లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మోనాల్ తనకు పెద్దలు కుదిర్చిన పెళ్లే చేసుకుంటానని అఖిల్‌తో చెప్పుకొచ్చింది. ప్రస్తుతానికైతే ఎలాంటి రిలేషన్షిప్లో లేనని స్పష్టం చేసింది. ఇక నోయల్ ఇంటి సభ్యుల మీద ర్యాప్ సాంగ్ పాడితే మెహబూబ్, దేవి, దివి కలిసి నోయల్ మీదే ర్యాప్ పాడి ఔరా అనిపించారు. (సూర్య కిరణ్ తగ్గించుకుంటే మంచిది: దివి) మరోసారి కట్టప్ప టాస్క్ సోహైల్.. అఖిల్, లాస్య, హారిక, కల్యాణి.. సూర్యకిరణ్, మోనాల్, గంగవ్వ.. అమ్మ రాజశేఖర్, అరియానా, దేవి, దివి, అమ్మ రాజశేఖర్, సూర్యకిరణ్,.. నోయల్, అఖిల్, మెహబూబ్, సుజాత, అభిజిత్.. లాస్యపై స్టాంపు గుద్దారు. నోయల్ వంతు వచ్చేసరికి మాత్రం కాస్త సీన్ క్రియేట్ చేశాడు. తనకు ఎవరినీ బాధపెట్టడం ఇష్టం లేదని అందుకే తన ముఖంపైనే ముద్ర వేసుకుంటున్నట్లు వెల్లడించాడు. అయితే ఈ నిర్ణయాన్ని ఇంటి సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. అలా చేస్తే నిజమైన కట్టప్ప నువ్వే అవుతావని వారించారు. నోయల్ చర్యను ఖండించిన బిగ్‌బాస్ అయినప్పటికీ నోయల్ తన మనసు మార్చుకోకపోవడంతో బిగ్‌బాస్ రంగంలోకి దిగాడు. నీకు నువ్వు స్టాంప్ వేసుకోడానికి వీల్లేదని చెప్పాడు. దీంతో నోయల్.. లాస్య మీదే అనుమానం ఉన్నప్పటికీ ఆమె ఎక్కడ బాధపడుతుందోనని అమ్మ రాజశేఖర్‌కు స్టాంప్ గుద్దాడు. ఈ తంతు ముగిసిన తర్వాత బిగ్‌బాస్.. ఈ కట్టప్ప ఎవరనేది ఇప్పట్లో తెలియజేయనని, కానీ త్వరలో మీకే తెలుస్తుందంటూ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. అనంతరం రాత్రి మాస్టర్.. ఇంటి సభ్యులు గ్యాంగ్‌గా విడిపోవడంపై జోకులు వేశాడు. ఇప్పుడు హాయిగా సరదాగా నవ్వుకుంటున్న ఇంటి సభ్యుల్లో ఎలిమినేషన్ నుంచి ఎవరు గట్టెక్కుతారు? ఎవరు అవుట్ అవుతారనేది రానున్న ఎపిసోడ్లలో తేలనుంది. (ఇద్దరిని ఏడిపించిన అరియానా) -
నేనే కట్టప్ప: నోయల్
బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టిన కంటెస్టెంట్లలో ఒకరు కట్టప్ప ఉన్నారని బిగ్‌బాస్ ఇంటి సభ్యుల గుండెల్లో భయాన్ని నాటాడు. దీంతో ఆది నుంచి కట్టప్ప ఎవరా అని తెగ ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కువమంది అభిజిత్‌ను కట్టప్పగా భావిస్తుండగా, కొందరు నోయల్‌ను, మరికొందరు సూర్యకిరణ్‌ను కట్టప్ప అనుకుంటున్నారు. కానీ ఎవరనేది ఇంకా తేలలేదు. దేవి నాగవల్లి అయితే అసలీ కట్టప్ప క్యారెక్టరే లేదని తేల్చి చెప్తోంది. ఇదిలా వుంటే అయితే నాలుగు రోజులుగా ఊరిస్తూ వస్తోన్న ఈ ఎపిసోడ్‌కు నేడు ఎండ్ కార్డ్ పడనున్నట్లు కనిపిస్తోంది. (చదవండి: బిగ్‌బాస్: ఫిట్‌నెస్‌పై గంగవ్వ ఫోకస్) తాజాగా విడుదల చేసిన ప్రోమోలో కట్టప్ప ఎవరనుకుంటున్నారో వారి ముఖం మీద స్టాంప్ వేయమని బిగ్‌బాస్ ఇంటి సభ్యులను ఆదేశించాడు. ఈ క్రమంలో అందరూ వారికి అనుమానం ఉన్న వ్యక్తుల మీద స్టాంప్ గుద్దారు. నోయల్ మాత్రం తానెవరినీ బాధపెట్టదల్చుకోలేని ట్విస్ట్ ఇచ్చాడు. కాబట్టి తనే కట్టప్ప అని ప్రకటిస్తూ తన ముఖం మీదే స్టాంప్ వేసుకుని అందరినీ ఒక్కసారిగా షాక్‌కు గురి చేశాడు. అయితే ఎవరి మీద తనకు అనుమానం లేనందువల్లే అలా చేశాడా? నిజంగా అతనే కట్టప్పా? అనేదానిపై ఫుల్ క్లారిటీ రావాలంటే ఇంకొద్ది గంటలు ఆగాల్సిందే. (చదవండి: వైల్డ్ కార్డ్ ఎంట్రీ: ఇద్దరా? ముగ్గురా?) Who is the #Kattappa? Miku evari mida doubt undi??#BiggBossTelugu4 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/Yiu9mL3tAS — starmaa (@StarMaa) September 11, 2020 -
హారిక కొందరికైనా రెస్పెక్ట్ ఇస్తే మంచిది
హౌస్‌లో జరుగుతున్న అల్లర చివ్వర యవ్వారాలకు బిగ్‌బాస్ ఫుల్స్టాప్ పెట్టాడు. కంటెస్టెంట్లతో ఫిజికల్ టాస్క్ ఆడించాడు. తొలిసారి టాస్క్ ఇచ్చాడు కాబట్టి, అందరూ తమ శక్తి మేర కష్టపడ్డారు. ఆ తర్వాత బిగ్‌బాస్ దివికి ప్రత్యేక టాస్క్ ఇచ్చాడు. టాస్క్‌లో భాగంగా దివి వైద్య తానేం అనుకుంటుందో ఉన్నదున్నట్టుగా అందరి మొహం మీదే చెప్పింది. అయితే ఆమె చెప్పినదాన్ని కొందరు అంగీకరించకపోయినప్పటికీ ఎలాంటి వాదులాట జరగకపోవడం విశేషం. నేటి ఎపిసోడ్లో జరిగిన హైలెట్స్‌ను పరిశీలిస్తే.. బిగ్‌బాస్ మార్నింగ్ మస్తీలో దివికి టాస్క్ ఇచ్చాడు. తను ఇంటిసభ్యులను ఏ విషయంలో మార్చాలని అనుకుంటుందో చెప్పాలన్నాడు. దీంతో టాస్క్ ప్రారంభించిన దివి అఖిల్ మోడల్ అని.. అతని వాకింగ్ స్టైల్ కూడా అలానే ఉంటుంది. కాబట్టి అది మార్చుకుంటే మంచిది అని చెప్పింది. పక్కవాళ్లు ఏడిస్తే కన్నీళ్లు పెట్టుకోవద్దని గంగవ్వకు సూచించింది. ఏడవద్దంటే తన వల్లకాదని గంగవ్వ కాస్త కటువుగా సమాధానమివ్వగా, ఏడిస్తే తామెవరం చూడలేం అంటూ అవ్వను కూల్ చేశారు. ఆ తర్వాత అభిజిత్.. కోపం తగ్గించుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చింది. లాస్య సెన్సిటివ్ అని చెప్పగా తాను అలాంటిదాన్ని కానని కొట్టిపారేసింది. హారిక అందరినీ నువ్వు అని సంబోధిస్తుంది, కాకపోతే కొందరికైనా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే మంచిదని చెప్పింది. (చదవండి: బిగ్‌బాస్: ఫస్ట్ వీక్ నామినేషన్స్..) మోనాల్ చిన్నదానికి కూడా ఏడుస్తుందని, కాబట్టి ప్రతిదానికి ఏడవద్దని సూచించింది. దేవి నాగవల్లి అప్పుడే హైపర్‌గా ఉంటారు, మళ్లీ అప్పుడే డల్ అయిపోతారు. కాబట్టి ఎనర్జీ ఎప్పుడూ ఒకేలా ఉంచుకోవాలని తెలిపింది. నోయల్ పాయింట్ మాట్లాడుతున్నాడు. కాకపోతే అది ముందే ప్లాన్ చేసుకున్నట్టు ఉంది. కల్యాణి కొన్నిట్లో ఓవర్ చేస్తున్నారు. అది తగ్గించి, తొందరపడకుండా ఉంటే మంచిది. సూర్య కిరణ్.. ప్రతీది పర్ఫెక్ట్గా చెప్తున్నారు. కానీ నా మాటనే వినడం అనేది తగ్గించాలి అనగానే నేను తగ్గించను అంటూ ఒక్కసారిగా కోప్పడినట్లు బిల్డప్ ఇచ్చి నవ్వేశాడు. అమ్మ రాజశేఖర్.. అందరికీ నచ్చిన పర్సన్. కానీ కుళ్లు జోకులు ఆపేస్తే మంచిదని చెప్పుకొచ్చింది. (చదవండి: బిగ్‌బాస్: 'అతను ఓవరాక్షన్ తగ్గించుకుంటే మంచిది') లగ్జరీ బడ్జెట్ చెడగొట్టిన కట్టప్ప ఎవరు? ఆ తర్వాత బిగ్‌బాస్.. అరియానా, సోహైల్‌ను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచాడు. కట్టప్ప వెన్నుపోటు పొడిచి నిన్న లగ్జరీ బడ్జెట్ టాస్క్‌ను చెగడొట్టాడని చెప్పాడు. ఇంటి సభ్యులు ఎవరిని కట్టప్ప అనుకుంటున్నారో, అందుకు కారణాలేంటో తెలుసుకోవాలన్నాడు. అయితే ఇదే విషయాన్ని సోహైల్ ఇంటి సభ్యులకు చెప్పగా వారు ఈ మాటలను నమ్మలేదు. ఇదేదో కొత్త టాస్క్ అని అనుమానపడ్డారు. నిన్ననే కట్టప్ప ఎవరనేది చీటీ రాసామని, ఇప్పుడు మళ్లీ కొత్తగా చెప్పమని తేల్చి చెప్పారు. అయితే ఇంటి సభ్యుల ఆలోచనను కట్టప్ప ప్రభావితం చేస్తున్నాడని సూర్యకిరణ్ గ్రహించాడు. దీంతో అరియానా, సోహైల్ దగ్గరకు వెళ్లి అఖిల్ కట్టప్ప అనుకుంటున్నానని చెప్పాడు. ఆ తర్వాత గంగవ్వ కూడా అఖిల్ పేరే చెప్పింది. అమ్మ రాజశేఖర్.. నోయల్ పేరును, దివి, మెహబూబ్.. లాస్య పేరు చెప్పారు. అసలు ఇంట్లో కట్టప్ప ఎవరూ లేరని దేవి అభిప్రాయపడింది. కానీ మిగతా ఇంటిసభ్యులు ఎవరూ తమ అబిప్రాయాలు చెప్పేందుకు ముందుకు రాలేదు. ఆ తర్వాత నోయల్ బిగ్‌బాస్ ర్యాప్ సాంగ్ పాడుతుంటే మిగతా ఇంటి సభ్యులు చప్పట్లు కొట్టారు. హౌస్‌లో ఫస్ట్ ఫిజికల్ టాస్క్ బిగ్‌బాస్ ఫిజికల్ టాస్క్ ఇచ్చాడు. అరియానా, సోహైల్ క్వాలిటీ చెక్ మేనేజర్లుగా ఉండగా, వారికి గంగవ్వ అసిస్టెంటుగా వ్యవహరించింది. సూర్య కిరణ్ సంచాలకుడుగా పని చేశాడు. మెహబూబ్, దివి, దేవి ఎల్లో టీమ్, మోనాల్, లాస్య, అఖిల్ గ్రీన్ టీమ్, నోయల్, హారిక, అమ్మ రాజశేఖర్ ఆరెంజ్ టీమ్, అభిజిత్, సుజాత, కల్యాణి బ్లూ టీమ్‌లుగా ఏర్పడ్డారు. సైరన్ మోగగానే గార్డెన్ ఏరియాలో కన్వేయర్ బెల్ట్ ద్వారా వచ్చే వస్తువుల కోసం టీమ్ సభ్యులు ఎగబడ్డారు. అమ్మ రాజశేఖర్, అఖిల్ తెలివిగా ఆడగా, అభిజిత్ ఆటలో కాస్త తడబడ్డాడు. నోయల్, లాస్య కూడా టమాటాల కోసం కొట్టుకున్నంత పని చేశారు. మరి ఈ ఆటలో ఎవరు గెలిచారో రేపు తెలుస్తుంది. మరోవైపు కట్టప్ప ఎపిసోడ్ రేపు కూడా కొనసాగనుంది. కాకపోతే కట్టప్ప తానే అని నోయల్ ముందుకు రావడం కొసమెరుపు. అది నిజమేనా? ట్విస్టులు ఉన్నాయా? అనేది తెలియాలంటే రేపటివరకు ఆగాల్సిందే. (చదవండి: బిగ్‌బాస్: నోరు విప్పిన దివి వైద్య) -
కట్టప్ప అతనే అంటున్న గంగవ్వ
బిగ్‌బాస్ నాల్గవ సీజన్లో కంటెస్టెంట్లు హౌస్‌లో అడుగు పెట్టిన మొదటి రోజే తగాదాలతో, అర్థం పర్థం లేని చిల్లర గొడవలతో తగవు పడ్డ విషయం తెలిసిందే. దీంతో మొదటి రోజునే చాలామంది కంటెస్టెంట్లు బోరుమని ఏడ్చేశారు. అయితే రెండో రోజు మాత్రం కాస్త గొడవలకు దూరంగా ఉంటూ వినోదాన్ని పంచే ప్రయత్నం చేశారు. కానీ ఈసారి కూడా మోనాల్ ఏడుపును ఆపడం ఎవరి తరము కాలేదు. అయితే అందరి మనుసులను తొలిచివేస్తున్న ప్రశ్న "కట్టప్ప ఎవరు?" ఈ ప్రశ్నతోనే నేటి ఎపిసోడ్ ప్రారంభమైనప్పటికీ సరైన సమాధానం మాత్రం దొరకలేదు. ఈ రోజు షో ఎలా సాగిందంటే.. పిచ్చాసుపత్రిలాగా చేస్తున్నవ్ బిగ్‌బాస్ ఇంట్లో ఏర్పాటు చేసిన స్కూల్లో కరాటే కల్యాణి టీచర్ పాత్రలో లీనమైపోయింది అయితే 50 ఏళ్లుగా గంగవ్వ ఇదే స్కూల్లో ఉందని టీచర్ పంచ్ వేస్తే.. జీతం తీసుకుని ఫెయిల్ చేస్తున్నవ్ అని అవ్వ రివర్స్ పంచ్ వేసింది. ఆమె అరుపులతో స్కూలు కాస్తా పిచ్చాసుపత్రిలాగా చేస్తున్నవ్ అంది. గంగవ్వ మాటలతో ఇంట్లో నవ్వులు పూశాయి. ఆ తర్వాత పనిలో పనిగా బిగ్‌బాస్ హౌస్ నియమ నిబంధనలను కూడా కంటెస్టెంట్లకు నేర్పించారు. మరోవైపు రోజు గడుస్తున్నా ఇంకా ప్రత్యేక గదిలోనే ఉన్నారు అరియానా, సోహైల్. మధ్యాహ్నం కావస్తున్నా టిఫిన్, లంచ్ ఏదీ పంపించకుండా పస్తులుంచుతున్నందుకు కంటెస్టెంట్ల తీరుపై అరియానాకు కోపమొచ్చింది. (చదవండి:బిగ్‌బాస్: ఒక్క డైలాగ్‌తో తేల్చేసిన గంగవ్వ) "నిన్న ఆహారం పంపించారు. మరి ఇవాళ పంపించాలన్న ఆలోచన లేదా?" అని అరియానా ఫోన్ చేసి అడిగింది. కాల్ వస్తుందనుకున్నాం అని అఖిల్ చెప్పగానే మెత్తబడిన ఆమె "పొరుగింట్లో ఉన్న మాకోసం ఫుడ్ పంపించాలి కదా" అని వయ్యారాలు పోతూ అడిగింది. ఇలా స్వీట్‌గా మాట్లాడితే ఇంకొంచెం ఎక్కువ కూర పంపిస్తామని అఖిల్ చెప్పాడు. ఇలా తిండికోసం మాట్లాడుతుండగా నోయల్ ఫోన్ అందుకుని ఏంది? మర్యాదగా అడిగితే మర్యాదగా పంపుతాం.. కానీ ఏంటిదంతా అంటూ పంపించట్లేదని చెప్పకనే చెప్తూ ఫోన్ కట్ చేశాడు. ఊహించని పరిణామానికి అరియానా, సోహైల్ బిత్తర మొహాలు వేసుకున్నారు. అఖిలే కట్టప్ప: గంగవ్వ ఇక కట్టప్ప ఎవరా అని బుర్రలు బద్ధలు చేసుకుంటున్న కంటెస్టెంట్లకు బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. మీ మనసులో ఎవరిని కట్టప్పగా అనుకుంటున్నారో వారి పేర్లను రాసి ఓ డబ్బాలో వేయమన్నాడు. అప్పుడు కరాటే కల్యాణి, అమ్మ రాజశేఖర్, సూర్య కిరణ్, సుజాత, గంగవ్వ.. అఖిల్ పేరును, దేవి నాగవల్లి, అఖిల్.. నోయల్, హారిక, లాస్య,.. సూర్య కిరణ్, దివి, మెహబూబ్.. లాస్య, అభిజిత్, మోనాల్.. అమ్మ రాజశేఖర్, నోయల్.. మెహబూబ్ పేర్లను రాశారు. ఇక అఖిలే కట్టప్ప అవుతాడని గంగవ్వ ముఖం పట్టుకుని చెప్పేసింది. అందరం అఖిల్ పేరే రాసినమని అతనితోనే చెప్పుకొచ్చింది. (చదవండి: బిగ్‌బాస్: ఫస్ట్ వీక్ నామినేషన్స్..) ఆకలితో అలమటించిన ఆ ఇద్దరు ఈరోజు మొదటి లగ్జరీ బడ్జెట్ టాస్క్ జరిగింది. ఈ టాస్క్‌కు అమ్మ రాజశేఖర్ సంచాలకులుగా వ్యవహరించాడు. అయితే టాస్క్ జరుగుతున్నప్పుడు ఎవరూ ఏ తప్పు చేయకుండా చూడాల్సిన అమ్మ రాజశేఖర్ వంటింట్లో దూరి పని చేసుకోవడం గమనార్హం. కంటెస్టెంట్లు అందరూ చిత్రలేఖనంలో తమ ప్రావీణ్యాన్ని బయటకు తీశారు. అయినప్పటికీ ఇంటి సభ్యులు కేవలం 5 వేల పాయింట్లు మాత్రమే సాధించుకున్నారు. ఇదిలా వుంటే పొరుగింటి వాళ్లకు భోజనం పంపమని కంటెస్టెంట్లు ససేమీరా చెప్పడంతో అరియానా, సోహైల్‌కు ఉపవాసం తప్పలేదు. దీంతో ఆహారం ఎందుకు పంపలేదో మీరే ఆ ఇంటికి వెళ్లి తేల్చుకోండని బిగ్‌బాస్ సూచించాడు. అర్ధరాత్రి 12 గంటలకు అసలు హౌస్‌లోకి ఈ ఇద్దరు అడుగు పెట్టారు. అసలే ఆకలి మీదున్న వీళ్లు తమకు జరిగిన అన్యాయంపై ఇతర కంటెస్టెంట్లను కడిగి పారేసినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో అభిజిత్‌కు, సోహైల్‌కు పెద్ద గొడవే జరిగినట్లు తెలుస్తోంది. అసలు ఆ గొడవకు కారణమేంటి? ఇందులో ఎవరిది తప్పు? అనేది తెలియాలంటే రేపటివరకు వేచి చూడాల్సిందే! (చదవండి:బిగ్‌బాస్.. అనైతిక షో: నారాయణ) -
బిగ్‌బాస్: అఖిల్ పులిహోర, నోయల్ దమ్కీ
బిగ్‌బాస్ నాల్గవ సీజన్లో 14 మంది కంటెస్టెంట్లను హౌస్‌లోకి పంపించారు. అరియానా గ్లోరీ, సయ్యద్ సోహైల్‌ను మాత్రం ప్రత్యేక గదిలోకి పంపించారు. దీంతో నిన్నటి ఎపిసోడ్లో సోహైల్ ఫోన్లో తానే బిగ్‌బాస్ అని మాట్లాడుతూ ఇద్దరికీ అవసరమయ్యే వస్తువులను, తిండినీ లిస్టు చెప్పి త్వరగా పంపించాలని కంటెస్టెంట్లను ఆదేశించాడు. అతను చెప్పినవన్నీ ఇచ్చేందుకు సుజాత రెడీ అయింది. కానీ నోయల్‌కు మాత్రం ఎక్కడో తేడా కొట్టింది. మాట్లాడింది బిగ్‌బాస్ కాదని చెప్పాడు. ఇంతలోనే కల్యాణి, సుజాతకు చిన్న గొడవ జరగడంతో హౌస్ అంతా రసాభాసగా మారింది. ఇంత గొడవ జరిగినప్పటికీ సోహైల్ అడిగినవన్నీ ఏమాత్రం లోటు లేకుండా పంపించారు. ఇదేదో బాగుంది.. ఏ పనీ చేయకుండానే కూర్చున్న చోటే నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసి తినొచ్చు అని అరియానా, సోహైల్ తెగ సంబరపడిపోయారు. (చదవండి: బిగ్‌బాస్‌ను ఎవరూ పట్టించుకోవట్లేదు! ) కానీ నేటి ఎపిసోడ్లో నోయల్ వారి ఆనందాన్ని నీరు గార్చేసినట్లు తెలుస్తోంది. తాజాగా స్టార్ మా విడుదల చేసిన ప్రోమోలో.. అరియానా ఫోన్ చేసి పొరుగింటి నుంచి మాట్లాడుతున్నాం అని చెప్పింది. ఫోన్ ఎత్తిన అఖిల్.. ఇంత స్వీట్‌గా మాట్లాడితే ఇంకొంచెం కూర ఎక్కువే పంపుతామని పులిహోర కలపడం మొదలుపెట్టాడు. ఇది సీరియస్ అని ఆమె చెప్పగానే నోయల్ ఫోన్ తీసుకుని 'ఏంది? నీ ప్రాబ్లమ్' అని దమ్కీ ఇచ్చాడు. మర్యాదగా అడుగుతేనే మర్యాదగా పంపుతామని తేల్చి చెప్పాడు. దీంతో బిత్తరపోయిన అరియానా కాస్త వినయాన్ని ప్రదర్శిస్తూ మాట్లాడేది ఎవరా అని ఆరా తీసేందుకు పేరడిగింది. 'నా పేరు గూగుల్ చేస్కో' అని నోయల్ ఫోన్ కట్ చేయడంతో ఆమెకు దిమ్మ తిరిగిపోయింది. మరి ఈ స్పెషల్ గదిలో ఉన్న కంటెస్టెంట్లు ఇద్దరూ ఆకలితో అలమటిస్తారా? లేదా మళ్లీ ఫోన్ చేసి బతిమిలాడుకుంటారా? తిండి కోసం ఇతర కంటెస్టెంట్లు ముప్పుతిప్పలు పెట్టిస్తారా? అనేది నేటి ఎపిసోడ్లో చూడాల్సిందే. (చదవండి: బిగ్‌బాస్-4 : హౌస్‌లోకి ఇద్దరు డైరెక్టర్స్!) Separate housemates Iddariki manchi jhalak ichina #Noel 👌 👌 #BiggBossTelugu4 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/QyqPPvzfwz — starmaa (@StarMaa) September 8, 2020 -
పాటలతో ఉర్రూతలూగించే నోయల్
నోయల్ మొదట సింగర్‌గానే పరిచయమైనప్పటికీ ఆ తర్వాత తనలోని నటనా కోణాన్ని కూడా బయటపెట్టాడు. ఇతను అందరికీ సుపరిచితుడే. ది షేక్ గ్రూప్ పేరుతో ఓ తెలుగు బ్యాండ్‌ను కూడా నిర్వహిస్తున్నాడు. 2019లో ఎస్తర్ నోరోన్హాను వివాహం చేసుకున్న నోయల్ కొద్ది రోజుల క్రితమే విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించి అందరినీ షాక్‌కు గురి చేశాడు. కాగా బయట ఎలా ఉంటానో తన ఫ్యామిలీకి తెలియజేసేందుకే బిగ్‌బాస్‌కు వచ్చానంటున్నాడు. రావడంతోనే బిగ్‌బాస్ షోపై ఓ ర్యాప్ సాంగ్ పాడి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇది బిగ్‌బాస్‌కు ఎంత నచ్చిందో తెలీదు కానీ, ప్రేక్షకులు మాత్రం బాగుందంటూ నోయల్‌తో మరింత కనెక్ట్ అయిపోయారు. అటు సింగర్‌గా, ఇటు నటుడిగా రాణిస్తున్న నోయల్ హౌస్‌లో కంటెస్టెంట్ల పోటీని తట్టుకుని ఎక్కడివరకు ప్రయాణం సాగిస్తాడో చూడాలి. -
‘డెస్పాసిటో ’ పాటకి ఫ్యాన్స్ ఫిదా!
-
493 కోట్ల హిట్స్ వచ్చిన పాట.. తెలుగులో..!
సాక్షి, హైదరాబాద్ : గంగ్నమ్ స్టైల్ పాట మీరు వినే ఉంటారు కదూ. ఆ పాట ప్రపంచాన్ని ఎంతగా ఉర్రూతలు ఊగించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మళ్లీ అదే స్థాయిలో యూట్యూబ్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న పాట ‘డెస్పాసిటో’.. స్పానిష్, ఇంగ్లీష్ లిరిక్స్‌తో రూపుదిద్దుకున్న ఈ పాటను తెలుగు రిమేక్ చేశారంటే అది ఎంతలా ప్రపంచాన్ని ఆకట్టుకుంటుందో అర్థం అవుతుంది. ప్యూర్టోరికో దేశానికి చెందిన ప్రముఖ సింగర్ లూయిస్ ఫోన్సీ, డాడీ యాంకీలు డెస్పాసిటోను కంపోజ్ చేశారు. 2017లో విడుదలైన ఈ పాట కేవలం 16 వారాల్లో యూట్యూబ్‌లో 493 కోట్ల మందికి పైగా వీక్షించారు. ఇంత తక్కువ సమయంలో అత్యధిక మంది వీక్షించిన పాట ఇదే. డెస్పాసిటోతో ఇంప్రెస్ అయిన గాయకుడు నోయల్ సీన్, గాయని ఎస్తర్ నొరాహాలు కలసి తెలుగులో ఈ పాటను పాడారు. ఇందుకు సంబంధించిన వీడియోను నోయల్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. డెస్పాసిటో ప్రేమలో పడ్డా నీతో అని సాగే పాట అద్భుతంగా ఉంది. అయితే, ఒరిజినల్ పాటకు నోయల్ కంపోజ్ చేసిన పాటకు తేడా ఉంది. ఒరిజినల్‌ను కాపీ చేయకుండా నోయల్ చేసిన ప్రయత్నం ఆకట్టుకుంటోంది. లిరిక్స్ కూడా వినడానికి చక్కగా ఉన్నాయి. ఇప్పటివరకూ ఈ పాటకు యూట్యూబ్‌లో 40 వేల పైచిలుకు వీక్షించారు. -
'ఎందుకో ఏమో' మూవీ స్టిల్స్