బిగ్‌బాస్‌ : నోయల్‌ రీఎంట్రీ.. సర్‌ప్రైజ్‌ వీడియో | Bigg Boss 4 Telugu : Noel Sean Will Come Back Surprising Video Posted | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ : నోయల్‌ రీఎంట్రీ.. సర్‌ప్రైజ్‌ వీడియో

Published Mon, Nov 2 2020 7:50 PM | Last Updated on Mon, Nov 2 2020 8:00 PM

Bigg Boss 4 Telugu : Noel Sean Will Come Back Surprising Video Posted - Sakshi

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ నుంచి నోయల్‌ అర్థాంతరంగా వెళ్లిపోయాడు. అనారోగ్య పరిస్థితి దృష్ట్యా అతను హౌస్‌లో ఉండటం సరికాదని వైద్యులు సూచించడంతో నోయల్‌ బిగ్‌బాస్‌ను వీడాల్సివచ్చింది. మొదట మెరుగైన వైద్యం కోసం నోయల్‌ బయటకు వెళ్తున్నాడని.. త్వరలో కోలుకుని తిరిగి వస్తాడని బిగ్‌బాస్‌ చెప్పాడు. అయితే శనివారం నాగార్జున వచ్చి.. నోయల్‌ ఇక శాశ్వతంగా బిగ్‌బాస్‌ హౌస్‌ని వీడుతున్నాడని కుండబద్దలు కొట్టాడు. ఎలిమినేట్‌ అయిన అందరి కంటెస్టెంట్స్‌లాగే నోయల్‌కు కూడా ఘన వీడ్కోలు పలికారు. నోయల్‌ని స్టేజ్‌ మీదకు రప్పించి సెల్ఫీ తీసుకొని బైబై చెప్పి బయటకు పంపించేశాడు. దీంతో నోయల్‌ ఫ్యాన్స్‌ ఒకింత అసంతృప్తికి లోనైనా.. ఆయన త్వరాగా కోలుకోవాలని ప్రార్థనలు చేశారు.
(చదవండి : బిగ్‌బాస్‌ : ఆమెను నామినేట్‌ చేసి షాకిచ్చిన అఖిల్‌)

ఇంతవరకు బాగానే ఉన్నా... సోమవారం ఓ సర్‌ప్రైజ్‌ వీడియో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి.. ఫ్యాన్స్‌కి శుభవార్తని అందిచాడు నోయల్‌. ‘బిగ్‌బాస్‌ గేమ్‌ ఇప్పటికీ ఆన్‌లోనే ఉంది(The Game is still ON).  ఏదైనా జరగొచ్చు.. నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. నా హెల్త్ కోసం ఎంతోమంది ఫోన్లు చేస్తున్నారు. ఎన్నో మెసేజ్‌లు వస్తున్నాయి. వాటిని చూస్తే చాలా ఎమోషనల్‌గా ఉంది. కానీ.. బిగ్ బాస్ గేమ్‌లో ఏదైనా జరగొచ్చు.. ది గేమ్ ఈజ్ స్టిల్ ఆన్. పని అయిపోయింది అనుకున్నవాడు మళ్లీ తిరిగి వస్తే ఆ కిక్ వేరేలా ఉంటుంది కదా? త్వరలో ఫుల్‌ డీటైల్స్ అందిస్తా మళ్లీ కలుద్దాం’ అంటూ వీడియో విడుదల చేసి ఫ్యాన్స్‌ని అయోమయోనికి గురిచేశాడు నోయల్‌. ఇప్పటికే బిగ్‌బాస్‌లో ఎన్నెన్నో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత వారం పక్కా ఎలిమినేట్‌ అవుతారనుకున్న అమ్మ రాజశేఖర్‌ని సేవ్‌ చేస్తూ అందరిని అశ్చర్యపరిచాడు బిగ్‌బాస్‌. మరి నోయల్‌ని కూడా తిరిగి హౌస్‌లోకి పంపి మరో ట్విస్ట్‌ ఇస్తాడేమో చూడాలి. ఏదైనా జరగొచ్చు అంటున్నాడుగా నోయల్.. ఏం జరుగుతుందో చూడాలి మరి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement