బిగ్‌బాస్ నాల్గో సీజన్‌లో ఎప్పుడో వెళ్లిపోవాల్సిన కంటెస్టెంటు అమ్మ రాజశేఖర్. అదృష్టం బాగుండి, బిగ్‌బాస్ టీమ్ కాపాడటం వల్ల కొన్నివారాలు ఎలిమినేషన్ నుంచి తప్పించుకోగలిగాడు. కానీ ఆయనను బయటకు పంపించేందుకు ప్రేక్షకులు కాచుకుని కూర్చున్నారు. తీరా నామినేషన్‌లోకి వచ్చాడు. వేటు వేశారు. వెళ్లిపోయారు. అయితే అఖిల్ చెప్పినట్లు అమ్మ రాజశేఖర్ తనకు నచ్చినవాళ్లతో బాగా మాట్లాడతారు. నచ్చకపోతే ఎదుటివాళ్లను మాట్లాడనిచ్చేవారే కాదు. తాజాగా ఆయన బిగ్‌బాస్ బజ్‌లో రాహుల్ సిప్లిగంజ్ దగ్గర ఇంటిసభ్యుల గురించి తన అభిప్రాయాలను వెల్లడించాడు.తన ఎంటర్‌టైన్‌మెంట్‌కు నవ్వుతూనే, అందులో తప్పులు వెతుకుతూ నామినేట్ చేస్తారని చెప్పుకొచ్చారు. (చదవండి: ప్యాంటులో మాస్క్ పెట్టుకుంటావా?: సల్మాన్ ఫైర్)
లాస్య సింపథీ గేమ్ ఆడుతోంది
"అభిజిత్‌ను చూసి చాలామంది పని చేయకుండా బద్ధకస్తులవుతున్నారు. అతడు పొద్దున డ్యాన్స్ చేయడు, గేమ్ ఆడడు, టాస్క్‌ను మధ్యలో ఆపేస్తాడు. అసలు బిగ్‌బాస్‌కు అభిజిత్ సూట్ కాడు. ఇక అఖిల్‌కు యాటిట్యూడ్ ఎక్కువ. అరియానా ముక్కుసూటిగా మాట్లాడుతుంది. కానీ, టాస్కులో మాత్రం రఫ్ఫాడిస్తుంది. దేవి నాగవల్లి ప్రతీది నెగెటివ్‌గా ఆలోచిస్తుంది. దివి.. నేను జనాల్లో బ్యాడ్ అవకుండా కాపాడింది. ఆమెకు నేను దిండు పెట్టిన గొడవలో ఆమె నావైపు నిల్చుని దేవతలా కాపాడింది. అప్పటి నుంచి ఆమె నా బెస్ట్ ఫ్రెండ్. గంగవ్వ.. నేను ఏడుస్తుంటే చీర కొంగుతో కన్నీళ్లు తుడిచింది. నేను వెళ్లిపోతే బిగ్‌బాస్ షోనే ఉండదు అంటూ ఓదార్చింది. హారిక.. ఇంగ్లీషులో మాట్లాడేవాళ్లతో ఉంటుంది. లాస్యకు ఆమె ముఖంలో ఉన్న క్లారిటీ లోపల ఉండదు. ఆమె నవ్వుకు ఏదో ఒక అర్థం ఉంటుంది. సింపథీ గేమ్ ఆడుతోంది. మెహబూబ్‌ను చూస్తే చిన్నప్పుడు నన్ను నేను చూసుకున్నట్లు ఉంటుంది. ఫైర్ ఉంది కానీ తెలివి లేదు. మోనాల్.. ఏం చేస్తుందో ఆమెకే అర్థం కాదు. చిన్నవాటికి ఎమోషనల్ అయిపోతుంది" (చదవండి: బిగ్‌బాస్: కెప్టెన్‌గా మాస్టర్, మరి ఎలిమినేషన్?)
నోయల్ ఫేక్, ఎనిమది వారాలు నటించాడు
"నోయల్.. ఫేక్ కంటెస్టెంటు. నిజానికి నోయల్ కోసమే బిగ్‌బాస్‌కు వచ్చాను. మొదట జాలీగా ఉన్నాం. తర్వాత అతడికి కాళ్లనొప్పి రావడంతో గేమ్ ఆడలేకపోయాడు. తర్వాత ఫాదర్, ఆ తర్వాత గురూజీ అయిపోయాడు. అతడికి హగ్గింగ్ డాక్టర్ అని పేరు కూడా పెట్టాను. కానీ అతడి క్యారెక్టర్ చివర్లో బ్లాస్ట్ అయింది. అంటే హౌస్‌లో ఎనిమిది వారాలు నటించాడంటే ఆస్కారు అవార్డు ఇవ్వాల్సిందే. సోహైల్‌కు కోపమెక్కువ. అందరితో బాగుండాలని తాపత్రయపడతాడు. అవినాష్.. నాలాగే ఎంటర్‌టైన్ చేస్తాడు. నోయల్ అతడిని చిల్లర కామెడీ అనడం చాలా తప్పు" అని విమర్శించాడు. దీంతో రాహుల్ మధ్యలో కలగజేసుకుని నోయల్ ఆ మాట మిమ్మల్ని అన్నాడు కానీ అవినాష్‌ను కాదని వెనకేసుకొచ్చాడు. అయితే మాస్టర్ మాత్రం అతడు ఎవరి పేరూ చెప్పలేదని, ఇద్దరికీ వేలు చూపించాడని చెప్పుకొచ్చాడు. ఇక తనకు స్విచ్ అయ్యే అవకాశం వస్తే.. అభిని బయటకు పంపించి తాను లోపలికి వెళ్తానని పేర్కొన్నాడు. తన వల్ల కనీసం టీఆర్పీ అయినా పెరుగుతుందని, వాడి వల్ల ఏదీ అవదని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment