
బిగ్‌బాస్ నాల్గో సీజన్ నుంచి నోయల్ అర్థాంతరంగా వెళ్లిపోయాడు. అనారోగ్య పరిస్థితి దృష్ట్యా అతను హౌస్‌లో ఉండటం సరికాదని వైద్యులు సూచించడంతో అతను మధ్యలోనే హౌస్‌ని వీడి బయటకు వచ్చాడు. బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లిన తొలివారంలోనే నోయల్‌కు కాళ్లనొప్పి ప్రారంభమైంది. అయితే ప్రేక్షకుల కోసం నోయల్ ఆ నొప్పినంతా భరిస్తూ పైకి నవ్వుతూ చక్కగా గేమ్ ఆడాడు. నొప్పి రోజు రోజుకి తీవ్రతరం కావడంతో నోయల్ అసలు విషయం చెప్పి బయటకు వచ్చాడు. అయితే ఇన్ని రోజులు నోయల్ నరకం అనుభించినట్లుగా శనివారం ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థం అవుతోంది.
ఆయన మామలు కాళ్ల నొప్పులతో బాధపడలేదు.. ఆయనకు యాంకిలాసింగ్ స్పాండిలైటిస్ అనే వ్యాది ఉందట. ఇది ఎముకలకు సంబంధించిన వ్యాధి. ఈ వ్యాది వల్ల ఎముకల పనితీరు మెల్ల మెల్లగా క్షీణిస్తుందని వైద్యులు చెబుతున్నారు. దాని వల్ల దేహంలోని పలు అంగాలపై ప్రభావం పడుతుందట. ఈ వ్యాధి బారిన పడిన వారి నడక తీరు, నిలబడే విధానం మారిపోతుంట. ఈ వ్యాధి ప్రభావం పక్కటెముకలపై పడితే శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుందని వైద్యులు చెబుతున్నారు. కంటి చూపు కూడా ప్రభావితం అవ్వడంతో పాటు గుండెకు సంబంధించిన సమస్యలు కూడా మొదలు అవుతాయి. ఇలా శరీరం మొత్తం కూడా ఈ వ్యాది వల్ల క్షీణిస్తూ మనిషి జీవచ్చవం మాదిరిగా అయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. నోయల్‌కు అత్యున్నత చికిత్స అందిస్తే ఆయన తప్పకుండా మళ్లీ మామూలు మనిషి అవుతాడని కూడా వైద్యులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment