Deergaishmaanbhava: ఆకట్టుకుంటున్న‘వదిలి వెళ్ళిపోకే’ సాంగ్‌ | Vadili Vellipoke Song Out From Deergaishmaanbhava Movie | Sakshi
Sakshi News home page

Deergaishmaanbhava: ఆకట్టుకుంటున్న‘వదిలి వెళ్ళిపోకే’ సాంగ్‌

Published Sat, Nov 27 2021 4:46 PM | Last Updated on Sat, Nov 27 2021 5:18 PM

Vadili Vellipoke Song Out From Deergaishmaanbhava Movie - Sakshi

కార్తీక్ రాజు, మిస్తీ చక్రవర్తి హీరో హీరోయిన్లుగా నోయెల్, ఆమని, పృద్వీ, సత్యం రాజేష్, కాశి విశ్వనాధ్,  తాగుబోతు రమేష్, గెటప్ శ్రీను తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం  'దీర్ఘాయుష్మాన్ భవ'. ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ గారు  చాలా రోజుల తర్వాత మళ్ళీ యముడి పాత్రలో నటించగా డాక్టర్ ఎంవీకే రెడ్డి సమర్పణలో ప్రతిమ ఈ సినిమా ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.

పూర్ణానంద మిన్నకూరి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం వహించారు. మలహర్ భట్ జోషి ఛాయాగ్రహణం అందించగా వినోద్ యాజమాన్య సంగీతం సమకూరుస్తున్నారు. కిషోర్ మద్దాలి ఎడిటర్ గా చేస్తున్నారు. కాగా ఈ సినిమాలోని ‘వదిలి వెళ్ళిపోకే’ అనే పాట యూట్యూబ్ లో విడుదల కాగా ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతుంది. సోసియో ఫాంటసీ ప్రేమకథా చిత్రం గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా త్వరలోనే విడుదలతేదీ ని ప్రకటించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement