
బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టిన కంటెస్టెంట్లలో ఒకరు కట్టప్ప ఉన్నారని బిగ్‌బాస్ ఇంటి సభ్యుల గుండెల్లో భయాన్ని నాటాడు. దీంతో ఆది నుంచి కట్టప్ప ఎవరా అని తెగ ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కువమంది అభిజిత్‌ను కట్టప్పగా భావిస్తుండగా, కొందరు నోయల్‌ను, మరికొందరు సూర్యకిరణ్‌ను కట్టప్ప అనుకుంటున్నారు. కానీ ఎవరనేది ఇంకా తేలలేదు. దేవి నాగవల్లి అయితే అసలీ కట్టప్ప క్యారెక్టరే లేదని తేల్చి చెప్తోంది. ఇదిలా వుంటే అయితే నాలుగు రోజులుగా ఊరిస్తూ వస్తోన్న ఈ ఎపిసోడ్‌కు నేడు ఎండ్ కార్డ్ పడనున్నట్లు కనిపిస్తోంది. (చదవండి: బిగ్‌బాస్: ఫిట్‌నెస్‌పై గంగవ్వ ఫోకస్)
తాజాగా విడుదల చేసిన ప్రోమోలో కట్టప్ప ఎవరనుకుంటున్నారో వారి ముఖం మీద స్టాంప్ వేయమని బిగ్‌బాస్ ఇంటి సభ్యులను ఆదేశించాడు. ఈ క్రమంలో అందరూ వారికి అనుమానం ఉన్న వ్యక్తుల మీద స్టాంప్ గుద్దారు. నోయల్ మాత్రం తానెవరినీ బాధపెట్టదల్చుకోలేని ట్విస్ట్ ఇచ్చాడు. కాబట్టి తనే కట్టప్ప అని ప్రకటిస్తూ తన ముఖం మీదే స్టాంప్ వేసుకుని అందరినీ ఒక్కసారిగా షాక్‌కు గురి చేశాడు. అయితే ఎవరి మీద తనకు అనుమానం లేనందువల్లే అలా చేశాడా? నిజంగా అతనే కట్టప్పా? అనేదానిపై ఫుల్ క్లారిటీ రావాలంటే ఇంకొద్ది గంటలు ఆగాల్సిందే. (చదవండి: వైల్డ్ కార్డ్ ఎంట్రీ: ఇద్దరా? ముగ్గురా?)
Who is the #Kattappa? Miku evari mida doubt undi??#BiggBossTelugu4 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/Yiu9mL3tAS
— starmaa (@StarMaa) September 11, 2020
Comments
Please login to add a commentAdd a comment