Kattappa
-
తెలుగులో ఆ సినిమాతోనే ఫేమ్.. ఇకపై ఆ పాత్రలు చేయను: సత్యరాజ్
కట్టప్పగా తెలుగు ప్రేక్షకులను అలరించిన నటుడు సత్యరాజ్. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రంతో కట్టప్పగా అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు. తాజాగా ఆయన జీబ్రా మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు. సత్యదేవ్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన సత్యరాజ్ తెలుగు ఇండస్ట్రీలో తన ప్రస్థానంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.సత్యరాజ్ మాట్లాడుతూ..'విలన్‌గానే నా కెరీర్ ప్రారంభించా. మిర్చి సినిమాతో తెలుగులో ఓ మంచి తండ్రిగా ఫేమస్ అయ్యాను. ఆ తర్వాత బాహుబలిలో కట్టప్పగా నటించా. ఇలాంటి పాత్రలు మళ్లీ చేసే అవకాశం రావడం చాలా అరుదు. మిర్చి మూవీతోనే తెలుగులో నాకు ఇమేజ్ వచ్చింది. ఇక నుంచి రెగ్యులర్ విలన్ పాత్రలు చెయ్యను. హీరో ముందు మోకరిల్లే పాత్రల్లో ఇకపై కనిపించను.' అని అన్నారు. (ఇది చదవండి: సత్యదేవ్ 'జీబ్రా' టీజర్ విడుదల)సత్యదేవ్, డాలీ ధనుంజయ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా జీబ్రా. ఈ ఏడాదిలో కృష్ణమ్మ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సత్యదేవ్.. ఇప్పుడు జీబ్రా అనే చిత్రంతో రానున్నాడు. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై ఎస్ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాలసుందరం, దినేష్ సుందరం ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాను దీపావళి సందర్భంగా అక్టోబరు 31న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో జెన్నిఫర్ పిసినాటో, సునీల్, ప్రియా భవానీ శంకర్, సత్య అక్కల కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం రవి బస్రూర్ అందించారు. -
బాహుబలి 'కట్టప్ప' రెమ్యునరేషన్, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?
తెలుగు సినిమా ప్రేక్షకులు సత్యరాజ్‌ను చూడగానే 'కట్టప్ప' అంటూ ఉంటారు. అంతలా 'బాహుబలి' సినిమాతో ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకు తగ్గట్టుగా తన పాత్రలో కట్టప్పగా ఒదిగిపోయారు సత్యరాజ్. కెరీర్ ప్రారంభంలోనే కొన్ని తెలుగు చిత్రాలలో విలన్‌గా కనిపించిన ఆయన తర్వాత పలు ప్రత్యేకమైన పాత్రలతో మెప్పించారు. తమిళనాటలో కూడా కెరీర్ ప్రారంభంలో విలన్ పాత్రలే చేశారు. తర్వాత స్టార్ హీరోగా కొనసాగారు. అనంతరం కేరెక్టర్ రోల్స్ లోకి మారిపోయారు. అప్పటి నుంచీ అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ సత్యరాజ్ కేరెక్టర్ యాక్టర్‌గా అలరిస్తూనే ఉన్నారు. (ఇదీ చదవండి: ఎయిర్‌పోర్టులో ప్రభాస్ చెంపపై కొట్టిన యువతి.. వీడియో వైరల్) సత్యరాజ్ అసలు పేరు రంగరాజ్. నేడు ఆయన 70వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అక్టోబర్ 3, 1954 కొయంబత్తూర్‌లో సత్యరాజ్ జన్మించారు. తండ్రి సుబ్బయ్య డాక్టర్. కొయంబత్తూరులోనే సత్యరాజ్ బి.ఎస్సీ వరకు చదువుకున్నారు. ఆయనకు నటులు ఎమ్.జి.రామచంద్రన్, రాజేశ్ ఖన్నా అంటే ఎనలేని అభిమానం. వారి స్ఫూర్తితో ఎలాగైన వెండితెరపై మెరవాలని ఆయనలో ఆశ చిగురించింది. కానీ ఆయన తల్లికి మాత్రం ఇష్టం లేదు. అయినా అది లెక్క చేయకుండా చెన్నైకి పయనమయ్యాడు సత్యరాజ్. మొదట తమిళ హీరో సూర్య తండ్రి శివకుమారు అప్పట్లో టాప్ హీరో. ఆయనను కలిసి ఎలాగైనా సినిమా అవకాశం ఇప్పించాలని ప్రాధేయపడ్డారు. (ఇదీ చదవండి: 100 సినిమాల్లో నటించిన దేవయాని.. టీచర్‌గా చేయాల్సిన పరిస్థితి ఎలా వచ్చింది) తల్లిదండ్రులకు ఇష్టంలేని పని చేయడం ఎందుకని, వారు చెప్పినట్లు చదువు పూర్తి చేయమని చెప్పి వెనక్కు పంపించేశాడు. కానీ, సత్యరాజ్ చెన్నైలోనే ఉంటూ ప్రయత్నాలు మొదలు పెట్టారు. అలా కమల్ హాసన్ హీరోగా నటించిన 'సట్టం ఎన్ కైయిల్' చిత్రంలో తొలిసారిగా ఒక కీలకమైన పాత్రలో కనిపించారు సత్యరాజ్. అందులో ప్రధాన విలన్‌కు అనుచరునిగా సత్యరాజ్ నటించారు. తర్వాత 1985లో కార్తిక్ రఘునాథ్ రూపొందించిన 'సావి' చిత్రంలో తొలిసారి హీరోగా కనిపించారు సత్యరాజ్. అనేక అవార్డులు నటుడు సత్యరాజ్‌కు తమిళనాడు ప్రభుత్వ కలైమామణి అవార్డు, MGR అవార్డు, పెరియార్ అవార్డు, ఫిల్మ్‌ఫేర్ అవార్డు, విజయ్ అవార్డు వంటి లెక్కలేనన్ని అవార్డులు వరించాయి. బాహుబలిలో కట్టప్పగా ఆయన పాత్రను యావత్ ప్రపంచానికి తీసుకెళ్లింది. ఆస్తి విలువ సత్యరాజ్‌కు మిర్చి సినిమాతో మంచి పాపులారిటి దక్కింది. అప్పట్లో ఒక సినిమాకు సుమారు రూ. 2 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. సత్యరాజ్‌కు చెన్నైలో స్వంత ఇల్లు ఉంది. అతను తన కుటుంబంతో కలిసి ఈ ఇంట్లో నివసిస్తున్నాడు. ఈ ఇంటి విలువ దాదాపు రూ.5 కోట్లు అని టాక్. అలాగే, అతని వద్ద ఫార్చ్యూనర్, ఫోర్డ్ ఎండీవర్, ఇన్నోవా అనే మూడు కార్లు ఉన్నాయి. అతనికి నాగమ్మాళ్ అనే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా ఉంది. ప్రస్తుతం దీని ద్వారా ఆయన భారీగానే ఆదాయాన్ని పొందుతున్నట్లు చెబుతున్నారు. అతని మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ. 60 కోట్ల నుంచి 70 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. -
ఆదిపురుష్‌పై వీరేంద్ర సెహ్వాగ్ ఎలాంటి కామెంట్ చేశాడంటే..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - కృతిసనన్ జంటగా ఓం రౌత్ తెరకెక్కించిన 'ఆదిపురుష్' విడుదలైన రోజు నుంచే వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. సినిమా విడుదలైన నాటి నుంచి ఏదో ఒక విధంగా విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని దీన్ని తెరకెక్కించినప్పటికీ.. ఇప్పటివరకూ వచ్చిన ఏ రామాయణ రచనలతోనూ దీనికి పోలిక లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. (ఇదీ చదవండి: ప్రెగ్నెంట్ అని తెలిసినా..ఆ అవకాశం వదులుకోలేదు: అలియా) ఇప్పటికే చాలామంది ప్రముఖులు సినిమాపై విమర్శలతో విరుచకపడ్డారు. రావణుడితో హనుమంతుడి సంభాషణలపై కూడా తీవ్ర దుమారం రేగడంతో మేకర్స్ వాటిని మార్చిన విషయం తెలిసిందే. తాజాగా భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఈ సినిమాపై కామెంట్ చేశాడు. ఆదిపురుష్ చూసిన తర్వాత బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో ఇప్పుడు అర్థమైందంటూ ఒక స్మైల్ ఎమోజీని చేర్చి ట్వీట్ చేశాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సెహ్వాగ్‌పై ఫైర్ అవుతున్నారు. క్రికెట్ తర్వాత ఇప్పుడు ఆదిపురుష్ మూవీపై దృష్టి పెడుతున్నారా..? న్యాయాన్ని ప్రజలు ఎందకు ద్వేషిస్తారో ఇప్పుడు అర్థం అవుతుంది అంటూ సెహ్వాగ్‌ను ట్రోల్ చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం సినిమాను ఇంకా బెటర్‌గా తీయాల్సిందంటూ ఆయనకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ట్విటర్లో వీరు చేసిన పోస్ట్‌కు సమాధానంగా వచ్చే కామెంట్స్ కూడా వైరల్ అవతున్నాయి. Adipurush dekhkar pata chala Katappa ne Bahubali ko kyun maara tha 😀 — Virender Sehwag (@virendersehwag) June 25, 2023 (ఇదీ చదవండి: Urvashi Rautela: అందులో ఫోటోలు ఉన్నాయి.. దొరికితే ఇవ్వండి) -
కట్టప్ప కొడుకు హీరోగా 'మాయోన్'
“కట్టప్ప” సత్యరాజ్ కుమారుడు సిబిరాజ్ హీరోగా యువ దర్శకుడు కిషోర్ దర్శకత్వంలో రూపొందిన ప్రతిష్ఠాత్మక చిత్రం “మాయోన్”. ఈ చిత్ర హక్కులను మూవీమ్యాక్స్ అధినేత, ప్రముఖ నిర్మాత మామిడాల శ్రీనివాస్ సొంతం చేసుకున్నారు. “మాయోన్” చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో జూలై 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్బంగా చిత్ర నిర్మాత మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. 'పురాతన దేవాలయానికి సంబంధించిన ఒక రహస్య పరిశోధన నేపథ్యంలో హై టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ “మాయోన్” చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గాడ్ వెర్సస్ సైన్స్ మెయిన్ థీమ్‌గా మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని నిర్మాత అరుణ్ మోజి మాణికం భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఆయనే ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రాయడం విశేషం. కిషోర్ ఎన్ దర్శకత్వం వహించిన ఈ మిస్టరీ థ్రిల్లర్‌కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ‘U’ సర్టిఫికేట్ మంజూరు చేసింది. అలాగే ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం ప్రధాన ఆకర్షణ అని చెప్పవచ్చు. ఇప్పటికే ఇసైజ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన పాటలకు సంగీత ప్రియుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ చిత్రంలో హీరో సిబిరాజ్ ‘అర్జున్’ అనే ఆర్కియాలజిస్ట్‌గా నటిస్తుండగా, తాన్య రవిచంద్రన్ ఎపిగ్రాఫిస్ట్ పాత్రలో కనువిందు చేయనుంది. ఇందులో నటించిన సత్యరాజ్ కుమారుడు సిబిరాజ్ కు మంచి భవిష్యత్ ఉంటుంది' అన్నారు. చదవండి: మొదట్లో కన్ను గీటాను, చివరికి పక్షవాతం అని తేలింది హనీమూన్‌కు చెక్కేసిన నయనతార దంపతులు -
నేనే కట్టప్ప: నోయల్
బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టిన కంటెస్టెంట్లలో ఒకరు కట్టప్ప ఉన్నారని బిగ్‌బాస్ ఇంటి సభ్యుల గుండెల్లో భయాన్ని నాటాడు. దీంతో ఆది నుంచి కట్టప్ప ఎవరా అని తెగ ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కువమంది అభిజిత్‌ను కట్టప్పగా భావిస్తుండగా, కొందరు నోయల్‌ను, మరికొందరు సూర్యకిరణ్‌ను కట్టప్ప అనుకుంటున్నారు. కానీ ఎవరనేది ఇంకా తేలలేదు. దేవి నాగవల్లి అయితే అసలీ కట్టప్ప క్యారెక్టరే లేదని తేల్చి చెప్తోంది. ఇదిలా వుంటే అయితే నాలుగు రోజులుగా ఊరిస్తూ వస్తోన్న ఈ ఎపిసోడ్‌కు నేడు ఎండ్ కార్డ్ పడనున్నట్లు కనిపిస్తోంది. (చదవండి: బిగ్‌బాస్: ఫిట్‌నెస్‌పై గంగవ్వ ఫోకస్) తాజాగా విడుదల చేసిన ప్రోమోలో కట్టప్ప ఎవరనుకుంటున్నారో వారి ముఖం మీద స్టాంప్ వేయమని బిగ్‌బాస్ ఇంటి సభ్యులను ఆదేశించాడు. ఈ క్రమంలో అందరూ వారికి అనుమానం ఉన్న వ్యక్తుల మీద స్టాంప్ గుద్దారు. నోయల్ మాత్రం తానెవరినీ బాధపెట్టదల్చుకోలేని ట్విస్ట్ ఇచ్చాడు. కాబట్టి తనే కట్టప్ప అని ప్రకటిస్తూ తన ముఖం మీదే స్టాంప్ వేసుకుని అందరినీ ఒక్కసారిగా షాక్‌కు గురి చేశాడు. అయితే ఎవరి మీద తనకు అనుమానం లేనందువల్లే అలా చేశాడా? నిజంగా అతనే కట్టప్పా? అనేదానిపై ఫుల్ క్లారిటీ రావాలంటే ఇంకొద్ది గంటలు ఆగాల్సిందే. (చదవండి: వైల్డ్ కార్డ్ ఎంట్రీ: ఇద్దరా? ముగ్గురా?) Who is the #Kattappa? Miku evari mida doubt undi??#BiggBossTelugu4 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/Yiu9mL3tAS — starmaa (@StarMaa) September 11, 2020 -
బ్యాంకాక్‌లో బాహుబలి.. లండన్‌లో కట్టప్ప
ముందు బాహుబలి (ప్రభాస్) బొమ్మ.. ఇప్పుడు కట్టప్ప (సత్యరాజ్) బొమ్మ కూడా కనువిందు చేయనుంది. ఎక్కడ అంటే? మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో. తుస్సాడ్స్ బ్యాంకాక్ శాఖలో ఇప్పటికే బాహుబలి కొలువు దీరాడు. ఇప్పుడు లండన్ శాఖలో కట్టప్ప కనిపించబోతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకునే ప్రముఖుల మైనపు విగ్రహాలను తుస్సాడ్స్ వారు మ్యూజియంలో ప్రతిష్టించే విషయం తెలిసిందే. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ప్రభాస్ మైనపు విగ్రహాన్ని బాహుబలి గెటప్‌లోనే ప్రతిష్టించారు. ఇదే సినిమా ద్వారా బోలెడంత పాపులార్టీ తెచ్చుకున్న సత్యరాజ్ విగ్రహాన్ని కట్టప్ప గెటప్‌లో పెట్టాలని తుస్సాడ్స్ నిర్ణయించుకుంది. త్వరలో సత్యరాజ్‌ని కలిసి విగ్రహ కొలతలు తీసుకోనున్నారు. లండన్ తుస్సాడ్స్‌లో చోటు సంపాదించుకోబోతున్న తొలి తమిళ నటుడు సత్యరాజే కావడం విశేషం. తమిళంలో ఆయన దాదాపు 200 పై చిలుకు సినిమాలు చేసినా ఒక్క ‘బాహుబలి’ ఆయన్ను వరల్డ్ వైడ్‌గా పాపులర్ చేసేసింది. -
కట్టప్పకు అరుదైన గౌరవం
సాక్షి, సినిమా : బాహుబలి సిరీస్‌లో కట్టప్ప పాత్రకు దక్కిన గుర్తింపు అంతా ఇంతా కాదు. మాషిష్మతి రాజ్యానికి, సింహాసనానికి.. నమ్మిన బంటుగా ఉండే పాత్రలో నటుడు సత్యరాజ్ మెప్పించగా.. దర్శకధీరుడు రాజమౌళి ఆ పాత్రను అద్భుతంగా తీర్చి దిద్దడంతో జనాలు బాగా కనెక్ట్ అయ్యారు. అయితే ఆ కట్టప్ప అలియాస్ సత్యరాజ్‌కు ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కింది. లండన్‌లోని మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో కట్టప్ప మైనం విగ్రహం ఏర్పాటు చేయబోతున్నారు. త్వరలో కట్టప్ప రూపంలో ఉన్న సత్యరాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు మ్యూజియం నిర్వాహకులు ప్రకటించారు. ఈ విషయాన్ని కోలీవుడ్ మీడియా, సత్యరాజ్ తనయుడు శిబి సత్యారాజ్ కూడా ధృవీకరించారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే... మేడమ్ టుస్సాడ్‌లో విగ్రహ ఏర్పాటు గౌరవం అందుకున్న తొలి తమిళ నటుడు సత్యరాజ్ కావటం. అంతకు ముందు బాహుబలి రూపంలో ఉన్న ప్రభాస్ విగ్రహాన్ని కూడా బ్యాంకాక్ మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో నెలకొల్పిన విషయం తెలిసిందే. Really proud to read this!😊🙏🏻 #Kattappa #Baahubali https://t.co/M61ZcN8OLU — Sibi (Sathya)raj (@Sibi_Sathyaraj) 11 March 2018 -
హర్రర్ చిత్రంలో సత్యరాజ్
కోలీవుడ్‌లో హర్రర్ కథా చిత్రాల ట్రెండ్ చాలా కాలంగానే కొనసాగుతోంది. ఇందుకు కారణం ప్రేక్షకుల ఆదరణే అని చెప్పవచ్చు. ఇకపోతే దక్షిణ భారతీయ సినిమాలో ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించి ఆ పాత్రకు జీవం పోసే నటుడు సత్యరాజ్. ఈ మధ్య బాహుబలి చిత్రంతో తన పేరును దేశ వ్యాప్తంగా ఇనుమడింపజేసుకున్న ఈయన తాజాగా హర్రర్ థ్రిల్లర్ కథా చిత్రంలో ప్రధాన పాత్రను పోషించడానికి సిద్ధం అవుతున్నారు. దీన్ని కళ్లపడం చిత్ర ఫేమ్ వేల్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ పాత్రలకు నప్పే నటులను ఎంపిక చేసుకోవడం చిత్రానికి చాలా ముఖ్యం అని తాను భావిస్తానన్నారు. ఆ విధంగా తాజా చిత్రానికి సత్యరాజ్ నటించడానికి ఒప్పుకోవడంతో సగం పని తగ్గిందని అన్నారు. ఇది ఒక ఎఫ్ఎం రేడియో స్టూడియో నేపథ్యంలో సాగే సూపర్ నేచురల్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. ఒక రాత్రి ఎఫ్ఎం.రేడియో స్టూడియోలో జరిగిన సంఘటన ఇతివృత్తంగా చిత్రం ఉంటుందన్నారు. దీన్ని ఒక ఎఫ్ఎం స్టూడియోలోనే చిత్రీకరించనున్నట్లు తెలిపారు. ఒక నూతన నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుందని, ప్రస్తుతం ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని చెప్పారు. హర్రర్ కథా చిత్రాల్లో ఈ చిత్రం వైవిధ్యభరితంగా ఉంటుందని దర్శకుడు వేల్ పేర్కొన్నారు. ఇంకాపేరు నిర్ణయించని ఈ సినిమా ఉత్కంఠ భరిత సన్నివేశాలతో అన్ని వర్గాలను అలరించే చిత్రంగా ఉంటుందని అన్నారు. -
‘సీఎం శివగామి, రాయ్ కట్టప్ప’
సాక్షి, న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ అసంతృప్తి నేత కుమార్ విశ్వాస్ మరోసారి పార్టీ కన్వీనర్ గోపాల్ రాయ్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. గతంలో ఎమ్మెల్యే అమానుతుల్లాను లక్ష్యంగా చేసుకొన్న గోపాల్ రాయ్ ఇప్పుడు తనపై అదే విధంగా కక్షకట్టారని విమర్శించారు. బాహుబలి-2 సినిమాలో కట్టప్ప క్యారెక్టర్ గోపాల్ రాయ్‌కు సరిగ్గా సరిపోతుందని ఎద్దేవా చేశారు. సినిమాలో శివగామి దేవి తనకు ఎవరైనా ఎదురుతిగితే అంతం చేయడానికి కట్టప్పను ఉసిగొల్పుతుందని, చివరకు కొడుకు బాహుబలిని కూడా చంపేయిస్తుందని, ఇప్పుడు పార్టీలో కూడా అదే పరిస్థితి నెలకొని ఉందని కుమార్ విశ్వాస్ అన్నారు. అధిస్థానానికి ఎదురు తిరిగితే తమ పార్టీ అధినేత కేజ్రీవాల్, తిరుగుబాటుదారులపై గోపాల్‌రాయ్ అనే కట్టప్పను ప్రయోగిస్తారని దుయ్యబట్టారు. పార్టీలోని చాలామంది కార్యకర్తలు తనని రాజ్యసభ సభ్యుడిగా చూడాలనుకున్నారని, ఈ విషయంపై పార్టీలో ఎన్నిక కూడా నిర్వహించాలని సూచించానని అన్నారు. కానీ తన మాటను పార్టీ పక్కన పడేసిందని, కావాలనే వ్యాపార వేత్త సుశీల్ గుప్తా, చార్టెడ్ అకౌంటెంట్ ఎన్డీ గుప్తా, పార్టీ నేత సంజయ్ సింగ్‌లను పార్టీ ఎంపిక చేసిందని విమర్శించారు. ఇది పార్టీలో నిజాలు మాట్లాడినందుకు దక్కిన ఫలితం అన్నారు. ఇది తన బలిదానంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. అయితే దీనిపై పార్టీ సీనియర్ నేత స్పందించారు. గోపాల్ రాయ్‌పై కుమార్ విశ్వాస్ ఆరోపణలు చేసినప్పటికీ ఆయన్ను పార్టీ బుజ్జగించే ప్రయత్నం చేసిందని అన్నారు. ఒకవేళ పార్టీ కుమార్‌ను నిర్లక్ష్యం చేస్తే రాజస్తాన్ ఎన్నికల ఇన్చార్జ్గా విశ్వాస్ను ఎందుకు ఎంపిక చేస్తారంటూ ప్రశ్నించారు. ఇక రాజ్యసభ ఎన్నికల విషయానికి వస్తే శుక్రవారం నామినేషన్ల గడువు ముగిసింది. 8 వరకూ నామినేషన్లు ఉపసంహరణకు గడువు ఉంది. జనవరి 16న ఎన్నికలు జరగనున్నాయి. -
మరో భారీ చిత్రంలో కట్టప్ప..!
బాహుబలి తరువాత అంతటి భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న దక్షిణాది చిత్రం సంఘమిత్ర. తమిళ దర్శకుడు సుందర్ సి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను తేనాండల్ ఫిలింస్ సంస్థ 250 కోట్ల బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. తమిళ హీరోలు జయం రవి, ఆర్య హీరోలుగా నటిస్తున్న ఈసినిమాకు హీరోయిన్ ఎంపికపై కసరత్తులు జరుగుతున్నాయి. ముందుగా శృతిహాసన్ ను ఫైనల్ చేసినా తరువాత నిర్మాతలతో అభిప్రాయ భేదం రావటంతో ఆమె తప్పుకుంది. శృతిహాసన్ తరువాత సంఘమిత్ర పాత్రకు చాలా మంది హీరోయిన్ల పేర్లను పరిశీలించిన యూనిట్, హన్సికను ఫైనల్ చేసే ఆలోచనలో ఉంది. సినిమాలో మరో కీలకమైన పాత్రకు కోలీవుడ్ సీనియర్ నటుడు సత్యరాజ్ ను తీసుకున్నారు. బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సత్యరాజ్, సంఘమిత్రలోనూ కీలక పాత్రలో కనిపించనున్నాడు. -
కట్టప్పగా నేనైతే ఇంకా బాగా చేసేవాణ్ని..!
బాహుబలి 2 సినిమా రిలీజ్ అయి రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఆ సినిమా ప్రస్తావన వస్తూనే ఉంది. ఇటీవల ఈ సినిమా చూసిన బాలీవుడ్ నటుడు గుల్షన్ గ్రోవర్, కట్టప్ప పాత్ర తానైతే మరింత బాగా చేసేవాడినన్నాడు. ఆ పాత్ర చేసేందుకు కావాల్సిన ఫిజిక్, మేనరిజమ్స్ నాకు ఉన్నాయన్న గుల్షన్ కట్టప్ప పాత్రకు నేనే మరింత న్యాయం చేయగలనన్నాడు. అయితే ఆ పాత్రలో నటించిన సత్యరాజ్, చాలా బాగా నటించాడని, ముఖ్యంగా సినిమా సక్సెస్ క్రెడిట్ అంతా రాజమౌళిదే అన్నాడు. రాజమౌళి గొప్ప డైరెక్టర్ అన్న గ్రోవర్, అవకాశం వస్తే అతనితో కలిసి పని చేసేందుకు రెడీ అన్నాడు. బాలీవుడ్ లో విభిన్న పాత్రలతో ఆకట్టుకుంటున్న గుల్షన్ గ్రోవర్, క్రిమినల్, బాలు లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షలను కూడా మెప్పించాడు. -
కట్టప్ప పాత్రకు సూపర్ స్టార్‌ను అడిగారట..!
బాహుబలి 2 రిలీజ్ అయి మూడు వారాలు దగ్గర పడుతున్నా.. ఆ సినిమాకు సంబంధించిన ప్రతీ వార్తను ప్రేక్షకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. తాజాగా సినిమాలో కీలకమైన కట్టప్ప పాత్రకు సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి ఫిలిం సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతుంది. బాహుబలి 2పై అంతటి హైప్ క్రియేట్ అవ్వడానికి కట్టప్ప, బాహుబలిని ఎందుకు చంపాడన్న ప్రశ్న కూడా ఓ కారణం. అయితే ఇంతటి ప్రధాన పాత్రకు ముందుగా అనుకున్న నటుడు సత్యరాజ్ కాదట. కట్టప్ప పాత్రలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు సత్యరాజ్. అయితే ఈ పాత్రకు ముందుగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌ను సంప్రదించారు. అప్పటికే కమిట్ అయిన సినిమాతో మోహన్ లాల్ బిజీగా ఉండటం.. ఒకే సినిమాకు బల్క్ డేట్స్ ఇచ్చే ఉద్దేశం లేకపోవటంతో లాల్ ఈ సినిమాకు నో చెప్పాడు. అలా సత్యరాజ్ చేతికి వెళ్లిన కట్టప్ప పాత్ర ఆయన కెరీర్ లోనే అత్యుత్తమ పాత్రల్లో ఒకటిగా నిలిచిపోయింది. -
కట్టప్పకు బాలీవుడ్ హీరో భార్య ఫిదా
ముంబై: బాహుబలి2 విడుదలైన తర్వాత మొత్తం ప్రేక్షకులు సినీలోకమంతా ప్రభాస్, రాజమౌళి, కట్టప్ప, శివగామిలాంటి పాత్రలను తెగ పొగిడేస్తుండగా ప్రముఖ బాలీవుడ్ నటి, నటుడు అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా మాత్రం కట్టప్పపై మనసు పారేసుకుంది. బాహుబలి సినిమాలో మహిష్మతి సామ్రాజ్యంలో బానిస సేన నాయకుడిగా సత్యరాజ్ పోషించిన కట్టప్ప పాత్రను తెగ ఇష్టపడుతోంది. అందులో భాగంగా సోషల్ మీడియా ఖాతా ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసింది. తాను కట్టప్పకు ఎలా అభిమానిగా మారిపోయాననే విషయాన్ని వివరించింది. ‘నేను బాహుబలి 2 చూశాను. నా కూతురు కోపంతో తన తండ్రిని కట్టప్ప అని పిలుస్తోంది. ఎంతలా అంటే ఒక వ్యసనంలాగా.. కట్టప్ప అని తను మూడుసార్లు అరిచేంత వరకు కూడా మేం అస్సలు అపలేకపోతున్నాం’ అంటూ ట్వింకిల్ ఖన్నా చెప్పుకొచ్చింది. -
శివగామితో కట్టప్ప రొమాన్స్.. ఫ్యాన్స్ షాక్!
-
శివగామితో కట్టప్ప రొమాన్స్.. ఫ్యాన్స్ షాక్!
చెన్నై: రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి-2 దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన అన్ని భాషల్లో ఈ సినిమా రికార్డు కలెక్షన్లు సాధిస్తోంది. మాహిష్మతి సామ్రాజ్యం రాజమాత శివగామి పాత్రల్లో నటించిన రమ్యకృష్ణకు హీరోల స్థాయిలో పేరు వచ్చింది. ఇక రాణికి విశ్వాసపాత్రుడిగా, బానిసగా కట్టప్ప పాత్ర పోషించిన సత్యరాజ్‌కు కూడా మంచి మార్కులు పడ్డాయి. కట్టప్ప.. బాహుబలిని ఎందుకు చంపాడని ఉత్కంఠగా ఎదురు చూసిన ప్రేక్షకులకు సమాధానం దొరికింది. అయితే థియేటర్లలో ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులకు మరో కొత్త ట్విస్ట్ ఎదురైంది..! సినిమా విరామంలో స్నాక్స్, డ్రింక్స్ తీసుకుని థియేటర్లలోకి వచ్చిన ప్రేక్షకులు తెరపై కనిపిస్తున్న దృశ్యం చూసి షాకయ్యారు. శివగామి (రమ్యకృష్ణ) పక్కన కట్టప్ప (సత్యరాజ్) కూర్చుని రొమాన్స్ చేస్తూ కనిపించాడు. ఇదేంటి రాజమాతతో బానిస ఇంత చనువుగా ఉండటం ఏంటి? అంటూ ప్రేక్షకులు అయోమయానికి గురయ్యారు. కాసేపు ఏమీ అర్థం కాలేదు. కట్టప్ప ఓ చీరను శివగామికి కానుకగా ఇవ్వగా ఆమె తీసుకుని మురిసిపోతోంది. ప్రేక్షకులు అయోమయంలో ఉండగానే ఇది పోతిస్ యాడ్ అంటూ తెరపై కనిపిస్తుంది. ఇది వ్యాపార ప్రకటన అని తెలిశాక ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. దేశ వ్యాప్తంగా బాహుబలికి ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి పాపులర్ టెక్స్టైల్ బ్రాండ్ కోసం రమ్యకృష్ణ, సత్యరాజ్‌లతో యాడ్ రూపొందించారు. ఇందులో వీరిద్దరూ రాజు, రాణిగా కనిపిస్తారు. రమకృష్ణ బాహుబలి సినిమాలో మాదిరిగా అదే వేషధారణతో కనిపించగా, సత్యరాజ్ మాత్రం ఈ సినిమాలో పాత్రకు భిన్నంగా బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు ధరించి రాచఠీవిలో కనిపిస్తాడు. మొత్తానికి ఈ యాడ్ చూసిన ప్రేక్షకులు అయోమయానికి గురికావడంతో పాటు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. -
బాహుబలి 2లో సమాధానం దొరకని ప్రశ్నలు
బాహుబలి తొలి భాగం రిలీజ్ అయిన దగ్గర నుంచి సినీ జనాలను వేదిస్తున్న ప్రశ్న కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు.? అయితే ఈ ప్రశ్నకు బాహుబలి 2 సమాధానం ఇచ్చిన దర్శకుడు రాజమౌళి, చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే బాహుబలి 2వ భాగాన్ని ముగించేశాడు. ఇప్పుడు ఆ సమాధానం దొరకని ప్రశ్నలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. బాహుబలి తొలి భాగంలో శివుడు, భల్లాలదేవుడి కొడుకు భధ్రని తల నరికి చంపాడు. అయితే రెండో భాగంలో భల్లాలదేవుడి భార్యకు సంబంధించిన సన్నివేశాలుంటాయి భావించిన ప్రేక్షకులకు ఆమె ఎవరన్నది సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలిపోయింది. రెండో భాగంలోనూ భల్లాలదేవుడి కొడుకు ప్రస్థావన ఉన్నా భార్యను మాత్రం చూపించలేదు. తొలిభాగంలో కాలకేయల నేపథ్యం వాళ్ల నాయకుడికి వివరాలను సవివరంగా చూపించిన చిత్రయూనిట్ రెండో భాగంలో కుంతల రాజ్యం మీద దాడిచేసిన పిండారీల నేపథ్యం నాయకుడిపై పెద్దగా దృష్టి పెట్టలేదు. అదే సమయంలో తొలిభాగంలో ఏ సాయం కావాలన్న ఈ మిత్రుడన్నాడంటూ కట్టప్పకు మాట ఇచ్చిన అస్లాం ఖాన్ రెండో భాగంలో కనిపిస్తాడని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. క్లైమాక్స్ మహిష్మతి మీద దండెత్తడానికి శివుడికి సైనికబలం పెద్దగా లేకపోయినా అస్లాం ఖాన్ సాయం మాత్రం తీసుకోలేదు. అంతేకాదు దేవసేనను విడిపించడానికి ప్రాణత్యాగానికి సైతం సిద్ధమైన అంవతిక నేపథ్యం కుటుంబం లాంటి వివరాలను కూడా ఎక్కడా ప్రస్థావించలేదు. ఇప్పటికే సినిమా నిడివి పెరిగిపోవటంతో కొన్ని విషయాలను చూసి చూడనట్టు వదిలేశారో..? లేక అవి అంత ముఖ్యం కాదనుకున్నారోగాని..? సోషల్ మీడియాకు మాత్రం మంచి టాపిక్ ఇచ్చారు బాహుబలి టీం. -
బాహుబలిని చంపడానికి కారణాలు ఇవేనా?
టాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా బాహుబలి ఫీవర్ రెండేళ్ల క్రితం మొదలైంది. బహుబలి మొదటి పార్ట్ స్క్రీన్స్‌పైకి వచ్చిన నాటి నుంచి అభిమానుల మదిని తొలుస్తున్న ఒకే ప్రశ్న బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?. శుక్రవారం బహుబలి పార్ట్ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాహుబలి సినిమాను క్షుణ్ణంగా పరిశీలిస్తే బహుబలిని కట్టప్ప చంపడానికి ఐదు కారణాలు ఉండొచ్చు. అయితే, అసలు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలుసుకోవాలంటే మాత్రం మూవీ విడుదలయ్యే దాకా అంటే శుక్రవారం వరకూ ఆగాల్సిందే. పొరబాటున: కట్టప్ప బాహుబలిని వెనుక నుంచి పొడిచి చంపినట్లు బహుబలి 2 ట్రైలర్లో ఉంది. వేరొకరిని చంపుతున్నానని భావించిన కట్టప్ప బాహుబలిని పొడిచేసి ఉండొచ్చు. భల్లాలదేవ బెదిరిస్తే.. కట్టప్ప బాహుబలి, భల్లాలదేవులకు శిక్షకుడు. చిన్ననాటి నుంచి బాహుబలిపై పగ పెంచుకున్న భల్లాలదేవుడు బాహును చంపాలని కట్టప్పను బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉంది. భల్లాలదేవుడి ఆజ్ఞ కారణంగా.. బాహుబలి మొదటిపార్ట్‌లో తన ప్రాణాలను కాపాడినందుకు ఏదైనా కోరుకోమని కట్టప్పను భల్లాలదేవ అడుగుతాడు. అప్పుడు కట్టప్ప దేవసేనను విడిపించాలని కోరుతాడు. అందుకు స్పందించిన భల్లాలుడు ఆమెను కత్తితో తెగ నరికి విడిపించుకోమంటాడు. అచ్చూ అలానే పరిస్ధితి ఎదురై బాహుబలిని చంపాలని భల్లాలుడు కట్టప్పను ఆజ్ఞాపించి ఉండొచ్చు. భల్లాలదేవుడు రాజు కావడం వల్ల.. కాలకేయుల మీద యుద్ధం ముగిసిన తర్వాత బాహుబలి మాహిష్మతికి రాజుగా పట్టాభిషేకం తీసుకుంటాడని శివగామి ప్రకటిస్తుంది. బాహుబలి పార్ట్ 2 ట్రైలర్లో బాహుబలి రాజుగా పట్టాభిషేకం పొందుతూ ప్రతిజ్ఞ చేస్తాడు. అయితే, దేవసేనను కాపాడాలని గిరిజన బృందం మనకు బాహుబలి పార్ట్ 1లో కనిపిస్తుంది. దేవసేనను చూసిన బాహుబలి ఆమెను పెళ్లాడటానికి రాజు కిరీటాన్ని వదులుకోవడానికి సిద్ధపడితే.. భల్లాలుడు రాజుగా పట్టాభిషేకం పొందే అవకాశం కలిగి ఉండొచ్చు. ఆ తర్వాత మాహిష్మతి రాజ్య సింహాసనానికి కట్టు బానిసైన కట్టప్పను బాహుబలిని చంపాలని భల్లాలుడు ఆదేశించి ఉండొచ్చు. కట్టప్ప బిజ్జలదేవుడి బానిస కావడం వల్ల.. బాహుబలి టీం ది రైజ్ ఆఫ్ శివగామి పుస్తకాన్ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ పుస్తకంలో కట్టప్ప బానిసల కుటుంబంలో జన్మించాడని ఉంది. కట్టప్ప తండ్రి సోమదేవ బిజ్జలదేవుడి తండ్రి మలయప్పకు బానిస అని కూడా అందులో ఉంది. బిజ్జలదేవుడిని రక్షించడానికి కట్టప్ప సొంత సోదరుడిని చంపుతాడని పుస్తకంలో ఉంది. బిజ్జలదేవుడు బాహుబలిని చంపాలని కట్టప్పను ఆదేశించే అవకాశం కూడా ఉంది. -
బాహుబలి 2 రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్
కర్ణాటకలో రెండు వారాలుగా బాహుబలి 2 రిలీజ్ విషయంలో జరుగుతున్న హై డ్రామాకు తెరపడింది. కావేరి జలాల విషయంలో సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలతో కన్నడిగుల మనోభావాలు దెబ్బతిన్నాయన్న ఆరోపణతో ఆయన కీలక పాత్రలో నటించిన బాహుబలి 2 రిలీజ్ ను అడ్డుకుంటామంటూ ప్రకటించారు ఆందోళనకారులు. బాహుబలి 2లో కట్టప్ప పాత్రలో నటించిన సత్యరాజ్ క్షమాపణ చెపితేనే రిలీజ్ కు అంగీకరిస్తామని ప్రకటించారు. రాజమౌళి కోరినా కన్నడ ప్రజాసంఘాలు దిగిరాకపోవటంతో కట్టప్ప దిగిరాక తప్పలేదు. శుక్రవారం కట్టప్ప వీడియో మెసేజ్ రూపంలో కన్నడిగులకు క్షమాపణ తెలపటంతో బాహుబలి 2 రిలీజ్ కు లైన్ క్లియర్ అయ్యింది. కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న కన్నడిగులు సత్యరాజ్ క్షమాపణలు చెప్పిన తరువాత ఆందోళన విరమిస్తున్నట్టుగా ప్రకటించారు. దీంతో ఏప్రిల్ 28న కర్ణాటకలో కూడా బాహుబలి భారీ ఎత్తున రిలీజ్ కు సిద్ధమవుతోంది. -
అసలు కట్టప్ప ఏమన్నాడు?
న్యూఢిల్లీ: బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న ప్రశ్న ఇంతకాలం ప్రేక్షకుల మదిని తొలుస్తూ వచ్చింది. ఆ స్థానంలో కట్టప్ప కన్నడిగులకు క్షమాపణ చెబుతారా, లేదా ? అన్న ప్రశ్న ఆక్రమించింది. చెప్పినా దుమారం రేపిన వివాదం సమసిపోతుందా? సినిమా సకాలంలో విడుదలవుతుందా? అని బాహుబలి అభిమానుల్లో ఆందోళన అంకురించింది. బాహుబలి దర్శకుడు రాజమౌలి సోషల్ మీడియా ద్వారా కట్టప్ప తరఫు బేషరుతుగా కన్నడిగులకు క్షమాపణలు చెప్పారు. ఆ మరుసటి రోజే, అంటే శుక్రవారం కట్టప్ప పాత్రధారి, తమిళనటుడు సత్యరాజ్ కూడా కన్నడిగులకు క్షమాపణలు చెప్పారు. ఎప్పుడో చేసిన తన వ్యాఖ్యలు కన్నడిగులను నొప్పించి ఉంటే అందుకు క్షమాపణులు చెబుతున్నానని చెప్పారు. ఈ నెల 28వ తేదీన విడుదల కావాల్సిన బాహుబలి–2 చిత్రం విడుదలను అడ్డుకోరాదని వేడుకున్నారు. ఇంతకు కన్నడిగులను అవమానించేలా సత్యరాజ్ ఏమన్నారు? ఎప్పుడన్నారు? అన్న ప్రశ్నలు కూడా సినిమా ప్రేక్షకులకు కలుగుతున్నాయి. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య 800 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తున్న కావేరీ నదీ పంపకాలపై ఇరు రాష్ట్రాల మధ్య ఎప్పటి నుంచో వివాదం నెలకొన్న విషయం తెల్సిందే. ఇరు రాష్ట్రాల నటులు ఎన్నో ఏళ్లుగా వారి వారి ప్రభుత్వాల వైఖరీలకు మద్దతుగా ప్రజాందోళనలకు మద్దతిస్తున్నారు. ధర్నాలు, బైఠాయింపుల్లో కూడా పొల్గొంటున్నారు. 2008లో చెన్నైలో నిర్వహించిన ఓ ధర్నా కార్యక్రమంలో రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి నటులు పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో సత్యరాజ్ మాట్లాడుతూ ‘కుక్కలు ఉచ్చపోస్తుంటే మౌనం వహించే మానులా తమిళప్రజలు ఉండరాదు’ అన్నారు. ఈ వ్యాఖ్యలపై కన్నడ సంఘాలు మండిపడ్డాయి. కాలక్రమంలో ఈ మాటలు ఇరు రాష్ట్రాల ప్రజలు మరచిపోయారు. బహూశ సత్యరాజ్ కూడా మరచిపోయి ఉంటారు. బాహుబలి–2 విడుదలను పురస్కరించుకొని కొందరు నాడు సత్యరాజ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు. ఏప్రిల్ 28న విడుదలవుతున్న బాహుబలిని అడ్డుకోవడంతోపాటు మొత్తం బెంగళూరు బంద్‌కు వటల్ నాగరాజ్ నాయకత్వంలోని ‘కన్నడ చలవలి వటల్ పక్ష’ సంఘం పిలుపునిచ్చింది. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బేషరుతుగా సత్యరాజ్ క్షమాపణలు చెబితేగానీ విడుదలను అనుమతించమని నాగరాజ్ హెచ్చరించారు. దానికి కన్నడి చలనచిత్ర వాణిజ్య మండలి కూడా మద్దతు పలికింది. సత్యరాజ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు చేసినవా, ఎప్పుడో చేసినవా అన్న అంశంతో తమకు సంబంధం లేదని, ఆ వ్యాఖ్యలు కర్ణాటకను, కన్నడిగులను అవమానపరిచే విధంగా ఉన్నాయని మండలి వ్యాఖ్యానించింది. గతంలో నాగరాజ్‌ను పెద్ద కమెడియన్ అంటూ కూడా సత్యరాజ్ ఎద్దేవ చేశారు. ఈ నేపథ్యంలోనే సత్యరాజ్ క్షమాపణల పత్రాన్ని చదవి దాన్ని వీడియోతీసి మీడియాలకు విడుదల చేశారు. కన్నడ సంఘాలు సత్యరాజ్‌ను బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని కోరితే క్షమాపణలు చెప్పిన సత్యరాజ్ చివరలో తాను తమిళ ప్రజల పోరాటానికి ఎప్పుడూ అండగా నిలబడతానని కూడా చెప్పారు. మరి ఇంతటితో వివాదం సమసిపోతుందా, లేదా చూడాలి. వివాదానికి తెరపడకపోతే వాస్తవానికి సత్యరాజ్‌కు వచ్చే నష్టమేమి లేదు. 45 కోట్ల రూపాయలకుపైగా డబ్బులుపెట్టి చిత్రం హక్కులుకొన్ని కన్నడ డిస్ట్రిబ్యూటర్లే నష్టపోతారు. -
ఎట్టకేలకు దిగొచ్చిన ‘కట్టప్ప’
-
ఎట్టకేలకు దిగొచ్చిన ‘కట్టప్ప’
చెన్నై: కన్నడిగుల ఆందోళనతో ‘కట్టప్ప’ దిగొచ్చాడు. కన్నడ ప్రజలకు వ్యతిరేకంగా 9 ఏళ్ల క్రితం తాను చేసిన వ్యాఖ్యలపై తమిళ నటుడు సత్యరాజ్ క్షమాపణ చెప్పారు. తాను కన్నడ ప్రజలకు వ్యతిరేకం కాదని, వివాదానికి ముగింపు పలకాలని విజ్ఞప్తి చేశారు. తన వ్యాఖ్యలు బాహుబలి-2 సినిమా విడుదలకు అడ్డంకి కారాదని ఆకాంక్షించారు. తన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడివుంటే క్షమించాలని వేడుకున్నాడు. బాహుబలి-2 సినిమాను అడ్డుకోవద్దని కన్నడీగులను కోరాడు. ఈ మేరకు లేఖ చదువుతూ వీడియో విడుదల చేశాడు. తమిళ ప్రజల సంక్షేమం కోసం మాట్లాడుతూనేవుంటానని, సినిమాల్లో అవకాశాలు పోయినా లెక్కచేయనని చెప్పారు. కావేరి నదీ జలాల వివాదం నేపథ్యంలో తమకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన సత్యరాజ్ క్షమాపణ చెప్పకుంటే బాహుబలి-2 సినిమాను అడ్డుకుంటామని కన్నడ సంఘాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. తమ సినిమాను అడ్డుకోవద్దని కన్నడ ప్రజలను దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి స్వయంగా కోరాడు. భారీ వ్యయంతో తెరకెక్కిన తమ సినిమాను అడ్డుకుంటే తీవ్రంగా నష్టపోతామని తెలిపాడు. రిలీజ్ అడ్డుకుంటే అందరూ నష్టపోవాల్సి వస్తుందని, బాహుబలి తొలి భాగాన్ని ఆదరించినట్టుగానే కన్నడ ప్రేక్షకులు బాహుబలి-2 కూడా ఆదరించాలని విజ్ఞప్తి చేశాడు. -
కాంగ్రెస్‌లో అంతా కట్టప్పలే..!
ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సరదాగా ఒక హ్యూమరస్ ఔట్లుక్! ‘బాహుబలి–2 వస్తున్నది... ఫస్ట్ డే రోజే చూడాలె’ అన్నడు నర్సింగ్. ‘అవ్‌గనీ... గీపారి బాహుబలి ఏషం ఎవరేసిండ్లే...?’ అని అడిగిండు యాదగిరి. ‘ఎవరేసుడేందిరా? బాహుబలి అంటే ప్రభాసే కదా...?’ అన్నడు నర్సింగ్. ‘అరెవారీ... నీకు గింతగూడ జన్రల్ నాలెడ్జ్ లేదురా. మొన్న తెలంగాణ అసెంబ్లీల జానారెడ్డి సారేమన్నడు. కాంగ్రెస్ పార్టీకి ఒక బాహుబలి ఒస్తడు... పార్టీని గెలిపిస్తడు అని అన్నడు కదా...’ అన్నడు యాదగిరి. ‘అవ్ అవ్... జానారెడ్డి సారు గా మాట అనంగనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గీతారెడ్డి అసొంటోళ్లు లేసి జానారెడ్డే మా బాహుబలి అని చెప్పిండ్లు కదా ’ అన్నడు నర్సింగ్. ‘జానారెడ్డి లెక్కల బాహుబలి అంటే రాహుల్ గాంధీ. కోమటిరెడ్డి లెక్కల జానారెడ్డే బాహుబలి. జానారెడ్డి అంటే పడనోళ్లకు మరో లీడర్ బాహుబలి. ఇగ కొంతమంది లీడర్లయితే మాకంటే బాహుబలి ఎవరున్నరు అని మనసుల అనుకున్నరు. మరి వీళ్లల్ల రాజమౌళి ఎవరికి బాహుబలి వేషమిస్తడో ఏందో చూడాలె’ అన్నడు యాదగిరి. ‘మొత్తానికి కాంగ్రెసోళ్లందరు బాహుబలికి బాగనే ప్రచారం చేస్తున్నరు... అసలు కాంగ్రెస్‌ల ఎంతమంది బాహుబలులు ఉన్నరే?’ అని అడిగిండు నర్సింగ్. ‘కాంగ్రెస్‌ల బాహుబలులు ఉన్నారో లేదో తెల్వదుగనీ... కట్టప్పలు మాత్రం మస్తు మందున్నరు’ అన్నడు యాద్గిరి. ‘కాంగ్రెస్‌ల ప్రతి ఒక్కడూ కట్టప్పనే. జానా బాహుబలి అయితే పొన్నాల కట్టప్ప అయితడు... కోమటి రెడ్డి బాహుబలి అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి కట్టప్ప అయితడు’ అని యాదగిరి చెబుతుంటే... ‘మరి అట్లయితే భళ్లాల దేవుడెవర్రా?’ అని అడిగిండు నర్సింగ్. ‘పిసిసి ప్రెసిడెంట్ కుర్చీల ఎవరు కూసుంటే వాళ్లే భళ్లాల దేవుడు’ అన్నడు యాదగిరి. అబ్బర నాయనా... మస్తు చెప్పినవ్... అన్నడు నర్సింగ్. – ఓరుగల్లు శ్రీ -
కట్టప్ప ఎందుకు చంపాడో అప్పుడే చెప్పేశాడు!
ఒక్క ప్రశ్న సినీ ప్రేమికులను ఉక్కిరిబిక్కిరి చేసింది. అభిమానులకు నిద్రలేని రాత్రులను ఇచ్చింది. ఇప్పటికీ రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఆ ప్రశ్నకు జవాబు లేదు. ఆ మిస్టరీ అంతుబట్టలేదు. అదే.. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఆ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ఇంకా కొన్నినెలలు ఆగాల్సిందే. అభిమానులను వెంటాడుతున్న 'బాహుబలి-1'లోని ఈ ట్వీస్టు గురించి తాజాగా 'భల్లాల దేవ' అలియాస్ రాణా దగ్గుబాటి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపాడు. బాలీవుడ్ టైఫ్.కామ్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన రాణాను టాప్ సీక్రెట్ అయిన 'బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపారు' అని అడిగారు. దీనికి రాణా ఆసక్తిరమైన సమాధానం చెప్పాడు. అక్షరాల ఐదు సంవత్సరాల కిందటే ఈ విషయం 'బాహుబలి' చిత్రంతో అనుబంధమున్న ప్రతి ఒక్కరికి తెలుసని చెప్పాడు. 'మా సినిమా (బాహుబలి) సెట్లోని ప్రతి ఒక్కరికీ ఈ విషయం తెలుసు. ఈ సినిమాలో పనిచేస్తున్న చిన్న నటుడు మొదలు పెద్ద నటుడి వరకు ప్రతి ఒక్కరికీ సినిమా కథ స్పష్టంగా తెలిసేవిధంగా రాజమౌళి ముందే చెప్పేశారు. ఐదేళ్ల కిందటే రెండు పార్టుల గురించి మాకు చెప్పాడు. ఇదేమీ అప్పటికప్పుడు అనుకున్న సంగతి కాదు. మంచి ప్రణాళికతో, ఆలోచనతో తెరకెక్కిస్తున్నాం' అని రాణా వివరించారు. అయితే, మిస్టరీ గుట్టు రాణా నేరుగా విప్పకపోయినా కొన్ని మంచి విషయాలు చెప్పాడు. 'దీనిని వివరించడం వీలుకాదు. ఇది గ్రాండ్ విజువల్ ట్రీట్. 2017, ఏప్రిల్ 28న ఈ సినిమా వస్తున్నది. మీరు చూసి తెలుసుకోండి' అంటూ రాణా తెలిపాడు. సో, రాజమౌళి తెరకెక్కిస్తున్న 'బాహుబలి-2' వచ్చేవరకు వేచి చూడాలన్నమాట. -
హైలెట్‌గా కట్టప్ప క్యారెక్టర్
-
ఆ విషయం ఈ ముగ్గురికే తెలుసా?
ఎందుకు... ఎందుకు? ‘బాహుబలి’ని కట్టప్ప ఎందుకు చంపాడు? ఎవరెన్ని సార్లు ప్రశ్నించినా దర్శకుడు రాజమౌళి సహా ‘బాహుబలి’ బృందం ఎవరూ సమాధానం చెప్పలేదు. సెకండ్ పార్ట్ విడుదల వరకూ వెయిట్ చేయమన్నారు. రహస్యం బయటపడకుండా రాజమౌళి అండ్ కో సక్సెస్ అయ్యారు. నిజం చెప్పాలంటే.. తండ్రీకొడుకులు రచయిత విజయేంద్రప్రసాద్, రాజమౌళిలకు మినహా మొన్నటివరకూ ‘బాహుబలి’లో నటించే ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఎవ్వరికీ ఎందుకు చంపాడనే విషయం తెలియదట. ఇప్పుడు ‘బాహుబలి: ది కంక్లూజన్’ షూటింగ్ జరుగుతోంది. కట్టప్ప బాహుబలిని చంపే సన్నివేశాలు తీయక తప్పని పరిస్థితి. రహస్యం బయటపడితే? షూటింగ్ చూసినోళ్లు ఎవరైనా పొరబాటున నోరు జారితే? రాజమౌళికి సందేహం వచ్చింది. దాంతో స్టూడియోలోకి ఎవ్వర్నీ అనుమతించకుండా రహస్యంగా మూడు రోజుల క్రితం ఆ సన్నివేశాలు చిత్రీకరించారట. ప్రభాస్, రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్, కీలక టెక్నీషియన్స్ ఒకరిద్దరికి మాత్రమే తెలుసట. ప్రేక్షకులకు ఆ రహస్యం తెలియాలంటే వచ్చే ఏడాది ఏప్రిల్ 28 వరకూ వెయిట్ చేయక తప్పదు. -
కట్టప్ప, బాహుబలిని నాలుగుసార్లు చంపాడా..?
బాహుబలి సినిమాకు సంబందించిన ప్రతీ వార్త దేశావ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా తొలి భాగం రిలీజ్ తరువాత ఎక్కువ మంది వేస్తున్న ప్రశ్న బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు. రాజమౌళి పాల్గొన్న ప్రతీ వేదిక మీద ఎదురవుతున్న ఈ ప్రశ్నకు రాజమౌళి నాలుగు సమాధానాలను రెడీ చేస్తున్నాడట. బాహుబలి తొలి భాగం చివర్లో కట్టప్ప, బాహుబలి చంపే సీన్‌తో ముగించారు రాజమౌళి. అయితే కట్టప్ప ఆ పని ఎందుకు చేశాడో రెండో భాగంలో చూపించబోతున్నాడు. తొలి భాగం రిలీజ్ తరువాత సినిమా మీద ఏర్పడ్డ అంచనాల నేపథ్యంలో, ఆ సీన్‌ను నాలుగు రకాలుగా తెరకెక్కించాలని భావిస్తున్నాడట. రిలీజ్ సమయంలో అప్పటి అంచనాలకు తగ్గట్టుగా ఏది కరెక్ట్ అయితే ఆ సీన్‌ను సినిమాకు జత చేసి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఈ వార్తపై యూనిట్ సభ్యుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా లేకపోయినా.. మీడియా సర్కిల్స్‌లో మాత్రం బాగా ప్రచారం అవుతోంది. -
'సీక్వల్లో మరింత బలంగా'
బాహుబలి సినిమా హీరో పాత్రలో పాటు అదే స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మరో పాత్ర కట్టప్ప. తమిళ నటుడు సత్యరాజ్ పోషించిన ఈ పాత్ర ప్రేక్షకుల మనసుల్లో బలమైన ముద్ర వేసింది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న ప్రశ్న ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తోంది. కట్టప్ప పాత్రలో ఆకట్టుకున్న సత్యరాజ్ ప్రస్తుతం దెయ్యం పాత్రలో కనిపించబోతున్నాడు. జాక్సన్ దురై పేరుతో తమిళ్లో తెరకెక్కిన సినిమాను దొర పేరుతో తెలుగులో అనువదిస్తున్నారు. ఈ సినిమాలో తన వారసుడు శిభిరాజ్తో కలిసి నటిస్తున్నాడు సత్యరాజ్. ఈ సినిమా ఆడియో రిలీజ్ సందర్భంగా తనకు ఎంతో పేరు తీసుకువచ్చిన కట్టప్ప పాత్ర విశేషాలను తెలియజేశాడు సత్యారాజ్. తొలి భాగంతో పోలిస్తే రెండో భాగంలో కట్టప్ప పాత్ర మరింత బలంగా ఉంటుందన్న సత్యారజ్, త్వరలోనే తాను బాహుబలి షూటింగ్లో పాల్గొనబోతున్నట్టు తెలిపారు. -
కట్టప్ప దొర అయ్యాడు!
‘బాహుబలి’ చిత్రంలోని కట్టప్ప పాత్రతో తమిళ నటుడు సత్యరాజ్ జాతీయ స్థాయిలో పాపులర్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఏ సినిమా ఫంక్షన్స్‌లో, ఏ ఇతర కార్యక్రమాల్లో కనిపించినా ప్రేక్షకులందరూ ఆయన్ను ‘కట్టప్పా’ అని పిలుస్తున్నారు. ఇప్పుడాయన దొరగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సత్యరాజ్ ప్రధాన పాత్రలో తమిళంలో తెరకెక్కిన ‘జాక్సన్ దురై’ చిత్రాన్ని ‘దొర’ పేరుతో రత్నా సెల్యులాయిడ్స్ పతాకంపై జక్కం జవహర్‌బాబు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ధరణీధరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడికల్ హారర్ ఎంటర్టైనర్లో సత్యరాజ్ తనయుడు శిబిరాజ్ హీరోగా నటించడం ఒక విశేషమయితే... మన తెలుగమ్మాయి బిందుమాధవి హీరోయిన్ కావడం మరో విశేషం. ఈ చిత్రం పాటలను ఈ నెల 21న, సినిమాను జులై 1న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ - ‘‘ప్రేక్షకులను ఆద్యంతం ఆసక్తికి గురి చేసే హారర్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన చిత్రమిది. తెలుగు ప్రేక్షకులకు ఈ జోనర్ కొత్తగా ఉంటుంది. సిద్ధార్థ్ విపిన్ మంచి పాటలు అందించారు. వెన్నెలకంటి, చంద్రబోస్ చక్కటి సాహిత్యంతో పాటలు రాశారు. శశాంక్ వెన్నెలకంటి డైలాగులు హైలెట్. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో జులై 1న విడుదల చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమేరా: యువరాజ్, నేపథ్య సంగీతం: చిన్నా. -
కట్టప్ప కనిపించడం లేదు!
కట్టప్ప.. ఈ పేరు గురించి పరిచయ వాక్యాలు అవసరంలేదు. ‘బాహుబలి’లోని ఈ క్యారెక్టర్ చాలా పాపులర్. అమరేంద్ర బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదు. ఈలోపు కట్టప్ప కనిపించడంలేదు? అంటే.. ఎవరికైనా సరే ‘అసలేమైంది?’ అని ఆశ్చర్యం కలగడం సహజం. విషయం ఏంటంటే.. సత్యరాజ్ తనయుడు శిబీ సత్యరాజ్ హీరోగా ఓ తమిళ చిత్రం రూపొందింది. విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి ‘కట్టప్పావ కానోమ్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. అంటే.. కట్టప్ప కనిపించడంలేదని అర్థం. ఈ టైటిల్ విన్నవాళ్లు కట్టప్ప పేరు పాపులర్ అయ్యింది కాబట్టి, పెట్టి ఉంటారని అనుకుంటున్నారు. దాంతో చిత్రర్శకుడు మణి క్లారిఫికేషన్ ఇచ్చారు. ‘‘క్రేజ్ కోసం పెట్టిన టైటిల్ కాదిది. కథకూ టైటిల్‌కీ లింక్ ఉంది. అదేంటో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే’’ అని పేర్కొన్నారు. -
రజనీ వర్సెస్ కట్టప్పా!
రజనీ: కట్టప్పా... నీకో విషయం తెలుసా? మా ఊళ్లో చిన్నప్పుడు కరెంట్ ఉండేది కాదు. దీపాలు కూడా ఉండేవి కావు. అయినా సరే, అర్థరాత్రి వరకు కష్టపడి చదివేవాడిని... కట్టప్ప: అదెలా????!!!!! రజనీ: అగరుబత్తి వెలిగించి ఆ వెలుగులో శ్రద్ధగా చదువుకునేవాడిని... కట్టప్ప: ???????!!!!!!!!??????? రజనీ: మరి నీ సంగతి? కట్టప్ప: మీకు ఆ ఆగరు బత్తి అయినా ఉండేది. మాకు అది కూడా కొనే స్తోమత లేదు. అయినా సరే రాత్రి బాగా కష్టపడి చదువుకునేవాడిని.... రజనీ: అదెలా సాధ్యం?????!!!!!! కట్టప్ప: మా ఇంటి పక్కన ప్రకాశ్, సూర్య అనే ఇద్దరు అన్నదమ్ములు, వారి చెల్లి జ్యోతి అని ఉండేవారు. రాత్రి సమయంలో వారిని మా ఇంటికి పిలిచి, వాళ్ల వెలుగులో చదువుకునేవాడిని. గబ్బర్‌సింగ్ వర్సెస్ సాంబ! గబ్బర్: అరెవో సాంబా... ఎంతమంది? సాంబ: ఇద్దరు దొరా... గబ్బర్: నేను లెక్కల్లో కొంచెం వీక్... 2 దేని తరువాత వస్తుంది? సాంబ: 1 తరువాత వస్తుంది... గబ్బర్: అలాగా... 2కు ముందు ఏముంటుంది? సాంబ: 1 గబ్బర్: మరి మధ్యలో ఏముంటుంది? సాంబ: ఏమీ ఉండదు దొరా! గబ్బర్: మరి అలాంటప్పుడు రెండూ ఒకేసారి రావచ్చు కదా! ఏమిటి పిచ్చి వేషాలు? సాంబ:???!!!!! -
బాహుబలి.. కట్టప్ప.. ఓ ట్విస్ట్..!
హైదరాబాద్: ఈ దశాబ్దం ప్రశ్నగా మారిన 'బాహుబలి హత్య'ను రచయిత విజయేంద్ర ప్రసాద్ మరో మలుపు తిప్పారు. 'బాహుబలి' బతికే ఉండొచ్చని చెప్పి మరింత ఆసక్తి రేకెత్తించారు. ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'బాహుబలి'కి సంబంధించిన పలు విషయాలు వెల్లడించారు. భీష్ముడి స్ఫూర్తితో కట్టప్ప పాత్రకు ప్రాణం పోసినట్టు చెప్పారు. శివగామిలో కైకేయి, గాంధారి, కుంతి పాత్రల తాలూకు ఛాయలు కన్పిస్తాయన్నారు. బిజ్జలదేవ పాత్రకు శకుని, భల్లాలదేవ పాత్రకు రావణ, దుర్యోధనులు, బాహుబలి పాత్రకు రాముడు, అర్జునుడు స్ఫూర్తి అని వెల్లడించారు. 'బాహుబలి' ఘన విజయంతో సీక్వెల్ ఎటువంటి మార్పులు చేయడం లేదని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 'బాహుబలి' విడుదలకు ముందే పూర్తి స్క్రిప్ట్ రాయడం పూర్తి చేశానని పేర్కొన్నారు. 'బాహుబలి'ని కట్టప్ప ఎందుకు చంపాడని ప్రశ్నించగా తనదైన శైలిలో జవాబిచ్చారు. 'బాహుబలి' హత్యకు గురైయ్యాడని ఎందుకు భావిస్తున్నారని ఎదురు ప్రశ్నించారు. 'బాహుబలి' బతికివుండే అవకాశం కూడా ఉందని చెప్పి సస్పెన్స్ మరింత పెంచారు. ఇప్పటివరకు బాహుబలిని కట్టప్ప చంపేశాడని భావిస్తున్న వారంతా ఇప్పుడు అతడు బతికివున్నాడా, లేదా అనే ప్రశ్న ఎదుర్కొంటున్నారు. దీనికి సమాధానం వచ్చే ఏడాది ఏప్రిల్ 14న లభించనుంది. -
ఆ ఒక్కడికే తెలుసు !
2015 సంవత్సరంలో చోటుచేసుకున్న నేరాలకు సంబంధించి ఇప్పటివరకు ఏమాత్రం క్లూ దొరకని ఒకే ఒక్క కేసు.. అమరేంద్ర బాహుబలి హత్య! 'కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?' ఈ ప్రశ్నకి సమాధానం కోసం ఎదురుచూడని సినీ అభిమాని ఉండడు. అసలు నిజం అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు. వారిలో కట్టప్ప పాత్రధారి సత్యరాజ్ ఒకరు. బాహుబలి రిలీజ్ అయినప్పటి నుంచి సత్యరాజ్ సుపుత్రుడు, తమిళ నటుడు శిబిరాజ్ ఈ ప్రశ్న అడుగుతూనే ఉన్నాడట. సత్యరాజ్ కుటుంబసభ్యులు కూడా బాహుబలి హత్య వెనుక ఉన్న సీక్రెట్ కోసం శతవిధాలా ప్రయత్నించి విసుగుచెంది ఊరుకున్నారట. ఎవరెంత బతిమిలాడినా సత్యరాజ్ మాత్రం కథలోని సస్పెన్స్ ని బయటపెట్టలేదు. 'మా నాన్నకు పని పట్ల ఉన్న నిబద్ధత అటువంటిది' అంటూ తండ్రి గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు శిబిరాజ్. అయితే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే విషయం సత్యరాజ్ కుటుంబంలో ఒకే ఒక్కరికి తెలుసట.. సత్యరాజ్ రెండున్నరేళ్ల మనవడికి! -
బాహుబలి హత్య వెనుక కథ
హైదరాబాద్: సెన్సేషనల్ మూవీ బాహుబలితో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాజమౌళి. ఈ సినిమాలోని ఒకే ఒక్క సీన్‌తో మరింత ఉత్కంఠను రగిలించాడు ఈ టాలీవుడ్ జక్కన్న. నమ్మిన బంటు కట్టప్ప.. బాహుబలిని హత్య చేసే చిట్ట చివరి దృశ్యంతో జనాలు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. తాజాగా తీవ్ర ఉత్కంఠను రేపిన ఈ ట్విస్ట్‌పై మీడియాలో స్పందించాడు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్నకు ఒక్కమాటలో సమాధానం చెప్పలేమని, దాని వెనుక పెద్ద కథే ఉందని రాజమౌళి వివరించారు. బాహుబలికి ఎంతో నమ్మకంగా ఉండే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో రెండోభాగంలో చూపిస్తామన్నారు. రెండో భాగమైన 'బాహుబలి ది కంక్లూజన్' విడుదల అయ్యేవరకు సస్పెన్స్ కొనసాగాల్సిందేనన్నారు. 'బాహుబలి-2' షూటింగులో బిజీగా ఉన్న రాజమౌళి ఇటీవల దీనిపై మాట్లాడారు. బాహుబలి 'ది బిగినింగ్'కు బాహుబలి ది కంక్లూజన్' 'సీక్వెల్ కాదని, రెండో భాగం మాత్రమేనన్నారు. ఒకే కథను రెండు భాగాలుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్లో మొదలైన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇటీవలే కేరళలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఇప్పటికి రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకుందని, అనుకున్న సమయానికే సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపాడు. ఇప్పటివరకు బాహుబలి-3 పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. కార్టూన్, గేమ్స్ ఇలా ఏదో ఒక రూపంలో బాహుబలి వార్తల్లో ఉండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నాడు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్న రేపిన ఉత్కంఠ నేపథ్యంలో రెండో పార్టు కచ్చితంగా చూడాలనే ఆసక్తి జనాల్లో మరింతగా పెరిగింది. అటు సోషల్ మీడియాల్లో ఫన్నీ సమాధానాలు, జోక్‌లు ఇప్పటికీ హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. -
హమ్మయ్య.. కట్టప్పకు విముక్తి లభించింది!
నిన్న మొన్నటి వరకు... అసలు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే విషయం మీద అనేక చర్చోప చర్చలు జరిగాయి. చిన్నతనంలో తన ప్లేటులోని అన్నం లాక్కున్నాడనే చంపాడన్నారు, మిర్చి సినిమాలో తన భార్య (నదియా) మరణానికి కారణం అయ్యాడన్న కోపంతో ఈ సినిమాలో ప్రభాస్‌ను చంపాడని చెప్పారు. ఇలా నెట్లో ఈ టాపిక్ విపరీతంగా హల్చల్ సృష్టించింది. అయితే, గత కొన్నాళ్లుగా ఇది మళ్లీ మరుగున పడిపోయింది. కట్టప్ప.. బాహుబలి ఈ రెండు అంశాలు కొన్నాళ్ల నుంచి చర్చకు రావడం తగ్గింది. ఇప్పుడు కొత్త టాపిక్ ఏంటో తెలుసా.. షీనా బోరా ఎందుకు హత్యకు గురైంది? ఆమెను నిజంగా చంపింది ఎవరు.. ముఖర్జియాల కుటుంబ చరిత్రలో అసలు ఎవరికి ఎవరు ఏమవుతారు. ఇలాంటి అనేకానేక ప్రశ్నలు నెట్టింట్లో అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నాయి. మామూలు ఔత్సాహికుల దగ్గర్నుంచి వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ వరకు ప్రతి ఒక్కరూ ఈ టాపిక్ గురించి ట్వీట్లు చేస్తున్నారు, వాట్సప్‌లో షేర్ల మీద షేర్లు చేస్తున్నారు, ఫేస్బుక్లో లైకులు కొడుతున్నారు. Mukherjeas,The Great Indian Family Tree pic.twitter.com/HQ0UPZSQ0b — Ram Gopal Varma (@RGVzoomin) August 30, 2015 Kattappa is relieved aftr sheena's murder mystery , it is more complicated than Bahubali, Now everyone is asking :Why Indrani killed Sheena? — Mahi Illindra (@mahimilli) September 2, 2015 -
'అతడి కోసమే బాహుబలి 2 చూస్తా'
ముంబై: 'బాహుబలి' సినిమాలో కట్టప్ప పాత్ర తనకెంతో నచ్చిందని ప్రముఖ రచయిత్రి, కాలమిస్టు శోభా డే పేర్కొన్నారు. రాజకుంటుబానికి నమ్మిన బంటుగా కట్టప్ప పాత్రలో సత్యరాజ్ ఒదిగిపోయారని ప్రశంసించారు. కట్టప్ప పాత్ర కోసమే 'బాహుబలి 2' టిక్కెట్ ను ముందుగా బుక్ చేసుకుంటానని వ్యాఖ్యానించారు. 'బాహుబలి' సినిమాపై తన అభిప్రాయాన్ని 'ఎన్డీటీవీ'కి రాసిన వ్యాసంలో నిర్మోహమాటంగా వెల్లడించారు. ప్రభాస్, రానా ఆయా పాత్రలకు సరిగ్గా సరిపోయారని పేర్కొన్నారు. రాజమాతగా నటించిన రమ్యకృష్ణ కట్టిన తొమ్మిది గజాలు చీరలు సూపర్ గా ఉన్నాయన్నారు. అయితే గిరిజనులను శత్రువులుగా చూపిన విధానం అభ్యంతరకరమన్నారు. ఇంగ్లీషులో హిట్టైన సినిమాలను బాగా స్టడీ చేసి అవసరమైన ఎలిమెంట్స్ 'బాహుబలి'లో ఉండేలా దర్శకుడు రాజమౌళి జాగ్రత్త పడ్డారని పేర్కొన్నారు. -
'బాహుబలి'ని కట్టప్ప ఎందుకు చంపాడు?
విడుదలై రెండు వారాలు గడిచినా 'బాహుబలి' ఫీవర్ జనాన్ని వదిలిపోలేదు. అంచనాలను మించి రికార్డులు తిరగరాసిన 'బాహుబలి'పై ఆసక్తి కొనసాగుతూనే ఉంది. రెండో భాగంపై అప్పుడే చర్చలు, రూమర్లు, జోకులు పేలుతున్నాయి. సోషల్ మీడియాలో అయితే జోకులే జోకులు. ఒకే ఒక ప్రశ్న చుట్టూ నెటిజన్లు హాస్యం పుట్టిస్తున్నారు. 'బాహుబలి'ని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్న సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 'క్వశ్చన్ ఆఫ్ ది ఇయర్'గా తేల్చేసి దీనికి సమాధానంగా సంధించిన సరదా కామెంట్లు, ఫోటోలతో కేక పెట్టిస్తున్నారు. 'బాహుబలిని కటప్ప ఎందుకు చంపాడో దేశం తెలుసుకోవాలనుకుంటోంద'ని ఒకరంటే... బాహుబలి చిన్నప్పుడు కటప్ప భోజనం ప్లేటు లాక్కున్నందుకే ఇలా చేశాడని మరొకరు సరదాగా కామెంట్ చేశారు. పనిలో పనిగా ఫోటో కూడా పోస్ట్ చేశారు. 'మిర్చి' సినిమాలో సత్యరాజ్ భార్య మరణానికి ప్రభాస్ కారకుడయ్యాడనే పగతో 'బాహుబలి'ని కట్టప్ప కడతేర్చాడని మరొకరు వెరైటీ భాష్యం చెప్పారు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో పెద్దోడు, చిన్నోడు మధ్య సంభాషణల్లో 'బాహుబలి'ని చొప్పించి వినోదం పంచారు. కొంతమంది తుంటరులైతే తమ సందేహం తీర్చుకోవడానికి ఏకంగా కస్టమర్ కేర్ కు ఫోన్ చేశారు. ఆ సంభాషణ సాగిందిలా... కస్టమర్ కేర్ ఉద్యోగి: మీకు నేను ఎలా సహాయ పడగలను తుంటరి: సర్, నేను ఓ విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను కస్టమర్ కేర్ ఉద్యోగి: అలాగే, అడగండి తుంటరి: బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? ఇది తెలుసుకునేందుకు కస్టమర్ కేర్ ఉద్యోగి వెంటనే తన ఉద్యోగాన్ని వదిలేసి 'బాహుబలి' సినిమా చూడడానికి వెళ్లాడు.