కట్టప్ప, బాహుబలిని నాలుగుసార్లు చంపాడా..?
బాహుబలి సినిమాకు సంబందించిన ప్రతీ వార్త దేశావ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా తొలి భాగం రిలీజ్ తరువాత ఎక్కువ మంది వేస్తున్న ప్రశ్న బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు. రాజమౌళి పాల్గొన్న ప్రతీ వేదిక మీద ఎదురవుతున్న ఈ ప్రశ్నకు రాజమౌళి నాలుగు సమాధానాలను రెడీ చేస్తున్నాడట. బాహుబలి తొలి భాగం చివర్లో కట్టప్ప, బాహుబలి చంపే సీన్తో ముగించారు రాజమౌళి.
అయితే కట్టప్ప ఆ పని ఎందుకు చేశాడో రెండో భాగంలో చూపించబోతున్నాడు. తొలి భాగం రిలీజ్ తరువాత సినిమా మీద ఏర్పడ్డ అంచనాల నేపథ్యంలో, ఆ సీన్ను నాలుగు రకాలుగా తెరకెక్కించాలని భావిస్తున్నాడట. రిలీజ్ సమయంలో అప్పటి అంచనాలకు తగ్గట్టుగా ఏది కరెక్ట్ అయితే ఆ సీన్ను సినిమాకు జత చేసి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఈ వార్తపై యూనిట్ సభ్యుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా లేకపోయినా.. మీడియా సర్కిల్స్లో మాత్రం బాగా ప్రచారం అవుతోంది.