
హమ్మయ్య.. కట్టప్పకు విముక్తి లభించింది!
నిన్న మొన్నటి వరకు... అసలు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే విషయం మీద అనేక చర్చోప చర్చలు జరిగాయి. చిన్నతనంలో తన ప్లేటులోని అన్నం లాక్కున్నాడనే చంపాడన్నారు, మిర్చి సినిమాలో తన భార్య (నదియా) మరణానికి కారణం అయ్యాడన్న కోపంతో ఈ సినిమాలో ప్రభాస్ను చంపాడని చెప్పారు. ఇలా నెట్లో ఈ టాపిక్ విపరీతంగా హల్చల్ సృష్టించింది. అయితే, గత కొన్నాళ్లుగా ఇది మళ్లీ మరుగున పడిపోయింది. కట్టప్ప.. బాహుబలి ఈ రెండు అంశాలు కొన్నాళ్ల నుంచి చర్చకు రావడం తగ్గింది.
ఇప్పుడు కొత్త టాపిక్ ఏంటో తెలుసా.. షీనా బోరా ఎందుకు హత్యకు గురైంది? ఆమెను నిజంగా చంపింది ఎవరు.. ముఖర్జియాల కుటుంబ చరిత్రలో అసలు ఎవరికి ఎవరు ఏమవుతారు. ఇలాంటి అనేకానేక ప్రశ్నలు నెట్టింట్లో అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నాయి. మామూలు ఔత్సాహికుల దగ్గర్నుంచి వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ వరకు ప్రతి ఒక్కరూ ఈ టాపిక్ గురించి ట్వీట్లు చేస్తున్నారు, వాట్సప్లో షేర్ల మీద షేర్లు చేస్తున్నారు, ఫేస్బుక్లో లైకులు కొడుతున్నారు.
Mukherjeas,The Great Indian Family Tree pic.twitter.com/HQ0UPZSQ0b
— Ram Gopal Varma (@RGVzoomin) August 30, 2015
Kattappa is relieved aftr sheena's murder mystery , it is more complicated than Bahubali, Now everyone is asking :Why Indrani killed Sheena?
— Mahi Illindra (@mahimilli) September 2, 2015