కట్టప్పగా నేనైతే ఇంకా బాగా చేసేవాణ్ని..!
బాహుబలి 2 సినిమా రిలీజ్ అయి రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఆ సినిమా ప్రస్తావన వస్తూనే ఉంది. ఇటీవల ఈ సినిమా చూసిన బాలీవుడ్ నటుడు గుల్షన్ గ్రోవర్, కట్టప్ప పాత్ర తానైతే మరింత బాగా చేసేవాడినన్నాడు. ఆ పాత్ర చేసేందుకు కావాల్సిన ఫిజిక్, మేనరిజమ్స్ నాకు ఉన్నాయన్న గుల్షన్ కట్టప్ప పాత్రకు నేనే మరింత న్యాయం చేయగలనన్నాడు.
అయితే ఆ పాత్రలో నటించిన సత్యరాజ్, చాలా బాగా నటించాడని, ముఖ్యంగా సినిమా సక్సెస్ క్రెడిట్ అంతా రాజమౌళిదే అన్నాడు. రాజమౌళి గొప్ప డైరెక్టర్ అన్న గ్రోవర్, అవకాశం వస్తే అతనితో కలిసి పని చేసేందుకు రెడీ అన్నాడు. బాలీవుడ్ లో విభిన్న పాత్రలతో ఆకట్టుకుంటున్న గుల్షన్ గ్రోవర్, క్రిమినల్, బాలు లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షలను కూడా మెప్పించాడు.