gulshan grover
-
‘షారుక్ వల్లే హాలీవుడ్ వెళ్లాను’
ప్రతి నాయక పాత్రలతో బాలీవుడ్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు గుల్షన్ గ్రోవర్. కేవలం బాలీవుడ్‌కే పరిమితం కాకుండా హాలీవుడ్ అవకాశాలు అందిపుచ్చుకున్న భారతీయ నటుల్లో గుల్షన్ గ్రోవర్ ఒకరు. అయితే షారుక్ ఖాన్ ప్రోత్సాహం వల్లే తాను హాలీవుడ్ చిత్రాల్లో నటించడానికి అంగీకరించాను అంటున్నారు గుల్షన్ గ్రోవర్. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ‘అజీజ్ మీర్జా దర్శకత్వంలో వచ్చిన ‘ఎస్‌బాస్’ చిత్రంలో నటిస్తుండగా.. జంగిల్ బుక్ రెండో చిత్రం: ‘మోగ్లీ అండ్ బాలు’(1997) అవకాశం నా తలుపు తట్టింది. అయితే హాలీవుడ్ వెళ్లలా.. వద్దా అనే డైలమాలో ఉన్నాను’ అన్నారు. ‘‘ఎస్‌బాస్’ చిత్రంలో నాతో పాటు షారుక్ ఖాన్ కూడా నటిస్తున్నారు. ఈ విషయం గురించి షారుక్‌తో చెప్పి.. స్క్రిప్ట్ చదవమని ఇచ్చాను. చదవడం అయ్యాక షారుక్ నాతో చెప్పిన తొలి మాట.. వెంటనే హాలీవుడ్ వెళ్లు. అవకాశాన్ని జార విడుచుకోకు అన్నారు. అప్పుడు నేను షారుక్‌తో ‘ఇప్పుడు నేను హాలీవుడ్ వెళ్తే అజీజ్ మీర్జా నా మీద కేసు వేస్తాడేమో.. నా పారితోషికాన్ని ఆపేస్తాడేమో’ అనే సందేహం వెలి బుచ్చాను. అప్పుడు షారుక్ ‘ముందు హాలీవుడ్ వెళ్లు. ఈ విషయాల గురించి ఎవరైనా నీకు ఫోన్ చేస్తే.. వచ్చి నన్ను కలువు.. మిగతా విషయాలు నేను చూసుకుంటాను’ అన్నారు. షారుక్ మాటలతో నాకు ధైర్యం వచ్చింది. అలా నా తొలి హాలీవుడ్ చిత్రాన్ని అంగీకరించాను’ అంటూ గుల్షన్ గ్రోవర్ చెప్పుకొచ్చారు. అంతేకాక ‘హాలీవుడ్లో కూడా ప్రతి నాయక పాత్రకే అంగీకారం తెలపడంతో చాలా మంది నన్ను నిరాశ పర్చారు. ఆ పాత్రకు నేను సరిపోను.. త్వరలోనే దర్శకుడు నా బదులు మరొకరిని ఆ పాత్ర కోసం తీసుకుంటాడని ఎగతాళి చేశారు. అయితే అదృష్టం నా వైపు ఉంది. దర్శకుడికి కావాల్సింది పెద్ద పెద్ద కళ్లున్న భారతీయ నటుడు. దాంతో నన్ను కొనసాగించారు. ఆ నాటి నుంచి నేటి వరకూ నేను మరిక వెను తిరిగి చూడలేదు’ అన్నారు గుల్షన్ గ్రోవర్. -
కట్టప్పగా నేనైతే ఇంకా బాగా చేసేవాణ్ని..!
బాహుబలి 2 సినిమా రిలీజ్ అయి రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఆ సినిమా ప్రస్తావన వస్తూనే ఉంది. ఇటీవల ఈ సినిమా చూసిన బాలీవుడ్ నటుడు గుల్షన్ గ్రోవర్, కట్టప్ప పాత్ర తానైతే మరింత బాగా చేసేవాడినన్నాడు. ఆ పాత్ర చేసేందుకు కావాల్సిన ఫిజిక్, మేనరిజమ్స్ నాకు ఉన్నాయన్న గుల్షన్ కట్టప్ప పాత్రకు నేనే మరింత న్యాయం చేయగలనన్నాడు. అయితే ఆ పాత్రలో నటించిన సత్యరాజ్, చాలా బాగా నటించాడని, ముఖ్యంగా సినిమా సక్సెస్ క్రెడిట్ అంతా రాజమౌళిదే అన్నాడు. రాజమౌళి గొప్ప డైరెక్టర్ అన్న గ్రోవర్, అవకాశం వస్తే అతనితో కలిసి పని చేసేందుకు రెడీ అన్నాడు. బాలీవుడ్ లో విభిన్న పాత్రలతో ఆకట్టుకుంటున్న గుల్షన్ గ్రోవర్, క్రిమినల్, బాలు లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షలను కూడా మెప్పించాడు. -
నా కంటే గొప్పగా ఎవరూ నటించలేరు
ముంబై: బాలీవుడ్ బ్లాక్ బస్టర్ రామ్ లఖన్ సినిమాలో నటించడం ద్వారా వెలుగులోకి వచ్చిన వెటరన్ గుల్షన్ గ్రోవర్.. ఈ సినిమాలో తన పాత్రను తన కంటే గొప్పగా ఎవరూ చేయలేరని అన్నాడు. 1989లో విడుదలైన ఈ సినిమాలో కేసరియా విలాయతిగా నటించిన గ్రోవర్ బ్యాడ్ మన్‌గా పాపులర్ అయ్యాడు. సుభాష్ ఘాయ్ దర్శకత్వంలో స్వయంగా నిర్మించిన రామ్ లఖన్ సినిమాలో అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్, రాఖీ, మాధురి దీక్షిత్, డింపుల్ కపాడియా, గుల్షన్ గ్రోవర్, అమ్రిష్ పురి, పరేష్ రావెల్, అనుపమ్ ఖేర్ తదితరులు నటించారు. కాగా ఈ సినిమాను యువ హీరోలు షాహిద్ కపూర్, రణ్వీర్ సింగ్‌లతో రీమేక్ చేసే యోచనలో ఉన్నట్టు వార్తలు రావడంతో గ్రోవర్ స్పందించాడు. ఈ సినిమాలో విలన్ పాత్రలో అదరగొట్టిన గ్రోవర్.. అది అద్భుతమైన పాత్రని అన్నాడు. రీమేక్‌లో మీ ప్రాతకు ఎవరైతే న్యాయం చేస్తారన్న ప్రశ్నకు సమాధానంగా.. తన పాత్రలో తనకంటే బాగా మరొకరు నటిస్తారని భావించడం లేదని చెప్పాడు. ఒక్కరు మాత్రమే బ్యాడ్మన్ పాత్రను చేయగలరని, ఆ వ్యక్తి తానేనని అన్నాడు. -
బ్యాడ్‌మ్యాన్.... షారుక్ !
స్టార్‌హీరోలు, హీరోయిన్లు యాడ్‌ఫిల్మ్స్‌లో నటించడ మనేది ఓల్డ్ ట్రెండ్. ప్రెజెంట్ ట్రెండ్ ఏంటంటే వెబ్‌సిరీస్. ఆన్లైన్ సీరియల్‌గా ఎపిసోడ్లు రావడం అన్నమాట. చాలామంది స్టార్ల కన్ను వీటిపై పడింది. బాలీవుడ్ సీనియర్ నటుడు గుల్షన్ గ్రోవర్ ప్రధాన పాత్రలో ఓ వెబ్‌సిరీస్ తయారవుతోంది. ఇందులో షారుక్‌ఖాన్ కూడా నటించనున్నారనేది లేటెస్ట్ న్యూస్. మాక్యుమెంటరీ(డాక్యుమెంటరీకి పేరడీ)గా రూపొందే ఈ సిరీస్‌ను ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ వయాకామ్ నిర్మిస్తోంది. ‘బ్యాడ్‌మ్యాన్’ టైటిల్‌తో రానున్న ఈ సిరీస్‌లో షారుక్‌ఖాన్‌ను ఓ అతిథి పాత్రలో నటింపజేయాలని గుల్షన్ గ్రోవర్ భావిస్తున్నారు. ‘‘నేను ఇప్పటికే బ్యాడ్‌మ్యాన్ లోగోను చూపించడమే కాక, టైటిల్ సాంగ్ కూడా వినిపించాను. షారుక్ కూడా దీనిలో నటించడానికి సానుకూలంగానే స్పందించారు’’ అని ఆయన చెప్పారు. మరి షారుక్ నటిస్తే ఈ ‘బ్యాడ్‌మ్యాన్’కు ఎంతటి క్రేజ్ వస్తుందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. -
లాయర్‌తో లవ్
‘‘ఒక లాయర్‌కి, జర్నలిస్ట్‌కి మధ్య సాగే ప్రేమకథ ఇది. లాయర్‌గా జగపతిబాబు, జర్నలిస్టుగా భూమిక అద్భుతమైన నటన కనబర్చారు. ప్రముఖ హిందీ నటుడు గుల్షన్ గ్రోవర్ ఇందులో కీలక పాత్ర పోషించారు’’ అని ‘ఏప్రిల్ ఫూల్’ చిత్ర దర్శకుడు కృష్ణస్వామి శ్రీకాంత్ అయ్యంగార్ చెప్పారు. జగపతిబాబు, భూమిక, రణధీర్, సృష్టి ముఖ్య తారలుగా జీఎల్ శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం వచ్చే నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ నిర్మాత సురేశ్‌బాబు మాట్లాడుతూ - ‘‘ఇందులో తాగుబోతు రమేశ్, ధనరాజ్ పాత్రలు ఆద్యంతం అలరిస్తాయి. సంగీత దర్శకుడు డా. బంటి చక్కటి పాటలిచ్చారు’’ అన్నారు.