బ్యాడ్‌మ్యాన్.... షారుక్ ! | Shah Rukh Khan to do a cameo in Gulshan Grover's mockumentary 'Badman'? | Sakshi
Sakshi News home page

బ్యాడ్‌మ్యాన్.... షారుక్ !

Published Tue, Apr 19 2016 11:55 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

బ్యాడ్‌మ్యాన్.... షారుక్ ! - Sakshi

బ్యాడ్‌మ్యాన్.... షారుక్ !

 స్టార్‌హీరోలు, హీరోయిన్లు యాడ్‌ఫిల్మ్స్‌లో నటించడ మనేది ఓల్డ్ ట్రెండ్. ప్రెజెంట్ ట్రెండ్ ఏంటంటే వెబ్‌సిరీస్. ఆన్‌లైన్ సీరియల్‌గా ఎపిసోడ్లు రావడం అన్నమాట. చాలామంది స్టార్ల కన్ను వీటిపై పడింది. బాలీవుడ్  సీనియర్ నటుడు గుల్షన్ గ్రోవర్ ప్రధాన పాత్రలో ఓ వెబ్‌సిరీస్ తయారవుతోంది. ఇందులో షారుక్‌ఖాన్ కూడా నటించనున్నారనేది లేటెస్ట్ న్యూస్. మాక్యుమెంటరీ(డాక్యుమెంటరీకి పేరడీ)గా రూపొందే ఈ  సిరీస్‌ను ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ వయాకామ్ నిర్మిస్తోంది.
 
  ‘బ్యాడ్‌మ్యాన్’ టైటిల్‌తో రానున్న ఈ సిరీస్‌లో షారుక్‌ఖాన్‌ను ఓ అతిథి పాత్రలో నటింపజేయాలని గుల్షన్ గ్రోవర్ భావిస్తున్నారు. ‘‘నేను ఇప్పటికే  బ్యాడ్‌మ్యాన్ లోగోను చూపించడమే కాక, టైటిల్ సాంగ్ కూడా వినిపించాను. షారుక్ కూడా దీనిలో నటించడానికి సానుకూలంగానే స్పందించారు’’ అని ఆయన చెప్పారు. మరి షారుక్ నటిస్తే ఈ ‘బ్యాడ్‌మ్యాన్’కు ఎంతటి  క్రేజ్ వస్తుందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement