‘షారుక్‌ వల్లే హాలీవుడ్‌ వెళ్లాను’ | Gulshan Grover Thanks To Shah Rukh Khan About His Hollywood Career | Sakshi
Sakshi News home page

హాలీవుడ్‌ ఆఫర్‌ గురించి వెల్లడించిన గుల్షన్‌ గ్రోవర్‌

Published Thu, Aug 1 2019 12:40 PM | Last Updated on Thu, Aug 1 2019 1:16 PM

Gulshan Grover Thanks To Shah Rukh Khan About His Hollywood Career - Sakshi

ప్రతి నాయక పాత్రలతో బాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు గుల్షన్‌ గ్రోవర్‌. కేవలం బాలీవుడ్‌కే పరిమితం కాకుండా హాలీవుడ్‌ అవకాశాలు అందిపుచ్చుకున్న భారతీయ నటుల్లో గుల్షన్‌ గ్రోవర్‌ ఒకరు. అయితే షారుక్‌ ఖాన్‌ ప్రోత్సాహం వల్లే తాను హాలీవుడ్‌ చిత్రాల్లో నటించడానికి అంగీకరించాను అంటున్నారు గుల్షన్‌ గ్రోవర్‌. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ‘అజీజ్‌ మీర్జా దర్శకత్వంలో వచ్చిన ‘ఎస్‌బాస్‌’ చిత్రంలో నటిస్తుండగా.. జంగిల్‌ బుక్‌ రెండో చిత్రం: ‘మోగ్లీ అండ్‌ బాలు’(1997) అవకాశం నా తలుపు తట్టింది. అయితే హాలీవుడ్‌ వెళ్లలా.. వద్దా అనే డైలమాలో ఉన్నాను’ అన్నారు.

‘‘ఎస్‌బాస్‌’ చిత్రంలో నాతో పాటు షారుక్‌ ఖాన్‌ కూడా నటిస్తున్నారు. ఈ విషయం గురించి షారుక్‌తో చెప్పి.. స్క్రిప్ట్‌ చదవమని ఇచ్చాను. చదవడం అయ్యాక షారుక్‌ నాతో చెప్పిన తొలి మాట.. వెంటనే హాలీవుడ్‌ వెళ్లు. అవకాశాన్ని జార విడుచుకోకు అన్నారు. అప్పుడు నేను షారుక్‌తో ‘ఇప్పుడు నేను హాలీవుడ్‌ వెళ్తే అజీజ్‌ మీర్జా నా మీద కేసు వేస్తాడేమో.. నా పారితోషికాన్ని ఆపేస్తాడేమో’ అనే సందేహం వెలి బుచ్చాను. అప్పుడు షారుక్‌ ‘ముందు హాలీవుడ్‌ వెళ్లు. ఈ విషయాల గురించి ఎవరైనా నీకు ఫోన్‌ చేస్తే.. వచ్చి నన్ను కలువు.. మిగతా విషయాలు నేను చూసుకుంటాను’ అన్నారు. షారుక్‌ మాటలతో నాకు ధైర్యం వచ్చింది. అలా నా తొలి హాలీవుడ్‌ చిత్రాన్ని అంగీకరించాను’ అంటూ గుల్షన్‌ గ్రోవర్‌ చెప్పుకొచ్చారు.

అంతేకాక ‘హాలీవుడ్‌లో కూడా ప్రతి నాయక పాత్రకే అంగీకారం తెలపడంతో చాలా మంది నన్ను నిరాశ పర్చారు. ఆ పాత్రకు నేను సరిపోను.. త్వరలోనే దర్శకుడు నా బదులు మరొకరిని ఆ పాత్ర కోసం తీసుకుంటాడని ఎగతాళి చేశారు. అయితే అదృష్టం నా వైపు ఉంది. దర్శకుడికి కావాల్సింది పెద్ద పెద్ద కళ్లున్న భారతీయ నటుడు. దాంతో నన్ను కొనసాగించారు. ఆ నాటి నుంచి నేటి వరకూ నేను మరిక వెను తిరిగి చూడలేదు’ అన్నారు గుల్షన్‌ గ్రోవర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement