Hollywood offer
-
‘షారుక్ వల్లే హాలీవుడ్ వెళ్లాను’
ప్రతి నాయక పాత్రలతో బాలీవుడ్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు గుల్షన్ గ్రోవర్. కేవలం బాలీవుడ్‌కే పరిమితం కాకుండా హాలీవుడ్ అవకాశాలు అందిపుచ్చుకున్న భారతీయ నటుల్లో గుల్షన్ గ్రోవర్ ఒకరు. అయితే షారుక్ ఖాన్ ప్రోత్సాహం వల్లే తాను హాలీవుడ్ చిత్రాల్లో నటించడానికి అంగీకరించాను అంటున్నారు గుల్షన్ గ్రోవర్. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ‘అజీజ్ మీర్జా దర్శకత్వంలో వచ్చిన ‘ఎస్‌బాస్’ చిత్రంలో నటిస్తుండగా.. జంగిల్ బుక్ రెండో చిత్రం: ‘మోగ్లీ అండ్ బాలు’(1997) అవకాశం నా తలుపు తట్టింది. అయితే హాలీవుడ్ వెళ్లలా.. వద్దా అనే డైలమాలో ఉన్నాను’ అన్నారు. ‘‘ఎస్‌బాస్’ చిత్రంలో నాతో పాటు షారుక్ ఖాన్ కూడా నటిస్తున్నారు. ఈ విషయం గురించి షారుక్‌తో చెప్పి.. స్క్రిప్ట్ చదవమని ఇచ్చాను. చదవడం అయ్యాక షారుక్ నాతో చెప్పిన తొలి మాట.. వెంటనే హాలీవుడ్ వెళ్లు. అవకాశాన్ని జార విడుచుకోకు అన్నారు. అప్పుడు నేను షారుక్‌తో ‘ఇప్పుడు నేను హాలీవుడ్ వెళ్తే అజీజ్ మీర్జా నా మీద కేసు వేస్తాడేమో.. నా పారితోషికాన్ని ఆపేస్తాడేమో’ అనే సందేహం వెలి బుచ్చాను. అప్పుడు షారుక్ ‘ముందు హాలీవుడ్ వెళ్లు. ఈ విషయాల గురించి ఎవరైనా నీకు ఫోన్ చేస్తే.. వచ్చి నన్ను కలువు.. మిగతా విషయాలు నేను చూసుకుంటాను’ అన్నారు. షారుక్ మాటలతో నాకు ధైర్యం వచ్చింది. అలా నా తొలి హాలీవుడ్ చిత్రాన్ని అంగీకరించాను’ అంటూ గుల్షన్ గ్రోవర్ చెప్పుకొచ్చారు. అంతేకాక ‘హాలీవుడ్లో కూడా ప్రతి నాయక పాత్రకే అంగీకారం తెలపడంతో చాలా మంది నన్ను నిరాశ పర్చారు. ఆ పాత్రకు నేను సరిపోను.. త్వరలోనే దర్శకుడు నా బదులు మరొకరిని ఆ పాత్ర కోసం తీసుకుంటాడని ఎగతాళి చేశారు. అయితే అదృష్టం నా వైపు ఉంది. దర్శకుడికి కావాల్సింది పెద్ద పెద్ద కళ్లున్న భారతీయ నటుడు. దాంతో నన్ను కొనసాగించారు. ఆ నాటి నుంచి నేటి వరకూ నేను మరిక వెను తిరిగి చూడలేదు’ అన్నారు గుల్షన్ గ్రోవర్. -
రానాకు హాలీవుడ్ ఆఫర్..!
సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా అన్ని భాషల్లోనూ వరుస సినిమాలతో దూసుకుపోతున్న దక్షిణాది నటుడు రానా. బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రానా, ప్రస్తుతం బహుభాషా చిత్రాలుగా తెరకెక్కుతున్న హాథీ మేరి సాథి, రాజా మార్తాండ వర్మ సినిమాల్లో నటిస్తున్నాడు. మరికొన్ని ఇంట్రస్టింగ్ సినిమాలకు చేతిలో ఉన్న రానాకు హాలీవుడ్ నుంచి పిలుపు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఓ హాలీవుడ్ యాక్షన్ మూవీలో అతిథి పాత్ర కోసం రానాను సంప్రదించారట. అయితే ఇప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉన్న రానా, ప్రస్తుతానికి హాలీవుడ్ ప్రాజెక్ట్‌ను పెండింగ్‌లో పెట్టినట్టుగా తెలుస్తోంది. సెట్స్‌మీద ఉన్న సినిమాలు ఓ కొలిక్కి వచ్చిన తరువాత డేట్స్ అడ్జస్ట్ అయితే హాలీవుడ్ సినిమాలో నటించే ఆలోచనలో ఉన్నాడట. రానా కీలక పాత్రలో నటించిన యన్.టి.ఆర్ మహానాయకుడు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
హాలీవుడ్ సినిమాలో శ్రీదేవి..!
అందాల తార శ్రీదేవి ఆస్కార్ అవార్డు విజేత మెరిల్ స్ట్రీప్‌తో కలసి ఓ హాలీవుడ్ సినిమాలో నటించే అవకాశముంది. ఈ చిత్రం పేరు 'కౌబాయ్స్ అండ్ ఇండియన్స్'. ఈ సినిమాలో నటించే విషయంలో సంప్రదింపులు జరుగుతున్నట్టు స్వయంగా శ్రీదేవి వెల్లడించారు. కాగా నిర్ణయం తీసుకోలేదు. బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్‌ను వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన శ్రీదేవి సుదీర్ఘ విరామం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు. ఆమె నటించిన 'ఇంగ్లీష్ వింగ్లీష్' చిత్రం గతేడాది విడుదలైంది. ఇటీవల అభిషేక్ కపూర్ సినిమా 'ఫితూర్'లో నటించే అవకాశం వచ్చినా తిరస్కరించారు. నెగిటీవ్ రోల్ కావడమే దీనికి కారణం.